AUCHITHYAM | Volume-06 | Issue-04 | April 2025 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. అసమ్మతి పత్రం: వందేళ్ళ తెలుగుసాహిత్యం

డా. అక్కెనపల్లి వెంకట్రాంరెడ్డి
సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ,
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9700206444, Email: ramuavr@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 23.12.2024 ఎంపిక (D.O.A): 25.03.2025 ప్రచురణ (D.O.P): 01.04.2025
వ్యాససంగ్రహం:
వందేళ్ళ క్రితం 1911లో అనగా 115 సంవత్సరాల పూర్వం ఇంటర్మీడియట్ పరీక్షలో విద్యార్థులు రాసే సమాధాన పత్రంలో అనుమతించదగిన తెలుగు భాషా ప్రమాణాల్ని నిర్ణయించడానికి మద్రాసు విశ్వవిద్యాలయం నియమించిన సంఘంలో సభ్యుడైన గురజాడ అప్పారావు. ఈ విషయమై అనేక తీవ్ర వాదోపవాదాలు, తర్కవితర్కాలతో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. అనంతరం 1914లో ఈ సంఘం తీసుకున్న నిర్ణయాలు విద్యాభివృద్ధికి మేలు చేయకపోవడమే గాకుండా, తప్పక కీడు చేస్తాయని నిరూపిస్తూ, ఆ సంఘం చేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాసిన పరిశోధనాత్మక నివేదికయే ఈ అసమ్మతి పత్రం. ఈ సంఘంలోని ఇతర సభ్యులైన జయంతి రామయ్య పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, శ్రీనివాసయ్యంగారు, గిడుగు, శేషగిరిరావు వీరందరూ చిక్కని, చక్కని గ్రాంథికాంధ్రవాదులు. వీరు గ్రాంథికభాషను మాత్రమే అనుమతించాలని నిర్ణయం చేసారు. వాటిని గురజాడ అప్పారావు తృణీకరించారు.
Keywords: అసమ్మతిపత్రం, మద్రాసు విశ్వవిద్యాలయం, ఇంటర్మీడియట్, గురజాడ అప్పారావు, గ్రాంథికాంధ్రవాదులు, జేమ్స్ జాయిస్, నాగరికత, సంకెళ్ళు, కన్యాశుల్కం, గుత్తసొమ్ము, గ్రామ్యం, మ్లేచ్ఛం
1. ప్రవేశిక:
వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం ఒకవైపు అయితే ఈ వందేళ్ళ సారస్వతం మరోవైపుగా చూడాల్సి వస్తుంది. కొలమానంలో, ప్రమాణంలో భారీగా ఉన్నా ఈ అంతరంలో పెనుమార్పులు చోటుచేసుకున్నది ఈ యుగంలోనే. ప్రాచీన, మధ్యకాలపు, స్వాతంత్ర్య పూర్వయుగపు రచనలు భాషాపరమైన కొన్ని ప్రమేయాలతో ఉండగా ప్రభంజనమైన గురజాడ సృష్టించిన ఆధునిక భాషావాదం, అసమ్మతి పత్రం సాక్షిగా కొత్త భావజాలానికి బాటలు వేసింది.
“1911లో ఇంటర్మీడియట్ పరీక్షలో విద్యార్థులు రాసే సమాధానపత్రంలో అనుమతించదగిన తెలుగు భాషాప్రమాణాల్ని నిర్ణయించడానికి మద్రాసు విశ్వవిద్యాలయం నియమించిన సంఘంలో సభ్యుడైన గురజాడ అప్పారావు. ఆ సంఘం చేసిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాసిన పరిశీలనాత్మక నివేదికయే ఈ అసమ్మతి పత్రం”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 09)
‘తెలుగు సాహిత్యానికి సంకెళ్ళు వేసి కడుపు మాడ్చడమా, లేఖ దానికి జవసత్వాలిచ్చి దాన్ని ఒక గొప్ప నాగరికత శక్తిగా చెయ్యడమా అనేది మనపై ఆధారపడి ఉంది’ అంటూ 1913 డిసెంబర్ 13న గురజాడ తన మొదటి అసమ్మతి పత్రం ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే కొంత సవరించి మరింత సమగ్రమైన రెండో అసమ్మతి పత్రం ఇచ్చారు. భాషా సాహిత్య రంగాల్లో యీ పరిస్థితి నంతటిని గురజాడ అసమ్మతి పత్రం ప్రతిబింబిస్తోంది.
సమాజంలో అనవసరమైన సంప్రదాయాలు, భ్రాంతిపూరిత నమ్మకాలు, మరియు అన్యాయాలపై విమర్శ చేస్తూ, మార్పు తేవాలని ప్రయత్నించే ఒక సాహసోపేతమైన రచన. అసమ్మతి పత్రంలో గురజాడ గారు తన కలం ద్వారా నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడుతూ, వ్యక్తిగత స్వేచ్ఛ, సమాజపు పరివర్తన మరియు సాంఘిక న్యాయం కోసం వాదించాడు.
మానవ మాత్రులెవ్వరు చదివి లాభపడడానికి గాని ఆనందించడానికి గానీ సాధ్యపడని పుస్తకాల్ని తెలుగు బోధనా సంస్థ పాఠ్యగ్రంథాలుగా నిర్ణయించడం, వాటిని దురదృష్ట వంతులైన యువత పాఠ్యగ్రంథాలుగా చదవడాన్ని నిరసించారు గురజాడ. వీరు తెలుగు విద్యాబోదనను కొంతైనా సులభం చేయడానికి ప్రయత్నించాడు. కానీ గ్రామ్యం అంటూ నిరసించబడిన శిష్టవ్యావహారాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యం కానేకాదు. ప్రజా బాహుళ్యానికి సులభంగా విద్యాబోధన, విద్యాభ్యాసం జరగాలి తద్వారా విద్య నాగరికతకు సాధనంగా మారాలి అనేదే గురజాడ మరియు ఆయన మిత్రమండలి వాదన.
2. రచన నేపథ్యం:
"అసమ్మతి పత్రం" అప్పటి సమాజంలోని అనవసరమైన ఆచారాలను, మూఢనమ్మకాలను, మరియు వ్యక్తిగత హక్కుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. గురజాడ గారు రచించిన ఈ పత్రం సామాజిక దుర్వ్యవస్థలను విమర్శించడంలో అగ్రగామిగా నిలిచింది. ఇది సమాజాన్ని ప్రగతిశీల దిశగా నడిపించే ప్రయత్నం చేసింది.
గురజాడ వాడుకభాషలో సాహిత్య రచనలు చేస్తున్నప్పటికి, అది ఉద్యమంగా లేదు. ఒకరకంగా అప్పుడాయన ఏకాకి. అప్పటికి గిడుగు వారి దృష్టి తెలుగు భాషపై లేదు. “అసలు ఈ వాదోపవాదాలు మొదలు కావడానికి చాలా సంవత్సరాల ముందే గురజాడ పాత కావ్యభాషకు బదులు నూతన జీవితానికి తప్పనిసరి అయిన వాడుక భాషను స్వీకరించవలసిన అవసరాన్ని కన్యాశుల్కం రెండు కూర్పుల పీఠికల్లోను నొక్కి వక్కాణించాడు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 25)
భాషల సమానత్వాన్ని నిర్ణయించడానికి మేలైన ప్రమాణాలు ఏర్పడ్డ ఈ రోజుల్లో కాలం చెల్లిన వ్యాకరణ ప్రయోగాలు, పదాలు, సమాసాలు కావ్యభాష నిండా ఉన్నాయి. అపరిమితమైన సంస్కృత పదాలు, సమాసాలు గుప్పిస్తున్నాయి. తెలుగు భాషను హతమార్చారు, సారస్వత సంస్కరణకు పూనుకోవలసిన సందర్భమిది అని పిలుపునిచ్చాడు గురజాడ.
పాత కావ్య భాషను అట్టిపెట్టాలని పట్టుపట్టి మాండలిక పదాలలోని కొద్దిపాటి తేడాల గురించి వాదన లేవనెత్తిన వారికి తెలుగుదేశం వివిధ ప్రాంతాలలో మాట్లాడే భాషలో పెద్ద తేడా లేదు. సమర్డులైన రచయితలు మనస్ఫూర్తిగా పూనుకున్నట్లైతే సులభంగానే కావ్యభాషను సృష్టించవచ్చునని గ్రాంథికవాదుల ప్రశ్నలన్నిటికి సమాధానంగా అసమ్మతిపత్రం ఇచ్చాడు.
3. గురజాడ తరువాత గ్రాంథిక వాదులు:
గ్రాంథికవాదులు సంఖ్యాధిక్యత ద్వారా గెలిచినా అది మహాసంగ్రామంలో ఒక పోరాటం మాత్రమే. “వ్యావహారిక భాషా ప్రతిష్టాపన కోసం రాసిన అనేక వ్యాసాలలోనూ గురజాడ అవలభించిన వ్యూహం ఎత్తుగడల్ని తర్వాత ఎందరో అవలంభించారు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 29) అంతిమ విజయం ప్రగతిశీలమైన వాదానిదేనని చరిత్రలో రుజువైంది. గురజాడ మాటలలో తెలుగు కావ్య భాషను మరింతగా నిర్జీవం చేసిన కఠిన వ్యాకరణ నియమాలు సాహిత్యానికి సంకెళ్ళువేసి కడుపు మాడ్చిన నియమాలు సుమారు శతాబ్దం గడిచాక తొలగిపోయాయని తెలుగు భాషా సాహిత్యాలు బహుముఖంగా పురోగమిస్తున్నాయి.
“సాహిత్య రచనలో వ్యావహారిక భాష ప్రయోగాన్ని నిరసిస్తూ కొమర్రాజు లక్ష్మణరావు గ్రామ్యరూపాలన్నీ దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ వాడుకలో ఉన్నాయన్న గురజాడ వాదనను ఆక్షేపించారు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 32) భావ, అభ్యుదయ, విధ్వంస, మానవీయ, నవ్య, విప్లవ, దిగంబర, పైగంబర, స్వేచ్చా, స్త్రీ, దళిత, మైనారిటి తదితర సకల వాదాల నాదాలకు ధ్వని ఈ అసమ్మతి పత్రం. యూలిసెస్ లో జేమ్స్ జాయిస్ వివరించిన ఊహా వాదానికి సైతం మూలాలను ఈ అసమ్మతి పత్రంలో గ్రహించవచ్చు.
4. వ్యవహారిక భాషావాదం, సమాజం:
సాహిత్యంలో వ్యవహారికభాషను ఉపయోగించడం ద్వారా భాషకున్న పవిత్రత, పటుత్వం పోయి సాహిత్యం సామాన్యస్థితికి దిగజారుతుందనేది గ్రాంథికభాషావాదులు వాదించేవారు. ఈ భ్రమను పోగొట్టడానికి గురజాడ ప్రపంచంలోని పలుభాషల వికాసాన్ని చారిత్రక ఆధారాలతో వివరించాడు. ఇలాంటి గ్రాంథికభాషావాదన ప్రతిదేశంలోను ఉన్నదేననీ, ఈజిప్టు – యూరోపిన్ భాషలలో కూడా ఆరంభంలో ఇలాంటి ప్రతిఘటనలే ఎదురయ్యాయని ఆయన పలు ఉదాహరణలను చూపించారు. ఐతే కాలక్రమంలో ఆయా దేశాలలో వ్యవహారికభాష సాధించిన ఫలితాలను, వికాసాన్ని చూపిన పిదప వారు తమ అభిప్రాయాలను మార్చుకున్నారని కూడా అసమ్మతి పత్రంలో గురజాడ పేర్కొన్నాడు.
“అసమ్మతి పత్రం రాయడానికి పూర్వమే తెలుగు భాషలో సంస్కరించుకోవాల్సిన సందర్భాలను తరుచుగా మిత్రులకు లేఖల ద్వారాను, వ్యాసాల్లోను గురజాడ సూచిస్తూ ఉండేవాడు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 26) వ్యాకరణబద్ధంగా రాయాలనే పండితులే ఎన్ని రకాలుగా వ్యాకరణ నియమాలను ఉల్లంఘించారో వారి రచనల నుండే ఉదాహరణలు చూపాడు. వాడుకభాషకు గ్రామ్యం, మ్లేచ్ఛం అనే పేర్లు పెట్టి హేళన చేసే గ్రాంథిక వాదులు, అసలు ఆ పదాలనే ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నారో చూపించడానికి పతంజలి మహాభాష్యం మొదలుకొని పలు వ్యాకరణ గ్రంథాల నుండి ఉపపత్తులను చూపిస్తూ అసలు అర్ధాన్ని గ్రహించమన్నాడు.
“కర్కశ గ్రాంథిక భాషావాది అయిన కొక్కొండ వెంకటరత్నం, కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, జయంతి రామయ్య పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, వేదం వేంకటరాయశాస్త్రి మొదలైన వారి రచనలను, అభిప్రాయాలను పేర్కొంటూ, వారి దోషాలను వారికే చూపిస్తూ గురజాడ విస్తృతంగా తన వాదాన్ని వినిపించాడు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 36) వేదం వేంకటరాయశాస్త్రి ప్రతాపరుద్రీయ నాటకాన్ని ఒకవైపు ప్రశంసిస్తూనే అందులోని అచారిత్రకతను, అనుదాత్తతను నిలదీశాడు. వేదం వారి ఇతర నాటకాల్లోని అనౌచిత్యాన్ని విమర్శించాడు. రచనాశిల్పంలోని అనౌచిత్యాల విషయంలో ఆయన కందూకూరిని కూడా వదలలేదు. పాఠ్యగ్రంథాలుగా ఉన్ననవలలోని చిత్ర విరుద్ధ చిత్రణలను కూడా తీవ్రంగా విమర్శించాడు.
గురజాడ ఈ అసమ్మతి పత్రం రచన సహజమైన వ్యంగ్య శైలిలో సాగుతుంది. ఆ కాలంలో విధ్యావంతులేకాక, సామాన్యప్రజలు కూడా సమస్యలను చర్చించుకోవాలని, ఆలోచనలను ప్రేరేపించాలని ఈ రచన ప్రయత్నించింది. ఆధ్యాత్మికత, సంప్రదాయాలు మరియు ఆధునికతకు మధ్య విభేదాలను హృదయానికి హత్తుకునే శైలిలో వివరిస్తుంది.
గురజాడ కావ్యభాష ప్రస్థానాన్ని సామాజిక దృష్టితో శాస్త్రీయంగా పరిశీలించాడు. సంకుచితమైన సామాజిక, రాజకీయ, సాహిత్య ఆదర్శాలది పైచేయిగా విన్న సామాజిక పరిస్థితులు కావ్యభాష ఉత్పన్నం కావడానికి దారితీశాయని తన పరిశోధన ద్వారా వెల్లడించాడు. భాష – సమాజం – సాహిత్యం - సంప్రదాయాల మధ్య గల సంబంధాలు, అవి ఒకదానిపై మరొకటి చూపిన ప్రభావాల్ని నిగూఢమైన అంశాలను సులువైన రీతిలో సమగ్రంగా విశ్లేషించారు. సాహిత్యభాషకు ప్రజాదరణ ఉన్నదని గ్రాంథిక భాషావాదులు చేసే మొండివాదనను తోసిపుచ్చుతూ, సాహిత్య భాషకు ఏనాడు ప్రజాదరణ లేదని, అది కొద్దిమంది గుత్తసొమ్ముగా వుండేదని పలు ఆధారాలతో గురజాడ వెల్లడించాడు.
గ్రాంథిక భాషావాదులు వ్యవహారిక భాషకు పెట్టిన పేరు గ్రామ్యం. “అందుకు గురజాడ ‘అవిస్త్’ అన్న సంయుక్తహల్లు ఉండే క్రియా రూపాలకు వందల కొద్దీ ఉదాహరణలిచ్చారు. వస్తూ, చేస్తే, చూస్తూ, రాస్తూ, ప్రార్థిస్తూ మొదలైనవి. అతి ప్రాచీన కాలం నుండి శాసనాది సాహిత్య గ్రంథాలు మొదలుకొని తన కాలం వరకు గల రచనల్లో ఆ ప్రయోగం ఎంత విస్తృతంగా వాడబడిందో వందల కొద్ది ఆధారాలతో నిరూపించాడు”. (గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 37)
ఒక భాషారూపం దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ, సమాజంలోని ప్రతి విభాగంలోనూ వాడుకలో వుండాలనేది గ్రాంథిక భాషావాదుల వాదన. ఈ వాదన ఊహాలోకపు ప్రయాణమంటూ, ఏమాత్రం ఆచరణయోగ్యం కాదని పలు ఆధారాలను చూపించి గురజాడ నిరూపించాడు.
5. రచనలో ప్రధాన అంశాలు:
- వ్యక్తిగత స్వేచ్ఛ: వ్యక్తుల ఆలోచనలకు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని గురజాడ గారు ఈ పత్రంలో చర్చించాడు.
- సాంప్రదాయాల విమర్శ: పాతకాలపు సంప్రదాయాలను అంధంగా పాటించడం కాకుండా, వాటిని అన్వయించుకోవాలని సూచించాడు.
- సమాజ రక్షణ: సమాజాన్ని న్యాయమైన మార్గంలో తీసుకెళ్లేందుకు, ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చాడు.
6. ఉపసంహారం:
- గురజాడ అప్పారావు పరిశోధనా కృషి అపారం. విద్య, భాష, చరిత్ర, సాహిత్యం, శాసనాలు, నాటకరంగం మొదలైన విషయాలకు సంబంధించి అప్పారావు చేసిన పరిశోధన అపరిమితమైనది. కానీ ప్రజలకు అందిన ఫలాలు పరిమితమే. అయినప్పటికీ అవి ప్రామాణికంగా చరిత్రలో నిలిచిపోయాయన్నది గమనార్హం.
- సంఘ సంస్కరణతో పాటు భాషా సంస్కరణకు గురజాడ శ్రీకారం చుట్టాడు. వ్యావహారిక భాషపై ఆయన చేసిన వాదనలు, ప్రతిపాదనలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి.
- వ్యావహారిక భాషోద్యమకర్త గిడుగు రామ్మూర్తి, శ్రీనివాస్ అయ్యంగారు తదితరులు ఆయన చేత స్ఫూర్తి పొందినవారే. నాది ప్రజల ఉద్యమం దానిని ఒకరిని సంతోషపెట్టడానికి వదులుకోను అంటూ గురజాడ చిత్తశుద్ధితో చివరి వరకు మాట్లాడుకునే తెలుగుభాషకే పట్టం కట్టడానికే అంకితమయ్యాడు.
- అక్షరం ఎంతటి క్షయం లేనిదో అప్పారావు కృషి అంతటి శాశ్వతమైనదే. తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు ప్రజలు ఆయనను స్మరించుకుంటూనే ఉంటారు. "దేశం కోసం ఎవరు ఏమి చేయగలరో కాదు, ఏం చేయాలని ఆలోచించాలి" అన్న గురజాడ సిద్ధాంతానికి ఈ అసమ్మతి పత్రం మంచి ఉదాహరణ.
7. పాదసూచికలు:
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 09
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 25
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 29
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 32
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 26
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 36
- గురజాడ అప్పారావు, అసమ్మతి పత్రం, పుట. 37
8. ఉపయుక్తగ్రంథసూచి:
- 20 వ శతాబ్దపు తెలుగు ప్రముఖులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005.
- గోపాలరావ్, పెన్నేపల్లి. (2012), గురుజాడలు, మనసు ఫౌండేషన్, హైదరాబాద్.
- చలపతిరావ్, ఎం. (1976), గురజాడ స్మారక సంపుటం, సౌత్ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్.
- వేంకట అప్పారావు, గురజాడ. (1987), అసమ్మతి పత్రం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- Venkata Apparao, Gurajada. (1914), The Minute of Dissent to the Report of the Telugu Composition Sub-Committee, V. Ramaswamy & Sons, Madras.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.