headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. గాజుల వెంకటకృష్ణ కథలు: స్త్రీ పాత్రలు

నల్లగోటి నగేష్

పరిశోధక విద్యార్థి, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8886828926, Email: nallagotunagesh@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 18.09.2024        ఎంపిక (D.O.A): 28.09.2024        ప్రచురణ (D.O.P): 01.10.2024


వ్యాససంగ్రహం:

ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిగా కథకులుగా పేరు ప్రఖ్యాతలు పొందిన సుప్రసిద్ధ రచయితల్లో గాజుల వెంకట కృష్ణ ఒక్కరు. వీరు మూడు కథా సంపుటాలు, నాలుగు కవిత సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు వెలువరించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా కర్నూలు సమగ్ర సహకార అభివృద్ధి ప్రణాళికలో ప్రాజెక్టు ఆఫీసర్. డిప్యూటీ రిజిస్టర్ గా పనిచేస్తున్న సుప్రసిద్ధ కథకులు. 1965లో అనంతపురం జిల్లాలోని బూడిదగడ్డ పల్లిలో జన్మించాడు. వృత్తిరీత్యా కర్నూలులోనే స్థిరపడి, కర్నూలు కథా రచయితల్లో ప్రముఖ కథా రచయితగా పేరు పొందాడు. సాహిత్య సేవకు గాను జాతీయస్థాయిలో ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాన్ని కొన్ని రంగులు ఒక పద్యం అనే కవిత సంకలనానికి సినారె పురస్కారాన్ని అందుకున్నారు. వెంకటకృష్ణ వెలువరించిన రెండు కథల సంపుటాలలోని ఇతివృత్తాన్ని పరిశీలించడం,ఈ వ్యాసం ముఖ్యఉద్దేశం. ఈ పరిశోధనా వ్యాసాన్ని కథా ప్రక్రియపై వెలువడిన పరిశోధన గ్రంథం “కథానిక స్వరూప స్వభావాలు,” “తెలుగు సాహిత్య చరిత్ర, తెలుగు కథానిక – అవతరణ వికాసాలు, పుస్తకాల్లోని “కథ- కథానికి”అంశాలను క్షుణ్ణంగా చదివి. ఆధునిక కథా పద్ధతులను అనుసరిస్తూ రూపొందించడమైనది. గాజుల వెంకట కృష్ణ రాసిన కథల్లోని సంఘటనలు, సందర్భాలు, పాత్రలు ఆధారంగా పూర్వ పరిశోధనల వివరాలు, విశ్లేషణలు, విమర్శలను ఆకలింపు చేసుకొని పరిశోధన ఫలితాలను వెల్లడించటం ఈ వ్యాసం ప్రధాన అంశం. ‘ఉబ్బిన కన్ను’ కథ, ‘వజ్రం’ కథలోని స్త్రీ పాత్రలు

Keywords: కథ – కథానిక, గాజుల వెంకట కృష్ణ, కథానిక లక్షణాలు, ఉబ్బిన కన్ను కథలోని స్త్రీ పాత్ర, వజ్రం కథలోని స్త్రీ పాత్రలు

1. ఉపోద్ఘాతం:

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి ప్రవేశించిన " నవల, కథ, నాటకం, పాట, వచన కవిత, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, వ్యాసం, విమర్శ, మొదలైన ప్రక్రియలు అన్నింటిలో కథానిక ప్రముఖ స్థానాన్ని అలంకరించింది. కథ ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఆదిమ కాలంలో మౌఖిక సాహిత్యంగా ప్రవర్తిల్లిన ఈ ప్రక్రియ రాను రాను లిఖితమవుతూ కాలానుగుణంగా నూతన సృష్టికి లోనై ఈనాడు శాకోపశాఖలుగా విస్తరించినది. ఇంతటి విశిష్టత కలిగిన కథా ప్రక్రియలో గాజుల వెంకటకృష్ణ వివిధ ప్రాంతాలలో సందర్శించి స్త్రీ పాత్రలను  ఎన్నుకొని కథలుగా మలిచారు.

2. రచయిత పరిచయం - సాహిత్య కృషి:

గాజుల వెంకటకృష్ణ అనంతపురంలోని బుడిదగడ్డపల్లిలో  ఏప్రియల్ 28, 1964. సంవత్సరంలో జన్మించారు. తన తండ్రిగారు వృత్తిరీత్యా టీచర్ అయినందువల్ల ప్రాథమికవిద్య మొత్తం చాలా గ్రామాల్లో చదివారు. ఇంటర్మీడియట్ కళ్యాణదుర్గం జూనియర్ కాలేజ్. డిగ్రీ (కే ఎల్ ఇ సొసైటీ) నిజ లింగప్ప డిగ్రీ కాలేజ్ రామోజీ నగర్ బెంగుళూర్. ఎమ్. ఎ. ఎమ్ ఫిల్ ( హిస్టరీ ) శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ చేశారు. తెలుగు భాష పై అభిలాష ఉండటం వల్ల సాహిత్య ప్రసంగాలకు వెళ్లి అనేక కథ పుస్తకాలను చదివి కథసాహిత్యం పై పట్టు సాధించి బండి  నారాయణస్వామి. కే శివారెడ్డి. పినాక పాణి. దర్శకత్వంలో సూచనలు, సలహాలు అనుసరిస్తూ కవి కథకులుగా గుర్తింపు పొందారు. వెంకటకృష్ణ కథలన్నీ పీడితవర్గపు భావోద్వేగాల చిత్రీకరణలు. ఒక వస్తువును భిన్న కోణాల నుంచి దర్శించి కథను రాయటమే ప్రత్యేకత.

గాజుల వెంకటకృష్ణ 1994 సంవత్సరంలోనే కథలు రాయడం మొదలుపెట్టిన 2000 సంవత్సరం నుండి రచయితగా అందరికీ పరిచయమైనారు. ప్రధానంగా కవిత్వం రాస్తున్నప్పటికీ కథలు. దీర్ఘ కవితలు వీరిది ప్రత్యేక శైలి ‘గరుడస్తంభం’, ‘చిలకలు వాలిన చెట్టు’, ‘దేవరగట్టు’ కథా సంకలనాలు.’దున్నేకొద్దీ దుఃఖం,’ ‘లో గొంతుక. ‘కొన్ని రంగులూ ఒక పద్యం’, ‘చినుకుదీవి’ అనే నాలుగు కవితా సంపుటాలు వెలువరించారు. ‘నదీ వరద మనిషి’, ‘హంద్రీగానం’ అనే రెండు దీర్ఘ కవితలు వెలువరించారు.

తెలుగు సాహిత్యానికి తన వంతుగా ఇష్టమైన సేవ చేస్తున్న వెంకటకృష్ణ కృషిని గుర్తించి సన్మానాలు, అవార్డులతో సత్కరించాయి.

3. గాజుల వెంకటకృష్ణ కథాసంపుటాల్లోని పాత్రలు:

గాజుల వెంకటకృష్ణ కథకుడుగా పరిచయం చేసిన దేవరగట్టు ఈ సంపుటిలోని స్త్రీలు జీవితంలో అలసిపోయిన మడమ తిప్పని పోరాటపటిములను ఎంపిక చేసుకొని చిన్నచిన్న సంఘటనలను తీర్చిదిద్దిన విధానం రచయిత ప్రతిభను వెల్లడి చేస్తుంది.  

3.1. విద్యలో స్త్రీ అణచివేత:

చంద్రకళ గలగల సెలయేరుల తన వాగ్దాటితో యూనివర్సిటీ క్యాంపస్ అంతా ప్రవహించేది. డెబిట్ లలో తన వాదన పటిమతో మురిపించేది. అలాంటి రోజుల్లో అక్క! అక్క! అంటూ కిషోర్ తన పరిశోధన మీద సందేహాలతో వెంటపడేవాడు. ఆమెకు కిషోర్ జూనియర్ ఇద్దరు గైడ్ ఒక్కరే కావడంతో పరిశోధన మీద సందేహాలతో ఆమె వెంట తిరిగేవాడు వాళ్ళిద్దరూ కొత్త పరిశోధన గురించి పరిశోధన అయ్యే అంశాల గురించి చర్చలే, చర్చలు ఊహలే ఊహలు. అలాంటి సందర్భంలో యూనివర్సిటీ లెక్చరర్ పోస్టులు నింపడానికి ప్రకటన వచ్చింది. అప్పటిదాకా పోస్ట్ పడితే ఆమెకు తప్ప ఇంకెవరికి ఇస్తారు అనుకున్నది. తలకిందులైపోయింది. కులం ఉన్నవాడో, డబ్బు ఉన్నవాడో ఎగరేసుకుపోయాడు. అంతటి ప్రతిభావంతురాలికి మొండి చేయి చూపారని తెలిసినప్పుడు  అసలు ఆమెను పీహెచ్.డీ సమర్పించనీయకుండా అడంకులు కల్పించారని తెలిసినప్పుడు కానీ కిషోర్ యూనివర్సిటీ రాజకీయాలు తెలుసుకోలేకపోయాడు. యూనివర్సిటీ వదిలేసి ముందు రోజు చంద్రకళ కోసం కాపు కాశాడు. చివరగా పలకరిద్దామని ఆ రోజు ఉబ్బిన ముఖం, వాచిన కుడి కన్ను,  అదేమక్క అంటే రాత్రి ఏదో పురుగు కుట్టింది తమ్ముడు, కొన్ని సంవత్సరాల తర్వాత అనూహ్యంగా చంద్రక్క కనిపించింది కిషోర్ కు. అన్నేళ్ల తర్వాత ఆమెను చూస్తుంటే మరోసారిగా చూసినప్పటి వాచిన కుడి కన్ను, వదలను ముఖము చంద్రక్కనే చూస్తున్నట్టు అనిపించింది. పదేళ్లలో ఎంత తేడా? హుషారు అంతా ఎక్కడ పోయినట్టు చంద్రక్క అన్నాడు. ఏమోలే కిషోర్ నువ్వన్నా హ్యాపీగా ఉన్నావు.

3.2. స్త్రీల కుటుంబ పరిస్థితులు :

చంద్రకళను అజమాయిషి చేస్తున్న గొంతులు ఏమ్మా పుణ్యానికిస్తావా. మేం నిన్ను కష్టపడి ఇంత చదివిస్తే కదా నీకు ఉద్యోగంమొచ్చి సంపాదిస్తున్నావు. మా సంసారాని పెట్టమంటునామా, మీ అమ్మకి పెట్టమంటున్నాం గానీ, మీ అమ్మ మంచాన పడింది. ఆయామ్మను ఎవరు సాకీ సంతరించాలా. నువ్వు పైసలివ్వకుంటే ఆయమ్మను తెచ్చియీడ పడేసి పోతాం. నువ్వే చూసుకుందువుగాని, ఈ దబాయింపులు ఏంటి వదిన నెలనెలా తీసుకుపోతూనే ఉండావే ఇంత నిష్టూరం చేస్తావా, నా కష్టసుఖాలు నీకేం పట్టవా అంటే నీకు పెళ్లి చేయలేదని కదా నీ బాధ. నా తమ్ముడు సరిపోతాడా దిక్కుమాలిన కులంలో నీకు కావలసిన ఆఫీసర్లు ఎవరు ఉండరు. ఉన్న వయస అయిపోయిన నిన్ను చేసుకోవడానికి రావద్దూ. నీకేమో రేయింబగల్లు పెళ్లి చేసుకోవాలని ధ్యాస. వదిన కావు కేక పెట్టింది చంద్రకళ. నేనివ్వకుంటే మీ సంసారం నడుస్తుందా, నా సొమ్ముతింటూనే నన్నిన్ని మాటలు అంటున్నారే.

3.3. స్త్రీ ఉనికి :

“అవునే చంద్రకళ. ఇవ్వకుంటే ఎట్లా ! అమ్మ మంచం మీద పడ్డా… నా ఆరోగ్యమూ అంతంత మాత్రమే… మీ బావ చూస్తే నా డబ్బు మనిషి. తమ్ముని బతుకు అంతా గుంతలోనూ, ఆదాయం తాగడానికి సరిపోయే, ఇంక నువ్వు గాక ఇంకెవరు ఇస్తారు. నీ ఖర్చులకు ఎంత కావాలా. ఒక ఐదువేలో, ఆరువేలో పెట్టుకొని మిగిలిందంతా ఇచ్చేయవే తల్లి! అని ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదేమే నీకు.” (గరుడ స్తంభం కథా సంకలనం ఉబ్బిన కన్ను పుట - 42 )

ఆదిపత్యంతో ఒకాడపిల్లను ఇల్లు ఎట్లా అడిస్తుందో ఎట్లా కంట్రోల్ చేస్తుందో చూడాలంటే నన్ను చూడు. వీళ్ళెవరికి నేను  సుఖంగా ఉండాలని లేదు. ఎంతసేపు వాళ్ల అవసరాలు తీర్చే యంత్రం కావాలి ఆ యంత్రం నోట్లు రాలుచుతూ ఉండాలి. ఆ యంత్రానికి శరీరముందని, మనసుందని తెలుసుకునే అవసరం లేదు. అన్ని కుటుంబాలు ఇలా ఉండవు నిజమే. నా కుటుంబం మాత్రమే ఇట్లా ఎందుకుందో నా దురదృష్టం. వీళ్లనుంచి పారిపోదామని చూశా  అయినా వీలుపడ్డం లేదు. వదినేమో చదువు సంధ్య లేని తన తమ్మునికి అంటగట్టాలని చూస్తుంది. అక్కేమో తన సవతిగా వచ్చిన పర్వాలేదు. అక్కా చెల్లెలు అన్నా చెల్లెల్లు లాంటి బంధాలు మాయమై మనుషుల అవసరాలు మిగులుతాయి. దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న నరకం శరీరరానికి ఒక తోడు కావాలని సొంత కుటుంబం కావాలని ఉండద, అది నేరమా! తన స్థాయి వాడని, పెళ్లాడాలనీ, తనంత చదివి ఉండాలని అనుకోకూడద. తనను ఎవరైనా ప్రేమిస్తారని నమ్మకూడదా. తన అక్క బావ. అన్నా వదిన తనకోసం ఒక మంచి మనిషిని వెదకాలని అలా వెతకడం వాళ్ల బాధ్యతగా ప్రవర్తించినందుకు వాళ్ళని దూరం పెట్టడం ఆమె చేసిన తప్పా!.

3.4. చంద్రకళ మరణం :

“సూర్యనారాయణ రెడ్డిని మా కాలేజ్ స్టాఫ్, లెక్చరర్ నిజానికి తనతో క్లోజ్ గా ఉండేవాడు. పెళ్లి చేసుకుంటున్నానని తెలిపి చివరికి తిరస్కరించాడు. వాళ్ల తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుంటున్నాడు. కులం కావాలన్నాడు, భరించలేకపోయింది. ఇంతకుముందే కుటుంబాన్ని దూరం పెట్టేసింది. ఈమె స్నేహ సంబంధాల గురించి, డబ్బులు ఇవ్వనందుకు వాళ్లు భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. సూర్యనారాయణ రెడ్డిని నమ్మింది, వీడు ఇలా చేసాడు. చంద్రకళ బద్దలైపోయింది సార్ ” (గరుడ స్తంభం కథా సంకలనం. ఉబ్బిన కన్ను. పుట – 44 )

వచ్చావా తమ్ముడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది, తనలో తానే అసంబద్ధంగా. మాట్లాడుతుంది గొనుక్కుంటుంది, ఉండి ఉండి అరుస్తుంది. వెంటనే మామూలు అయిపోయి మంచం మీద నుండి లేచి నడవాలని చూస్తుంది చంద్రక మానసికంగా చాలా దూరం వెళ్ళిపోయింది. ఎవరన్నా పలకరిస్తే తుంచినట్లు మాట్లాడేది. పెళ్లికి బయట చాలా జీవితంముందక్క కాస్త ఆలోచించి చూడండి. నా గురించి మీరు ఆందోళన పడకండి వెళ్లండి మీరు. సింహం లాగా తిరిగేది కాలేజీలో క్లాసులో పాఠాలు చెప్పే ఆ గొంతు వినాలి. చరిత్ర ఇంత బాగా చెప్పొచ్చా అనిపించేది ఎట్లాంటి  చంద్ర ఎట్లాయిపోయింది సార్! పదిహేనురోజులుగా కాలేజీకి వెళ్ళలేదమ్మా. కొలీగ్స్ సెల్ కు కాల్ చేస్తే అది స్విచ్ ఆఫ్ లో వుందంటా. ఆఖరికి అనుమానంతో  ఇంటికి వెళ్లి తలుపులు తట్టి అవి తెరుచుకోక, వాటిని బద్దల కొట్టి లోపలికివెళితే చంద్రక్కా అసహ్యమైనా వాసనతో ఆ దుర్గంధాల మధ్య పడింది. తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తే కండిషన్ క్రిటికల్ ఉదయం వచ్చి చూస్తే వచ్చిన ఆమె. పడిపడి ఏడుస్తుంది దగ్గర పెట్టుకుని చూసుకుందాం అనుకుంటే. ఎంత అన్యాయం చేసితివి తల్లి నీకేం తక్కువైండ్యా లక్ష్యలు! లక్ష్యలు జీతం సంపాదించే దానివి దిక్కు లేని దానిలాగా వెళ్లిపోతివే పెళ్లి మీద బండ బడా అదే నీకు నాకు అగ్గిపెట్టె నిన్ను రొమ్మున పెట్టుకున్నే ఎంతపనాయ సామి!.

4. గాజుల వెంకటకృష్ణ కథాసంపుటాల్లోని స్త్రీ కథలు:

వెంకటకృష్ణ వెలువరించిన మూడో కథ సంపుటి ‘దేవరగట్టు’. ఈ సంపుటిలో 15 కథలలో 8 కథలు స్త్రీలపై వివక్ష గల కథలు ఉన్నాయి.

వజ్రం కథల్లోని దొరికిన రంగురాయి కోసం విశ్రాంతమ్మ నర్సిరెడ్డి ల మధ్య జరిగిన సందర్భం అత్యంత సహజంగా రాయగలగడం ఆశ్చర్యం అంత జరిగాక విశ్రాంతమ్మ తనలాంటి దైన్య జీవితమే కదా అని జాలి చూపించడం.

4.1. విశ్రాంతమ్మ జీవితం :

విశ్రాంతమ్మకు చిన్నప్పుడే పెద్ద వయసాయనతో పెండ్లయింది. నలుగురు ఆడబిడ్డలే ఆమెకు ఇరవై ఎనిమిది దేల్లప్పుడు. భర్త చనిపోయాడు. పుట్టింటివైపు నుంచి మెట్టినింటివైపు నుంచి ఏ సహాయము లేక పిల్లల్ని పెంచడానికి చాలా ఇబ్బందులు పడింది. కూలి పని చేసి చర్చిలో కసువూర్చి ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు ఊర్లోనే చేసింది. మూడో పాప చర్చి ఫాదర్ సహాయంతో నర్సింగ్ ట్రైనింగ్ చేసుకొని ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉంది. ఆమె ఏ కూతురు దగ్గర ఉండలేక పోతుంది. ఊర్లో ఒక అల్లుడికి ఏదో చెప్పరాని రోగం వాడికి ఎప్పుడూ ఏమవుతుందో తెలీదు. వాడి భార్యకు రోగం ఎక్కించాడు ఆ పాప ఎంత కాలం బతుకుతుందో తెలీదు ఇవన్నీ చూసి భరించే శక్తి లేదు, చూడకుండాను ఉండలేదు. 50 సంవత్సరాలైనా నిండని విశ్రాంతమ్మ జీవితం నుంచి పారిపోవాలనుకుంటూ రైలు ఎక్కి ఈ జీవితంలోకి వచ్చింది.

4.2. వజ్రాల అన్వేషణ :

“భర్త చనిపోయాకపడ్డ అవస్థలూ, బంధువుల ఇల్లు కాడి తిరస్కారాలు, చేన్లలో మగవాళ్లకు లొంగాల్సి  వచ్చినప్పటి కన్నీళ్లు యిద్దరు కూతుర్ల పెండ్లిండ్లకై పట్టుకున్న కాళ్లు కడుపులూ… కడిగి కడిగి తుడిచిన చర్చిమెట్లు, మూడో కూతురి కడుపు సంకటము,  ‘నీన’ అవుతాలేమ్మా.. యా పెండ్లీ వద్దు అంటున్న ఆఖరి కూతురు దీనమైన మొఖమూ…. అన్న అన్ని ఇతరులు తెరలుగా గుర్తొస్తున్నాయి…ఒక్కో కన్నీటి చుక్క రాలిపోతుంది. ఇంకా ఎన్నో ఉబికి ఉబికి…. మృత్యుమొఖాలై.. ఆకలి మొఖాలై. ఒక్కోరాయి ఒక్కోరాయి భంగు భంగుమంటున్నాయి. రాయిని రాయిని తాకి. దొరకాలని గ్యారెంటీ ఏముంది. వజ్రంమంటే సామాన్యమా!. ఎన్ని వందల మంది వెతుకులాడుతున్నారో!. అందరికీ  దొరికేకి అవుతుందా, అట్లా సమాధాన పడుతూ, దుఃఖపడుతూ, ఎంతసేపు గడిచిందో.” (గరుడస్తంభం కథల సంకలనంలో వజ్రం కథ పుట - 81)

తలతలమంటోంది. అవి వాన కాలపు తొలి దినాలు. ఊరికే వర్షం వస్తే కాదన్నా భూమ్మీద నీళ్లు పారల్లా. అట్లయితేనే అంతోఇంతో కనిపిస్తాయి. కానీ లేకుంటే నీవు ఎంత ఎతికినా అంతే. అవునంటా చానా మాయదారి వంట కనిపించినట్లే కనిపించి మాయమైతాయంటగదా. నువ్వు నాలుగైదు సంవత్సరాలుగా వస్తుండావు నువ్వే చెప్పల్లా. ఏం అనుభవమో ఏమోలే అంతా ఉత్తప్రయాస ఎంత వెతికిన ఏం ప్రయోజనం లేదు మేఘాలతో పాటు వాలినారు వలస పక్షుల్లాగా ఈ చుట్టూ ప్రక్కల ఊర్లనిండా ఇట్లాంటి జనమే.

5. గాజుల వెంకటకృష్ణ కథలు - విమర్శకుల అభిప్రాయాలు:

గాజుల వెంకటకృష్ణ వెలవరించిన దేవరగట్టు కథలు, వజ్రం కథా సంపుటాలపై ఇదివరకు పరిశోధన జరగకపోయినప్పటికీ ప్రముఖ తెలుగు కథకులు వాసిరెడ్డి నవీన్ గారు గాజుల వెంకటకృష్ణ కథలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

కథరచనలో ప్రతి రచయిత పాత్ర చిత్రణ గురించి ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. జాగ్రత్త పడాలి. అప్పుడప్పుడు కొంతమంది రచయితలు తమకు తెలియకుండానే ఎలా చెప్పాలో అర్థం కాకపోవడం వలన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి మాట్లాడేస్తారు.  పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ తీస్తారు. వెంకటకృష్ణ ఈ విషయంలో అత్యంత మేలుకోవులతోనూ సంయమనంతోను ఉన్నాడు. ఈ కథల్లో, ఏ పాత్ర తన పరిధిని మించి ప్రవర్తించదు. ప్రతిపాత్ర మొదటి నుంచి చివరి వరకు తన స్వభావరిత్యా ఒకే రకంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడ అతిగా మాట్లాడదు. ప్రవర్తించదు. కానీ కథ పూర్తయ్యేసరికి పాఠకులకు చేరాల్సిన విషయం అస్పష్టతకు తావు లేకుండా చేరుతుంది.

6. ముగింపు :

  • గాజుల వెంకటకృష్ణ రాసిన కథలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పవచ్చు.
  • కథలను ప్రాథమికోన్నత స్థాయి నుంచి డిగ్రీ స్థాయిలో విద్యను అభ్యసించే విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టవచ్చు.
  • ఎంచుకున్న ఇతివృత్తం విలక్షణంగా అనిపిస్తుంది.
  • కథలన్నీ సమాజంలో జరుగుతున్న అందరూ విన్నవి చదివినవే అయినా కథకుడిగా వీరు ఎంచుకున్న శైలి కథను నడిపించిన విధానం కొత్తగా ఉంది.
  • కథలు మేఘం లాగా మెరుస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు.
  • వెంకటకృష్ణ కథలు ఎంచుకున్న విధానం జాగురుకత కథాగమనం అద్భుతంగా ఉంటుంది.

7. ఉపయుక్త గ్రంథ సూచి :

  1. దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూపస్వభావాలు, పరిశోధన గ్రంథం, నవోదయ పబ్లికేషన్, విజయవాడ.
  2. ద్వానాశాస్త్రి. తెలుగు సాహిత్య చరిత్ర ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
  3. రాజారాం, మధురాంతకం. 1998. తొలినాటి తెలుగు కథలు 1996-1945 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
  4. విజయలక్ష్మి, సి. తెలుగులో కథాసాహిత్యం. విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్, తిరుపతి.
  5. వెంకటకృష్ణ, గాజుల. ఒక కథగా మారాలనుకున్న తల్లి. లిఖిత ప్రెస్ హైదరాబాద్.
  6. వెంకటకృష్ణ, గాజుల. 2016. దేవరగట్టు కథలు, లిఖిత ప్రెస్ హైదరాబాద్.
  7. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. కథాశిల్పం. విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్, విజయవాడ.
  8. వెంకటేశ్వర్లు, బూదాటి. తెలుగు సాహిత్యప్రక్రియలు-ధోరణులు. హిమాకర్ పబ్లికేషన్ హైదరాబాద్.
  9. శెట్టి, ఈశ్వరరావు. గురజాడ కథానిక, విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్ హైదరాబాద్
  10. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర విశాలాంధ్ర పబ్లిసింగ్ హౌస్ విజయవాడ.
  11. సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు. మొదటి సంపుటం. విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]