ప్రాంతీయ భాషగా తెలుగు: సమస్యలు, సవాళ్ళు

Main Article Content

డా. బానోత్ స్వామి

Abstract

తెలుగు భాష ద్రావిడ కుటుంబం దక్షిణ-మధ్య శాఖకు చెందినది. సుదీర్ఘ చరిత్ర, ప్రాచీనత కలిగి, 2008లో శాస్త్రీయ భాషాహోదా పొందింది. నన్నయ్య మొదలు శ్రీనాథుడు, పోతన, గురజాడ వంటి కవులు దీని కీర్తిని పెంచారు. ప్రస్తుత ప్రపంచీకరణ, పట్టణీకరణ, నూతన విద్యా విధానాలు, సమాచార సాంకేతికత ప్రభావం తెలుగు భాషపై గణనీయంగా ఉంది. ఆంగ్ల భాష ఆధిపత్యం, విధానపరమైన లోపాలు, సాంకేతిక వనరులు కొరత, యువతలో భాషాభిమానం తగ్గడం, మీడియా ప్రభావం, ప్రాంతీయ భాషా భేదాలు తెలుగు మనుగడకు సవాళ్లుగా నిలుస్తున్నాయి. భాష జాతికి ఆత్మ, సంస్కృతికి ప్రతిబింబం అన్న భావనతో, తెలుగు భాష బలహీనపడడానికి గల కారణాలను విశ్లేషించడం, పరిష్కార మార్గాలను సూచించడం ఈ పరిశోధన ముఖ్య ఉద్దేశం. ఈ విశ్లేషణకు పూర్వ పరిశోధనలు, భాషా సాహిత్య విశ్లేషణలు, చరిత్ర గ్రంథాలు ఆధారం. తెలుగు భాషా ప్రాముఖ్యత క్షీణతపై ప్రస్తుత సాహిత్య చర్చను ఈ పరిశోధన అనుసంధానిస్తుంది. విద్యా పత్రికలు, యునెస్కో నివేదికలు, ప్రభుత్వ విధాన పత్రాలు, జనాభా గణన వివరాలు ఈ విశ్లేషణకు ద్వితీయ వనరులుగా ఉపయోగపడ్డాయి. ఈ పరిశోధన విశ్లేషణ పద్ధతిని అనుసరించి, తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను లోతుగా పరిశీలించింది. పరిశోధన పరిధి తెలుగు భాష ఆవిర్భావం నుండి నేటి దశ వరకు గల చారిత్రక పరిణామాలను వివరిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుకు గల ప్రాముఖ్యత దీని లక్ష్యం. ఈ పరిశోధన ఫలితాలు మాతృభాషా విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భాషాభివృద్ధి సాధించడం, ప్రాంతీయ సాహిత్యం ప్రోత్సహించడం, మీడియా సినీ రంగాల సహకారం, భాషా పరిశోధనా కేంద్రాల స్థాపన, ప్రజలలో భాషా గౌరవాన్ని పెంపొందించడం అవశ్యకం అని సూచిస్తాయి. తెలుగు భాష సంరక్షణ జాతి, సంస్కృతి మనుగడకు అత్యంత కీలకమని, భవిష్యత్తు తరాలకు తెలుగు వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ వ్యాసం నిర్ధారిస్తుంది.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

ప్రాంతీయ భాషగా తెలుగు: సమస్యలు, సవాళ్ళు. (2025). ఔచిత్యమ్, 6(13), 9-18. https://doi.org/10.5281/

References

తెలుగు విశ్వవిద్యాలయం జర్నల్. "మీడియా ప్రభావం – భాషా మార్పులు."

యునెస్కో రిపోర్ట్స్. Language and Media in the Digital Era. 2020.

రమేష్, ఎం. టెలివిజన్ భాషలో తెలుగు పరిణామం. విశ్వభారతి పబ్లికేషన్స్, 2016.

రామకృష్ణ, గోపరాజు. భాషా చింతన. కెవిఆర్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011

పైదే. తెలుగు భాషావికాసం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2013

రామారావు, కె. తరాల మధ్య విలువల మార్పు. తెలుగు అకాడమీ, 2018.

శివరామకృష్ణ. డిజిటల్ మీడియా భాషా సంస్కృతి. ఆధునిక ప్రచురణలు, 2019.

Census of India. Language Data. 2011.

Devy, G. N. The Languages of India: A Cultural Survey. Sahitya Akademi, 2009.

Government of India. National Education Policy Document, 2020 (NEP 2020).

Mahapatra, B. "Regional Languages in the Digital Era." Indian Journal of Linguistics, 2017.

Mallikarjun, B. "Indian Multilingualism, Language Policy and Education." Language in India Journal, 2004.

Mallikarjun, B. Languages in India. 2004.

Sudhakar, V. Generation Gap in Urban Families. Kakatiya University Press, 2021.

Similar Articles

You may also start an advanced similarity search for this article.