headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు: శ్రీరామాయణ సంబంధ ప్రస్తావన

చక్రహరి రమణ

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి),
సిద్దిపేట, తెలంగాణ.
సెల్: +91 9247226292, Email: ramana.chakrahari@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.03.2025        ఎంపిక (D.O.A): 28.03.2025        ప్రచురణ (D.O.P): 01.04.2025


వ్యాససంగ్రహం:

అనంతమ్మ పురుషోత్తమరావులకు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని పెద్దాపురం గ్రామంలో 1808 సంవత్సరంలో రాకమచర్ల వేంకటదాసు జన్మించారు. పోతన మహాకవిలాగా వీరు సహజకవి. శబ్దాలంకారాలు, వృత్యనుప్రాసలు, అంత్యానుప్రాసాలంకారాలతో సంకీర్తనాసరస్వతికి పెట్టనిసొమ్ముల వలె ఆధ్యాత్మికచింతనతో రామాయణ కథాసారాన్ని, రాముని, కృష్ణుని, శ్రీహరిని, శివుణ్ణి వేనోళ్ల కీర్తిస్తూ తత్వాలను, కీర్తనలుగా అందించారు. ధర్మాన్ని, నీతిని, సహజత్వాన్ని, ప్రేమ తత్వాన్ని పంచి ఎందరినో సన్మార్గులుగా మార్చిన రాకమచర్ల వేంకటదాసు లక్షకీర్తనలదాకా ఆశువుగా పాడారు. అందులో పదహారు వందల వరకు కీర్తనలు లభ్యమవుతున్నాయి. ఈ వ్యాసనిర్మాణానికి రాకమచర్ల వెంకటదాసు కీర్తనలు, వాల్మీకి రామాయణం ఆకరాలు. ప్రస్తుతం నాకు లభిస్తున్న వనరుల దృష్ట్యా భాస్కర యోగి రచించిన “పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన” అనే గ్రంథంలో రాకమచర్ల వెంకట దాసుపై ఒక వ్యాసం ప్రచురితమైంది. కపిలవాయి రచించిన చక్రతీర్థ మాహాత్మ్యంలో రాకమచర్ల కొండలలోని యోగ నరసింహక్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది. రామాయణ సంబంధమైన కొన్ని కీర్తనల గూర్చి అందులోని విశేషాలను ప్రస్తుతవ్యాసంలో విశ్లేషణాత్మక పద్ధతిలో తెలియజేయదలచాను.

Keywords: భక్తి, ఆద్యాత్మికత, రాకమచర్ల వెంకటదాసు, తత్వము,దశరథుడు, శ్రీ రాముడు, రామాయణం

1. ప్రవేశిక:

పల్లె ప్రాంతాలలోని వారందరూ రోజంతా పనులు చేసి అలసిపోయి రాత్రి పూట ఇంటికి వచ్చి ఆయా ఊర్లో ఉన్న పెద్ద వాళ్ళందరూ ఒక దగ్గరగా చేరి తమ తమ శరీర అలసటను తీర్చుకొనుటకు భక్తి పాటలు పద్యాలు కీర్తనలు పాడుకుని ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకునే వారు. ‘వ్యవసాయం, కూలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి వడ్రంగి మొదలైన వాళ్లందరికీ నిరక్షరాసులయినప్పటికీ భారత భాగవత రామాయణ కావ్యాలలోని పద్యాలనెన్నింటినో ఎలాంటి అక్షర దోషం లేకుండా ఏకధాటిగా చదివే నేర్పరులు ఆ కాలంలో కనబడే వారు1. (దూరదర్శన్ కేంద్రం నుండి జువ్వాడి గౌతమరావుతో జ్యోత్స్న ఇంటర్వ్యూ) కాని ప్రస్తుతకాలంలో అలా ఏకదాటిగా పద్యాలు చదివేవారు కనుమరుగవుతున్నారు. అక్షరజ్ఞానము లేని జ్ఞానవంతులు పూర్వకాలంలో కోకొల్లలుగా కనిపించేవారు. వారి నోటి నుండి పాటలు, పద్యాలతో పాటు భక్తికి సంబంధించిన కీర్తనలు వేనోళ్ళ వినిపించేవి. ఆ కీర్తనలను రాగతాళాలతో మద్దెల మృదంగ గజ్జెల గలగలలు కంజరమువ్వల చప్పుల్లతో చెవులకింపుగా మనసుకాహ్లాదంగా పాడుతూ ఉంటే అటుకాలాన్ని ఇటు తనువును మర్చిపోయి భక్తి ఊయలలో ఓలలాడే వారు ఎందరెందరో ఉండేవారు.

ఇలా ఎంతోమందిని భక్తి భావానికి, ఆద్యాత్మిక ఆలోచనతోను చేసిన కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అందులో రాకమచర్ల వెంకటదాసు సుమారు లక్షకుపైగా కీర్తనలను తన నోటివెంట ఎన్నో సందర్భాలలో ఆశువుగా వచ్చి ‘అంతమనేది లేకుండా చేశావు'’2 (గీతాంజలి ఠాగూర్- చలం పాట- 1) అన్న ఠాగూర్ మాటలను నిజం చేసే విధంగా రాకమచర్ల కీర్తనలకు అంతం అనేది లేకుండా ఎన్ని పాడినను ఎంత తత్వాన్ని తెలుసుకున్నను ఇంకా తెలుసుకోవాలనే కుతూహలమే తప్ప మరొకటి కాదు.

సుమారు 200 సంవత్సరాల పైగా కాలం గడిచినను రాకమచర్ల వెంకటదాసు రచించిన కీర్తనలను ఎన్నో ప్రాంతాలలో భక్తి తత్వంలో పారవశ్యాన్ని పొందుతూ సంసార సాగరమనే ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఆ బాధలోనుండి కొంత ఉపశమనాన్ని పొందుట కొరకు కొందరు ఒక్కదగ్గర చేరి భజనలుగా కీర్తనలుగా పాడుకుంటూ ప్రస్తుతాన్ని మర్చిపోయి మానసికమైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు.

పెద్ద ఉమ్మెంతాలకు మూడు కిలోమీటర్ల సమీపంలో రాకమచర్ల కొండల మధ్య రాకమచర్ల గ్రామము. ఆ గ్రామం యోగా నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ ముచుకుందా నది మరియు రాకమచర్ల కొండలు అనంతగిరి కొండలలోని ఒక భాగం. వాటి పుట్టుకగా ముచుకుందానది ప్రస్తుతం మూసీ నదిగా పిలవబడుతుంది3. (పాలమూరుజిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన - 98) రాకమచర్ల కొండలు మరియు నరసింహ క్షేత్ర స్థలపురాణం గురించి పలురకాల చరిత్ర కానవస్తుంది. ద్వాపరయుగంలో ముచ్కుంద మహారాజు ఈ కొండ గుహల్లో నిద్రించాడని, కాలయవనుడు అతన్ని మేల్కొల్పి భస్మమైపోయాడని, ఆ తర్వాత తనకు ప్రత్యక్షమైన శ్రీకృష్ణున్ని అతడు తన జ్ఞాపకంగా అక్కడ నిలవాల్సిందని కోరగా తిరుమలేశుని పేరుతో శ్రీకృష్ణుడు ఆ కొండల్లో వెలిశాడని అక్కడి స్థల పురాణం చెబుతుంది4. (లింగమూర్తి కపిలవాయి చక్ర తీర్థ మహత్యం 1980 ద్వి. ఆ. 33). ఈ ముచుకుందా క్షేత్రములో శ్రీ లక్ష్మీ యోగానంద నరసింహస్వామి అర్చారూపంగా భక్తుల సేవలందుకుంటున్నాడు. ఆ సేవలందిస్తున్న భక్తులలో అమిత భక్తుడు రాకమచర్ల వెంకట దాసు.

2. జననం: 

రాకమచర్ల వెంకట దాసు అనంతమ్మ పురుషోత్తమరావుఅకు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట తాలూకాలోని పెద్దాపురం గ్రామంలో 1808 సంవత్సరంలో జన్మించారు. రాకమచర్ల వెంకటదాసు తన ఎనిమిదవ ఏట ఉపనయనం జరిగిన కొంత కాలానికే తన తండ్రి కాలం చాలించాడు. పాలోల్ల పోరు పడలేక తల్లి కొడుకులు సొంత ఊరు వదిలి రాప్రోలు ఇప్పటి రాయప్రోలు గ్రామానికి వలసవచ్చి. గ్రామస్తులు పెట్టించిన వీధి బడిలో చేరి రాకమచర్ల వెంకటదాసు తన కుటుంబాన్ని పోషించుకున్నాడు.

విద్యావిలాస మనసో ధృతశీలశిక్షాః,
సత్యవ్రతా రహిత మానమలాపహారాః
సంసారదుఃఖదళనేన సుభూషితా యే,
ధన్యా నరా విహితకర్మ పరోపకారాః5

విద్యావిలాసంలో లగ్నమై, సచ్ఛీలస్వభావం కలవారై, సత్యభాషణాదియై, నిగర్వులై, పవిత్రులై, సదా సత్యోపదేశాలనిస్తూ, విద్యాదానంతో ప్రపంచ మానవుల దుఃఖాలను దూరపరస్తూ, వేదవిహిత కర్మలతో పరోపకారం చేసే స్త్రీ పురుషులు ధన్యులు. అలాంటి గుణాలతో, ఆధ్యాత్మిక భావన కలిగిన రాకమచర్ల వెంకటదాసు రాత్రి సమయాలలో పిల్లలతో, గ్రామస్తులతో భజనలు చేయించేవాడు. ఈ సంగతి తెలిసి పెద్ద ఉమ్మెంతాల గ్రామస్తులు కోలాటం నేర్పే పంతులుగా రాకమచర్ల వెంకటదాసును రాయప్రోలు నుండి తమ గ్రామానికి తీసుకొని వెళ్లారు. అది అతని జీవితంలో ఒక మార్పు. రాకమచర్ల వెంకట దాసు ముచుకుందుడు నిద్రించిన గుహను అక్కడ వెలసిన స్వామిని వారం వారం దర్శించుకొంటూ ఒకసారి వారం రోజులు తపస్సు చేసి ఇంటికి వచ్చాడు. తర్వాత ఒకరోజు స్వామి కలలో కనిపించి 'నీవు నా దగ్గరకు రావద్దు నేనే నీ దగ్గరికి వస్తా'నని చెప్పి అదృశ్యమయ్యాడు. ఏ రూపంలో వస్తాడు. ఎలా వస్తాడు అనే సందేహంతో ఎదురు చూస్తున్న సమయంలో తన తల్లికి చౌదరి పొలంలో ఎరువు తోలుతుండగా అంగుష్ట ప్రమాణమైన సింహ సాలగ్రామం లభించిందని, అది వెంకటదాసు దగ్గర ఉంటే మంచిదని దానిని తనకిచ్చాడని చెప్తుంది. ఆ సాలగ్రామం పూజా మందిరంలో పూజ పీఠంపై పెట్టగా ఆ సాలగ్రామం చూడడానికి వెళ్లిన వెంకటదాసుకు బాలకృష్ణుడు ప్రత్యక్షమై నీలంగిరికి వెళ్లి వీరప్పయ్యను దర్శించమని అదృశ్యం అయ్యాడు. ఎందుకంటే తాను యోగానంద నరసింహస్వామి అనుగ్రహంతో ఎన్నో కీర్తనలను రచించాడని ప్రసిద్ధి.

పోతనకవిత్వంలాగా వేంకటదాసుకవిత్వానికి శబ్దాలంకారాలు, వృత్యనుప్రాసలు అంత్యానుప్రాసలు సహజంగా కుదరుతూ సంకీర్తనాసరస్వతికి పెట్టనిసొమ్ములు అయ్యాయి.అందుకు మచ్చుకగా రారా రారా రమ్మని ‘ర’ అనే ప్రాసలో కీర్తన ప్రారంభించి అంతా ఏకప్రాసలో చెప్పాడు. దాంట్లో ఒక పల్లవిలోనే ‘ర’ ఏడు పర్యాయాలు ఆవృతి అయిందంట కీర్తన వేంకటదాసుగారు లక్షకీర్తనలదాకా ఆశువుగా చెప్పాడని ప్రజలు చెప్పుకొంటారు. కాని ప్రస్తుతం అచ్చుకునోచుకున్నవి అయిదువందలు మాత్రమే.

పూర్వం కవులకు వ్రాయసగాళ్లు ఉండేవారు. వ్యాసమహర్షికి గణపతి, తిక్కనకు గురునాథుడు లేఖకులుగా ఉండేవారు. అలాగే వేంకటదాసుకు భజనలో తంబూరా తీసుకొని కూర్చున్నపుడు వెనుక ఎవరైనా ఇద్దరు, ముగ్గురు కాగితం, కలం తీసుకొని కూర్చుని వ్రాసేవాళ్లు. అలా రాసిపెట్టినవే మనకు లభిస్తున్న ప్రస్తుతకీర్తనలు. ఒక్కోచరణం ఒక్కొక్కరురాసే విధంగా శిష్యులు లేఖకులుగా కూర్చునేవారని, ఒక్కోసారి తొందరలోనే ఏదైనా పాదభంగం అయితే ఆయన ఆ స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాతే అడిగి తెలుసుకొనే వారు.6

3. రామాయణం సంబంధ కీర్తనలు

రాకమచర్ల వెంకటదాసు రామాయణ సంబంధమైన కీర్తనలతో రామాయణ కథను సృష్టించగలిగాడు.

ఆ శ్రీరాముడిని వేడుకుంటూ దినకర వంశజ దివ్య తేజ7 అని సంభోధించాడు. భారత దేశం లో ఇక్ష్వాకు రాజుచే నడిపించబడిన సూర్యవంశం లేదా సౌర వంశంలో జన్మించిన వాడు కనుక దినకర వంశంలో దివ్య తేజోవంతుడా అంటూ, ధశరథ రామ8 అని, ఆ బలరామునికి ఆకాశంలో ఉన్న చంద్రుడు కావాలంటే అద్దంలో రాముడి ప్రతి బింబంతో పాటు చంద్రుడి ప్రతిబింబం కనపడేలా ఏర్పరచి ఓ రామ చంద్రా అని పిలిచాడు. శ్రీరాముడికున్న వేయి నామాలలో దాశరథి అన్న పిలుపే ఇష్టమని రాముడంటాడు. అందుకే రాకమచర్ల వెంకటదాసు ఆ శ్రీరాముడిని దశరథ రాఘవేంద్రా, దశరధరామా9 అని తన కీర్తనలో పిలిచాడు. అంతే కాకుండా తాటక గర్వోత్పాటన భూసుర! కోటివినుత నవ కోమల పదయుగ8. తాటక గర్వోత్పాటన భూసుర10 అన్నాడు. యక్షురాలు, కామ రూపిణి, వేయిఏనుగుల బలం కలిగిన తాటకిని సంహరించి తన గర్వాన్ని అణిచి వేసిన శ్రీరామ అంటూ, విశ్వామిత్ర యాగసంరక్షణ నిమిత్తం మారీచ సుబాగులను ఒక్క వేటుతో నూరు ఆమడలు దూర పారవేచిన శ్రీరాముడిని దానవహరణ అంటూ ప్రార్థించాడు.

అహల్య గురించి:

అమిత యోగ గౌతమ సతి రక్షణ కమల నయన 11

నదీ స్నానాన్ని ముగించుకొని అగ్గిలా మెరుస్తూ సమిదలు, కుశలు పట్టుకొని వచ్చిన గౌతముడికి, ఇంద్రుడు తన ఆశ్రమంలో అహల్యతో పాటు కనిపించగా అనేకవేల సంవత్సరాలు యీ ఆశ్రమంలోనే వుంటావు, ఆహారం లేక వాయుభక్షణం చేస్తూ దుమ్ములోనూ, ధూళిలోనూ పొరలాడుతూ ఎవరికీ కనపడకుండా పడివుండమని గౌతముడు శపించి, దశరథపుత్రుడు రాముడు వచ్చినప్పుడు అహల్యకు శాపవిముక్తి పొందుతుందని (రామాయణం బాలకాండ -114) విశ్వామిత్రుడు చెప్పి అహల్యకు శాపవిముక్తిని ప్రసాదించమంటాడు. ఆ విధంగా అహల్యకు శాపవిమోచన గావించిన వాడు ఆ శ్రీరామచంద్రుడు. అందుకే అమిత యోగ గౌతమ సతి రక్షణ అని రాకమచర్ల వెంకటదాసు తన కీర్తనలో అహల్య ప్రస్తావననూ తీసుకొచ్చారు.

జానకి రామా:

వనరుహాక్షా ! రాఘవ వైరి శిక్షా ! దినకర వంశజ దివ్య తేజ ! సజ్జన పరి పాలన జానకి రామా12

అయోనిజ అయిన సీతను బలపరాక్రమ వంతునికిచ్చి వివాహం చేయదలచి (వీరశుల్కం) శివ ధనస్సును రామునికి చూపించగా బ్రహ్మర్షీ ఇదిగో ధనుస్సు ముట్టుకుంటున్న అంటూ అతివిలాసంగా ధనుర్మధ్యం పట్టుకొని నారి యెక్కుపెట్టి ధనుస్సును మధ్యలో విరిచేశాడు. పిడుగులు పడ్డ శబ్దం, పర్వతాలు పగిలేటంతటి కంపనాలతో ఆ ప్రాంతమంతా వొణికి పోయింది. అలా జనకుని కుమార్తె జానకిని వివాహమాడి ఆ శ్రీరాముడు జానకీ రాముడయ్యాడు. అందుకే రాకమచర్ల వెంకటదాసు జానకీ రామా అంటూ పలుమార్లు తన కీర్తనలల్లో సంభోదించాడు.

ఖరా సురాంతక13 సింహోరస్కుడు, మహానుభావుడు, పద్మ నేత్రుడు, ఆజానుబాహుడు, దేవకుమారుడిలా కనిపించిన శ్రీరాముడిని, రావణ, కుంభకర్ణ, విభీషణ,ఖర రాక్షసుల సోదరి అయిన శూర్పనఖ వరించాలని లక్ష్మణుని చేతిలో అబాసుపాలయ్యి సోదరుడు ఖరునితో మొరపెట్టగా అతడు దూషణుడితో పాటు పద్నాలుగు వేల రాక్షసులను వెంటబెట్టుకుని యుద్ధానికిరాగా వారందరినీ ఒక్క క్షణంలో సంహరించిన ఆ శ్రీ రామున్ని రాకమచర్ల వెంకటదాసు ఖరాసురాంతక అని కీర్తించాడు. వాలిని ఖండన14 జానకి జాడను తెలుసుకొనుటకు కిష్కింద పర్వతంపై సుగ్రీవుని మైత్రితో అతని సోదరుడైన వాలి చేసిన దురాగతాలను అరికట్టడం కొరకు వాలిని సంహరించడానికి మార్గాన్ని చూపిన ఆ శ్రీరాముడు వాలిని ఖండన అని, వారధి బంధన15 రావణుని హతమార్చి, సీతమ్మను తీసుకొని రావడం కొరకు మార్గం లేదని లంకకు చేరుటకు సముద్రముపై వారధిని నిర్మించి వారధిబంధనుడయ్యాడు ఆ శ్రీ రాముడు. ఆ వారధిని రామసేతు అన్నారు.

రావణ హరణ లంకకు వెళ్లి రావణున్ని సంహరించి రావణ సంహార అనే పేరును తెచ్చుకున్న ఆ శ్రీరాముడిని రాకమచర్ల వెంకటదాసు రావణ హరణ అంటూ కీర్తించాడు. ఆ విధంగా రావణుని సంహరించి అయోధ్య నగరానికి పట్టాభిషిక్తుడై రామ సార్వభౌముడు అయ్యాడు. అందుకే రామా సార్వభౌమ అని తన కీర్తనలలో వేడుకున్నాడు అంతే కాకుండా సీతాకాంత(కీర్తన 103) సీత అంటే మనసు. మనసునకు పర్యాయపదాలుగా సీత, స్త్రీ, చంద్రుడు అని చెప్తారు. చంద్రమా మనసో జాతః అని రుగ్వేదం చెబుతుంది. మనసుకు ఆధిపత్యం చంద్రుడు అలాంటి సీత మనసును చంద్రుడుతో పోల్చాడు చంద్రుడు కలువలకు ఆకర్షితుడైనట్టు సీత రామునికి ఆకర్షితురాలైనట్టుగా ఉపమ తెలుస్తుంది.

శ్రీరామచంద్రుని సుగుణాలు :

అమితగుణ (కీర్తన 285) అనేక సుగుణాలు కలిగిన వాడు ఆ శ్రీరామచంద్రుడని, శ్రీరామచంద్రునికి ఉన్న పదహారు గుణాలు. అవి గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలో మంచిని చూసేవాడు. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగల స్వభావం కలిగిన పదహారు గుణాలు ఉన్నాయని అమిత గుణ ఓ శ్రీరామా అని గుణాలను కీర్తించాడు రాకమచర్ల వెంకట దాసు.

సజ్జన పరిపాలన (కీర్తన 112) సుగ్రీవున్ని, విభీషణున్ని, ఎంతోమంది ప్రజలను కాపాడిన వాడు కనుక సజ్జన పరిపాలన అనే నామంతో, బుధ జన రంజిత (కీర్తన 205-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు)- విశ్వామిత్రుడు వశిష్ఠుడు హనుమంతుడు శతానందుడు వామదేవుడు జాంబవంతుడు మొదలైన బుద్ధి గల వాళ్లందరి పట్ల సంతోష పెట్టేవాడు లాగా ఉన్నాడు కనుక బుధజన రంజిత అని పాడుకున్నాడు.

జనకజాధిపా సదనప్రతాపా ! జనక ! అనుపమాన పరమపుణ్య! ఆర్యవినుత మునిశరణ్య ! సనకసాదియోగి గణ్య! స్వామి సకలప్రావీణ్య సకల ప్రావీణ్య (కీర్తన 113-)- యుద్ధ విద్యలోనూ, ధర్మశాస్త్రంలోనూ ప్రావీణ్యమున్యుడు కనకే సకల ప్రావీణ్య అని సంబోధించాడు.

సంగ్రామభీమ (కీర్తన-125-) యుద్ధాలలో ఎదురులేని వాడుగా నిలిచాడు కాబట్టి సంగ్రామ భీమా కీర్తించాడు. శరణాగత రక్షణ (కీర్తన 224 - రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు) శరణాగతి కోరిన విభీషణున్ని, రావణునికి సైతం శరణాగతి రక్షణ ఇస్తానన్న ఆ శ్రీరాముని శరణాగత రక్షణ అని వేడుకున్నాడు.

దురితారే (కీర్తన 205) దురితములు అనగా కష్టాలు బాధలు దోషాలు అంటే దోషాలను పోగొట్టి సుగ్రీవుని కష్టాలను తీర్చినటువంటివాడు శ్రీరాముడు అందుకే దురితారే అని రాకమచర్ల వెంకట దాసు పొగిడాడు. ధార్మిక జనలోల (కీర్తన 301-)- ధర్మాత్ములను రక్షించడంలో ఎప్పుడు ఆ శ్రీరాముడు సిద్ధంగా ఉంటాడు కనుక ధార్మిక జనలోలా అని, సురకోటి వినుత (కీర్తన 259-)- దేవతల చేత నిత్యము స్తుతించబడడం స్తుతించబడతాడని సురకోటి వినుత అని కీర్తించాడు.

రామ తారాకనామా రామ –పల్లవి
రామరామ జిత కామబుధావన
తామరసాక్ష సునామ పరాత్పర !!రామ!!
జనకజ మానస వనరుహ దినకర ! సనకస నందన సన్నుత దశరధ!!రా!!
మానిత కౌశిక మఖపరిపాలన! దానవహరణ సమాన రహితరఘు!!రా!! (కీర్తన 282-) 

ఈ కీర్తనలో ఆ శ్రీ రాముడికున్న సహస్ర నామాలలోని అనేక నామాలు కీర్తించగలిగాడు రాకమచర్ల వెంకటదాసు. కేవలం సహస్రనామాలే కాకుండా రామాయణ ఘట్టాలలోని రాముడి జననం నుండి విద్యాభ్యాసం, విశ్వామిత్రుల యాగసంరక్షణ, రాక్షససంహారము, వివాహ ఘట్టం, అరణ్యవాసం, పట్టాభిషేకంవంటి రామాయణ సంబంధ ప్రస్తావనలనెన్నింటినో తన కీర్తనల ద్వారా రామాయణాన్ని సంపూర్ణంగా తెలిపారు రాకమచర్ల వెంకట దాసు.

4. ఉపసంహారం:

  • సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరుస్తున్న ప్రస్తుత కాలంలో నాటి తెలుగు సాహిత్య పరంపరల విస్తరణ కనుమరుగవుతున్న నేటి సమాజంలో విద్యార్థి దశ నుండి మొదలు వృద్ధాప్య దశ వరకు సాహిత్య సంపదను పెంపొందించుట కొరకు రామాయణం భారతం పురాణాలు ప్రబంధాల లాంటి అనేక గ్రంథలను ప్రజలకు పరిచయం చేయవలసి ఉంది. 
  • పద్యాలు పాటలు అందులోని పారమార్థికతను ఆధ్యాత్మికతను అభివృద్ధి పరచుకుంటూ, వారి వారి మానసిక ఆనందంతోపాటు మానవీయవిలువలను ఎన్నింటినో వికాసం చెందించుటకు అనుగుణంగా రాకమచర్ల వెంకట దాసు కీర్తనలు మూల కారణం అవుతాయి. 
  • ఇలాంటి కీర్తనలు విద్యార్థుల స్థాయిలో వారికి అందించినట్లయితే ప్రాచీన వాజ్మయాన్ని మనం అభివృద్ధి పరిచిన వాళ్ళము అవుతాము.

5. పాదసూచికలు:

  1. దూరదర్శన్ కేంద్రం నుండి జువ్వాడి గౌతమరావుతో జ్యోత్స్న ఇంటర్వ్యూ
  2. గీతాంజలి ఠాగూర్- చలం పాట- 1
  3. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన – 98
  4. లింగమూర్తి కపిలవాయి చక్ర తీర్థ మహత్యం 1980 ద్వి. ఆ. 33
  5. సత్యార్థ ప్రకాశము 3-1
  6. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన - 99
  7. కీర్తన 112 రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2002
  8. కీర్తన 103 వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2002
  9. కీర్తన 103-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  10. కీర్తన 103-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  11. కీర్తన 113 -రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  12. కీర్తన 50-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  13. కీర్తన 225-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  14. కీర్తన 225-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు
  15. కీర్తన 162-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణారెడ్డి మర్రి- సత్యార్థ ప్రకాశము-2017-వి3 ప్రింటర్స్, హైదరాబాద్ 
  2. బాగయ్య మొరంగపల్లి -అన్నమయ్య భారతీయ వాగ్గేయకారులు -2014- శెట్టి బుక్ షెల్లర్-ప్రింటింగ్ హైదరాబాద్
  3. భాస్కర యోగి పి. పాలమూరు జిల్లా సంకీర్తన సాహిత్యం ఒక పరిశీలన 2011-తుర్లపాటి పౌండేషన్, సికింద్రాబాద్
  4. లింగమూర్తి కపిలవాయి చక్ర తీర్థ మహత్యం 1980- వాగ్దేవి ప్రెస్, హైదరాబాద్
  5. వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2002- అన్నమ రాజు భాస్కర్ రావ్ప్రింటింగ్ ప్రెస్ శంకరంపేట
  6. వెంకటదాసు రాకమచర్ల-రాకమచర్ల వెంకటదాసు వారి కీర్తనలు -2014- శెట్టి బుక్ షెల్లర్-ప్రింటింగ్ హైదరాబాద్
  7. సిమ్మన్న, వెలమల, తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం, 2013.
  8. సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ పాద- రామాయణం బాలకాండ 1980- వాగ్దేవి ప్రెస్, హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]