headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. నిజాంకాలం నాటి లంబాడ ప్రజల పరిస్థితులు

డా. బానోత్ స్వామి

ఇంటి నెం. 35-3-1012, వెంకటేశ్వర కాలనీ,
రోడ్ నెం. 10, గోపాలపూర్, హసన్ పర్తి
హన్మకొండ - 506009 తెలంగాణ.
సెల్: +91 9603082128, Email: BANOTHSWAMY128@GMAIL.COM
Download PDF


వ్యాససంగ్రహం:

నిజాం కాలం నాటి లంబాడ ప్రజల పరిస్థితులను వివరించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. లంబాడ, తండా, గిరిజన పదాలను పరిచయం చేస్తూ, వారి జీవనశైలిని, 19-20 శతాబ్దాల మధ్య నివసించిన ఈ జాతి ప్రజల పరిస్థితులను పరిశోధనాత్మకంగా ఈ వ్యాస చర్చిస్తుంది. తండానిర్వహణ, బిడారు వర్తకం వంటి ముఖ్యాంశాలను స్పృశిస్తూ ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. గిరిజన సాహిత్యం, చరిత్ర, సంస్కృతులపై వచ్చిన గ్రంథాలు, పరిశోధనలు ఈ వ్యాసానికి ఆధారవిషయాలు. నిజాం కాలంలో ముఖ్యంగా లంబాడీలు తమ అస్తిత్వాన్ని, తమ జీవిత గమనాన్ని కోల్పోయి సంచార జీవులుగా గడిపిన క్రమాన్ని ఈ పరిశోధనలో అవగాహన చేసుకోవచ్చు. అప్పటి నిజాం ప్రభుత్వం నిర్వహించిన వర్తకవ్యాపారం తెలుసుకోవడం, లంబాడీల శ్రామికజీవితనేపథ్యాన్ని గమనించడం ఈ పరిశోధన ఉద్దేశ్యం - లక్ష్యం.

Keywords: బిడారులు , వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, తండ, పన్నులు, 20 వ శతాబ్దం, ఆధునికీకరణ.

1. ఉపోద్ఘాతం:

భారతదేశంలో ఆధునికవ్యాపారం, రవాణా సౌకర్యాలు రాకమునుపు లంబాడాలు అధిక సంఖ్యలో బిడారు వర్తకులుగా, వ్యాపారులుగా పేరుగడించారు. బిడారు వర్తకం ప్రాచీన కాలంనుండి వుండేది. పదకొండవ శతాబ్దంనుండి వర్తక వాణిజ్యాలు విస్తరిస్తూ, మొగలు సామ్రాజ్య కాలంలో పతాకస్థాయికి చేరుకున్నాయి. పాలకులు యీ సంచార గుంపులని సైన్యం యొక్క ఆహార పదార్థాలు రవాణా చేసే వారిగా వినియోగించు కున్నారు. ఎన్నో సంచార జాతులు ఈ వర్తకంలో వుండేవి. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో లంబాడీలు ఈ విధమైన వ్యాపారాలలో వుండేవారు.

ఇక యుద్ధ సమయాలలో ఆహారధాన్యాలు, వస్తువులు సైన్యానికి రవాణా చేసేవారు. వీరు ఢిల్లీ సుల్తాన్, మొగల్, ఫ్రెంచ్, బ్రిటిషు మరియు నైజాం సైన్యాలకు స్వతంత్రమైన రవాణా వర్తకులుగా మెలిగేవారు. కొంతమంది ఇతర వ్యాపారులకు, రవాణా సౌకర్యాలు కల్పించేవారు. కొంతమంది వర్తకులుగా కూడా వుండేవారన్న విషయాన్నిబట్టి వీరు కూడ కొంత సొమ్మును కూడబెట్టేవారని తెలుస్తోంది. అయితే క్రమబద్ధీకరించిన మార్కెటు వల్ల వలసపాలకుల కొత్త ఆర్ధిక సంబంధాలు వల్ల బిడారు వర్తకులు తృణీకరింపబడ్డారు. దీనికితోడు రైల్వేలు రావడంవల్ల, యంత్రాలవల్ల లంబాడాల బిడారు వర్తకం పూర్తిగా దెబ్బతింది. వలస పాలనవల్ల లంబాడాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. మొదట్లో తమకి తాము స్థిరపడడానికి వలస శక్తులు బిడారు వర్తకులని వుపయోగించుకొన్నారు. 

1820 నుండి సంస్కర్తలు ఉద్యమించి, లంబాడాల చరిత్రని, సంస్కృతిని, నేర్చుకున్న నైతిక విలువలని ఆసరా చేసుకుని మార్పు కోసం ప్రయత్నించారు. తరతరాలుగా పదిల పర్చబడిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలు మూలస్తంభాలుగా సరికొత్త అస్తిత్వాన్ని ఏర్పర్చుకునే ప్రయత్నంలో పడింది. కొత్త వ్యవస్థలో స్వయం సంస్కరణలతో పోరాడేశక్తిని సాధించింది.

లంబాడీలు బిడారు వర్తకులుగా, సుదూర ప్రాంతాల్లో ఏవిధంగా వ్యాపారం చేసేవారో అనే విషయంతో ఈ పుస్తకం మొదలవుతుంది. ఏవిధంగా లంబాడీల పరిణామ క్రమం అదే వృత్తులు చేస్తున్న వివిధ సాంఘిక, మత వర్గాల నుండి రూపొందింది అనే విషయాన్ని విశ్లేషిస్తుంది. ఢిల్లీ సుల్తాన్ల కాలం నుండి లంబాడాలు రవాణా వర్తకులుగా ప్రసిద్ధి పొందారు. అదేవిధంగా మొగల్, నిజాం, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాలకి ఆహారధాన్యాలు అందజేసేవారు. లంబాడాల అస్తిత్వాన్ని అధ్యయనం చేయడానికి వాణిజ్య వర్గాల శ్రేణులని పరిగణలోకి తీసుకోవాలి. వలస పాలన ప్రమేయంతో బిడారు వర్తకం ఎంతో నష్టపోయింది. కొత్త మార్కెట్ ఆర్థిక విధానం, కొత్త మార్కెట్ నియంత్రణలు అభివృద్ధి చెందిన అధునాతన రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ అతి కీలకమైన పాత్ర పోషించాయి. 

2. పరిశోధన ఉద్దేశం: 

సాధారణంగా గిరిజనులు అటవీక జీవితాన్ని కొనసాగిస్తూ ఆధునిక సమాజానికి దూరంగా మెలుగుతున్న క్రమాన్ని ప్రాచీన సాహిత్యం నుంచి గమనించవచ్చు. కానీ సమాజంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నాగరికత అంశాలు గిరిజనుల జీవితాలపై ప్రభావాన్ని చూపాయి. ఇందులో కారణంగానే లంబాడీలు అనేక ప్రాంతాలకు వలస వెళ్లడం వర్తక వ్యాపారాలు నిర్వహించుకుంటూ జీవితాన్ని కొనసాగించడం జరిగింది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రభుత్వం వీరికి వలసలు వెళ్లే క్రమంలో పునరావాసాలు కల్పించడంలో అప్పటి ప్రభుత్వాలు విఫలమవ్వడం, ప్రభుత్వ పథకాలు అందించకపోవడం, నిరక్షరాస్యతకు లోనవ్వడం మొదలగు కారణాలు వీరి జీవితాలను వర్తక వ్యాపారం వైపుకు నెట్టివేశాయి. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి వీరు ఆధునిక సాంస్కృతిలో మెల్లమెల్లగా అలవాటు పడుతూ వచ్చారు. అంతకుముందు నిర్వహించిన వర్తక వ్యాపారాలలో భాగంగా అనేక నూతన మార్కెట్ వ్యవస్థ వచ్చి వీరి మానవ మునగడపై కొంత ప్రభావాన్ని చూపిందని గమనించవచ్చు. ఈ అంశాలన్నీ పరిశీలించడం ఈ వ్యాస ఉద్దేశం.

3. లంబాడిలా పరిచయం: 

పూర్వం తాండాలో లంబాడీలు నైతికవిలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతి ని పరిరక్షించుకున్నారు. కానీ ఈ ప్రజల గురించి ఏ మత గ్రంధాలు, ఏ చరిత్ర కారులు, ఏ పుస్తకాలలో రాయలేదు. ఏ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనె ఉన్నారు.... గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ లంబాడీలు శారీకంగా భారీ మనుసులు. దృడమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు, వారిని చుసిన బ్రిటిష్ ప్రభుత్వం Long Bodies అని పేరు పెటింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం Criminal Tribe Act అమలులోకి తెచ్చింది, ఈ చట్టం ఉద్దేశం లంబాడీ లు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీ లు నేరస్థలు.. కావున వారిని బందించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవిలోని లంబాడీల తాండాలపై పడడంతో, లంబాడీలు అడవులలో పారిపోయారు. వారి పై ఎవరు దాడి చేసిన మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు ఈ సిద్ధాతం లంబాడీ తెగ కూడా పాటించింది. ఆలా బ్రిటిష్ వారి నుండీ పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి. సంచార తెగగా లంబాడి లు పిలవపడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగ వారు ఐనా సరే ఆహారం, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ లో తండాలు, గుడాలు, నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.లంబాడిలు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి, జీవనం కోసం అడవి ఉత్పతుల మీద ఆధారపడి జీవించారు. బయట సమాజం గురించి తెలియక ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. లంబాడీల సంస్కృతీ సంప్రదాయాలు కట్టుబాట్లు ఎంతో గొప్పనైనవి ప్రత్యేకమైనవి. వీరినే లంబాడీ, సుగాలీ లమ్మాణీ బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తాండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాష కు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు.

లంబాడీలు ఇప్పటికి కూడా తాండాలలో తమ ఆచారవ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు. లంబాడీ పూర్వికులు ఉండడానికి తాండాలను నెలకొల్పి లంబాడీ సంస్కృతిని కాపాడేలా చేసారు. ఈ తాండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారు ఐనా ఎంత గొప్పవారు ఐనా, తాండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు, లంబాడీలపై రుద్దడానికి వీలులేదు, కావున తాండా బయటి మనసులను రాణించే వారు కాదు. తాండా నాయక్ (తాండా పెద్ద ) ఏం చెప్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు,అంటే వారిలో ఎదో ప్రత్యేకం ఉంది అని అర్ధం. లంబాడీలలో పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకు సంస్కృతీ, సంప్రదాయాలు,కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవనవిధానం, పెళ్లి,, చావు, అన్ని ప్రత్యేకమైనవే. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి,బాషా కనుమరుగవుతున్నాయి,

4. లంబాడాల జీవన శైలి: 

పంతొమ్మిదో శతాబ్దపు మధ్య కాలంనుండి, వారు పశువుల కాపరులుగా, వ్యవసాయదారులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనోపాదిని చేసుకునే పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టబడ్డారు. విధివిధానాలు, నియంత్రణలు, చట్టాలు, వలస రాజ్య రాజకీయ పరిస్థితులు లంబాడీల పరిస్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రాజ్యం వారి సంచార జీవనశైలిని అణిచివేసి, రైతు కూలీలుగా స్థిరపడేలా చేసింది. రాజ్యం జారి చేసిన రెవెన్యూ, వ్యవసాయ విధానాలు క్రమంగా లంబాడాలని కూలీలుగా మార్చివేసింది. కరువుకాటకాల సమయాలలో, ఋతువులు సరిగ్గా లేనప్పుడు, దోపిడీ చేయవలసిన స్థితి ఏర్పడింది. దీనివలన వారిని రాజ్యం నేరస్తులుగా పరిగణించింది. ఎన్నో పద్ధతులలో వారిని అణిచివేసింది. మొత్తానికి హైద్రాబాద్ ప్రభుత్వం తీసుకువచ్చిన వలసవాద రాజకీయ వాదం లంబాడాలని ప్రాధాన్యం లేని వర్గంగా మార్చింది.

హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన లంబాడాలు ఉత్తర-పశ్చిమ భారత దేశానికి చెందినవారు. దక్షిణం వైపు వచ్చిన లంబాడాలపై మొదలుగా ప్రస్తావన పెరిస్టా రాసిన 'ఏ హిస్టరీ ఆఫ్ ద రైజ్ ఎండ్ ప్రోగస్ ఆఫ్ ద మహమడన్ ఫైయిత్ ఇన్ ద కంట్రీ ఆఫ్ హింద్' లో వుంది. 1417 సంవత్సరంలో ఫిరోజ్ షా బహమనీ సోదరుడు ఖానాఖానన్ డక్కన్ రాజధాని గుల్బర్గా పై దండయాత్ర చేసినప్పుడు బిడారు వర్తకులకి చెందిన వందలాది ఎద్దులను తరలించుకు పోయాడు. అయితే క్రూక్ అంచనా ప్రకారం బంజారాల ప్రస్తావన 1504 సం. లో మహ్మదీయుల చరిత్రలో సికందర్ దోల్పూర్పై దండయాత్ర సమయంలో కనిపించింది. 1630 సంవత్సరంలో షాజహాన్ వజీర్ ఆసిఫ్ ఝాతో చరన్ బంజారాలు, భంగి, జంగి నాయక్ నాయకత్వంలో, రాథోడ్ వర్గం. 1,80,000 ఎద్దులతో, భగవాన్ దాస్ నాయక్ కి సంబంధించిన వడత్యా వర్గం 52000 ఎద్దులతో దక్షిణ భారతదేశంకు వచ్చారు.

5. బిడారు వర్తకులైన లంబాడాల సంక్షిప్త చరిత్ర: 

లంబాడాల చరిత్ర బిడారు వర్తకంతో మొదలవుతుంది. ఉపఖండంలో సంచార బిడారు వర్తకులు ఎంతోమంది వున్నా, ప్రతి ఒక్కరికి వారివారి చారిత్రక, సాంస్కృతిక, సామాజిక నేపథ్యాలు వున్నాయి. చూడ్డానికి విడివిడిగా, చీలిన సమూహాలుగా కన్పించినా, అదే వ్యాపారంలో వున్న వారి కలయికగా, స్థిరపడిన భావావళి నుండి ఏర్పడినవారే. అభివృద్ధి చెందుతున్న వర్తకం కావడం వల్ల ఎంతో మంది ఆకర్షితులయ్యారు. కాలక్రమంలో ప్రతి సమూహం వైవిధ్య సాంఘిక చరిత్రను ఏర్పర్చుకున్నాయి. సంచార వర్తకులకి వివిధ పేర్లతో, సాంఘిక మూలాలు ప్రతి ప్రాంతంలోనూ వున్నాయి.

హిందుజాతి వ్యవస్థలో చిన్న స్థానాలు కల్గి ఉండటం, సంక్లిష్టమైన వారి చరిత్ర, ఆధారాలు సరిగ్గా లేక పోవడంవల్ల వారిసాంఘిక చరిత్రను అర్థం చేసుకోవడం కష్టతరమే! కేవలం పదహారో శతాబ్దంనుండి, అప్పటి యూరోపియన్ యాత్రికుల డైరీల వల్ల, ఆ తరువాత కాలంలో వచ్చిన మానవ జాతి శాస్త్రజ్ఞులు, ఆంత్రోపాలిజిస్టుల వల్ల వారి చరిత్ర కొంత తెలుస్తుంది. ఈ సంచార సమూహాలు, యాత్రికుల, వలసవాద మానవజాతి శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించటానికి కారణాలు, మొదట్లో సైన్యానికి ఆహారధాన్యాలని సరఫరా చేసినవారు, 'నేరస్తుల వర్గం'గా ముద్రింప బడడమే. నిజానికి, ఈ శాస్త్రజ్ఞుల అధ్యయనాలు ఈ సమూహాల చరిత్రని వక్రీకరించినవి. వలస ప్రభుత్వం వివిధ సంచార జాతులను అన్నిటినీ కలిపి ఒకే 'బంజార' వర్గంగా నిర్ధారించారు. వీటిలో భాగంగా లంబాడాలని చేర్చింది. ఈ వర్గీకరణకి ఏ విధమైన పద్ధతిని అవలంబించారో స్పష్టంగా తెలిదుకానీ, ప్రముఖంగా మూడు విధాలు కన్పిస్తాయి.

  1. రాజస్థానీ వంశపరంపర మార్వారీ భాషకి దగ్గరగా ఉండే భాషవారు
  2. జీవనోపాధి పశువులతో ముడిపడి ఉన్న వారు
  3. ఆహారధాన్యాలు, యితరవస్తువులు రవాణా చేయడంలో నిమగ్నమై ఉండే వారు.

19వ శతాబ్దానికి చెందిన మానవజాతి శాస్త్రజ్ఞులలోనే 'బంజార' అనే పదం పట్ల చర్చవుంది. ఒకవర్గం బంజార అనే మాట పర్షియన్ పదం 'బిరన్జర్' లేదా ధాన్యం తీసుకు వెళ్ళేవారు. మరొక వర్గం సంస్కృత పదమైన 'వంజరివన్' (అడవి) చర్ (తిరిగేవారు) - అంటే అడవిలో సంచరించే వారని అర్ధం. క్రమంగా యిదే 'బంజారా' కి రూపాంతరం చెందింది. హెచ్. ఎమ్. ఇలియట్ అనే పంతొమ్మిదో శతాబ్దపు ప్రసిద్ధ మానవ జాతి శాస్త్రవేత్త ఉద్దేశ్యం ప్రకారం, శ్రీదండి కవి రాసిన 'దశకుమార చరిత్ర' లో ప్రమతి కధలో భాగంగా వున్న కోడిపుంజుల పోరాటాన్ని, బంజార సమూహంలో ప్రస్తావిస్తూ, సంస్కృత పదమైన వాణిజ్య లేదా బాణిజ్య-కర, అంటూ వర్తకుడు లోంచి తీసుకోబడిందిగా నిర్ధారించాడు. తన వాదనని నిరూపించడానికి మేఘస్తనిస్ 'ఇండికా' (క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం) ఆధారంగా చూపెట్టారు. దానిప్రకారం ప్రత్యేక సాంఘిక తరగతికి చెందిన బంజారాలు భారతీయ మూలాలు గలవారే. ఆ తరువాత విలియమ్ క్రూక్ జరిపిన పరిశోధనలు ఇలియట్ వాదనను సమర్థించాయి. అయితే పూర్వం బంజారాలే నేటి లంబాడాలని నిరూపించే ఖచ్చితమైన ఆధారాలు మనకి ఏవి లేవు. దీనిని ప్రమాణంగా పరిగణించి, అన్ని బిడారు వర్తకదారులకు వర్తింపచేసి, ఇలియట్ రూపొందించిన 'సప్లిమెంట్ టు ద గ్లాసరి ఆఫ్ ఇండియన్ టరమ్స్'లో చేర్చబడింది.

హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన లంబాడాలు ఉత్తర-పశ్చిమ భారత దేశానికి చెందినవారు. దక్షిణం వైపు వచ్చిన లంబాడాలపై మొదలుగా ప్రస్తావన పెరిస్టా రాసిన 'ఏ హిస్టరీ ఆఫ్ ద రైజ్ ఎండ్ ప్రోగస్ ఆఫ్ ద మహమడన్ ఫైయిత్ ఇన్ ద కంట్రీ ఆఫ్ హింద్' లో వుంది. 1417 సంవత్సరంలో ఫిరోజ్ షా బహమనీ సోదరుడు ఖానాఖానన్ డక్కన్ రాజధాని గుల్బర్గా పై దండయాత్ర చేసినప్పుడు బిడారు వర్తకులకి చెందిన వందలాది ఎద్దులను తరలించుకు పోయాడు. అయితే క్రూక్ అంచనా ప్రకారం బంజారాల ప్రస్తావన 1504 సం. లో మహ్మదీయుల చరిత్రలో సికందర్ దోల్పూర్పై దండయాత్ర సమయంలో కనిపించింది. 1630 సంవత్సరంలో షాజహాన్ వజీర్ ఆసిఫ్ ఝాతో చరన్ బంజారాలు, భంగి, జంగి నాయక్ నాయకత్వంలో, రాథోడ్ వర్గం. 1,80,000 ఎద్దులతో, భగవాన్ దాస్ నాయక్ కి సంబంధించిన వడత్యా వర్గం 52000 ఎద్దులతో దక్షిణ భారతదేశంకు వచ్చారు” (తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు - వ్యాస సంకలనం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 2015, -185).

6. తండా నిర్వహణ - బిడారు వర్తకం:

తండా ఏర్పాటు, బిడారు వర్తకంలో అతిముఖ్యమైనది. లంబాడాలు వివిధ తండాలుగా, వారి వారి రవాణా, వర్తక వ్యవహారాలని బట్టి, విభజింప బడ్డారు. ప్రతి తండాకి ఒక్క ప్రాంతం, ఒక్క వస్తువు మీద గుత్తాధిపత్యం వుండేది. సాంఘిక, నైతికంగా ఒకే విలువలగల బిడారు వర్తకుల సమూహంగా తండా ఏర్పడింది. తండా, ఒక వర్తక సమూహం, దాని నాయకుడు, ఆ సమూహం చేసే వర్తక, రవాణాలకి మధ్యవర్తి. అసలు తండా, అంటే శిబిరం, దాంట్లో ఎక్కువ సంఖ్యలో జనం, కొన్ని ఎద్దులు వుంటాయి.కొన్నిసార్లు 'తండా' ని 'బంజార' మాటలని సమానర్థంలో వాడారు.

నాయిక్ ఆధిపత్యం వల్ల అతని ప్రమేయం లేకుండా, తెలవకుండా ఏదీ జరిగేదికాదు. వేరే తెగలోని వారిని పెళ్ళిచేసుకొనడానికి కూడా నాయిక్ అనుమతి తప్పనిసరి. అతనే తండాకి నిర్వాహకుడు, న్యాయాధిపతి, వివాదాల పరిష్కారంలో అతని మాటే ముఖ్యమైనది. సాధారణంగా తండా పంచాయితీకి వచ్చే సమస్యలు ముఖ్యంగా వివాహానికి సంబంధించినవి, లైంగిక పరమైన విషయాలకి సంబంధించినవే వుంటాయి. బిడారు వర్తకం మొదటి రోజుల్లో సంకర లైంగిక సంబంధాలు సాధారణం కావడం, అవి క్రమంగా హింసకి దారితీసేవి. మొదట్లో లంబాడాల వివాహ విషయంలో నియమ నిబంధనలు ఉండేవి కాదు.

లంబాడాలు ఆహారధాన్యాలు, ఉప్పు వర్తకాన్ని వస్తు మార్పిడి పద్ధతిలో చేసేవారు. వీరు ఉప్పు, బియ్యం, చేతిపని వారి వస్తువులు, పట్టు, నూనె గింజలు, ఎండు కొబ్బరి, బెల్లం, పోగాకు, ఉప్పు చేపలు, ఓపియమ్, తమలపాకులు మద్రాసు రాష్ట్రంనుండి హైద్రాబాద్ ప్రాంతంలోకి తీసుకెళ్ళి కాటన్, ఆహారధాన్యాలైన గోధుమ, రాగి, జొన్నలు, పప్పులు, ఇతర తృణ ధాన్యాలు చింతపండు, ఇనుము మొదలైన వాటితో మార్పిడి చేసేవారు. లంబాడాలు తమ మార్పిడికి తీసుకున్న వస్తువులని, ఆహారధాన్యాలని లాభదాయకమైన ధరలకి గ్రామీణ ప్రాంతాలలో విక్రయించేవారు. వీరి సమూహాలు గ్రామాల మధ్య నుండి సాగిపోయిన్నప్పుడు ప్రజలు ఉప్పు, ఆహారధాన్యాలు, ఇతర వస్తువులు కొనుక్కునే వారు. మిగిలిన వస్తువులు ఏమైనా వుంటే వాటిని వారాంతపు సంతలలో, అమ్ముకునేవారు. 

"ద మ్యానువల్ ఆఫ్ ది డిస్ట్రిక్ ఆఫ్ విశాఖపట్నం'లో వారంలో జరిగే సంతలలో బంజారులు అమ్మకాలు జరిపేవారని పేర్కొన్నారు. హైద్రాబాద్ రాష్ట్రంలో కూడా యిదే విధమైన సంతలు జరిగేవి. తెలంగాణాలో 250 వారం సంతలు, 700 సంతలు మరాట్వాడా ప్రాంతంలో జరిగేవి. రాష్ట్రంలో 2,437 మేళాలు, జాతరలు, ఉత్సవాలు జరిగేవి. వీటిల్లో పెద్ద మొత్తంలో వర్తకం జరిగేది. లంబాడాలు అన్ని బజారులని వస్తువు మార్పిడిలకి వుపయోగించేవారు". (భంగ్య, భూక్యా, నిజాం పాలనలో లంబాడీలు, హైదరాబాద్, 2012.)

7. రవాణా వ్యవస్థ:

రైల్వే లైన్ ద్వారా హైదరాబాద్ గ్రామాలకు ప్రధానంగా దిగుమతి అయ్యే వస్తువు ఉప్పు. అప్పటిదాక ఉప్పు మీద లంబాడాలదే గుత్తాధిపత్యం వుండేది. హైద్రాబాద్ GIP రైల్వేలతో కలిపాకా బొంబాయి నుండి అధికశాతం ఉప్పు దిగుమతి అయితే, మచిలీపట్నం నుండి అతి తక్కువ ఉప్పు దిగుమతి అయ్యేది. నిజానికి మద్రాసు, నిజాం ప్రభుత్వాల మధ్య, ఉప్పు దిగుమతి విషయంలో వివాదాలు వుండేవి. ఆ తరువాత నిజాం ప్రభుత్వం బొంబాయి నుండీ ఉప్పు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. మద్రాసు ప్రభుత్వం రాతి ఉప్పు తయారీని నిషేధించి, తద్వారా గుత్తాధిపత్యం సాధించింది. 1874 లో నిజాం ప్రభుత్వం నుండి బ్రిటిషు ప్రాంతాలకి రాతి ఉప్పు ఎగుమతిని నిషేధిస్తూ ఉత్తర్వు జారీచేశారు. నిజాం ప్రభుత్వం ఆ ఎగుమతిని నిషేధించినా, మద్రాసు సరిహద్దు ప్రాంతాల నుండి ఎగుమతి అయ్యేది. ఇది వివాదంగా మారి, మద్రాసు ప్రభుత్వం, నిజాంప్రాంతం నుండి రాతి ఉప్పును పూర్తి స్థాయిలో నిషేధించింది. యిది 1802 లోని ఒప్పందానికి పూర్తిగా వ్యతిరేకం, 1802 ఒప్పందం ప్రకారం రెండు ప్రాంతాల మధ్య వస్తువుల స్వేచ్ఛా రవాణా వుండేది.

రోడ్లు, రైల్వేల నిర్మాణం మార్కెట్లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో, రైల్వేలైన్లు, దానికి అనుబంధంగా నిర్మింపబడిన రోడ్లు వలన, కోమట్లు వివిధ వస్తువులని చిన్న చిన్న పట్టణాలకి, పెద్ద గ్రామాలకి తీసుకువెళ్ళి చిల్లర ధరలకి అమ్మేవారు. తిరిగి ఆ జిల్లాలోని ఉత్పత్తుల పట్టణాలకి తీసుకు పోయేవారు.

20వ శతాబ్దపు తొలినాళ్ళకే చాలా పట్టణాలకు వ్యాపారస్తులకి అనుగుణంగా రహదారులు కలిపి వున్నాయి. మొదట్లో వ్యాపారులు చిన్న చిన్న పట్టణాలలో, పెద్ద గ్రామాలలో స్థిరపడి, క్రమంగా ఆదివాసులున్న అడవి ప్రాంతాలకి విస్తరించారు. అదిలాబాద్ లాంటి ఆదివాసులు ఎక్కువగా గల ప్రాంతాలకి వీరి వ్యాపారం విస్తరించింది. కాజీపేట-బలార్షా రైల్వేలైను, అడవి ప్రాంతాలలో సైతం మార్పుని తీసుకువచ్చింది. సమాచార వ్యవస్థ పెరగడం వలన అన్ని వైపుల నుండి వ్యాపారులు ఈ ప్రాంతాలకి చేరారు. మొదట్లో లక్సెట్టిపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజుర నిర్మల్, బేల, మాహురు లాంటి చిన్న నగరాలలో అదిలాబాద్ లంటి పట్టణాలలో స్థిరపడి, మిగతా ప్రాంతాన్ని ఎద్దుల బండ్ల మీద తిరిగేవారు.

రోడ్లు, రైల్వేల నిర్మాణం మార్కెట్లో ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో, రైల్వేలైన్లు, దానికి అనుబంధంగా నిర్మింపబడిన రోడ్లు వలన, కోమట్లు వివిధ వస్తువులని చిన్న చిన్న పట్టణాలకి, పెద్ద గ్రామాలకి తీసుకువెళ్ళి చిల్లర ధరలకి అమ్మేవారు. తిరిగి ఆ జిల్లాలోని ఉత్పత్తుల పట్టణాలకి తీసుకుపోయేవారు.

వ్యాపారులు దారుణంగా వెనక బడిన రైతుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించేవారు. రుణాలకి డబ్బులు యివ్వడం వడ్డీవ్యాపారులకి, రైతులకి నిరంతర సంబంధం ఏర్పర్చేది. తక్కువ ధరలకి వ్యవసాయ ఉత్పత్తులని తీసుకుని, బ్రిటిషు ప్రాంతంకి పంపేవారు. ఈ విషయం నాల్గో అధ్యాయంలో తెలుసుకుందాం. వ్యాపారవర్గాలే కాక, రైతు కులాలు ఈ వడ్డీ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. కొత్త భూమి శిస్తు విధానం భూముల వ్యవసాయం చేయని వారి చేతుల్లో కేంద్రీకృతమవ్వడానికి, అణగారిన రైతులు దోపిడీకి గురికావడానికి కారణం కావడమే కాకుండా, సరికొత్త వ్యాపార వర్గాల ఆవిర్భావానికి కూడ కారణమైంది. వస్తువులని సాధారణంగా దగ్గర్లో వున్న రైల్వేస్టేషన్కి తీసుకు వెళ్ళడానికి బళ్ళని, ఎద్దులని వుపయోగించేవారు.

'ది సెటిల్మెంట్ రిపోర్టు ఆఫ్ ది వరంగల్ తాలుకా' ప్రకారం వరంగల్, దాని చుట్టుపక్కల వున్న గ్రామాల వ్యవసాయ ఉత్పత్తులని ధనిక రైతులు, వ్యాపారవేత్తలు మార్కెట్కు తీసుకు వచ్చేవారు. అనాదిగా వర్తకంలో వున్న లింగాయతులు,బనియాలు ధాన్యపు మార్కెట్ నే కాక ఉత్సవాలని, జాతర్లని భారీ వ్యాపార కేంద్రాలుగా మార్చివేశారు. లంబాడాలని ప్రాంతీయ మార్కెట్లకి ధాన్యాలని సరఫరా చేయడానికి ధనిక వ్యాపారులు వుపయోగించుకున్నారు. కాని క్రమంగా వీరు ఈ ఉపాధి - పోగొట్టుకున్నారు. ఎద్దులబళ్ళ స్థానంలో మోటర్ వాహనాలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ఈ రకంగా ప్రధాన వాణిజ్య వర్గాలు భారీ స్థాయిలో వ్యాపార వ్యవహారాలు నడపడమే కాక, వ్యవసాయ ఉత్పత్తులని, ఉప్పుని లంబాడాల ఎద్దుబళ్ళ నుండి వేగంగా సాగే రైల్వే లైన్లకి తరిలించి వేశారు. రాష్ట్రంలో దిగుమతులలో స్థిరమైన స్థాయిలో అభివృద్ధి వుండేది. ఎగుమతుల విలువే దిగుమతుల విలువ కన్నా ఎక్కువ ఉండేది. ఈ విలువలని గమనిస్తే ఏ విధంగా రైల్వేలు కొత్త మార్కెట్ విధానాలు వలసవాదులకి, రాష్ట్ర వనరులు, సంగ్రహించడానికి సాయం చేశాయో తెలుస్తుంది. హైద్రాబాద్ ఎగుమతులలో 50 శాతం కాటన్ ఎగుమతులే.

నూనె గింజలు, ఆముదం, వేరుశెనగలు, నువ్వులు, కూడా ఎగుమతులలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా HGV రైల్వే ఆవిర్భావంతో తెలంగాణా జిల్లాల్లో అముదం ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. 1910-12 లో సగటు ఎగుమతులు 326 లక్షలు అయితే 1906-10 మధ్య ఈ ఎగుమతుల విలువ 179 లక్షలే. అదే విధంగా ధాన్యం ఎగుమతులు, బ్రిటిషు భారతదేశంలో అధిక ధరలు వుండడం వల్ల, ఎగుమతులు పెరిగాయి.

8. ముగింపు:

19వ శతాబ్దం ప్రారంభానికి గిరిజనులు సహజ వర్తక వ్యాపారాలు వదిలేసి పట్టణాలలో వలసలు ప్రారంభించారు. ఈ క్రమంలో వారి సంస్కృతి సాంప్రదాయాలు వస్తూ మారక పద్ధతి పూర్తిగా కనుమరుగవుతూ స్థానా చలనం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రపంచీకరణ ప్రభావంతో పాటు తర్వాతి కాలంలో వచ్చిన అనేక నూతన గిరిజన చట్టాలు అడుగుల పై ఆంక్షలు విధిస్తూ గిరిజనులను వలసలకు గురి చేశారు ఈ క్రమంలో గిరిజనులు పునరావాసం పొందడం జరగక ప్రభుత్వాలు వారిని విస్మరించాయి. ముఖ్యంగా నిజాం కాలంలో వీరి పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ఎందుకనగా అక్షర జ్ఞానం లేని వీరు కేవలం గిటారులుగా వివిధ ప్రాంతాలలో తిరుగుతూ వ్యాపారాలు చేయడం తప్ప వేరే ఆధునిక జీవిత నేపథ్యం లేకుండా పోయింది. నిజాం రాజ్యం వీరిని పూర్తిగా అణిచివేసి కూలీలుగా రైతు కూలీలుగా బానిస చేయడం జరిగింది. మొత్తంగా హైదరాబాద్ సంస్థాన ప్రభుత్వం తీసుకొచ్చిన వలసవాద రాజకీయవాదం లంబాడీలకు ప్రాధాన్యం లేని వర్గంగా మార్చింది.

  1. తరువాత కాలంలో వీరి సంస్కృతిపై హిందూ, సిక్కు, ముస్లిము మతాల ప్రభావం కూడా ఎక్కువే. ఇది పంతొమ్మిదో శతాబ్దంలో, సంచార జీవితం వదిలి స్థిర జీవితం ఏర్పర్చుకొన్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. 
  2. ఆ తరువాత కాలంలో సంస్కర్తలు, సంస్కృతిని కాపాడే ప్రయత్నంతో పాటు, వలస వ్యవస్థ వలన కలిగిన పరిస్థితులని ఎదుర్కొనే ప్రయత్నంచేశారు. దీంతో ఇరవై శతాబ్దంలో వాళ్ళలో విద్యావంతులైన లంబాడీ నాయకులు ఆర్థికంగా, రాజకీయంగా, సంస్కృతిపరంగా మార్పు కోసం కృషి చేశారు. 
  3. వారి ఆశయంలో లంబాడాలు హిందూ సమాజంలో కలసి ఉన్నత స్థాయికి క్షత్రియులైన రాజపుట్ల మాదిరిగా ఎదగాలని, సంకల్పించారు. వలస రాజ్యం చేసిన జాతుల, రాజకీయ గణాంకాల వలన కూడా లంబాడాల ఆశయ సాధనకి ప్రోత్సాహం లభించింది. 
  4. ఈ విధంగా వలసపాలన అనంతరం తమ ఉనికిని చాటుకుని, సాంఘికంగా, రాజకీయంగా అస్తిత్వాన్ని నిలుపుకున్నారు.

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అరుణ్ కుమార్, మైపతి, ఆదివాసి జీవన విధ్వంసం, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, వరంగల్, 2016
  2. ఆంధ్ర సారస్వత పరిషత్తు , తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు వ్యాస సంకలనం, 2015.
  3. గోనా నాయక్. భారతదేశంలోబంజారాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005.
  4. చీనియ నాయక్. బంజారా చరిత్ర సంస్కృతి- ప్రగతి అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ 1998.
  5. జగన్నాధం, పేర్వారం. ఆధునిక సమాజంలో గిరిజన భాషా సంస్కృతి, ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం, 2012.
  6. బంజారా సమాచార పత్రిక, మార్చి-ఏప్రిల్, హైదరాబాద్, 2007.
  7. భంగ్య, భూక్యా, నిజాం పాలనలో లంబాడీలు,హైదరాబాద్, 2012.
  8. భాషా, పరిభాషా సాహిత్యం, సంస్కృతి వీక్షణం, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1910.
  9. రామాచార్యులు, బిరుదురాజు. తెలుగు కావ్యాల్లో గిరిజనుల సంస్కృతి,2001.
  10. వేణుగోపాల్, విట్ట. ప్రాచీనాంధ్ర సాహిత్యంలోగిరిజన జీవనచిత్రణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008.
  11. శైలమ్మ, జీ, తెలుగు కథ సాహిత్యం - గిరిజన జీవితం, ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2011.
  12. సూర్యనారాయణ, భారతదేశం గిరిజన సముదాయం, 1983.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]