AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
6. వస్తుసంస్కృతి: ఆదివాసీల జీవితం
డా. బానోత్ స్వామి
పోస్ట్ డాక్టోరల్ ఫెలో, తెలుగు విభాగం,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్, తెలంగాణ.
సెల్: +91 9603082128, Email: banothswamy128@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 26.06.2025 ఎంపిక (D.O.A): 31.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
కొండకోనల్లో జీవనం నిండైన అమాయకత్వం రాజకీయాలు తెలియని మనస్తత్వం ప్రతి నెల పండుగలు, పండుగలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు అందుకు తగ్గట్టుగా వేషధారణ. ఇది ఆదివాసి గిరిజనుల ప్రత్యేకత. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండల మధ్య ఆవాసం విలువైన సాంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం, విలక్షణమైన ఆహార్యం, అడవి తల్లి నీడలో తరతరాల పయనం, భిన్నమైన సంస్కృతి, విభిన్నమైన సాంప్రదాయాలు వైవిధ్యమైన ఆహార్యం తరతరాల నాటి జీవనశైలి. తరతరాలుగా అడవి తల్లితో పెనవేసుకున్న బందం, నిండైన అమాయకత్వం, కపటం ఎరుగని మనస్తత్వం, ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ, ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. వారి యొక్క జీవన విధానంలో ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలను అనుసరించారో ఈ వ్యాసంలో విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను.ముఖ్యంగా ఆదివాసిలైన కోయ గోండు, చెంచు మొదలగు గిరిజన తెగల జీవన విధానంలో ఉన్న వస్తు సంస్కృతిని తెలియపరుస్తాను. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో గిరిజన తెగల వస్తు సంస్కృతిని అధ్యయనం చేయడం, దాన్ని ప్రస్తుత సాహిత్యంతో అనుసంధానించడమే ఈ వ్యాస లక్ష్యం.
Keywords: గుంపు, పూర్భం, అనముంత, సిత్రం వేళా, సుకురం, సర్కారు కంప, ఆకీపేన్, శంక , పాతవాలు , సాపు, బిజిలి, పెరియ కోక్ , వివడి మాసం, పేరుస పెను.
1. ప్రవేశిక
"ఆదివాసులు అన్నా, వనవాసులు అని అన్నా, గిరిజనులు అన్నా ఆ మాట చెబుతున్న సత్యం ఒక్కటే. మానవ శాస్త్ర (Anthropology) అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో మానవజాతి నాలుగు రకాలుగా ఉంటుంది. ఆస్ట్రలాయిడ్, మంగోలాయిడ్, కాక సాయిడ్, నీగ్రోయిడ్, ఇలా వారి వారి శరీర ఆకృతి, ఎత్తు, రంగు, దంతాల నిర్మాణం, పాదాల సైజు, తల నిర్మాణం, ముక్కు, చేతులు వాటిలోని వైవిధ్యత దృష్ట్యా ఈ వర్గీకరణ చేశారు. అయితే ఈ భూమిపైన ఆదిమ మానవుడు అవతరించి లక్ష సంవత్సరాలు అయితే ఆ తర్వాత Homonids, Homo-Erectus, Homosapiens రూపాంతరం చెందడం పరిణామ సిద్ధాంతానికి ఒక నిజమైన దృష్టాంతం. నాలుగు కాళ్ల మీద (Quadripodal) నడిచే జంతు జీవన స్థితి లోని ఆదిమ తత్వం నుంచి, రెండు కాళ్లపై (Bi-podal) నడవగలిగే Homo-Erectusగా మారడానికి వేలాది సంవత్సరాల ప్రస్థానం కొనసాగింది. ఆ తర్వాత మనము ఈ నాటి మానవుడికి తొలితరంగా భావించే Homo-Sapiensగా అవతరించడానికి మధ్య వేలాది సంవత్సరాల ఫాక్ చరిత్ర కూడా ఉంది1".
ఆదివాసి, ఆదివాసులు లేదా భారతదేశంలోని అసలైన నివాసులు. ఆదివాసి అనే పదానికి అర్థం "అది" అంటే ప్రారంభం, "వాసి” అంటే స్థిరపడినవారు. భారతదేశంలో మొదట స్థిరపడినవారు ఆదివాసులు అని అర్థం. వీరినే గిరిజనులు, అడవి బిడ్డలు, అనాగరికులు అనే వివిధ పేర్లతో పిలుస్తారు. అడవులే ఆదివాసులకు ఆయువుపట్టు. కొండకోనల్లో జీవనం. నిండైన అమాయకత్వం. రాజకీయాలు తెలియని మనస్తత్వం. ప్రతి నెల పండుగలు, పండుగలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు అందుకు తగ్గట్టుగా వేషధారణ. ఇది ఆదివాసి గిరిజనుల ప్రత్యేకత. చుట్టూ దట్టమైన అరణ్యం. కొండల మధ్య ఆవాసం. విలువైన సాంప్రదాయాలు, కట్టుబాట్లతో జీవనం, విలక్షణమైన ఆహార్యం, అడవి తల్లి నీడలో తరతరాల పయనం, భిన్నమైన సంస్కృతి, విభిన్నమైన సాంప్రదాయాలు వైవిధ్యమైన ఆహార్యం తరతరాల నాటి జీవనశైలి. తరతరాలుగా అడవి తల్లితో పెనవేసుకున్న బందం, నిండైన అమాయకత్వం, కపటం ఎరుగని మనస్తత్వం, ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ, ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు.
"భారతదేశంలో అత్యంత ప్రాచీన కాలం నుండి నివసిస్తున్న సాంస్కృతిక, భౌగోళికంగా ప్రత్యేకమైన తెగల సమూహాలు. భారత రాజ్యాంగం వారిని “గిరిజనులు” (Scheduled Tribes – STs) గా గుర్తించి, వారి అభివృద్ధికి మరియు పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు చేసింది. ఆదివాసీ గిరిజనుల వస్తు సంస్కృతి అనేది భారతదేశంలోని పురాతనమైన మరియు అనేక సామాజిక, ఆధ్యాత్మిక, ఆచార ప్రాతిపదికలపై ఆధారపడిన సంస్కృతి. ఇది వారి జీవన విధానాన్ని, వారి చుట్టూ ఉన్న ప్రకృతిని ఎలా అర్థం చేసుకుంటారో ప్రతిబింబిస్తుంది. వారి వస్తు సంస్కృతి అంటే ప్రధానంగా వారు వాడే వస్తువులు, ఆయుధాలు, అలంకారాలు, కళలు, పనిముట్లు, వాసస్థల నిర్మాణ పద్ధతులు మొదలైనవి.
2. ఆదివాసీల లక్షణాలు
1. స్వతంత్ర జీవనశైలి: అరణ్య ప్రాంతాల్లో స్వతంత్రంగా వ్యవసాయం, వేట, మత్స్యకార కార్యకలాపాలపై ఆధారపడే జీవనం.
2. భిన్నమైన సంస్కృతి: తమదైన భాషలు, నృత్యాలు, పాటలు, సంప్రదాయాలు.
3. సాధారణ ఆచారాలు: ప్రకృతిని పూజించే విశ్వాసాలు, మాతృక దేవతల పూజ.
4. తనిఖీ వ్యవస్థలు: పంచాయితీలకు బదులుగా గోత్రస్థాయి పెద్దల ఆధ్వర్యంలో న్యాయం.
5. సంప్రదాయ జానపద వైద్యం: మొక్కజొన్నలు, మూలికలు, ఆయుర్వేద ఆధారిత వైద్యం3".
"కోయా తెగ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలంగాణలో వీరి జనాభా ఎక్కువగా దండకారణ్య అడవుల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఉంటుంది. ప్రస్తుతం వీరు ఎక్కువగా నివాసం ఉంటున్న జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెంలోని చింతూరు, దుమ్ముగూడెం, బూర్గంపాడు, మణుగూరు మండలాలు. ములుగు జిల్లలలోని టూరునాగారం, వెంపల్లి, తాడ్వాయి, గోవిందరావుపేట. ఖమ్మంలో కొంతమంది కోయా వలసలు ఇప్పటికి జరుగుతున్నాయి.ఆదిలాబాద్ జిల్లలో దట్టమైన అడవి ప్రాంతానికి గోండు తెగల ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని కోయా వలసలు ఉన్నాయి3".
ఆహార, పానీయాల గురించి ముఖ్యమైన సమాచారం: గిరిజన వంటకాల్లో చిరుధాన్యాలు, కారం, పులుపు కూరలతో చేసిన రోటి ప్రసిద్ధి. ఇది బంజారా, కోయ, గోండు తెగల వంటకాల నుండి వస్తుంది. ఆదివాసీలు అన్నం, పప్పులు, మూలికలు, సాగ్, మాంసం వంటి ఉడికించిన ఆహారాన్ని తీసుకుంటారు. కొన్నిసార్లు జంతువులు లేదా పక్షి మాంసం నిప్పులో కాల్చరు. ఆదివాసి పళ్లెంలో ఉడకబెట్టిన అన్నం, మార్టుర్ లేదా ఉరద దాల్, గుజ్జు చేసిన ఆహార పదార్థం, చట్నీ, మాంసం, స్థానికంగా దొరికే చేపలు, పీతలు వంటివి ఉంటాయి. పండుగలప్పుడు రకరకాల పీఠాలు (బియ్యం పిండితో చేసిన కుడుములు) పప్పులు, కూరగాయలు లేదా మాంసంతో వడ్డిస్తారు.ఆదివాసీల ఆహార పద్ధతులలో ఉడకబెట్టడం, ఆవిరి చేయడం వంటివి సాధారణ పద్ధతులు, అయితే చేతులతో మెత్తగా మెదపడం వల్ల పోషకాలు కోల్పోకుండా చూస్తారు.వారి చిరుతిండ్లలో దూస్కా(బియ్యం పిండితో చేసినవి) లాంటి పదర్థాలు తింటారు.
3. పూర్వపరిశోధనలు
ఆదివాసుల గురించి పూర్వ పరిశోధనలు (Previous Research Studies on Adivasis)" అనే అంశం పరిశోధనాపరంగా చాలా విస్తృతమైనది. ఇది అనేక రంగాలలో — ఆర్థికం, భౌగోళికం, భాష, సంస్కృతి, హక్కులు, మహిళలు, విద్య, వలసలు మొదలైన విభాగాలలో సాగింది.గిరిజన సాహిత్యం గురించి మౌఖిక సాహిత్యం మీద అనేక పరిశోధనలు జరురుతున్నాయి. కథ, గేయం, గిరిజన నవల మీద అనేక పరిశోధనలు, వ్యాసాలు ప్రాంతీయ సాహిత్య ప్రాజెక్ట్ లు నిర్వహిస్తున్నారు. వెరియర్ ఎల్విన్ (Verrier Elwin)ఆదివాసుల జీవితం, సాంస్కృతిక విలువలు "The Tribal World of Verrier Elwin" అన్న పుస్తకం ఆదివాసుల జీవితంపై విశిష్టమైన దృష్టిగోపాల కృష్ణన్, కె.ఎస్. గిరిజన అభివృద్ధి విధానాలు ప్లానింగ్ కమిషన్‌కు నివేదికలు సమర్పించారు. Ministry of Tribal Affairs (India)గిరిజనులపై కేంద్ర స్థాయి డేటా గిరిజన జనాభా, విద్యా స్థితి, అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు సమర్పించారు. కాకతీయ విశ్వవిద్యాలయం గిరిజన సాహిత్యం, జీవితం పీహెచ్.డి. స్థాయిలో అనేక పరిశోధనలు సాగినవి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గిరిజన మహిళల సామాజిక స్థితిM.Phil/PhD లో గిరిజన మహిళల సమస్యలపై విశ్లేషణాత్మక పరిశోధనలతో పాటు అనేక గిరిజన తెగల సాహిత్యం మీద ముఖ్యంగా మౌఖిక సాహిత్యం చాల కోణాలలో వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. Dr. B.R. Ambedkar Open University గిరిజన ఆర్థిక స్థితిగతులు వలసలు, ఉపాధి, వ్యవసాయం సంబంధిత అధ్యయనాలు, కోయతూర్, గోండు, చెంచు తెగలపై పరిశోధనలు అనేక జాతులపై ప్రాంతీయ అధ్యయనాలు ప్రత్యేక జాతుల పట్ల పౌరహక్కుల దోపిడీపై వివిధ పత్ర సమర్పణలు జరుగుతూ వచ్చాయి. కానీ ఆదివాసిల జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించినట్లు జరిగితే అనేక నూతన విషయాలు నేటి ఆధునిక సమాజాన్ని పరిచయం చెయ్యవచ్చు. ఆదివాసీలు ఉపయోగించిన ప్రతి వస్తువు కూడా మానవుని సాంఘిక జీవితంలో భాగంగా తోర్పడినవే. పర్యావానికి హని లేకుండా ఉపయోగించే అనేక వస్తువుల గురించి వారి ఆహార ఉత్పతుల గురించి క్షేత్ర పర్యాటనల ద్వార మరిన్ని లోతైన విషయయలను గమనించవచ్చు.
4. పరిశోధన పద్ధతి
ఈ వ్యాసాన్ని గుణాత్మక పద్ధతి ద్వార పరిశోధన చేయవచ్చు. ఎందుకంటే వ్యాస నిర్మాణం పూర్తిగా వారి నుండి అనేక విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు వారితో అనేక మౌఖియా సాహిత్య విషయాలు తెలుసుకోవడం జరిగింది. ప్రాథమిక ఆకరాలుగా వ్యాసక్రమ ముందు భాగంలో ఉన్న అదివాసిల నేపథ్యాన్ని పరిచయం చేయడంజరిగింది. వస్తు వినియోగ విషయాలను నేరుగా సమాచారాన్ని తీసుకోని అదివాసిల వస్తు వినియోగ పద్ధతులను విశ్లేషణ చేయడం జరిగింది. ఇందులో ద్వితీయ ఆకరాలు వారితో చేసిన చర్చ.
ప్రపంచీకరణ ప్రభావంలో అనేక జాతులు వారి సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోతువస్తున్నారు. ముఖ్యంగా నాగరిక సమాజానికి దూరంగా ఆటవిక జీవనాన్ని కొనసాగిస్తున్న కొన్ని ఆదివాసి గిరిజన తెగలు నేటికి వారు వారి జీవన మనుగడ కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నాగరిక సమాజంలో నెట్టివేయబడి కాల క్రమంలో వారి భాషతో పాటు సాంస్కృతిక విషయాలను కూడా మర్చిపోతున్నారు. ఆదివాసీలు వారి దైనందిన జీవితంలో ఉపయోగించిన వస్తువులను భవిషత్తు తరాలకు అందించడంతో పాటు కనుమరుగవుతున్న సాంస్కృతిక విషయాలను నెమరు వేసుకోవడం ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. ఈ పరిశోధన వ్యాసం మూలంగా ఆదివాసి గిరిజన జీవితాలను దగ్గరగా చూడవచ్చును. వారు జీవన క్రమంలో పర్యావరణాన్ని హాని చేయకుండా, అటవీ సంపాదను కొల్లగోట్టకుండా సాంస్కృతిక జీవనాన్ని గడిపిన తీరును మనం ఈ వ్యాసంలో గమనించవచ్చు.
5. ఆదివాసీ గిరిజన తెగల వ్యవసాయ వస్తు సంస్కృతి
ఆదివాసీలకు అడవిపై పుట్టుకతోనే హక్కు ఉంటుందని వారు నమ్ముతారు, దీని నుండి పోడు వ్యవసాయం ఉద్భవించింది. పోడు వ్యవసాయంలో, వారు వాలుగా ఉన్న అటవీ ప్రాంతాల్లోని చిన్న పొదలు మరియు మొక్కలను వ్యవసాయానికి అనువుగా మారుస్తారు, నాగలి లేదా ఎద్దులను ఉపయోగించకుండా "కచల్" అనే చిన్న పుల్లతో విత్తనాలు నాటుతారు. వారు రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వంటి చిరుధాన్యాలను పండిస్తారు మరియు రసాయనాలు వాడకుండా పశువుల పేడను ఎరువుగా ఉపయోగిస్తారు.ఈ పద్ధతి అడవులకు లేదా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. వారు ఎద్దులను ఉపయోగించకుండా 'కచల్' అనే చిన్న పుల్లతో భూమిని దున్ని, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను పండిస్తారు. రసాయనాలు వాడకుండా పశువుల పెంచుతారు.
5.1 వస్త్రధారణ
గిరిజనులు సాధారణంగా సహజ పదార్థాలతో తయారైన వస్త్రాలు ధరించేవారు. ప్రాదేశిక పరిమాణాన్ని బట్టి జంతు చర్మాలు, కాటన్, జుట్టు లేదా చెట్టు తారు లాంటి పదార్థాలు ఉపయోగించేవారు. పురుషులు కౌపీనం, ధోతి, మహిళలు చీరకట్టు మాదిరిగా కనిపించే చీరలు ధరించేవారు. రంగులు మరియు అలంకరణలపై చాలా ఆసక్తి ఉంటుంది.
Image
(ఆదివాసి సాంప్రదాయ వస్త్రాలతో గిరిజన మహిళలు)
5.2 అలంకారాలు
బొగ్గు, రాళ్లు, కలుపు, తాంతలు, పక్షుల పిండి, డావుడి ముత్యాలు మొదలైన వాటితో చేయబడిన ఆభరణాలు. పురుషులు, స్త్రీలు రెండూ మాలలు, చెవి రింగులు, ముక్కు గూచలు, పాద రింగులు ధరిస్తారు.ముఖ్యమైన అలంకరణలు. ఈ వస్తువులు తెగల గుర్తింపుగా, సామాజిక హోదాను తెలియజేస్తాయి.
5.3 గృహ నిర్మాణం
చెక్క, తాటి ఆకులు, బూడిద, గడ్డి మొదలైన సహజ పదార్థాలతో చిన్న గూళ్లు నిర్మిస్తారు. వాతావరణాన్ని బట్టి నిర్మాణ శైలి మారుతుంది.ఇంటి నిర్మాణం కూడా వస్తును అనుసరిస్తూ ఎతైన పల్లపు మైదన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం వ్హేస్తారు. ముఖ్యంగా కర్రలను ఉపయోగించి ఇంటికి వెలుతురు వచ్చే విధంగా మరియు ఎండ వన నుండి రక్షించుకోవడం కోసం అడవిలో దొరికే ఖాసి అనే గడ్డి జాతిని ఉపయోగించి ఇంటిపై పేరుస్తారు. గోడలకు పుట్టమన్నును లేదా మొత్తటి ఒంర్డు మట్టిని తిసుకుకోవచ్చి ఇంటి గోడలను చాల అందంగా వివిధ రకాల చిత్రాలతో అలంకరించుకుంటారు.ముఖ్యంగా ఆదివాసీలు ఇంటి నిర్మాణంలో వారికీ వారె స్వయం సిద్ధంగా నిర్మాణం చేయడం గొప్ప విషయం. నిర్మాణ సమయంలో ఒకరికి గుంపు నిర్మాణంలో సహాయపడుతారు.వేసవిలో చల్లగా, వర్షాకాలంలో తడవని విధంగా నిర్మించబడుతుంది. కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు గుహలతో పోలిన రక్షణ గదులు చేస్తారు.
Image
(ములుగు జిల్లాలో కొండయి గ్రామంలో ఆదివాసి కోయ గిరిజనుల గృహం. ఈ గృహాన్ని స్వయంగా చేతి నిర్మాణంతో చేయడం జరిగింది.)
5.4 పనిముట్లు & ఆయుధాలు
వేట మరియు సేకరణ కోసం బాణాలు, బల్లెం, కత్తులు, బొక్కల వంటి ఆయుధాలు వాడతారు. వ్యవసాయం కోసం నూగు, కొడవలి, యెత్తరి వంటివి వాడతారు. నూగు అనే సాంప్రదాయ వస్తువును తయరు చేసుకుంటారు. నూగు అంటే అడవిలో వంకరగా ఉన్న కర్రను ఉపయోగించి దానిని నాగలి లాగా తాయారు చేసుకుంటారు. ప్రస్తుతం ఆధునిక కాలంలో ఉపయోగిస్తున్న నాగలి ఆదివాసిల కాలం నుండి అనేక పరిణామాలు జరిగి సాంప్రదాయ వ్యయసాయ ఉత్పతులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారు ఉపయోగించిన వ్యవసాయ వస్తువులు నేటికి అనేకం కనుమరుగు అవుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచికరణలో అనేక మార్పులు రావడంతో పాటు ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో అనేక మార్పులు సంబవిన్చాడంతో పాటు, వలసలు ప్రారంభం అయ్యాయని చెప్పవచ్చు.
5.5 కళ & శిల్పం
గిరిజనుల గోడచిత్రకళ (ఉదా: గోండ్ పింటింగ్స్, వర్లీ ఆర్ట్) ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మట్టితో విగ్రహాలు, పండుగలలో మాస్క్‌లు తయారు చేస్తారు. ఇప్పటికి కొన్ని సంతలలో, కొన్ని ప్రాంతలలో గిరిజనులు స్వయంగా చేసిన అనేక చేతి నైపుణ్య వస్తువులు లభ్యం అవుతున్నాయి. గిరిజనులు అడవిలో దొరికే సహజ సంపద ద్వార వారు స్వయంగా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకున్నా కూడా వారి వస్తు నిర్మాణం చాల ప్రత్యేకంగా ఉంటుంది. గోడలపై గీతలు, రంగులు, సంకేతాలు (వర్లీ ఆర్ట్ లాంటి చిత్రణలు) వుంటాయి. ఇంటి ముందు తొరణాలు, పూలగుళ్లు, పసుపు-కుంకుమతో అలంకరణ కనిపిస్తుంది.
5.6 పండుగలలో వస్తుప్రదర్శన
జాతరలు, పర్వాలవండి పండుగలు, బోనాలు వంటి వేళల్లో తమ సంప్రదాయ వస్తు సంస్కృతి ప్రత్యక్షంగా కనిపిస్తుంది.
Image
సమ్మక్క సారక్క అదివాసిల మ్యూజియం ములుగు జిల్లా. తెలంగాణ రాష్ట్రం.
5.7 పర్యావరణ అనుసంధానం
అన్ని వస్తువులు ప్రకృతికి హానీ కలిగించని పదార్థాల నుంచే తయారవుతాయి. గిరిజనుల వస్తు సంస్కృతి పూర్తిగా స్థిరమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ వస్తు సంస్కృతి వారి భావజాలాన్ని, జీవన నైపుణ్యాలను, ప్రకృతి పై ఆధారపడిన జీవన శైలిని తెలియజేస్తుంది. ఇది ఒక అరుదైన సంపదగా మనం సంరక్షించాల్సిన అవసరం ఉంది.
"ఆదివాసీల వస్తు సంస్కృతిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువులు వారి దైనందిన జీవితం, వృత్తులు వేట, వ్యవసాయం, మత్స్యకారం, ఆచారాలు, పండుగలు, నృత్యాలు మరియు విశ్వాసాలపై ఆధారపడతాయి.
Image
(ఆదివాసీలు వెదురు కర్రలతో తయరు చేసిన గృహ ఉపయోగ వస్తువులు)
ఈ క్రింద విభాగాల వారీగా కొంతమంది ఆదివాసీలలో తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాదు, ఖమ్మం , వరంగల్, నల్గొండ లాంటి చోట్ల ఉపయోగించే సాధారణ వస్తువుల పేర్లను మనం గమనించవచ్చు.
ఆహారం లేదా వంటలో వాడే వస్తువులు
- చట్టి – మట్టితో చేసిన కడాయి/కుక్కర
- బొట్టిలు – మట్టి పాత్రలు
- కరవాయి – తాళపత్రాలతో చేసిన పాత్ర
- గడ్డవేడీ – పిండి తయారు చేసే రాయి
- పొయ్యి – చెక్కలతో మండించే చుల్గా
వేషధారణ అలంకార సామాగ్రి
- తంతు వస్త్రాలు – చెట్టు తంతువుల నుంచి తయారైన దుస్తులు
- పగడాలు – చేతికి వేసుకునే ముడి రాళ్లు లేదా గాజు ముత్యాలు
- నూతన గూచు – ముక్కులో వేసుకునే రాయి/చిన్న బంగారు వస్తువు
- పెండిలు – చెవులకు వేలాడే అలంకారాలు
- కట్టగుంట – జుట్టు చుట్టుకునే ముడి దారం
వేటలో వాడే ఆయుధాలు
- బాణం – తూటా గుచ్చే ఆయుధం
- బల్లెం – పెద్ద ముక్కలతో గల కత్తి
- కొడవలి – వ్యవసాయ పనులకు
- తూడా – వేటలో ప్రయోగించే బొంకు/కొడవ
విశ్రాంతి & గృహోపకరణాలు
- ముంజలు – గడ్డి తోలు తో తయారైన పరుపు
- చెట్టు తెర – తాటి ఆకులతో తయారైన తెర/చాప
- కలంపురుగు – దెబ్బలకు కట్టు వేసుకునే పదార్థం
- పలుగు – నీటి పాత్ర
సాంస్కృతిక & మతపరమైన వస్తువులు
- పగడి మాస్కులు – పండుగల్లో ధరిస్తారు
- తాంబేరు – నాట్యం సమయంలో వాడే తాళాలు
- మాసిక్ కలం – గోడ చిత్రాల కోసం ఉపయోగించే సహజ రంగు కలం
- బూడిదగింజలు – మంత్రాల కోసం వాడే గింజలు/పూతలు
కళా వస్తువులు
- వర్లీ చిత్ర పలకలు – గోడలపై గీతలు వేసేందుకు
- గోండ్ బొమ్మలు – గోండ్ తెగ వారి కళా రూపాలు
- కంచం పిడకలు – మట్టి లేదా మేతతో చేసిన బొమ్మలు"4.
భారతదేశానికి ఆదికాలం నుండి జ్ఞానం, జీవన విధానంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన ఆదివాసులు (గిరిజనులు) వారి భౌతిక (వస్తు) జీవనరీతిలో సహజ వనరులను ఆధారంగా చేసుకొని, పర్యావరణాన్ని గౌరవిస్తూ, స్వయం సమృద్ధి జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆదివాసుల వస్తు సంస్కృతి అనేది వారి జీవితపద్ధతి, ఆచారాలు, వృత్తులు, నమ్మకాలు మరియు ప్రకృతితో జతచేసిన అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది.
6. ఉపసంహారం
- ఆధునిక జీవనవిధానాల వల్ల ఆదివాసుల వస్తు సంస్కృతి తుడిపాటుకు గురవుతోంది. ప్లాస్టిక్ పాత్రలు, సిమెంట్ ఇళ్లు, మార్కెట్ వస్తువుల వినియోగం పెరుగుతుంది. దీంతో పూర్వపు కళలు, వస్తు శిల్పాలు కనుమరుగవుతున్నాయి. యువతలో ఈ సంస్కృతిపై ఆసక్తి తగ్గిపోతోంది. కొంతమంది మాత్రమే ఈ సంప్రదాయ వస్తువుల తయారీలో కొనసాగుతున్నారు.ఆదివాసుల వస్తు సంస్కృతి అనేది కేవలం వారి అవసరాలను తీర్చే సామగ్రి మాత్రమే కాదు, అది వారి ఆత్మ, జీవనశైలి, సంస్కృతి మరియు వారసత్వపు నిదర్శనం. తెలంగాణ లోని గిరిజనులు ఈ వస్తు సంస్కృతిని తమ జీవనంలో ఇంకా కొనసాగిస్తూ తమ చుట్టూ ఉన్న ప్రకృతిని వినియోగిస్తూ జీవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఈ సంస్కృతిని రక్షించడం మనందరి బాధ్యత.
- ఆదివాసుల వస్తు సంస్కృతి అనేది కేవలం అనుబంధ వస్తువుల సమాహారం కాదు – అది ఒక తెగ జీవన తత్వానికి, పర్యావరణ అనుబంధానికి, సమాజ నిర్మాణానికి ఆధారస్తంభంగా నిలుస్తుంది. అయితే ఆధునికీకరణ ప్రభావంతో ఈ వస్తు సంస్కృతి మాయమవుతున్నది. ఆధునిక వస్తువుల ప్రవేశం, మార్కెట్ ఆధారిత వినియోగం, సంప్రదాయ శిల్ప కళల్లో ఆసక్తి తగ్గడం వంటివి దీనికి కారణాలు. ఈ నేపథ్యంలో ఆదివాసుల వస్తు సంస్కృతిని పరిరక్షించటం, నమోదు చేయటం, ప్రోత్సహించటం అనేది సమాజంగా మనందరి బాధ్యత. ఈ వస్తు సంస్కృతిని మనం అధ్యయనం చేయడం ద్వారా ఆదివాసుల జీవన తత్వాన్ని, వారి అనుబంధాలను, వారి గుర్తింపును మనం గౌరవించగలము. వారు మన భూభాగపు సహజ సంస్కృతికి జీవావాహిని లాంటివారు. వారి వస్తు సంస్కృతి పరిరక్షితమైతే, వారి జీవన పరంపర కూడా నిలిచి ఉంటుంది. ఈ సంస్కృతి మనిషి సహజ జీవితానికి దగ్గరగా ఉండే జీవన సరళిని ప్రతిబింబిస్తుంది.
7. సూచికలు
- తెలంగాణ గిరిజనుల సంస్కృతి - భాష, సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం, వాచస్పతి ఆచార్య కే. కుసుమ రెడ్డి - హైదరాబద్, 2023
- భారతీయ గిరిజన సంస్కృతి - సమాజం - తెలుగు అకాడమి హైదరాబద్, 2019
- మన గిరిజన సంస్కృతి - డా. నాగేంద్ర హంసవాత్ ,సత్య కే, లోనవాత్- భూమి బుక్ ట్రస్ట్, హైదరాబాదు, 2024
- ఈసం బాబురావు, వయస్సు 57, ములుగు జిల్లా కొండయిగ్రామం
8. ఉపయుక్తగ్రంథసూచి
- అరుణ్ కుమార్, మైపతి, ఆదివాసి జీవన విధ్వంసం, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వరంగల్, 2016.
- కృష్ణకుమారి, నాయిని, తెలుగు జానపద విజ్ఞానం సమాజం సంస్కృతి సాహిత్యం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2011.
- నదీం హస్ నైన్ భారతీయ గిరిజనులు, హైదరాబాద్, 1995.
- పార్స్పెక్టివ్, సామాజిక శాస్త్రం వసంతగీతం, రాజకీయఆర్థికచారిత్రకనవల, హైదరాబాద్, 2013.
- మోహన్. జి.యస్, జానపద విజ్ఞాన అధ్యయనం, శ్రీనివాస పబ్లికేషన్ బెంగళూరు, 2001.
- ముత్యం తెలంగాణ భాష, తెలుగు భాష, గిరిజన భాషలు, శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్, 2016.
- రామాచార్యులు, బి. తెలుగు కావ్యాల్లో గిరిజనుల సంస్కృతి,2001.
- రాజ్ మహమ్మద్, తెలంగాణ గిరిజనుల మౌఖిక సాహిత్యం, హైదరాబాద్, 2002.
- రంగారెడ్డి, కె. గుత్తి కోయల జీవనం, ఖమ్మం జిల్లా కమిటీ, హైదరాబాద్, 2003.
- సూర్యనారాయణ, భారతదేశం గిరిజన సముదాయం,1983.
- సుందరం, ఆర్వీఎస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం, 1983
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

