ఔచిత్యమ్ - తెలుగు పరిశోధన మాసపత్రికలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల ఆచార్యుల ప్రామాణిక పరిశోధనవ్యాసాలు ప్రచురిస్తున్నాం. భాషాసాహిత్యాల మొదలు అన్ని మానవీయశాస్త్రాలలో ప్రచురణలు సాగుతున్నాయి. పత్రిక ఆరు సంపుటాల ప్రచురణ పూర్తి చేసుకొని, ఏడో సంపుటంలోకి అడుగుపెడుతోంది. తెలుగు పరిశోధకుల కృషిని లోకవ్యాప్తం చెయ్యడానికి దీక్షగా ముందుకు సాగుతున్న ఔచిత్యమ్ పత్రికలో గడిచిన కొన్ని సంచికలతో పాటు ఈ సంపుటంలోని రాబోయే అన్ని సంచికలు "గూగుల్ స్కాలర్"లో ఇండెక్స్ కావడం విశేషం. తెలుగు పరిశోధనరంగంలో ఇదొక మైలురాయి. ఈ సంచికతో పాటుగా రానున్న సంచికల్లోని వ్యాసాలను కూడా పరిశోధకులు, ఆచార్యులు పరిశీలిస్తూ.. సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాం.
ప్రధానసంపాదకుడు
శతావధాని డా, రాంభట్ల పార్వతీశ్వర శర్మ
Published: 2026-01-01