నిత్యబాలింత కవితాసంపుటి: సామాజికాంశాలు

Main Article Content

గంజి కుమార్ రాజా

Abstract

ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి రాసిన 'నిత్య బాలింత' కవితాసంకలనం సమకాలీన సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తుంది. ఈ పరిశోధన సంకలనంలోని కవిత్వవస్తువులను విశ్లేషించడం ప్రధాన లక్ష్యం. పాఠకులలో ఆలోచన రేకెత్తించే అంశాలు, కవిత్వ నిర్మాణ శైలి, ప్రయోగాత్మక మాధుర్యం ఈ అధ్యయనానికి ప్రధానం. 'నిత్య బాలింత' అన్న శీర్షికకు రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి: ఒకటి ప్రకృతితో ముడిపడిన మట్టి తల్లిని నిత్య బాలింతగా దర్శించడం, రెండు ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే రైతన్న దృక్పథంలో భూమి పడే నొప్పులను గుర్తించడం. ఇది కవి సామాజిక స్పృహ, శ్రామిక పక్షపాత దృక్పథాలను ప్రస్ఫుటం చేస్తుంది. రాజకీయ, మత, ఆర్థిక, మానవ సంబంధాలు, కరువు, సమాజంలో స్త్రీ స్థానం, వలస జీవితాలు వంటి కీలక అంశాలు సంకలనంలో ప్రతిబింబిస్తాయి. తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వం, సామాజిక విమర్శల నేపథ్యంలో వెల్చేరు నారాయణరావు, జి. లక్ష్మీ నరసయ్య వంటి ప్రముఖుల రచనలను పరిశీలించి, వాటిని ఆధారం చేసుకుని ఈ అధ్యయనం కొనసాగింది. ఈ పరిశోధనకు ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి 'నిత్య బాలింత' కవితా సంకలనం ఆధారం. రచయిత ఇతర కవితా వ్యాస సంపుటాలు, కవిత్వ నిర్మాణ పద్ధతులు, కవిత్వం చర్చనీయాంశాలు వంటి ద్వితీయ ఆధార గ్రంథాలను కూడా పరిశోధన పరిధిలోకి తీసుకుని లోతైన విశ్లేషణ జరిగింది. పరిశోధన వర్ణనాత్మక విశ్లేషణ పద్ధతిలో సాగింది. కవితా సంకలనంలోని వివిధ ఖండికలను నేపథ్యం, వస్తువు, శైలి ఆధారంగా విశ్లేషించారు. ప్రకృతి-మానవ సంబంధం, రైతు చైతన్యం, వలస జీవితాలు, మత వివక్ష వ్యతిరేకత, స్త్రీ స్థితి, యువత ఆశాస్ఫూర్తి, సమయ ప్రాధాన్యత, స్నేహ బంధ విలువ వంటి ప్రధానాంశాలను గుర్తించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డి 'నిత్య బాలింత' కవితా సంకలనంపై మాత్రమే దృష్టి సారించింది. కవిత్వం సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించడం, ప్రజలలో చైతన్యం నింపడం, ప్రపంచ శాంతిని మానవ సౌఖ్యాన్ని కాంక్షించడం, మంచిని ప్రోత్సహించడం, చెడును ఖండించడం ప్రధాన ఫలితాలుగా వెల్లడయ్యాయి. గ్రామ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి దాకా జరుగుతున్న అనేక సామాజిక పరిణామాలు ఈ కవిత్వంలో నిబిడీకృతమై ఉన్నాయి. ఈ అధ్యయనం కవి సామాజిక దృక్పథం, ఆయన కవిత్వ శైలిని లోతుగా అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. భవిష్యత్తు పరిశోధనలకు ఆయన ఇతర రచనలపై సమగ్ర విశ్లేషణకు ఇది ఒక ప్రాతిపదికగా నిలుస్తుంది. ప్రస్తుత పరిశోధన కవిత్వంలోని కొన్ని ప్రధానాంశాల విశ్లేషణకు మాత్రమే పరిమితమైంది.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

నిత్యబాలింత కవితాసంపుటి: సామాజికాంశాలు. (2026). ఔచిత్యమ్, 6(13), 28-36. https://doi.org/10.5281/

References

ఈశ్వర్ రెడ్డి, ఎన్. కన్నీటి సీమ. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2003.

పైదే. మనసు పాట. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2009.

పైదే. నాకొక మనిషి కావాలి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2020.

పైదే. నాలో నువ్వు మినీ కవిత్వం. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2023.

పైదే. సాహిత్యంలో సమాజం వ్యాస సంపుటి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2023.

పైదే. నిత్యబాలింత కవితా సంపుటి. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2025.

పైదే. సమాజ హితం సాహిత్య మతం. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, 2025.

నరసయ్య, జి. లక్ష్మీ. కవిత్వ నిర్మాణ పద్ధతులు. ప్రతీక పబ్లికేషన్, 2015.

నరసయ్య, జి. లక్ష్మీ. కవిత్వం చర్చనీయాంశాలు. కర్షక ఆర్ట్స్ ప్రింటర్స్, 2021.

వెల్చేరు, నారాయణరావు. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం. ఎమెస్కో బుక్స్ ప్రై. లి., 2023.

Similar Articles

You may also start an advanced similarity search for this article.