AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. కాకులపాటి రాధాసుందరమ్మ శతకాలు: వర్ణనలు
చెన్నా సాయిరమణి
పరిశోధకులు, తెలుగుశాఖ
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8688399796, Email: ramani2000sai@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.07.2025 ఎంపిక (D.O.A): 31.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యం శతకం అనేది ఎంత ప్రాచీనమో అంత నవీనం.శతక ప్రక్రియ నాటి నుండి నేటి వరకు ప్రతి యుగం గొప్పగా ఆదరించింది. ప్రతి కవి ఏదో సందర్భంలో శతకం రాయకుండా తన సాహిత్య ప్రస్తానం రాయకుండా ఉండరన్న మాట నూటికి నూరుపాళ్ళు సత్యం. అలాంటి కోవలోకి చెందినవారే రాధా సుందరమ్మ గారు. వీరు కళింగాంధ్ర ప్రాంతమైన విశాఖపట్నవాసి. ఈమె సుమారు 5 శతకాలు లభ్యమవుతున్నాయి. వీరి శతకాలన్నీ ఆధ్యాత్మిక కోవలోనే సాగాయి.అవి శ్రీ హనుమత్ శతకం, శ్రీ (వెంకట)రమణ శతకం, శ్రీ గోపాల శతకం,శ్రీ శివ శతకం,శ్రీ లలితా శతకం. ఈ శతకాల్లో ఆమె రూప వర్ణన, పదప్రయోగం, విశేషాలు, వినూత్నాంశాలు ఇలా పలు కోణాల్లో వీరి శతకాలను విశ్లేషించవచ్చు. ఇప్పటివరకు ఈమె పూర్తి శతకాలని ఎవరు విశ్లేషణాత్మకంగా పరిశీలన చేయలేదు. అందుకని ఆ రచయిత్రి శతకాలని పరిశీలించబోతున్నాను.ఈమె శతకాలను ఒక సంపుటిగా మార్చి వాళ్ళ సంతతి పుస్తకముగా తీసుకోని వచ్చారు. ఆ పుస్తకాన్ని ఇప్పుడు నా వ్యాసానికి ఆకరంగా చేసుకొని వ్యాసం మలుస్తున్నాను.
Keywords: రచయిత్రి పరిచయం, రూప వర్ణన, పోలికలు, విశేషాలు, వినుత్నాంశాలు, ముగింపు
1. ప్రవేశిక
ఎందరో మహానుభావులు- అందరికీ వందనము1 త్యాగరాజస్వామి అన్నట్టు తెలుగు శతక సాహిత్యం అనంత శతకాల సంగమం. వీటిని తరచి చూడలే కానీ ప్రతి శతకంలో పదమో, వర్ణన మనల్ని కాసేపు ఆ భావనల్లో నిలబడేటట్టు చేస్తుంది.ఆ సంగమాన్ని ఎంత ఎక్కువ ఆస్వాదన చేస్తే అంత గొప్ప అనుభూతి కలుగుతుంది.అయితే ప్రాచీన శతకలు చాలా వరకు తెలిసిన అలభ్యాలు అధికమైతే మనకు తెలియకుండా ఉన్న శతకలుగా ఉండవచ్చు. వాటిని ఎలాగోలో బయటకు తేవాలని ఆశ కానీ శక్తి లేకపోయినప్పటికీ ఉన్న శతకాలని ఆస్వాదిస్తే మన తెలుగు మాధుర్యం తెలుస్తుంది. అలాంటి శతకాల్లో ఒక కవయిత్రి రాసినశతకాలను ఇప్పుడు పరిశీలన చేయబోతున్నాను.
2. రచయిత్రి పరిచయం
క్రీ. శే. శ్రీమతి కాకులపాటి రాధాసుందరమ్మా గారి కాలం 1919-1991. వీరి తల్లిదండ్రులు శ్రీ పాలూరి ముత్తం రాజు సూర్యకాంతం.వీరు మూడవ సంతానం.వీరు విజయనగరం జిల్లా రణస్థలం మందు జన్మించారు.మీరు 1957వ సంవత్సరంలో ఆంధ్ర మెట్టికురేషన్లో ఉత్తీర్ణులయ్యారు. వీరు చదువుపై విపరీతమైన ఆసక్తి కలదు. వీరి భర్త శ్రీ కాకులపాటి కృష్ణమూర్తి గారు. వీరి సంతానం ఐదుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. రచయిత్రి కృష్ణ భక్తురాలు. రాధాసుందరమ్మ గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే ప్రాధమిక, మధ్యమ, రాష్ట్ర భాష పరీక్షలు పాసయ్యి ప్రవేశిక పరీక్ష 1960సం” పాసయ్యారు. వీరు ఐదు శతకాలు రాసారు. అవి శ్రీ హనుమద్, శ్రీ (వెంకట)రమణ, శ్రీ గోపాల, శ్రీ లలితా శతకాలు. అముద్రితముగానున్న ఈ శతకాలను వారి బిడ్డలు సంకలనం చేసి ముద్రించారు. ఇప్పుడు రచయిత్రి శతకంలో ఉన్న విశేషాలను ఒక్కోటిగా పరిశీలన చేస్తున్నాను.
3. ఎంపికచేసుకున్న శతకాలు - వర్ణనలు
3.1 రూపవర్ణన
జిహ్వకో రుచి పుర్రెకో బుద్దని పెద్దలు ఏనాడో చెప్పారు. అలానే రచనల్లో కూడా కవి ఆలోచన అనుగుణంగానే వర్ణన కానీ, మలుపు కానీ తార్కాణముగా ఉంటుంది.
3.1.1 హనుమద్ శతకం
ఇప్పుడు రాధాసుందరమ్మ గారు రాసిన హనుమద్ శతకములో హనుమని
బాల రవి బింబమున్ గని
బాల ఫలమని భ్రమించి |చపలత తోడన్
హేల గగనంబు కెగసిన
బాల్యంబున హనువు భగ్న। మయ్యెనట హనుమా! (హనుమద్ శతకం 5వ పద్యంలో)
చిన్న ఫలమని చపలత్వంతో సూర్యమాండలానికే వెళ్ళారు అన్నారు. ఇక్కడ కవయత్రి రూపం అంటే కేవలం దేహదారూడ్యమే కాదు గుణాలు గురించి కూడా చెబితే అది సంపూర్ణ రూప వర్ణన అని భావించి హనుమలో ఉన్న చపలత్వం అనే విషయాన్ని వివరిస్తూ అతని బలాన్ని వివరించారు.
వేదాధ్యయనంబొప్పగ
నాదిత్యుని యాశ్రయించి | యతి భక్తుడవై
యాధేవునను గ్రహమున
యాదరమున విద్యలెల్ల | నందవె హనుమా !(హనుమద్ శతకం7పద్యంలో)
హనుమ విద్యభ్యాసం కొరకు సాక్షాత్ ఆదిత్యున్ని ఆశ్రయించారని వివరించటంలో హనుమ శక్తి, యుక్తిని పరోక్షంగా తెలిపే ప్రయత్నం చేశారు.
వాయుసుత దీనపాలా
ధీయుతపింగాక్ష దురిత । దానవహరణా
భయవారణ అరిసూదన
హయముఖ మము బ్రోవరావ |అంజలి హనుమా!(హనుమద్ శతకం 13వ పద్యంలో)
హనుమ వాయుసూతుడని వారి శౌర్య పరాక్రమాలను వివరిస్తూ హనుమ రూపాన్ని మదిలో తలచేట్టు చేశారు.
హనుమ పరాక్రమాన్ని ఇంకను 50 నుంచి 60 పద్యాలు వరకు ఆయన సాహస కార్యాలు వివరిస్తూ ఎంత బలిసాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఇంకను ఇలాంటి పద్యాలు ఆద్యంతం హనుమ రూపాన్ని వర్ణించారు.
3.1.2 శ్రీ (వెంకట) రమణ శతకం
వెంకటేశ్వర రూపాన్ని చెప్తున్నప్పుడు ఆయన స్థలాన్ని,అతని వైభవాన్ని చెబుతూ స్వామి రూపాన్ని కంటికి చూపించే ప్రయత్నం చేశారు.
శేషాద్రి శిఖరవాసా
దోషాచర దళన యంచు దొరకొని పొగడన్
భాషయు భావమునంగల
దోషములెంచకు దయను ప్రభో శ్రీరమణా!( శ్రీ (వెంకట)రమణ శతకం3వ పద్యం)
స్వామి శేషాద్రినందు నివసిస్తున్నారని చెబుతూ వారి స్థలం గురించి ప్రారంభించడంలో…ఎవరైనా పరిచయం చేయాలంటే కొందరు వారు ఊరు నుండి మొదలు పెట్టి చెప్పే అలవాటు ఉంటుంది. అలాంటి పంధాను అనుకరించి రాధా సుందరమ్మ గారు స్వామిని వర్ణించడం మొదలుపెట్టారు.
భవబంధహర! ముకుందా!
తవచరణాబ్జముల గొల్చి । తరియించుటకై
అవిరళధ్యానము చేయగ
నవకాశమొసంగుమంటి | నార్తిని రమణా ॥
ఖగరాజ గమన! మాధవ!
సుగుణాకర! దీనపాల! సురనుతనామా!
అగణిత గుణ గంభీరా!
వగ దొలుగ భజింతు బ్రోవు । వరదా రమణా ॥
కరుణాలయ! మాంపాలయ!
కరివరదా! భర్మచేల! కస్తురిఫాలా!
సురగణవందిత! కావుము
సిరి, మంగల కూడి వేగ | శ్రీధర రమణా ॥( శ్రీ (వెంకట)రమణ శతకం11-13 పద్యాల్లో)
స్వామిని స్తుతిస్తూనే వారి గుణాలు కీర్తిస్తూ వారి రూపాన్ని మదిలో తెలియాడేటట్టు చేశారు.
ఇలా స్వామిని చాలా పద్యాల్లో-
కమలాక్ష! శ్రీకళత్రా!
భ్రమలను పోద్రోలినీదు । భావన యెపుడున్
నామది మరువక యుండగ
కామజనక వరములిమ్ము । కరుణతో రమణా ॥(శ్రీ (వెంకట)రమణ శతకం21వ పద్యం)
ఫణిరాజ శయన! కేశవ!
మణిఖచితకిరీటధారి! మాధవ! శౌరీ!
క్షణికములగు సిరులేల?
న గణితగుణా! నీదుసేవ | గలుగగ రమణా ॥( శ్రీ (వెంకట)రమణ శతకం29వ పద్యం)
వలె స్వామిని కీర్తిస్తూ స్వామి రూపాన్ని వర్ణించారు.
3.1.3 గోపాల శతకం
గోపాలను వర్ణించేప్పుడు ఆయన సాహసాలు ప్రముఖ ఘట్టాల ఆధారంగా చేసుకుని వర్ణించారు. గోపాలుని మోము చూస్తే చాలు ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్పడం ద్వారా కృష్ణుడు
మోము యొక్క దివ్యత్వం పరోక్షంగా-
సుందరవేషముదాలిచి
నందుని మందిరము జొచ్చి | నగుమోమునయా
ముందరితొట్టెలొబాలున
కందముగా చన్ను గుడిపె | నంతగోపాలా ॥ (గోపాల శతకం15వ పద్యం)లో తెలిపారు.
గోపాలుని బాల్య చేష్టలు, లీలలు వర్ణిస్తూ అతని గొప్పతనం చెప్పడం వెనుక ఆయన మనస్తత్వంతో పాటు అల్లరి గుణంతో అందరివాడిగా మారాడు అని చెప్తు ఆయనపై రాసిన ప్రతి పద్యములో నవ్వు గురించి మోము గురించి (ఉదాహరణకు
గోపీగోపకులెల్లను
నాపాపలముద్దుమోము | లరలింపతగన్
రేపవలువారిగంటికి
రెప్పవలెన్గాచియుండి | రంతగోపాలా ॥ (.గోపాల శతకం18వ పద్యం )
లో ఇలా ఒకటికి రెండు పద్యాలలో నవ్వు గురించి, మోము గురించి ఇలా ఒకటికి రెండు పదాలను విషయ వర్ణంతో తెలుపుతూ రూపాన్ని చూపించే ప్రయత్నం కనిపించింది.
ఇక ఒకటి రెండు పద్యాలలో వారిని స్తుతిస్తూనే ఆయన చిరునామా చెప్పినట్లు చెబుతూ వారి గురించి కొంత అవగాహన తీసుకొస్తూ, విష్ణువు గోపాలుడు ఒక్కరే అన్ని చెప్తే వారి రూపాన్ని గోపాలని రూపాన్ని కలగలిపి చూపించే ప్రయత్నం చేస్తూ ఓ కొత్త భావం నింపటంలో ప్రారంభిస్తూ రూపం కంటే గోపాల లీలలు వారి రూపాన్ని పాఠకులకు అందుకునే ప్రయత్నం చేయటానికి కొత్త తోవలో నడిపించారు.
3.1.4 శ్రీ శివశతకం
శివుని రూపాన్ని చెప్పటానికి కవయిత్రి శతకమును ఇంకా వినూత్న కోవను ఎంచుకున్నారు. ప్రతిపద్యములో ప్రారంభ పాదంలో రూప వర్ణన చేస్తూ తరువాత వేడుకోవడంతో లేకపోతే ఇంకా వర్ణన కానీ చేయటం కనిపిస్తుంది.
ప్రతి పద్యంలో స్వామి రూపాన్ని వర్ణిస్తూ చెప్పడం ద్వారా పద్య పద్యంతో స్వామి యొక్క గొప్పతనంతో పాటు శతకాంతంలో వారి రూపం మదిలో నిక్షిప్తం అయ్యేందుకు చాలా ఆస్కారం కనిపిస్తుంది కవయిత్రి ఉద్దేశం కావచ్చు.
గంగాధరా, పరేశా
లింగాయనినిన్ను గొల్వ | నీప్సిత ఫలముల్
గంగాస్రవంతివలెనే
పొంగారుచు చెంతజేరు। పొలుపార శివా ॥( శ్రీ శివ శతకం 4వ పద్యము)
కాశీపురాధినాధా
విశ్వేశపురాణపురుష | వినుత సురేశా
విశ్వంభర, కరుణాకర
విశ్వతమోహరణ మనవి | వినవయ్య శివా ॥( శ్రీ శివ శతకం 6వ పద్యము).
ఇలా ఒక్కోనామం తీసుకుని వారిని వర్ణించారు. ఇవి సంస్కృత నామాలున్నప్పటికీ మనం వాటిని ఎలా తెలుగులో సొంతంగా మలుచుకోవడం వలన పాఠకులు కూడా ఇబ్బంది అనిపించకపోవచ్చు. ఇలా ప్రతిపద్యంలో స్తుతిస్తూ స్వామి రూపాన్ని సాక్షాత్తు కవయత్రి ప్రయత్నం చేశారు.
3.1.5 శ్రీ లలితాశతకం
అమ్మవారి రూపాన్ని చూపించిన కవయిత్రి మొత్తం శతకమంతా ఆమెనే వర్ణిస్తూ వేడుకుంటూ కీర్తిస్తూ రూపాన్ని వర్ణించే ప్రయత్నం చేశారు.
ప్రతిపద్యంలో అమ్మవారి రూపాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు. అమ్మ పేర్లు ప్రస్తావిస్తూ
అండజవాహనుసోదరి
ఖండితరిపుమస్తకాళి | కలితకరాళీ
చండీశ్వరి, చాముండీ
భండన అరిరాజి, భవము । బాపుము లలితా ॥ (శ్రీ లలితా శతకం 5వ పద్యము)
ఆమె రూపాన్ని చూపించే ప్రయత్నం ఓ విధం అయితే, ఆమె యొక్క గొప్పతనం చెబుతూ కీర్తిస్తూ వైభవం ద్వారా రూపాన్ని వివరించేటట్టు ఉదాహరణ
సురవరవందిత చరణా
పరిపూర్ణదయానిధాన | పాలిత భువనా
హరి హర బ్రహ్మాదులకును
దరమేనిను దెలియమదిని | దలచెద లలితా ॥( శ్రీ లలితా శతకం 6వ పద్యం)
ద్వారా చూపించే ప్రయత్నం మరో రకం.
అమ్మ కరుణాని చెబుతూ మదిలో భక్తి పెంచేట్టు చేస్తూ
అజ్ఞానాంధవిమోచని
సుజ్ఞానము నొసగి బ్రోవు । శుభగుణచరితా
విజ్ఞాన మార్గగామిని
ప్రజ్ఞాప్రాభవమొసంగి | బ్రోవుము లలితా ॥ ( శ్రీ లలితా శతకం 17వ పద్యం)
ద్వారా ఆమె యొక్క ప్రేమ రూపం తెలిపే ఓ కోణం.. ఇలా శతకమంతా ఒక్కో విధంగా అమ్మ స్తుతిస్తూ ఆమె రూపాన్ని ఆమె నామాలతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఆమె రూపాన్ని మదిలో నిలిపే ప్రయత్నం చేశారు.
4. పోలికలు
ఎవరిని ఎవరితోనైనా,దేనితోనైనా పోల్చాలంటే ఒక్కొక్కరిది ఒక్కో భావం. ఈ కవయత్రి కూడా తనదైన రీతిలో పోలికలను ఎలా పోల్చారో చూద్దాం.
జలధి పొంగినట్లు శరీరం పొంగినదని హనుమత్ శతకమున
ఉప్పొంగు జలధి వోలెను
నుప్పొంగుచు తనువు మిగులు నున్న తగిరియై
యొప్పగ మోదము తోడుత
కుప్పించిన ధరణి కదలి | కృంగదె హనుమా!(హనుమద్ శతకం 45వ పద్యంలో)
ఆంజనేయ కాయం పెంచటాన్ని పోల్చడం ద్వారా వారు ఉన్నది సముద్రం ఒడ్డున ఇక పోలిక కూడా దూరంగా వెళ్లకుండా అక్కడే ఉన్న సముద్రాన్ని హనుమ శరీరంతో పోలుస్తూ కవియత్రి చమత్కారాన్ని చూపించారు.
గోపాల శతకముల
వచ్చినరక్కసు జూచియు
ఖచ్చితమగునొక్కతాపు |కాలితొదన్నన్
చిచ్చరపిడుగుంబోలెడు
హెచ్చగునాదమునయుసురు |లొదలెగోపాలా ॥( గోపాల శతకము 21వ పద్యం)
లో రక్కసులను చిన్నవాడిగా ఉన్నప్పుడే సంహరించరు కనుక చిచ్చర పిడుగు వలె అందర్ని సంహారం చేసారని గోపాలుడిని చిచ్చరపిడుగుతో పోలుస్తూ చెప్పడం కనిపిస్తుంది.
ఇలా చిన్ననాటి లీలలను వర్ణించిన గోపాల, హనుమ శతకాలను పోలికలు ఓ మోస్తరుగా చూపించారు కానీ స్తుతిస్తూ మిగిలిన శతకాల పోలికలను అవసరం లేని వాటికి అందులో పరిహరించారు.ఎక్కడ ఏది అవసరమో అది ప్రయోగించే విజ్ఞత కవయత్రి కి ఉందని ఈ ఉదాహరణ ద్వారా తెలిసింది.
5. విశేషాలు
రాధా సుందరమ్మ రాసిన ఐదు శతకంలో కొన్ని విశేషాలు దాగి ఉన్నాయి.
1. ప్రధానంగా ఈమె శతకంలో ప్రతి పద్యం రెండు వాక్యాల సమ్మేళనం వలె ఉంటుందని పరోక్షంగా గీతలను పెట్టి చెప్పడం కనిపిస్తుంది. అలా గీత పెట్టు వెనక లిప్త పాటుకాలం ఆగి చదివితే చదివే వారికి, వినేవారికి కూడా అర్థవంతంగా ఉంటుందని చెప్పటం.అలానే ఎలా చదవాలి ఈ శతకాల ద్వారా తెలియజేసారు.
2.వీరు శ్రీకారంతో మొదలుపెట్టడం, విఘ్నపతిని స్తుతించడం. అలాగే శతకాంతములో ఫల శృతితో కానీ విన్నపంతో కానీ ముగించటం ప్రతి శతకంలో కనిపిస్తుంది. ఈ ఆనవాయితి సంస్కృత ప్రభావం వలన జరిగింది అని పెద్దలు ఉవాచ. ఆ ఆనవాయితీని కవయిత్రి కాలం నందు కూడా పుష్కలంగా వాడేవారిని ఇమె శతకాలే తార్కాణంగా కనిపిస్తున్నాయి.
3. ఈమె తన శతకములో సంస్కృత పదాలు వాడిన దీర్ఘంగా కాకుంటే చిన్నపాటి నామ పదాలతో సరళంగా శతకాలని హత్తుకునేటట్లు తీర్చిదిద్దడం విశేషంగా చెప్పుకోవచ్చు.
6. వినూత్నాంశాలు
- హనుమత్ శతకములో హనుమ శౌర్యం చెప్పేందుకు ఆయన సాహసాలు వర్ణిస్తూ ఆ సంఘటనలు కళ్ళకు కట్టినట్టు చూపించారు
- ఎవరి గురించి అయినా గొప్పగా చెప్పాలన్నా వారి సాహసాలు చెప్పాలన్నా లోకనీతులు ఉపయోగించి లోకనీతి తాడుతో భక్తి శతకముగా మార్చడం కనిపిస్తుంది.
- ప్రతి పాదం అందు రెండవ అక్షరం యతితో ఐదు శతకాలల్లో ఏ ఒక్కసారి కూడా నియమం తప్పకుండా వాడడం ద్వారా చాలా ప్రాస పదాలు శతకముందు కనిపిస్తాయి.
- ఈమె అన్ని భక్తి శతకాలే రాసారు. ఒక్కో శతకం ఒక్కో దేవుని గురించి రాయటం. ఏ దైవం పై కీర్తించిన రాసిన ఆ దేవునిపై భక్తిని తొనగకుండా చక్కగా పాఠకుల హృదయాలలో భక్తి పెంచేటట్టుగా, స్తుతి చేస్తూ రచించారు.
- అవతార రూపులు గురించి శతకాలు రాసినప్పుడు ఘట్టాలు ఆధారంగా చేసుకుంటే, మూల రూపాలకు వారి గాథల ఆధారంగా చేసుకుని ఆ పరిధిని దాటకుండా రాయడం కనిపిస్తుంది.
- కవియిత్రి ఆది దంపతుల గురించి, త్రేత యుగ హనుమ, ద్వాపర గోపాల,కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశుని స్తుతిస్తూ రాయటంలో ప్రతి యుగాన్ని చెప్తూ మూల రూపాలయిన శివపార్వతులు అని పరోక్షంగా బోధనతో ఐదు శతకాలను మలిచారని అనిపిస్తుంది.
- కవియిత్రి వేడుకోలు శివ,లలిత,వెంకట శతకాలలో కనిపిస్తాయి.ఎందుకంటే గాధలు చేస్తూ వేడుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. అదే ఘట్టాల వివరించినప్పుడు వర్ణనకు ప్రాధాన్యం అధికం అవుతుందని వీరి శతక పరిశీలన ద్వారా అవగతం అయింది.
7. ఉపసంహారం
- ఆంధ్రవాజ్మయమున నన్నయ కాలమునుండి నేటివరకు వివిధ కావ్యప్రక్రియలు క్రమపరిణామ వికాసముల నొందినవి
- అలానే ఇప్పుడు కవయిత్రి రచించిన ఈ శతకంలో రచయిత్రి ఎన్నో అంశాలు పరోక్షంగా తెలిపారు. వీటిపై ఇంకను వివిధ అంశాల్లో వివిధ కోణంలో చూస్తూ పరిశీలన చేసే అవసరం ఎంతైనా ఉంది.
- ఈ శతకం 1900 కాలం నాటిది అయినప్పటికీ భాషలో కఠినం లేదు.. సంస్కృత పదాలు ఉపయోగ తప్పా! భావం సరళంగా ఉన్నప్పుడు భాష కూడా అలానే ఉండాలని ఈ శతకాల ద్వారా కవియత్రి తన రచన ద్వారా సందేశాన్ని అందించారు.
- ఈ శతకాలని భక్తివి. ఇందులో కేవలం రచయిత్రి భక్తి కోణాన్ని మాత్రమే ఆవిష్కరించారు. అలానే సమాజాన్ని మార్చమని కవయిత్రి తన బాధ్యతగా దైవాన్ని వేడుకోవడం కూడా కనిపిస్తుంది.
- భక్తితో పాటు మనిషికి ఏ గుణాలు ఉండాలో కూడా తెలియ చెప్పడం కవయత్రి పరోక్షంగా తెలిపారు. ఇలా మరిన్ని కోణాల్లో ఈ శతకాలను అధ్యయనం చేసే బాధ్యత భావి పరిశోధకులపై ఉన్నది.
- ఇలా వివిధ కోణాలు పరిశీలన చేయడం వల్ల భవిష్యత్తు శతకకారులకి కవయిత్రి చూపించిన సూచనలు తారకమంత్రంగా మారుతాయని నా అభిప్రాయం.
8. సూచికలు
- శ్రీ కె.రామచంద్రన్ -త్యాగరాజకీర్తన హారము, వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్,1956, పుట-342
- డా.కె.గోపాలకృష్ణారావు-ఆంధ్ర శతక సాహిత్య వికాసం,ఉస్మానియా విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేటు పట్టము నొందిన సిద్ధాంత వ్యాసము. పుట-1
9. ఉపయుక్తగ్రంథసూచి
- ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (3,4 సంపుటాలు). తెలుగు అకాడమీ, హైదరాబాద్, first edition-2004
- కృష్ణమూర్తి, కాకులపాటి & కాకులపాటి రాధా సుందరమ్మ. శతకరాజా సంపుటి. వంశీ కృష్ణ ప్రింటర్స్, విశాఖపట్నం
- గోపాలకృష్ణారావు, కె. ఆంధ్ర శతక సాహిత్య వికాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేటు పట్టము నొందిన సిద్ధాంత వ్యాసము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్డు, హైదరాబాద్
- పైదే. శతక సౌరభం, యువ భారతి, సాహితీ సాంస్కృతిక సంస్థ, 5,కింగ్స్ వే, సికిందరాబాదు-3,
- రామరావు పంతులు, అడిదము. విస్మృత కళింగాంధ్ర చరిత్ర. ప్రథమ భాగము, ఆంధ్ర విజ్ఞానసమితి, విజయనగరం
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

