AUCHITHYAM | Volume-06 | Issue-09 | August 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. దండకారణ్య కథలు: ఆదివాసి చైతన్యం
యండమూరి సంతోషి
పరిశోధకులు, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9505669107, Email: yandamurisanthoshi65@gmail.com
ఆచార్య జర్రా అప్పారావు
ప్రొఫెసర్ & హెడ్, తెలుగుశాఖ,
ఆంధ్ర విశ్వవిద్యాలయం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492495813, Email: drraojarra@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 17.07.2025 ఎంపిక (D.O.A): 31.07.2025 ప్రచురణ (D.O.P): 01.08.2025
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో కధా ప్రక్రియ మొదలైన నాటి నుంచి నేటి వరకు అనేక అంశాలు కథా వస్తువుగా స్వీకరించి విస్తరించింది. అనేక మంది రచయితలు మనుషుల మనస్తత్వాన్ని, ఎన్నో సంఘటనల్ని కథలుగా రాసి తమదైన ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకోగలిగారు. దండకారణ్యంలోని అమాయక ఆదివాసీలకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి కొందరు కధకులు వారి కథల ద్వారా ప్రయత్నించారు సమాజంలోని వ్యక్తులను చైతన్య పరిచే ప్రతి కథ చైతన్య కథ అవుతుంది అటువంటి కథలు ఈ దండకారణ్య కథల్లో చాలానే ఉన్నాయి. వాటి పరిశీలనే ఈ “దండకారణ్యకథలు: ఆదివాసిచైతన్యం” వ్యాస రచనోద్దేశం. దండకారణ్యకథల్లో చైతన్యకథలు మాత్రమే ఈ వ్యాసానికి ప్రాథమిక ఆధారం. కొత్తచదువు, నీరీమిల, ఇద్దరు శస్త్రకారులు, సోయి. భాగాలుగా చేసి ఈ పరిశోధన వ్యాసమును రూపొందించాను. ఇంతకుముందు పాలగడ్డ మైనావతి “దండకారణ్యకథలు - ఒక పరిశీలన’ అనే సిద్ధాంతగ్రంథం, దండకారణ్య కథలు 2005- 2012, విరసం ప్రచురణ, దండకారణ్యకథలు 2013-15, విరసం ప్రచురణలు ఈ వ్యాసానికి ద్వితీయ ఆకరాలు. దండకారణ్యంలో ఆదివాసీల మీద నానాటికి జరుగుతున్న దోపిడీని ఎదుర్కోవడానికి, ఆదివాసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, వారి మీద జరుగుతున్న అన్యాయాలను వారే ఎదుర్కొనేటట్టు చేసే విధంగా ప్రస్తుతప్రభుత్వాలు, సమాజం కూడా తోడ్పాటు కలిగించాలన్న ఆశావహదృక్పం ఈ వ్యాసంలో కనిపిస్తుంది.
Keywords: దండకారణ్యం, ఆదివాసీలు,చైతన్యం, కథలు,ప్రజలు, కొత్త చదువు, సోయి, నిరీమిల.
1. ప్రవేశిక
భారతదేశంలో వింధ్య పర్వతాలకి దక్షిణంగా విస్తరించిన భూభాగమే దండకారణ్యం భారతీయ ఇతిహాసాలైనా రామాయణ మహాభారతాల్లో దండకారణ్య ప్రస్తావన ఉంది చక్కటి ఆధ్యాత్మిక ప్రాంతం హిందువులకు పవిత్ర స్థలంగా ఉండేది అనేకమంది ఋషులకు మునులకు తప్పు భూమిగా ఉండేది దండకారణ్యం భారతదేశం యొక్క మధ్య తూర్పు భాగంలో విస్తరించి ఉంది ఈ అరణ్యం అత్యధికంగా చతిస్గడ్ రాష్ట్రంలోని పాస్టర్ డివిజన్లో ఉంది ఒడిస్సా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు కూడా దండకారణ్య పరిధిలోనే ఉన్నాయి.
దండకారణ్య ప్రాంతంలో అధికంగా ఆదివాసులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు వీరి యొక్క మృతి ముఖ్య వృత్తి వ్యవసాయం పశుపోషణ అటవీ ఉత్పత్తుల సేకరణ వీరు పోడు వ్యవసాయం ద్వారా రాగులు, సజ్జలు గంటలు, జొన్నలు వంటివి పండిస్తారు అడవి నుంచి చింతపండు తేనే తుమ్మ జిగురు చీపుర్లు అడ్డాకులు ఇవన్నీ సహకరించి విక్రయిస్తుంటారు మేకలు గొర్రెలు మాంసం కోసం పెంచుతుంటారు వ్యవసాయానికి ఎడ్లు దున్నపోతులను వినియోగిస్తుంటారు మరియు పాల కోసం ఆవులు గేదెలు పెంచుతుంటారు.
మైదాన ప్రాంతప్రజలు జీవనవిధానానికి ఆదివాసీ
ప్రాంత ప్రజల జీవన విధానానికి మనకి చాలా తేడా కనిపిస్తుంది. అభివృద్ధిలో ఎంతగానో వెనుకబడి ఉన్నారు.
మైదాన ప్రాంత ప్రజల ఆధునిక సౌకర్యాలు వీరికి అందుబాటులో ఇప్పటికీ లేవు దళారుల చేత మోసపోతూ మీరు విలువైన
సంపదను కోల్పోతున్నారు సమ సమాజ నిర్మాణ సాధనకు కొద్ది మంది చైతన్యకారులు వీరి పట్ల సానుభూతితో ప్రజల
పక్షాన నిలబడి పోరాటాన్ని సాగించారు వారిలో ఎంతో చైతన్యాన్ని తీసుకువచ్చారు ఎన్నో దండకారణ్య కథలను
సేకరించడం జరిగింది. సహకరించి విరసం వారు దండకారణ్య కథలు పేరుతో రెండు సంకలనాలుగా ప్రచురించారు
అమాయక ఆదివాసీలకు జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి కొందరు కథకులు తమ కథల ద్వారా ప్రయత్నించారు.
2. ఆదివాసి దండకారణ్య చైతన్యకథలు
2.1. కొత్తచదువు
ఈ కథను బి.భానుమతి అనే రచయిత్రి చక్కగా రాసి దండకారణ్య ప్రాంత ఆదివాసి పిల్లల చదువుల్లో చైతన్యాన్ని ఏ విధంగా తెచ్చిందో ఈ కథ ద్వారా తెలియజేశారు ఈ కథ సుక్రు అనే 12 సంవత్సరాల బాలుడి యొక్క కథ. సుక్రు జనతన సర్కారు నడిపే బడిలో చదువుకునే సమయంలో మి లీషియా అనే ఆమె వారికి లెక్కలు, సాంఘిక శాస్త్రం మొదలైనవి అన్నీ కూడా వారికి శాస్త్రీయ పద్ధతుల్లో నేర్పించేది.
చదువుతోపాటు ఆమె పోలీసులు వారి మీద దోపిడీ ఏ విధంగా చేస్తున్నారు వాస్తవ ప్రపంచంలోని అన్ని విషయాలను వారికి ఆదివాసి భాషలోనే వివరించేది .అంతేకాకుండా బిర్సాముండా, కొమరం భీం కథలు చెబుతూ వారిని చైతన్యవంతులు చేసి నిజ జీవితంలో వారు ఏ విధంగా ప్రవర్తించాలో తెలివిగా నేర్పించేది. వారి భూమి మీద వారికి ఉన్న హక్కులు పంటలు గూర్చి వివరంగా తెలియజేస్తూ చైతన్యాన్ని నింపేది. వీరి అడవిని రాజకీయంగా ఎలా ప్రభుత్వం తీసుకుంటుందో సాంఘిక శాస్త్రం ద్వారా తెలియజేసేది. పనులు చేసేటప్పుడు కూలి డబ్బులు ఎలా తీసుకోవాలో లెక్కల ద్వారా తెలియజేసేది.
మొత్తంగా చూస్తే వీరి చదువు వారి జీవితాలను ఆధారంగా చేసుకుని చెప్పేది. వీరు మహిళా సంఘం ఏర్పాటు చేసుకుని దొంగసారా అమ్మకాలు,తాగొచ్చి భార్యను కొట్టే వారిని వదిలిపెట్టేది కాదు ఈ సంఘo. ఇలా సుక్రు గూడెం బతుకుల్లో చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు చూసి ఓర్చుకోలేని పట్టేలు, పట్వారిలు వారి మీద దాడి చేసి వారి గూడెం ధ్వంసం చేసి వీరి కుటుంబము నాశనం చేసి వీరి ని హాస్టల్ కి పంపించివారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి, వారు చెప్పే చదువు వీరికి అర్ధమయ్యేది కాదు సహజమైన ప్రకృతిలో పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం లో చదువుకుంటున్న సుక్రుకు హాస్టల్ వాతావరణం దుర్బరంగా అనిపించి, కొన్ని నెలలు గడిపిన సుక్రు తన ఊరికి వెళ్ళిపోయి మద్దెమాను బడిలోన చదవాలి అనుకుని దానికి అనేక రకాలుగా ప్రయత్నం చేసి చివరికి తన భాష తెలిసిన వంట అక్క సహాయం తీసుకుని పారిపోయి అడవిదారి పడతాడు.
పిల్లల చదువు అనేది ఆహ్లాదకరమైన వాతావరణంలో
సాగాలి మరియు వారికి అర్థవంతమైన వారి యొక్క మాతృభాషలోనే సాగాలి అని రచయిత్రి ఈ కథను చైతన్యవంతంగా
చిత్రించారు.
2.2 నిరీమిల
ఈ కథ రచయిత్రి యామిని ఈమె నిరీమిల వర్ణనతో కథను ప్రారంభించారు.మనసుకు ఆకట్టుకునే విధంగా ఉండే నిరీమల కళ్ళు, వాక్చాతుర్యం, నిక్కచ్చిగా మాట్లాడే స్వభావం నీరీమల సొంతం. ఈమె ఆ గ్రామానికి క్రాంతికారి మహిళా సంఘం న్యాయశాఖ బాధ్యురాలు. ఈమె ఎన్నో ఒడిదుడుకులతో కూడుకుని ఉన్న జీవితం అనిభవించినది. ఈమెను పక్క ఊరి వ్యక్తి ఎత్తుకుపోవాలని రాక్షస వివాహం చేసుకోవాలని అనుకున్నపుడు కొంచెం కూడా బెదరకుండా ఆత్మవిశ్వాసంతో అతన్ని ఎదిరిస్తు. వారిని హెచ్చరిస్తుంది అప్పటినుండ ఆమె అందరికీ ఇంకా ఆకర్షితురాలు అయింది. సంఘం యొక్క కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొని గ్రామ ప్రజలను చైతన్యం చేయడానికి ఎంతగానో కృషి చేసేది, అన్యాయంగా మరణించిన ఆదివాసి ఉద్యమకారుల మరణానికి గుర్తుగా స్తూపాన్ని నిర్మించాలని ప్రయత్నంలో ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసి ప్రజలను చైతన్య పరిచే విధంగా ఈమె కార్యక్రమాలు చేస్తుందని. ఈమె భర్త లచ్చుని పోలీసులు తీసుకెళ్లిపోతారు.
పార్టీ వచ్చిన తర్వాత దండకారణ్య ప్రాంతంలో ఎంతో చైతన్యం కలిగించి, అధిక ఉత్పత్తి మార్గాలు రావడం విద్య,వైద్య సదుపాయాలు తెప్పించి,ఎప్పుడూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను చైతన్యం చేస్తూ ఉంటుంది. గ్రీన్ హంట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంఘం. ఈ గ్రీన్హంట్ దుర్మార్గాలను అరికట్టాలనుకుని ఈమె ఒక్కరితో చురుగుగా పని చేయడంతో పోలీసులు, ప్రభుత్వం ఈమె కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈమె భర్తని జైల్లో పెట్టి అతను ఇబ్బంది పెడితే దీంతో ఈమె కుటుంబం సంఘం మానేసి ఇంట్లో ఉండమని చెప్తే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఈ సంఘం.ఒకప్పుడు పరిస్థితులు చూస్తే దు ర్బరంగా మన జీవితాలు గడిచేవి వీరికి భయపడి ఎదిరించడం మానొద్దు అని ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళను, గ్రామస్తులను చైతన్యం చేస్తూ వచ్చేది ఎన్ని ఆటంకాలు వచ్చినా వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేసింది.
భర్తను విడిపించడానికి పోలీసుస్టేషన్ కి వెళ్లి విడిపించుకుని వచ్చే టైంకి సంఘం చెట్టు మద్ది తో స్తూపాన్ని నిర్మించి ఈమెను అర్థం చేసుకుని అత్త కూడా మద్దతుగా ఉంటుంది. రచయిత్రి ఆదివాసి స్త్రీలలో ఏ విధంగా నిరీమిల చైతన్యం కలిగించిందో తెలుసుకోవచ్చు.
2.3 ఇద్దరు శస్త్రకారులు
దండకారణ్యంలో జనతన సర్కారులో పనిచేసే వైద్యులకు,బాహ్య ప్రపంచంలో పనిచేసే వైద్యులకు ఉండే భేదాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. తన జీవితంలో ఏ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేని, ఊబకాయంతో బాధపడుతున్న ఒక ప్రభుత్వ వైద్యుడు తన జీవితాన్ని యుద్ధరంగంలోని గెరిల్లా సైన్యం జీవితంతో పోల్చుకుంటాడు.
ఆదివాసి ప్రాంతంలో యుద్ధ సమయంలో వైద్య శిబిరాన్ని నిర్వహించే అమ్మాయి ఇడిమే ఈమె కేవలం ఎనిమిదవ తరగతి చదివి,యుద్ధంలో గాయపడిన గెరిల్లాలకు ఆమెకు వచ్చిన వైద్యం చేస్తూ వారి ప్రాణాలను కాపాడుతుంది. రైను అనే వ్యక్తి కంటికి పెద్దగాయం కావడంతో ప్రభుత్వ వైద్యుడిని శస్త్ర చికిత్స కోసం తీసుకువచ్చినపుడు అతను అడవి డాక్టర్లను చూసి,అడవి డాక్టర్లు వెనకబడి లేరని ఒక విధంగా చెప్పాలంటే మెరుగ్గా ఉన్నారనే విషయం అర్థం అయ్యి, ఇడిమే వైద్యం చూసి ఈయన ఎంతో మంత్రముగ్ధుడు అయ్యి, ఈ వైద్యాన్ని ఎలా నేర్చుకుందో ఆమెని అడిగి తెలుసుకోవాలనుకుంటాడు కానీ ఆమె ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి మనిషి ఆమె దేనికి స్పందించకుండా,పనిచేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉంటున్న ఈమెను చూసి "పట్టణాల్లో లాగా తమ భావాన్ని ఎక్కువగా వ్యక్తం చేయడం ఉండదేమో ఇక్కడి ఆదివాసీల్లో"1 అనుకుని ఆమె గురించి అంతా అడిగి తెలుసుకుని,ఆమెకి తనకి వచ్చిన వైద్యాన్ని నేర్పించాలని అనుకుంటాడు. ఒక డాక్టర్ బయట నుంచి వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని రోజులు వీళ్ళతో పాటు ఉండి వారికి ఇవన్నీ నేర్పించి, వెళతారు అని చెప్పి, తనకున్న సందేహాల్ని ఆ ప్రభుత్వ వైద్యుణ్ని అడిగి తెలుసుకుని శ్రద్ధగా రాసుకుంటుంది.
ఈమె ఆత్మవిశ్వాసానికి ప్రభుత్వ వైద్యుడు పరవశించి పోయి నిజంగా ఆదివాసి ప్రాంతాల్లో ఎంతో చైతన్యం ఈమె తీసుకువచ్చింది ప్రస్తుతం జీవితంలో ఏదీ అంత తొందరగా నిర్ణయం తీసుకోలేని,ఎన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నప్పటికీ ఏమీ సాధించలేనటువంటి నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి ఆయనకు ఉన్నదాంట్లో తృప్తిపడి దాన్లో మెరుగ్గా రాణించి ఎంతోమంది గే్రిల్లా ప్రాణాలను కాపాడినటువంటి ఇడిమే చైతన్యం చూసి ఆయనకి ఎంతో ముచ్చటేసింది. ఇప్పటికీ ఎన్నో ఆదివాసి ప్రాంతాల్లో తగిన సదుపాయాలు లేకపోయినప్పటికి కూడా ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతున్న ఇడిమె లాంటి ఆదివాసీలు ఎంతోమంది కి ఆదర్శం గా ఉన్నారు.
2.4 సోయి
ఈ కథను మిడ్కో రాశారు.సోయి అనగా అర్థం స్పృహ, చైతన్యం. దండకారణ్యంలో నివసించే ఆదివాసీలకు మూఢనమ్మకాల పట్ల నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారిలో చైతన్యం కలిగించడానికి రాసిన కధే సోయి.
ఆదివాసీల యొక్క మూఢనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని కాపాడుకోవడానికి వారు ఏ విధంగా కృషి చేశారు అనే విషయాన్ని కూ లంకుషంగా ఈ కథలో మనం తెలుసుకోవచ్చు.వారిలో చైతన్యం ఏ విధంగా వచ్చిందనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ కథలో ముఖ్య పాత్ర కోసాల్ ఈయన భూతవైద్యుడు.ఈయనకు కొడుకు రామాల్, కోడలు సన్నీ, వారికి ముగ్గురు పిల్లలు.మనవరాలు చైతే అనే పన్నెండేళ్ల అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతుంటే తాత మంత్రం వేస్తానంటే మంత్రంతో కడుపునొప్పి తగ్గుతుందా అని ఆ అమ్మాయి అడిగి, ఇవన్నీ మూఢనమ్మకాలని జనతన సర్కారు బడిలో ఉపాధ్యాయురాలు చెప్పిందని తాతతో చెబుతుంది. ఈ మాటతో కోశాల్ బయటకు వచ్చి తన తండ్రి నుంచి వంశపారపర్యంగా వచ్చిన వడ్డే (భూత వైద్యుడు) అయ్యాను.ఈ ఊర్లోనే కాక పక్క ఊర్లో కూడా మంచి పేరు సంపాదించి, రోగాలు వచ్చిన వాళ్ళకి, దయ్యాలు పట్టిన వాళ్ళకి, చేతబడిని నయం చేసాను. తన ఇంట్లో మంత్రాలు చదవనిరోజు పూజలు చేయని రోజు లేదు.ఏదో ఒక వేట ఇవ్వని రోజు లేదు రోగాలను నయం చేయడానికి వచ్చిన వాళ్లు ఇతనికి వడ్లు, జొన్నలు, ఉలవలు, బొబ్బర్లు ఇలా ఏదో ఒకటి ఇచ్చేవారు.కాక పెద్దమనిషిగా కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు.ఇ లాంటి సమయంలో కాలం మారుతున్న కొలది ఊర్లో వారందరూ మారుతూ వస్తున్నారు వారి పద్ధతులు మారుతూ వస్తున్నాయి ఇవి ఈయనకు నచ్చేవి కావు ఒకప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఆదివాసీలకు చాలా ఇబ్బందులు పెట్టేవారు కానీ ప్రస్తుతం ఈ ఆదివాసి ఒక దళంగా,పార్టీగా ఏర్పడి వాళ్ళ సమస్యలను వారే పరిష్కరించుకునే స్థాయికి వచ్చారు ఇలాంటి సమయంలోనే వైద్య సదుపాయాలు, చదువుకోడానికి బళ్ళు అన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో వచ్చాయి.
దళం సభ్యులు మంత్రాలు తంత్రాలు చేయవద్దని చెప్పడం వల్ల ఇతనికి కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా వచ్చిరాని వైద్యంతో జనాలని చంపొద్దు అని చెప్పారు. " పూల అమ్ముకున్న చోటనే కట్టలు అమ్ముకునే గతి తనకొచ్చే"2 కొంత కాలానికి బహుళ జాతి కంపెనీలు కోసాల్ ఊరిలో ఉన్న వారి భూమిని కొని కంపెనీలు పెడదామనుకుని భూమికి బదులుగా డబ్బు, వైద్య సదుపాయాలు, బడులు కట్టిస్తామని కన్నాల్ అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్ముతాడు. తను మనవరాలు చైతే అసలు బయట ఏం జరుగుతుందో కంపెనీవారు మన భూములను బలవంతంగా లాక్కొని మనల్ని మోసం చేయబోతున్నారు దీనికి వ్యతిరేకంగా బెంగాల్ పెద్ద ర్యాలీ మన దళo వాళ్లు ఏర్పాటు చేశారు అందులో అమ్మానాన్న నేను అందరం వెళుతున్నామని చెప్తే మనల్ని వారు మోసం చేసి భూములు లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. ఇంకా కంపెనీ వాళ్ళు తెలివిగా అమాయకపు ఆదివాసీల భూములను అప్పనంగా దోచుకోవడానికి వారితోనే భూమి పూజ కి పూజారిని పిలిస్తే అనుమానం రాకుండా ఉంటుందని కోసాల్ ని పూజారిగా రమ్మంటే, కోపంతో-
"అరేయ్ ఈన్నుంచి పోతావా పోవా?ఏమనుకుంటున్నవు నన్ను?ఈ భూమిని, నా ఊరిని మింగే కంపెనీకి నేను భూమి పూజ చేత్తను అనుకుంటున్నావా? పైసలకు ఆశపడి కన్నతల్లిన అమ్ముకుంటానుఅనుకుంటున్నావా? గంత సోయి తప్పి ఉన్నాను అనుకుంటున్నావా? నా ఊరే పోయినంక, నా భూమి పోయినంక నేను వడ్డేగా(భూ త వైద్యుడి)చేసిందేముంది దొంగ పో"3
అని కన్నాల్ ని ఊరు నుంచి తరిమేసి
ఇంట్లోకెళ్ళిపోయి ఇంతవరకు కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నాను. ఇక్కడ నుంచి ఊరిని,భూమిని కాపాడుకోవడానికి
అతనిలో చైతన్యం కలిగి కంపెనీ వాళ్ళని ఎదిరించి,ఏం చేసినా భూమిని కాపాడుకుంటాను.ఈ విధంగా మూఢనమ్మకాలతో
ఉన్న వ్యక్తిగా ఊరిని, భూమిని కాపాడడానికి, వారిని దోచుకునే వారిని ఎదిరించిన తీరు ఈకధ ద్వారా
తెలుసుకోవచ్చు.
3.
ఉపసంహారం
- దండకారణ్య ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీల కథలు చైతన్యాన్ని తెప్పించే విధంగా ఉన్నాయి
- కొత్త చదువు అనే కథ ద్వారా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి మాతృభాషలో చదువు చెప్పడం ద్వారా వారు ఏ విధంగా నేర్చుకుంటారో ఈ కథ ద్వారా తెలియజేయడం జరిగింది
- చైతన్యం చేసే ఆదివాసి స్త్రీలను ప్రభుత్వాలు ఏ విధంగా అనగ తొక్కుతున్నాయో నిరీమిల కథ ద్వారా తెలుసుకున్నాము
- మూఢనమ్మకాల పట్ల ఆదివాసీలకి ఎంత గట్టి నమ్మకం ఉంటుందో కోసాల్ పాత్ర ద్వారా సోయి కథలో తెలుసుకున్నాము
- బాగా చదువుకున్న గొప్ప డాక్టర్ ఉబకాయంతో ఊగిసలాడుతూ మానసిక ప్రశాంతత లేకుండా ఉంటే, చదువు అంతగా లేని, శిక్షణకు కూడా అవకాశం లేని ఆత్మవిశ్వాసం మాత్రమే గల ఉత్సాహవంతురాలు గెరిల్లా డాక్టర్ ఇడిమే యు ద్దరంగంలో ఏ విధంగా సేవలు చేస్తుంది తెలుసుకున్నాము
4. సూచికలు
- దండకారణ్య కథలు 2005- 2012 పుట. 204
- దండకారణ్య కథలు 2013 - 2015 పుట. 91
- దండకారణ్య కథలు 2013 -2015 పుట. 106
5. ఉపయుక్తగ్రంథసూచి
- కృష్ణకుమారి, నాయని. తెలుగు జానపద విజ్ఞానం- సమాజం సంస్కృతి సాహిత్యం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2019
- దండకారణ్య కథలు, విరసం ప్రచురణ, 2005 -2012
- దండకారణ్య కథలు, విరసం ప్రచురణ, 2013 -2015
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూపస్వభావాలు, శ్రీ బి నాగేందర్ శివాజీ ప్రెస్, సికింద్రాబాద్, 1998
- మైనావతి, పాలగడ్డ. దండకారణ్య కథలు ఒక పరిశీలన, లఘు సిద్ధాంత గ్రంథం, 2019
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. కథా శిల్పం, విశాలాంధ్ర ముద్రణ సమితి, విజయవాడ, 2016
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

