AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
8. పాలమూరు జిల్లా గ్రామదేవతలు: పరిశీలన

జి. దౌలమ్మ
తెలుగు ఉపన్యాసకురాలు
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వనపర్తి.
వనపర్తి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 8179266902, Email: gantasandhya3466@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.03.2025 ఎంపిక (D.O.A): 30.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
తెలంగాణప్రాంతంలో గ్రామాదేవతలకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రాచీనమానవుడు పూజించిన శక్తిదేవత గ్రామాదేవత. నాయని కృష్ణకుమారి తల్లి దేవతను గురించి ప్రస్తావిస్తూ మనుషులను పీడించు ప్రేతాత్మల నుండి రక్షణకు ఆ మనుషులు భగవంతుని రూపం కల్పించుకొని తమకు రక్షణగా నిలబెట్టుకున్నారు. ఆ నిలబెట్టుక్కున్న దేవతలను జానపదుల గ్రామాదేవతలు అన్నారు. ప్రాచీన సంస్కృతసాహిత్యమున కనిపించే దేవి యొక్క ఉమా, అంబిక నామములు ద్రావిడశబ్దమునకు మారురూపములు అని పేర్కొన్నానారు. రామాయణంలో హనుమంతుడు లంకను చేరుకునపుడు లంక లోపలికి వెళ్ళకుండా “లంకిణి” అనే రాక్షసి అడ్డుకుంది. రామాయణంలో లంకిణిని అతిప్రాచీన గ్రామదేవతగా పేర్కొనవచ్చు. సింధు ప్రజలు అమ్మతల్లిని స్త్రీదేవతగా పూజించారని లభించిన చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది. మాతృసామ్యవ్యవస్థలో దేవతయే తప్ప దేవుని ప్రసక్తి లేదు. ఒక్కొక్క గుడికి ఒక్కో చరిత్ర, ఒక్కోరాయికి ఒక్కోకథ అనే మాట జానపదుల గ్రామదేవతలకు వర్తిస్తుంది. కల్మషం లేని మనుషులుగా గ్రామీణులు బంధాలు, అనుబంధాలే ఆస్తులుగా వారు అనుకుంటారు. వారి యొక్క ఆచార వ్యవహారాలే గ్రామ దేవతలు వెలవడానికి కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుత వ్యాసం క్షేత్రపర్యటన ద్వారా సేకరించిన సమాచారంతో రూపుదిద్దుకుంది.
Keywords: పాలమూరు, గ్రామదేవత, చరిత్ర, జానపదం, క్షేత్రపర్యటన
1. ప్రవేశిక:
గ్రామ దేవతలు గ్రామంలో వెలసిన దేవతలు. వీరు గ్రామం ఉన్నప్పటి నుండి ఉండవచ్చు లేదా తర్వాత నిలుపుకున్న వారు కావచ్చు. తెలుగులో దేవుడు పుంలింగం, దేవత స్త్రీ లింగం గా వ్యవహరిస్తారు. గ్రామదేవతలు అందరూ స్త్రీలే. గ్రామరక్షణకై గ్రామ పొలిమేరలో లేదా గ్రామం నడిబొడ్డున ఈ దేవతలు ప్రతిష్ట అనడు చేసేవారు. గ్రామంలో ఏ దేవత లేకపోతే ఆపదలు కలుగుతాయని భావించేవారు అందుకోసం గ్రామాల్లో గ్రామదేవతలను నిలుపుకోవడం జరుగుతుంది.
2. పోచమ్మ దేవత:
పోచమ్మ అనగా పోషించే తల్లి అని, పోశమ్మ(పోచు+ అమ్మ=పోచమ్మ- పోశమ్మ ) గా మారింది. శరీరంపై బుగ్గలను పోసే తల్లి కనుక పోసే+అమ్మ=పోశమ్మ గా మారింది. వాడుక రూపం లేదా వ్యవహరిక రూపం ఓ సేవ. పెద్ద పెద్ద బుగ్గలు ఏర్పడితే బుగ్గలమ్మ పోసింది అని జనులు పలుకుతారు. ఆమెను సుంకులమ్మ అని కూడా వ్యవహరిస్తారు. ఈ వ్యాధి తీవ్రస్థాయికి చేరుకుంటే ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఒక్కోసారి ఈ వ్యాధి గ్రామమంతట వ్యాపిస్తుంది అందువల్ల గ్రామస్తులు స్పోటకపు వ్యాధి సోకకముందే పోచమ్మను తగిన విధంగా పూజించి శాంతింప చేస్తారు. అమ్మ తల్లి సోకినవారికి చల్లని మజ్జిగ కలూ తప్ప మరి ఏమి ఇవ్వరు. రోగికి తెల్ల బట్టలు వేసి, వేప మండలు ప్రక్కలో పెడతారు ఇంటిలో తాలింపు వేయడం నిషేధం. వ్యాధి తగ్గిన తర్వాత బెల్లం అన్నంతో గాని, కోడితో గాని దేవతకు మొక్కులు చెల్లిస్తారు.
“పోచమ్మ తల్లి ఓ పోచమ్మ తల్లి- మమ్ము
గండ దీపంబులు పోచమ్మ తల్లి- నీకు
నిండుగా బోనాలు పోచమ్మ తల్లి
కలు బెల్లపు శోక పోచమ్మ తల్లి- నీకు
చల్లని తల్లివమ్మా పోచమ్మ తల్లి -నీకు
హారాలు బెట్టేమో పోచమ్మ తల్లి
కొత్త బట్టలు నీకు పోచమ్మ తల్లి- నీకు
ఒడిబియ్యం అమ్మ పోచమ్మ తల్లి
పోచమ్మ తల్లి ఓ పోచమ్మ తల్లి- నీకు
పదివేల దండాలు పోచమ్మ తల్లి” అని ఈ తల్లిని ప్రార్థించడం జరుగుతుంది.
తెలంగాణ జిల్లాలోని అన్ని గ్రామాలలో పోచమ్మ దేవత కొలవై ఉంది. ప్రతి సంవత్సరం మొకారతలో ఈమెకు బోనాల పండుగ అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ రోజున పెళ్లి కానీ యువతాలు మట్టితో తయారు చేసి అలంకరించిన బోనం కుండను మట్టికుండకు ఎత్తుకొని ప్రదర్శనగా భవనీల ముందు నడువగా తప్పేట తాళాలతో పోచమ్మ గుడికి వెళ్తారు. మట్టి కుండ కు సున్నం పోసి పసుపు, కుంకుమ బొట్లను పెడతారు. పోచమ్మ గుడికి పూల దండలు కట్టి బోనం సమర్పిస్తారు. గుగ్గిలం పొగ చేసి గుడి ముందర కల్లుతో గాని బెల్లం పాకంతో గాని సాకను పోస్తారు. పసుపు, కుంకుమలను చల్లి క్రొత్త బట్టలను కానుకగా దేవతకు సమర్పిస్తారు. ఇంకా కొంతమంది కోళ్లను, మేకపోతులను బలి ఇచ్చి వాటి తలలను కాళ్ళను గుడి ముందున్న చెట్టు కొమ్మలకు వేలాడదీస్తారు. చాకలి వాళ్లు బైండ్ల వారు ఈ దేవతకు పూజారులుగా ఉంటారు.
మూడు బండలు నిలబెట్టి ,నాలుగవ బండను పైన కప్పుల అమర్చి పోచమ్మ గుడిని నిర్మిస్తారు. ఈ గుడిలో మూడు మూలల రాయి (త్రికోణకృతి) లేదా చతురస్రాకార రాయిని నిలబెట్టి ఆరాయినే పోచమ్మగా ఆరాధిస్తారు. ఈ తల్లిని పూజించడం వల్ల పెళ్లి కానీ యువతకు త్వరగా పెళ్లి అవుతుంది మంచి భర్త దొరుకుతాడు అనే విశ్వాసంతో బోనమును ఎత్తుకొని వెళ్లి ఆమెకు సమర్పిస్తారు.
3. ఎల్లమ్మ దేవత:
ఎల్లమ్మ అంటే ఎల్లలను రక్షించే దేవతగా తెలంగాణ ప్రజలకు నమ్మకం. ఎల్లమ్మ అంటే రేణుకా దేవి అవతారమని భావిస్తారు. తెలంగాణ ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ ను వరాలు ఇచ్చే దేవతగా ఆరాధిస్తారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఎల్లమ్మను ఆరాధిస్తారు. ఎల్లమ్మ దేవతకు శాకాహార నైవేద్యంతో గాని మాంసాహార నైవేద్యంతో పూజిస్తారు.
1. బాపనింటి ఎల్లమ్మ దేవత: (తుర్కలపల్లి)
తెలంగాణ ప్రాంతంలోని కొల్లాపూర్ తాలూకాలో బాపనేంటి ఎల్లమ్మ దేవతను ఆరాధిస్తారు. తర్కల గ్రామంలో బాపనేంటి ఎల్లమ్మ దేవతను హరిజనులు మాత్రమే పూజించడం ఇక్కడ ప్రత్యేకత. మిగిలిన కులాల వారు ఈ బాపనేంటి ఎల్లమ్మను చేయరు. ఈ దేవతను శ్రావణమాసంలో ని మంగళవారం రమ్య పూజిస్తారు.
2.జంబులమ్మ దేవత: (జమ్ములమ్మ దేవత)
తెలంగాణ ప్రాంతంలోని మరొక జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాకు 3 కిలోమీటర్ వెలసిన దేవత జంబులమ్మ (జములమ్మ).
జమ్ములమ్మ ను ఎల్లమ్మ ఒక్కరే అని ఈ ప్రాంతంలో పూజిస్తారు.
దేవత వెలిసిన విధానం:
జమ్మిచేడు జములమ్మ దేవత గుడి కీర్తిశేషులు లక్ష్మణ గౌడ్ గారి పొలంలో ఉంది.
లక్ష్మణ గారి కాలంలో చిన్న గుంటుక కట్టుకొని పొలం దున్నుతున్నప్పుడు ఒక రాయి అడ్డుగా వస్తే దాన్ని తీసి గట్టున పారవేసి ఇంటికి వెళ్ళాడు. ఉదయం వచ్చి పొలంలో చూస్తే తాను తీసివేసిన రాయి యధా స్థానంలో ఉండడం గమనించాడు. ఇలా రెండు మూడు రోజులు జరిగింది ఒకనాడు ఊళ్లో వాళ్లు అందరూ కాపలా కాచి రాత్రి 12 గంటలకు రాయి వెళ్లి యధా స్థానంలో నిలబడటం చూసి ఊరు వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాయి తెల్లచీర తెల్లరవిక కట్టుకొని శ్రీ మూర్తి అయి దర్శనమిచ్చింది. అప్పుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఈ జమ్ములమ్మ గుడి కట్టారు అని పూజారి బీసన్న తెలిపారు.
దేవత పుట్టినిల్లు గుర్రం గడ్డ అని అంటారు ఈ పుట్టింటికి వెళ్లే దారిలో ఆమె చెయ్యి, పాదాలు గుర్తులు ఉన్నాయి అని అంటారు.
జమ్మి చెడు జమ్ములమ్మను స్వయంభు వెలసిన దేవతగా ఆరాధిస్తారు. జములమ్మ గుడి దగ్గర వెలసిన ముక్కిడి అమ్మను పూజించిన తర్వాతే జములమ్మను కొలవడం ఆచారంగా వస్తుంది జములమ్మ గుడి ముందు చెక్క బొమ్మల రూపంలో ముఖ్యడమను కొలుస్తారు. పిల్లలకు చెవిలో చీము కారడం, పుండ్లు ఇంకా ఇతర చర్మవ్యాధుల నివారణకు ఈమెను ఆదిదేవతగా కొలుస్తారు. కొందరు మాంసాహార నైవేద్యంతో మొక్కులు చెల్లిస్తారు మరికొందరు కాయ చక్కెర భక్షాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు మెడలో పాదాలు వేసుకుంటారు వీటిపై నాగ ఫణి ముద్రించి ఉంటుంది వీటిని బైండ్ల వారు స్త్రీల మెడలో వేయడం ఇక్కడి విశేషం.
నియమం:
పాదాలు మెడలో ధరించిన స్త్రీలు మైల తిండి తినరాదు, ఎంగిలి కూడా తినరాదు అని ఒక నియమం ఉంది. ఎవరైనా చనిపోతే ఆ శవం దాన సంస్కారాలు జరిగిన తర్వాతే స్నానం చేసి భోజనం చేయాలని నియమాలు ఉన్నాయి.
జమ్మి చెడు జములమ్మ తల్లిని ఇక్కడి ప్రజలు కొంగు బంగారం నీ ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు.
4. మైసమ్మదేవత:
పాలమూరు జిల్లాలో గ్రామ దేవతల్లో మైసమ్మ మొదటి స్థానాన్ని పొందిన దేవత. మైసమ్మ ను వివిధ రకాల పేర్లతో కోట ,గండి కట్ట ,దొడ్ల ,బాల నాయనోనిపల్లి మొదలగు మైసమ్మగా పిలువబడుతుంది. కోట మైసమ్మ దేవత కొల్లాపూర్ మండలంలోని ఎండబెట్ల, సింగోటం మొదల గ్రామాల్లో ఉంది. మైసమ్మ దేవతకు అంకాల్లోల్లు పూజారులు. ఈమెకు బోనం తేవడం ఇక్కడే ఆచారం బోనం వెంట రాజావారి వ్యవసాయం చేసే రైతులు వేటను తెచ్చి దేవత చుట్టూ తిప్పి తర్వాత బలిస్తారు.
5. కోట మైసమ్మ దేవత:
ఈ జిల్లాలలోని సంస్థానాలలో ఉండే కోటలన్నిటికీ కోట మైసమ్మ వెలసింది. కొల్లాపూర్ మండల కేంద్రంలోని కోట మైసమ్మను కీర్తిశేషులు రాజా లక్ష్మణరావు గారి కాలంలో నిలబెట్టారు. వారు తమ సంస్థానానికి జట్రపోలు నుండి కొల్లాపూర్ కి మార్చిన సమయంలో కోట రక్షణార్థమై కోట మైసమ్మ ను గోడకు నిలబెట్టారు. పశు సంరక్షణ అర్థం కూడా ఈ దేవతను పూజిస్తారు.
కోట మైసమ్మకు ప్రతి దేవత లింగమయ్య అని గుణం పోతురాజు తెలిపినాడు. ఆ సమయంలో లింగమయ్య దేవుని కూడా పూజలు జరుపుతారు. కోట మైసమ్మకు నవధాన్యాల కుంభం పోసి పూజా తంతులో భూతపిల్లిగాడి పాత్ర ఉంటుంది. ఇది చాలా పదుల ఆచారంగా వస్తుంది.
6. లింగమయ్య:
లింగమయ్యను శివుని ప్రతిరూపంగా కొలుస్తారు. కొల్లాపూర్ తాలూకాలోని సింగపట్టణం (సింగోటం) గ్రామ పొలిమేరలో బొలిగట్టు దగ్గర అడవిదేవుడిగా లింగమయ్యను పూజిస్తారు. నల్ల సరుపు గుండు రూపంలో లింగమయ్య పూజలు అందుకున్నాడు ఈ లింగమయ్యను ఎక్కువగా పూజించేవారు గొల్ల వారు.
పంటలు చేతికి వచ్చినప్పుడు బోనాన్ని ఎత్తుకొని, దానితోపాటు మేకపోతును లింగమయ్య చుట్టూ తిప్పి కల్లును సాకపోస్తారు. గుడి ముందు శుభ్రం చేసి అలికిన నేలపై పంట వేస్తారు. చిన్నస్వామి అనే సింగోటం గ్రామానికి చెందిన యాదవుడు సిగం ఎత్తి మేకను నోటితో పట్టుకొని గాపు పడతాడు. తర్వాత దాన్ని కోసి బంధువులతో కలిసి విందు భోజనాలు చేసి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలోనే ఉంటారు. ఈ బలి మాంసాహారంతో భూత గుణనాథుడైన శివుడు సంతృప్తి పొందుతాడు అని ప్రజల నమ్మకం.
7. ఉపసంహారం:
- జానపదుల సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు భక్తి, శ్రద్ధలను ఎలుగెత్తి చాటేవి గ్రామదేవతలే అది జగద్విదితం.
- ఈ గ్రామదేవతల చుట్టూ అద్భుతమైన కథలు, విచిత్ర సంఘటనలు సాలెగూడులా అల్లుకొని పోయి ఉంటాయి.
- ఒక్కొక్క గుడికి ఒక్కో చరిత్ర, ఒక్కోరాయికి ఒక్కో కథ అనే మాట జాన పదుల గ్రామదేవతలకు వర్తిస్తుంది.
- కల్మషం లేని మనుషులుగా గ్రామీణులు బంధాలు, అనుబంధాలే ఆస్తులుగా వారు అనుకుంటారు. వారి యొక్క ఆచార వ్యవహారాలే గ్రామ దేవతలు వెలవడానికి కారణమైందని చెప్పొచ్చు.
8. పాదసూచికలు:
1. మహబూబ్నగర్ జిల్లా గ్రామ దేవతలు, పుట :42.
2. తెలుగు జానపద గేయ గాథలు, పుట:184 - డా. నాయని కృష్ణకుమారి.
3. తెలుగు జానపద సాహిత్యం పురాగాధలు, పుట.185. డా. రావి ప్రేమలత.
9. విషయ సేకరణలో తోడ్పడిన దాతలు :
- జోగులాంబ గద్వాల్ జిల్లా జంబులమ్మ దేవత పెద్ద అర్చకులు రాజు, చిన్న అర్చకులు : E. రాజు (ఇద్దరు అన్నదములు ).
- డి.నరేష్ : పరుశురాం గుడి దగ్గర అర్చకులు.
- T. సత్య నారాయణ-మైసమ్మ గుడి పూజారి.
10. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణ కుమారి, నాయిని. 1977. తెలుగు జానపద గేయగాథలు p.hd పరిశోధన గ్రంధం
- ఇందిర దేవి, ఎం. 2000. మహబూబ్ నగర్ జిల్లా గ్రామదేవతలు. పరిశోధన గ్రంధం
- రఘురామారెడ్డి, యెల్డంద. 1979. పల్లె పదాలలో ప్రజాజీవనం. p.hd పరిశోధన గ్రంధం
- లింగమూర్తి, కపిలవాయి. పాలమూరు జిల్లా. వాణి పబ్లికేషన్ ప్రధమ ముద్రణ
- శాస్త్రి, బి. ఎన్. మహబూబ్ నగర్ జిల్లా సర్వస్వం. మూసీ పబ్లికేషన్. కాచిగూడ
- జనార్దన్ భట్. మహబూబ్ నగర్ జిల్లా జాతరలు - ఉత్సవాలు. ఓ.యూ, m.Phil గ్రంధం
- ప్రేమలత, రావి. తెలుగు జానపద పురాగాధలు. పరిశోదన గ్రంధం
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.