AUCHITHYAM | Volume-07 | Issue-9 | August 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. ఆంధ్రప్రశస్తి: వేంగి క్షేత్రము రచనావైశిష్ట్యము
డా. తలారి వాసు
సహాయాచార్య, తెలుగు విభాగం,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9949294254, Email: vasutalari@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.07.2026 ఎంపిక (D.O.A): 25.07.2026 ప్రచురణ (D.O.P): 01.08.2026
వ్యాససంగ్రహం:
20వ శతాబ్దపు ప్రముఖ సాహిత్యమూర్తి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘ఆంధ్ర ప్రశస్తి’ ఖండకావ్య సంపుటిలోని ‘వేంగీక్షేత్రం’ అనే అంశాన్ని విశ్లేషించడమే ఈ పరిశోధనా పత్రం ముఖ్యోద్దేశం. జాతీయోద్యమ కాలంలో తెలుగు ప్రజల్లో చైతన్యం తెచ్చి, గత వైభవాన్ని స్మరింపజేయాల్సిన చారిత్రక ఆవశ్యకతను ఈ శీర్షిక సమర్థిస్తుంది. పూర్వపు పరిశోధనలు, మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి చారిత్రకవేత్తల రచనలు అందించిన స్ఫూర్తితో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. ‘ఆంధ్ర ప్రశస్తి’ గ్రంథం ప్రాథమిక ఆధారంగానూ, ఇతర సాహిత్య విమర్శనా గ్రంథాలు ద్వితీయ ఆధారాలుగానూ విషయసేకరణ జరిగింది. విశ్వనాథ కవితా తత్వాన్ని, చారిత్రక దృక్పథాన్ని పరిశీలిస్తూ వర్ణనాత్మక పద్ధతిలో వ్యాసరచన ప్రణాళిక కొనసాగింది. పరాధీనతలో కుంటుపడుతున్న జాతిని జాగృతం చేయడంలో కవి పడిన ఆవేదనను, పురాతన ఆంధ్రుల శౌర్యపరాక్రమాలను ఈ పరిశోధన వెల్లడిస్తుంది. కాలానుగుణ పరిమితుల కారణంగా లభ్యమైన చారిత్రక ఆధారాల ఆధారంగా ఫలితాలు ప్రకటించబడ్డాయి. భవిష్యత్తులో విశ్వనాథ ఇతర చారిత్రక కావ్యాలపై సమగ్ర పరిశోధనలు చేయడానికి ఈ పత్రం మార్గదర్శకం అవుతుంది.
Keywords: విశ్వనాథ సత్యనారాయణ, ఆంధ్ర ప్రశస్తి, వేంగీక్షేత్రం, గతవైభవం, జాతీయోద్యమం, ఖండకావ్యం, చరిత్ర
1. ప్రవేశిక
దేశం పట్టనంతటి మహాకవి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వంటి గొప్ప గురువునకు ఈయన అసాధారణ శిష్యుడు. 20వ శతాబ్దంలో విస్తృతంగా వివిధ ప్రక్రియల్లో రచనలు కావించి కవిగా, నాటకకర్తగా, నవలాకర్తగా, విమర్శకునిగా, వక్తగా అంతకుమించి ఒక సాహిత్యశక్తిగా ఆయన తన మహోన్నత ముద్రను తెలుగు వాఙ్మయ వేదికపై ఉంచారు. ఏ ప్రక్రియను చేపట్టినా దానిని సుందరంగా తీర్చిదిద్ది శాశ్వతమైన విలువను కలిగించారు. ఆయన రచించిన ఆంధ్ర ప్రశస్తి (1919) ప్రాచీనాంధ్ర వైభవాన్ని వర్ణించే మహత్తర కావ్యం (శ్రీ విశ్వనాథ, 2010).
2. జాతీయోద్యమం – ఆంధ్రప్రశస్తి నేపథ్యం
జాతిని జాగృతం చేయడం జాతీయోద్యమ కర్తవ్యం. ఆ ఉద్యమ ప్రభావంతోపాటు ఆంధ్రోద్యమంలో తెలుగువారు తమ ప్రత్యేకతలను చాటుకోవలసి వచ్చింది. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ వంటి వారు ఆంధ్రదేశ చారిత్రక విశేషాలను వెలుగులోనికి తెచ్చారు. ఆ వెలుగులో అఖండకాంతి గల కొన్ని దివ్వెలను విశ్వనాథవారు చేపట్టి గతవైభవ స్మరణకు పట్టంగట్టారు. ఆంధ్రజాతీయాభిమానాన్ని మేల్కొల్పి ప్రజల్ని స్వాతంత్ర్యపథ గాముల్ని చేయటానికి ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషం వంటి కావ్యాల్ని రచించారు. ఆంధ్ర ప్రశస్తి ఖండకావ్యాన్ని ప్రసిద్ధికెక్కిన చరిత్ర పరిశోధకులు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి అంకితమిచ్చారు (ఖండవల్లి లక్ష్మీరంజనం మరియు బాలేoదుశేఖరం, 1969).
మా పూర్వాంధ్ర ధరాధినాయక కథామంజూషికా రత్నగా
థాపద్యావళిపేరిహారిసుమనోదామంబు మాధ్వీక భా
షాపృక్తంబు మహాప్రబంధ రచనాసౌందర్యపున్వాసనల్
తీపైక్రమ్మగ నాంధ్ర సోదరుల కందిత్తున్ గళాంకమ్ముగాన్
కాలంతెలియని ఆంధ్ర మహా విష్ణువు నుండి చారిత్రకాధారాలు గల విజయనగరరాజ్య పతనం వరకుగల ఆంధ్రుల చరిత్రని విశ్వనాథ ఈ సంపుటిలో కవిత్వీకరించారు. ప్రజలనాలుకలపై నానిన జనశ్రుతులు, కథలు మరియు దొరకుచున్న చరిత్ర ఆధారాలు పరిశీలించి విశ్వనాథ వారు ఆంధ్రప్రశస్తిని రచించారు.
3. ఆంధ్రప్రశస్తిలోని ఖండికలు
ఆంధ్రవిష్ణువు స్మరణతో ఆంధ్రప్రశస్తి ఖండకావ్యం మొదలైంది. ఇది పురాతన చరిత్ర - పూర్వాంధ్రరాజుల కథలతో నిండిన పేటిక. అది ఆంధ్రుల సంపద. దానినుండి కవి తనకు నచ్చిన రత్నాలవంటి పన్నెండు కథలను విశ్లేషించారు (శ్రీ విశ్వనాథ, 2010).
- ఆంధ్ర విష్ణువు
- శాతవాహనుడు
- గౌతమీపుత్ర శాతకర్ణి
- మాధవవర్మ
- వేగీక్షేత్రం
- ముఖలింగం
- నన్నయభట్టు
- ప్రోలరాజు
- ప్రోలరాజువధ
- చంద్రవంకయుద్ధం
- కొండవీటి పొగమబ్బులు
- యమదంష్ట్రిక
12 ఖండికలు 177 పద్యాలుగల కావ్యాన్ని విశ్వనాథవారు తన మిత్రులు, చరిత్ర పరిశోధులైన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారికి అంకితమిచ్చారు (శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు, 2024). తెలుగునాట జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం ముమ్మరంగా సాగిన ఉద్యమాలు. మనభాష, సంస్కృతులను కాపాడుకోవడానికి కవులు ఆంధ్రభాష, ఆంధ్ర వైభవం, ఆంధ్రజాతిని గూర్చి ఎన్నోరసవంతమైన కవితల్ని పండించారు (డా.తలారి వాసు, 2013).
4. వేంగీక్షేత్రం – గతవైభవ స్మరణ
వేంగీ సామ్రాజ్యానికి రాజధాని రాజమహేంద్రవరం. సామ్రాజ్యానికి కేంద్ర స్థానం పెదవేగి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరలో ఉంది. అది వేంగీక్షేత్రం. కవి ఆ స్థానంలో నిలబడ్డాడు. గత వైభవాన్ని స్మరిస్తున్నాడు (శ్రీ విశ్వనాథ, 2010).
ఏరాజు పంచెనో యిచట శౌర్యపుఁబాయ సమ్ములు నాగుల చవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవ రాజ రమణులలు కాళ్ళఁబారాణులిడిరొ
చిత్ర రథ స్వామి రథోత్సవములో దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ
ఏ రెండు జాముల యినుని వేడిమి వచ్చి కలిసిపోయెనొ త్రిలింగ ప్రభువుల
నా జగచ్ఛేయసంబులై యలరు తొంటి వేంగి రాజుల పాద పవిత్ర చిహ్న
గర్భితంబైన యీ భూమి ఖండమందు నశ్రువులు జార్త్రు జీవ చ్ఛవాంధ్రజనులు
ఇదంతా పూర్వపు తెలుగు రాజుల చరిత్ర. ఆ చరిత్ర వైభవాలతో నిండివుంది. ఇప్పుడు ఆ వైభవమేది. గతాన్ని స్మరిస్తూ కన్నీరు కారుస్తూ జీవచ్ఛవాలైనారు ఆంధ్రులు. ఈ చోటులోని వారి పాద చిహ్నాలు లేవు. పూర్వపు రాజ్య చిహ్నాలు కనిపించడం లేదు. ఊహకు కూడా అందడం లేదు. పంటపొలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కాలం బలీయమైంది. ఆ వైభవాలన్నీ కాలగర్భంలో కలసిపోయాయి (ఖండవల్లి లక్ష్మీరంజనం మరియు బాలేoదుశేఖరం, 1969).
5. వేంగీక్షేత్ర పూర్వ వైభవ విశేషాలు
ఈ వేంగీ క్షేత్రంలోని పొలాలన్నీ పచ్చిక బయళ్ళతో ఎంతో అందంగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చని మైదానాన్ని ఎవరు లిఖించిరో! అప్సరసలు ఇక్కడ గానాన్ని ఆలపించారు. మహత్తర దివ్యశిల్పాలను ఏ దివ్యపురుషులు తయారు చేశారో! ఏ పురాణ మునీంద్రులు ఈ మార్గాన్ని వర్ణించారు. ఈ ఆంధ్రదేశంలో ఎక్కడ చూచినా పూర్వరాజుల చరిత్ర గీయబడి, పాడబడి, లిఖించబడి వినిపిస్తున్నాయి (శ్రీ విశ్వనాథ, 2010).
ఈ వేంగీ క్షేత్రంలో ఒకప్పుడు పల్లవులు విజయ పతాకాలు ఎగుర వేశారు. నన్నయ భారతాన్ని, వ్యాకరణాన్ని రచించాడు. కవుల చేతిలో దేశికవిత వైభవాన్ని పొందింది. గోదావరీ నదీ ఘోషలో శిల్పుల శిల్ప శబ్దాలు కలసిపోయాయి. దానికి కారణం శత్రువుల దండయాత్రలు. ఆ పూర్వ వైభవాలు దండయాత్రలలో ఆ విధంగానే సమసిపోయాయి (శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు, 2024).
ఇది వినిపింతు నంచు మది నెంచెద మిత్రులకున్! గళస్థ గా
ద్గదికము, లోచనాంత బహుధాస్రుత బాష్ప నదమ్ము, స్పందనా
స్పద హృదయమ్ము; నా పనికిఁ జేలక చేసెడు, నన్ను నింతగా
నెద పదిలించుకొన్న, దిది యెక్కడి పూర్వపు జన్మ వాసనో!
ఈ ఆంధ్ర వైభవాలన్నీ నా మిత్రులకు చెప్పాలని అనుకుంటుండగానే నా గొంతు దుఃఖంతో నిండిపోయింది. కన్నీరు కారుతోంది. హృదయం స్పందిస్తోంది. ఇదంతా నా పూర్వజన్మ సంస్కారం. అది నా హృదయంలో శాశ్వతంగా ఉంది. పూర్వజన్మ జ్ఞానమిది. దానిని మీతో పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను కాని దుఃఖంలోనికి వెళ్ళిపోయాను (డా.తలారి వాసు, 2013).
ఉపసంహారం
- విశ్వనాథవారి ఆంధ్రప్రశస్తిలోని వేంగీ క్షేత్రం ఖండిక గత వైభవ స్మరణను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
- సాంస్కృతిక పరాధీనతలో కొట్టుమిట్టాడుతున్న సుప్తమైన జాతిని జాగృతం చేయడమే ఈ కావ్య ప్రధాన ఉద్దేశం.
- తెలుగుభాషా మరియు సంస్కృతుల వైభవానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కావ్యం ద్వారా కవి సందేశం ఇస్తారు.
- చారిత్రక స్పృహను పెంపొందించుకుంటూ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తుంది.
ఉపయుక్త గ్రంథసూచి
- లక్ష్మీరంజనం, ఖండవల్లి. బాలేoదుశేఖరం., 1969. ఆంధ్రుల చరిత్ర- సంస్కృతి. గంగాధర పబ్లికేషన్స్.
- వాసు. తలారి, 2013. వింశతి. CIIL ప్రచురణ., మైసూరు.
- సత్యనారాయణ, విశ్వనాథ 2010. ఆంధ్ర ప్రశస్తి. శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్.
- శ్రీరామారావు. పొన్నపల్లి, 2024. ఒకడు విశ్వనాథ! కాదంబరి ప్రచురణలు. విశాఖపట్నం
- సత్యనారాయణ, విశ్వనాథ. 1970. కావ్యపరీమళము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

