ఔచిత్యమ్ - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక

తెలుగు భాష, సాహిత్యంపై పరిశోధనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో ఈ అంశంపై రకరకాల పరిశోధనలు వెలుగులోకి వస్తున్నాయి. “తెలుగులో పరిశోధన” ఇప్పటికే నిరంతర కృషితో సమాజాభివృద్ధికి దోహదపడుతోంది. కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లు, రీసెర్చ్ జర్నల్స్‌లో ముఖ్యంగా ప్రచురణ రూపాల్లో అనేక చర్చలు, సిద్ధాంతాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా  అందరికీ అందుబాటులో ఉండేలా ప్రామాణికమైన పరిశోధనా వ్యాసాలను  ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఉద్దేశ్యంతో “శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ, వివిధ విశ్వవిద్యాలయ ఆచార్యులు, విషయనిపుణుల సౌజన్యంతో "ఔచిత్యమ్"  (auchithyam.com) పేరుతో ఆన్‌లైన్ పీర్-రివ్యూడ్ రీసెర్చ్ జర్నల్ ISSN: 2583-4797 (నెలవారీ) నిర్వహిస్తున్నారు.

పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

2026-01-08

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

Vol. 6 No. 14 (2025): డిశంబర్ 2025 ఔచిత్యమ్ పత్రిక

శ్రీమహా విష్ణువు మోహినీ అవతారంలో దేవ దానవుల యోగ్యతను బట్టి అమృతాన్ని పంచడంలో ఔచిత్యాన్ని ప్రదర్శించాడు. పరమ ఔచిత్యకారి - ఆ అచ్యుతుడికి నమస్కరిస్తున్నాను” అని కాశ్మీర పండిత అగ్రేసరుడు క్షేమేంద్ర మహాకవి ప్రస్తుతించాడు. సౌందర్య శాస్త్రంలో ఔచిత్య సిద్ధాంత ప్రతిపాదనతో ఆచార్య పీఠాన్ని అలంకరించాడు. ప్రతి పదంలో, వాక్యంలో, అలంకార, రసాదుల్లో, దేశ కాలాలలో అన్ని చోట్లా యోగ్యతను అనుసరించి ఔచిత్యాన్ని పాటించాలని ఘంటా పథంగా చెప్పాడు. తెలుగు భాషా సాహిత్యాల్లో కూడా ప్రాచీనం - ఆధునికం అనే భేదాలేవీ లేకుండా సమకాలీన సమాజ ఉద్ధరణకు ఈ ఔచిత్యమ్ ప్రాణప్రదమైంది. ఈ మహిత ఉద్దేశాన్ని తెలియజేసేదిగా, ఉన్నత ఆశయాలను చేరుకోవాలనే లక్ష్యంతో ఈ అంతర్జాల తెలుగు మాస పత్రికకు “ఔచిత్యమ్” అని నామకరణం చేశాం. తెలుగు పరిశోధక శిఖామణులారా..! రండి....! మీ బహు గ్రంథపఠన కౌశలానికి, ప్రామాణిక పరిశోధనా పద్ఢతుల పరిమళాలను వెదజల్లే ఆలోచనలను మేళవించి, విశ్వవేదికపై కొలువుతీరిన తెలుగుతల్లి మెడలో వ్యాసమాలగా అలంకరించండి. ఈ విజయ దశమి రోజు ప్రారంభ సంచికను కొన్ని వ్యాసాలతో వెలువరించాం. ఆసాంతం ఆస్వాదించి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

- ప్రధాన సంపాదకుడు
శతావధాని డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ.

Published: 2025-12-01

దివ్యాంగుల కథలు : చైతన్యం

పుప్పాల రూపులు, ఆచార్య జర్రా అప్పారావు (Author)

44-50

యయాతి నవల: విమర్శనాత్మక విశ్లేషణ

డా. టి.డి. రాజన్న తగ్గి (Author)

51-60

జానపద ఆటలు: మనోవికాసం

డా. గడ్డం వెంకన్న (Author)

61-68

కరోనా మహమ్మారి తెచ్చిన విలయం: కథాసాహిత్యంలో దాని ఆనవాళ్ళు

అప్పన్న ఇనపకుర్తి, డా. ఢిల్లీశ్వరరావు సనపల (Author)

69-81

View All Issues

ISSN: 2583-4797 (Online)

Frequency of publication: Monthly

Language: Telugu

Starting Year: 2020

Format of publication: Online

Publisher details (Name and Complete address):
Dr. Rambhatla Parvatheeswara Sarma
Dr. RVRM Trust, 12-121/17, Flat No. 402,
Satyanagar, Chinamusidiwada,
Pendurthy, Visakhapatnam, – 531173.
Andhra Pradesh, India
Contact: +91 9247859580.
E-mail: editor@auchithyam.com

Details of Editor-in-Chief:
“Sathavadhani” Dr. Rambhatla Parvatheeswara Sarma
Visakhapatnam, Andhra Pradesh, India.
Cell: +91 9247859580
Email: editor@auchithyam.com
Profile: https://rambhatla.in/parichayam.html