AUCHITHYAM | Volume-06 | Issue-12 | October 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. తెలుగుజాతి చారిత్రికవైభవం: మోటుపల్లి
డా. సి.వి. పవన్ కుమార్
అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇబ్రహీంపట్నం
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సెల్: +91 9912356769, Email: drcvpavan@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.09.2025 ఎంపిక (D.O.A): 28.09.2025 ప్రచురణ (D.O.P): 01.10.2025
వ్యాససంగ్రహం:
ఆంధ్రదేశచరిత్రలోనే కాకుండా దక్షిణ భారతదేశచరిత్రలో కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది మోటుపల్లి. దేశీయకొండ పట్టణంగా కూడా వ్యవహరింపబడిన మోటుపల్లి ప్రాచీన, మధ్యయుగ ఆంధ్రదేశచరిత్రలో అంతర్జాతీయ ఓడరేవు పట్టణంగా విశిష్ట సేవలు అందించింది. ఆంధ్రప్రదేశ్ బాపట్లజిల్లా చినగంజాంమండలంలో మోటుపల్లి ఉంది. శాతవాహనులు, చోళులు, కాకతీయులు, విజయనగర వంటి ప్రముఖ దక్షిణ భారత రాజ్యాలు తమ ఎగుమతులు, దిగుమతుల నిర్వహణకై ఈ ఓడరేవును అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా కాకతీయుల కాలంలో దీని వైభవం పతాక స్థాయికి చేరుకుంది. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు ఇక్కడ వేయించిన మోటుపల్లి అభయ శాసనం ఎనలేని సమాచారాన్ని అందిస్తోంది. సమకాలీన చరిత్రలో మొదటిసారిగా సముద్ర వ్యాపారులకు సముద్ర బీమాను అందించి, వాణిజ్యాన్ని ప్రోత్సహించిన కాకతీయుల ఘన చరిత్రకు ఇది సాక్షీభూతంగా నిలుస్తోంది. శ్రీనాధుని రచనలలో కూడా ఇక్కడి వాణిజ్య కార్యకలాపాలు ప్రస్తావించబడ్డాయి. ఇటలీ యాత్రికుడు మార్కోపోలో 1287లో ఈ ఓడరేవును సందర్శించి, దీని ద్వారా జరిగే వాణిజ్య కార్యకలాపాల గురించి తన రచనలో స్పష్టమైన వివరణ ఇచ్చాడు. సమకాలీన చరిత్రలో ఈ ఓడరేవు పట్టణం విశ్వనగరంగా, బలమైన సాంస్కృతిక కేంద్రంగా ఉద్భవించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మోటుపల్లి 16వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిర పరిస్థితుల కారణంగా క్రమంగా దాని వైభవాన్ని కోల్పోయింది. తెలుగు వారి చారిత్రక వారసత్వమైన మోటుపల్లి పుట్టు పూర్వోత్తరాలను వెలికి తీయడమే ఈ పరిశోధన పత్రం ముఖ్యోద్దేశం. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దురైస్వామి దయాలన్, కృష్ణ మోహన్ రెడ్డి మొదలగు వారి పరిశోధనా పత్రాలలో కూడా మోటుపల్లి గురించి సంక్షిప్త సమాచారం మాత్రమే లభ్యమవుతోంది. అందువల్ల దీనిపై సమగ్ర పరిశోధన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మోటుపల్లిలో బయల్పడుతున్నచారిత్రక అవశేషాల గురించి ది హిందూ, దక్కన్ క్రానికల్, ఈనాడు తదితర దిన పత్రికలలో వచ్చిన సమాచారాన్ని, పి.వి. పరబ్రహ్మ శాస్త్రి, మార్కోపోలో లాంటి విదేశీ యాత్రికుల రచనలలోని సమాచారాన్ని చారిత్రక విశ్లేషణ పద్ధతిలో క్రోడీకరించి, క్షేత్ర స్థాయి పరిశీలనా ద్వారా వాస్తవాల అధ్యయనంతో ఈ పరిశోధనా పత్రాన్ని రూపొందించడం జరిగింది. మోటుపల్లి భౌగోళిక నేపథ్యం, ఈ ఓడ రేవు ద్వారా జరిగిన వాణిజ్య కార్యకలాపాల సుదీర్ఘ వివరణలను తగిన చారిత్రిక ఆధారాలతో ప్రస్తావిస్తూ, అది సాంస్కృతిక కేంద్రముగా కూడా ఎలా అభివృద్ధి చెందినదో తెలియపరుస్తూ, దాని పతనానికి గల కారణాలను పరిశోధనా పత్రంలో చర్చించడం జరిగింది. మోటుపల్లి పురా వైభవ పునరుద్ధరణతో పాటుగా మంచి పర్యాటక, చారిత్రక కేంద్రంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను సూచించడంతో ఈ పరిశోదన పత్రం ద్వారా మనం ఆశించగలిగిన ప్రయోజనం.
Keywords: - మోటుపల్లి, కాకతీయులు, విదేశీ వాణిజ్యం, సాంస్కృతిక కేంద్రం
ఉపయుక్త గ్రంథసూచి
- పరబ్రహ్మ శాస్త్రి, పి.వి. ప్రాచీనాంధ్రదేశ చరిత్ర - గ్రామీణ జీవన విధానం. హైదరాబాద్, ఎమ్మెస్కో బుక్స్, 2012.
- ప్రతాప రెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. హైదరాబాద్, ఓరియంట్ లాంగ్మేన్, 1992.
- ప్రసాదరావు, పి.వి.కె. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర. హైదరాబాద్, ఎమ్మెస్కో బుక్స్, 1999.
- బెనెడెట్టో, ఎల్.ఎఫ్., మరియు ఆల్డో రిక్కీ. ది ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో. లండన్, రూట్లెడ్జ్, 1939.
- దయాలన్, దురైస్వామి. "ఏన్షియంట్ సీపోర్ట్స్ ఆన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా: ది హబ్ ఆఫ్ ది మేరిటైమ్ సిల్క్ రూట్ నెట్వర్క్." [జర్నల్ పేరు లేదా ప్రచురణ స్థలం] (జర్నల్ పేరు పేర్కొనబడలేదు), సంపుటి 4, సంఖ్య 1, జూన్ 2019, పుటలు 25–69.
- డెక్కన్ క్రానికిల్. ఆగస్టు 16, 2022.
- ది హాన్స్ ఇండియా ఈ-పేపర్. మార్చి 10, 2021, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్.
- ది హిందూ. ఫిబ్రవరి 22, 2021, ఒంగోలు ఎడిషన్.
- ది హిందూ. జూలై 16, 2016, విజయవాడ ఎడిషన్.
- త్రిపాటి, సిలా. "మేనేజ్మెంట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ మేరిటైమ్ ట్రేడ్ ఆఫ్ ఒరిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ది హిస్టారికల్ పిరియడ్." [జర్నల్ పేరు లేదా ప్రచురణ స్థలం] (జర్నల్ పేరు పేర్కొనబడలేదు), సంపుటి 34, 2, 2009, ໖ 77-90.
- రఘునాధ రావు, పి. హిస్టరీ అండ్ కల్చర్ అఫ్ ఆంధ్రప్రదేశ్. స్టెర్లింగ్ పబ్లికేషన్స్, 2021.
- శాస్త్రి, పి.వి.ఆర్. ది కాకతీయాస్. (ప్రచురణకర్త పేరు తెలియదు], [ప్రచురణ సంవత్సరం తెలియదు).
- శివనాగి రెడ్డి, ఈమని. తెలుగువారి వారసత్వం. విజయవాడ, ప్రజాశక్తి బుక్ హౌస్.
- శ్రీనాధుడు. హరవిలాసం. మదరాసు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1916.
- సోమరెడ్డి, ఆర్. మధ్యయుగ ఆంధ్ర దేశంలో మత సంస్థలు. హైదరాబాద్, సుమతి పబ్లికేషన్స్, 2013.
- సోమసుందర రావు, సి. ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి. సంపుటి 4, మధ్యయుగ ఆంధ్ర దేశం (1300-1324).
- - సోమశేఖర శర్మ, మల్లంపల్లి. రెడ్డి రాజ్యాల చరిత్ర (సిర్కా. 1325 AD, నుండి సిర్కా. 1448 AD).
- వాల్టెయిర్, ఆంధ్రా విశ్వవిద్యాలయం, 1946. ఇంటర్నెట్ ఆర్కైవ్స్.
- - సుబ్రహ్మణ్యం, బండారు. తెలుగు నేలపై పురావస్తు పరిశోధనలు. హైదరాబాద్, తెలుగు విశ్వవిద్యాలయం, 2012.
- - హనుమంత రావు, బి.ఎస్.ఎల్. ఆంధ్రుల చరిత్ర. హైదరాబాద్, విశాలాంధ్ర పబ్లికేషన్స్, 2012.
- - హైదరాబాద్ నగర నిర్మాతలు కుతుబ్ షాహీలు. హైదరాబాద్, ఎమ్మెస్కో బుక్స్, 1999.
- - హైదరాబాద్ నగర నిర్మాతలు కుతుబ్ షాహీలు. హైదరాబాద్, ఎమ్మెస్కో బుక్స్, 2011.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

