headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-06 | Issue-02 | February 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. కేతు విశ్వనాథరెడ్డి కథలు: రైతుసమస్యల చిత్రణ

గంధం అశోక్ కుమార్

పరిశోధకులు, తెలుగుశాఖ,
యోగివేమన విశ్వవిద్యాలయం, వేమనపురం,
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9542414559, Email: ak5774747@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 04.01.2025        ఎంపిక (D.O.A): 28.01.2025        ప్రచురణ (D.O.P): 01.02.2025


వ్యాససంగ్రహం:

రాయలసీమ సమస్యలపై తమ కలంతో గళం విప్పిన రాయలసీమ తొలి తరం కథా రచయితలలో కేతు విశ్వనాథ రెడ్డి ముఖ్యులు. వీరు రాయలసీమ సమాజం గురించి రచించిన కథలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వాటిని ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ అనే పేరుతో సంపుటిగా వెలువరించారు. ఈ కథలు రాయలసీమ ప్రజల జీవనస్థితి గతులు, మరీ ముఖ్యంగా కడపజిల్లా ప్రజల జీవనవిధానం పాఠకులకు కళ్ళముందు కనపడేలా చేస్తాయి. సామాన్యప్రజలు, కూలీలు, రైతులు, మతవిషయాలు, స్త్రీసమస్యల వంటి సామాజికాంశాలను ఈ కథలల్లో ప్రధానాంశాలు. రచయిత తన రచనల ద్వారా ఆనాటి రాయలసీమ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ కథల్లో రాయలసీమ రైతుల జీవనవిధానం చిత్రించిబడిన తీరును ఈ వ్యాసం వివరిస్తుంది. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ సంపుటి ఈ వ్యాసానికి ప్రధాన ఆకరం. ఆచార్య డా. కె. శ్రీదేవి రాసిన ‘విస్తృత జీవితానుభవం నిర్దిష్టసైద్ధాంతిక బలం కేతు’ అనే వ్యాసం, డా. డి. ప్రవీణ రాసిన ‘నమ్ముకున్ననేల కథ - ప్రధానపాత్రల చిత్రణ’ వంటి వ్యాసాలు ఈ పరిశోధనకు ద్వితీయ విషయసామగ్రి. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొనే కష్టాలు, కుటుంబజీవనం కోసం రైతులు కూలీలుగా మారడం, బీల్లుగా మారిన భూములను అమ్ముకొవడం కోసం పడే కష్టాలు, భూములను తక్కువ ధరకు కొనాలని చూసే దళారులు, రాయలసీమ - కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు వంటి రైతుసమస్యలను ఈ కథల సంపుటి ఆధారంగా ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

Keywords: కేతు విశ్వనాథరెడ్డి, రాయలసీమ, కథలు, రైతులు, కూలీలు, వర్షాభావం, కరువు

1. ఉపోద్ఘాతం:

రాయలసీమ అగ్రశ్రేణి కథాసాహిత్యవేత్తలలో ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ముఖ్యులు. ఈయన 1963 లోతొలి కథ అనాదివాళ్ళు సవ్యసాచిలో వెలువడింది. కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించాడు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదక మండలికి అధ్యక్షుడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు. తన సాహిత్య వ్యాసాలను "దృష్టి" అనే పేరుతో వెలువరించారు. తెలుగు కథారచయితల్లో Torch bearers అనదగ్గ ముఖ్యుల గురించి ఈయన రాసిన మరో పుస్తకం దీపధారులు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003) మొదలైన కథా సంపుటులు కూడా వెలువరించాడు.

ఈయన రాయలసీమ ప్రాంతం అందులో మరీ ముఖ్యంగా కడప ప్రాంత ప్రజలు కరువు వలన పడే బాధలను వారి కష్టాలను ఆవేదనలను తన కథల్లో సజీవంగా కళ్ళకు కట్టినట్టు చిత్రించాడు. రాయలసీమలో ప్రజలకు ప్రకృతి నుంచి వచ్చిన కష్టాల కంటే , బలమైనవాడు బలహీనత కలిగిన వాడిని పెట్టే కష్టాలు అధికంగా ఉండేవి. ఇలాంటి సమస్యలన్నింటినీ తన కథల్లో చిత్రించే ప్రయత్నం చేశారు విశ్వనాథరెడ్డి . రాయలసీమ రైతులు, కూలీల బతుకుల వెతలపైనే కాకుండా స్త్రీ సమస్యలు అలాగే మతసబంద కథలు రాశాడు. విశ్వనాథరెడ్డి జీవితం వ్యవసాయంతో సంబంధం కలిగి ఉండడం, జీవితాంతం శ్రామిక ప్రజలతో కలిసి ఉండడం వల్ల ఆ అనుభవాలు ఆయన రాసిన కథలను సజీవవంతం చేశాయి.

2. నమ్ముకున్ననేల కథ – రైతుకష్టాలు:

నమ్ముకున్న నేల కథలో కథకుడు, వీరన్న , వీరన్న భార్య రాజ్యలక్ష్మి, అంగడి సుబ్బారాయుడు ప్రధానపాత్రాలు. రచయిత కథను స్వయంగా చెప్పినట్టు ఉంటుంది. కథకుడు తన మూడవ కూతురు పెళ్లి కోసం తనకు ఉన్న భూమిని అమ్మలని సొంతవూరు కదపలోని చిలమకూరుకు రావడంతో కథ ప్రారంభమవుతుంది.
భూమిని అమ్ముకోవడం.

రైతు భూమిని భూదేవతగా భావించి పూజిస్తాడు. భూమిని నమ్మి పంటలు పండిస్తూ జీవినం సాగిస్తాడు. వర్షాలు పడి పంటలు బాగా పండితే రైతే రాజు. అలాంటి భూమిని వంశపారం పర్యంగా తరతరాలు చేతులు మారుతూ రైతుకు జీవనాధారంగా ఉంది. అలాంటి భూమిని వర్షాలలేమి కారణంగా పంటలుపండకపోవడంతో భూములునమ్ముకున్న రైతు భూమిని అమ్ముకొని జీవనం సాగించాల్సిన పరిస్థితి. నమ్ముకున్న నేల కథలో కథకుడు భూమిని అమ్మి తన కూతురు పెళ్లి చేయాలని ఆలోచించుకొని ఊర్లో ఉన్న భూమిని దాయాది వీరన్నకు అమ్ముతాడు. పంటలు పండక వీరన్న కూడా కూలీ గా మారి సిమెంట్ ఫ్యాక్టరీ లోకి వెళ్తుంటాడు. వీరన్న భూమిని కొనే స్థితిలో లేడు. వీరన్న పరిస్థితి గురించి అంగడి సుబ్బారాయుడు చెప్పాడు. అంగడి సుబ్బారాయడికె పొలం అమ్మి పెళ్లికి డబ్బులు కుదిరేలా చూసుకోమని వీరన్న చెప్తాడు. పొలం వేరే వాళ్ళకు అమ్మితే బాయిలో నీళ్ళ వంతుకోసం గొడవలు పడవలసి ఉంటుంది అలాంటి గొడవలు ఏవి ఉండకుడదు అని ఆలోచించి వీరన్నకే అమ్మాలనుకోవడం వీరన్న తన నిస్సహాయ స్థితిని ఇలా తెలియజేస్తాడు.

"మళ్ళా భూమి చేసుకోమంటావు? భూమీవద్దు గీమీ వద్దు. అసలు నీకర్థం కాంది యింకొకటి వుంది. భూమి చేసుకుంటాననుకో. సుబ్బరాయుడికి బాకీ, గవర్నమెంటుకు బాకీ, నీకూ బాకీ. సుబ్బరాయుడు తన బాకీలోకి మళ్ళీ ఆయకం పెట్టుకుంటాడు. సొంతం చేసుకుంటాడు. సుబ్బరాయుడి బాకీ కింద నువ్వియ్యాలనుకునే రెండెకరాలు పోతాది. నీకు నేనివ్వాల్సిన పదివేలు యిరవైవేలవుతాది. అసలు సంగతి సుబ్బరాయుడు ఆరువేలకంటె యెక్కువ పెట్టనంటున్నాడు. నువ్వేం చెయ్యలేవు. యియ్యాల్సిందే. నేను సంచకారమిచ్చిన డబ్బు నాకు దమ్మిడీ రాదు. అది సుబ్బరాయుడే పట్టుకుంటాడు.” (36 పుట-నమ్ముకున్న నేల - కేతు విశ్వనాథ రెడ్డి కథలు)  

అంటూ భూమిని కొనలేనని పుటగడవడమే కస్టంగా ఉందంటూ చెప్తాడు. సేద్యం చేయడం వలన ఇంకా అప్పులే అవుతాయి కానీ అప్పులు తీరవనే విషయాన్ని రచయిత ఇక్కడ చేప్పాడు. చేసే పని లాభం రాకపోయినా పరవలేధు కానీ నష్టాన్ని కలిగించేలా ఉండకూడదు.

2.1 వర్షాభావ పరిస్థితులు:

నేడు భారత దేశంలో అతి తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో రాయల సీమ ఒకటి. ఒకప్పుడు రాయల సీమ ప్రాంతం పచ్చధనం, పంటలతో కళాకాలాడుతూ ఉండేది.

“రాయల సీమ పచ్చల బజారు, అచట నొకనాడు పండే ముత్యాల చాలు, అట నొకప్పుడు నిండే కావ్యాల జాలు” (2 పుట - పెన్నేటి పాట) అంటూ రాయసీమ వైభవాన్ని చిత్రించాడు విద్వాన్ విశ్వం. అలాంటి పరిస్థితుల నుంచి పాలకుల వైపల్యం, వాతావరణ మార్పుల వలన రాయల సీమ నేడు కరువు ప్రాంతగా వర్షా భావాన్ని ఎదుర్కొంటున్నది. రైతుల జీవనం దుర్భరంగా మారింది.

ఈ కథలో కేతు విశ్వనాథ రెడ్డి రైతు జీవనాన్ని కళ్ళకు కట్టేలా చిత్రించారు. అందులో వర్షాలు రాక భూములు బీళ్లుగా మారిన పరిస్తుతులు గురించి ..

సేద్యాలు అయి కూడా చాలా మటుకు విత్తనం పడకుండా .. దాదాపు చేలన్ని బీళ్లు .. బీళ్ళు ఆకాశాన్ని కరువున పడి చూస్తూ.. బీళ్ళు దున్నేరు. వానలేదు. పంట లేదు”. (36 పుట-నమ్ముకున్న నేల - కేతు విశ్వనాథ రెడ్డి కథలు)

అంటూ కరువు పరిస్తితి గురించి వివరించాడు. వర్షాలు రావని తెలిసి కూడా రైతులు భూములను సేద్యాలు చేసుకుంటూ ఈ ఏడు(సంవత్సరం) అయినా వర్షం రాకపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. వ్యవసాయం తప్పా మరో వ్యాపకం లేని వారు రైతులు. అందుకే తమ అదృష్టాన్ని ప్రతి ఏటా పరీక్షించుకుంటూ ఉంటారు. చిన్నపాటి వర్షం రాగానే విత్తనాలు జల్లి అవి ఎప్పుడు మొలకెత్తుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఆ విషయాలను ఇలా తెలిపారు-

“పొలంలో జొన్నేగిలి లేదు. కొర్రెగిలి లేదు. కుసమేగిలి లేదు. సేనక్కాయెగిలి లేదు. యే యెగిలి యేం లాభం ? అక్కడో, ఇక్కడో బెత్తెడెత్తు కూడా పెరక్కుండానే పసివాళ్ళ చావులాగా మాడి బుగ్గి అయిన సేనక్కాయ. ఈ పాటికి రెండు మూడు వానలు అదును తప్పకుండా పడివుంటే గట్లు కూడా ఆకనపడకుండా పైరు పచ్చలతో కళ కళ లాడుతూ పొలాలు ఉండేవి. ఇప్పుడు గట్లు మాత్రం కనపడుతున్నాయి.” (37 పుట-నమ్ముకున్న నేల - కేతు విశ్వనాథ రెడ్డి కథలు)

అరకొర వానలకు పంట వేసినా అవి మొలకలు వచ్చి బెత్తెడు కూడా పెరగవు. వర్షాలు అదునుకు (సమయానికి) రాకపోవడం తో పంటలు పండక రైతులు అప్పుల పాలవుతున్నారు. అందుకే భారత దేశంలో వ్యవసాయాన్ని జూదం తో పోలుస్తారు. వర్షాలు రాక అనా వృష్టి వస్తే, వర్షాలు ఎక్కువ అయ్యి అతి వృష్టి వస్తుంటాయి. ప్రతి సంవత్సరం రైతుకు ఏదో ఒకటి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. అందుకే భారత దేశంలో వ్యవసాయాన్ని జూదం తో పోలుస్తారు.

2.2 రైతులు కూలీలుగా మారడం:

వీరన్న సేద్యం వదిలి బోగం మేళ కంపెనీ పెట్టి మోసపోయి కూలిగా మారి పనిచేసుకునే సంఘటన చాలా బాధను కలిగించే అంశం. ఒకప్పుడు ఉన్నతంగా బతికిన రైతు కరువు కారణంగా చేయరాని పనులు చేసి పరువు పోగొట్టుకోవడంతో పాటు నలుగురిలో ఎదుర్కొనే అవమానాలు అనంతం. వీరన్న చేసిన పని గురించి-

"వాడు మనోళ్ళందరికీ చెడ్డ పేరు దెచ్చినాడు. వూర్లో సాటి కాపోళ్ళకు చెడ్డపేరు. మన వంశం యెట్లాంటిది? దెబ్బ తిన్నోడు దాయాదే గదా అని మనింట్లో సేద్యాని కుండమన్నా. వాడు బడాశ మనిషి, ఒప్పుకోలేదు. ఆ పనికిమాలిన కామనూరోళ్ళ మాట విని 'బోగం కంపెనీ'లో చేరినాడు. చేరినోడు మర్యాదగా వుండినా పొయ్యేది. ఆ రెండెకరాలూ అమ్మి బాకీలన్నా పూర్తిగా దీర్చకుండా, రెండువేలు తీసుకొని యింకెక్కడా బాగుండదని చిలకలూరిపేటకు పోయినాడంట. యిద్దరు బోగమోళ్ళను దెచ్చుకుంటే వాళ్ళు దొడ్డికి పొయ్యొస్తామని అదే పోయినారంట. వీడు అన్నెందాలా చెడిపోయినాడు. యేమయిందో యేమో తెల్గు. బామర్థులతో చెడిందని అంటా వుంటారు. పోలీసోళ్ళు వొక రోజు బాగా కొట్టినారంటా వుండారు. యీ మధ్యనే వూరు చేరి సిమెంటు ఫ్యాక్టరీకి పోతండాడు.” (41 పుట-నమ్ముకున్న నేల - కేతు విశ్వనాథ రెడ్డి కథలు) అనీ మునిరెడ్డి అనే వ్యక్తి చెప్తాడు.  

వర్షాలు రాక రైతులు పరిస్థితి దారుణంగా మారడం తో పుట గడవడం కోసం కూలీలుగా మారి బతుకీడుస్తున్న విషయాన్ని ఇలా తెలిపాడు. పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే ఎలాంటి పెట్టుబడి లేని కులీ పనే ఉత్తమం అనుకోని చాలామంది రైతులు కూలీలుగా మరీ ఫ్యాక్టరీలలోకి పనులకు వెళ్తున్న విషయాన్ని రచయిత ఇక్కడ తెలిపాడు.

2.3 ఫ్యాక్టరీలు - రైతుకు నష్టాలు:

మన దేశంలో వ్యవసాయం ఆదారిత దేశం. పంట చేతికి అందాలంటే వ్యవసాయంలో రైతుకు తోడుగా నిలిచే వ్యవసాయ కూలీల పాత్ర కూడా చాలా ఉంటుంది. అలాంటి కూలీలు ఇప్పుడు అధిక మొత్తంలో కులీ ఇచ్చే ఫ్యాకరీలలోకి వెళ్లడంతో రైతుకు వ్యవసాయ భారం అదికమైంది. పరిశ్రమలు రావడం దేశాభివృద్ది లో భాగం. కానీ పారిశ్రామికీకరణ వలన రైతులుకు కూలీల కష్టాలను తెచ్చిపెట్టింది. ఆ అంశాన్నే ఇలా తెలిపాడు 

కరువులే ఒకటి అనుకుంటే యీ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చి రైతుల కొంప గూల్చింది. రోజుకు సిమెంట్ ఫ్యాక్టరీలో పదైదు రూపాయల కూలీ గిట్టుతుంది. రైతును అంత యిమ్మంటే యెక్కణ్నుంచి తెచ్చి యివ్వాల? యిప్పుడు అయిదు రూపాయలిచ్చినా వచ్చేవాడు లేడు. ఆడోళ్ళు కూడా అక్కడికే మరిగింటే, పది రూపాయలు దొరుకుతుంది.యింక భూములన్నీ అమ్ముకోవాల్సిందే. ఈ కూలోళ్ళు, మన పక్క పల్లె కూలోళ్ళే మన భూములన్నీ కొనే రోజులు దగ్గరపడినాయి." (41 పుట-నమ్ముకున్న నేల - కేతు విశ్వనాథ రెడ్డి కథలు)

ఇవి ఆ నాటి రైతుల మనోవేదన. పొలంలో కూలీలతో పనులుచేయించుకోవడానికి రైతులు పడే కష్టాలు, కూలీలకు అధిక మొత్తంలో ఖర్చు అవుతున్న తీరు, వ్యవసాయం కంటే కులీ పనులు చేసుకోవడంతోనే ఉన్నతంగా జీవించవచ్చు అనే విషయం ఇక్కడ గమనించవచ్చు. పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే ఎలాంటి పెట్టుబడి లేని కులీ పనే నయం అనుకోని చాలామంది రైతులు కూలీలిగా మరీ ఫ్యాక్టరీలలోకి పనులకు వెళ్తున్న విషయాన్ని రచయిత ఇక్కడ తెలిపాడు

3. తేడా కథ – రైతు జీవనం:

రాయలసీమ ప్రాంత అబ్బాయి రాఘవ కోస్తా ప్రాంతానికి చెందిన అమ్మాయి శ్రీలత ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉంటారు. తమ ప్రేమ పెళ్లి చేసిన నాయుడు అనే వ్యక్తి పెళ్లికి వెళ్ళి రాఘవ ఊరు అయిన కడప జిల్లాలోని రాజంపేటకు రావడంతో కథ ప్రారంభం అవుతుంది. 

3.1 కరువు పరిస్థితులు:

శ్రీ లత కోస్తా ప్రాంతం అమ్మయి అక్కడ ఉండే పచ్చదనాలు చూసి రాయసీమ ప్రాంతం కరువును చూసిన తీరు ఒక ధనవంతుడు, నిరుపేద వాడి ఇంటికి వెళ్తే ఎలా తోస్తుందో అలానే శ్రీ లతకు అనిపిస్తుంది. ఆ అంశాన్నే ఇలా రైలు దిగాక రెండు బస్సులు మారవలసి వచ్చింది. రోడ్డు దిగి ఒక కిలోమీటరు పైగా నడవవలసి వచ్చింది.

హైదరాబాద్లో ఇంటినుండి బస్ స్టాపులదాకా నడవటాలూ వాటికోసం పడిగాపులూ, వాటిలో బాధలూ నిత్యం అనుభవమే కాబట్టి, శ్రీలతకు ఆ నడక కష్టమనిపించలేదు. కానీ అత్తగారి ఊరి పరిసరాల్ని చూసీ చూడ్డంతోనే శ్రీలత జడుసుకుంది. ఊరికి ఒక పక్క బోడికొండ గుట్టలు, మరొకపక్క బండరాళ్ళ దీవులున్న, నీళ్ళంటూ లేని నల్లటి ఇసుకవంక. చెట్లు చేమల్లేని మెట్టచేలు. ఊరిముందు కాస్తా పచ్చదనమున్న ఒకటీ అరా తోటలు, ఆకాశంలో, ఆ ఊరికి కొంత దూరంలో వున్న సిమెంటు ఫ్యాక్టరీల పొగ గొట్టాల్లోంచి వచ్చే దుమ్ము పొగలు. అవే అక్కడి మబ్బులు. ఊళ్ళో ఒకటో రెండో వేపచెట్లు.” (58 పుట-తేడా - కేతు విశ్వనాథ రెడ్డి కథలు)

కాలం గడుస్తున్నా కొద్దీ వర్షాలు రాకపోవడం కరువుతో ఆ ప్రాంతం మునిగిపోవడంతో చెట్లు చెమలు లేని కొండలు రాళ్ళతోనే కనిపిస్తాయి అనే అంశాన్ని రచయిత తెలిపాడు. ఇక్కడ నదులలో నీళ్లకు బదులు ఇసుక గాలులు ప్రవహిస్తాయి అనేంత కరువును రచయిత కళ్ళకు కట్టినట్టు తెలిపాడు.

3.2 రాయల సీమ – కోస్తా ప్రాంతాల వ్యత్యాసం:

కోస్తా ప్రాంతపు పచ్చదనాలు రాయలసీమ ప్రాంతపు కరువు కాటకాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను గురించి ఈ కథలోగమనించవచ్చు. ఆ వ్యత్యాసాలను ఇలా కేతు విశ్వనాథ రెడ్డి గారు ఇలా వివరించారు.

“అత్తగారిల్లు శ్రీలతకో చుట్టూ గోడలు కట్టిన స్తంభాల మంటపంలాగా తోచింది. ఇంట్లోకి వెళుతూనే కుడివైపు గాడి, పశువులు, కసువు, పేడ, గంజు ఎడమవైపు వంటావార్పు, జంతువులూ, మనుషుల సహజీవనం శ్రీలతకు ఘోరంగా కనిపించింది. కరెంటు, రోజులో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. అత్తగారి ఊళ్ళోవున్న ఆ వారం రోజుల్లో శ్రీలత తను పుట్టి పెరిగిన తెనాలి దగ్గర్లోని గ్రామాన్ని కనీసం ఐదారు పర్యాయాలు గుర్తు చేసుకుంది. తను పుట్టినూరు.. ఊరి బయట తామరకొలనూ, చుట్టూ నీటితో కలకలలాడే పంట కాలువలూ, పంటపొలాలూ, పొలాల్లో వరి నాట్లూ, వరి కోతలూ, నూర్పిళ్ళూ, ఎప్పుడూ మనుషుల సందడి, ఇళ్ళముందూ, పెరళ్ళలో కొబ్బరి చెట్లూ, బాదం చెట్లూ, పూలమొక్కలూ, ఏదో ఒక్క ఎకరా మాత్రమే భూస్థితి కలిగిన తమ ఇంట్లో కూడా ఒక కొబ్బరి చెట్టు. శుభ్రంగా పడుకోడానికి ఒక గది. మనుషుల కాపురానికి దూరంగా పెరట్లో గేదెల కొట్టం. నీళ్ళకు కరువు లేదు. గాలికి కరువు లేదు. కంటికి కనపడని దరిద్రం లేదు. అత్తగారి ఊళ్ళో అన్నిటికీ కరువే”. (59 పుట- తేడా- కేతు విశ్వనాథ రెడ్డి కథలు)

రాయల సీమలో సాధారణ కుటుంబం వారి జీవన పరిస్థితులు ఈ కథలో కనపడతాయి. సాధారణంగా రాయలసీమ రైతులు ఇళ్ళల్లోనో ఇంటిపక్కనే పక పాకను చేసి పశువులను కట్టేసి వాటికి తమకు బేధం లేదని మనుషుల లాగే చూసుకుంటారు అనే అంశం ఇక్కడ గమనించవచ్చు. 

3.3 రాయల సీమ – కోస్తా రైతుల కుటుంబాల మధ్య వ్యత్యాసం:

శ్రీలత తండ్రి ఉన్న ఎకరంలోనే కాయగూరలు పంటలు పండించి తల్లి రెండు గేదెలను పోషిస్తూ ఎవరికి తోచిన పని వారు చేస్తూ ఉంటారు. కానీ జయరాం తండ్రి బీడీలు కాలుస్తూ కాలక్షేపం చేయడం, వాళ్ళ అన్న సిగరెట్లు తాగుతూ రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ డాబులు చెప్పడం చూసి శ్రీలత తన కుటుంబాన్ని, జయరాం కుటుంబాన్ని పోల్చుకొని కొంచెం ఎవగించుకుంటుంది. కానీ రాఘవ తల్లి, తమ్ముడు దివాకర్ కష్టపడి పనులు చేసుకోవడం చూసి సంతోషపడుతుంది. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం కరువు కాటకాల వల్ల పనులు లేక సొమరిగా మారిన మగవాళ్ళు, ఎన్నో తెలివి తేటలు ఉన్నా చదువు మధ్యలో ఆగిపోతే యువకులు ఇళ్ళల్లో పనులు చేసుకోవాల్సిన పరిస్థితులను ఈ కథలో చూడవచ్చు. కోస్తా ప్రాంతం లో కురిసే వానలు రాయల సీమలో కూడా కురిస్తే అలాంటి పచ్చదనము ఉంటుంది కదా అని పాఠకుడికి ఇక్కడ తోస్తుంది.

4. ముగింపు:

  • వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండితే రైతు నిజంగానే రాజులా జీవిస్తాడు. కానీ రాయసీమ ప్రాంతం కారువుకటకాలతో అల్లాడుతుంటుంది. అలాంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వివరించారు విశ్వనాథ రెడ్డి.
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆర్యోక్తి. అలాంటి అన్నం పండించే రైతు కూడా బ్రహ్మ తోసామానంగా చూసిన నాడే రైతు కష్టాలు తీరుతాయి. కరువు కాటకాల కాలంలో, వర్షాభావ పరిస్తితుల్లో రైతుకు అండదండగా ఉంటూ రైతు క్షేమాన్ని కాంక్షించాలి. రైతుల జీవనవిధానం రైతు కష్టాలు కళ్ళకు కట్టినట్టు తెలిపారు
  • ఆయన కథల్లో రాయలసీమ ప్రాంతపు ప్రజల జీవనవిధానం ముఖ్యంగా కనిపిస్తుంది. దోపిడీకి, వంచనకూ గురయ్యే పేదలు, రైతులు అతని కథల్లో కనిపిస్తాయి. విశ్వనాథరెడ్డి గారి కథలు అన్నీ చాలా జాగ్రత్తగా చదవాల్సిన కథలు. ఆయన కాలక్షేపం కోసం కథలు రాయలేదు. 
  • మనం కాలక్షేపం కోసం చదవాడినికి కూడా రాయలేదు. ప్రతి కథ చదివి ఆచరించాలనే ఉద్దేశంతో రాసినట్టు ఉంటాయి. ప్రతి కథా ఒక సదుద్దేశ లక్ష్యంతో నడుస్తుంది. 
  • తళతళలూ, మెరుపులూ, ఉత్కంఠలూ, ఏ కథలోనూ కనిపించవు. మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మరింత ఉన్నతంగా ఎదగటానికి, విశ్వనాథరెడ్డిగారి కథలు ఉపకరిస్తాయి.
  • తనదైన వ్యక్తిత్వపు విలువలతో, సామాజిక సమస్యలకు, సంఘర్షణలకు స్పందించే గుణం, స్పష్టమైన తన భావ ప్రకటనతో, స్పష్టమైన అభివ్యక్తితో, గొప్ప సామాజిక పరిశీలనాశక్తి కలిగి ఉన్నవ్యక్తి సాహిత్యం రచన ఎలా ఉంటుందో కేతు విశ్వనాధరెడ్డి గారి కథల్లో కనిపిసస్తాయి.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. చంద్రశేఖర్ రెడ్డి, రాచపాలెం. మన నవలలు మన కథానికలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 2013
  2. దక్షణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వబావాలు, పోరంకి దక్షణామూర్తి, హైదరాబాద్, 2009 
  3. నాగయ్య జి, తెలుగు సాహిత్య సమీక్ష, నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 2004.   
  4. నారాయణ సింగమనేని, కథావరణం – పెన్నేటి పబ్లికేషన్స్, కడప, 2013.
  5. పైదే. (సంక), తెలుగుకథకులు - కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.2001 
  6. విశ్వనాధ రెడ్డి, కేతు. కడపజిల్లా కథాసాహిత్యం వ్యాసం, 1992
  7. పైదే. కేతువిశ్వనాథరెడ్డి కథలు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. 1994 
  8. శ్రీ దేవి, కె. సీమ కథ అస్థిత్వం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,విజయవాడ,2016 
  9. శ్రీధర్, వెల్డండి. తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం, సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, కర్నూల్, 2015.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]