AUCHITHYAM | Volume-07 | Issue-8 | July 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. పుష్పగిరి క్షేత్రం: చారిత్రక అవలోకనం
డా. చంద్రకాంత్ మునేశ్వర్
సహాచార్యులు, చరిత్రశాఖ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డి
జిల్లా కామరెడ్డి, తెలంగాణా.
సెల్: +91 9989538243, Email: chandrakanthmuneshwar1980@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 05.06.2026 ఎంపిక (D.O.A): 25.06.2026 ప్రచురణ (D.O.P): 01.07.2026
వ్యాససంగ్రహం:
హరి-హరులు కల పుణ్యక్షేత్రం. శైవ, వైష్ణవులకు పవిత్ర స్థలం. తెలుగు రాష్ట్రలలో గోళకి మఠానీకి అనుబంధంగా ఉన్న ఏకైక అద్వైతపీఠం. పినాకిని నది ఒడ్డున పచ్చని ప్రకృతి రమణీయతల మధ్య అద్భుత శిల్ప,చిత్ర కళవైభవానికి ప్రతీక పుష్పగిరి. ఈ క్షేత్రం కడప జిల్లాలోని ‘పుష్పగిరి’ గ్రామంలో ఉంది. అద్వీతీయ పుణ్యక్షేత్రము, దక్షిణాదిలోని గోళకి మఠ కేంద్రము. కాకతీయుల కాలంలో క్రి.శ 13వ శతాబ్దంలో సోమశివాచార్యచే గోళకి మఠ స్థాపన,పీఠాదిపతి అఘోర శివాచార్యుల బోధన శైవ-వైష్ణవుల సమన్వయం, సంస్కృతిక దైవ క్షేత్రం, ప్రకృతి పర్యటక ప్రదేశం. ప్రస్తుత పరిశోధన వ్యాసం “పుష్పగిరి క్షేత్రం: చారిత్రక అవలోకనం” అను అంశముపై దృష్టి కేంద్రికరిస్తుంది. “పుష్పగిరి క్షేత్రము” పై అనేక పరిశోధనలు జరిగాయి. నా ఈ పరిశోధన పత్రము యొక్క ముఖ్య ఉద్దేశము ‘పుష్పగిరి’ పుణ్యక్షేత్రము, గోళకి మఠ విశిష్టత, శైవ-వైష్ణవ మతాల మధ్య సమన్వయము, సామాజిక సంక్షేమానికి, విద్య వికాస సేవా గురించి. ఆదరణ, పోషణ, సహకారము, ఆధ్యాత్మిక సంస్కృతిక కేంద్రం. రాజులు, సామంతులు ఇచ్చిన దానాలు, అదేవిదంగా “పుష్పగిరి”కి సంబంధించిన ‘శాసనాలు’ అభివృద్ధి గురించి నేటి తరానికి తెలియ పర్చడం ముఖ్య ఉద్దేశ్యం. ఈ చారిత్రక పరిశోధన వ్యాసములో గోళకి మఠ మూల కేంద్రం మధ్య భారతము, అలాగే దక్షిణాదికి వలస వచ్చిన విధానం గురించి చర్చించు కొంటాము. నేటి తరానికి ‘పుష్పగిరి’ చారిత్రక, సంస్కృతిక ప్రాముఖ్యతను గురించి వివరించడం, ప్రస్తుత స్థితి, సంరక్షణ, నిర్వహణ, పర్యటక దృష్టి కోణంలో చర్చించడం, చారిత్రక, వారసత్వ సంపదను కాపాడుకొని పర్యటక అభివృద్ధికి తోడ్పాడు అంశాలపైన అవగాహనా కల్పించడం నా ఈ పరిశోధన పత్ర ఆవశ్యకతగా భావిస్తున్నాను. పరిశోధన రచన విధానము, పరిశోధన పద్ధతి ప్రాథమిక, ద్వితీయ ఆధారాలను ప్రామాణికంగా తీసుకొని పరిశోధన పత్రము సమర్పిస్తాను. అందుబాటులో ఉన్న అనేక రచనలను సేకరిస్తాను, చరిత్రక రచనలు, పురావస్తు అధికారుల నివేదికలు, పరిశోధన గ్రంథాలు, రాజ్యాభిలేక పరిశోధనాలయంలో దొరుకు సమాచారము, ప్రభుత్వ రికార్డులు, ప్రముఖ దినపత్రికలలో అచ్చు అయిన సమాచారము, స్వయంగా కావలసిన విషయాలు సంబంధిత అధికారుల నుండి క్షేత్ర పర్యటన ద్వారా సేకరించిన ప్రాథమిక సమాచారమును ఆధారంగా చేసుకుని పరిశోధన సాగిస్తాను. నా ఈ పరిశోధన ‘పుష్పగిరి క్షేత్రం’ పైన పరిశోధన, అధ్యయనం చేస్తున్న తోటి పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.
Keywords: పుష్పగిరి, గోళకి మఠం, విశ్వేశ్వర శంభూ, సోమా శివాచార్య, అఘోరా శివాచార్య, తాంత్రిక, తాత్వీక, శైవ, వైష్ణవ, కాకతీయ, సామంత నాయక, ఆదరణ, పోషణ, భక్తి, పంచనది సంగమం, శ్రీశైలం, చారిత్రక శాసనాలు, గరుడ, శాఖలు, భౌగోళీక, పురాణాలు, హరి-హర, దానాలు, శ్రీ విధ్య ఉపాసన, అమృత బిందు, అధ్వైతము, పీఠం, పర్యాటకము, వసతులు, సౌకర్యాలు, సంరక్షణ
1. ప్రవేశిక
కడప జిల్లాలోని “పుష్పగిరి” కేవలం ఒక పుణ్యక్షేత్రము మాత్రమే కాదు ఇది దక్షిణాది గోళకి మఠ కేంద్రము. క్రీ.శ 13వ శతాబ్దంలో విశ్వేశ్వర శంభూ శిష్యులు సోమశివాచార్య స్థాపించిన ఈ మఠము తర్వాతి కాలంలో అఘోర శివాచార్యుల వారి కాలంలో తంత్ర, తాత్విక వేత్తల చేతుల్లో శైవ-వైష్ణవ మతాల మధ్య సమన్వయానికి, తాంత్రిక శక్తులకు, సామాజిక సంక్షేమానికి కేంద్ర బిందువుగా హరి-హర క్షేత్రంగా అవతరించినది. కాకతీయుల సంపూర్ణ పోషణ, సహకారము, మద్దతు గోళకీ మఠం యొక్క ఆధ్యాత్మిక శక్తి అలాగే స్థానిక ప్రజల భక్తి భావము కలసి పుష్పగిరిని ఒక మహోన్నత క్షేత్రంగా మార్చాయి. చారిత్రక పరిశోధనల ప్రకారం గోళకి మఠములకు మూల కేంద్ర మధ్య భరతము అలాగే దక్షిణాదికి వలస వచ్చిన విధానం గురించి చర్చించు కొంటాము. (క్రీ.శ. 10వ శాతాబ్దము మొదలు క్రీ.శ 12వ శతాబ్దాల మధ్య).
2. గోళకీ మఠానికి మూలం
గోళకీ మఠాలకు మూలము మధ్య భారతదేశము (ప్రస్తుత మధ్యప్రదేశ్) లోని ‘త్రిపురి’ (జబల్పూర్ సమీపంలోని తివూర్) కేంద్రంగా ఉండేది. ఈ ‘త్రిపురి’ నర్మదా, గంగా నదుల మధ్య ఉన్న పవిత్ర ప్రాంతము. గోళకి మఠము శైవమతానికి చెందిన ఒక ధార్మిక మఠ కేంద్రంగా ఉండేది. ఇది ప్రస్తుత జబల్పూర్ సమీపంలోని తివూరు పట్టణం. పదో శతాబ్దం లో "సద్బవ శంభు" గోళకి మఠానికి ప్రధాన గురువు. కాలచూరి రాజైన యువరాజు దేవుడు ఈ మఠానికి మూడు లక్షల గ్రామాలు దానం ఇచ్చాడు. (మధ్యభారత దేశాన్ని పాలించిన ఒక రాజవంశం పేరు కాలచూరి).సద్బవ శంభు తరువాత వచ్చిన "సోమ శంభు" అనే గురువు "సోమ శంభు పద్దతి" అను పేరుతో గోళకీ మఠాల నిర్వహణ విధానాలను,సంప్రదాయ పద్దతులు నియమ నిబంధనలను క్రోడికరిస్తూ ఒక గ్రంధంను రచించాడు. సోమ శంభు తరువాత మఠ గురువుగా వచ్చిన "వామ శంభు" కాలచూరి రాజులకు (క్రీశ 1052 ) రాజ గురువుగా ఉన్నాడు. ఈ మఠానికి చెందిన తదనంతర పీఠాధిపతులలో "విశ్వేశ్వర దేవ" ప్రముఖుడు. ఇతను కాకతీయ రాజైన గణపతి దేవునికి శైవ దీక్షా ఇచ్చిన గురువు. ఇతని ప్రస్తావన ప్రసిద్ధ కాకతీ మల్కాపుర శాసనంలో ప్రముఖంగా ఉంది. ఇతనికి గల వివిధ బిరుదులు - గోళకి వంశ క్రితాభిషేక, మహిసుర, నైష్టిక దేశికేంద్ర, శైవాచార్య మొదలగునవి. గోళకి మఠాలు గౌడదేశం (బెంగాలు)లో పదవ శతాబ్దానికి ముందే విస్తరించి ఉన్నాయని వేటూరి ప్రభాకరశాస్త్రి “బసవ పురాణా”నికి వ్రాసిన ముందుమాటలో అన్నారు.
దక్షిణ భారతదేశంలో శైవమతం ప్రాచీన కాలం నుండియే విస్తరించి ఉంది. పురాతన పశుపతినాథ ఆరాధన శాఖ నుండి అతి వికృతమైన కాపాలిక శాఖ వరకూ అనేక శాఖలు, ఉప శాఖలు కనిపిస్తాయి. పదో శతాబ్దానికి వచ్చేసరికి శుద్ధ శైవము, కాలముఖము ప్రముఖ శాఖలుగా మిగిలాయి. గోళకి మఠం శుద్ధశైవానికి చెంది రాజాశ్రయాన్ని పొంది పదకొండు, పన్నెండు శతాబ్దాలలో ప్రాచుర్యంలో ఉండింది. కానీ కాలక్రమేణా ఈ రెండు శాఖలు కలిసిపోయినట్లు తెలుస్తుంది. గోళకి మఠ గురువులైన ఈశాన దేవ, క్రియాశక్తిలు వారు శుద్ధశైవులైనప్పటికీ తదనంతరం కృష్ణదేవరాయుల సమయానికి కాలముఖులుగా పేర్కొనబడ్డారు.
గోళకి మఠం వీరశైవ అఘోరా పద్దతులకు-వేదాలకు మధ్యేమార్గంగా అవతరించిన సంప్రదాయపద్దతి అని వేటూరి ప్రభాకర శాస్త్రి అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కొన్ని చోట్ల ఈ మఠాధిపతులు వీరశైవులని, అఘోరాలని, తాంత్రిక వాదులనీ పేర్కొనబడ్డారు. (ఆధారం. పుష్పగిరి శాసనం) అప్పట్లో ప్రతి శివాలయములోను గోళకి మఠం ఉండేది. దీనిని మహేశ్వరి, శైవయోగినిల పేరుతో పిలువబడే శైవ సన్యాసినిలు నిర్వహించే వారు. వీరి వివరాలు పదమూడవ శతాబ్దానికి చెందిన కర్నూలు శాసనాలలో విరివిగా కనిపిస్తాయి. పూజాదికాలు మాత్రం లింగధారులు, జంధ్య ధారులు అయిన జంగాలు జరిపేవారు. వీరు శైవాగమన పద్దతులు మరియు వేదాలకు అనుగుణంగ పూజలు చేసేవారు. వీరిని శుద్ధశైవ బ్రాహ్మణులుగా మల్కాపుర శాసనంలో పేర్కొనబడ్డారు. కాల క్రమంలో వీరు వేదాలను ఎక్కువగా అనుసరించటంతో ఆరాధ్య బ్రాహ్మణులు అని పిలవబడ్డారు. శైవమత పునరుద్దరణకు పూనుకొన్న పండిత త్రయంలోని "శివలెంక మంచన" గోళకిమఠ నియమనిబంధల గ్రంధమైన "సోమ శంభు పద్దతి" రచనను వ్రాసిన సోమశంభుని మనుమడు.
గోళకిమఠానికి చెందిన ప్రముఖులు
గోళకి మఠానికి చెందిన ప్రముఖులు ఉత్తరం నుండి దక్కను కేరళ వరకు విస్తరించి ఉన్నారు వారిలో ముఖ్యులు
- పన్నెండో శతాబ్దపు కాలచూరి వంశానికి చెందిన బిజ్జల దేవునికి దీక్ష ఇచ్చిన ‘క్షంపాల’ దీక్ష గురువు.
- కేరళకు చెందిన ఈశాన శివాచార్య. ఇతను రాజరాజ చోళునికి రాజ గురువు.
- కాకతి గణపతిదేవునికి దీక్షనిచ్చిన విశ్వేశ్వర శంభూ. ఇతనిని గణపతిదేవుడు తన తండ్రిలాగ పేర్కొన్నాడు. ఇతను కృష్ణా తీరంలో మంధర (నేటి మందటం) ప్రాంతంలో ఆశ్రమం కట్టుకొని స్థిరపడ్డాడు. గోళకిపీఠాధిపతి విశ్వేశ్వర శంభూ కాకతీయ రాజులకు గురువే కాక- చోళులకు, మాళవులకు, కాలచూరి రాజులకు కూడా గురువేనని ఇంకా వందలాది వీరశైవ ఆచార్యులకు అధిపతి అని చెప్పబడ్డాడు.
- పుష్పగిరి మఠాన్ని స్థాపించిన "సోమశివాచార్య" గోళకి సంప్రదాయానికి చెందిన గురువు. ఇతని విగ్రహం వెడికల్లిలో కలదు. (పుష్పగిరి చెన్నకేశవ ఆలయంలో క్రీ.శ.1501వ సంవత్సరం నాటి శాసనంలో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని నిర్మించినట్లు ఉన్నది).
- శ్రీనాథుడు ఓడించిన గౌడ డిండిమ భట్టు గోళకి పరంపరకు చెందిన వ్యక్తి.
- విరూపాక్ష పుష్పగిరి అద్వైత మఠాలు గోళకి వంశస్థులు నెలకొల్పినవే.
- ఆంధ్ర ప్రాంతంలో పుష్పగిరి, త్రిపురాంతక ఆలయాలలో గోళకి మఠాలు ఉండేవి.
- విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన విద్యారణ్య స్వామి గోళకి మఠ సంప్రదాయానికి చెందిన వ్యక్తి.
గోళకి మఠ గురు వంశస్థులు ఆ తరువాత అనేక శతాబ్దాలు ఆంధ్ర దేశంలో తమ ఉనికిని నిలుపుకొన్నారు. కాళేశ్వరం, శ్రీశైల, మంథని ఆలయాలలో తమ మఠాలను నెలకొల్పి తమ సంప్రదాయాలను ప్రచారం చేసుకొన్నారు.
గోళకి మఠం - సామాజిక సంస్కరణ
శ్రీకంఠ శివాచార్యుడు ఆలయంలోకి కులాలతో సంబంధంలేకుండా భక్తులందరకీ ప్రవేశం కల్పించాడు. (కాకతీయుల కాలం నాటి మల్కాపుర శాసనంలో కూడా బ్రాహ్మణులు మొదలు చండాలుర వరకూ అందరికి ఉపయోగపడే విధంగా సత్రలను నిర్మాణం చేసినట్లు శాసన సమాచారం ఉంది). శివుని నామోచ్ఛారణ ద్వారా చండాలుడు కూడా ఉత్తముడౌతాడని ప్రభోదించాడు. ఒక చండాలుడు శివుని నామాన్ని ఉఛ్ఛరించాకా ఇతరులందరూ అతనితో మాట్లాడవచ్చు, కలిసి జీవించవచ్చు, కలిసి భుజించవచ్చు అని ముండకోపనిషత్తులో చెప్పబడింది అని శ్రీకంఠుడు ప్రవచించేవాడట ఆ తరువాత వచ్చిన బసవేశ్వరుడు శివదీక్ష తీసుకొన్న స్త్రీలు, పురుషులు; బ్రాహ్మణులు, శూద్రులు; అంటతగినవారు, అంటరానివారు, అందరూ ఒకేరకమైన హక్కులు కలిగి ఉంటారని, లింగము, కులము, వర్ణములకు అతీతంగా అందరూ మోక్షమును పొందే అర్హత కలిగి ఉంటారని ప్రవచించాడు. బసవేశ్వరుని బోధనలుగా చెప్పబడుతున్న పై అంశాలన్నీ అప్పటికే అమలులో ఉన్న గోళకి మఠ సంప్రదాయాలని వేటూరి ప్రభాకరశాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయినపుడు ఈ గోళకి మఠ ఆచారకులు ఆంధ్రనుంచి, కర్ణాటకవైపు వలసపోయి విద్యారణ్య స్వామి ఆశీర్వాదాలతో హరిహర, బుక్కరాయల సారధ్యంలో క్రి.శ 1336వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు.
గోళకి మఠం తాంత్రిక పీఠమా?
గోళకిమఠం (Circular Lodge) ప్రారంభదశలలో శక్తి ఆరాధనకు, తాంత్రిక విద్యలకు నిలయంగా ఉండేదనే ఒక అభిప్రాయం కలదు. గోళకిమఠానికి మూడులక్షల గ్రామాలను దానం చేసిన కాలచూరి రాజులు పదో శతాబ్దంలో (975-1025 క్రీశ) జబల్పూర్ లో నిర్మించిన చౌసట్ యోగిని ఆలయం/భేడఘాట్ ఆలయం ఈ వాదనకు సాక్ష్యంగా నిలుస్తుంది. (గోళాకార ఆలయం) చౌసట్ యోగిని ఆలయంలో శివుడు, దుర్గమాత, అరవై నాలుగు యోగినిలు కొలువై ఉన్నారు. యోగినుల విగ్రహాలు శృంగారోద్దీపన కలిగించే విధంగా ఉంటాయి. ఈ ఆలయంలో- తాంత్రిక విద్యలుగా భావించబడే మూలాధార చక్రం, కుండలిని స్థానాల ఆధారంగా వివిధ యోగినిల పేరుతో అరవై నాలుగు ఆలయ గదులు ఉన్నాయని, ఇవన్నీ తంత్రసాధనకొరకు ఉపయోగపడి ఉండొచ్చని ఆర్.కె.శర్మ అభిప్రాయపడ్డాడు. (Kiss of the Yogini by Gordan White)
గోళకిమఠం ఎలా ప్రారంభమైనా దాని ఆరాధన,రీతి/విశిష్ట వర్గం (Cult) ఒక గొప్ప రాజకీయ సామాజిక మార్పులకు ఆధారమయ్యిందనేది ఒక చారిత్రిక సత్యం. గోళకి మఠం మధ్య భారతంలో స్థాపించబడినదైనప్పటికీ రాజకీయ ఒడిదుడుకుల వల్ల క్రమక్రమంగా దక్షిణాదివైపుకు జరుగుతూ వచ్చింది. అలా కర్ణాటక, కేరళ, తమిళ, తెలుగు రాష్టాలలో విస్తరించినపుడు ఇక్కడి శైవ సంప్రదాయాన్ని ప్రభావితం చేసి ఒక ప్రత్యేకమైన "Golaki School of Shaivism" గా రూపాంతరం చెందింది. శైవం లోని దుష్ట సంప్రదాయాలను (అఘోరాలు, శక్తి ఆరాధన, శారీరిక హింస, యోగినీ ఆరాధన లాంటివి) క్రమక్రమంగా వదిలించుకొని ఈ సమాజంలోని ప్రజలందరూ సమానమేననే సిద్ధాంతాన్ని ఉద్భోదించిన ఒక ఉత్తమ మత సంప్రదాయంగా గోళకి మఠాన్ని నేడు గుర్తించవచ్చు.
శ్రీ కృష్ణదేవరాయుల కాలంలో గోళకి మఠ సాంప్రదాయం హిందువులను అప్పటి ఉమ్మడి శతృవులకు వ్యతిరేకంగా ఏకీకృతం చేయటంలో సహాయపడింది. శివదీక్ష తీసుకొన్న ప్రజలందరూ దేవుడిముందు సమానమే అని చెప్పిన వైదిక శాఖ ఈ గోళకిమఠం. మరి అంతటి గొప్ప ప్రభోధనలనుండి మరలా ఇంతదూరం ఎందుకు జరిగిపోయామో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం.
గోళకి అంటే
"గోళకీ" అంటే గోళాకారము (Circular) అని అర్థము. ఈ గోళకి మఠం శైవ సిద్ధాంతంలోని (64) చౌసట్ యోగినుల (Chausath Yoginis) ఆరాధనతో ముడిపడి ఉంది. మధ్యప్రదేశ్లోని భేడాఘాట్లో ఉన్న చౌసతట్ యోగిని ఆలయం వలెనే, ఈ మఠము కూడా తాంత్రిక అలాగే వేద సంప్రదాయాల మిశ్రమ సిద్ధాంతము. చౌసట్ యోగినిలు హిందూ తాంత్రిక సంప్రదాయంలో శక్తి స్వరూపిణీ (దైవిక స్త్రీ శక్తి) అత్యంత శక్తివంతమైన,రహస్య అరవై నాలుగు మంది స్త్రీ దేవతల సమూహం. వీరు అష్ట మాతృకల నుండి ఉద్భవించారని, తంత్ర, యోగ అలాగే ఆధ్యాత్మిక శక్తులకు ఆధిదేవతలని ఈ శాఖ భక్తులు భావిస్తారు. వీరు ప్రధానంగా భైరవి, శాకిని, డాకిని రూపాల్లో ఉంటారని విశ్వాసం. చౌసట్ యోగినుల ముఖ్య విశేషాలకు మూలం అష్ట మాతృకలు (బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి, చాముండ, నరసింహి) ఒక్కొక్కరు ఎనిమిది మంది శక్తి రూపాలను సంతరించుకోవడం ద్వారా అరవై నాలుగు యోగినులు ఏర్పడ్డారు. అరవై నాలుగు యోగినుల పూజ మూలంగా (చౌసత్ యోగిని పూజ) శ్రేయస్సు, మానసిక ప్రశాంతత, ప్రతికూల శక్తుల నుండి రక్షణ అలాగే ఆరోగ్యకర, సంతోష జీవితాన్ని ప్రసాదిస్తారు అని నమ్మకం. భారతదేశంలో అరవై నాలుగు యోగినులకు ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి, ముఖ్యంగా ఒడిశాలోని హీరాపూర్ (భువనేశ్వర్ సమీపంలో), రానిపూర్-ఝరియాల్ అదేవిదంగా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ (భేడాఘాట్) లలో దేవాలయాలు కనిపిస్తాయి. అరవై నాలుగు యోగినుల దేవాలయాలు సాధారణంగా వృత్తాకారంలో, పైకప్పు లేకుండా (hypaethral) ఉంటాయి, మధ్యలో శివుడు (భైరవుడు) ప్రధాన దేవతగా ఉంటాడు. తంత్రము ఆలాగే శక్తి స్వరూపులు. వీరు తాంత్రిక శక్తులకు అధిదేవతలుగా, కోరికలను తీర్చేవారుగా, అలాగే దుష్ట శక్తులను సంహరించే శక్తి స్వరూపాలుగా పూజిస్తారు.
అరవై నాలుగు యోగినుల పేర్లు (కొన్ని ప్రసిద్ధమైనవి) పురాణా గ్రంథాలను బట్టి కొద్దిగా అటు ఇటు మారవచ్చు, కానీ సాధారణంగా ఈ విదంగా ఉన్నాయి. 1. దేవీ 2. యోగిని 3. డకిని 4. శాకిని 5. లకిని 6. కాకిని 7. హకిని 8. త్రాకిని 9. రక్తిని 10. మాలిని 11. సింహిని 12.చాముండి 13.రాగిణి 14.భోగిణి 15.వారాహి మొదలైనవి.ఈ దేవతలు మానవ భావోద్వేగాలను, కోరికలను అలాగే వ్యక్తిత్వాలను సమతౌల్యం చేస్తాయని, యోగులకు సిద్ధిని ప్రసాదిస్తాయని విశ్వసిస్తారు.
గోళకి మఠము దక్షిణాదికి వలస
క్రీ.శ.12వ శతాబ్దములో కాలచూరి రాజవంశ పతనానంతరం మధ్య భారతంలోని ‘త్రిపురి’ గోళకి మఠానికి చెందిన గురువులు దక్షిణాదికి వలస వచ్చారు. దక్షిణాదికి వలస వచ్చిన వారిలో ముఖ్యులు ‘సద్భావ శంభు’ అనే గురువు శిష్యులు ప్రధానమైన వారు. వీరు దక్షిణాదిలో గోళకి మఠాన్ని స్థాపించారు.‘సద్భావ శంభు’ శిష్యుడు ‘విశ్వేశ్వర శంభు’ దక్షిణ భారతంలో మొదట గోళకి మఠాలను కాకతీయ రాజ్యమంతట స్థాపించి ప్రముఖ శైవ కేంద్రాలుగా తీర్చిదిద్ది అభివృద్ధి పరచాడు. కాకతీయులు (ముఖ్యంగా గణపతి దేవుడు, రుద్రమదేవి) శైవమతాన్ని, ముఖ్యంగా 'శివ శిక్షణ' (శివమతం) "Golaki School of Shaivism” ను ప్రచారం చేయడానికి గోళకి మఠాలకు చెందిన ఆచార్యులను (సద్భావ శంభూ శిష్యులను) ఆహ్వానించి గౌరవించి ఆదరించారు. గోళకి మఠాలు కేవలం మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా, విద్య, సంస్కృతి,కళలకు అలాగే సమాజ సేవ కేంద్రాలుగా పనిచేశాయి. గోళకి మఠాలకు అనేక మంది రాజులు, సామాంతులు అనేక భూ,గ్రామ,ధన,ధాన్యాలను దానంగా ఇచ్చి అభివృద్ధి పర్చినారు. (‘శివకుమార స్వామి. ఎం. రచన సం. 2015 శ్రీ సిద్ధాంత శిఖామణి తత్త్వప్రదీప్క’) గ్రంధం వంటి రచనలు గోళకి మఠ పరంపర, సిద్ధాంత తత్వాన్ని గురించి వివరిస్తాయి. సద్భావ శంభూ, విశ్వేశ్వర శంభూలచే నెలకొల్పిన గోళకి మఠాలు కాకతీయుల పాలన కాలంలో శైవమత వ్యాప్తికి అలాగే సాంస్కృతిక పునరుజ్జీవనానికి పెద్దపీట వేశాయి.
గోళకీమఠ శాఖలు
గోళకి మఠ శాఖలు క్రీ.శ.12వ శతాబ్దం నుండి క్రీ శ 13వ శతాబ్ద కాలముల మధ్య కాకతీ గణపతిదేవుడి కాలంలో విశ్వేశ్వరశంభు నేతృత్వంలో గోళకీ మఠాలు కాకతీయ సామ్రాజ్యం అంతటా స్థాపించబడి విస్తరించాయి. కాకతీయులు గోళకి మఠాలను విరివిగా పోషించారు. ఈ గోళకి మఠాలు కేవలం ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల స్థలాలు మాత్రమే కాకుండా విద్య, వైద్య, సంక్షేమ, సామాజిక సేవల కేంద్రాలుగా విశృతముగా పనిచేశాయి.
1. మల్కాపురం (మందడం) గోళకి మఠ శాఖ గుంటూరు జిల్లా మల్కాపురం మందడంలో ఉంది. మందడ గోళకి మఠ శాసనం రుద్రమదేవి జన్మదిన సమాచారమును ఇస్తుంది. క్రీ.శ1261 మార్చ్ 25న రుద్రమదేవి జన్మదిన రోజు, ప్రసూతి గృహం, వైద్యశాల. వివిధ వివరాలతో పాటు ఈ శాసనం మల్కాపురం గోళకి మఠము గురించి అదేవిదంగా రాణి రుద్రమదేవి జన్మదిన విషయాల గురించి తెలియజేస్తుంది.
2.కాళేశ్వరము. జయశంకర్ భూపాలపల్లి, కాకతీయ కులదైవ క్షేత్రం, ఉపలమఠములోని గోళకి మఠం.
3.మంథని(మంత్రకూటం), పెద్దపల్లి జిల్లా, విశ్వేశ్వరదేవాలయ, మఠము.
4.త్రిపురాంతకము, ప్రకాశం జిల్లా, శైవ తీర్థం, గోళకీ మఠ శాఖ.
5.పుష్పగిరి, కడప జిల్లా, అద్వైత మఠం, శంకరాచార్య పాదముద్ర, శైవ-వైష్ణవ సమన్వయం.
6.శ్రీపర్వతం (నాగార్జునకొండ), పల్నాడు జిల్లా, బౌద్ధ-శైవ సమన్వయం.
7.అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా, శక్తి పీఠము, గోళకీ మఠ శాఖ.
8.ద్రాక్షారామం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పంచారామ క్షేత్రం. గోళకి మఠం.
9.భట్టిప్రోలు, బాపట్ల, ప్రాచీన బౌద్ధ-శైవ కేంద్రం.
10.సోమశిల, నెల్లూరు జిల్లా లింగప్రతిష్ఠ, మఠం.
11.ఏలేశ్వరం, మహబూబాబాద్, మఠం, లింగప్రతిష్ఠ.
12.కొమ్మూరులు, ప్రకాశం/నెల్లూరు, లింగప్రతిష్ఠ.
13.చంద్రవల్లి (చంద్రవోలు), ప్రకాశం జిల్లా, శైవ క్షేత్రం.
14.ఓరుగల్లు (వరంగల్), వరంగల్ జిల్లా కాకతీయ రాజధాని కేంద్రం. భద్రకాళి మఠం.
15.గంగాపురం, మహబూబ్ నగర్ జిల్లాలోని గంగాపురం (జడ్చర్ల సమీపంలో) కూడా చారిత్రక జైన-శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, ఇక్కడ కూడా చౌడీశ్వరాలయం వంటి పురాతన చౌడీశ్వర మఠం శిథిల కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి. గోళకి మఠాలు ప్రధాన వ్యాపార మార్గాల వెంబడి, నదీ తీరాల్లో ఉండటం వల్ల, వర్తక వ్యాపారులకు, యాత్రికులకు ఆశ్రయాన్ని ఇచ్చాయి . గోళకి మఠాలు కాకతీయ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడంలో కీలక పాత్రను పోషించాయి. అలాగే ప్రజలలో భక్తి భావాన్ని పెంచి, ఆధ్యాత్మిక విలువలను నేర్పి సన్మార్గంలో తీసుకొని వెళ్లేల ప్రయత్నం చేశాయి.
3. పుష్పగిరి పేరు వెనుక చరిత్ర
పుష్పగిరి అంటే "పుష్పాల కొండ" ఈ కొండ మీద పువ్వులు ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉండటం వల్ల పుష్పగిరి అను పేరు వచ్చింది. దీనిని శైవులు "మధ్య కైలాసం" అని, వైష్ణవులు "మధ్యఅహోబిలం" అని పిలుస్తారు. ఇది శైవ, వైష్ణవ మత శాఖల సమన్వయానికి ప్రతీక.
భౌగోళిక స్థానం
దక్షిణ భారత దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కడప జిల్లా, చెన్నూరు మండలములో పుష్పగిరి తీర్థ స్థలం గ్రామం ఉంది. కడప పట్టణానికి 16 కి.మీ. దూరంలో, కడప-కర్నూలు రోడ్డు మార్గంలో పెన్నా నది (పినాకిని) ఒడ్డున ఒక కొండపై ఈ ఆలయ సముదాయము,మఠము కలదు.
పంచ నది సంగమం
పుష్పగిరి క్షేత్ర అత్యంత విశిష్టమైన అంశం ఇక్కడ ఐదు నదులు ఒకే చోట కలవడం. ఐదు నదుల సంఘమ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైనదిగా మారుస్తుంది.1.పెన్నా నది (పినాకిని) – ప్రధాన నది. 2.చిత్రావతి నది. 3.పాపఘ్ని నది. 4. కుందూరు నది. 5. సగిలేరు నది ఈ నదినే కుమారధార అని కూడా అంటారు.
ఈ ఐదు నదులు కలిసే ప్రదేశాన్ని ‘పంచనదిసంగమం’ అని పిలుస్తారు. భారతీయ ఆచార సంప్రదాయము ప్రకారం ఈ పంచనది సంగమములో స్నానము చేస్తే సకల పాపాలు నశించి పోతాయని, మోక్షం లభిస్తుందని, అష్ట ఐశ్వర్యము సిద్దిస్తుంది అని, ఆయురారోగ్యములు కలుగుతాయి అని భక్తుల నమ్మకం.
పుష్పగిరితో అనుబంధం ఉన్న పురాణకథలు సర్పయాగ పాప పరిహారము
పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం, శుక మహర్షి ఆదేశంపై ఈ ఆలయం నిర్మించబడిందని పురాణ ప్రతిథి. సర్పయాగ పాపం జనమేజయుని ప్రార్థన కురుక్షేత్ర యుద్ధ సంహారం తర్వాత, పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు హస్తినాపురంలో రాజ్యం చేపట్టాడు. కానీ సర్పయాగంలో తక్షకుని కాలు తీసిన పాపం అతన్ని వెంటాడుతోంది. బాధపడుతున్న జనమేజయుడిని శుక మహర్షి చూసి, “రాజా! దక్షిణ దిశలో పుష్పగిరి కొండకు వెళ్ళు. అక్కడ పంచ నదులు కలిసే పవిత్ర స్థలం. కొండపై చెన్నకేశవుడు, కింద పెన్నా నది ఒడ్డున నాగేశ్వరుడు కలిసి నిలబడి ఉన్నారు" అన్నారు. జనమేజయుడు వెంటనే పుష్పగిరి కొండకు చేరుకుని, కొండ మీద చెన్నకేశవుడికి, కొండ కింద నాగేశ్వరుడికి ఆలయాలు నిర్మించాడు. ఇక్కడ హరిహరులు కలిసి ఉన్నారు. ఇది “దక్షిణ కాశీ" అని ప్రజలకు వివరంగా చెప్పాడు అని పురాణ ప్రథితి.
పుష్పగిరి మహిమ అమృత సరోవరం ‘బ్రహ్మాండపురాణం’
జనమేజయుడు సర్పయాగ పాప పరిహారం కోసం పుష్పగిరి ఆలయ నిర్మాణం గురించి వివరించబడిన పురాణం బ్రహ్మాండపురాణం. పుష్పగిరి అమృత కోనెటి (పినాకిని నది సమీపంలోని అమృత సరస్సు) పురాణ కథ గరుడుడు అమృతం తీసుకునేటప్పుడు జరిగిన అద్భుత సంఘటనల చుట్టూ తిరుగుతుంది.
- స్థలపురాణము గరుత్మంతుడి కథ
స్థలపురాణము ప్రకారం ఓసారి కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వినత కలిసి ఆడుకుంటూ….పందెంలో ఓడిపోయినవారు గెలిచినవారికి దాసిలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిలా పని చేసేదట. వినతకు జన్మించిన గరుత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కద్రువను కోరాడట. అప్పుడు కద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వినతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరుత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో రెండు అమృతం చుక్కలు ఈ ప్రాంతంలోని పినాకిని నదిలో పడటంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా, యుక్తవయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారట. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసినా అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారనీ ఆ తరవాతే హరి-హరులు ఇక్కడ వెలిశారనీ... అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరువచ్చిందనీ అంటారు.
చారిత్రక ఆధారాల ప్రకారం
పుష్పగిరి గోళకి మఠంను, చెన్నకేశవ ఆలయాన్ని (చంద్రమౌళేశ్వర ఆలయాన్ని) కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో 12వ శాతాబ్దంలో అఘోరా సోమశివాచార్యుల వారు నెలకొల్పినట్లుగా చరిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అఘోరా సోమాశివాచార్యుల వారి శిష్యుడు విద్యారణ్యస్వామి ఇక్కడ విద్యను అర్జీంచినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. పంచనదీ సంగమముగా గుర్తింపు పొందిన పినాకిని నది... దక్షిణం నుంచి ఉత్తర దిశగా కాశీ విశ్వేశ్వరాలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని ‘దక్షిణకాశీ’గా పిలుస్తారు.
హరి-హరక్షేత్రం
శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి ఒకే చోట కొలువై ఉండటం వల్ల ఇది "హరిహర క్షేత్రం"గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హరి-హారులను చంద్రమౌళేశ్వరునిగా భావిస్తారు.
పుష్పగిరి పీఠం–పురాణ విశిష్టత (పురాణ కాలము నాటిది).
- స్కందపురాణం (శ్రీశైల ఖండం): పుష్పార్ణవ తీర్థం, హరిహర సంగమ స్థలం. శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం నైరుతి ద్వారం.
- మహిమ : ఒక్క రోజు ఉపవాసం → కాశీ, ప్రయాగ ఫలితం.
- వాయుపురాణం: పంచ నదీ సంగమం వద్ద హరిహర క్షేత్రం మహిమ.
- రసరత్నాకరం (సత్యనాథుడు): పుష్పగిరి హరిహర క్షేత్రం – దక్షిణ కాశీగా వర్ణన.
స్కంద పురాణం: స్కంద పురాణము ప్రకారం, పుష్పగిరి దర్శనం ఒక్క రోజు ఉపవాసంతో కాశీ, ప్రయాగ ఫలితాలు ఇస్తుందని (శ్రీశైల ఖండం) పేర్కొంటుంది. బ్రహ్మాండ, వాయు పురాణాల్లో పంచనదీ సంగమ దర్శనం పాపనాశనం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అమరత్వ సద్గతిని ప్రసాదిస్తుందని వ్యాస మహర్షి ఉద్బోదించారు. హరి-హరుల పాద ప్రక్షాలనం మోక్షాన్ని, శ్రీచక్ర దర్శనం కోరికలను పూర్తి చేస్తాయనీ అనేది భక్తుల విశ్వాసం.
పుష్పగిరిలో ఆలయ నిర్మాణం
పుష్పగిరిలోనీ వైద్యనాథేశ్వర ఆలయాన్ని క్రీ.శ. 1255లో చోళ రాజవంశం రాజు నిర్మించారని శాసన ఆధారం తెలుపుతుంది. రాష్ట్రకూట రాజు కృష్ణ-I ఈ ఆలయాన్ని పోషించినట్లు శాసన ఆధారం ఉంది. ఆలయ రోజువారీ నిర్వహణ కోసం ఆయన భూమిని బహుమతిగా ఇచ్చాడు. పుష్పగిరి ఆలయ సముదాయం సముద్ర మట్టానికి 380 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 7.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆలయ సముదాయంలో 28 మందిరాలు ఉన్నాయి ఇవి ఇప్పటికీ ఉన్నాయి. పుష్పగిరి ప్రాంతంలో అనేక శిథిలమైన ఆలయాలు చూడవచ్చు.
పుష్పగిరి ఆలయ సముదాయంలో "శ్రీ పుష్పగిరి మహా సంస్థాన్" అనే వైదిక మత సంస్థ ఉంది. "శ్రీ పుష్పగిరి మహా సంస్థాన్”ను స్థాపించిన ఋషి విద్యారణ్యుడు జగద్గురు శంకరాచార్య పీఠం వంశానికి చెందినవాడు. శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ ప్రస్తుత పీఠాధిపతి. తెలుగు మాట్లాడే ప్రాంతానికి ఇది ఏకైక అద్వైత మఠం. “రెండవహంపి” క్షేత్రంగా ప్రసిద్ధి.
- ఆది శంకరాచార్యుల ఆశీస్సు (788 CE) ఏకైక శంకరాచార్య మఠం:
కేరళ కాలడిలో జన్మించిన ఆదిశంకరాచార్యులు తన పన్నెండవ ఏటా సన్యాసం తీసుకుని, దక్షిణామూర్తి యాత్రలో పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నిలబడి, "ఇక్కడ హరిహరులు కలిసి నిలబడి ఉన్నారు. ఇది అద్వైత పీఠమవుతుంది" అన్నాడటా. చంద్రమౌళీశ్వర లింగాన్ని పూజించి శ్రీ చక్రం ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారం కలదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న ఆదిశంకరాచార్య పీఠం ఇదొక్కటే. ఈ మఠానికి ఎదురుగా త్రికూటేశ్వరాలయం ఉంది. కమలేశ్వర, హచాలేశ్వర, పల్లవేశ్వర ఆలయాలు క్రి.శ1255వ సంవత్సరంలో ప్రతిష్టించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలకూ ఉమ్మడి ముఖమంటపం ఉంది.
శిల్ప కళ వైభవం
చోళ రాజుల కాలంలో నిర్మించిన వైద్యనాథ ఆలయం పశ్చిమం వైపు ముఖం కలిగి ఉంది. ఈ ఆలయం శిల్పకళా సంపదకు పేరొందింది. ఆలయం గోడలపై శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఏనుగుల వరసలు,గుర్రాల మీద వీరుల విన్యాసాల దృశ్యాలు చూడముచ్చటగా ఉంటాయి. వైద్యనాదేశ్వరుణ్ణి శైవులు, చెన్నకేశవస్వామిని వైష్ణవులు అర్చిస్తారు. చెన్నకేశవస్వామి ఆలయం గోడల మీదున్న చోళ శిల్పకళా, రాష్ట్ర కూట శిల్ప కళ, కాకతీయ శిల్ప కళ, విజయనగర శిల్ప కళ వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. నిండైన చెన్నకేశవుని విగ్రహం, చంద్రమౌళీశ్వర విగ్రహం యాత్రికులను భక్తి పారవశ్యంలో ముంచుతుంది. జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పౌరాణిక గాథను అద్భుతంగా చెక్కరు. చోళులు, పల్లవులు,కృష్ణదేవరాయులు ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధిపర్చారు. పుష్పగిరి ఆలయాల గోడల పైన ఉన్న చిత్రకళ అత్యాద్భుతం పౌరాణిక దేవి, దేవతలు, అప్సరసలు, ప్రకృతి చిత్రాలు చూడ ముచ్చటగా ఉంట్టాయి.
పీఠదిపతి సోమశివాచార్య జీవిత చరిత్ర(క్రి శ 1280–1300)
క్రీ శ 13వ శతాబ్దము చివరి భాగం (క్రీ.శ. 1280–1300 వందల సంవత్సర ప్రాంతం). పుష్పగిరి కాకతీయ రుద్రమదేవి అలాగే ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో గురు పరంపర ఆచారం సోమశివాచార్య గోళకీ మఠము యొక్క సుప్రసిద్ద గురువు విశ్వేశ్వరశంభు శిష్యుడు సమకాలీకుడు. గోళకీ మఠమునకు అసలైన మూలం మధ్య భారతదేశంకాగా దీనిని దక్షిణాదికి విస్తరింప చేసిన ఘనత సోమశివాచార్యకు దక్కింది. సోమశివాచార్యుల వారు శుద్ధ శైవ,అఘోర సంప్రదాయాలకు చెందినవారు. అయినప్పటికీ ఆయన కఠినమైన తాంత్రిక పద్ధతుల కంటే, శైవ-వైష్ణవ మతాల సమన్వయం, సామాజిక సంక్షేమంపై దృష్టి సారించారు. సోమశివాచార్య విగ్రహం సమీపంలోని వేడికల్లి గ్రామం, కొల్లాపూర్ మండలం, నాగర్ కర్నూల్ జిల్లా లో ఉంది.
పుష్పగిరి గోళకి మఠ స్థాపన
పుష్పగిరి మఠమును క్రీ.శ.1280–1300 వందల సంవత్సరాల మధ్య ప్రాంతములో సోమశివాచార్యులు స్థాపించారు. పుష్పగిరి చరిత్ర విశిష్టమైనది.పుష్పగిరి మఠ స్థాపన ప్రధాన ఉద్దేశ్యం శైవ-వైష్ణవ మత శాఖలను సమన్వయ పరచడం పుష్పగిరి ఇప్పటికే హరి-హర పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి. సోమశివాచార్యులు ఇక్కడ గోళకీ మఠాన్ని స్థాపించడం ద్వారా ఈ రెండు శైవ-వైష్ణవ మత సంప్రదాయాల మధ్య సమన్వయాన్ని సాధించారు. అద్వైత సిద్ధాంతమును ప్రచారం గావించి ఇక్కడ ఆది శంకరాచార్యుల వారి అద్వైత మఠాన్ని కూడ నేపకొల్పారు. సోమశివాచార్యుల వారు ఇతర గోళకీ మఠాల వలెనే పుష్పగిరి మఠము ద్వారా సామాజిక సంక్షేమ కార్యక్రమాలు,విద్య, వైద్యం, అన్నదానం వంటి సేవలు ప్రజలకు అందించేవారు.
పుష్పగిరి గోళకి మఠ అభివృద్ధికి సోమ శివాచార్యులు చేసిన సేవ వారి కృషి అమోఘమైనది. పుష్పగిరిలో సోమశివాచార్యుల వారు అనేక ఆలయాలను నిర్మించారు. ఇక్కడ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయము (శివుడు),కమలమ్మ తల్లి (పార్వతి దేవి) ఆలయామును నిర్మించి అభివృద్ధి చేశారు. తర్వాతి కాలములో ఇక్కడ చెన్నకేశవ స్వామి (మహా విష్ణు) ఆలయమును కూడా నిర్మించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయాలను నిర్మించినట్లు ఇక్కడ ఉన్న శాసన ఆధారం తెలుపుతున్నాయి.క్రీ.శ.1298 వ సంవత్సరమునకు చెందిన నాటి ఇక్కడి శాసన సమాచారం ప్రకారం చెన్నకేశవ ఆలయమును నిర్మించిన్నట్లు లిఖించబడి ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయము పుష్పగిరిలో ఉన్న అతి పురాతన ఆలయాలలో ఒకటి. పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయ శాసనము సోమశివాచార్య పుష్పగిరిలో ఆలయ నిర్మాణం ప్రారంభించారని ధృవీకరిస్తుంది.
పుష్పగిరి మఠ చారిత్రక ప్రాముఖ్యత
సోమశివాచార్య స్థాపించిన పుష్పగిరి మఠం, తర్వాతి కాలంలో విద్యారణ్య స్వామి (విజయనగర సామ్రాజ్య సంగమ వంశనికి చెందిన హరిహర, బుక్క రాయల గురువు) తన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా పుష్పగిరి బాసిల్లినది. స్థానిక కాళేశ్వర రాజు అలాగే యువరాజు దేవుడు పుష్పగిరి మఠానికి దాన ధర్మాలు చేసినట్లు చరిత్రక శాసనాల ద్వారా తెలుస్తున్నది (క్రీ.శ. 13వ–14వ శతాబ్దాల మధ్య) పుష్పగిరి అభివృద్ధిలో స్థానిక పాలకులైన కాళేశ్వర రాజులు అలాగే యువరాజు దేవుడు కీలక పాత్ర పోషించారు. వారు పుష్పగిరి మఠానికి భూములు, గ్రామాలు, మనులు, మాన్యాలను దానం చేశారు. కాళేశ్వర రాజు (కాళహస్తి వంశీయుడు). క్రీ శ 13వ శతాబ్దం చివరి భాగంలో రాణి రుద్రమదేవి–ప్రతాపరుద్రుడి కాలములోను అనేక దానాలు ఈ మఠము పొందినది.
పుష్పగిరి ఆలయ సముదాయ అభివృద్ధి
కాళహస్తి వంశ యువ రాజు దేవుడు చంద్రమౌళీశ్వర ఆలయ నిర్మాణము అభివృద్ధికి నిధులు సమకూర్చారు. యువరాజు దేవుడు (స్థానిక సామంత రాజు)క్రీ శ 14వ శతాబ్ద ప్రారంభం కాలములో (ప్రతాపరుద్రుడి కాలం).
భూ దానాలు
కాళహస్తి వంశ యువ రాజు దేవుడు పుష్పగిరి మఠము,ఆలయాల నిర్వహణ, ధుప దీప నైవేద్యల కోసం విస్తారమైన భూములను దానం చేశారు. ఈ భూముల నుండి వచ్చే ఆదాయముతో మఠ నిర్వహణ,ఆలయ నిర్వహణ పూజలు,ధుప దీప నైవేద్యం, దీపారాధనలకు ఉపయోగించబడేది.
గ్రామ దానం
కాళహస్తి వంశ యువ రాజు దేవుడు పుష్పగిరి సమీపంలోని అనేక గ్రామాలను ఆలయానికి దానం చేశారు. ఈ గ్రామాల నుండి పన్నుల రూపంలో వచ్చే ఆదాయము ఆలయ అభివృద్ధికి వినియోగించబడేవి.
దానాలు
పుష్పగిరి దాన శాసన ఆధారం క్రీ.శ. 1320వ సంవత్సరా కాలము నాటి శాసనం ప్రకారం, యువరాజు దేవుడు పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయానికి 50 గ్రామాలు, వేయి వరహాలు (బంగారు నాణేలు), మరియు వంద ఆవులను దానం చేశారు అని దాన శాసనం ద్వారా తెలుస్తున్నది.
- పుష్పగిరి దాన శాసనం ఇచ్చే వివరాల ప్రకారం యువరాజు దేవుడు ఆలయంలో అఖండ దీపము వెలిగించడానికి నిధులు కేటాయించారు.
- యువరాజు దేవుడు భక్తుల కోసం ఒక అన్నదాన సత్రాన్ని నిర్మించి అందులో అన్నదానానికి నిత్యం అవసరమైన ధాన్యాములను దానం చేశారు. ఈ దానాల వల్ల పుష్పగిరి ఆలయం ఆర్థికంగా స్వయంసమృద్ధి కావడమే కాకుండా పుష్పగిరి ఒక ప్రముఖ తీర్థయాత్రా పుణ్య కేంద్రంగా అవతరించినది.
పుష్పగిరికి సంబంధించిన చారిత్రక శాసనాలు- శాసనవైభవం
పుష్పగిరి చరిత్రలో శాసనాలు కేవలం దానాలను మాత్రమే కాకుండా, నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ అలాగే పరిపాలనా వ్యవస్థలను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా 30 శాసనాలకు పైన అనేక విషయాలు తెలుపుతున్నాయి. ప్రధాన శాసనాల విశ్లేషణలో పన్నుల వివరాలను, దానాలుమొదలైన విషయాలు పుష్పగిరి క్షేత్రంలో లభించిన శాసనాలు క్రీ.శ. 10వ శతాబ్దం నుండి 17వ శతాబ్ద కాలం నాటివి విస్తరంగ లభించాయి. పుష్పగిరిలో లభించిన శాసనాలు ప్రధానంగా తెలుగు,సంస్కృతం,తమిళ భాషా, లిపిలలో అలాగే కొన్ని చోట్ల లభించిన శాసనాలు కన్నడ భాష, లిపిల్లో ఉన్నాయి.
శాసనాల వర్గీకరణ (వంశాల వారీగా)
పుష్పగిరిలో లభించిన శాసనాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు:
రాష్ట్రకూటకాలం, రాష్ట్ర కూట పూర్వ కాలం: (2) రెండు శాసనాలు (పుష్పగిరి పురాతనత్వాన్ని తెలుపుతాయి).
కాయస్థ & వైదంబ (సామంత రాజులు): ఐదు (5) శాసనాలు (స్థానిక పరిపాలనను వివరిస్తాయి).
కాకతీయ కాలం: ఆరు (6)శాసనాలు (గోళకీ మఠం, సోమశివాచార్య ప్రభావం).
విజయనగర కాలం: పన్నెండు (12) శాసనాలు (అత్యధిక దానా శాసనాలు, అఘోరశివాచార్యుల నిర్మాణాలు).
నాయక ఇతర సామంత పాలకుల శాసనాలు: మూడు (3) శాసనాలు (చివరి దశ అభివృద్ధి). అదేవిదంగా పాలకుల పేర్లు లేని శాసనాలు కూడ ఉన్నాయి.
శాసనాల ప్రధాన ముఖ్యాంశాలు:
ఇక్ష్వాకుల ముందు శాతవాహన శాసనాల్లో (క్రీ.పూ. 200-క్రీ.శ. 200) పుష్పగిరి పేరు ధృవీకరణ లేదు.
ఇక్ష్వాకులు – మొదటి చారిత్రక గుర్తింపు మహాభారతం (క్రీ.పూ. 3102) తర్వాత 2000 సంవత్సరాలు గడిచాయి. శాతవాహన సామ్రాజ్య పతనానంతరం ఇక్ష్వాకు వంశం (క్రీ.శ. 220-295) నాగార్జునకొండ కేంద్రంగా ఉదయించింది.
ఇక్ష్వాక రాజు ఇజ్జల ఏజు శాసనం: ఈ శాసనములో “పుష్పగిరి క్షేత్రం, శ్రీశైల మల్లికార్జున దక్షిణ ద్వారం." అను విషయం ఉంది.
ఉపాశిక బోధిశ్రీ శాసనం: ఈ శాసనం పుష్పగిరి పై శిలా మండపం ‘బౌద్ధ విహారం’ నిర్మించినట్లు తెలుపుతుంది.
పుష్పగిరి చరిత్రను ధృవీకరించే అనేక శాసనాలు లభ్యమయ్యాయి. ఇవి ఇక్ష్వాక, రాష్ట్రకూట కాలం, రాష్ట్రకూట పూర్వ కాలం,కాయస్థ అలాగే వైదంబ (సామంత రాజులు),కాకతీయ, రెడ్డి,విజయనగర అలాగే నాయక మరి ఇతర సామంత పాలకుల కాలం నాటి శాసనాలు ఈ శాసనాలు ఆలయ నిర్మాణం, దానాలు అలాగే గోళకి మఠం యొక్క అభివృద్ధి గురించి సవివరమైన విషయాలు వివరిస్తాయి.
1వ శాసనం : క్రీ.శ. 1298 వ సంవత్సరం కాకతీయుల పాలన కాలం నాటి శాసనము. (కాకతీయ కాలం)
పాలకుడు ప్రతాపరుద్రుడు (లేదా రుద్రమదేవి చివరి కాలం). భాష: సంస్కృతం, లిపి: తెలుగు. విషయం: ఈ శాసనం చెన్నకేశవ స్వామి ఆలయం నిర్మాణం గురించి తెలుపుతుంది. సోమశివాచార్య లేదా ఆయన శిష్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇందులో పేర్కొన్నారు. ప్రాముఖ్యత: ఇది పుష్పగిరిలో లభ్యమైన అతి పురాతన శాసనం. ఈ శాసనం తెలిపే వివరాల ప్రకారం పుష్పగిరిలో వైష్ణవ ఆలయం ఉండటాన్ని ధృవీకరిస్తుంది.
2వ శాసనం: క్రీ.శ. 1320 వ సంవత్సరం కాకతీయుల కాలం నాటి దాన శాసనం. దాన దాత: యువరాజు దేవుడు (స్థానిక సామంత రాజు). భాష: తెలుగు, లిపి: తెలుగు. విషయం: యువరాజు దేవుడు పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయానికి 50 గ్రామాలు, వేయి వరహాలు (బంగారు నాణేలు), అలాగే వంద ఆవులను దానం చేశారు అనే విషయం ఈ శాసనంలో లిఖించబడి ఉంది. ప్రాముఖ్యత: ఈ శాసనం పుష్పగిరి ఆలయానికి లభించిన భారీ దానాల గురించి వివరిస్తుంది. ఈ శాసనం ఆలయం యొక్క ఆర్థిక స్థితిని, అలాగే స్థానిక పాలకుల భక్తిని చాటుతుంది.
3వ శాసనం: క్రీ.శ. 1501వ సంవత్సర కాలం నాటి శాసనం (విజయనగర కాలం). పాలకుడు: కృష్ణదేవరాయలు (లేదా నరసనాయకుడి పాలన కాలం). భాష:సంస్కృతం, లిపి: తెలుగు. విషయం: పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం యొక్క శిఖరాన్ని (గోపురం) ముఖద్వారాన్ని నిర్మించారు అను విషయం ఈ శాసనం అఘోరశివాచార్యుల తాంత్రిక నైపుణ్యాన్ని, అలాగే వారి ఆలయ నిర్మాణ కృషిని వివరిస్తుంది. ప్రాముఖ్యత: ఈ శాసనం అఘోర శివాచార్యుల తాంత్రిక కృషికి ప్రత్యక్ష ఆధారం. శైవ తంత్రవేత్తలు విష్ణు ఆలయాన్ని నిర్మించడం వారి సమన్వయ దృక్పథానికి నిదర్శనం.
4వ శాసనం: క్రీ.శ. 1525 వ సంవత్సరం కాలం నాటి శాసనం (విజయనగర కాలం). పాలకుడు: కృష్ణదేవరాయలు. భాష: తెలుగు, లిపి: తెలుగు. విషయం: కృష్ణదేవరాయలు పుష్పగిరి ఆలయానికి భూదానం, గ్రామదానం చేశారు. ఆలయ నిర్వహణ కోసం నిత్యం అవసరమైన ధాన్యం, నేతి, పూజా సామగ్రి కోసం నిధులు కేటాయించారు. ప్రాముఖ్యత: విజయనగర సామ్రాట్టు పుష్పగిరిని ఎంతగా గౌరవించారో ఈ శాసనం చాటుతుంది.
5వ శాసనం: క్రీ.శ. 1550 వ సంవత్సర కాలం నాటి శాసనం (విజయనగర కాలం). పాలకుడు: సదాశివరాయలు. భాష: తెలుగు, లిపి: తెలుగు. విషయం: పుష్పగిరి ఆలయంలో నిత్య పూజలు, ఉత్సవాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు ఈ శాసనంలో వివరించబడ్డాయి. బ్రాహ్మణులకు, అర్చకులకు ఆగ్రహర భూములు ఇవ్వడం జరిగింది. ప్రాముఖ్యత: ఆలయ నిత్య కృత్యాలను క్రమబద్ధీకరించడానికి ఈ శాసనం దోహదపడింది.
6వ శాసనం : క్రీ.శ. 1575 వ సంవత్సర కాలం నాటి శాసనం (విజయనగర/నాయక కాలం). పాలకుడు: శ్రీరంగరాయలు (లేదా నాయకుల కాలం). భాష: తెలుగు, లిపి: తెలుగు. విషయం: పుష్పగిరి ఆలయ సముదాయంలో కొత్త మండపం నిర్మాణం, అలాగే తీర్థ క్షేత్ర అభివృద్ధి గురించి ఈ శాసనం తెలుపుతుంది. ప్రాముఖ్యత: ఈ శాసనం పుష్పగిరి ఆలయ సముదాయం యొక్క చివరి విస్తరణ దశను గురించి సూచిస్తుంది.
7వ శాసనం: క్రీ శ 950 వ సంవత్సరం కాలం నాటిది. పాలకుడు రాష్ట్రకూట కృష్ణ III. భాషా:కన్నడ, సంస్కృతం లిపి :కన్నడ, దేవానగరి. విషయం : ఇంద్రేశ్వర ఆలయానికి భూదానం. ప్రాముఖ్యత : ఇది పుష్పగిరిలో అత్యంత ప్రాచీనమైనది.
8వ శాసనం అలాగే 9వ శాసనం: క్రీ శ 1100 వ సంవత్సర కాలం అలాగే క్రి శ 1150 వ సంవత్సర కాలం. పాలకులు : వైదంబ రాజులు. విషయాలు: స్థానిక గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ఆదాయాన్ని 'పుష్పగిరి తీర్థం' అభివృద్ధికి కేటాయించారు. ప్రాముఖ్యత : ఆర్ధిక సంబంధ శాసనాలు.
10వ శాసనం:క్రీ.శ 1242 వసంవత్సర కాలం. పాలకులు:వైద్యాంబిక (కాయస్థ) సామంత పాలకులు. భాషా, లిపి:తమిళం. ప్రాముఖ్యత: వైద్యనాథేశ్వర ఆలయానికి దీపారాధన కోసం నూనె, వత్తుల ఖర్చుల కోసం భూమి దానం. విశిష్ఠత:దాన శాసనం.
11వ శాసనం : క్రీ శ 1255 వ సంవత్సర కాలం. పాలకులు :మల్లిదేవ మహారాజు విషయము: ’'పెన్నమగాని' అనే గ్రామాన్ని అగ్రహారంగా మార్చి ఆలయానికి ఇచ్చారు. ప్రాముఖ్యత: ఆగ్రహార దాన శాసనం.
12 వ శాసనం: క్రీ శ 1261 వ సంవత్సర కాలం. పాలకులు: కాకతీయ రుద్రమదేవి (ప్రతినిధి). భాషా, సంస్కృతం. లిపి: కన్నడాంద్ర. విషయము: గోళకీ మఠం శాఖల నిర్వహణ కోసం నిధుల కేటాయింపు. ప్రాముఖ్యత: ఆర్ధిక సంబంధ శాసనం
13వ శాసనం : క్రీ శ 1290 వ సంవత్సర కాలం. పాలకులు: అంబదేవుడు (కాయస్థ). హిరణ్య రాష్ట్ర. భాషా:సంస్కృతం. లిపి:కన్నడాంద్ర. విషయము: పెన్నా నదిపై స్నాన ఘట్టాల నిర్మాణం గురించి ప్రస్తావన. ప్రాముఖ్యత: యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం.
14వ శాసనం అలాగే 15వ శాసనం: క్రీ శ 1310 వ సంవత్సర కాలం అలాగే క్రి శ 1320 వ సంవత్సర కాలం. పాలకులు: కాకతీయ సామంతులు. విషయము: యుద్ధాల్లో విజయం పొందినందుకు కృతజ్ఞతగా ఆలయ ప్రాకారాల నిర్మాణం. ప్రాముఖ్యత: విజయ శాసనం.
17వ శాసనం: క్రీ శ 1340 వ సంవత్సర కాలం. పాలకులు: ముసునూరి నాయకులు. విషయం: తురుష్కుల దండయాత్ర తర్వాత ఆలయ పునరుద్ధరణ పనుల గురించి వివరణ. ప్రాముఖ్యత: ఆలయ జీర్ణోద్ధారణ
18వ శాసనం: క్రీ శ 1420 వ సంవత్సర కాలం. పాలకులు: విజయనగర (బుక్కరాయలు). విషయం: ఆలయ అర్చకులకు నివాస స్థలాల దానం (అగ్రహారా దానం). ప్రాముఖ్యత: ఆలయ సేవకుల, అర్చకులకు సౌకర్యాల ఏర్పాటు.
19వ శాసనం: క్రీ శ 1438 వ సంవత్సర కాలం. పాలకులు: ప్రౌఢదేవరాయలు. విషయం: హరిహర క్షేత్రంగా శివ-విష్ణు ఆలయాలకు ఉమ్మడి నిధుల మంజూరు. ప్రాముఖ్యత: శైవ,వైశవ సమ్మేళనం
20వ శాసనం: క్రీ శ 1450 వ సంవత్సర కాలం. పాలకులు: సాళువ నరసింహరాయలు. విషయం: ఆలయ రక్షణ కోసం కోట గోడల నిర్మాణాలకు అనుమతి. ప్రాముఖ్యత: సంరక్షణ ఏర్పాట్ల అవసరాన్ని గుర్తించడం.
21 వ శాసనం: క్రీ శ 1501 వ సంవత్సర కాలం. పాలకులు: విజయనగర విషయం: అఘోరశివాచార్యులు చెన్నకేశవ ఆలయ శిఖర నిర్మాణం.తాంత్రిక పద్ధతుల్లో ప్రాణప్రతిష్ఠ చేసినట్లు సమాచారం. ప్రాముఖ్యత: తాంత్రిక మఠంగా అభివృద్ధి పరచు సమాచారం ఇస్తున్నది.
22వ శాసనం, 23వ శాసనం మరియు 24వ శాసనం: క్రీ శ 1510-1520 వ సంవత్సర కాలం. పాలకులు: శ్రీకృష్ణదేవరాయలు. విషయం: తన దిగ్విజయ జైత్రయాత్రల సమయంలో పుష్పగిరిని దర్శించి 'కనకాభిషేకం' చేసినట్లు ఆధారాలు. ప్రాముఖ్యత: శ్రీ కృష్ణదేవరాయలు శత్రు రాజ్యల పైన దండయాత్రను తెలిపే శాసనాలు.
25వ శాసనం: క్రీ శ 1525 వ సంవత్సర కాలం. పాలకులు: విజయ నగర కృష్ణదేవరాయలు. విషయం: రాయలసీమ లోని చెన్నూరు సీమ నుంచి వచ్చే సుంకాలను ఆలయానికి మళ్లించిన శాసనం. ప్రాముఖ్యత: దాన శాసనం, ఆర్ధిక పుష్టిని వివరిస్తుంది.
26వ శాసనం: క్రీ శ 1530 వ సంవత్సర కాలం. పాలకులు: అచ్యుతదేవరాయలు. విషయం: ఆలయంలో అన్నదాన సత్రాల ఏర్పాటు, యాత్రికుల సౌకర్యాల కోసం భూదానం. ప్రాముఖ్యత: యాత్రికులకు సౌకర్యాలు కల్పించడం.
27వ శాసనం: క్రీ శ 1545 వ సంవత్సర కాలం. పాలకులు: ఆలియా రామరాయలు. విషయం: రాజ్య రక్షణ కోసం పుష్పగిరి మఠం ఆశీస్సులు పొందినట్లు . ప్రాముఖ్యత: ఆలియా రామరాయల దండయాత్రల గురించి తెలుపుతుంది.
28వ శాసనం: క్రీ శ 1550 వ సంవత్సర కాలం. పాలకులు: సదాశివరాయలు. విషయం: బ్రాహ్మణులకు 'మాన్యాలు' (పన్ను లేని భూములు) ఇచ్చిన వివరాలు. ప్రాముఖ్యత: దాన శాసనం.
29వ శాసనం: క్రీ శ 1565 వ సంవత్సర కాలం. పాలకులు: తిరుమలరాయలు. విషయం: తళ్ళికోట యుద్ధం తర్వాత మఠం రక్షణ కోసం తీసుకున్న చర్యలు. ప్రాముఖ్యత: వైదిక మతేతర దాడుల నుండి మఠంను రక్షించడం.
30వ శాసనం: క్రీ శ 1575 వ సంవత్సర కాలం. పాలకులు: శ్రీరంగరాయలు. విషయం: కొత్తగా నిర్మించిన మండపాలు మరియు తీర్థం అభివృద్ధి వివరాలు. ప్రాముఖ్యత: మఠం అభివృద్ధిని తెలియ చేస్తుంది.
స్థానిక పాలకుల శాసనాలు: క్రీ శ 1600-1650 వ సంవత్సర కాలం. పాలకులు: స్థానిక నాయకులు. విషయం: ఆలయ రథోత్సవాలు అలాగే వార్షిక ఉత్సవాల నిర్వహణకు ఇచ్చిన విరాళాలు. ప్రాముఖ్యత: పుష్పగిరి తిరుణాళ్ల గురించి తీయజేస్తుంది.
పన్నుల వివరాలు మరియు ఆర్థిక నిర్వహణను తెలిపే శాసనాలు (Taxation & Revenue):
పుష్పగిరిలో లభించిన ఈ శాసనాల ప్రకారం దేవాలయాలకు కేవలం భూమిని మాత్రమే దానం ఇవ్వడమే కాకుండా ఆ భూములపై వచ్చే పన్ను వసూలు చేసే హక్కును కూడా దానంగా ఇచ్చేవారు. దీనిని "సర్వమాన్య దానం" అని పిలిచేవారు.
ప్రధాన పన్నులు: (Taxes mentioned in Inscriptions):
అరి (Ari): వ్యవసాయ భూమిపై వసూలు చేసే ప్రధాన పన్ను.
కోరు (Koru): పండించిన పంటలో ప్రభుత్వానికి ఇచ్చే వాటా.
సిద్ధాయం (Siddhaya): నిర్ణీత నగదు రూపంలో చెల్లించే పన్ను.
ముద్ర సుంకం (Stamp duty): భూమి క్రయ విక్రయాల సమయంలో వసూలు చేసే రుసుము.
పెర సుంకం: పెన్నా నది ద్వారా జరిగే వాణిజ్యంపై విధించే సుంకం.
తలారి రుసుము: గ్రామాల రక్షణ కోసం తలారులకు ఇచ్చే పన్నును ఆలయ రక్షణకు మళ్లించేవారు.
పన్నుల వినియోగం: ఇలా వసూలు ఐన ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అంగరంగ వైభవాలకు (నిత్య పూజలు, ఉత్సవాలు) అలాగే ఖండ స్ఫుటిత నవకర్మలకు (ఆలయ మరమ్మతులు) ఉపయోగించేవారు.
శాసనాల్లో పేర్కొన్న ప్రత్యేక సాంకేతిక వివరాలు:
- భూమి కొలతలు: శాసనాల్లో భూమిని పుట్టి,తూము,కుంట అనే ప్రాచీన కొలతల్లో పేర్కొన్నారు. పెన్నా నది నీటి పారుదల ఉన్న భూములను "వెట్ లాండ్స్" (తరి) గా, వర్షాధార భూములను "డ్రై లాండ్స్" (మెట్ట) గా విభజించారు.
- లిపి పరిణామం: క్రీ శ 10వ శతాబ్దపు శాసనాల్లో అక్షరాలు గుండ్రంగా (పాత తెలుగు) ఉండగా, క్రీ శ 16వ శతాబ్దపు విజయనగర శాసనాల్లో అక్షరాలు స్పష్టమైన ఆధునిక తెలుగు లిపికి దగ్గరగా ఉండటం గమనించవచ్చు.
- శాపవచనాలు: ప్రతి శాసనం చివరలో "ఈ దానాన్ని ఎవరు హరించినా వారణాసిలో ఆవును చంపిన పాపాన పోతారు" వంటి శాపవచనాలు (Imprecatory verses) ఉండటం ఆనాడు దానధర్మాలకు ఉన్న పవిత్రతను తెలుపుతుంది.
అంతిమంగా ఈ శాసనాలు పుష్పగిరిని కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ఒక ‘ఆర్థిక పరిపుష్టతకు సంపద శక్తి కేంద్రంగా (Economic Hub)’ చూపిస్తాయి. గోళకీ మఠం ద్వారా ఈ సంపదను విద్యా, వైద్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు ఎలా మళ్లించారో ఈ శాసన ఆధారాలే నిజమైన సజీవ గొప్ప సాక్ష్యాధారాలు. పైన తెలిపిన శాసనాలు అన్నీ ప్రస్తుతం భారత పురాతత్వ శాఖ (ASI) (Archaeological Survey of India) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో భద్రపరచబడీ ఉన్నాయి. ఈ శాసనాలు పుష్పగిరి యొక్క చారిత్రక, సంస్కృతిక ప్రాముఖ్యతను గురించి అదేవిదంగా పుష్పగిరి క్షేత్ర ఆధ్యాత్మిక నిరంతర అభివృద్ధిని గురించి ధృవీకరిస్తాయి.
పుష్పగిరి గోళకి మఠ అభివృద్ధికి అఘోర శివాచార్యుల వారి కృషి (క్రీ.శ. 1501):
- అఘోర తంత్రం: అఘోర మార్గం ఇది శైవమతంలోని అత్యంత రహస్యమైన, శక్తివంతమైన శాఖ. అఘోర తంత్రం ‘భైరవుడి’ (శివుని ఉగ్ర రూపం) ఆరాధనపై దృష్టి సారిస్తుంది.
- అఘోర శివాచార్యులు తంత్రవేత్తగా ఆలయ నిర్మాణం అలాగే తాంత్రిక ప్రాణప్రతిష్ఠను చేశారు. పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం క్రీ.శ. 1501 వ సంవత్సర కాలం నాటి శాసనం ప్రకారం, ‘అఘోర శివాచార్యులు’ ఈ చెన్నకేశవఆలయ శిఖరాన్ని (గోపురం), ముఖ ద్వారాన్ని నిర్మించారు. గోపురము, ద్వార నిర్మాణం కేవలం ఇది ఒక అద్భుతమైన శిల్పకళ నైపుణ్యామే కాదు ఇది ఒక ‘తాంత్రిక శక్తితో కూడిన నిర్మాణం’తాంత్రిక సాధనలు అలాగే సిద్ధులు పంచమకర్మ సాధన,శ్మశాన సాధన, మంత్ర సిద్ధి.
- అఘోరా శివాచార్యుల వారు అథర్వణ వేదం, రుద్రయామలం వంటి తాంత్రిక గ్రంథాల నుండి మంత్రాలను సాధన చేశారు. ఈ అఘోరా మంత్రాల ద్వారా వ్యాధులను నయం చేయడం, శత్రువులను నిగ్రహించడం (మారణ హోమం), వర్షం కురిపించడం వంటి సిద్ధులు సాధించారని నమ్మకం.
- అఘోరా శివాచార్యుల వారు వీరభద్రులు అనే తాంత్రిక యోధులను తయారు చేశారు. వీరు గ్రామాలను దొంగలు, దుష్ట శక్తుల నుంచి రక్షించేవారు.
- శైవ-వైష్ణవ సమన్వయం అద్వైత తంత్రం అఘోర శివాచార్యులు శైవమతం అలాగే వైష్ణవమతము మధ్య తాంత్రిక సమన్వయాన్ని సాధించారు.
- అఘోరా శివాచార్యుల వారు రాజకీయ సలహాదారులను, మారణ తాంత్రిక ప్రయోగాలు చేసే యోధులను శిక్షణను ఇచ్చి ప్రయోజకులను చేసి సమాజ సేవ కొరకు ఉపయోగపడే విదంగా తయారు చేశారు. ఉదాహరణకు విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకులు ఐన విద్యారణ్య స్వాముల వారు అఘోర శివాచార్యుల శిష్యుడు, అఘోరా శివాచార్యుల వారసులైన విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
పర్యాటక ప్రదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న పుష్పగిరి క్షేత్రం, ప్రముఖ ప్రాచీన ఆలయాల సముదాయములకు, ఆధ్యాత్మికతకు, ప్రకృతి రామణీయ అందాలకు, సహజ సిద్ద కొండలు,వనాలకు, వన మూళికలకు, సహజ సిద్ద పంచన నది నదాల సౌందర్యానికి, జీవ వైవిద్యానికి ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. పుష్పగిరి గొప్ప చారిత్రక, సంస్కృతిక, వారసత్వ సంపదకు నిలయము ఇక్కడి ప్రధాన దైవము శివుడు, చంద్రమౌళిశ్వరునిగా పూజలందు కొంటున్నారు. పుష్పగిరి ప్రముఖ శైవ -వైష్ణవ సమాన్వయ కేంద్రం హరిహర పుణ్యక్షేత్రము, సిద్దులు, నవనాథ్ అలాగే ఇతర అనేక దేవి-దేవతల ఆలయాల సమూదాయం కారణంగా దీనిని "రెండవ హంపి" అని కూడా పిలుస్తారు.
పర్యాటక ప్రధాన ఆకర్షణలు
- చంద్ర మౌళీశ్వర, చెన్నకేశవ స్వామి ఆలయం ద్రావిడ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ శివ-విష్ణు ఆలయం.
- త్రికూటేశ్వర స్వామి ఆలయం శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో ఒకే గర్భగుడిలో మూడు లింగాలు ఉన్నాయి.
- రోగాలను నయం చేసే వైద్యనాథేశ్వర స్వామి ఆలయం శివునికి అంకితం చేయబడిన ఆలయం.
- రామ ఆలయం – రామాయణంలోని ఘట్టాలను వర్ణించే అద్భుతమైన శిల్పాకళకు రాతి చెక్కడాలు ఇక్కడ ఉన్నాయి.
- ఐదు నదులు ఒకే చోట కలిసే ప్రకృతి పలకరింపుల పర్యాటక కేంద్రం పుష్పగిరి.ఈ ప్రదేశానికి ఏటా ప్రతి కాలంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
- పుష్పగిరి క్షేత్రము పక్కనే ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట (డ్యాం) ఉండడం పర్యాటకులకు అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.
పుష్పగిరి క్షేత్రం పుష్పగిరి గ్రామం నుంచి కిలోమీటరు దూరంలో ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అంటారు. నదుల కలయికను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా వస్తుంటారు.
- వీటితోపాటు కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర ఆలయాలనూ చూడొచ్చు.
- ఇక్కడ ప్రతి అడుగులోనూ చరిత్ర తారసపడుతుంది అనడంలో సందేహం లేదు. పురాతన కట్టడాలతో అపురూపమైన రాతి శిల్పాలు చూడ వచ్చు.
- ఆలయాలలో ప్రతిష్టించిన రాతి విగ్రహాలు ఎంతో నైపుణ్యతతో శిల్పకళ కారులచెతిలో చెక్కి రూపుదిద్దారు. ఇక్కడి ప్రతి శిల్పం, ప్రతి కట్టడంలోనూ అలనాటి చారిత్రక, సంస్కృతిక విశేషాలు కళ్ల ముందు కనిపించేలా రూపుదిద్దుకున్నాయి.
- వరదలు వచ్చినప్పుడు పెన్న నది దాటి ఆవలివైపుకు వెళ్ళలేం.
- ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నప్పటికీ ఎక్కువ శాతం పర్యాటకులు ఇక్కడి పకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతారు.
- ఐదు నదుల సంగమం కావటంతో నీటి పారుతు ఉంటుంది. ఆనకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి.
- ఆహ్లాద వాతావరణం ఉన్న పుష్పగిరి ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రకృతి ప్రేమికులతోపాటు చారిత్రక కట్టడాలపై ఆసక్తి ఉన్న పర్యాటకులు ప్రతి కాలంలో వెళ్లి సందర్శించ వచ్చు.
ప్రాముఖ్యత
పుష్పగిరి ఆలయానికి చెన్నకేశవస్వామే క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తికంలో విశేష అభిషేకాలూ, ఉత్సవాలూ జరిపిస్తారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉపాలయాలనూ చూడొచ్చు. హరిహరులు శివుడు-విష్ణువు మరి ఇతర దేవి దేవతల ఆలయాలతో కూడిన ఒక ప్రధాన శైవ-వైష్ణవ పుణ్యక్షేత్రం.
పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాల సముదాయం ప్రశాంతమైన ప్రకృతి సిద్ద ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
చేరుకునే విధానం
పుష్పగిరికి సమీప నగరము కడప 16 కి.మీ. దూరంలోఉంటుంది. విమాన సదుపాయము కలదు సమీపంలో ఉన్న విమాన మార్గం గల నగరం తిరుపతి విమానాశ్రయం 160 కి.మీ. దూరంలో అదేవిదంగా కడప విమానాశ్రయం 25 కి.మీ. దూరంలో ఉంటుంది. రైల్వే మార్గ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది కడప రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్. ఇంతే కాకుండా కడప మరియు తిరుపతి నుండి బస్సులు, టాక్సీల ద్వారా చేరుకోవచ్చును చక్కటి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.
సందర్శించడానికి ఉత్తమ సమయం
అక్టోబర్ నుండి మార్చి వరకు (వాతావరణం అనుకూలంగా ఉంటుంది). మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రధాన పర్వదిన పండుగల సందర్బంగా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకొంటారు. పుష్పగిరి క్షేత్ర ఆలయాలు ప్రకృతి రమణీయతకు, భక్తి భావం ఉన్నవారికి ఆధ్యాత్మికత ప్రదేశం, ఇంతే కాకుండా చరిత్ర,సంస్కృతి,పురావస్తు శాస్త్ర పరిశోధకుల ఒక అన్వేషణ ప్రదేశం.
ఉపసంహారం
నేడు పుష్పగిరి క్షేత్రమును దర్శించుకునే లక్షలాది మంది భక్తులు ప్రధానంగా ఏడు ముఖ్య సంస్కృతిక విషయాలను నెమరు వేసుకొంటారు అందులో
- గోళకీ మఠం యొక్క ఆధ్యాత్మికతను.
- పుష్పగిరి గోళకి మఠమునకు సంబందించిన పురాణ కథల మహిమలను.
- అఘోరా సోమశివాచార్యుల వారి శైవ -వైష్ణవ సమన్వయ దృక్పథమును.
- పుష్పగిరి క్షేత్ర అభివృద్ధికి రాజులు చేసిన దానాలను.
- పుష్పగిరి - శ్రీశైలంతో ముడిపడి ఉన్న సంబంధమును.,
- అఘోరా తాంత్రిక శక్తిని గురించి
పుష్పగిరి చరిత్ర ప్రాముఖ్యత, అభివృద్ధి, సంస్కృతిక విషయాలు తెలిపే చారిత్రక శాసన ఆధారాలను గురించి చర్చించుకోని గుర్తుచేసుకుంటున్నారు.
పుష్పగిరి క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు పుష్పగిరి క్షేత్రం హరి-హరుడు కొలువైన పుణ్యక్షేత్రం ‘శైవ-వైష్ణవ’ మత సాంప్రదాయాల సమన్వయం, తంత్ర విద్య, అద్వైత జ్ఞానం,పంచ నది సంగమం, చారిత్రక శాసనాలు అలాగే సామాజిక సంక్షేమ ప్రగతికి నాంది పలికిన అజరామరమైన పుణ్యక్షేత్ర కేంద్రం.ప్రముఖ పర్యాటక కేంద్రం. పుష్పగిరి ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ కేంద్రం కానీ ఇక్కడ పర్యాటకులకు సౌకర్యాలు మితంగానే ఉన్నాయి. నివాస సౌకర్యం, భోజనాల సౌకర్యం దేవస్థానం వారి అన్నదాన సత్రం తప్ప ఇంక వేరే భోజన శాలలు లేవు, అలాగే పుష్పగిరి ప్రదేశం విశిష్టత, చరిత్ర, సంస్కృతి, పర్యాటక సమాచారం గురించి తెలుసుకోవాలంటే గైడ్లు, వివరాలు తెలిపే విచారణ అధికారులు, రోడ్డు పైన సమాచారం తెలిపే బోర్డులు వివిధ సౌకర్యాలు కల్పిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. పర్యాటక అభివృద్ధి మూలంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి.ఆర్ధిక సంపద పెరుగుతుంది. స్వయం ఉపాధి లభిస్తుంది,నిరుద్యోగ సమస్య కొంతవరకు తీరుతుంది. పర్యాటకము ద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికుల సహాయ సహకారాలతో ప్రభుత్వ-ప్రయివేట్ రంగాల బాగస్వామ్యంతో పుష్పగిరి క్షేత్రాన్ని ఇంక అభివృద్ధి పరుస్తారని పర్యాటక సౌకర్యాలు కల్పిస్తారని ఆశీద్దాం.
పాదసూచికలు
1.సుందరేశ్వర రావు, నిడదవోలు :గోళకి మఠము -ఆంధ్ర దేశము - వ్యా., సంపు. 54,సంచిక 10.అక్టోబర్ 1977.పుట 56-65.
2.సుందరేశ్వర రావు నిడదవోలు., భారతి పత్రిక. గోళకి మఠము-ఆంధ్రదేశము., వ్యా, సంపు, 54.సంచి, 11,నవంబర్ 1977.,పుట 19-35.
3.Subrahmanya kumar. V.V., Architecture And Sculpture of the Pushpagiri Temple. Kaveri Book. 2003.,p5-14.
4.శివకుమార స్వామి.ఎం., శ్రీ సిద్ధాంత శిఖామణి తత్వప్రదీప్కా., శైవ భారతి శోధన్ ప్రతిష్టాన్ వారణాశి. 2015.
5.South Indian Inscriptions. Vol-II., p227.,Ramachandra Murthy S.S. ICHR Publisher-211.
6.సాక్షి దిన పత్రిక., 11 సెప్టెంబర్ 2025.,మహిమాన్వితం…ముక్తిప్రదం పుష్పగిరి క్షేత్రం.
7.Subrahmanya kumar. V.V., Architecture And Sculpture of the Pushpagiri Temple. Kaveri Book. 2003., p15-31.
8.Kasturi Apala Naidu., International Journal of Research Culture Society. Vol-9.Issue-8., August2025., The Architectural Splendor of Pushpagiri Temple Complex with the Reference of Chenna Keshava Temple., p15-19.
9.Ramaiah Pantulu. J., and Laxmi Narayana Rao.N. South Indian Inscriptions. Vol-X., Telugu Inscriptions on the Madras Presidency.
Ramesan, Inscriptions of Andhra Pradesh -Cuddapah District, Part -I, Epigraphical Series, 2977. Government of Andhra Pradesh.
10.Parabramha Shastry. P.V., Inscriptions of Andhra Pradesh Cuddapah District, Part -III. 1981,Government of Andhra Pradesh.
Muttu Lakshmi Research Academy, Golaki Matha Inscriptions From Andhra Pradesh A Study of A Shaiva Monastic Lineage History Shaivism Epigraphy Cynthia Talbot.
11.అవధానం ఉమామహేశ్వర శాస్త్రి., కడప జిల్లా శాసనాలు సంస్కృతిక చరిత్ర., సాహితి సామ్రాజ్యము. పుట 130-133.
12.ఈనాడు దిన పత్రిక., శివ కేశవులు కొలువైన పుష్పగిరి క్షేత్రం., 27ఫిబ్రవరి 2025.
13.ఈనాడు దిన పత్రిక, మకరందం., ‘శివ కేశవ క్షేత్రం పుష్పగిరి’., 16 ఏప్రిల్ 2026.
ఉపయుక్తగ్రంథసూచి
1).ఆది నారాయణ శాస్త్రి మాడ్గుల.,’రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం’. 1995,ఆదిత్య పబ్లికేషన్స్, అరవింద్ నగర్. అనంతపురం.
2).Eshwara Reddy. G,. ‘A Study of Religious Endowments During the Vijaya nagara Period (With Reference to Andhra Pradesh) Un Published Thesis Department of Ancient Indian History, Culture and Archaeology, Sri Venkateswara University, Tirupati. November 2009.
3).Mallappa. T.N., ‘Kriyasakti Vidyaranya’. 1974.,Published by Bangalore University.
4).David Gordan White,. ‘Kiss of the Yogini Tantric Sex’ In Its South Asian Contexts,. 2003, The University of Chicago Press.
5). Parabramha Shastri. P. V. ‘Telugu Script :Origin and Evaluation’ (3rd BC-16th C AD), 2009, Andhra Pradesh Government Oriental Manu Scripts Library and Research Institute - Hyderabad.
6).పరబ్రహ్మ శాస్త్రి. పి. వి. కాకతీయులు, 2014,.ఎమెస్కో ముద్రణ.
7).పరబ్రహ్మ శాస్త్రి. పి. వి. కాకతీయ శాసన సాహిత్యము, 2019,. తెలంగాణా సాహిత్య అకాడమీ.
8).Ramaiah Pantulu. J. And Laxmi Narayana Rao. N. South Indian Inscriptions (Texts)(SII. Volume - X) Telugu Inscriptions on the Madras Presidency. Printed at Ananda Press. Madras and Published by the Manager of Publication, Delhi. Department of Indian Archaeology.
9).Himanshu Prabha Ray, The Archaeology of Seafaring in Ancient South Asia. 2003,. Cambridge University Press.Cambridge.
10).Yashodha Devi,. The History of Andhra Country, (1000 AD - 1500 AD), 1993.Gyan Publishing House, New Delhi.
11).Ganapathi Racharla., Subordinate Rulers in Medieval Deccan, 2000, Bharatiya Kala Prakashan.
12).Ramesan,Inscriptions of Andhra Pradesh - Cuddapah District, Part-I, Epigraphical Series, 1977 Government of Andhra Pradesh.
13).Parabramha Shastri P. V. Inscriptions of Andhra Pradesh - Cuddapah District, Part-III. 1981, The Government of Andhra Pradesh- Hyderabad.
14).Gurumurthy. A., Temple of Cuddapah District, 1990. New Era Publications,Madras.
15).puratattva. https://puratattva.in ,. South Indian Inscriptions. Vol-9 Rashtrakutas Inscriptions.
16).www.indiatravelportal.com ., Pushpagiri Temples, India.
17).సాక్షి దినపత్రిక,. 11సెప్టెంబర్ 2025. శీర్షిక ‘మహిమాన్వితం…. ముక్తి ప్రదం పుష్పగిరి.
18).ఈనాడు, 26 జూన్ 2022, శీర్షిక ‘శివ క్షేత్రం పుష్పగిరి.
19).Field Visit May, 2026.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

