నైతిక విమర్శ: పాశ్చాత్యుల కృషి
Main Article Content
Abstract
పాశ్చాత్య సాహిత్య ప్రభావంగా తెలుగులో వెలువడిన అనేక నూతన వచన ప్రక్రియలలో ఒకటి విమర్శ ప్రక్రియ. ఇది ఏదైనా ఒక కావ్యంలోని లేదా రచనలోని గుణదోషాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ, శ్రేష్టమైన రచనను, సాహిత్యాన్ని సమాజానికి అందిస్తుంది. ఈ ప్రక్రియకు ఉన్న విశేషమైన విస్తృతి లక్షణాల ఆధారంగా 19 వ శతాబ్ధి ఉత్తరార్ధం నుండి మొదలుకొని 20 వ శతాబ్ధి ఉత్తరార్ధం వరకు ఇధి ప్రక్రియ నుండి రూపాంతరంచెంది ఒక దృక్పథంగా అలాగే పరిశోధన అధ్యాయన ప్రమాణంగా రూపుద్ధిద్దుకుంది. ఈ విమర్శ దృక్పథంలో కొన్ని విమర్శనా రీతులు సాహిత్యాన్ని అధ్యాయనం చేయడానికి ఏర్పడ్డాయి అవి మార్క్సిస్టు విమర్శ రీతి, కళా విమర్శ రీతి , రూప విమర్శ రీతి , సాంఘిక విమర్శ రీతి , మనస్తత్వ విమర్శ రీతి, ఆర్కీటైపల్ విమర్శ రీతి మొదలైనవి. వీటిని ఆచార్య ఎస్.వి. రామారావు రచించిన “ తెలుగులో సాహిత్య విమర్శ ” అనే గ్రంథంలో సూత్రప్రాయంగా పరిచయం చేశారు. అలాగే ఆంగ్లసాహిత్య విమర్శకుడు విల్‌బర్ట్ తను సంపాదకత్వం వహించిన “ Five approaches of literary criticism ” అనే గ్రంథంలో వివరించారు. ఈ విమర్శ రీతులలో కొన్ని విమర్శ రీతులు పరిశోధన అధ్యాయన ప్రమాణాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ మరికొన్ని రీతులు ఇంక శాస్త్రీయంగా పరిచయం చేయబడలేదు. కాబట్టి వాటిలో ఒకటైన నైతిక విమర్శ రీతిని పరిచయం చేయడం, పాశ్చాత్య సాహిత్యంలో దీని ఆవిర్భావ వికాసానికి కృషిచేసిన ప్రముఖ లాక్షణికులను, విమర్శకులను పరిచయం చేయడం, అలాగే తెలుగు సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడానికి ఇది ఎలా దోహదంచేస్తుందో వివరించే ప్రయత్నం చేయడమే నా ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.
Downloads
Article Details
Section

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.
How to Cite
References
చక్రవర్తి, సిహెచ్. లక్ష్మణ. (సంపా). తెలుగు సాహిత్య విమర్శదర్శనం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2016. హైదరాబాదు.
మందేశ్వరరావు, వడలి. పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర – సిద్ధాంతాలు. తెలుగు విశ్వవిద్యాలయం, 1994. హైదరాబాద్.
రామారావు, ఎస్. వి. తెలుగులో సాహిత్య విమర్శ. సరోజా ప్రచురణలు, 2017. కరీంనగర్.
విల్‌బర్ట్, జాన్. (సంపా). Five Approaches to Literary Criticism. న్యూయార్క్: యూనివర్సిటీ ప్రెస్, 1970.
వేంకటేశం, బొద్దుల. ఆంగ్ల సాహిత్య శాస్త్రం. సరోజా ప్రచురణలు, 2010. కరీంనగర్.
పైదే. ఆరిస్టాటిల్ కావ్యశాస్త్రము. సరోజా ప్రచురణలు, 1993. కరీంనగర్.
పైదే. గ్రీక్ – రోమన్ సాహిత్య శాస్త్రము. సరోజా ప్రచురణలు, 1993. కరీంనగర్.