AUCHITHYAM | Volume-06 | Issue-03 | March 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. తెలుగు నవలలు: గిరిజన పండుగలు
డా. కె. మమత
సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ
భద్రుక కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్, కాచిగూడ,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9440402691, Email: mamathatelugu1@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.02.2025 ఎంపిక (D.O.A): 28.02.2025 ప్రచురణ (D.O.P): 01.03.2025
వ్యాససంగ్రహం:
శతాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో గిరిజన జీవితాలను రచనల్లో చూపకుండా ఏ సాహిత్య ప్రక్రియ కొనసాగలేదు. పద్యం, గద్యం, వచనంలతోపాటు ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ నవల నాటకం మొదలైన అనేక ప్రక్రియలు ప్రధాన వస్తువుగానో, ఉపవస్తువుగానో గిరిజన జీవితాలను సృష్టించినవే. గిరిజన గురించి పాఠకులకు పరిచయం చేస్తూ తమ సామాజిక బాధ్యతను అద్భుతంగా నెరవేర్చిన కొందరు రచయితలు గిరిజన పండుగలు, జీవితాలు వస్తువుగా నవలలు రాశారు. అందులో లంబాడోళ్ళ రామదాసు, కొమరం భీమ్, అతడు అడవిని జయించాడు, అడవి, సంఘం సరిహద్దు, రాగో ?చివరి గుడిసె, ఊరు పునరావాసం, అడవి తల్లి, ఎల్లి మొదలైన నవలలు గిరిజన జీవితాలను అందులోని పండుగలను వాస్తవికతకు దగ్గరగా చూపాయి. ఈ రచయితలు గిరిజన జీవితాలను వారి పండుగలను ఎంత సహజ సిద్ధంగా సాహిత్యంలో చూపారో తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం.
Keywords: గిరిజన పండుగలు, గిరిజన సాహిత్యం, గిరిజన జీవన విధానం, లిఖిత సాహిత్య పాత్ర, కథ,నవల ప్రక్రియలు
1. సాహిత్యం గిరిజన ప్రస్తావన:
నన్నయ్య మొదలు అనేక మంది ప్రాచీన కవులు తమ రచనల్లో గిరిజన జీవితాల ప్రస్తావన చేశారు. నన్నయ్య ఆది సభా అరణ్య పర్వాల్లో ‘అరణ్య నివాసులు, పర్వత నివాసులు’ అనే పదాలను ప్రయోగించాడు. తిక్కన, శ్రీనాథులు ఇటువంటి ప్రస్తావనే చేశారు. తిక్కన ద్రోణ, శాంతి, అనుశాసనిక, అశ్వమేథ, మౌసల పర్వాల్లో గిరిజనుల్ని గూర్చి వర్ణిస్తూ కిరాత, శబర, బోయ, లుబ్ధ, నిషాద శబ్దాల్ని ప్రయోగించాడు. ఎఱ్ఱన ధర్మవ్యాధోపాఖ్యానంలో గిరిజనుల గురించి చెప్పాడు. పాల్కురికి సోమనాథుడు ‘పండితారాధ్య చరిత్ర’ బసవపురాణంలో చెంచుల నడకల్ని వేట విధానం గూర్చి చెప్పబడిరది. శ్రీనాథుడు ‘శివరాత్రిమహాత్మ్యం’లో సుకుమారుని వృత్తాంతాన్ని వర్ణించాడు. రామాయణంలో పేర్కొన్న వాలి, సుగ్రీవులు మొదలైన పాత్రలు గిరిజన పాత్రలే. ఈ విధంగా ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజన ప్రస్తావనలు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తున్నాయి.
2. ఆధునిక సాహిత్యంలో నవల - గిరిజన అంశాల ప్రస్తావన:
సాహిత్యంలో నవల పరంగా నరహరి గోపాలకృష్ణమ సెట్టి రాసిన శ్రీరంగరాజ చరిత్రతో గిరిజన ప్రస్తావన ప్రారంభమైంది. ఆ తర్వాత గిరిజన జీవితాలను పూర్తిగానూ అరకొరగానూ చిత్రించిన నవలలు ఉన్నాయి. గిరిజన జీవితాల్లోని సంస్కృతిని సంప్రదాయాన్ని చిత్రించిన మొదటి నవల కొర్రపాటి గంగాధరరావు రాసిన ‘‘లంబాడోళ్ళ రాందాసు’’ వట్టికోట ఆళ్వారు స్వామి ‘‘గంగు’’ నవలలోనూ గిరిజన ప్రస్తావన కన్పిస్తుంది.
3. నవల - గిరిజన పండుగలు:
మానవుని సంస్కృతి, సంప్రదాయాలలో పండుగలు ప్రధానపాత్ర పోషిస్తాయి. ఆయా పండుగలను జరుపుకునే సందర్భంలో మానవుడు ఆశ్రయించే వస్త్రధారణ నైవేద్యాలు ఆహారపు అలవాట్లు నృత్యం వాయిద్యాలు మొదలైన వారిని పండుగల ప్రాధాన్యతను తెలియజేస్తాయి ఈ క్రమంలో గిరిజనుల పండుగలను పరిశీలిస్తే అవి మరింత వైవిధ్యంగా కనిపిస్తాయి.
3.1 కొత్తల పండుగ:
అట్టాడఅప్పలనాయుడు రాసిన ‘పునరావాసం’ నవలలో ‘‘కొత్త పంటలు వచ్చాక కొత్తల పండుగ చెయ్యందే పంటలు తినరెవరూ’’ కొత్తలపండుగ అంటారు. దీన్ని దీసరి ముహూర్తం చూసి పండుగరోజు నిర్ణయిస్తాడు. వలసల్లో పురోహితుడా దీసరా! దీసరి నిర్ణయించిన రోజున ఆ వలసవాళ్ళు ఆ రోజు కొత్తల పండుగ జేసి ఆ రోజు నుంచి కొత్త పంటల్ని తినడం ఆరంభిస్తారు.
“ఎంత కరువుతో కాలిపోతున్న కొత్తల కలవందే వంటల్ని తినమారంబించరు యెవరూ గూడా! పంటలు పండటానికి కారణం దేవతలు దయగా చూడటమేనని భావిస్తారు వీళ్ళందరూ. దేవతలే యిచ్చేరని తలుస్తారు’’ అంటాడు రచయిత.
కాబట్టి ఏ గిరిజన తెగ వాళ్ళైనా ఎంతో ఐక్యత కలిగి ఉంటారని అర్థమవుతోంది. పంటలు సరిగ్గా పండకపోతే తమ తప్పిదం ఏదో ఉందని అభిప్రాయం ప్రతి గిరిజనుడిలో ఉంటుంది. అందువల్ల దేవతల పేరు మీద ఇటువంటి పండుగలను జరుపుకుంటుంటారు.
ఈ విధంగా రచయిత అప్పలనాయుడు గిరిజనులలో కొత్తల పండుగ ప్రాధాన్యాన్ని ‘పునరావాసం’ నవల ఆధారంగా తెలియజేశాడు.
3.2 గుస్సాడి పండుగ:
వసంతరావు దేశ్ పాండే రాసిన ‘అడవి’ నవలలో ‘‘గోండులకు ఇష్టమైన గొప్ప పండుగ గుస్సాడి సండుగ’’ ఈ కార్తీక మాసంలోనే వస్తుంది. సాడికి ఘముందే దసరా పండుగ నుండి దండోరా వేయడం మొదలవుతుంది. ఒక ఊరి నుండి గోండులు ఇంకొక ఊరికి వెళ్ళి దండోరా వేస్తారు. ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్ళినప్పుడు ముందుగా ఈ ఊరి ‘మహాజన్’ ఇంటికి వెళ్ళి దండోరా వేస్తారు. మహాజన్ భార్య వారికి ధాన్యం, డబ్బులు ఇస్తుంది. దండోరాకు ‘తాషా’ అనే చిన్న నగరా వాయించుతారు. ఘసాడికి డప్పులుంటాయి. జంగు గుస్సాడి వేషం కట్టడానికి వీలుగా గోచి బిగించి పై నుండి నల్లటి ‘ఘగ్ర’ వేసుకున్నాడు. దేవు మెత్తటి సుద్దను జంగు ఒంటికి పూతగా రాసాక, జంగు గొలుసులతో ఒంటిపై నున్న తడి సుద్దపై వంకీలు పెట్టుకుంటున్నాడు. మసితో కనుబొమలు అవీ దిద్దుకున్నాడు అని వేషధారణను వర్ణిస్తాడు రచయిత.
అంతే కాకుండా ‘‘ఆడ, మగ, పిల్లా, పాప, ముసలి, ముతక అందరికీ గుస్సాడి పండుగంటే ఇష్టం. వారం పదిరోజులసాగే ఈ పండుగలో వారు తింటారు, తాగుతారు, ఆడతారు, పాడుతారు అందుకే ఈ పండగంటే అందరికి ఇష్టం’’ అనే వాక్యాల్లో గిరిజనులకు గుస్సాడి పండుగతో ఉండే అనుబంధాన్ని చెప్పాడు నవలాకారుడు.
“దండారీ నృత్యాలన్నిటిలోను ముఖ్యపాత్రధారులు గుసాడీలు. వీరి ప్రతి నృత్యకారులు చుట్టు కాపలా కాస్తున్నట్టు తిరుగుతూ ఆడతారు. వీరి ఒంటి నిండా బూడిద పూసుకుని, మధ్య మధ్య సున్నం బొట్లు పెట్టుకుంటారు. కళ్లకు చుట్టూ కూడా సున్నంతో గీతలతో అలంకరిస్తారు. నెమలి ఈకలతో అలంకరించిన టోపీ ధరిస్తారు’’ అనే వాక్యాల ద్వారా గుస్సాడి పండుగను నవల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు.
3.3 పొల్వ పండుగ:
దీన్ని గోండులు ప్రతి ఆదివారం చేసుకుంటారు. వారు ఏడు రోజులు పనిచేసీ, చేసి అలసిపోయివుంటారు. దానితో ఈ పండుగ పేరు మీద విశ్రాంతి లభిస్తుందనుకుంటారు. ఈ పండుగ రోజు గూడెంలోని వారు ఎవరు కూడా పనులకు పోరు. ఒకవేళపోతే శిక్షలు వేసే సంప్రదాయం ఉంటుంది. సాధన రాసిన ‘రాగో’ నవలలో-
‘‘విజ్జ పండుగ (విత్తనాలు అలికే పండుగ) చేయనిదే అసలు భూమిలో విత్తువేయరు ఆదివాసీలు. కానీ ఈ యేడు ఈ పట్టింపు లేవీ చెల్లవనీ ఆ పండుగలు, మొక్కుబళ్ళు ఓపిగ్గా తరువాత చేసుకోవచ్చుననీ తీర్మానించుకున్నారు. ఊళ్ళోకి ఇతర కులస్తులు పోల్వ నాడు పొలం పనులకి, అడవి పనులకి పోతే మాడియా పెద్దలు దండుగలేసేవారు. కానీ ఈ వేళ పోల్వలే వాయిదా వేసుకుంటున్నారు. అవసరాలే అన్ని మార్పుల్పి ముందుకుతోస్తాయి’’ అన్నారు.
దీన్ని బట్టి గోండులలో పొల్వపండుగ ఆచారం క్రమ క్రమంగా తగ్గుతోందని అర్ధమవుతోంది. నిరంతరంగా వస్తున్న సంప్రదాయాన్ని గోండులు క్రమ క్రమంగా తక్కువగా ఆచరిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు.
3.4 ఆకాడి పండుగ:
వర్షారంభమైన తర్వాత నేలపైన పచ్చని గడ్డి మెలిచి ప్రకృతి శోభాయమానంగా కనిపించినప్పుడు అకాడి పండుగ చేస్తారు. ఆషాడ మాసంలో ఆ పండగను జరుపుకుంటారు. సాహు? అల్లం రాజయ్య లు రాసిన ‘కొమురం భీము’ నవలలో ఈ పండుగ జరుపుకునే విధం చిత్రించబడిరది. నవలలో ఓ సందర్భంలో ‘‘ఇవ్వాళ చేయబడుతుందని’’ చిన్ను దండోరా వేయించాడు. అది ముందే తెలిసిన వాళ్ళు చాలామంది చీకటితోనే లేచిపోయి దగ్గర్లోని షావుకార్ల దగ్గర అప్పు పెట్టి జొన్నలు తెచ్చుకున్నారు.
‘‘అకాడి దేవర మమ్ముల సల్లంగ చూడు తల్లి.. ఇయ్యేడు పంట బాగా రావాలె. తల్లి నువ్వు దయ తలిస్తేనే మేం బతికేది’’ అనే వాక్యాలు పండుగతో పాటు ఆనాటి కరువు పరిస్థితులని తెలుపుతున్నాయి. ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఎందుకంటే వ్యవసాయపు పనులు ఈ పండుగతోనే ప్రారంభమవుతాయి. అందువల్ల కోళ్ళు, మేకలు కోసి దేవత పేరుమీద కోసి తింటారు. ఈ విధంగా సాగుతుంది నవలలో అకాడి పండుగ వర్ణన.
3.5 గువర్ పండుగ :
అట్టాడ అప్పలనాయుడు రాసిన “పునరావాసం” నవలలో ఈ పండుగను గురించి తెలియజేయడం జరిగింది. దీన్ని సంవత్సరానికి ఒక్కసారి గానీ, రెండు మూడేండ్లు కొకసారిగాని చనిపోయిన వ్యక్తుల బంధువుల తృప్తికొరకు సవరలు చేసుకొనే పండుగ. ప్రతిసారి అంతకు పూర్వం జరిగిన గువర్ పండుగనాటి నుండి అప్పటి వరకున్న చనిపోయిన బంధువుల ప్రేతాల తృప్తి కొరకున్న వారిని పెద్దలతో కలుపుటకు ఈ గువర్ పండుగ చేసుకొంటూ ఉంటారు. ‘పునరావాసం’ నవలలో ఓ సందర్భం లో ‘చనిపోయిన వారికి తాము వాడిన వస్తువులు అవసరం వుంటుందని, ఏ లోకంలో వున్నా వీటికోసం వాళ్ళు ఇబ్బంది పడగూడదన్న ఆలోచనతో ఇవన్నీ ఆ కుందిరిలో వుంచుతారు’. గిరిజనుల నమ్మకమది. ఆ తర్వాత ముహూర్తంచూసి, తొమ్మిదో రోజున గానీ, పదకొండవ రోజున గానీ అస్థికలు పాతే స్థలం ఒక్కో దగ్గర కేటాయించి వుంటుంది. అక్కడ అస్థికలు పాతుతారు. అలాగే చనిపోయిన వారి జ్ఞాపకార్ధం ఊరిబయట శిలాఫలకం పాతే చోటు వుంటుంది. అక్కడ రాయిని పాతి ‘గువర్’ పండుగ చేస్తారు. ఈ విధంగా నవల రచయిత గువర్ పండుగను నవలలో తెలియజేశారు.
3.6 హోలీ పండుగ:
బంజారాలు జరుపుకునే హోళీ పండుగ విశేషాలను తెలుపుతూ కొర్రపాటి గంగాధర్ రావు రాసిన ‘లంబాడోళ్ళ రాందాసు’ నవలలో ఈ విధంగా హోళీ చిత్రణ కనిపిస్తుంది.
‘‘హోళి పండుగను తాండా వాళ్ళు పెద్ద ఉత్సావంలాగా చేసుకుంటారు. ముందు పన్నెండు రోజులూ ప్రయత్నాలకే సరిపోతుంది. మనసులో అణిగి మణిగి ఉన్న సరదాలకూ, సరాగాలకూ రెక్కలు వచ్చి స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళే పండుగ అది. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఇక్కా పులుముకుంటూ పాటలతో, ఆటలతో మాటునున్న ప్రియురాళ్లను మెప్పించే కాలమది. ఆ పండుగ నాడు కొరచూపులు సావు వేస్తాయి. హోలీ రోజు ఒక్కొక్కళ్ళకి రంగు నీళ్ళ ధారల్లోంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకోవడమే కష్టమౌతుంది. పెద్దవాళ్ళు లయబద్ధంగా పల్లవిపాడుతూ షికార్లకిస్తారు. చరణాలు అందుకుంటూ పడుచుపిల్లలు పరుగెత్తుకు వెళ్ళి పారిపోతున్న స్త్రీ పురుషుల మీదా రంగు నీళ్ళు చిమ్ముతారు. చిమ్మటం ఎంత సరదాయో, పట్టుదలగా పారిపోవటం కూడా అంతే సరదా.. పెద్దవాళ్ళు కూడా పసిపిల్లలై ప్రవరిస్తారు.” అంటూ బంజారాల పండుగలలో హోళీ ప్రత్యేకతను తెలిపాడు రచయిత.
4. ఉపసంహారం:
- మనదేశంలో గిరిజనులది ఒక ప్రత్యేకమైన జీవనవిధానం. వేషభాషలు, కట్టుబొట్టు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందులో పండగలు అనేవి మరింత ప్రత్యేకమైనవి. ఇది వారి సంస్కృతిని మరింత దగ్గరగా చూపుతాయి. అటువంటి పండుగలు సాహిత్యంలోకి నవల రూపంలో దర్శనం ఇవ్వడం ఒక మంచి విషయం.
- ఇందుకు తెలుగునాట అనేకమంది రచయితలు కృషి చేశారు. వారి వారి నవలలలో గిరిజనుల పండుగలను గురించి ప్రస్తావించడం, విశ్లేషించడం ద్వారా గిరిజనేతర సమాజాలకు ఆయా తెగల సంస్కృతి సాంప్రదాయాలు పట్ల మరింత గౌరవం అభిరుచి ఆసక్తులు పెరిగాయనటంలో సందేహం లేదు.
- విభిన్న జీవన విధానాలే ఆయువుగా జీవిస్తున్న గిరిజనుల పండుగల వైశిష్టం ఈ నవలల ద్వారా బాహ్య ప్రపంచానికి వాస్తవిక కోణంలో పరిచయమైందని భావించవచ్చు.
- ఇటువంటి గిరిజన అంశాల వస్తువులతో మరిన్ని నవలలు రావాల్సిన ఆవశ్యకత తెలుగు సాహిత్యంలో మిగిలి ఉంది.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పలనాయుడు, అట్టాడ. పునరావాసం (నవల). శ్రీకాకుళ సాహితి, శ్రీకాకుళం, 1999.
- రాజయ్య, అల్లం & సాహూ., కొమురం భీము. Perspectives Publishers, హైదరాబాద్, 2013
- సాధన- రాగో నవల. సృజన ప్రచురణలు. 1996.
- గంగాధరావు, కొర్రపాటి. లంబాడోళ్ళ రామదాసు. రాజకీయనవల. 1972.
- రవికుమార్, దుప్పల. దోపిడీకి గురవుతున్న గిరిజనం. పునరావనం నవలాసమీక్ష. జూన్ 27, 2008. లింకు
- సాధన. ధారావాహిక నవలలు. రాగో(నవల), నెచ్చెలి అంతర్జాల వనితామాసపత్రిక. జూలై, 2020.
- సాధన. నా రాగో మా మాస్టర్ కే అంకితం. అరుణతార మాసపత్రిక, నవంబర్ 1997.
- పాణి. రాగో మనకేం చెబుతోంది?. కొలిమి. May, 2020. లింకు
- జి. వెంకటలాల్. కొర్రపాటి గంగాధరరావు నవలానుశీలన. సిద్ధాంతగ్రంథం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, 2008.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

