AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. దక్షిణాంధ్రయుగం: వైదికకర్మాచరణం
వై. శివకుమార్
పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
హైద్రాబాదు విశ్వవిద్యాలయం,
హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 99632405219, Email: shivayamma9963@gmail.com
Download
PDF
సమర్పణ (D.O.S): 17.08.2024 ఎంపిక (D.O.A): 26.08.2024 ప్రచురణ (D.O.P): 01.09.2024
వ్యాససంగ్రహం:
నాయకరాజులు ఆచరించిన వైదికర్మల ప్రశస్తిని దక్షిణాంధ్రయుగంలో వెలువడిన సాహిత్యం ఆధారంగా విశ్లేషించడం ఈ పరిశోధన వ్యాస ఉద్దేశం. నాయకరాజుల బ్రాహ్మణ పోషణ, వైదికకర్మకాండల నిర్వహణ మొదలైన సాహిత్యాంతరగత ప్రస్తావనలు ఈ వ్యాసరచనకు ప్రధానవనరులు. విజయరాఘవకల్యాణం, మన్నారుదాసవిలాసం వంటి రచనలు ప్రాథమిక ఆకరాలు. సాహిత్యచరిత్రలు, సమీక్షలు ద్వితీయవిషయసామగ్రి. వివాహాది అనేకసందర్భాల్లో కనిపించే మంత్రభాగాలను ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. కేవలం కొన్ని కావ్యనాటకాలలోని వివాహప్రక్రియ, స్వస్తివాదనం, సంకల్పం, కలశారాధన వంటి అంశాలకే ఈ వ్యాసం పరిమితమై ఉంది. చారిత్రకాంశాల సమన్వయ పద్ధతిలో ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: విజయరాఘవకల్యాణం, మన్నారుదాసవిలాసం, విప్రనారాయణచరిత్ర, దక్షిణాంధ్రయుగం, వైదికకర్మాచరణం.
1. పరిచయం:
శ్రీకృష్ణదేవరాయల యుగం, తెలుగు సాహిత్యానికి ‘స్వర్ణయుగం’గా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు దక్షిణదేశ పరిపాలన కోసం, తెలుగు నాయక రాజులను మధుర, తంజావూరులలో తమ సామంతులుగా నియమించుకొన్నారు. నాయకరాజుల ఆదరణ కోసం తెలుగు సైనికులు, కవి పండితులు తెలుగు ప్రాంతం నుండి దక్షిణ దేశానికి తరలివెళ్ళారు. క్రీ.శ.1565 లో జరిగిన తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం మహ్మదీయుల వశమైంది. అందువల్ల తెలుగు ప్రాంతంలోని కవులకు, గాయకులకు, శిల్పులకు రాజాదరణ తగ్గిపోయింది. కాబట్టి, తెలుగుప్రాంతంలోని కవులు, పండితులు, శిల్పులు మొదలైనవారు మధుర, తంజావూరుల్లోని రాజులను ఆశ్రయించారు.
సాహిత్యపోషణలో, రాజ నిర్వహణలో నాయక రాజులు విజయనగర రాజులను ఆదర్శంగా తీసుకొని, తెలుగు కవి పండితులను, తెలుగు భాషా సాహిత్యాలను పోషించారు. కాబట్టి, 17, 18 శతాబ్దాలలో తెలుగు సాహిత్యం తెలుగుదేశం సరిహద్దులను దాటి దక్షిణ దేశం, ముఖ్యంగా తంజావూరు, మధుర, చెంజి, పుదుక్కోట, మైసూరు మొదలైన కేంద్రాలలో విలసిల్లింది. తెలుగు సాహిత్య చరిత్రకారులు ‘దక్షిణాంధ్ర యుగం’ అని ప్రత్యేకించి, ఆంధ్ర వాఙ్మయ పరిణామంలో ఆ కాలపు ప్రాధాన్యతను గుర్తించారు. ఆ కాలం ప్రక్రియ వైవిధ్యంలోనూ, రచనా స్వరూపంలోనూ, భాష, శైలులలోనూ, సాహిత్య ప్రయోగాలలోనూ ఎంతో ప్రత్యేకతను ప్రదర్శించింది. ఇలా ఎన్నో విశిష్టలతో వెలువడిన ఈ యుగంలో నాయక రాజులు ఆచరించిన వైదిక కర్మాచరణ ప్రశస్తిని గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2. వైదికకర్మాచరణం:
నాయక రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చి పోషించడమే కాకుండా వాళ్ళతో వైదిక కర్మకాండలను నిర్వహింపచేసేవాళ్ళు. వివాహ సమయంలో పురోహితులకు భూరి సంభావనలిచ్చినట్లు కొన్ని కృతుల్లో కనిపిస్తుంది.
2.1 విజయరాఘవ కళ్యాణం:
సంకల్పం:
శుభశోభనే ముహూర్తే ఆద్యః బ్రాహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేత వరాహకల్పే, వైవస్వతమన్వంరే, కలియుగే ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, అస్మిన్వర్తమానే వ్యవహారిక చాంద్రమానే సౌమ్య నామ సంవత్సరే, ఉత్తరాయనే, వసంతరౌ వైశాఖమాసే శుక్లపక్షే ఆద్యశుభ నక్షత్ర, శుభ యోగే, శుభకరణ యుక్తాయాం ఆస్యాంశుభతితౌ అచ్యుత భూపాల కుమారస్య, విజయ రాఘవ భూపాలస్యవివాహాఖ్యం కర్మ కరిష్యమాణస్త దాదౌ.
పైన తెలుపబడిన కాలం వల్ల ఈ నాటకం క్రీస్తుశకం 1669 ఏప్రిల్ 21 మే 7 తేదీల్లో రచించబడింది.
2.2 మన్నారుదాస విలాసం:
సంకల్పం:
శుభే శోభనముహూర్తె............. శుభకృన్నామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంతరౌ చైత్రమాసే శుక్ల పక్షే ఆద్వ పంచమ్యాంశుశుతిథౌ గురువాసర యుక్తాయాం............ ఆస్యాం శ్రీ రఘునాథభూపాల కుమారస్య అచ్యుత విజయ రాఘవ భూపాలస్య ఉద్వాహఖ్యం కర్మకరిష్య మాన తదాదౌ
పై సంకల్పం వలన మన్నారు దాస విలాసం నాటకం క్రీస్తుశకం 1662 ఏప్రిల్ 18వ తేదీన రచించారు.
రంగాజమ్మ తన నాటకంలో రచనా కాలాన్ని తెలపడంతో పాటు, వివాహ ప్రక్రియ, అక్కడ జరిగే విషయాలన్నింటిని ఈ విధంగా వివరించింది.
“నుముహూర్తో స్త్విత్యనుగృహ్ణంతు సముహూర్తమన్తు సుప్రతిష్టితమస్తు”
అంటూ....
వ. అని యీ విధాన, దేవతాహ్వాన, నాంద్యగ్నిముఖ, స్నాతకవ్రత, పునఃపుణ్యాహాచన, అంకురార్పణ, కన్యావరణ, మంగళాష్టక, నవ వస్ర్తధారణ మంగళ సూత్రధారణ వివహప్రధాన హోమాది శుభకర్మంలాచరింప జేయుసమయంబున”
అని మరియు పురోహితులు వివాహ శేష హోమంబులు శేఖరించు కళ” అని వివాహ విధానాన్ని, చేయాల్సిన కృత్యాలను గురించి రంగాజమ్మ చాలా వివరంగా వివరించింది.
మన్నారు దేవుడుహేమబ్జనాయికా స్వయంవరంలో
సంకల్పం:
శుభేశోభనే ముహుర్తౌ.....సౌమ్యనామ సంవత్సరే, ఉత్తరాయణే, వసంతర్తే, చైత్రమాసే శుక్లపక్షే, అద్యశుభ అద్య శుభ నక్షత్ర. రక్తాబ్జనాయికా రాజగోపాలయోః ఉద్వాహాఖ్యం కర్మకరిష్య మాణ”
అని కాల నిర్దేశాన్ని తెలుపుతున్నారు. దీని వలన నాటకం క్రీ.శ 1667- మార్చి21-ఏప్రిల్ తేదిల మధ్య రచించిందని చెప్పవచ్చు. విజయ రాఘవ కళ్యాణనికి, దీనికి మధ్య ఒక నెల రోజుల వ్యవధి ఉండవచ్చు.
విజయ రాఘవ నాయకుడు పూతనహరణంలో కాల నిర్దేశం చేశాడు. ఇక్కడ వివాహం ప్రక్రియ లేదు కాని స్వస్తివాదనం అనే వైదిక ప్రక్రియ ఉంది.
స్వస్తి వాచక అంటే శుభసమయాలను, శుభ సమయాల తర్వాత సర్వారిష్ట శాంత్యర్థం చేసే వైధిక కర్మ. ఇక్కడ నందుడు పురోహితులను పిలిపించి, తన కుమారుడైనా శ్రీ కృష్ణుడికి స్వస్తి వాచనం ఆచరించమని కోరే సమయంలో..
“శుక్లాంబరధరం విష్ణుమ్” అని ....శుభేశోభనముహుర్తే ఇత్యాదిగా ప్రారంభించి-
"అస్మిన్ వర్తమానే, వ్యావహారికే, చంద్రమాన ఖరనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతర్తే చైత్రమాసే, శుక్ల పక్షే ఆద్య పంచమ్యాం శుభతిధౌ గురు వానర సంయుక్తాయాం..... అస్యకుమారస్య సర్వారిష్ట శాంత్యర్ధం కలశపూజాం కరిష్యే. అనేనకలశోదక మార్జనేన అన్యకుమారస్య సమస్త పీడాపరిహారోస్తు.... అస్మిన్ గృహేశోభన పరంపరావాప్తిరస్తు”
ఖర సంవత్సరం క్రీ. శ 1658 తో సరిపోతుంది. ఇక్కడ పుణ్యాహవచన విధానం చెప్పబడింది. కళశంలో నీటిని ఉంచి, మామిడి కొమ్మల పై నుండి, కలశజలాన్ని మంత్ర సంస్కారంగా చేసి కలశ పూజ అయిన తర్వాత ఆ జలాన్ని ఇంటిలోపల చల్లుతారు. దీని వలన ఇంట్లో ఉండేవారికి, ప్రత్యేకంగా స్వస్తి పుణ్యాహవచనం కావాల్సిన వారికి సమస్త పీడలు పరిహారం అవుతాయని నమ్మకం.
2.3 విప్రనారయణ చరిత్ర:
తిరువారాధన సమయంలో సంకల్ప ఇలా ఉంది.
శుభేశోభన ముహుర్తే......అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన నందననామాసం మత్పరే ఆయనే, శుభమానే శుభకరనే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథే చంపకారణ్య పుణ్య క్షేత్రే శ్రీరాజగోపాల స్వామి సన్నిధౌ. “విజయరాఘవ భూపాలస్య సర్వాభిష్ట సిధ్యర్ధం శ్రీరాజగోపాల స్వామి పూజాంకరిష్యే.”
ఇందులో తెలుపబడిన సంవత్సరం- నందన- ఇది విజయరాఘవ నాయకుడు రాజ్య పాలన చేసిన కాలం. (క్రీ. శ 1652) దీనిని బట్టి ఈ నాటకం విజయ రాఘవ నాయకుని పరిపాలన కాలంలో వెలువడిందని అర్థం అవుతుంది.
3. విశ్లేషణలు:
పై ఉదాహణలను బట్టి వైదిక కర్మలను ఆచరించడంలో నాయక రాజులు ఎంత భక్తి శ్రద్దలు వహిస్తున్నారో అర్థం అవుతుంది. అంతేకాకుండా ఈ సంకల్పంలో ‘చాంద్రమానం’ అని వ్యవహరింపబడింది. దీనిని బట్టి నాయక రాజులు, మాసపరిగణాన్ని తెలుగు దేశ పద్దతినే పాటిస్తున్నారనేది స్పష్టం అవుతుంది. ‘సౌరమాన మాసం’ అనేది ద్రావిడ ప్రాంతంలో ప్రచారంలో ఉంది. ఈ కారణం వల్లనే తమిళ సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలలో కొన్ని రోజులలో స్వల్పమైన తేడాలుంటాయి.
ఆనాటి నాటకాలలో ఇటువంటి సంకల్పం రాయడం ఈ కాలంలోని కొందరికి ఛాందసవాదంగా కనిపించవచ్చు, కానీ చరిత్ర ప్రకారంగా చూస్తే ఇటువంటి సాంప్రదాయాల వలన చరిత్ర, సాహిత్యల చిక్కుముడులు విప్పడానికి ఎంతగానో సహకరిస్తాయి.
నాయకరాజుల కాలంలో మరొక విశేషం ఉంది, అదేంటంటే నాయకరాజుల కాలంలో ఉన్న బ్రాహ్మణ ప్రభావం, వైదిక కర్మ విధానం, మొదలైనవి మహారాష్ట్ర రాజులు రాసిన రచనల్లో కనిపించవు.
4. ముగింపు:
- దక్షిణాంధ్ర యుగంలోని16,17 శతాబ్ధాల మధ్య కాలంలో ఉన్నటువంటి సాంఘిక, ఆర్థిక, సామాజిక, సారస్వత అంశాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
- సమాజంలోని ప్రజల జీవన విధానాన్ని గురించి శివకవుల తర్వాత, మళ్ళీ నాయక రాజుల కాలంలో వెలువడిన రచనలలోనే ఎక్కువ వివరాలు తెలుస్తున్నాయి.
- దక్షిణాంద్ర యుగంలోని సాంఘిక పరిస్థితుల పరిస్థితులను గురించి చేస్తున్న అధ్యయనంలోని కొన్ని ప్రధాన విషయాలను ఈ పత్రంలో చర్చించడం జరిగింది.
- ఇటువంటి అధ్యయనాలు ఇంక వివరణాత్మకంగా, విమర్శనాత్మకంగా జరపవలసిన అవసరాన్ని ఈ పత్రం ద్వారా సాహిత్య అధ్యయన శిలురకు, పరిశోధకులకు జ్ఞప్తికి తీసుకురావడం జరుగుతున్నది.
5. ఉపయుక్త గ్రంథసూచి:
- ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం (2వ సంపుటం). హైదరాబాదు: తెలుగు అకాడమి ప్రచురణ.
- ఆరుద్ర. ముద్దుపళని, రాధికా సాంత్వనం. హైదరాబాదు: ఎమెస్కో బుక్స్.
- కుసుమాబాయి, కె. నాయక రాజుల చరిత్ర- కళా సంస్కృతి. హైదరాబాదు: కావ్యశ్రీ గ్రాఫిక్స్.
- కృష్ణారావు, వై. తెలుగు సాహిత్య చరిత్ర. హైదరాబాదు: తెలుగు అకాడమి.
- జయ రాములు, బి. సాంత్వన కావ్యాలు – శృంగార నాయికలు. హైదరాబాదు: హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం.ఫిల్. పరిశోధన వ్యాసం.
- నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష. తిరుపతి: నవ్య పరిశోధక ప్రచురణ.
- తెలుగు అకాడమి. 2005. తెలుగు-తెలుగు నిఘంటువు . హైదరాబాదు: తెలుగు అకాడమి ప్రచురణ.
- ప్రతాపరెడ్డి, సురవరం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. విజయవాడ: పల్లవి పబ్లికేషన్స్
- రామారావు, ఎస్వి. తెలుగు సాహిత్య చరిత్ర. హైదరాబాదు: పసిడి ప్రచురణలు.
- వెంకటరావు, నిడదవోలు. దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయం. మద్రాసు: మద్రాసు విశ్వ విద్యాలయం.
- వేంకటావధాని, దివాకర్ల. ఆంధ్ర వాజ్ఞయ చరిత్ర. హైదరాబాదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు.
- వెంకటరమణయ్య, నేలటూరు. దాక్షిణాత్యాంధ్ర సాహిత్యం. మదరాసు: వేదము వేంకటరాయశాస్ర్తి అండ్ బ్రదర్స్.
- శ్రీరామమూర్తి, కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర. విశాఖ పట్టణం: రమణ శ్రీ ప్రచురణ.
- 14. సత్యనారాయణ, కంభంపాటి. ఆంధ్రుల సంస్కృతి- చరిత్ర2. హైదరాబాదు: హైదరాబాదుబుక్ ట్రస్ట్.(అనుపమ ప్రింటర్స్)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

