headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-8 | July 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం: విస్మరణ - వాదవివాదాలు

బాషిపంగు వెంకన్న

పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ,
ఉస్మానియా విశ్వవిద్యాలయం,
మహబూబాబాద్, తెలంగాణ
సెల్: +91 9052180854, Email: bashipanguvenkat7235@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సుదీర్ఘ తెలంగాణ అస్తిత్వపోరాటాల అనంతరం ప్రత్యేకతెలంగాణరాష్ర్టాన్ని సాధించుకున్న సందర్భంలో తెలంగాణ ప్రాంత కవుల కృషిని వెలుగులోకితెచ్చే అవసరం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికి తెలంగాణ చరిత్రకి ఆ ప్రాంత కవులకు తగినంత గుర్తింపు లభించలేదు. 1990 దశాబ్దంలో ప్రాంతీయ అస్తిత్వవాదం బలంగా వచ్చినప్పటికీ అంతకుముందే తెలంగాణ కవులు, రచయితలు కవిత్వంలోనూ, కథల్లోనూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రాంతీయ అస్తిత్వంపై కర్నూలు జిల్లాలో మూడు ప్రాంతాలపై (తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ) జాతీయ సదస్సును నిర్వహించారు. ఆ సదస్సులో భాగంగా తెలంగాణకు సంబంధించి ప్రాంతీయ అస్తిత్వ ఛాయలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం 2017లో నిర్వహించింది. ఈ సదస్సులో భాగంగా తెలంగాణ చరిత్ర పరంగా సాహిత్యంలోని తన అస్తిత్వాన్ని ఏ విధంగా కోల్పోయిందో తెలంగాణ రచయితలు తెలుగు ప్రత్యేక సంచిక గ్రంథంలో వివరించారు. తెలంగాణ అస్తిత్వంపై కథాసాహిత్యంలో పరిశోధనలు జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 2012లో ఎం. దేవేంద్ర ‘తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ (1990 – 2010)’ అనే అంశంపై పరిశోధన చేసారు. ఈ పరిశోధనలో కథా సాహిత్యంలో తెలంగాణ అస్తిత్వ మూలాలను తెలియజేసారు. ప్రస్తుత వ్యాస ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాష్ర్టం యొక్క ఉనికి అస్తిత్వం ఏ విధంగా కోల్పోయిందో తెల్పడమే. నేను సేకరించిన గ్రంథాలలో ఉన్న విషయాలను సమాచార విశ్లేషణ పద్ధతి ద్వారా వివరించాను.

Keywords: అస్మకరాజ్యం, శాసనాలు, తెలంగాణ తొలి తెలుగుపదం, ప్రాచీన కవులు, ఆదికవి, తెలంగాణ తొలి కథ

1. ఉపోద్ఘాతం:

1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (తెలంగాణ+ఆంధ్ర) ఏర్పడిన తర్వాత అనేకమైన రాజకీయపరమైన పరిణామాలు జరిగాయి. సమాజాన్ని ప్రాంతీయ సమాజాలను మార్చే శక్తి రాజకీయాలకే ఉంది. కుట్ర పూరితమైన రాజకీయ పరిపాలనలో భాగంగా ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీశారు. తెలంగాణ చరిత్ర సాహిత్య అంశాలు, భాష సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, నీళ్ళు నిధులు నియామకాలు చివరికి తెలంగాణ అనే పేరును కూడా ఉనికిలో లేకుండా చేశారు. 

2. అస్మక రాజ్య ప్రస్తావన:

ప్రాచీన భారతదేశంలో క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో అనేక రాజకీయ సాంస్కృతిక ఆందోళనలు జరిగి రాజకీయంగా చిన్నచిన్న జనపదాలను ఆక్రమించి మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. 16 మహాజనపదాలలో దక్షిణ భారత దేశంలో ఏర్పడిన ఏకైక రాజ్యం అస్మక (అస్సాక), రాజధాని – పోతన్ (బోధన్), గోదావరి నదికి దక్షిణాన ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం "ముఖత్రాపు పేట శాసనం అస్మక మహాజనపదం"గురించి తెలిపే మొట్టమొదటి ఆధారం (భారతదేశ చరిత్ర సంస్కృతి2022, ప్రతిభ సిరీస్, పుట:690) అదేవిధంగా మెగస్తనీస్ "ఇండికా" అర్యన్ "ఇండికా" ప్లీనీ "నేచురల్ హిస్టరీ", టాలేమి మొదలైన గ్రీకు పండితుల రచనల్లో అస్మక రాజ్య ప్రస్తావనలు కలవు. మహాజనపదాల కాలంలో జైన బౌద్ధ మతాలు విలసిల్లాయి కాబట్టి జైన సాహిత్యంలో అస్మకరాజ్య రాజధాని పోతలి, పోదన్, బోధన్ ప్రస్తావన కలదు. కాలక్రమంలో మగధ రాజ్యం బలపడటంలో మహాజనపదాలు అంతరించాయి. చివరికి అస్మకరాజ్యం శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది. బోధనలో జరిపిన పురావస్తు తవ్వకాలలో ఆ కాలం నాటి కోట ఆనవాళ్లు, మట్టి పాత్రలు లభించాయి. ఇంకా శాస్త్రీయమైన తవ్వకాలు జరిపితే మరుగున పడిన తెలంగాణ చరిత్ర అస్తిత్వ మూలాలను వెలికి తీయవచ్చు. నేటికీ నిజామాబాద్ జిల్లాలో బోధన్ మహా పట్టణంగా విలసిల్లుతుంది. అస్మక రాజ్యాంగ మహాజనపదంగా గుర్తింపు పొందినప్పటికీ తెలంగాణ రాజ్యంగా గుర్తింపును పొందలేదు. 

3. శాతవాహన కాలం నాటి కవులు గ్రంథాలు విస్మరణ:

శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు తన తండ్రి సాతవాహనుడి పేరుమీద రాజ్యాన్ని స్థాపించాడు ఇతడు కోటిలింగాల (కరీంనగర్-జగిత్యాల) ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు అనీ శ్రీముఖుడి నాణేల ఆధారంగా తెలుస్తుంది. నానాఘాట్ శాసనం ఆధారంగా మొదటి శాతకర్ణి తండ్రి సిముకుడు అని తెలుస్తుంది అయినాప్పటికీ ఆంధ్రులు కోస్తాంధ్రవాదం ముందుకు తెచ్చి ఆంధ్రబృత్యుల వంశం, శాతవాహన వంశం ఒక్కటేనని శ్రీముఖుని మొదటి రాజధాని ధాన్యకటకం (గుంటూరు) అని ఆర్.జి భండార్కర్ వాదించాడు. తెలంగాణ వాదం ప్రకారం కోటిలింగాలలో దొరికిన శ్రీముఖి నాణేలు వారి కన్నా పూర్వ రాజుల నాణేలు లభించడంలో మొదటి రాజధాని కోటిలింగాల అని నిర్ధారించారు. (సత్యనారాయణరెడ్డి ఎ. తెలుగు ప్రత్యేక సంచిక – ప్రపంచ తెలుగు మహాసభలు, పుట.66)

స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఆంధ్రపాలకును ధాన్యకటకమే మొదటి రాజధాని అని పాఠ్యపుస్తకాలలో పొందుపరిచారు. కోటిలింగాల ప్రాంతాన్ని విస్మరించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అనే చారిత్రక వాస్తవాన్ని ఆంధ్ర చరిత్రకారులు మరుగున పెట్టి కోస్తాంధ్ర చరిత్ర సంస్కృతుల్ని పొగిడారు. అదేవిధంగా శాతవాహనుల అనంతరం విష్ణుకుండినిలు తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించారు వీరికి సంబంధించిన కొన్ని అంశాలను మరుగున పెట్టి తమ ప్రాంత విశిష్టతను వివరించారు. 

తెలంగాణ నుండి వెలువడిన తొలి లిఖిత గ్రంథం బృహత్కథ. భారతీయ కథా సాహిత్యానికే కాక ప్రపంచ కథా సాహిత్యానికి మహాగ్రంథం. బృహత్కథ దీని యొక్క సంస్కృత నామం 'వడ్డకహ' పరిశోధకుల ప్రకారం 7 అధ్యాయాలలో ఒకే అధ్యాయం లభిస్తున్నది. దీనిని రచించిన గుణాడ్యుడు తెలంగాణ వాడు/తెలుగు వాడు కావటం విశేషం. వాల్మీకి, వ్యాస, గుణాడ్యుడు, ముగ్గురిని మహాకవిత్రయంగా పేర్కొంటారు. భానుడు, దండి, క్షేమేంద్రుడు, సోమదేవ సూరి వంటి పండితుల గ్రంథాలకు మూలం బృహత్కథయే. పంచతంత్ర కథలు, బేతాళ కథలు, అరేబియన్ కథలకు మూల గ్రంథం బృహత్కథయే. అలాంటి మహత్తరమైన నీతి కథలను విస్మరించి పంచతంత్ర కథలకు ప్రాచుర్యం కల్పించారు. కానీ మూల గ్రంథమైన బృహత్కథకు గుర్తింపు రాలేదు. చరిత్రలో శాతవాహనుల కాలాన్ని స్వర్ణ యుగం అంటారు. శాతవాహన రాజుల్లో హాలుడు స్వయంగా కవి. ఇతడు వివిధ కవులు రచించిన పద్యాలను సేకరించి ‘గాథాసప్తశతి’ కావ్యాన్ని సంకలనం చేశాడు. ప్రాకృతంలో పద్యాన్ని 'గాథ' అంటారు. 'సప్తశతి 'అనగా 700 గాథలను సేకరించి ఈ కావ్యాన్ని కూర్చడు. పల్లె ప్రజల జీవితాలు, కర్షకుల జీవితాలు, శృంగార హాస్య వృత్తాంతాలు పెండ్లి పాటలు గాథల్లో వర్ణింపబడ్డాయి. గాథా సప్తశతి తెలంగాణలో సంకలన రచన అయ్యింది. దీనిలో ‘పిల్ల, అత్, పొట్ట, అద్దం, పాడి, మైల, పత్తి, రూప, అవ్వ, బొంది’ (గంగాప్రసాద్ మల్లేగోడ (సం.) శాతవాహనుల నుండి కాకతీయుల వరకు - తెలంగాణ, పుట.59) వంటి తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు శాతవాహనులు ఆంధ్రభృత్యులని వారి చరిత్రలో హాలుడిని ఆంధ్ర ప్రాంతానికే పరిమితం చేశారు. 

4. తెలంగాణ తొలి తెలుగు పదం – శాసనాలు విస్మరణ:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగులో తొలి పదం తొలిగద్య, పద్య శాసనాలపై ఇప్పటికి ఆంధ్ర తెలంగాణ చరిత్రకారుల మధ్య చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఏపీలో కడప జిల్లాలో బ్రిటిష్ కాలంలోనే ఆనవాళ్లు కనిపించకుండా పోయి కొన్ని రోజుల తర్వాత దొరికిన కల్లమల్ల శాసనం తొలి తెలుగు శాసనమని చరిత్రకారులు పరిశోధకులు చెప్పటం ఇందుకు కారణమైంది. "కళ్ళమల్ల శాసనం" క్రీ.శ.575 కాలానికి వందేళ్ళ కిందట్నే కీసరగుట్టలో "తొలుచు వాండ్రు" అనే తెలుగు పదం రాశారని తెలంగాణ చరిత్రకారులు వాదిస్తున్నారు. అనగా విష్ణుకుండినుల రాజైన రెండవ మాధవ వర్మ క్రీ. శ. 410-435 హయంలోనే కీసరగుట్టలో శాసనం రాశారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు. కీసరగుట్టలో రామలింగేశ్వర ఆలయం వద్ద రాతి గుండు పై "తొలుచువాండ్రు"అని శిల్పులు రాసినట్టు పేర్కొన్నారు. ఈ శాసనాన్ని 1967 లోనే అప్పటి చరిత్రకారులు గుర్తించినప్పటికీ తెలంగాణపై ఉన్న వివక్ష వల్లే ఉమ్మడి AP చరిత్రకారులు గుర్తించలేదన్నారు. (వెలుగు పత్రిక- ఈ పేపర్ జనవరి 10, 2022). గోపరాజుల కాలం (క్రీ.పూ 300) నాటి నాణేల్లోనీ 'నారన' పేరు ఆధారంగా అన్న తెలుగు మాట వాడుకలో ఉన్నట్లు నిరూపితం అవుతున్నది. కానీ తెలంగాణపై వివక్షత కారణంగా ఆంధ్ర చరిత్రకారులు తొలి తెలుగుపదంగా చరిత్రకారుడు వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధనల్లో భాగంగా అమరావతి స్తూపం శిథిలాల్లో రాతి పలకపై గుర్తించిన 'నాగబు' అనే పదాన్ని తొలిపదంగా చలామణిలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర పోటీ పరీక్షల్లో తొలి తెలుగు పదం 'నాగబు' అని ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం!. 

తెలంగాణలో తొలి గద్య శాసనం- నన్నయ గద్య రచనను పోలివున్న కొఱవి శాసనం, మరియు పద్య శాసనం-కుర్క్యాల శాసనంలో 3 కంద పద్యాలు తెలుగులో, 3 పద్యాలు కన్నడంలో మరియు సంస్కృతంలో పద్యాలు కలవు. (మనోహరి భిన్నూరి, శిలాక్షరం – బి.ఎన్.శాస్ర్తి సమాలోచన, పుట. 174) త్రిభాషా భాష శాసనంగా (తెలుగు, కన్నడం, సంస్కృతం) గుర్తింపబడినప్పటికీ తొలి పద్య శాసనంగా- అద్దంకి శాసనం, గద్య శాసనంగా-కళ్ళ మల్ల శాసనాలకే ఆంధ్ర చరిత్రకారులు ప్రాధాన్యతను ఇచ్చారు. తెలుగులో మొదటిది ఏది? అన్న ప్రశ్న వచ్చినప్పుడల్లా అన్ని ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చాయంటూ ప్రచారం చేశారు. అచ్చ తెలుగు కావ్యం, తెలంగాణ శాసనాలు, ఆదికవి, పోతన, కొఱవిగోపరాజు, పాల్కురికి కవుల జన్మస్థలం విషయంపై అలాగే కథ, నవల విషయంలోనూ అదే జరిగింది. కాకతీయ గణపతి దేవుడు చక్రవర్తి కాలంలో కరీంనగర్ జిల్లాలో  లభించిన 'ఉప్పరపల్లి శాసనం' అచ్చంగా తెలుగు శాసనం ఈ శాసన కర్త రేచర్ల రుద్రుడి మంత్రి రాజనాయకుని కొడుకు ‘కాటయ’. ఈ శాసన పద్య గద్యాత్మకంగా ఉంది. ఇందులో ఉత్పలమాల, కందం, మత్తేభం వృత్త పద్యాలు, 2గద్యలు కలవు. (భిన్నూరి మనోహరి శాసన పర్వం-2024, పుట. 134)

అచ్చతెలుగు కావ్యాలకు తెలంగాణ పుట్టినిల్లు. తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం పొన్నెగంటి తెలగన రాసిన 'యయాతి చరిత్ర' గుర్తింపు పొందింది. కానీ తొలి అచ్చ తెలుగు శాసనాన్ని ఆంధ్ర చరిత్ర సాహిత్యకారులు విస్మరించారు. మొదటిసారిగా తెలంగాణ అనే పేరు ప్రస్తావన ఉన్న శాసనం మెదక్ జిల్లాలోని తెల్లాపూర్ శాసనం. ఈ శాసనంలో తెలంగాణ అనే పదం 'తెలంగాణ పురం' అని పేర్కొనబడింది. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా పరిపాలన కాలం తెలంగాణ పురంలో నడుబావిని నిర్మించారు. ఆ బావికి ఉత్తరాన మామిడి వనాన్ని పెట్టినట్టు ఈ శాసనంలో కలదు. (భిన్నూరి మనోహరి, శాసనపర్వం- 2024, పుట.270) ఈ శాసనంలో విషయం చాలా చిన్నదే కానీ 'తెలంగాణ' పదం ఉండటం వల్ల ప్రసిద్ది పొందింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కొత్త రాష్ట్రానికి 'ఆంధ్ర- తెలంగాణ' రాష్ట్రంగా ఉండాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. ఈ పేరు ముసాయిదా బిల్లులో కూడా ఉంది. కానీ ఈ విషయాన్ని మరుగున పరిచి ఆంధ్ర పాలకులు మరియు జాయింట్ సెలెక్ట్ కమిటీ కొత్త రాష్ట్రానికి 'ఆంధ్రప్రదేశ్ ' పేరును నిర్ణయించారు. తెలంగాణ పేరును ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఆదిలోనే తుంగలో తొక్కారు. తెలంగాణ అనే పేరును ఉనికిలో లేకుండా చేశారు.

5. తెలంగాణ ప్రాచీన కవులు – వాద వివాదాలు 

తెలంగాణ చరిత్ర గొప్పతనాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి తెలియజేసిన తెలంగాణ శాసనాల పరిశోధకుడు నడయాడే తెలంగాణ చరిత్రగా గుర్తింపు పొందిన భిన్నూరి నరసింహ శాస్త్రి గారు. ఈయన పరిశోధనలో భాగంగా ఆదికవి 'నన్నయ కాదు.... నన్నెచోడుడు 'అని నిరూపించారు. అయినప్పటికీ ఆంధ్ర చరిత్రకారులు తమ ప్రాంతం వాడైన నన్నయను ఆదికవిగా ప్రకటించారు. నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొందరు పరిశోధకులు తెలంగాణ ఆదికవిగా పాల్కురికి సోమనాథుడిని పేర్కొన్నారు. పాల్కురికి సోమనాథుడు వరంగల్ జిల్లాలోని పాల్కురికి గ్రామ నివాసి, ఆధారాలు ఉన్నప్పటికీ సీమాంధ్ర పండితులు సోమనాథుడి జన్మస్థలం మైసూర్ రాష్ట్రంలోని హల్కురికి తేల్చారు. వరంగల్ జిల్లాలో జన్మించిన పోతనను కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో పుట్టినట్టుగా ప్రచారం చేయటం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. ఈ విషయం సీమాంధ్ర పండితులకు, తెలంగాణ కవులకు పెద్ద ఉద్యమమే జరిగింది.

‘‘మొదటిసారిగా వావికొలను సుబ్బారావు అనేకవి పోతన జన్మస్థలం 'ఒంటిమిట్ట' గ్రామ నివాసి’’ (సత్యనారాయణ రెడ్డి ఎ., తెలుగు ప్రత్యేక సంచిక, ప్రపంచ తెలుగు మహాసభలు, పుట.233) అని ప్రచారం చేశాడు. 

సీమాంధ్ర కవులు పండితులు ఇంకొక అడుగు ముందుకేసి కడప జిల్లా ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆహ్వాన పత్రంపై పోతన బొమ్మ వేసి అతను కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామం వాడని చెప్పుకున్నారు. జయంతి రామయ్య పంతులు ధూపాటి వెంకట రమణాచార్యులు వంటి కవి పరిశోధకులు వావికులను సుబ్బారావు చెబుతున్నది అవాస్తవమని పోతన జన్మించింది వరంగల్ జిల్లా బమ్మెర గ్రామం అని స్పష్టమైన ఆధారాలతో నిరూపించినప్పటికీ సీమాంధ్ర పండితులు తమ ప్రాంతం వాడని ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రకటించుకున్నారు. సాహిత్యచరిత్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ కవులకు తగిన స్థానం లభించలేదని తెలంగాణ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోపిడి చేసినట్టుగా తెలంగాణ సాహిత్యాన్ని కూడా ఆంధ్ర పాలకులు దోపిడీ చేయడాన్ని తెలంగాణ కవులు, రచయితలు, మేధావులు, ఉస్మానియా విద్యార్థులు, సినారె, నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జయశంకర్ సార్ వంటి మేధావులు కడప జిల్లా విదశాబ్ది ఉత్సవాల్లో పోతనను తమ జిల్లా వాడని ప్రదర్శించడాన్ని (One India Telugu e paper, 24 August 2000)  తప్పు పట్టారు. 

అదేవిధంగా తిక్కన సమకాలికుడు అయిన మారన గోదావరి తీరంలో జన్మించిన మారన జన్మస్థలం కోస్తాంధ్రకు తరలిపోయింది. ఆరుద్ర గారు మారన గూర్చి తెలంగాణ ప్రాంతపు గోదావరి నది తీరం వాడని తన రచనల్లో ఓ పద్యం ద్వారా తెలిపాడు. కొఱవి గోపరాజు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గల భీంగల్ ఇతని జన్మస్థలం. పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు అని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఆంధ్ర పండితులు ఉభయగోదావరి ప్రాంతం వాడని చెప్పుకున్నారు. 

దక్షిణ భారతంలో ఏకైక మహాజనపదం అస్మకరాజ్యం గుర్తింపు నోచుకోలేదు. తదనంతర పాలకులు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అనే చారిత్రక వాస్తవాన్ని ఆంధ్ర చరిత్రకారులు మరుగున పెట్టారు. వీరి అనంతరం రాజ్యం విష్ణుకుండినులు వారి చరిత్ర అంశాల, ముఖ్యమైన తొలి శాసనాలను విస్మరించారు. చారిత్రకంగా రాజ్య నిర్మాణం గోదావరి నదికి దక్షిణంగా తెలంగాణలో ఆరంభమై కోస్తాంధ్ర వరకు రాజ్యం విస్తరించింది అనే అంశాన్ని ఆంధ్ర చరిత్రకారులు పుస్తకాల్లో ప్రస్తావించలేదు. కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీల రాజ్యాల చారిత్రక అనేక విషయాలను విస్మరించి తెలంగాణ ప్రాంతానికి సంబంధం లేనటువంటి విజయనగర సామ్రాజ్య చరిత్రను మరియు కోస్తాంధ్ర విశిష్టతను వారి సంస్కృతులను, సంప్రదాయాలను పాఠ్యపుస్తకాల్లో లిఖించారు. 

నిజాంల పరిపాలనలో స్వంత రైల్వేలు, ఉర్దూ యూనివర్సిటీ, ప్రత్యేక న్యాయశాఖ, అనేక పరిశ్రమలు, రోడ్డు రవాణా సంస్థలు, ఎయిర్ లైన్ స్వంత విమాన సంస్థ, స్వతంత్ర బ్యాంకు, నీటిపారుదల వ్యవస్థ, నూతన విద్యావ్యవస్థ అనేక కట్టడాలు నిజాం పరిపాలనలో అభివృద్ధి చెందినప్పటికీ తెలంగాణ ప్రాంతం అంధకారంలో ఉందని, మతతత్వం పెరిగిందని, మేము పరిపాలనకు రాకముందు తెలంగాణ భూముల్లో దుబ్బ కొట్లాడేది అని మేమే తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్పుకున్నారు. ప్రత్యామ్నాయంగా తెలంగాణ వాస్తవ చరిత్రను మరుగున పరిచారు.

6. తెలంగాణ తొలి కథకురాలు – భండారు అచ్చమాంబ:

6వ నిజాం కాలంలోనే తెలంగాణ జీవితాల్ని బండారు అచ్చమాంబ కథలుగా రాసింది. హైదరాబాద్ లో అందరికీ ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ఆంధ్రాలో బ్రతకలేని పరిస్థితి వస్తే హైదరాబాదుకు వలస వెళ్లైనా జీవితాలను  వెల్లదీయవచ్చు అని సత్పత్రదానము (1902) (శ్రీహరి రవ్వా, తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, పుట.96) కథలో తెలియజేశారు.

తెలుగు కథ సాహిత్యంలో తొలి కథ విషయానికి వస్తే 1902లో బండారు అచ్చమాంబ 'స్త్రీ విద్య'ను కాదని 1910లో గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' ను తొలి కథగా ఆంధ్ర సాహిత్యకారులు గుర్తించారు. ఇటీవల కవి పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ తొలికథగా 'స్త్రీ విద్య'అని ఆధారాలతో సహా నిరూపించారు. నిజాం రాష్ట్రంలో సాటి తెలుగు వారి గురించి ఆలోచన చేయకుండా ఈ ప్రాంతంలో కవులు జన్మించి ఉండరు? ఒకవేళ ఎక్కడ జన్మించిన  కవులనైనా సరే కోస్తాంధ్ర ప్రాంతంలోనే పుట్టినట్టు రాయటం సీమాంధ్ర సాహిత్యకారులకు, చరిత్ర రచయితలకు పరిశోధకులకు అలవాటుగా మారింది.

అదే విషయమై ‘‘1930వ సంవత్సరంలో ముడుంబై వెంకట రాఘవాచార్యులు అనే కవి "నిజాం రాష్ట్రమున తెలుగు కవులు పూజ్యము’’ అని అహంకారపూరితమైన వ్యాఖ్యానం చేశారు." (సత్యనారాయణ రెడ్డి ఎ., తెలుగు ప్రత్యేక సంచిక, ప్రపంచ తెలుగు మహాసభలు, పుట. 233) 

దానికి సురవరం ప్రతాపరెడ్డి గారు సవాలుగా తీసుకొని 1934 సంవత్సరంలో "గోల్కొండ కవుల సంచిక" అనే గ్రంథంలో 354 కవులు వారి రచనలు, మరియు జీవితాలను గూర్చి గ్రంథ రూపంలో సమాధానం ఇచ్చాడు. అదే వారసత్వంగా జూలూరి గౌరీశంకర్ గారు 'పొక్కిలి' కవితా సంకలనంలో 129 మంది తెలంగాణ కవితలను పరిచయం చేశాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర కవుల ఆదిక్యత కొనసాగింది. ప్రముఖ పత్రికలు పత్రికా సంపాదకులుగా వారే ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమైన ప్రభుత్వ విభాగాల్లో వారే ఉండటం వల్ల సీమాంధ్ర కవులకు ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ కవుల రచనలు వచ్చిన సీమాంధ్ర పత్రిక సంపాదకులు, నాయకులు హేళన చేసి నిరాకరించారు. తెలంగాణ భాష యాస పై అణచివేత వివక్షత కొనసాగించారు. తెలంగాణలో స్థిరపడిన గొప్ప కవులు రాయప్రోలు సుబ్బారావు దివాకర్ల వేంకటావదాని మరియు కరీంనగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు తెలంగాణ భాష సంస్కృతినీ వ్యతిరేకించారు.

"1980వ సంవత్సరంలో టి. అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడే తెలంగాణ భాషను హేళన చేస్తూ పత్రికల్లోను,ప్రసారమాధ్యమాల్లోను అవమానించారు". (శ్రీధర్ వెళ్దండి,  తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం-2014, పుట:27)

తెలంగాణ భాష అర్థం కావటం లేదని పత్రిక భాషలో రాయాలని సీమాంధ్ర పాలకులు, పత్రికా సంపాదకులు,రచయితలు, తెలంగాణ భాషను వ్యతిరేకించారు. తెలుగు వారందరి భాష ఒక్కటేనని భాషా ప్రయుక్త రాష్ట్రమని సగర్వంగా వల్లించిన మాటలన్నీ అబద్ధాలని నిరూపించుకున్నారు. 2013వ సంవత్సరంలో రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా రాజకీయ పార్టీలు లిఖిత పూర్వకంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా అంగీకరించారు. ఆ సభలో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యునిగా నేను తెలుగులోనే మాట్లాడుతాను. తెలుగు వారందరం 57 సంవత్సరాలు కలిసి ఉన్నాం ఎలా విభజన చేస్తారు, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చట్టసభల్లో అవమానిస్తున్నారు అని ప్రకటించారు. ఆ విషయమై అదే సభలో ఉన్న వెంకయ్య నాయుడు గారు చట్టసభల్లో ప్రాంతీయ భాషయైన తెలుగు మాట్లాడే హక్కు సభ్యులకు ఉంది అని హరికృష్ణకు మద్దతు తెలిపారు. ఆనాడు 1980లో టి. అంజయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణ భాష యాసలో మాట్లాడినందుకు విమర్శించారు, పత్రికలు ప్రసారమాధ్యమాల్లో అవమానించిన సంగతి మరిచారు. 

తెలంగాణలో మాట్లాడుకునే భాషా యాసను పాఠ్యపుస్తకాల్లో, పత్రికల్లో, రేడియో సినిమాల్లో వ్యతిరేకించారు. ప్రత్యేకంగా టీవీ సీరియల్ లలో, సినిమాల్లో విలన్, హాస్య పాత్రలకు తెలంగాణ భాషను వాడి కించపరిచారు. సీమాంధ్ర భాషలోనే పాఠ్యపుస్తకాలు, పత్రికలు ఉండటం వల్ల వారి భాషా భవాల్లోకి మారాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలంగాణ అస్తిత్వం కొత్త కాదు సుదీర్ఘ చరిత్ర ఉంది. తెలంగాణ పోరాటాలకు పురిటి గడ్డ. తెలంగాణ జ్ఞాపకాలు సమ్మక్క సారక్క తిరుగుబాటు, కొమరం భీం, సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వంటి అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని ఆంధ్ర నాయకుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చి తెలంగాణ చరిత్రను అవమానించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ, తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ పండుగ లోనే ఉంది తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. అలాంటి బతుకమ్మ పండుగను సీమాంద్రులు ఏనాడు గుర్తించలేదు. తెలంగాణలో గోదావరి, కృష్ణ నదులు వందల కిలోమీటర్ లు ప్రవహిస్తున్న ఏనాడు తెలంగాణ నేలలో ప్రవహించే నదులుగా గుర్తించలేదు ఆమోదించను లేదు. 

7. ముగింపు: 

సమైక్యాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగులో మొదటిది ఏది? అనే అంశం వచ్చినప్పుడల్ల అన్ని ఆంధ్ర ప్రాంతం నుండే వచ్చాయంటూ ప్రచారం చేశారు. తెలంగాణ ప్రాచీన చరిత్ర, భాషా ,సంస్కృతి సంప్రదాయాలు, విస్మరణ వివక్షతలకు గురైంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర రచనలో తెలంగాణ వారు తక్కువగా ఉండటం, తెలంగాణేతరులైన సీమాంధ్రులు ఎక్కువగా ఉండటం వల్ల తెలంగాణ చరిత్ర వెనక్కి నెట్టబడింది. సీమాంధ్రులకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు విలువను ఇవ్వకపోవడం, తెలంగాణ ప్రాంతీయ విశిష్టతను పరిగణలోకి తీసుకోకపోవడం, తెలంగాణ సాహిత్య చరిత్రలో ప్రాచీన కవులకు మరియు వివిధ ప్రక్రియలకు తగిన స్థానం ఇవ్వకపోవడమే కాక ఆంధ్ర ప్రాంత చరిత్రకారులు, పరిశోధకులు రచించిన గ్రంథాల్లో తెలంగాణ అస్తిత్వ  చారిత్రక అంశాలు ఆదరణ కోల్పోయాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మేధావుల పోరాటాలు, కళాకారులు ధూంధాంలు, విద్యార్థుల ప్రాణత్యాగాలు, తెలంగాణ ప్రజల శాంతియుత పోరాటాల ఫలితంగా 2 జూన్ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

ఆ తర్వాత తెలంగాణ భాషకు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు చారిత్రక అంశాలకు కొంతమేరకు గుర్తింపు లభించింది. అయినప్పటికీ తెలంగాణ చరిత్ర సంస్కృతులపై చర్చలు, పరిశోధనలు జరిపి తెలంగాణ అస్తిత్వ మూల అంశాలపై శాస్త్రీయంగా, హేతుబద్ధంగా విశ్లేషణ చేసి తెలంగాణ చరిత్ర పరిణామ క్రమాన్ని నూతన ఆధారాలతో లిఖించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన వెలుగు చూడని అంశాలు సరైన నిర్ధారణకు రాని అంశాలు ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత అంశాలు చరిత్రకెక్కనివి ఎన్నో ఉన్నాయి. ఆ దిశగా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రచనల్లో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ చరిత్రకు జరిగిన అన్యాయాన్ని వివక్షతను నిర్మూలించి తెలంగాణ నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాలి.

8. పాదసూచికలు:

  1. భారతదేశ చరిత్ర సంస్కృతి2022, ప్రతిభ సిరీస్, పుట:690 
  2. సత్యనారాయణరెడ్డి ఎ. తెలుగు ప్రత్యేక సంచిక – ప్రపంచ తెలుగు మహాసభలు, పుట.66 
  3. గంగాప్రసాద్ మల్లేగోడ (సం.) శాతవాహనుల నుండి కాకతీయుల వరకు - తెలంగాణ, పుట.59
  4. వెలుగు పత్రిక- ఈ పేపర్ జనవరి 10, 2022.
  5. మనోహరి భిన్నూరి, శిలాక్షరం – బి.ఎన్.శాస్ర్తి సమాలోచన, పుట. 174. 
  6. భిన్నూరి మనోహరి శాసన పర్వం-2024, పుట.134. 
  7. భిన్నూరి మనోహరి, శాసనపర్వం- 2024, పుట.270. 
  8. సత్యనారాయణ రెడ్డి ఎ., తెలుగు ప్రత్యేక సంచిక, ప్రపంచ తెలుగు మహాసభలు, పుట.233.
  9. One India Telugu e paper, 24 August 2000.  
  10. శ్రీహరి రవ్వా, తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, పుట.96. 
  11. సత్యనారాయణ రెడ్డి ఎ., తెలుగు ప్రత్యేక సంచిక, ప్రపంచ తెలుగు మహాసభలు, పుట.233 
  12. శ్రీధర్ వెళ్దండి,  తెలుగు కథ ప్రాంతీయ అస్తిత్వం-2014, పుట:27.

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగాప్రసాద్ మల్లెగోడ (సం.), సాతవాహనుల నుండి కాకతీయుల వరకు – తెలంగాణ, 2017, తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాదు.  
  2. మనోహరి భిన్నూరి, శాసన పర్వం, 2024, ధ్రువ ఫౌండేషన్, హైదరాబాదు 
  3. మనోహరి భిన్నూరి, శిలాక్షరం – బి.ఎన్.శాస్ర్తి సాహిత్యం సమాలోచన, 2019, మూసీ పబ్లికేషన్స్, హైదరాబాదు. 
  4. రాములు బి.ఎస్., ప్రాంతీయ అస్తిత్వం కథ, నవల, 2016, విశాల సాహిత్య అకాడమి, కరీంనగర్. 
  5. శ్రీధర్ వెల్దండి, తెలుగుకథ ప్రాంతీయఅస్తిత్వం, 2014, విజయలక్ష్మి ప్రచురణ, హైదరాబాదు 
  6. శ్రీహరి రవ్వ, తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, 2016, తెలుగు అకాడమి, హైదరాబాదు
  7. సత్యనారాయణ రెడ్డి ఎ. (సం), తెలుగు ప్రత్యేక సంచిక, ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు అకాడమి, హైదరాబాదు 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]