గాలివాన కథానిక: భారతీయ తాత్త్వికచింతన
Main Article Content
Abstract
ఈ పరిశోధనవ్యాసం పాలగుమ్మి పద్మరాజు 'గాలివాన' కథానికలో భారతీయ తాత్త్విక చింతన విశ్లేషిస్తుంది. జీవితంలో ఏర్పడిన అనూహ్య ఘటనలు వ్యక్తిత్వపరివర్తనకు ఎలా దారితీస్తాయో, నియమబద్ధ జీవితానికి అతీతంగా మానవవిలువల ప్రాధాన్యతను ఎలా గుర్తిస్తాయో “రావుగారి” పాత్ర ద్వారా ఈ కథానిక స్పష్టం చేస్తుంది. భారతీయతలో సహజంగా కనిపించే ఈ తాత్త్వికత, కఠిన మనస్తత్వాన్ని సైతం కరుణతో ఎలా నింపుతుందో, కపిలవస్తు యువరాజు సిద్ధార్థుడు, సమ్రాట్ అశోకుడు, మహాత్మా గాంధీ వంటి వ్యక్తుల జీవనగమనాన్ని ప్రస్తావించడం ద్వారా పరిశోధన ఆవశ్యకతను సమర్థిస్తుంది. 'గాలివాన' కథా సంకలనాన్ని ఈ వ్యాసానికి ప్రాథమికవనరు.. భగవద్గీత, తైత్తరీయోపనిషత్తు వంటి వేద గ్రంథాల నుంచి తాత్త్విక సిద్ధాంతాలను సమర్థన, సమన్వయం కోసం ఉపయోగపడ్డాయి.. పాత్ర విశ్లేషణ, కథాంశ వివరణ పద్ధతులను అవలంబిస్తూ, రావుగారి ప్రవర్తనలో వచ్చిన పరిణామాన్ని భారతీయ తాత్త్విక చింతనతో అనుసంధానించడమైనది. ఈ కథానికలోని సంఘటనలను క్రమబద్ధంగా విశ్లేషిస్తూ, రావుగారిలోని మార్పును, సమత్వయోగం, 'ఆత్మవత్ సర్వభూతేషు' వంటి సూత్రాలకు ఎలా అన్వయించవచ్చో ఈ వ్యాసం వివరించింది. రావుగారు తన పర్సు దొంగిలించినా, తన ప్రాణాలను కాపాడిన ఆ మహిళను దొంగగా భావించకుండా, ఆమెను మానవతాపరిమళాలు వెదజల్లే మహోన్నతవ్యక్తిగా గుర్తించడం; పరిస్థితుల ఒత్తిడిలో వ్యక్తిత్వం ఎలా రూపాంతరం చెందుతుందో, నియమాలకు అతీతంగా మానవీయ సంబంధాలకు, అనురాగానికి స్థానం ఎలా లభిస్తుందో ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. ఈ పరిశోధన పాలగుమ్మి కథాశిల్పంలోని లోతైన తాత్త్వికతను, మానవతా విలువలను పాఠకులకు తెలియజేస్తుంది. ప్రస్తుత పరిశోధన కథా విశ్లేషణకు పరిమితమైంది. భవిష్యత్తు పరిశోధనలకు ఇలాంటి తాత్త్విక నేపథ్యం గల ఇతర రచనలను విశ్లేషించడానికి ఈ వ్యాసం ఉపకరస్తుంది.
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
కుటుంబరావు, కొడవటిగంటి. కొకు వ్యాసప్రపంచం-5 సాహిత్యవ్యాసాలు. “ఉత్తమకథ, కుటుంబరావు, పద్మరాజుల సంభాషణ”, విప్లవరచయితల సంఘం, ఆంద్రప్రదేశ్ 2001.
దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు. స్వీయప్రచురణ. హైద్రాబాదు. 1988
దయానంద (మూ). సుబ్బారావు, కోడూరి. (సంక.) వైదిక క్రాంతిపథం. తైత్తరీయోపనిషత్తు. శిక్షావల్లి, 1-11-3. గాయత్రీ ఆశ్రమము, సికింద్రాబాద్, 1996
పద్మరాజు, పాలగుమ్మి. "గాలివాన" కథా సంకలనం. మొదటి భాగం. సత్య పబ్లికేషన్స్,
భగవద్గీత. భక్తివేదాంత బుక్ ట్రస్ట్, ముంబయ్, 1984
మురళీధరరావు, ఈ. "మానవమనస్తత్వం సామాజిక స్పృహ : పాలగుమ్మి పద్మరాజు" (వ్యాసం). తెలుగుసాహిత్యం - సామాజికస్పృహ జాతీయ సదస్సు - 2024 ప్రత్యేకసంచిక, Spl. Edition, Vol- 19, Issue 01, ISSN No. 2582-8738. March, 2024
సోమశేఖరశర్మ, మల్లంపల్లి (సంపా.) తెలుగు విజ్ఞానసర్వస్వము మూడవ సంపుటము, తెలుగుభాషాసమితి, మద్రాసు. 1958