headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

12. కుమారవ్యాసభారత ఉద్యోగపర్వం : శ్రీకృష్ణుడి పాత్ర విశ్లేషణ

డా. టి. డి. రాజన్న తగ్గి

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కన్నడ శాఖ,
కర్నాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం, కడగంచి,
కలబురగి, కర్నాటక.
సెల్: +91 8904446344, Email: tdrajannathaggi@cuk.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 19.02.2025        ఎంపిక (D.O.A): 28.02.2025        ప్రచురణ (D.O.P): 01.03.2025


వ్యాససంగ్రహం:

‘కుమారవ్యాసుడు పాడుతూ వుంటే, కలియుగం ద్వాపరమవుతుంది. భారతం కన్నులో చిందుతూ, ఒంటిలో మెరుపుల ధారా ప్రవహిస్తోంది’ అనే ఆధునిక కవుల పొగడ్తలకు అర్హుడైన కుమారవ్యాసుడు కన్నడ సాహిత్యంలో పదిహేనవ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కవి. ఇతను కుమారవ్యాసభారతం అనే కావ్యాన్ని రాశాడు. ఈ కావ్యంలో రాజులకు వీరం, ద్విజలుకు పరమవేదపు సారం, యోగులకు తత్వవిచారం, మంత్రివర్గానికి బుద్ధిగుణం, విరహులుకు శృంగారం, పరిణతులకు అలంకారం… ఇలా అన్నీ రకాల రసస్వాదనకు తావు వుందనేదే ఈ కావ్యశ్రేష్ఠత. ఈ కావ్యానికి శ్రీకృష్ణుణ్ణి నాయకుడుగా ఎంచుకుని అతన్ని భక్తియుగ ప్రవర్తకుడిగా. దైవీ పురుషుడిగా, ʼతేనవిన తృణమపి న చలతిʼ అన్నట్టు అన్నిటికీ శ్రీకృష్ణుడే చైతన్యస్వరూపిగా చిత్రించినది విశేషం. ఇవన్నీ విశేషాలతో పాటు శ్రీకృష్ణుడి ఉద్యోగం, ప్రాముఖ్యత, చాలా ముఖ్యమైన అడుగులు, తంత్రాలు కనిపించేది మాత్రం ఉద్యోగపర్వంలో. ఇంతకు ముందు ఈ కావ్యాన్ని గురించి శ్యామసుందర్ బిదరకుంది ʼకుమారవ్యాస కన్నడ భారతంʼ, రహమత్ తరీకరె, ʼకుమారవ్యాస భారత సాంస్కృతిక ముఖాముఖిʼ అనే పరిశోధనాత్మక గ్రంథాలను సంపాదించారు, ఈ వ్యాస రచనకు కుమారవ్యాసభారతంలోని ఉద్యోగపర్వ భాగమే ఆధారం. ఈ ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణుడు శిష్టుల రక్షణకోసం మరియు దుష్టుల నిగ్రహంకోసం వేసిన అడుగులు ఎలాంటివి ? వాటి పూర్వ తయారిలో వేసిన పథకాలేంటి? అనే విషయాన్ని విమర్శా దృక్పథంతో పరిచయం చేయడమే ఈ వ్యాసోద్దేశం. ఈ వ్యాస రచనలో శ్రీకృష్ణుడు పాండవులను ప్రతీకారానికి ప్రేరేపించినది, సంధానమనే సాకుతో సంగ్రామం నెలకోల్పినది, విదురుణ్ణి దుర్యోధనుడినుంచీ వేరు చేసినది, శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శన, కర్ణుడి మనస్సులో నాటిన ద్వంద్వం… అనే ఉపశీర్షికలతో విభజించుకుని విశ్లేషించడం జరిగింది. ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణుడు పాండవుల్ని ప్రేరేపించే స్వభావంగలవాడిగానూ, క్రోధాన్ని పెంచేరకంగానూ, తన కారణజన్మోద్దేశానికి సందర్భాలని తనకు తగినట్టు పరివర్తించుకనేవాడిగానూ, కేవలం లోకకల్యాణార్థంకోసం అవసరపు శత్రుత్వాన్ని పోషించేవాడిగానూ, ఎల్లప్పుడూ దుష్టనిగ్రహ మార్గంలో సాగిపోయే కర్తవ్యపరుడిగానూ వుంటూ తన ఉద్యోగాన్ని ఎలా పూర్తిచేశాడు అనే సంగతులను భిన్న దృక్పథంతో విశ్లేషించడం ఈ వ్యాసలక్ష్యం.

Keywords: లోకకల్యాణం, దుష్టనిగ్రహం, సంధానం, సంగ్రామం, విశ్వరూపం, ద్వంద్వం, ఉద్యోగం

1. ప్రవేశిక:

మధ్యకాలపు కన్నడ సాహిత్యంలో పదిహేనవ శతాబ్దంలో చాలా ప్రసిద్ధ కవి కుమారవ్యాసుడు. ఇతను ‘కుమారవ్యాస భారతం’ అనే కావ్యం రాశాడు. దీనికి ʼకర్ణాట భారత కథామంజరిʼ, ʼగదుగిన భారతంʼ అనే పేర్లు కూడా వున్నాయి.

ఈ భారత కావ్యారంభంలోనే కవి శ్రీకృష్ణుడి కథను పలుకుతాను సరళ రూపముగాʼఅని చెబుతూ, ఈ కావ్యానికి శ్రీకృష్ణుడే నాయకుడని తేల్చి చెప్పేశాడు. ఇందులో శ్రీకృష్ణుడిది ధర్మమార్గములో సాగే తేజోబలం. ఈ తేజోబలం లోకకల్యాణార్థం వినియోగగొన్నది. కాబట్టి శ్రీకృష్ణుడు ʼధర్మహింసా తథైవచాʼ అనే ఉద్దేశంతో దుష్టుల నిగ్రహానికి తన బాల్యంనుంచీ అనేక మంది రాక్షసుల్నీ వధిస్తూ వచ్చాడు. అందులో జరాసంధుణ్ణి చంపడానికి భీముణ్ణి ప్రచోదించింది, శిశుపాలుణ్ణి తనే వధించింది, అలానే శిష్టుల రక్షణానుగ్రహ బరువుని తనే మోసింది… ఇలా ఎన్నో చేసింది కేవలం లోకకల్యాణార్థంకోసం.

ఇలాంటి శ్రీకృష్ణుడు కుమారవ్యాస భారతంలో నాయకుని పాత్ర పోషించినా ఈ పాత్రపు ప్రాముఖ్యత, ఉద్యోగం, చాలా ముఖ్యమైన అడుగులు, తంత్రాలు కనిపించేది మాత్రం ఉద్యోగపర్వంలో. 

కన్నడంలో మహాభారతం పైన మూడు కావ్యాలు రచించబడినాయి. అందులో పంప కవి ఆద్యుడైతే తరువాత రన్న. ఆ తరువాతే కుమారవ్యాస. ఈ ముగ్గురి కావ్యాలలో శ్రీకృష్ణుణ్ణి చిత్రించిన తీరు మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది. వ్యాసభారతంలో శ్రీకృష్ణుడు యుగప్రవర్తుకుడుగా చిత్రింపబడితే, పంప శ్రీకృష్ణుణ్ణి చరిత్రపు వీరయుగం ప్రవర్తకుడిగా చిత్రించాడు. కానీ కుమారవ్యాసుడు మాత్రం భక్తియుగం ప్రవర్తకుడిగా. దైవీ పురుషుడిగా చిత్రించినది విశేషం. ʼతేనవిన తృణమపి న చలతిʼ అంటే అన్నిటికీ శ్రీకృష్ణుడే చైతన్యస్వరూపి అన్నట్టు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అదీగాక ప్రతిసందర్భంలోను తను తన అవతార లక్ష్యం వైపే మనస్సుని కేంద్రీకరించినట్టు తన పనిని తాను నిభాయిస్తూ వుంటాడు.

అందువలనే శ్రీకృష్ణుడు పాండవుల్ని ప్రేరేపించే స్వభావంగలవాడిగానూ, క్రోధాన్ని పెంచే రకంగానూ, తన కారణజన్మోద్దేశానికి సందర్భాలని తనకు తగినట్టు పరివర్తించు వాడిగానూ, కేవలం లోకకల్యాణార్థం అవసరపు శత్రుత్వాన్ని పోషించేవాడిగానూ, ఎల్లప్పుడూ దుష్టనిగ్రహ మార్గంలో సాగిపోయే కర్తవ్యపరుడిగా కనిపిస్తాడు.

ఇలా ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణుడు శిష్టుల రక్షణ భవంతిని నిర్మించడానికీ, దుష్ట నిగ్రహంకోసం వేసిన బేస్మెంట్ ఎలాంటివి? వాటి పూర్వ తయారిలో వేసిన అడుగులేంటి? అనే విషయాన్ని విమర్శా దృక్పథంతో పరిచయం చేయడమే ఈ వ్యాసోద్దేశం.

2. పాండవులను ప్రతీకారానికి ప్రేరేపించినది:

ముఖ్యంగా ఉద్యోగపర్వంలో శ్రీకృష్ణుడు మూడు భిన్న సందర్భాల ద్వారా శిష్టుల అనుగ్రహం మరియు దుష్టుల నిగ్రహానికి అడుగురాయి వేశాడు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు తనే స్వయంగా దుష్టుల సంహారానికి ముందడుగు వేయడు. దాన్ని శిష్టులచే చేయించాడనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసుకుంటూ పోతాడు.

అందులో మొదటిది పాండవులలో యుద్ధోత్సాహం కలిగించడం. అరణ్య, అజ్ఞాతవాసలను పూర్తిచేసుకుని ఇంద్రప్రస్థానికి చేరుకున్న పాండవులు పదిమూడు సంవత్సరాలు దుష్టత్వంనుంచీ దూరంగా వుండబట్టి వాళ్ళలో కోపం, ద్వేషం, వైరత్వ, ప్రతీకారం ఇవన్నీ నశించిపోయుంటాయి. దీన్ని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు వాళ్ళ మనస్సులో నిరంతరంగా ద్వేషం ఉండేటట్టు-

“వెనక జూదంలో అవమానపాలయిన మీరు ఈ సామ్రాజ్యానికి రాజులు ఎప్పుడవుతారోʼ2

అనే మాటలతో పాండవులకి జరిగిన అన్యాయం, వీరు రాజ్యవంచితులు కావడానికి నెలకొన్న సందర్భం, ద్రౌపదికి జరిగిన అవమానం, పదిమూడు సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సిన సందర్భం… ఇవన్నీ గుర్తుచేసి పాండవుల మనస్సులో ప్రతీకారభావాన్ని చెలరేగిస్తాడు.

తరువాత “సామంగానే సామ్రాజ్యాన్ని అడుగుదాం… ఒప్పుకోకపోతే ఎలాగూ దండం ఉండే ఉంటుంది”3

అని పాండవులు యుద్ధానికి పూనుకునేటట్టు వాళ్ళ మనస్సులని రెచ్చగొడుతాడు. ఇందులో శ్రీకృష్ణుడి అంతరంగం మాత్రం పాండవులు సంధానంకాన్నా సంగ్రామమే కోరుకోవాలి అని మథనపడుతూ వుంటుంది. అందువలనే పాండవుల మనస్సుని ప్రశాంతచిత్తంగా వుండడానికి అవకాశం ఇవ్వడు.

3. సంధానమనే సాకుతో సంగ్రామం నెలకోల్పినది:

ఇక్కడ శ్రీకృష్ణుడుకి పాండవులకి రాజ్యం ఇప్పించడమనేది ముఖ్యోద్దేశం కాదు. శ్రీకృష్ణుడి జన్మకారణంలో శిష్ట రక్షణ అనేది ఒక ఎత్తయితే, దుష్టుల్ని సంహరించాల్సిన పని ఇంకో ఎత్తు. కాబట్టి పాండవులకి సంధాన ద్వారా రాజ్య ఇప్పిస్తే అక్కడ దుష్ట నిగ్రహానికి తావే ఉండదు. కాబట్టి పాండవులకి రాజ్యాన్ని యుద్దంతో ఇప్పిస్తే అక్కడ శిష్ట రక్షణ కూడా వుంటుంది. అలాగే దుష్ట సంహారమూ జరుగుతుంది. అందువలన శ్రీకృష్ణుడు ధర్మరాజు వద్దక్కు వచ్చి ప్రేమగా పలుకుతూ, ʼమీరు ఈ పదిమూడు సంవత్సారాలు చాలా దుఃఖ అనుభవించారనేది నాకు ఎరుకే. మీకు మీ సంతోషాన్ని మళ్ళీ చేకూరించాల్సిన బాధ్యత నామీదే ఉంది.

ʼధర్మరాజు, నువ్వు చెప్పు… దుర్యోధనుడితో సంధానం కావాలో ? సంగ్రామం కావాలో ? నీ అభిమతమేంటి ?  నీవేది కోరితే దాన్నే చేకూరుస్తానుʼ4

అని చెప్పినా కూడా శ్రీకృష్ణుడి మనస్సు మాత్రం ధర్మరాజు సంగ్రామాన్ని ఎంచుకుంటే బావుంటుందని అనుకుంటుంది. కానీ ధర్మరాజు మాత్రం సోదరులవధంతో ప్రయోజన మేముంటుందనే భావంతో సంధానాన్ని కోరుతాడు. అలాగే భీమ, అర్జున, నకుల వీళ్ళలో ఎవరూ సంగ్రామానికి ఇష్టపడకుండ మేమూ కూడా అన్న ధర్మరాజు మాటల మీదే నిలబడతాము అనేస్తారు. కానీ సహదేవుడు మాత్రం ʼదేవా నాకు సంధానం నచ్చదు, సంగ్రామమే నా అభిమతంʼ5 అంటాడు. ఇక్కడ సహదేవుడు అలా చెప్పడానికి వున్న కారణం తను మహా పరాక్రమి అనో, తనకి యుద్ధం అంటే చాలా ఉత్సాహం, ఆసక్తి ఉందనో కాదు. తనకి వుండే దివ్యజ్ఞానం వలన అలా తన అభిప్రాయాన్ని వెలుబుచ్చుతాడు.

అప్పుడు శ్రీకృష్ణుడి అంతరంగ సంతోషిస్తుంది. తను కోరింది ఒక్కరైనా చెప్పారు. కానీ ఐదుగురిలో కేవలం ఒక్కడు సంగ్రామం అంటే మిగతా నలుగురు మాత్రం సంధానం అన్నందువలన శ్రీకృష్ణుడు సంగ్రామం ఏర్పర్చడానికి అవకాశం లేదు. కాబట్టి ద్రౌపదికి కబురంపి ఆమె అభిప్రాయాన్ని కూడా అడుగుతాడు. ఎందుకంటే ద్రౌపది ఎన్నడూ సంధానానికి ఒప్పుకోదు. అక్కడికి వచ్చిన ద్రౌపదికి శ్రీకృష్ణుడు పాండవుల అభిప్రాయాల్ని చెబితె ద్రౌపది ఆవేశంతో ʼపాపిష్ఠాత్ములు సంధానానికి ఒప్పుకుని నన్ను చెంపాశారుʼ6, ʼవీళ్ళు నాను భర్తలు కారు పరమ శత్రువులుʼ7 అంటూ తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతూ, తనకు ప్రియమైన భర్త భీముణ్ణి ప్రచోదిస్తుంది. భీముడు ద్రౌపది కళ్ళల్లో నీళ్ళు చూసిన వెంటనే తను అన్నమాటను వదిలేసి ద్రౌపది తరుపున మాట్లాతాడు. కడకు తానూ సంగ్రామానికి సిద్ధమౌతాడు. ఇప్పుడు ఆరుగురిలో ముగ్గురు సంగ్రామం అంటే ముగ్గురు సంధానం అంటారు. అయినా ద్రౌపది తను కన్నీళ్ళు పెట్టుకుంటూ మిగతావాళ్ళందరినీ సంగ్రామానికి సిద్ధం చేస్తుంది.

ఇక్కడ శ్రీకృష్ణ లోలోపల సంతోషపడుతాడు. కానీ బయట చెప్పడు. ఇది అతనికి కావలిసినదే. సంగ్రామం అనేది పాండవులు ఇష్టంగా కోరిన ప్రక్రియ కానే కాదు. అది శ్రీకృష్ణుడి ఉపాయం వలన, ఆయన ఆడుతున్న నాటకం వలన జరిగింది. శ్రీకృష్ణుడు ధర్మరాజుని అడిగినప్పుడు ʼనువ్వు ఏది కోరితే అది చేకూరుస్తాననేʼ మాటలను గమనిస్తే, ధర్మరాజు కోరింది సంధానం. దాన్ని చేకూర్చవలసింది శ్రీకృష్ణుడి పని. కానీ అక్కడ శ్రీకృష్ణుడికి సంధాన ఇష్టలేకనే అక్కడున్న మిగత పాండవులను అడగడం, ద్రౌపదిని పిలవడం, ద్రౌపది ఏడుపు ద్వారా అందరిని సంగ్రామానికి ఒప్పించడం జరుగుతుంది.

ఇంకో మాటలో చెప్పాలంటే పాండవులనుంచీ వీడ్కోలు చెప్పి వెళుతున్నప్పుడు ఎక్కడ సంధానం జరుగుతుందో అని భయపడుతూ ఉండే ద్రౌపదిని, శ్రీకృష్ణ సముదాయిస్తూ, ʼనీవేమి భయపడకు, నేను సంధానానికి వెళ్ళినా అక్కడున్న వాళ్ళ మనస్సుల్ని రెచ్చగొట్టి సంగ్రామాన్నే ఖాయం చేసుకుని వస్తానుʼ. అన్న హామిలో కూడా శ్రీకృష్ణుడికి సంధానంకన్నా సంగ్రామమే కావలసినది అని తెలుస్తుంది.

ఇలా సంగ్రామమే ఖాయం అయిన తరువాత దుష్ట సంహారానికి శ్రీకృష్ణుడు మూడు పతకం వేసుకుంటాడు.

దుష్ట సంహారాన్ని తనే స్వతః చేయలేడు, కాబట్టి తనకు అనుకూలంగా పని చేసేవాళ్ళకి మద్దతుగా వుంటానని హావమి ఇవ్వడం, వాళ్ళకి తగిన అన్ని శక్తి సామర్థ్య బలం చేకూర్చే ప్రయత్న చేస్తాడు. అలాగే వాళ్ళకి అనుగ్రహం ఇస్తాననీ హామి ఇస్తూ వాళ్ళను యుద్ధానికి సన్నద్ధం చేయడం మొదటిది.

రెండవది: దుష్టకూటంలో వున్న ప్రతి ఒక్కరికూ ఒక్కో తరహ భీతి కలిగించేది.

మూడవది: దుష్టకూటంలో వున్న బలాన్ని ఒక్కొక్కటిగా తెంచుకొని పోవడం. లేక వాటిని నాశం చేస్తూ వెళ్ళడం.

ఈ మూడు సంగతులను శ్రీకృష్ణుడు ఎవరికీ తెలీకుండా చేస్తూ వేళ్తాడు.

ఇక్కడ పాండవులకు మద్దతు ఇవ్వడం, అనుగ్రహం ఇవ్వడం అనేది వాళ్ళ మీద ఉండే ప్రేమంకన్నా తన అవతార కార్యోద్దేశం పూర్తి చేసుకోవడానికి ఇది అనివార్యంగా చేయాల్సిన పనే తప్ప ఇదే ముఖ్య ఉద్దేశం కాదు. అతని ముఖ్య ఉద్దేశమే దుష్టుడైన దుర్యోధనుడి అవసానంకోసం. అయినా శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఏ విధంగానూ శత్రువు కాదు. వీళ్ళిద్దరి మధ్యా ఎటువంటి కలహాలూ లేవు. కాబట్టి అతణ్ణి సంహరించాలంటే అతనికి వుండే ఏకైక మార్గమంటే పాండవులను తనవైపు తిప్పుకోవడం మరియు వాళ్ళ తరుపున పోరాడడం అనివార్యమౌవుతుంది.

దుష్టసంహారం శ్రీకృష్ణుడి ప్రధాన ఆశయం అయినా దాన్ని పరోక్షంగానే నిర్వర్తించాలి. ఎదురెదురుగా ఏ కారణాలూ లేకపోవడంవలన ద్రౌపది మానభంగాన్ని తన పావుగా తీసుకుంటాడు. అలాగే జూదంలో ఓడిపోయిన సంగతులనూ కూడా తనకు ప్రయోజనకరంగా మార్చుకుంటాడు. దీని ద్వారా పాండవుల మనస్సులో దుర్యోధనుడి మీద బద్ధ శత్రుత్వం కలిగేలా చేస్తాడు. ఇవన్నీ ఎవరికీ తెలీకుండానే నడపిస్తాడు.

పాండవుల మనస్సుని యుద్దానికి సిద్ధం చేసిన తరువాత శ్రీకృష్ణుడు చేయవలసిన పని ఇంకా రెండు మిగిలాయి. అవేమిటంటే దుష్టకూటంలో భయభీతిలు కలిగేలా చేయడం. కాబట్టి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి వాళ్ళలో భయాన్ని కూడా కలిగించి వుంటాడు. కానీ భయం ఒక్కటే దుష్టసంహార కాదు. అనేది శ్రీకృష్ణుడికి ఎరుకే. అందువలన దుష్టశక్తిని అంచనా వేసి దుష్టకూటంలో వున్న ఒక్కొక్క వీరుణ్ణి నిర్వీర్యం చేసుకుంటూ పోతే మాత్రం తన ఉద్దేశం సఫలమౌతుంది అనే జ్ఞానం శ్రీకృష్ణుడుకి ఉంది.

ఇక్కడ దుర్యోధనుడి శక్తి అంటే బలరామ, ద్రోణ, అశ్వత్థామ, విధుర, కర్ణ, భీష్మ.. మొదలగు అందరినీ మానసికంగానో లేక, ఇంకో విధంగానో తొలగించడానికి ఉపాయం పన్నుతాడు.

4. విదురుణ్ణి దుర్యోధనుడి నుంచీ వేరు చేసినది:

బలరాముణ్ణి కేవలం ఒక గోహత్యతో తీర్థయాత్రకు పంపే పనిలో సఫలమవుతాడు. ఇక్కడ శ్రీకృష్ణ మరియు బలరామ ఇద్దరూ అన్నదమ్ములైనా శ్రీకృష్ణుడికున్నంత కారణజన్మోద్దేశం బలరాముడికి లేదు. కాబట్టి బలరాముడు అక్కడ ఏదైనా అన్యాయం జరుగుతుందంటే అడ్డుకుంటాడనే భయంతో శ్రీకృష్ణుడు బలరాముణ్ణి తీర్థయాత్రకు వెళ్ళేటట్టు చేస్తాడు. ఇక్కడ దుర్యోధనుడి బలాన్ని తొలగించే ప్రయత్నంలో గోహత్యా దోషం అనేది ఒక సాకు మాత్రమే. ఇది శ్రీకృష్ణుడి పతకంలో ఒక భాగమే తప్ప బలరాముడి దోషం కాదు. ఇలా దుర్యోధనుడి సైన్య బలగాన్ని క్రమేపి దుర్బలం చెస్తూ వెళ్తాడు.

అందులో ఇంకో సందర్భం అంటే దుర్యోధనుడి బలగం నుంచీ విదురుణ్ణి తొలగించడం. సంధి అనే సాకుతో హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు నేరుగా విదురుడి ఇంటికి వెళుతాడు. కానీ ఇటు చక్రవర్తియైన దుర్యోధనుడు శ్రీకృష్ణుడు తన అంతఃపురం ఆతిథ్యం స్వీకరించాలని అన్నీ ఏర్పాట్లను చేసుంటాడు. ఇది తెలిసినా శ్రీకృష్ణడు మాత్రం నేరుగా విదురుని ఇంటికి వెళ్ళడం కృష్ణుడికి విదురుడి మీద ఉన్న అపార ప్రేమమూ కాదు, విదురుడి ఇంటిలో ఆతిథ్యం స్వీకరించాలనే ఉద్దేశంతూనూ కాదు. దీనివలన దుర్యోధనుడు కోప్పడతాడు ఆ కోపంతో ʼదేవా మీరు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించకుండా ఆ అవివేకి దాసిపుత్రుడి ఇంటికి వెళ్ళి ఆకలి తీర్చుకున్నారుʼ8 అంటాడు. అవివేకి దాసీపుత్రుడు అనే మాటలు దుర్యోధనుడి నోటినుండి రావాలి, అలా వస్తే అవమానానికి గురియైన విదురుడు, ʼకలిభీముడు నీ తొడలను విరిచి నిన్ను చంపుతున్నప్పుడు కాపాడాలనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ నీ నోటినుండి ఇలాంటి మాటలు విన్న తరువాత కూడా అలా చేయదలచుకోలేదుʼ9 అని తన విల్లుని విరగొట్టి వెళ్ళిపోతాడు. ఇది కృష్ణుడికి చాలా అవసరమైన సందర్భం.

ఇక్కడ శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఇంటికి ఆతిథ్యానికి రాలేకపోయినందుకు శ్రీకృష్ణడు ఇచ్చే నెపం - ʼశత్రువుల ఇంట భోజనం చేయకూడదుʼ10 అనేది. ఇక్కడ దైవీపురుషడైన కృష్ణుడికి అవి చెప్పే మాటలే కావు. కానీ తను రాలేను అనడంకన్నా ఇలాంటి నెపంతో హస్తినాపురంలో వున్నవారినీ సమాధానం చేసినట్టూ అవుతుంది, విదురునికీ కూడా సంతోషం పరచినట్టూ అవుతుంది. అలాగే దుర్యోధనుడి ఒక బలాన్ని విరగొట్టినట్టూ అవుతుంది. ఇది కృష్ణుడి తంత్ర భేదంలో ఒక భాగం.

ఎందుకంటే విదురుడు దుర్యోధనుడి తరపున యుద్ధం చేసేది ఖాయం అయితే పాండవులకి గెలుపు అసాధ్యం. ఇది తెలిసిన శ్రీకృష్ణడు ఇలా భేదోపాయంతో వేరు చేయడంలో సఫలమవుతాడు. ఇది డివైడ్ అండ్ రూల్ లా కనిపించక పోయినా కూడా అదే విధంగా జరిగింది. అలాగే దుర్యోధనుడు చెప్పిన ʼశత్రువుల తరుపున సంధికోసం వచ్చి, మాలో ద్వేషం రగలించి వెళదామని వచ్చావా వెధవ యాధవాʼ11 అనే మాటల్లోనూ శ్రీకృష్ణుడి మర్మం కనబడుతుంది.

5. శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శన:

అలానే సంధికోసం వచ్చినట్టు నటించినా అక్కడ చేయవలసిన పని అంతా పూర్తి చేసుకుని వెళ్ళాలనే కాంక్ష మాత్రం  కృష్ణుడిలో గాఢంగా కనిపిస్తుంది. కాబట్టి సంధానమనే సాకుతో దుర్యోధనుడికి మద్దతుగా వుండే ధృతరాష్ట్ర మరియు అక్కడున్న చాలా మంది రాజుల్ని భయభీతుల్ని చేసి వెళ్ళడం అతని ప్రధానోద్దేశం కూడా. అందువలన వారిని మాటలతో కెలకి దుర్యోధనుడికి కోపం తెప్పిస్తాడు. కోపం రావాలనే ఉద్దేశంతో ఇలాచేసి తరువాత దుర్యోధనుడు కోపంతో శ్రీకృష్ణుణ్ణి బంధించాలని ఆరాట పడినప్పుడు అంధుడైన ధృతరాష్ట్రునికి కళ్ళు ప్రసాదించి ʼఆస్థానపు ఘనతేజము లహరి మిగిలందున హరి అగుపించాడు నిరుపమ విశ్వరూపముతోʼ12 ఇలా తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. అప్పుడు తన విశ్వరూపాన్ని చూసినవారందరూ భయభీతులవుతారు. ఇది కూడా శ్రీకృష్టుడు దుర్యోధనుడి పక్కనున్న చాలా మంది రాజులకి మరియు వీరులకి హెచ్చరికలా అనిపిస్తుంది. ఇవన్నీ దుర్యోధనుడి పక్కనున్నవాళ్ళకు భయపెట్టే ఉద్దేశంతో చేసిన తంత్రాలే.

6. కర్ణుడి మనస్సులో నాటిన ద్వంద్వం:

దుర్యోధనుడి ఆప్త స్నేహితుడైన కర్ణుడిని దుర్యోధనుడి నుండి వేరు చేయడం కృష్ణుడికి చాలా ముఖ్యమైనది. దానికి కృష్ణుడికి చాలా మార్గాలున్నాయి. అందులొ మొదటిది కర్ణుడి జన్మరహస్యం, రెండవది కర్ణుడి తల్లి కుంతీదేవి. ఈ రెండు అస్త్రాలను ప్రయోగిస్తే చాలు కర్ణుడి పని ఖతం అవుతుంది. కాబట్టి సంధానానికి వచ్చిన కృష్ణుడు తిరిగి ద్వారకా వెళ్ళేటప్పుడు తనకు తోడుగా రావాలని కర్ణుణ్ణి పిలుస్తాడు. అభశుభ తెలియని కర్ణుడు కృష్ణుడితో రథంలో వెళుతున్నప్పుడు కృష్ణుడు ʼఇనతనూజనితో మరిదిబంధం సరసపు మాటలతోʼ13 ʼకుంతిదేవి ఐదు వరాల్లొ మొదటి బిడ్డవే నీవుʼ14 పాండవులు నీకు సోదరులు అని చెప్పడంవలన కర్ణుడి మనస్సు ద్వంద్వంలో పడిపోతుంది. తరువాత కృష్ణుడు ʼఅందరికీ అగ్రుడైన నువ్వు పోయి దుర్యోధనుడి ముందు చైచాపడం ఎంతవరకు న్యాయంʼ15 అని చెప్పి తన మాటలను కొనసాగిస్తూ ʼనువ్వు వస్తానంటే నిన్న ఈ రాజ్యానికి మహారాజుణ్ణి చేస్తానుʼ అనే ఆమిషం అతని ముందుంచి అతని మనస్సులో భేదాన్ని మరియు ఆశను నాటుతాడు. కానీ కర్ణుడు పాండవులతో కలిసిపోవడం కృష్ణుడికి ఇష్టంలేదు. కాబట్టి కర్ణుడు ఇంకా మనోమథన పడుతున్నప్పుడే ʼనువ్వు వస్తే చాలా సంతోషం, రాకపోయినా…ʼ16 అని చెప్పడంలో పాండవులకి ఏ రకమైన హాని జరగకూడదనే ఆశయం వున్నా, పాండవుల ద్వారా దుష్ట సంహారం చేయాల్సిన పనివుంది కాబట్టి ఏక కాలంలో దుర్యోధనుడి బలం, బలగాన్ని హరిస్తూ పాండవుల రక్షణ కూడా చేస్తూ వస్తాడు.

కర్ణుడి మనస్సుకు జన్మరహాస్యం చెప్పినా కర్ణుడు దుర్యోధనుడి నుంచీ బయటకొస్తాడనే నమ్మకం కృష్ణుడికి లేదు. కాబట్టి ఇంకో అస్త్రం వదులుతాడు. అదే కుంతీదేవి. కృష్ణుడే కుంతీదేవికి చెప్పి పంపి కర్ణుడినుండి ఒకసారి వాడిన శరాన్ని మళ్ళివాడకుండా వుండేటట్టు మాట తీసుకురావాలని ఒత్తిడి చేసి పంపించి అందులోను సఫలమవుతాడు.

7. ఉపసంహారం:

  • మొత్తానికి శ్రీకృష్ణుడు ఉద్యోగపర్వంలో దుష్ట సంహారమే ప్రధాన ఉద్దేశంగా భావించి దానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తూ పాండవుల్నీ యుద్ధపరంగా చేసినది, బలరామ, విధుర, కర్ణుణ్ణి, దుర్యోధననుండీ ఆంశికంగా వేరు చేసినది కనిపిస్తుంది.
  • ఇక్కడ శ్రీకృష్ణుడికి పాండవుల బలం మీద నమ్మకం లేదనిపిస్తుంది. ఒకవేళ పాండవులు బలవంతులు, పరాక్రమశాలులే అయివుంటే దుర్యోధనుడి పక్కనున్న వీరుల్నీ ఇలా ఒక్కొక్కటే తెంపాల్సిన పని వుండదు.
  • కొన్ని సారి బలాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ జయం లభించదు. ఉపాయం, తెలివి వున్నవాడు మాత్రమే నెగ్గుతాడు అనేది ఇందులో ప్రధానాశయం. ఇవన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు నిజానికి ఆదర్శప్రాయుడు.

8. సూచికలు:

  1. కుమారవ్యాస భారత సంగ్రహం, పుట 5
  2. పైదే, పుట 101
  3. పైదే, పుట 301
  4. పైదే, పుట 315
  5. పైదే, పుట 318
  6. పైదే, పుట 318
  7. పైదే, పుట 324
  8. పైదే, పుట 338
  9. పైదే, పుట 338
  10. పైదే, పుట 339
  11. పైదే, పుట 345
  12. పైదే, పుట 348
  13. పైదే, పుట 353
  14. పైదే, పుట 354
  15. పైదే, పుట 355
  16. పైదే, పుట 356

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. తరీకరె రహమత్ (2004), కుమారవ్యాస భారత సాంస్కృతిక ముఖాముఖి, ప్రసారాంగ, కన్నడ విశ్వవిద్యాలయం, హంపి.
  2. పుట్టప్ప కె.వి., వెంకటేశ  అయ్యంగార్ మాస్తి  (1958), కర్ణాట భారత కథామంజరి, మైసూరు సంస్థాన సాహిత్య మరియు అభివృద్ధి శాఖ, మైసూరు.
  3. బిదరకుంది శామసుందర్  (2004), కుమారవ్యాస కన్నడ భారత, కర్నాటక సాహిత్య అకాడెమి, బెంగళూరు.
  4. శామాశాస్త్రి ఆర్ (1922), ఉద్యోగపర్వం, మైసూరు ప్రభుత్వ ముద్రణశాఖ, మైసూరు.
  5. సీతారామయ్య  ఎం.వి.(1990), కుమారవ్యాస భారత సంగ్రహం, బి.ఎం.శ్రీ స్మారక ప్రతిష్ఠాన, బెంగళూరు.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]