ఆధునిక తెలుగు పత్రికలభాష: ప్రమాణీకరణ
Main Article Content
Abstract
ఆధునిక తెలుగు పత్రికల భాష ప్రజలతో నిరంతరం మమేకమై సామాజిక మార్పులను ప్రతిబింబించే ముఖ్యమైన మాధ్యమం. అయితే వార్తల వేగం, అనువాద ప్రభావం, ఆంగ్ల పదాల అధిక వినియోగం వల్ల పత్రికల భాషలో ఏకరీతి కొరవడుతోంది. ఈ నేపథ్యంలో ఆధునిక తెలుగు పత్రికల భాషను ప్రామాణీకరించడం అత్యవసరం. ప్రామాణీకరణ ద్వారా శుద్ధమైన వ్యాకరణం, స్పష్టమైన వాక్య నిర్మాణం, సరైన పద ప్రయోగం, సాంప్రదాయ - ఆధునిక పదాల సమతుల్య వినియోగం సాధ్యమవుతుంది. ఇది పాఠకులకు అర్థగ్రాహ్యతను పెంచడమే కాకుండా భాషా గౌరవాన్ని నిలబెడుతుంది. అంతేకాకుండా విద్య, పరిపాలన, మీడియా రంగాల్లో ఒకే విధమైన భాషా ప్రమాణాలు ఏర్పడేందుకు దోహదపడుతుంది. ఈ అధ్యయనం ఆధునిక తెలుగు పత్రికల భాషలో ఉన్న సమస్యలను విశ్లేషించి, ప్రామాణీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సూచిస్తుంది. ఫలితంగా తెలుగు భాష యొక్క సమృద్ధి, స్థిరత్వం మరియు భవిష్యత్ తరాలకు దాని పరిరక్షణకు ఈ ప్రయత్నం ఉపయోగకరంగా నిలుస్తుంది. ఈ వ్యాసంలో అనేక పూర్వ పరిశోధనలు, భాషా సాహిత్యానికి, పత్రికకు సంబంధించిన వ్యాసాలు వివిధ పుస్తకల్లో, పత్రికల్లో, సదస్సు సమావేశాల్లో ఆధునిక భాషా మరియు విశ్లేషణ గురించి వ్యాసాలు రావడం జరిగింది. చేకూరి రామారావు రాసినటువంటి భాషానువర్తనం, భాషాంతరంగం వంటి గ్రంథాలు, అలగే లక్ష్మణ రెడ్డి రచించినటువంటి తెలుగు భాష ప్రాచీనత- ఆధునికత మరియు ముద్ధాళి రఘురామ్, తెలుగు భాషా వైభవం మొ।। గ్రంథాలలో చాలావరకు చరిత్ర, తెలుగు సాహిత్య పరిణామం, పత్రికభాషా మొదలగు చరిత్ర వంటి గ్రంథాలు భాషా వికాసం, సాహిత్యాభివృద్ధిని అనుసంధానిస్తూ విలువైనసమాచారం అందించారు. ఆధునిక తెలుగు పత్రికలభాషా విద్య, సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావాల వల్ల తెలుగు భాష కొత్త పదాలు, భావ వ్యక్తీకరణలతో విస్తరిస్తోందని కొంత విశ్లేషణాత్మక సందేశాన్ని ఇవ్వడం జరుగుతుందని నా అభిప్రాయం.
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
చెన్నయ్య, జె. "తెలుగు పత్రికల భాషా స్వరూపం." తెలుగు భాషా వైభవం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
రఘురామ్, ముద్ధాళి. "తెలుగు భాషా వైభవం." తెలుగు భాషా మహోత్సవాల ప్రసంగ వ్యాస సంకలనం, ప్రథమ ముద్రణ, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
రామారావు, చేకూరి. భాషాంతరంగం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2000.
రామారావు, చేకూరి. భాషానువర్తనం. చేర పబ్లికేషన్, హైదరాబాద్, 2000.
లక్ష్మణ రెడ్డి, వి. తెలుగు భాష ప్రాచీనత ఆధునికత. నవసాహితి బుక్ హౌస్, విజయవాడ, 2006.
వరదాచారి, జి. ఎస్. "పత్రిక భాష." తెలుగు భాషా వైభవం, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.
వ్యాస కృష్ణ, బూరుగుపల్లి. "తెలుగు పత్రికలు - మారుతున్న భాషా ధోరణులు." 7వ ప్రపంచ తెలుగు సదస్సు వ్యాస సమాహారం, త్రైమాస అంతర్జాల పత్రిక, 2022.