నేటి అవధానకవిత్వంలో వ్యాకరణం: సంధి, సమాసవిధానాల పరామర్శ

Main Article Content

డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ

Abstract

పద్యవిద్యకు కావ్యభాష ప్రాణం. దీనికి వ్యాకరణశాస్త్రజ్ఞానం అత్యావశ్యకమని, బాల-ప్రౌఢ వ్యాకరణాల పరిజ్ఞానం పద్యరచనా ప్రామాణ్యాన్ని నిర్దేశిస్తుందని ఈ వ్యాసం తెలుపుతుంది. "ప్రయోగశరణం వ్యాకరణం" అనే అభియుక్తోక్తి ఆధారంగా నేటి అవధాన పద్యపూరణలలో సంధి, సమాసవిధానాలు బాలవ్యాకరణ ప్రాతిపదికన ఎలా ఉన్నాయో పరిశీలించడం ఈ అధ్యయనం ప్రధానలక్ష్యం. చింతామణి వివరణలు, బాలవ్యాకరణ లక్ష్యరూపసాధన విమర్శలు, బాలవ్యాకరణ-సంహితా-సర్వస్వము, నీతిచంద్రిక-బాలవ్యాకరణం వంటి పూర్వపరిశోధనలను గమనించడమైనది. పరిశోధనలో  ఇటీవల జరిగిన అవధాన ప్రదర్శనల నుండి సేకరించిన సమస్య, దత్తపది, వర్ణనలు, ఆశువుల పూరణలను ప్రాథమిక ఆధారాలుగా ఉపయోగించి విశ్లేషణాత్మక పద్ధతిలో అధ్యయనం సాగింది. పద్యకవులకు తత్సమతద్భవదేశ్య పదవిజ్ఞానం, ప్రాతిపదిక-ప్రత్యయ విభాగాలపై అవగాహన, సంధి-సమాసఘటనాచాతుర్యం అత్యవసరమని పరిశోధన స్పష్టం చేసింది. నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది లాంటి అవధానాంశాలలో తత్సమాచ్ఛిక పదభేదం, పదవిచ్ఛేదం, సంధులు, సమాసాలు కీలకపాత్ర పోషిస్తాయని, శబ్దచమత్కారానికి, అర్థభేద సాధనకు ఈ జ్ఞానం అనివార్యమని తేలింది. అత్వ, ఇత్వ, ఉత్వ, సరళాదేశ, గసడదవాదేశసంధులు, ఆగమసంధులు పద్యనిర్మాణంలో గణనియమాలకు అనుగుణంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తాయని, సంధివిధానాలు అవధానాంశాలలోని సంక్లిష్టతను ఛేదించడంలో సమర్థంగా దోహదపడతాయని వ్యాసం వివరించింది. బాలవ్యాకరణం ప్రకారం సమాసకల్పన, సంస్కృతాచ్ఛిక మిశ్రసమాసాల ప్రయోగం, త్రిక, స్త్రీసమ, ముగంత, ధాతుజవిశేషణ పూర్వపద కర్మధారయాలు తెలుగు సమాసాలకు ప్రాణం పోస్తాయని విశ్లేషణలో వెల్లడైంది. అయితే, ప్రస్తుత అవధానకవిత్వంలో ఉత్వసంధి సడలింపులు, ద్రుతప్రకృతులు-కళల తారతమ్యజ్ఞాన లోపం, అనవసర యడాగమాలు, దుష్టసమాసాల వంటి కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని పరిశోధన గుర్తించింది. అవధానకవిత్వంలో వ్యాకరణనిర్దుష్టతను పెంపొందించడానికి పూర్వకవిప్రయోగాల నిరంతరాధ్యయనం, ప్రసిద్ధపూర్వావధాన పద్యాల అనుశీలన, సంస్కృత, బాలవ్యాకరణ గ్రంథాల వ్యాఖ్యాన సహిత సమగ్ర పరిశీలన, కవిప్రయోగాలను సూత్రసమన్వయం చేస్తూ రూపసాధన ప్రక్రియలు, సూత్రాల ఆధారంగా నూతన ఉదాహరణల కల్పన లాంటి అభ్యాసాలు అత్యంత ఆవశ్యకమని ఈ వ్యాసం భవిష్యత్తు పరిశోధకులకు సూచించింది.

Downloads

Download data is not yet available.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

నేటి అవధానకవిత్వంలో వ్యాకరణం: సంధి, సమాసవిధానాల పరామర్శ. (2026). ఔచిత్యమ్, 7(1), 15-24. https://doi.org/10.5281/zenodo.18721924

References

అవధానపుష్కరిణి పత్రిక. డిశంబరు, 2025 (సంపుటి-1 సంచిక-4). అవధానవిద్యావికాసపరిషత్, భాగ్యనగరం, 2025

అవధానసప్తకం వీడియోలు, ఆరాధ్య – స్త్రోత్రనిధి యూట్యూబ్ ఛానల్. లింక్, 29.01.2026.

పురుషోత్తం, బొడ్డుపల్లి. చిన్నయసూరి బాలవ్యాకరణము (వికాసవ్యాఖ్య). స్టూడెంట్సు ఫ్రండ్సు, సరసరావుపేట. 1977.

రామకృష్ణారావు, వంతరాం. బాలవ్యాకరణఘంటాపథము. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2016

వేంకటశాస్త్రి, చెళ్ళపిళ్ళ. కథలు - గాథలు. వేంకటేశ్వర పబ్లికేషన్సు, కడియము. 1958.

సుబ్బన్న శతావధాని, సివి. అవధానవిద్య. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1987

సూర్యనారాయణశాస్త్రి, మల్లాది. సూర్యనారాయణీయము (ప్రథమ-ద్వితీయభాగములు). ఆంధ్రభాషానుశాసనము నాల్గవకూర్పు. 1926.

Similar Articles

You may also start an advanced similarity search for this article.

Most read articles by the same author(s)