AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. నిర్మల్ జిల్లా శతకసాహిత్యం: వ్యవసాయాంశాలు
టేకులపల్లి నర్సయ్య
పరిశోధకులు, తెలంగాణ విశ్వవిద్యాలయం,
సహాయ ఆచార్యులు, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ.
సెల్: +91 9182017249, Email: manichandra.t896@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 30.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
ప్రాచీన కాలం నుండి నేటి వరకు వ్యవసాయం మానవ సమాజ అభివృద్ధిలో ప్రాధాన్యత పొందిoది. నిర్మల్ జిల్లా ప్రాంతoలో వ్యవసాయ రంగాన్ని జీవనాధారంగా చేసుకొని సంప్రదాయ ఆధునిక పద్దతులను మేలవించుకొని పంటలను పండిస్తూ. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వ్యవసాయం అనేది పంటలకే పరిమితo కాకుండా సామాజిక, ఆర్థిక సాంస్కృతిక అంశాలకు ఆలంబనగా ఉంటుంది. వేదాలలో కూడా వ్యవసాయ ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత దేశం వ్యవసాయ ఉత్పతుల్లో రెండవ స్థానం నిలిచి శ్రామిక శక్తిలో సగానికి పైగా ఉపాధి కల్పిస్తుంది. జాతీయ స్థూల ఉత్పత్తిలో సుమారు 20 శాతం వాటాను అందిస్తున్నది. ఉత్పత్తి, ఉపాధి, పంటలు, ధరలు, మార్కెట్ వ్యవస్థ, పంటలు వంటి వ్యవసాయరంగ అంశాలు సమాజంతో అనుబంధమై యుంటాయి. ఈ క్రమంలో వ్యవసాయానికి సాహిత్యానికి ఉన్న సంబంధం ఏమిటి? తమ సమకాలీన వ్యవసాయ, ఆర్థిక అంశాలను, రైతు కష్టాలు, వర్షాభావ కరువు పరిస్టితులు, ఋతువుల ప్రభావం, విపత్తులు, పంటలు, ధరల ప్రభావం వంటి అంశాలను నిర్మల్ జిల్లా కవులు తమ శతకాలలో ఏవిధంగా వెల్లడించారు. చర్చించడం ఈ పరిశోధన పత్రం ఉద్దేశ్యం. ఆధునికంగా అనేక సాహితీ ప్రక్రియలు వెలువడుతున్నప్పటికి పద్యానికి పెద్ద పీటవేసి శతకాల ను వెలువరించారు. ఇట్టి కృషిని గుర్తించి అందులోని నీతి, భక్తి, వ్యవసాయo సామాజికకోణం వంటి అంశాలను పరిశీలించడం ఉద్దేశ్యం. వీటిని సమగ్రంగా విశ్లేషించడం ద్వారా సాహితీ ప్రపంచానికి ఈ ప్రాంత కవుల కృషిని చాటడం, భవిష్యత్ తరాల వారికి అందించడం ఆవశ్యకమని భావి౦చనైనది. "నిర్మల్ జిల్లా శతక సాహిత్యం పరిశీలన" అనే అంశం మీద ఎటువంటి పరిశోధనలు ఇప్పటి వరకు జరగలేదు. ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా సమగ్ర సాహిత్యం అంశం, బాసర క్షేత్ర మహాత్మ్యం వంటి అంశాలపై పరిశోధనలు జరిగాయి. జిల్లాలోని మండలాల వారిగా కవులను రచయితలు, ఉపాధ్యాయులను, కలుసుకొని విషయాన్ని సేకరించడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని శతకాలు, 2025 సంవత్సరం వరకు కాలాన్ని పరిధిగా చేసుకోవడమైనది. శతకాలలోని నీతి, భక్తి , సామజిక, సాంస్కృతిక వ్యవసాయ సంబంధిత అంశాలను విశ్లేషించడం పరిశీలించడం జరుగుతుంది, భవిష్యత్ పరిశోధకులకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.
Keywords: శతక సాహిత్యం, వ్యవసాయం అనుబంధ అంశాలు, రైతు శ్రమ, పర్యావరణం, పంటల సంబరం
1. ప్రవేశిక
నిర్మల్ ఒక చారిత్రకమైన ప్రదేశం నిర్మల్ జిల్లాలో ప్రముఖ భూమిక వహించేది ప్రధానంగా వ్యవసాయరంగమే. ఈ జిల్లాలో పూర్వకాలం అంటే నిర్మల, నిర్మల గా ఏర్పడిన కాలం 16వ శతాబ్దం అని చరిత్ర ద్వారా మనకు తెలియ వస్తుంది. ఆనాదిగా ఈ జిల్లాలో కూడా వ్యవసాయం సాగులో ఉంది.
“నిర్మల్ జిల్లలో సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు కొండలతో కూడిన దక్కన్ పీఠభూమికి చెందడం వల్ల మిశ్రమ నేలలున్నాయి.60 శాతం నల్లరేగడి భూములు, 20 శాతం ఎర్రనేలలు , 10 శాతం ఇసుక నేలలున్నాయి. జిల్లాలో 60 శాతం భూములు కడెం, స్వర్ణ , గడ్డెన్నవాగు ,సదర్ మట్ ప్రాజెక్టులు, పోచంపాడ్ (ఎస్ ఆర్ ఎస్ పి) ఎడమ కాలువ, చెరువుల కింద 40శాతం భూములు మెట్టభూములు , గడ్డి భూములు వున్నాయి.”1
పత్తి, వరి ప్రధానంగా సాగుచేస్తూ పసుపు జొన్న, మొక్కజొన్న , కంది, మినుము సోయా,వంటి వివిధ పంటలను కాలానుగుణంగా ఈ జిల్లాలో పండిస్తారు. మామిడి, సపోటా, దానిమ్మ మొదలగు పండ్ల పంటలు మరియు ఆగ్రో ఫారేస్టి చెట్లను పెంచుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ జిల్లాలో సుమారు 7 లక్షలకు పైగా పశు సంపద కలదు.
ఇక్కడి జిల్లా ప్రజలు వ్యవసాయరంగాన్ని జీవనాధారంగా సంప్రదాయ, ఆధునిక వ్యవసాయ విధానాలను అన్వయించుకొని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలోని కవులు సృజించిన శతక సాహిత్యంలో వ్యవసాయ, ఆర్థిక సామాజిక స్పృహ ఏ మేరకు ఉందో పరిశీలించడo ఈ వ్యాసం ఉద్దేశం.
ప్రస్తుత విషయానికి సంబంధించిన నిర్మల్ జిల్లా వ్యవసాయ, ఆర్థిక అంశాలు వాటిపై వెలువడిన సాహిత్యం మీద ఇదివరకు ఎటువంటి పరిశోధనా గ్రంధాలు రాలేదు. నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం నిర్మల్ జిల్లా సాహిత్య చరిత్ర, అదిలాబాద్ జిల్లా వంటి గ్రంధాలు ఈ ప్రాంతంలో వెలువడినాయి.
2. నిర్మల్ జిల్లా శతకసాహిత్యం
"హితేనా సహితం సాహిత్యం” ఆర్యోక్తి. సమాజ హితాన్నికోరి, సమాజానికి మంచిని ప్రభోదించేది, స్పూర్తిని నింపి జాగృతం చేసేది సాహిత్యం. సమాజంతో సంబంధం లేని సాహిత్యం మానజాలదు. దండలో దారం వలె శతకాలలోని పద్యాలు జీవన విలువలను, తాలుకు వాటి లోతులను ఆవిష్కరిస్తూ అంతిమంగా వ్యక్తీ శ్రేయస్సును సమాజశ్రేయస్సును ఆకాంక్షించి రాయబడినవిగా అయి ఉంటాయి.
ఈ ప్రాంత కవులు శతకాలలో వ్యవసాయ రంగానికి సంబంధిత అంశాలను ఏవిధంగా వెల్లడించారో కొన్ని శతకాలను పరిశీలిద్దాం.
2.1 బ్రతుకుబాట శతకం (ఆత్మప్రబోధశతకం)
మడిపల్లి భద్రయ్య కవి ఈ శతకం ద్వారా మానవ సమాజంలో గుణాత్మక మార్పును, శ్రేయస్సును చైతన్యాన్ని కోరి 'భద్రయా విని దిద్దుకో బ్రతుకు బాట' అనే మకుటంతో “బ్రతుకుబాట” శతకాన్ని రచించారు. వీరు గేయ పద్య వచన ప్రక్రియల్లో ముపైకి పైగా ప్రసిద్ద రచనలు చేశారు . పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యతకు అలవాలం అడవి. జనాభా పెరుగుదల నగర విస్తీర్ణంచే అడవి శాతం తగ్గుతూ వస్తుంది. ఉండవలసిన స్థాయిలో అటవీ సంపద లేకుండా పోవడంచే బ్రతుకు అగమ్య గోచరమవుతుందని హెచ్చరిక చేస్తూ. అడవిని ఆశ్రయిoచి పక్షి, పశు సంపద వృద్ది చెందుతుందని, వ్యవసాయరంగానికి అటవీ సంపద ఏంతో మేలు చేస్తుందనే ఎరుకను ప్రకృతి ప్రేమను కవి ఈ పద్యంలో తెలియ పరిచారు.
“అడవి లేకున్న బతుకంత అడవిగాదే/చెట్ల వలననె ఇక్కట్లు చేరరావు
తెలిసి తెలియనటుండగా తెర్లుగాదే/భద్రయా విని దిద్దుకో బ్రతుకు బాట”2
2.2 మనసు పొలిమేరల్లో
ఈ శతకాన్ని బొందిడి పురుషోత్తమరావు రచించారు. వీరు వైడుర్యపురంలో జన్మించారు. ప్రభుత్వ విశ్రాంత ఉపాధ్యాయులు. వృత్తిలో ఉన్నప్పుడు వీరి ఉత్తమ సేవలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకున్నారు. ప్రత్యూష మాస పత్రిక మరియు నిర్మల భారతి సాహితీ సంస్థను స్థాపించి, సాహితీ కృషి చేశారు. సరస్వతీ శతకం, మనసు పొలిమేరల్లో అనే శతకాలు కుడా రాశారు తటిల్లత, సహ్యాద్రి పరిమళాలు మొదలగు కవితా సంకలనాలు వెలువరించారు.
ఒకప్పుడు చేతికొచ్చిన పంటను గోనె సంచి నింపి ఎడ్లబండి పైనే ఇంటికి తరలించుకొని వ్యవసాయదారులు గాదెలలో నింపుకొని నిల్వ చేసుకునేవారు. ఆ వరి పంట పసిడి ఛాయాతో కనులకు పండగయ్యేది. గాదేనిండానిండి హృదయానికి ఎంతో సంబరాన్ని వంపుచేసేదని. పంటఇంటికి రావడం తో రైతు లో ఆనందం వెల్లివిరిసే ఉత్సాహాన్ని కవి మననం చేస్తున్నాడు. ఇప్పుడు పండించిన చోట నుండే దళారులు కొనుగోలు చేసి వాహనాలలో ధాన్యంను తలించుకుపోతున్నారు. నాటి పరిస్థితిలు కానరావని కవి గుర్తుచేస్తున్నాడు దిగివ పద్యంలో
కం . “ఎడ్ల బండి నెక్కి నిట్లే చేసుకు వెళ్ళి/ పంట గోనె నింపి యింటి కరుగ
ఛాయా వంట పండగ కనులార/ ఇంటి గాదె నిండె ఇంపు పెంపు” 3
2.3 మధుసూదన శతకం:
మంగ్లారపు దివాకర్ ఈ శతకంను రాసారు. ఇందులో తేటగీతి పద్యాలున్నాయి. వస్తు ఉత్పత్తి చేసి ఉత్పత్తికారుడు తాను ఉత్పత్తి చేసిన ధరను నిర్ణయించినట్లు . రైతు తాను పండించిన పంటకు తానే ధరను నిర్ణయించే స్వత్రంత లేకుండా ఉండడాన్ని కవి తెలియ జేశాడు ఈ పద్యంలో. భూ పై ఉత్తముడు ఎవరంటే అతడే అన్నదాత అని ప్రేమతో ప్రకటించుతాం. కానీ తన శ్రమకు దక్కవలసిన హక్కులను రాజనీతి కాలరాస్తుందని కవి వాపోతాడు.
“వస్తు మూల్య నిర్ణేత ఉత్పత్తి దారు / ధాన్య ధర జెప్ప నొప్పరే దాత రైతు
రైతు హక్కులను కబలించె రాజనీతి /భావ సుధమధు సుధన భాసితమ్ము” 4
2.4 పూలబాల శతకం
జాదవ్ పుండలిక్ రావు పాటిల్ తానూర్ మండలంలోని బెంబెర గ్రామంలో జన్మించారు. వీరు పననాలు గేయాల సంకలనం, పొండురంగ శతకం, నిజదర్భరనం కైతికాలు మొదల రచనలు చేశారు. చెరువులో ఉండే సారవంతమైన మట్టిని పంట పోలాలో సహజ ఎరువుగా వాడేవారు రైతులు . అది పొలానికి సారవంతాన్ని ఇచ్చి అధిక దిగుపడికి ఉపయోగ పడేది. అధిక దిగుబడి ఆశతో కృత్రిమ ఎరువుల వాడకంతో భూమి సారవంతత కోల్పోతుందని కవి పర్యావరణ స్పృహ తెలియజేశాడు.
“చెరువు మన్ను బోయ చేసుకు బలమగు /బరువు తోడ మొక్క బలసి పోవు
బలిసి నట్టి పైరు బాగుగా సిరినిచ్చు/ పుండరీకు మాట పూల బాట”5
2.5 రామరెడ్డి శతకం
పంట ఉత్పత్తిని అందించే ప్రధాన వనరు విత్తనం. రైతులు నాణ్యమైన సాగు విత్తనాలను కూడా బెట్టుకొని రక్షించుకొనేవారు. కల్తీ లేకుండా విత్తనాలు ఉంటే సారవంతమైన మంచి దిగుబడి అంది రైతు శ్రమ, కాలం వృధా కాకుండా ఉంటుంది. విత్తనాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని కవి తెలియజేశాడు.
“పుచ్చు విత్తనంబు పుడమి లోవేసిన/చచ్చి పోవు మొలక సాగదిలను...”6
2.6 శ్రీవెంకటేశ్వర శతకము
ఈ శతకాన్ని రావుల చంద్రకళ రాశారు. ఖానాపూర్ వాస్తవ్యురాలు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు. వ్యవసాయం అంటే పంటలు పండించడమే కాదు .ప్రకృతి , ఆర్టిక సామాజిక అనుభందాలతో ముడిపడినది రైతుజీవన తత్త్వం. రైతు వల్ల అందరు ఆనందంగా ఉంటారని , కవయిత్రి రైతు శ్రమకు ఇవ్వవలసిన గౌరవాన్ని పేర్కొన్నారు.
“రైతు లేని నాడు రాజ్యమే యుండదు/రైతు యున్న యెపుడు రక్షణిచ్చు
రైతు వల్ల జనము రంజింప బడెదరు సిరుల వేంకటేశా శరణు నీవే” 7 .
2.7 వాసుదేవ శతకం
సారంగ పూర్కర్ సుమతి వాసుదేవ శతకమును రచించారు. మంచి ఆలోచనలు వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే అలంకారాలు అయినప్పటికీ జనం ధనమే విలువైనది అనుకుంటారు కాని రచయిత్రి అంతకన్నా మంచి మంచి తలంపులే విలువైనవని బలమైన అభిప్రాయాన్ని ఈ పద్యంలో వెల్లడిస్తుంది.
ఆ.వె: “విత్తమంది మనిషి చిత్తము నిలుపును/మంచి తలపులన్ని మదిలొ చెరచి
ఏద్చుచుండే నేడు యేకాకిగా నిల్చి/ వందనాలు తండ్రి వాసుదేవ”8
రైతు గొప్పతననాన్ని వివరిస్తూ రైతును రాజుగా అభివర్ణించారు.
“హలము పట్టి తాను పొలము పనులు చేసి/ కష్ట పడుతూ మనల కడుపునింపు
అట్టి తైతే రాజు అవనిలో నిజమిది/ వందనాలు తండ్రి వాసుదేవ” 9
2.8 సత్యసూక్తి శతకం
గడ్డం సత్యపాల్ రెడ్డి సత్య సూక్తి శతకమును రచించారు. దీనిని ఆటవెలది పద్యాలలో తన భావాలను ఇనుమడింప చేశారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యం విలువలను పెంపొందించాలని ఆకాంక్షించారు. ఈ శతకంలో కవి శీర్షిక పేరుతో ప్రతి పద్యానికి అంశ ప్రకటన చేసి సంస్కృత శతక విభజనను అనుసరించి. వినూత్నతను తెచ్చారు.
వ్యవసాయం, ఋతువులతో జూడమని వ్యవసాయవేత్తలు ప్రస్తావిస్తారు. ఋతువులు గతి తప్పి వర్షాకాలం కురవాల్సిన వర్షాలు కురువకపోవడాన్ని, కరువుకు కారణం ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అదేసమయమంలో ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రజలు మారవలసిన అవసరాన్ని కవి గుర్తుచేస్తున్నారు. ఋతువులు,కరువు విపత్తులు రైతుల జీవితాలను ప్రభావితo చేస్తాయని కవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆ.వె “వర్ష ఋతువు వేళ వర్షాలు కరువాయె/మేఘుడేల నేడు మేను దాచె
కరువు కళ మొచ్చె కారణమెవ్వరు/సత్యపాలు మాట సద్దిమూట”10
అతడు లేని నాడు అన్నము లేదాయె (24 పద్యం) అన్నదాత యిలను యారాధ్య దైవంబు అని (23 పద్యం రైతు గోప్పతాన్ని చెబుతూ అతని వెతలు తీర్చు రాజ్యమే రంజిల్లు అని కవి ప్రకటిస్తాడు.
2.9 దివ్యనరసింహ శతకం
దీనిని శేషం శఠగోపం నరేశాచార్యులు రాశారు. మకుటం దైవాన్ని సంబోధిస్తు ఉన్నా ఇందులో ఆటవెలది పద్యాలతో చక్కటి నీతులు శతకం నిందాఉన్నాయి.
ఆమె: “నీలి మబ్బు మనకు నీరిచ్చి కాపాడు/ చెరువు తోడ పైరు చెలిమ జేయ
చెట్లు పెంచుడెపుడు చినుకురాలు కొరకు/దివ్య నారసింహ దీనబందు” 11
చెట్లు పెంచడం తో మబ్బుకు చినుకుకు, చెరువుకు మరియు పైరుకు ఉన్న చక్కటి వాటి చెలిమిని. అవినాభావ సంబంధాన్ని కాపడటంలో వ్యవసాయ రంగ మనుగడ ఆధారపడి ఉంటుందని ప్రకృతి ప్రేమను కవి ప్రకటిస్తున్నాడు .
3. ఉపసంహారం
- నిర్మల్ కవులు తమ శతకాల్లో తాము దర్శించిన సమాజాన్ని నిశిత దృష్టితో గమనించి వ్యవసాయ రంగ అభివృద్దికి జరగవలసిన కృషి, చేపట్టవలసిన పర్యావరణం పరిక్షణ చర్యలు, కల్తీ లేని విత్తనాలపంపిణి ఉండాలని, రైతు ఈ పుడమి పై దైవంతో సమానమని, తన పంటకు తానే ధరను నిర్ణయించే అధికారం ఉండాలని అకాoక్షించారు.
- సరళ సుభోధకమైన శైలిలో లోతైన భావగంభిరత ఉండే విధంగా పద్యాలు రచించారు.
- తెలంగాణా జీవ పదాల వాడుక, వ్యవసాయ అనుబంధ సాహిత్యం మీద అంతగా అధ్యయనం ఈ జిల్లాలో జరగలేదు. అందుకు ఈ వ్యాసం దోహదపడుతుందని భావిస్తున్నాను.
4. సూచికలు
- ఎల్లూరి శివారెడ్డి, ప్ర .సం జె. చెన్నయ్య,సం. నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం(2024) తెలంగాణా సారస్వత పరిషత్తు హైదరాబాద్, పుట-386
- మడిపల్లి భద్రయ్య, బ్రతుకు బాట శతకము, పుట- 15
- బొందిడి పురుషోత్తం రావు ,మనసు పొలిమేరల్లో శతకం, పుట -41
- మంగ్లారపు దివాకర్ , మధు సూదన శతకం ,పుట-2
- జాదవ్పుండలిక్ రావు పాటిల్, పూల బాట శతకం, పుట- 32
- నల్లా రామరెడ్డి . రామరెడ్డి శతకం, పుట- 39
- రావుల చంద్రకళ, శ్రీ వెంకటేశ్వర శతకము, పుట-5
- సుమతి సారంగ పూర్కర్, వాసుదేవ శతకం,పుట -28
- సుమతి సారంగ పూర్కర్, వాసుదేవ శతకం, పుట -34
- గడ్డం సత్యపాల్ రెడ్డి, సత్య సూక్తి శతకం , పుట -41
- శేషం శఠగోపం నరేశాచార్యులు , దివ్య నరసింహ శతకం, పుట -9
5. ఉపయుక్తగ్రంథసూచి
- గిరిజా మనోహరబాబు, జి. (2012) తెలుగు శతకాలు, పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- గోపాలకృష్ణరావు, కే (1976) ఆంధ్ర శతక సాహిత్య వికాసం, ప్రతిభా ఆర్ట్స్ ప్రింటర్స్, హైదరాబాద్.
- చంద్ర కళ రావుల, (2020) శ్రీ వెంకటేశ్వర శతకము గోదావరి & గ్రాఫిక్స్ & ప్రింటర్స్ జగిత్యాల.
- తెలంగాణా సారస్వత పరిషత్ (2024), నిర్మల్ జిల్లా సమగ్ర స్వరూపం, హైదరాబాద్
- తెలుగు సాహిత్యం తెలంగాణా సాహిత్యం (2021). డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం, హైదరాబాద్
- దివాకర్ మంగ్లారపు (2008) మధుసూధన శతకం, శ్రీ కళాంజలి గ్రాపిక్స్ హైదరాబాద్,
- నరేశాచార్య శేషం శఠగోపం (2016) దివ్యనరసింహ శతకం, తెలుగు సాహితీ పీఠం
- పురుషోత్తంరావు బొందిడి (2022) మనసు పొలిమేరల్లో, వైడుర్యపుర సాహిత్య కళా పరిషత్, వడూర్
- పుండలిక్ రావు పాటిల్ జాదవ్, (2021) పూలబాట శతకం, కవియాత్ర ప్రచురణలు.నిర్మల్
- భద్రయ్య మడిపల్లి (2019) బ్రతుకు బాటశతకం, దేవి కల్యాణి ప్రింటర్స్, హైదరాబాద్.
- రామరెడ్డి నల్లా (2021), రామరెడ్డి శతకము, శారద గ్రాఫిక్స్ & ప్రింటర్స్ నిర్మల్
- సత్యపాల్ రెడ్డి గడ్డం. 2019 సత్యసూక్తి శతకం 2019. నిర్మల్: ఉమా పబ్లికేషన్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

