headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. సృజనాత్మక సాహిత్యప్రక్రియలు: “కాకతీయ” ప్రస్తావనలు

డా. ఎన్. సూర్యకాంతి

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
అరోరా డిగ్రీ & పీ.జీ కళాశాల.
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9666643471, Email: suryakanthi161@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగుసాహిత్యప్రక్రియల్లో సృజనాత్మకతకు విశేషమైన గుర్తింపు ఉంది. తెలంగాణలో సంప్రదాయకవిత్వం నుండి ఆధునిక సాహిత్యప్రక్రియలవరకు ఎంతో ఆదరణ ఉంది. కావ్యానాటకాలు ఒకవైపుంటే, గేయాలు, కథలు, నవలలు మరోవైపు చక్కని ప్రాంతీయ, చారిత్రకప్రస్తావనలతో అలరారుతున్నాయి. తెలంగాణలో వెలువడిన కథలు, నవలలు, కావ్యాలను పరిశీలించి వాటిలో ప్రస్తావితాలైన కాకతీయ సామ్రాజ్యాంశాలను సోదాహరణంగా ఈ వ్యాసం చర్చిస్తుంది. సాహిత్యచరిత్రలు, విమర్శగ్రంథాలు, మూలరచనలు ఈ వ్యాసరచనకు విషయసామగ్రి. వివరణాత్మకపద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. అందుబాటులో ఉన్న కొన్ని రచనల వివరణకే ఈ వ్యాసం పరిమితమై ఉంది.

Keywords: కావ్యాలు, నవలలు, కథ, గేయాలు, నాటకాలు, ఆనందధార.

1. ఉపోద్ఘాతం:

తెలుగులో లిఖిత సాహిత్యం సుమారు 11వ శతాబ్దినుండి కనిపిస్తుంది. అది నన్నయ ఆంధ్రమహాభార రెండున్నర పర్వాలతో ఒక వ్యవస్థీకృత రూపం పొందింది. నన్నయ రాసినట్లు చెప్పే ఆంధ్రశబ్దచింతామణిలో 'విశ్వశ్రేయఃకావ్యమ్' అని చెప్పినా, ఆంధ్రమహాభారతంలో బ్రాహ్మణ ఆధిక్యతను, వైష్ణవమతతత్త్వాన్ని ప్రచారం చేశారు.  తిక్కన హరిహరాద్వైతాన్ని ప్రతిపాదిత రూ ఎఱ్ఱన మ్మలా వైష్ణవాన్నే తన రచన వర్జించాడు శ్రీనాథుడు భక్తినే ప్రధానం చేసుకున్నా సాహిత్య విలువలతో కూడి, అది శైవానికే ప్రాధాన్యాన్నిచిం బంందించు అదేకాలానికి చెందిన పోతన భాగవతంలో వైష్ణవం పునః ప్రాణ ప్రతిష్ఠపొందింది. కేతన, దండి తదితరులు బంకావ్యాలు రాసినా, ప్రబంధయుగంలో పెద్దన, శ్రీకృష్ణదేవరాయలు తదితర ప్రబంధకవులు తమ వర్ణనా సామర్దాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. దక్షిణాంధ్రయుగంలో విలాసకావ్యాలు, యక్షగానాలు తదితర దేశీయప్రక్రియలకు ప్రాధాన్యం లభించింది. తర్వాత ఆధునిక సాహిత్య యుగంలో పాశ్చాత్య ప్రభావం వల్ల కట్టమంచి రామలింగారెడ్డి సాహిత్య విమర్శతో తెలుగు సాహిత్యం పునర్మూల్యాంకనం చేయడం ప్రారంభమైంది. ఈ పరిణామంలోనే భావకవిత్వం, అభ్యుదయ, విప్లవ, దిగంబర కవిత్వాలు తెలుగు సాహిత్యాన్ని కొత్త మలుపులు తిప్పాయి. ఆ ధోరణుల తర్వాత వచ్చిన స్త్రీవాదం, దళిత, మైనారిటీ వాదాలు తెలుగు సాహిత్యానికి కొత్త విలువల్ని పరిచయం చేశాయి. కేవలం సమకాలీన సాహిత్యాన్నే కాకుండా, ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసే పద్ధతికి పునర్మూల్యాంకన దృక్పథాన్నిచ్చాయి.

తెలుగు సాహిత్యంలో ప్రధాన సృజనాత్మక సాహిత్యప్రక్రియలైన కావ్యం ఖండకావ్యం, నవల, కథ, జానపద కవిత్యం మొదలైన వాటిలో కాకతీయుల చిత్రణం పరిశీలించడం.

2. పరిశోధనాంశ ఆవశ్యకం:

తెలంగాణ నేటి రాజులలో కాకాతీయులు ప్రధానులు. కాకతీయవంశం వరకూ అప్రతహాసంగా ఆంధ్ర, తెలంగాణ ప్ర్రాంతాలను పరిశీలించి చిరస్థాయిగా నిలిచిపోయింది. మెదటి బేతరాజు మెదలగు చిట్టచివరి ప్రతాపరుద్రుని దారకా వచ్చిన రాజపరమపరలో రుద్రమదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి ప్రతాపరుద్రుడు ప్రధానులు. వీరి గురించి తేలుగు సాహిత్యంలో ఎందరో కవులు వీరి శౌర్యసాహసాల గురించి పరిపాలల రీతి గురించి ఎందరో కవులు, సృజనాత్మకస్థితి పురాతన ల చేత కథలు, నవలలు, నాటకాలు, ఖండకావ్యాలు రచించారు. తటాకాలు నిర్మించి దేశ మును చేసిన ఆనాటి వారి దూరదృష్ఠి నేటి తెలంగాణ ప్రభుత్వమునకు మిషన్ భగీరథకు  ఆదర్శప్రాయంగా నిలిచింది. రామప్పగుడి, వేయిస్తంభాల గుడి మెదలగు వాటి చేత ఆనాటివారు కళాసౌందర్య పిపాసులని తెలుస్తుంది.

1. సురవరం ప్రతాపరెడ్డి, మధునపంతులు, మరమండల రామరావు, పి.వి పరబ్రహ్మశాస్త్రి మెదలగు విద్వాంసులు కాకతీయుల గురించి అమృతాంశాలను వెలుగు లోకి తెచ్చారు.
2. నల్గోండ జిల్లా సందుపాట్ల అనే గ్రామంలో రుద్రమదేవి చనిపోయిన తేది నిర్మించిన శాసనం లభించింది. 

3. సృజనాత్మక సాహిత్యప్రక్రియలు: “కాకతీయ” ప్రస్తావనలు:

కాకతీయులకు సంబంధించిన చారిత్రాత్మక అంశాలు సృజనాత్మక ప్రక్రియలలో ఏతీరుగా పోందుపరిచారో పరిశిలించి తులనాత్మకంగా పరిశీలించడం ఈ పరిశోధన ముఖ్యలక్ష్యం.

3.1 కావ్యాలు:

కాకతీయుల రాజులను ప్రధానంగా చేసుకుని రాసిన కావ్యాలు ఇతర సాహిత్యాత్మక అంశాలను కలుపుకుని రాసిన వాటిలో వచ్చిన కాకతీయుల చిత్రణలు, ఖండకాల రూపంలో వచ్చిల కాకతీయుల అధ్యాయంలో చర్చించబడింది.

1. ప్రతాపరుద్రదేవి కావ్యం – కల్వకూరి నారయణరావు
2. ఓరుగల్లు – శేషాద్రి రమణకవులు
3. ఓరుగల్లు కోట – శ్రీనివాస సోదరులు
4. కాకతీయ తోరణం – ఇంద్రగంటి హనుమన్ శాస్రి
5. రుద్రమదేవి – ఏటుకూరి వేంకటనరసయ్య
6. ఆంధ్రపురాణంలో రుద్రమదేవి ఖండం -  మధునాపంతులు

3.2 నవలలు:

కాకతీయుల వైభవాన్ని తెలియజేస్తూ చక్కటి నవలలు వెలువడ్డాయి. చరితాత్మక ప్రమాణాలను పాటిస్తూ సత్యనిష్ఠకు విగాథం కలిగించకుండా వెలుగుతీసి నవలలు రాసినవాళ్ళు ఉన్నారు.

1. రుద్రమదేవి – బద్దిరాజు సోదరుడు
2. రుద్రమదేవి- నోరి నరసింహశాస్త్రి
3. ఆనందధార - ఓగేటి ఇందిరాదేవి
4. మాలిక్ కాఫర్ – ప్రోఫేసర్ ముదిగొండ శివప్రసాద్
5. అనుభవ మండపం - ప్రోఫేసర్ ముదిగొండ శివప్రసాద్
6. నాగానిక - ప్రోఫేసర్ ముదిగొండ శివప్రసాద్
7. అడవి బావిరాజు – గోన గన్నారేడ్డి

ఇంకా మరికొన్ని లభించగలవు.

1. రుద్రమదేవిని బంధించి తీసుకురావడం దాంతో కాకాతీయుల రాజ్యపతనం, దాని పర్యవసనం చిత్రీకరించడమైంది.
2. భవేశ్వరుడు కాకతీయుల కాలంలో చేసిన వీరశైవమతం చిత్రీకరించిన నవల,
3. కాకతీయుల శిల్పకళా వైభవం చిత్రీకరించిన నవల

ఇంకా మరికొన్ని పరిశోధనల ద్వారా లభించగలవు.

3.3 కథ:

తెలంగాణ తోలి తరం కథలలోనేటి గురజాడఅప్పారావు సమకాలికుడైన మాడపాటి హనుమంతరావు -హృదయశీలం అనే కథలో రుద్రమదేవి పురుషవేశంలో తలించిన రుద్రమదేవి వలన అనుకోకుండా రుద్రమదేవితో కలతలు రేగి నిజం తెలిసి సంతోషపడడం ఇతి వృత్తం. 1911 లో ఈ కథ వచ్చింది.

గురజాడ దిద్దుబాటు వచ్చిన కాలంలోనే తెలంగాణలో మాడపాటి హనుమంతరావు ఈ కథ రాయడం విశేషం. కాకతీయుల గురించి ఎంతోమంది కథలు రాసిన ఆధారాలు ఉన్నాయి.

3.4 గేయాలు:

గేయ సాహిత్యంలో తెలుగువారి పౌరుషానికి ప్రతీకగా కాకతీయులను ప్రస్తావిస్తూ పాడడం కనిపిస్తుంది. శంకరంబాడి మా తెలుగు తల్లికి మల్లేపూదండలో రుద్రమభుజశక్తి మల్లమ్మపతిభక్తి అని కీర్తించారు.
శ్రీశ్రీ కాకతీయులు - అద్దే శ్రీ నారాయణరెడ్డి.

4. కావ్యాలలో కాకతీయప్రస్తావనలు:

1. ప్రతాపరుద్ర కళ్యాణం – రామకోటి శాస్త్రి
2. ఆంధ్రపురాణం – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి

తెలుగు సాహిత్యంలో రుద్రమదేవి పేరుతో కాళ్ళకూరి నారాయణరావు ప్రతాపరుద్రమదేవి కావ్యం, మధునాపంతుల ఆంధ్రపురాణంలోని రుద్రమదేవి ఖండం, ఏటుకూరి వెంకటనరసయ్య రద్రమదేవి కావ్యం. శేషాద్రి రమణకవులు ఓరుగల్లు కోటకావ్యం, వేటూరి వాసుదేవశాస్త్రి ఓరుగల్లు సామ్రాజ్యం నవల, ఓగేటి ఇందిరాదేవి ఆనందధార నవల మొదలైనవన్నీ కలుపుకుని సిద్దాంతగ్రంథం రాయవచ్చు. చాలదనుకుంటే తెలుగు సాహిత్యంలో కాకతీయతేజం అని అందరిని కలుపుకొని నవల కథ, కావ్యం, ఖండకావ్యం మొదలైన అన్ని సృజనాత్మక ప్రక్రియలలో వెలువడిన కాకతీయ సాహిత్యాన్ని సమీక్షించవచ్చు.

ఇది కాకతీయ తరంగిణి కాదు. మధుర కవితా తరింగిణి కాకతీయ కల్లోలిని కాకతీయ శైవాలిని అని కాకుండా ఈ పేరు పెట్టడంలో కవిగారు వ్యంగం పాటించారు. తరంగం అంటే దరిజేరునది అని అర్థం. రసహృదయుడైన పాఠకుని దరిజేరునది అని అంతరార్థం కాగా పాఠకునికు బ్రహ్మానంద సహోదర రససామ్రాజ్యం సమీకంలోనికి తెచ్చేదని పిండితార్థం. .... ఈ కావ్యంలో కవి ఒక క్రొంగ్రొత్త ప్రయోగం చేశారు. ఇది తెలుగు సాహిత్య లోకంలో మున్ను విన్నది కాదు. కన్నది కూడా కాదు. భీమచోడుడు తమ్ముడైన గోకర్ణుని సంహరిచాడు. అదుపు నాఙ్ఞయు తప్పిన మదుపు టేన్గు వలె ప్రజలను పీడించాడు. అది విని కాకతీ రుద్రమదేవుడు స్వయంగా అతని పై దండెత్తాడు. భీముడు రుద్రపరోక్షంలో ఎన్నివాగినా, కాకతీయ బలాలను చూచి ఆర్తి చెందాడు. భయంతో తల్లడిల్లాడు. (మొవ్వ వృషాద్రిపతి, కాకతీయతరంగిణి ముందుమాట, పుటలు: 2-4)

కాకతీంద్రుఁడు ఘోర ఖడ్గాంచలంబునఁ
దనయుత్తమాంగమ్ముఁ దరిగినట్లు
గళనాళముంబట్టి కంఠదఘ్నంబుగాఁ
.................................
కాకగృధ్రంబులు కండలింతింతగాఁ
జించి యాపోవ భక్షించినట్లు
పుండ్రేక్షుఖండంబుఁబోలెఁ గోలెమ్ముకఁ
కన్నులంగట్టి నట్లైనఁగంపమడర
దెమిలిచి శునకమ్ము నమలినట్లు
ముచ్చేమట గ్రమ్మి నిలువున ముంచియెత్త
గజగజవడంకి తడబడి కాళ్ళు పెనఁగ
భీమచోడుని నాలుక పిడుచగట్టె."

ఈ పద్యంతో అమితభీతితో ప్రాణాలచేత పట్టుకొని పారిపోయే నీచుని రూపాన్ని వర్ణించారు కవి."

5. ఆనందధార (నవల)లో కాకతీయ ప్రస్తావనలు:

ఇది చారిత్రక నవల. కాకతీయ రుద్రమదేవి ప్రధానపాత్రగా కథ నడిచింది. తండ్రి గణపతి దేవుడు, రుద్రమను మగబిడ్డగా పెంచాడు. అన్ని విద్యలను నేర్చుకొన్నారు. గణపతి మరణించిన పిమ్మట ఆమె మహారాణి అయినారు. కాని పెళ్ళాడిన మగడు ఆమె ఆధిక్యాన్ని సహించలేకపోయాడు. ఆమె జీవతంలో ప్రశాంతత చాల తక్కువ. పెళ్ళికి ముందు అమాయంగా దౌర్బల్యం ప్రదర్శించినా దేశం కోసం తాను తన మనసు మార్చుకొనవలసి వచ్చింది. అడుగడుగునా, విపత్తులే. సామ్రాజ్య రక్షణకు శౌర్య ప్రదర్శనం, గర్భిణిగా స్త్రీత్వభావ ప్రకటనం, ఇష్టసఖి వకుళయందు గాడాభిమానం. హృదయానికి హత్తకొనే విధంగా వర్ణింపబడినాయి. వకుళ, రామప్పలు, తప్పిదం తెలిసికొన్న భర్త వీరభద్రుడు-రుద్రమదేవి రక్షించి, త్యాగధనులయినారు.

12వ శతాబ్దంలో ఆంధ్రదేశాన్ని కాకతీయరాజులు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు. పరమత సహనంతో ప్రజలు సుఖసంతోషాలతో వర్దిల్లుతున్నారు. అష్టైశ్వరాలను అనుభవిస్తున్నారు. రుద్రుడు శత్రురాజులను జయించి రాజధానికి తిరిగివచ్చాడు. పట్టణమంతా విజయోత్సవాలు జరిగాయి. రుద్రుని తండ్రి ప్రోలయేశుడు జైనమతావలంబి కాగా రుద్రుడు శైవమతావలంబి కావడం విశేషం.

ప్రోతయాధిపుడు జినదేవుడైన పార్శ్వనాథుని గుడికేగినాడు. సాయంత్రం అయింది. చీకట్లు కమ్ముకోసాగినాయి. తండ్రి ననుసరించి రుద్రుడు కూడా వెళ్ళనాడు. కాని విమతస్థుడైన రుద్రుడు జనదేవు మందిరింలో ప్రవేశించక వెనుక మంటపంలో నిలబడ్డాడు. అది తెలియని ప్రోలయేశుడు చీకటిలో శత్రువు ఉన్నాడని భావించి తన చంద్రహాన్ని విసిరాడు. అది రుద్రుని పాదాలవద్ద పడింది. రుద్రుడు కూడా చీకట్లో తండ్రిని గుర్తించిక శత్రువని తలచి తన ఖడ్గాన్ని విసిరాడు. అది ప్రోలయయక్ష్మాథునికి తగిలింది. అతడు మూర్ఛతో నేలకొరిగాడు. అప్పుడు సమీపించిన రుద్రుడు తండ్రిని గుర్తించి తన అపరాధానికి ఖిన్నుడుయ్యాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చి తండ్రిపై పడ్డాడు. అంతలో అమాత్యశేఖరుడైన బేతన, నామగల్లు దుర్గాధీశుడు నామిరెడ్డి రుద్రుని వెదుకుతూ అక్కడికి వచ్చారు.

మూర్చనుండి తేరుకున్న ప్రోలయాధీశుడు రుద్రుని ఓదార్చి విధిబలీయ శత్రువని చీకటిలో తెలియక నీ పై కత్తి దూసిన నాకు ఇంత చేటు జరిగిందని చెప్పాడు. ఇదిగో రాజముద్రిక, రాజదండం, మకుటం, నా జ్యేష్ఠపుత్తుడు రుద్రని కాకతీయాంధ్ర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయమని అమాత్యశేఖరు బేతనకు చెప్పి తనువు చాలించాడు. తర్వాత రుద్రుడు తండ్రి అంత్యక్రియలు యథావిధిగా జరిపించి, మంత్రి సామంత దండనాథ పురప్రముఖున సమక్షంలో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించాడు.

బ్రహ్మన్న నలకామరాజును పల్నాటికి రాజును చేసి తపస్సుకై అడవి కెళ్ళాడు. దీనితో పల్నాటికి బలమైన నేతలేడని తెలిసిన రుద్రుడు పల్నాటి రాజ్యాన్ని జయించదలచాడు. అపారమైన సైన్యంతో పల్నాడు పై దండెత్తినాడు. ఘోరయుద్ధం జరిగింది. అందులో వెలనాటి గొంక రాజు తలను రుద్రుడు తన ఖడ్గంతో నరికాడు. అది చూచిన అతని కొడుకు పృథ్వీశ్వరుడు పిష్టిపురం వైపు పరుగెత్తాడు. వాని వెంటబడి గుంటూరు, కృష్ణ, గోదావరి మండలాలను ఆక్రమిస్తూ ద్రాక్షరామం చేరాడు. అక్కడ రుద్రుడు తన విజయశాసనాన్ని ప్రతిష్ఠించి మరలి తన రాజధానికి వచ్చాడు. విజయాలకు కారణమైన ప్రతాపంతో వెలిగిన రుద్రుడు చరిత్రలో ప్రతాపరుద్రుడుగా కీర్తిగాంచాడు.

6. మాలిక్ కాఫర్(నవల)లో కాకతీయప్రస్తావనలు:

మాలిక్ కాఫర్ ప్రొ॥ ముదిగొండ శివప్రసాద్ 85వ రచన. ఢిల్లీ నుండి వచ్చి, మన కోహినూరు వజ్రాన్ని, మన వైభవాన్ని కొల్లగట్టిన బానిససేనాని మాలిక్ కాఫర్ పేరు అతని మీదే, కథ అతని చుట్టూ తిరిగినా, ఈ నవల నాయకుడు మాలిక్ కాఫర్ కాదు. ఈ నవలకు ఆత్మ అజరామరమైన హిందు ధర్మం. గంగలా  అనంతంగా, చిరాయువుగా హిందు సంస్కృతి మన దేశంలో సాగుతుంది. గంగానది ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్ని ఆటంకాలు వచ్చిన ఒక జీవనదిగా ఎన్నో నదులను కలుపుకుంటూ యుగయుగాలుగా సాగుతూంది. అలాగే హిందు ధర్మం కూడా మన దేశంలో ఒక జీవనదిగా, జీవన విధానంగా సాగుతోంది. అలెగ్జాండర్, గజిని, ఘోరి, తైమూర్, ఛెంగీజ్  ఖాన్ లు బందిపోటు దొంగలుగా వచ్చారు. మాలిక్ కాఫర్, బాబరు, ఔరంగజేబు ఇక్కడే ఢల్లీలో ఉంటూ మన గుళ్ళూ, గోపురాలు కోల్లగోట్టారు. ఎందుకంటే గుడి ఒక బడి. గుడిలో భక్తి, ముక్తి, రక్తి వస్తాయి. గుడిలో మన సంపద, శిల్పసంపద, సంస్కృతి ఉన్నాయి. గుడిని కొల్లగుడితే మన హిందు ధర్మం కుంటుపడుతుందని ఈ వెర్రివాళ్ళ భ్రమ. అయితే హిందు ధర్మం మన జీవనాడిలో ఉంది. పుణ్య గంగానదిలా అది భారతదేశంలో సాగుతూనే ఉంటుంది.

కథ మొదటి పంక్తి “ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః” ఔను! ఇది ప్రతాప రుద్రమహారాజు కథ ప్రతాపరుద్రు మహారాజుకు రుద్రసంకేతం. నాగయగన్నసేనాని ఆహార్యం చేసుకుంటూ గడ్డం పెట్టుకుంటాడు. అది అలంకార భాషలో ‘గండం’ రాబోయో ప్రమాదానికి సూచన.

ఈ నవల ఇతివృత్తం ఇలా ప్రతీకాత్మకంగా సాగుతుంది – ఒక హిందూ బానిస బలవంతంగా నపుంసకుడిగా మార్చబడి, మతం మార్పిడికి, మతం మార్పిడికి లోనవుతాడు. అతడే మాలిక్ కాఫర్ ఇతడు వేటగాడు. తన మనస్సులోని క్రోధానికి, భీభత్సానికి తనే వేటాడబడ్డాడు. తన హృదయంలో అతడే నరరక్తం మరిగినపులి. తనే మేక, తనే కసాయి. ఏ గుడిలో నుండి బయటకు వెళ్ళొట్టబడ్డాడో అదే గుడిమీద దండయాత్ర చేశాడు. పురుషత్వం కోల్పోయిన మాలిక్ కాఫర్ కు భార్య, బిడ్డలు, సంసారసుఖం లేదు.  మరో పక్క లలిత కళలలకు పుట్టినిల్లు ఓరుగల్లు. ఎంతో వైభవం పొందిన కాకతీయ సామ్రజ్యం పతనమైంది. వారి నిజమైన సంపద కావ్యములు, శిల్పములు, నృత్యములు (దేవదాసి గుళ్లలో నర్తించేవారుట). ఎంత వైభవం కోల్పోయాము. ఈ నవలకు అంగిరసము కరుణ. కరుణ రసమొక్కటే ప్రకృతి రసమని భవభూతి ఉత్తరరామచరితలో ప్రతిపాదించాడు.

7. ముగింపు:

 

  • వివిధ సృజనాత్మక రచనల్లో కాకతీయప్రస్తావనలు ఉన్నాయని నిర్ధారణ అయ్యింది.
  • సంప్రదాయ, ఆధునిక రచనల్లో కాకతీయుల వీరత్వం, సాహిత్యప్రియత్వం వర్ణించబడిన విధానం నిరూపించబడింది. 
  • మత, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు అవగాహనలోకి వచ్చాయి.
  • సృజనాత్మక రచనల్లో ప్రత్యేకంగా చారిత్రక విషయాలను ప్రస్తావించడం నేపథ్యాలను గమనించడమైనది.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆది - సభా - అరణ్య పర్వములు - నన్నయల తెలుగు డిపార్టుమెంట్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం, 1968
  2. కవిత్రయవిరచిత- శ్రీమదాంధ్రమహాభారతం, తిరుమల-తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 2012.
  3. కావ్యప్రకాశః - మమ్మటః - పూనా, 1933
  4. నాగయ్య, జి., 2009, తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటి) తిరుపతి, భవాని నగర్, నవ్య పరిశోధక ప్రచురణలు.
  5. రఘుపతిరావు, అక్కిరాజు, 2000 సాహిత్య వ్యాసములు - గ్రామ్యపద ప్రయోగం, హైదరాబాద్.
  6. రాధాకృష్ణ, మిక్కిలినేని. జానపద కళారూపాలు - హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
  7. రామరాజు, బిరుదురాజు - తెలుగు జానపద గేయ సాహిత్యం.
  8. వేంకటేశ్వర్ రెడ్డి, అన్నపురెడ్డి, 1991 "సంస్కృతి విన్యాసం” (మోనోగ్రామ్) చరిత్ర - హైదరాబాద్ తెలుగు అకాడమీ, హిమాయత్నగర్.
  9. వ్యాకరణమహాభాష్యమ్ - పతంజలి, వారాణసీ, 1942
  10. సుందరం, ఆర్.వి.ఎస్., 2015 : ఆంధ్రుల జానపద విజ్ఞానం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]