జానపద ఆటలు: మనోవికాసం

Main Article Content

డా. గడ్డం వెంకన్న

Abstract

జానపద ఆటలు మానవ మనుగడకు, మనోవికాసమునకు దోహదపడతాయి. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో, ఏదో ఒక సమయంలో ఏదైనా ఒక జానపద ఆట ఆడుకున్నవారే. అందుకే జానపద ఆటలు మానవ జీవితంలో ప్రాముఖ్యత పొందాయి. వ్యాసకర్త ఎంపిక చేసుకున్న "జానపద పాటలు-మనోవికాసం" వ్యాసంలో జానపద ఆటల వివరాలు, ఆటల ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటుగా ఈ ఆటలు మానసిక వికాసానికి దోహదపడే అంశాలు చర్చించడం అయింది. దైనందిన జీవితంలో ఆటల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. జానపద పాటల గురించి విశ్వవిద్యాలయ స్థాయిలో జరిగిన పరిశోధన చాలా తక్కువ. కొద్దిమంది పరిశోధకులు మాత్రం జానపద ఆటల్లో ఉండే అన్ని అంశాలు ఒకే పరిశోధనాంశంగా కాకుండా ఒక్కొక్క అంశాన్ని ఎంచుకొని పరిశోధన చేయడం జరిగింది. కాగా ప్రాచీన సాహిత్యంలో అక్కడక్కడ ఈ జానపద ఆటల ప్రస్తావన మనకు కనపడుతుంది. ఎంపిక చేసుకున్న పరిశోధన వ్యాసం పూర్తిగా క్షేత్ర పర్యటన మీద ఆధారపడినది. వ్యాసకర్త తన పరిశోధనలు భాగంగా వివిధ ప్రాంతాలలో పర్యటించినప్పుడు సేకరించిన ఆటల ఆధారంగా ఈ వ్యాసం రాయబడింది. జానపద ఆటలు మనోవికాసం నకు సంబంధించిన ఈ వ్యాసంలో జానపద ఆటలు పరిచయం, ఆటల ప్రయోజనాలు, జానపద ఆటలు మనోవికాస దృక్పథం అనే శీర్షికలుగా విభజించుకుని, వీటి కనుగుణంగా ఉప శీర్షికలతో వ్యాసాన్ని రూపొందించడం జరిగింది. జానపద ఆటలు మానవ జీవన విధానంలో అంతర్భాగం. ఈ ఆటలు ఆడడం వలన పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మనోవికాసానికి ఎక్కువ దోహదపడుట వలన ఆటలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

జానపద ఆటలు: మనోవికాసం. (2025). ఔచిత్యమ్, 6(14), 61-68. https://doi.org/10.5281/zenodo.18112970

References

కాంతలక్ష్మి, ఐ.వి., & విద్వేశ్వరి. మానవ ధర్మం. లక్ష్మీ ప్రచురణలు, విజయవాడ, 2012.

చలం, గుడిపాటి. ప్రేమలేఖలు. అరుణ పబ్లికేషన్స్, విజయవాడ, 2002.

పైదే. మ్యూజింగ్స్. అరుణా పబ్లికేషన్స్‌.

జోగారావు, ఎస్.వి. సాహిత్యభావలహరి. తెలుగు అకాడమి, హైదరాబాద్, 1989.

తాయారమ్మ, జి. గంజాం కోరాపుట్టి జిల్లాలోని తెలుగువారి బాలగేయాలు - స్త్రీల పాటలు ఒక

పరిశీలన. తాయారు ప్రచురణలు, గంజాం, 1997.

బాపిరాజు, అడవి. తుఫాను. బాపిరాజు ప్రచురణలు, విశాఖపట్నం, 1989.

పైదే. తుఫాను. విశాలాంధ్ర పబ్లికేషన్స్‌, 2010.

భక్తవత్సల రెడ్డి, ఎన్. తూర్పు గోదావరి జిల్లా జానపదుల ఆటలు. జానపద గిరిజన విజ్ఞానపీఠం, వరంగల్, 2004.

మంజులత, ఏ., & తెన్నేటి, సుధాదేవి. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. తెలుగు ఆకాడమి, హైదరాబాద్, 2001.

రాజుపాపయ్య, రంగు. జానపదుల ఆటలు - సాహిత్య సాంస్కృతిక పరిశీలన. విమల ప్రచురణలు, హైదరాబాద్, 2024.

వల్లభామాత్యుడు, వినుకొండ. క్రీడాభిరామము. విక్టరీ పబ్లికేషన్స్, విజయవాడ, 1997.

వెంకటేశ్వరరెడ్డి, అన్నపరెడ్డి. అస్తిత్వవాదం. పల్లవి పబ్లికేషన్స్‌, విజయవాడ, 2000.

సరస్వతి, పి. జానపద సాహిత్యం- పిల్లల పాటలు. తెలుగు పరిశోధన ప్రచురణలు, హైదరాబాద్, 1989.

సుబ్రహ్మణ్యం, వడ్ల. తెలుగు సాహిత్యంలో క్రీడా వినోదాలు. వీణ ప్రచురణలు, హైదరాబాద్, 1987.

Similar Articles

You may also start an advanced similarity search for this article.