యయాతి నవల: విమర్శనాత్మక విశ్లేషణ
Main Article Content
Abstract
భారతీయ సాహిత్య పరంపరలో పురాణ, చరిత్రలను ఆధునిక కాలఘట్టంతో పోల్చి చూసే ప్రయత్నం అనాది కాలంనుండి నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. ఇలా పురాణ కథనాలలోని పాత్రలను, జీవిత విలువలను మళ్ళి మళ్ళి సృజించే ప్రయత్నం జరుగుతూనే వస్తుంది. కాలకాలానికి విలువలను తరలించే ప్రయత్నంలో ఇలాంటి మరుసృష్టులు మొదలయ్యాయి. ఇలా పురాణ వస్తువుని ఆధారంగా పెట్టుకుని మరాఠి భాషలో స్వతంత్రంగా రాసిన నవల యయాతి. ప్రసిద్ధ ఇది మరాఠి రచయిత విష్ణు సుఖారాం ఖాండేకర్ 1959 లో రాసిన నవల. ఈ నవల పైచూపుకి నవలలా కనిపించినా కథ చెప్పే తీరుని బట్టి ఇదొక ఆత్మకతల గుచ్ఛం అనిపిస్తొంది. ఈ నవలలో పాత్రలే (యయాతి, దేవయాని, శర్మిష్ఠ) తమ కథను తాము చెప్తూ కొనసాగిస్తాయి. ఒకే కథను మూడు పాత్రలు విభిన్న దృక్పథంతో చెప్పే విధానమే ఈ నవల విశేషత. ఈ నవలను ఆధారంగా చేసుకుని ʼయయాతి : నవల విశ్లేషణʼ అనే శీర్షిక రూపొందించుకొని భిన్న దృక్పథంతో వివరించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ వ్యాసంలో ఒకే కుటుంబలో వున్న ముగ్గురి వ్యక్తుల మనస్తత్వాలూ ఎలా భిన్నంగా మారినాయి అనే విషయన్ని విశ్లేషించడం జరిగింది. ఇంతకు మునుపు ఈ నవలను ఆధారంగా చేసుకుని ʼమహాక్షత్రియʼ అనే నవల, ʼయయాతిʼ అనే నాటకం,ʼ సంజీవినిʼ అనే నాటకాలు వచ్చినాయి. వీటన్నిటిని ఆధారంగా తీసుకొని యయాతి, దేవయాని మరియు శర్మిష్ఠ ఈ ముగ్గురి పాత్రను విశ్లేషణ చేయడం జరిగింది. ఈ వ్యాసాన్ని మనోదృక్పథంతో విశ్లేషించడానికి, నవలకు ప్రేరణ, ఆత్మకథలుగా కనిపించే నవల, నవల శిల్పం, యయాతి వ్యక్తిత్వం, యయాతి భోగాపేక్షలు, దేవయాని మరియు శర్మిష్ఠల భిన్న స్వభావం, స్నేహం ద్వేషంగా మారినది, స్వార్థంతో కూడిన పెళ్ళి, భిన్న ధ్రువాలు - అనే ఉపశీర్షికలతో విభజించుకున్నాను. జీవితంలో పెళ్ళి, బంధుత్వ, స్వార్థం, ప్రేమ, లైంగికాపేక్ష, ద్వేషం అనేవి ఈ నవలలో ఎలా ఉన్నాయి అనేవి మనోదృష్టితో విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసోద్దేశం.
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
గిరీశ్, కార్నాడ్. యయాతి (నాటకం). ధారవాడ: మనోహర గ్రంథమాలా, 1960.
నరసింహశాస్త్రి, దేవుడు, మహాక్షత్రియ. బెంగళూరు: స్టాండర్డ్ బుక్ డిపో, 1966.
రామేశ్వరావధాని, శ్రీమన్ మహాభారత. బెంగళూరు: భారత దర్శన ముద్రాణాలయ, 2014.
విష్ణు సుఖారాం, ఖాండేకర్. యయాతి (తెలుగు అనువాదం: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్). న్యూఢిల్లీ: సాహిత్య అకాడెమి, 2000.
పైదే. యయాతి (కన్నడ అనువాదం: వి.ఎం. ఇనాందార్). బెంగళూరు: అంకిత పుస్తకం, 2008.