నెమలి కన్నులు: దళిత జీవన పరిణామాలు

Main Article Content

వొటారికారి సందీప్

Abstract

సమాజాన్ని ఏ వ్యక్తి కూడా నేరుగా తనంతటతాను అర్థం చేసుకోలేడు. అలా అర్ధం చేసుకోవాలంటే అందుకు అతనికి తన జీవితకాలం కూడా సరిపోదు. కాగా సమాజం రెండు అంత్యాల మధ్య ఉన్న ఒక సరళ రేఖ లాంటిది కాదు. అది విభిన్న దొంతరల సమూహం. అనేక కోణాలను కలిగి ఉన్న సంఘర్షణ క్షేత్రం. కాబట్టి ఇట్లాంటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అనేక కారకాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అవి శాసనాలు, నాణాలు, కట్టడాలు. అయితే వీటన్నిటితోపాటు అతి ముఖ్యమైనది సాహిత్యం కూడా. ఎందుకంటే మాక్సిమ్ గోర్కి అభిప్రాయం ప్రకారం “సాహిత్యం సమాజాన్ని చూపించే దర్పణం లాంటిది”. ఎందుకంటే సాహిత్యమే సమకాలీన సమాజాన్ని రికార్డు చేస్తుంది. చరిత్రకారులకు కావలసిన కాల రేఖను నిక్కచ్చిగా అందిస్తుంది. అట్లాగ సాహిత్యంలో చరిత్రను రికార్డు చేసే ప్రక్రియల్లో ‘స్వీయ చరిత్ర’ అతి ముఖ్యమైనది. దీనిని ‘ఆత్మకథ’ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ స్వీయ చరిత్ర పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ప్రవేశించిన ఆధునిక సాహితీ ప్రక్రియ. సామాన్యంగా అన్ని స్వీయ చరిత్రలు ఒకే లాగా ఉండవు. అందుకు కారణం ఇతరుల ఆత్మకథలతో పోల్చుకుంటే దళితుల ఆత్మకథల్లో దుఃఖం, వేదన ప్రధానంగా ఉంటుంది. వాస్తవానికి ఇవే అప్పటి సమకాలీన సమాజానికి చారిత్రక సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇలా ఇవి తెలుగు సాహిత్యంలోకి చాలా అరుదుగా వస్తుంటాయి. అట్లాగా అరుదుగా వచ్చిన ఇప్పటి స్వీయ చరిత్రే ఈ ‘నెమలికన్నులు’. ఈ నెమలి కన్నులు ఆత్మకథ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రచించారు. ఇది మొదట్లో భూమిపుత్ర పత్రికలో ప్రతివారం ప్రచురించబడి 2023వ సంవత్సరంలో పుస్తక రూపంలో ముద్రితమైంది. ఇప్పుడు ఈ ఆత్మ కథను దళిత జీవిత పరిణామ క్రమంలో పరిశీలించి ఫలితంశాలను ఈ పరిశోధన వ్యాసంగా తెలుపుతున్నాను. ఇందుకోసం నెమలికన్నులు ఆత్మకథ తో దళిత చరిత్రను పునర్ మూల్యాంకనం చేసి దళిత జీవితాల్లో విద్య ప్రాముఖ్యతను వివరించడం ఈ వ్యాస పరిమితి. మూల గ్రంథంగా నెమలి కన్నులు ఆత్మకథ, అట్లాగే తెలుగులో స్వీయ చరిత్రలు, మా నాయన బాలయ్య, తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్ కంపెనీ పాలన, దళితుల చరిత్ర, అంబేద్కర్ రచనలు, ఇతర అంతర్జాల సమాచారాలు మొదలైనవి ఈ వ్యాసరచనకు ద్వితీయ ఆకారాలుగా తోడ్పడ్డాయి. కాబట్టి ఆయా ఆకారాలలో తెలిపిన దళిత జీవిత చరిత్రను సాంస్కృతిక, సామాజిక, విద్యా ప్రభావాలతో గుణాత్మక పరిశోధన పద్ధతిలో విశ్లేషించడం జరిగింది. సామాజిక వ్యవస్థలో దళిత జీవిత పరిణామ క్రమం ఎలా ఉంది? వారి ఉన్నతికి విద్య ఎలా తోడ్పడిందో తెలుసుకోవాలనుకునేవారికి ఈ వ్యాసం ప్రామాణికమవుతుందని చెప్పవచ్చు.

Article Details

Section

పరిశోధన వ్యాసాలు

How to Cite

నెమలి కన్నులు: దళిత జీవన పరిణామాలు. (2025). ఔచిత్యమ్, 6(14), 28-43. https://doi.org/10.5281/zenodo.18091227

References

అడపా, సత్యనారాయణ. ద్యావనపల్లి సత్యనారాయణ. తెలంగాణ-చరిత్ర-సంస్కృతి ఉద్యమాలు. తెలంగాణ పబ్లికేషన్స్, 2023.

అడపా, సత్యనారాయణ (సంపా). తొలి ఆధునిక ఆంధ్ర, హైదరాబాద్, కంపెనీ పాలన (క్రీ.శ 1724 - 1857). ఎమెస్కో పబ్లికేషన్స్, 2015.

అక్కిరాజు, రమాపతిరావు. తెలుగులో స్వీయ చరిత్రలు. యువ భారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, 1984.

జి., లక్ష్మీ నరసయ్య. దళిత స్పృహ: తెలంగాణ పరిణామం. వివేక ప్రచురణలు, 2010.

చిన్నారావు, యాగటి. మందార ప్రభాకర్ (అను). ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర (1900-1950). 3వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2011.

చిన్నారావు, యాగటి. ఎస్.సుబ్రహ్మణ్యం (అను). ఆంధ్ర ప్రదేశ్ నూరేళ్ళ దళిత ఉద్యమం సంక్షిప్త చరిత్ర. 1వ ముద్రణ, సమాంతర ఫౌండేషన్, 2012.

చండ్ర, రాజేశ్వర రావు., గౌడ్, రాజ బహుదూర్., గిరిప్రసాద్, నల్లమల. చారిత్రాత్మక తెలంగాణ పోరాటం. 2వ ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1987.

దాశరథి, రంగాచార్య. చిల్లర దేవుళ్ళు. 4వ ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2001.

దార్ల, వెంకటేశ్వరరావు. నెమలి కన్నులు. 1వ ముద్రణ, కస్తూరి విజయం పబ్లికేషన్స్, 2023.

దార్ల, వెంకటేశ్వరరావు. నెమలి కన్నులు (కవిత్వం). 2వ ముద్రణ, మంజుశ్రీ ప్రచురణలు, 2016.

దార్ల, వెంకటేశ్వరరావు. సాహితీ సౌగంధి. 1వ ముద్రణ, మంజుశ్రీ ప్రచురణలు, 2016.

నల్లందిఘల్, లక్ష్మీ నరసింహాచార్యులు. మనుస్మృతి. 1వ ముద్రణ, గాయత్రీ ప్రచురణలు, 2000.

ఖండవల్లి, లక్ష్మీరంజనం. సంస్కృతి చర్చ: ఒక విశ్లేషణ. ఆదర్శ ప్రచురణలు, 1999.

బి., విజయభారతి. బాబాసాహెబ్ అంబేద్కర్. 3వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1990.

వై., రామాకృష్ణ రావు. ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య స్రవంతి (stream of consciousness in modern Telugu literature). 1వ ముద్రణ, వేదిక సాహితీ సాంస్కృతిక సంస్థ, 1987.

సత్యనారాయణ, ఎస్వీ. (సంపా). దళితవాద వివాదాలు. 2వ ముద్రణ, నవచేతన పబ్లిషింగ్ హౌస్, 2019.

సత్యనారాయణ, వై.బి. పి.సత్యవతి (అను). మా నాయన బాలయ్య. 1వ ముద్రణ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2013.

సుధాకర్, ఎండ్లూరి. మల్లె మొగ్గల గొడుగు మాదిగ కతలు. 1వ ముద్రణ, దండోరా ప్రచురణలు, 1999.

Similar Articles

You may also start an advanced similarity search for this article.