శ్రీరఘురామ శతకము: భక్తి, సామాజికాంశాలు

Main Article Content

ఎం. వేణుగోపాల్ శర్మ
డా. ఎం. దేవేంద్ర

Abstract

తెలుగు సాహిత్య చరిత్రలో శతక ప్రక్రియ వినూత్న స్థానం పొందింది. ఎన్నో కవితా వస్తువులను స్వీకరిస్తూ, ప్రాచీన మార్గాన్ని అనుసరించి సమాజంలోని అంశాలపై నూతన కవులు స్పందిస్తూ నూతన శతక రచనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ లక్షణం ఒకే విధంగా ఉన్నా, కవి ఎంచుకున్న ఇతివృత్తం భిన్నత్వాన్ని ప్రదర్శిస్తుంది. రంగన్నగారి సాయులు 2002లో రచించిన "శ్రీ రఘురామ శతకం" వైష్ణవ భక్తి తత్వ ప్రధానమైంది. 108 కంద పద్యాలతో "శ్రీ రఘురామా" మకుటంతో కూడిన ఈ శతకంలో భక్తి, వ్యక్తిత్వ, సామాజిక, నైతిక విలువలు విశదమవుతాయి. ప్రస్తుత పరిశోధన ఈ శతకంలోని భక్తి, నీతి, సామాజిక అంశాలను ఎంపిక చేసిన పద్యాల ద్వారా విశ్లేషిస్తుంది. శతకాలు నీతి, దైవ భక్తి, సామాజిక శ్రేయస్సు, దేశభక్తి ప్రబోధకాలుగా నిలుస్తాయి. తరాలు మారినా వీటి ఆదరణ తగ్గదు, విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడతాయి. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలపై పరిశోధనలు విస్తృతంగా జరిగినా శతక సాహిత్యంపై మరింత కృషి అవసరం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శతక సాహిత్య పరిశోధనలో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి తదితర ప్రాంతాలను సందర్శించి, పలువురు శతక కవులను కలిసి 73 శతక రచనలు సేకరించడమైనది. శ్రీ రఘురామ శతకం వాటిలో ఒకటి. డా. గోపాల కృష్ణారావు రచించిన "ఆంధ్రశతకసాహిత్యవికాసము" శతక పరిశోధనలకు ప్రామాణికంగా నిలుస్తుంది. ప్రస్తుతవ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించి, శతక లక్షణాలు, వర్గీకరణ, సామాజిక ప్రయోజనాలను వివరించింది. పరిశోధన ఫలితాలు శతకసాహిత్యం ప్రాధాన్యతను, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అది అందించగల వికాసాన్ని నిరూపిస్తాయి. శతకశైలి సరళంగా ఉండి, ఆత్మాశ్రయ కవితా ధర్మం ఉండటం వల్ల విద్యార్థి మనస్సులో సులభంగా నాటుకుంటుంది. వేమన, సుమతి, భాస్కర శతకాలు నాటి తరాలను ప్రభావితం చేసినట్లే, ఈ ప్రక్రియను ముందు తరాలకు మరింత ప్రభావవంతంగా అందించాలి. కవి తన శతకంలో భక్తి తత్వానికి మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, సమాజ స్థితిగతులను లోక వ్యవహారాలను చాటి చెప్పిన పద్య రత్నాలను అందించారు. వ్యక్తిగత శ్రేయస్సు కన్నా సంఘ శ్రేయస్సు గొప్పదని చాటే నడవడికను అలవరచుకోవాలని ఈ పరిశోధన సూచిస్తుంది. భవిష్యత్తులో శతక సాహిత్య ప్రక్రియపై మరిన్ని లోతైన పరిశోధనలు జరగాలని ఈ వ్యాసం ఆకాంక్షిస్తుంది.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

శ్రీరఘురామ శతకము: భక్తి, సామాజికాంశాలు. (2025). ఔచిత్యమ్, 6(13), 19-27. https://doi.org/10.5281/

References

గంగాప్రసాద్, ఎనిశెట్టి. సాహితీసౌరభాలు-పద్యసుమాలు. సాహితీసమాలోచనంప్రచురణ, హైదరాబాద్,2020.

గోపాల కృష్ణారావు, కే. ఆంధ్ర శతక సాహిత్యము. ప్రతిభ ఆర్ట్స్ ప్రింటర్స్, హైదరాబాద్,1976.

నటేశ్వర శర్మ, అయాచితం. నవ్యనీతి శతకము. ప్రాచ్య విద్యాపరిషత్తు, ప్రాచ్య కళాశాల విద్యార్థుల బృందము ప్రచురణ, కామారెడ్డి, 1995.

మురళి, పబ్బ. పబ్బ మురళి మాట పసిడి మూట. పబ్బ పబ్లికేషన్స్, బోధన్, నిజామాబాద్ జిల్లా, 2018.

రవీందర్, ఘనపురం. కవన ఘనుని శతకం. హరిదా రచయితల సంఘం ప్రచురణ, నిజామాబాద్, 2016.

లక్ష్మణ కవి, ఏనుగు. భర్తృహరి సుభాషిత రత్నావళి. జే.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2006.

శాస్త్రి, ద్వా.నా. తెలుగు సాహిత్య చరిత్ర. ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.

సత్యనారాయణ, సుప్పని. సుప్పని శతకము. శ్రీ రాఘవేంద్ర ప్రింటర్స్, కాప్రా, మేడ్చల్ జిల్లా, 2022.

సాయులు, రంగన్నగారి. శ్రీ రఘురామ శతకము. చైతన్య ఆర్ట్స్ ప్రింటర్స్, కామారెడ్డి, 2002.

Similar Articles

You may also start an advanced similarity search for this article.