కరోనా మహమ్మారి తెచ్చిన విలయం: కథాసాహిత్యంలో దాని ఆనవాళ్ళు
Main Article Content
Abstract
ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో విశిష్ట స్థానం సంపాదించి, సమాజంలో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగిస్తున్న ప్రక్రియ కథ. కథలలో విభిన్న వస్తువులను తీసుకొని రాయడం పరిపాటే. ఈ నేపథ్యంలో విభిన్న వస్తువైవిధ్యంతో కరోనాకాలంలో కథలు వెలుపడ్డాయి. భాష ఎలాగైతే పరిణామశీలో సాహిత్యం కూడా కాలానుగుణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను తనలో నింపుకొని సుసంపన్నమవుతుంది. ఉదాహరణకు ఆదికవి నన్నయ నుండి నేటివరకు సాహిత్యాన్ని తరచి చూసినప్పుడు ఈ పరిణామశీలత అగుపిస్తుంది. ఆధునిక కాలంలో వచ్చిన సాహిత్య ఉద్యమాలన్నీ సామాజిక స్పృహతో వెలువడినవే. అదేవిధంగా కవి కూడా సమాజంలో భాగమే కాబట్టి తనకాలపు నాటి సామాజిక అంశాలను స్పృశించకుండా దాటి వెళ్లడం సాధ్యం కాదు. కోవిడ్ కాలంలో కరోనా మహమ్మారి తెచ్చిన విలయం-కథా సాహిత్యంలో దాని ఆనవాళ్ళును ప్రస్తావిస్తూ, వస్తు వైవిద్యంతో కూడిన కథలను విశ్లేషిస్తుందీ వ్యాసం.
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
అన్నపూర్ణ, పాతూరి. (సంపా.) వడలి రాధాకృష్ణ. కాలుతున్న కాలం. రెయిన్బో గ్రాఫిక్స్, 2021.
కాంతారావు, శిరంశెట్టి. కాలం నేర్పిన పాఠం. (కథాసంపుటి) శ్రీశ్రీ ప్రింటర్స్, 2021.
పవన్ కుమార్, కోడం. కరోనా@లాక్ డౌన్360, లయ పబ్లికేషన్స్ అక్టోబర్
రజిత, అనిశెట్టి. కొమర్రాజు రామలక్ష్మి, బండారు సుజాత (సంపాదకులు)- కరోనాకాలం కథలు (శతాధిక రచయితల కథలు, కథనాలు) దీప్తి ప్రింటర్స్, 2020.
రామకృష్ణ, అడపా. కరోనా కల్లోలం కథలు. డిసెంబర్
విజయలక్ష్మి, అత్తలూరి. లాక్ డౌన్ వెతలు. రాజేశ్వరి ప్రచురణలు, జూలై
శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, 1998.
సిమ్మన్న, వెలమల. సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం, 2005.
సుధాదేవి, తెన్నేటి (సంక.) - కొత్త (కరోనా)కథలు-4, కథా సంకలనం. వంశీ ప్రచురణ జూన్ 2021.