తెలంగాణ పదకోశకర్తలు: ప్రత్యేకతలు
Main Article Content
Abstract
పరిశోధన ఒక భాష పదసంపదను నిఘంటువులు పరిరక్షిస్తాయి. నిఘంటువులనే మనం మరోకార్థములో పద కోశాలుగా పిలుస్తున్నాం. అన్యోన్యాపేక్ష లేనిశ్లోక సముదాయాన్ని కోశమంటారని మన లాక్షణికులు నిర్వచించినారు. “దేశాన్నాయిన చూడు, లేక కోశాన్నాయిన చూడు” అని పెద్దలు అంటుంటారు. ఇక్కడ కోశమంటే పదకోశం. పదాల అర్థాలను తెలిపే గ్రంధం. మన దేశములో ఇప్పటికీ మనకు లభిస్తున్న సమాచారం ప్రకారం అమర కోశమే మొదటి పదకోశంగా లక్షణకారులు గుర్తించినారు. సి.పి. బ్రౌన్ సాహిత్య కృషి వలన తెలుగులో ఇప్పటి ఆధునిక రీతిలో ఉన్న పదకోశాలను మనం నిర్మించుకున్నాం. దాని ఫలితంగానే శబ్దరత్నాకరం బ్రౌణ్యనిఘంటువు, ఆంధ్రనామసంగ్రహం, విద్యార్థికల్పతరువు, సాంబ నిఘంటువు, శ్రీహరినిఘంటువు, తెలుగు విశ్వవిద్యాలయ నిఘంటువు, తెలుగు అకాడమీ నిఘంటువులు మొదలగునవి ఎన్నో తెలుగులో వెలిసినాయి. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రములో జరిగిన అన్యాయాల్లో భాష కూడా ఒకటి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమములో సృజనకారులు ఎన్నో పాటలు, కథలు, నవలలు మొదలగు సాహిత్య ప్రక్రియాలల్లో వారి యాసను, భాషను, పదజాలాన్ని చొప్పించి అస్తిత్వాన్ని చాటుకున్నారు. భాషా వేత్తలు కూడా తమ వంతు కర్తవ్యంగా తెలంగాణ పదజాలాన్ని ఒక చోటుకు తీసుకురావడానికి కృషి చేసినారు. అట్ల కృషి చేసిన వారిలో నలిమెల భాస్కర్, ముదిగంటి సుజాతారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, కాలువ మల్లయ్య, కపిలవాయి లింగమూర్తి, భూతం ముత్యాలు ఎస్. చంద్రయ్య మొదలుగు వారలు కొన్ని పదకోశాలను నిర్మించినారు. వారు నిర్మించిన పదకోశాల ప్రత్యేకతను తెలియజేయడమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
అలివేణి, మబ్బు. తెలంగాణ పద నిఘంటువు. అలివేణి మబ్బు స్వీయ ప్రచురణ, హైదరాబాద్, 2024.
చంద్రయ్య, ఎస్., సంపాదకుడు. తెలంగాణ సాంస్కృతిక పదకోశం. తెలంగాణ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 2024.
జగన్నాథం, పేర్వారం. ఆరె భాషా నిఘంటువు. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 1995.
భాస్కర్, నలిమెల. తెలంగాణ పదకోశం. నయనం ప్రచురణలు, సిరిసిల్లా, 2003.
మల్లయ్య, కాలువ. గుమ్మి. ఫెయిర్ మీడియా ప్రచురణ, హైదరబాద్, 2018.
ముత్యాలు, భూతం. మాండలీకం. గుంపు మాండలిక సంస్థ, నల్గొండ, 2013.
ముదిగంటి, సుజాతారెడ్డి. తెలంగాణ వ్యవహార పదకోశం. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2018.
లింగమూర్తి, కపిలవాయి. పామర సంస్కృతం. మార్నింగ్ ప్రచురణలు, మహబూబ్ నగర్ జిల్లా, 2016.
శంకర నారాయణ, పాలూరి. ఆంధ్ర వాచస్పత్యం. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1990.
శ్రీహరి, రవ్వా. శ్రీహరి నిఘంటువు. తెలుగు అకాడమీ, హైదరాబాద్, 2004