దివ్యాంగుల కథలు : చైతన్యం

Main Article Content

పుప్పాల రూపులు
ఆచార్య జర్రా అప్పారావు

Abstract

జీవితం చాలా చిన్నది. దానిలో అనుక్షణం సంతృప్తితో బతకాలని కోరుకునే వారు ఉండరు. ఇక సాధారణ వ్యక్తులు కన్నా భిన్నంగా గడపాల్సి రావడం పట్ల ఆవేదన ఉండవచ్చు.కానీ అవయవాలు లోపం సహకరించనప్పుడు, అనుకున్న విధంగా ఉండలేకపోతున్నామనే లోటు ఉంటుంది. ఏ తప్పు లేకుండానే విధి శాసిస్తే అందరిలా మేమెందుకు లేమనే ప్రశ్న వారిదవ్వచ్చు.దీంతో తమ పనులు చేసుకోలేక ఇతరులపై ప్రతి నిమిషం ఆధారపడే విధంగా ఉండటం విరక్తికి దారితీస్తుంది.అలా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే వైనాలు నిరాశకు నిస్పృహకు లోను చేస్తుంటాయి. ఈ సంఘర్షణలు అధిక ప్రభావం చూపితే ఒక్కోసారి ఆత్మహత్యలకు దారి తీయవచ్చు.అలాగే ఈసడింపులు భరించలేక,తన వల్ల తనవారికి మనోవేదన ఎందుకనుకోవడమో కూడా వారిని మానసికంగా కృంగదీస్తుంటాయి. అలాంటప్పుడు కన్నవారో, తోబుట్టువులో, స్నేహితులో,ఆ నిరాశల్ని పారద్రోలి నువ్వు అందరిలాంటివాడివేనని తెలియజేయాలి. అందరిలా ఏది సాధించాలన్న కొంత కృషి పట్టుదల ఉంటే చాలు అన్నట్లు బ్రతుకులో ఆశావాదాన్ని నింపి గమ్యాన్ని నిర్దేశించాలి. అలా ఆత్మ విశ్వాసాన్ని తట్టిలేపుతూ వారిని నిలబెట్టే యత్నం చేయాలి. అటువంటి చైతన్యవంతమైన కథలను ఈ పరిశోధన పత్రంలో నేను విశ్లేషించడం జరిగింది, నిర్మాణాత్మక పరిశోధన పద్ధతి ద్వారా ఈ పరిశోధన పత్రాన్ని రాయడం జరిగింది. చిక్కా హరీష్ కుమార్ గారు "వికలాంగుల సాహిత్యం - సామాజిక చైతన్యం" అనే అంశంపై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడం జరిగింది.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

దివ్యాంగుల కథలు : చైతన్యం. (2025). ఔచిత్యమ్, 6(14), 44-50. https://doi.org/10.5281/zenodo.18112370

References

అసిలేటి, నాగరాజు, హరీష్ కుమార్ చిక్క, సంపాదకులు. మేము సైతం. చందు పబ్లికేషన్స్, 2017.

ఎల్లయ్య, వేముల, శంకర్, సంపంగి, సంపాదకులు. అవిటి కథలు. [ప్రచురణకర్త వివరాలు లేవు], 2013.

తాళ్లూరి, నాగేశ్వరరావు, హితశ్రీ, సంపాదకులు. శత వసంతాల తెలుగు కథ. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2018.

నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష. నవ్య పరిశోధక ప్రచురణలు, 2021.

బేగం, ఆసియా. "గుర్తింపు." మేము సైతం, సం. నాగరాజు అసిలేటి, చందు పబ్లికేషన్స్, 2017, పు.

రామారావు, ఎస్వీ. తెలుగులో సాహిత్య విమర్శ. పసిడి ప్రచురణలు, 2017.

రెడ్డి, సి. నారాయణ. ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు ప్రయోగములు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2017.

రమాపతిరావు, అక్కిరాజు, సంపాదకులు. తొలి మలితరం తెలుగు కథలు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్, 2018.

సోమయాజులు, చాగంటి. చాసో కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2023.

"వారి వైకల్యాన్ని అధిగమించడానికి ఉదాహరణగా చెప్పుకొని ఎనిమిది ప్రసిద్ధ వ్యక్తులు." లైవ్ క్వికీ బ్లాగు, 18 ఫిబ్రవరి 2020.

Similar Articles

You may also start an advanced similarity search for this article.