AUCHITHYAM | Volume-4 | Issue-13 | November 2023 Special Issue | ISSN: 2583-4797 | UGC-CARE listed
28. ఆత్రేయ సాహిత్యం - మధ్య తరగతి జీవితం
డా. దొంతరాజు లక్ష్మీ నరసమ్మ
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి,
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9493570591, Email: drlakshminarasamma@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో మధ్యతరగతి జీవితాలను ఆవిష్కరించిన విధానాన్ని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. ఎన్.జి.ఓ. నాటకంలో వివిధాంశాలను ఈ వ్యాసరచనకు పరిశీలించాను. ఆత్రేయపరిచయం, కథాసారంశం, వివిధసమస్యలను ప్రస్తావించాను. నాటకరంగం, ఆత్రేయ రచనలపై వచ్చిన వివిధగ్రంథాలు ఈ పరిశోధనకు ఆకరాలు.
Keywords: ఆత్రేయ, నాటకం, ఎన్.జి.ఓ, మధ్యతరగతి జీవితం.
1. ఉపోద్ఘాతం:
మనసు కవి, మనస్సు ఉన్న మన కవి ఆచార్య ఆత్రేయ. ఆత్రేయ అసలు పేరు ‘కిళాంబి వేంకట నరసింహాచార్యులు’. కలం పేరు ఆచార్య. గోత్రం పేరు ఆత్రేయ. ఈ రెంండిని కలిసి ఆచార్య ఆత్రేయ అయ్యారు. 7-5-1921 సం॥లో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరుపేట తాలుకా మంగళంపాడు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సీతమ్మ, శ్రీకృష్ణమాచార్యులు.
ప్రాథమిక విద్య స్వగ్రామంలోను, ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చిత్తూరులోను, ఇంటర్మీడియట్ రాయవెల్లూరులోని ఉరిస్ కళాశాలలోను, టీచర్స్ ట్రైనింగ్ చిత్తూరులోను జరిగింది. 1945లో పద్మావతితో వివాహం జరిగింది.
రచయితే కాకుండా ఈయన స్వాతంత్య్రసమరయోధుడు కూడా. ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళారు. తరువాత కమ్యూనిస్టు పార్టిలో చేరి ప్రచారకర్త కూడా వ్యవహరించారు.
కుటుంబ పోషణ కోసం అనేక ఉద్యోగాలు కూడా చేసారు. నెల్లూరు మున్సిప్‌కోర్టులోను, తిరుత్తణి సేటిల్‌మెంట్ ఆఫీసులో గుమస్తాగా, ‘జమీన్‌రైతు’ పత్రికలో సహాయ సంపాదకుడిగా, ఆంధ్రనాటక కళాపరిషత్తులో వేతన కార్యదర్శిగా పనిచేసారు.
నాటక రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, ప్రయోక్తగా, తెలుగు నాటక రంగ చరిత్ర వికాశ దశలో ఒక నూతన అధ్యాయానికి పునాది వేసినవారు ఆచార్య ఆత్రేయ.
ఆత్రేయ రచనలు : ఆత్రేయ 10 నాటకాలు, 15 నాటికలు రచించారు. గౌతమిబుద్ధ, అశోక సామ్రాట్, పరివర్తన, వాస్తవం, ఈనాడు, ఎన్.జి.ఒ.. విశ్వశాంతి, కప్పలు, భయం, తిరుపతి అనే నాటకాలు రాసారు.
కళకోసం, చస్తే ఏం, ప్రగతి, ఎవరుదొంగ, అంత్యార్పణ, అంతర్యుద్ధం, ఓటు నీకే, ఒక రూపాయి, చావకూడదు, మాయ, వరప్రసాదం, ఆశ్వఘోషుడు, తెరచిన కళ్ళు, కాపలా వాని దీపం అనే నాటికలు రాసారు.
ఆత్రేయ తొలి నాటకాలు ప్రజాదరణ అంతగా పొందలేదు. పరివర్తన నాటకంలో సామాజిక స్పృహను, ప్రజల పక్షాన నిలబడి, వాళ్ళకోసం తన కవితాశక్తిని ధారపోసే కవిగా పేరుతెచ్చుకున్నారు.
ఆత్రేయ కాలం నాటికి దాతల సహాయం లేక క్రమేపి క్షీణించాయి. పద్యనాటకాలలో అరితేరిన నటులకు బదులు కాంట్రాక్టర్ల ఎంపిక చేసిన కిరాయి నటులు రంగ ప్రవేశం చేసే క్షీణస్థితికి పద్య నాటకాలు వచ్చాయి. సామాజిక ఆర్థిక సమస్యను కధావస్తువులుగా తీసుకొని గద్యనాటకాలు వచ్చాయి. పి.వి. రాజమన్నారు, చలం మొదలైన వారు గద్యనాటకాలు రచించారు. కాని చాల వరకు ప్రదర్శనలే నోచుకోలేదు.
ఆత్రేయ నాటక రంగంలోకి అడుగుపేట్టే సమయానికి సాంఘిక సమస్యా నాటకాలు రచనను, ప్రదర్శనను ఒక ఉద్యమంగా స్వీకరించినవి ఆంధ్ర నాటక కళాపరిషత్తు, ప్రజానాట్యమండలి సంస్థలు. ఈ ఉద్యమానికి తన నాటకాల ద్వారా ఊపునిచ్చిన రచయత ఆత్రేయ.
ఆత్రేయను కీర్తి శిఖరాలకు తీసుకువెళ్ళిన నాటకం ఎన్.జి.ఒ. 1947లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీల్లో ఉత్తమ నాటక బహుమతి పొందింది. దీనికే ‘‘అద్దె కొంప’’, ‘‘గుమస్తా’’ అని పేర్లు కూడా ఉన్నాయి.
‘కావ్వేషు నాటకం రమ్యమ్’ అని, ‘నాటకాంతం హి సాహిత్యమ్’ అని నాటకం యొక్క విశిష్టతను గూర్చి సంస్కృత అలంకారికులు తెలియజేశారు. శ్రవ్యదృశ్యకావ్యాలలో దృశ్యకావ్యాలకే సాహితీలోకంలో గౌరవాదరణలు మెండు. ఒక విషయాన్ని చదివి, విని అర్ధం చేసుకోవడం కన్నా చూసి అర్ధం చేసుకోవడం చాలా తేలిక. దృశ్యకావ్యానికి మన మనసుకు హత్తుకుపోయే లక్షణం ఉంది. అందుకే దృశ్యకావ్యాలు ప్రేక్షకుల హృదయాలలో పదికాలాలపాటు సుస్ధిరస్థానాన్ని సంపాదించుకున్నాయి. దీనికి ప్రధాన కారణం దృశ్యకావ్యాలను పండితులే కాక పామరులు కూడా చూచి సులభంగా అర్ధం చేసుకోవడమే.
సాహిత్య ప్రక్రియలలో నాటకం అత్యంత శక్తివంతమైన, విశిష్టమైన సాధనం. ప్రజా హృదయాల్ని సూటిగా స్పందింపజేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. ‘భారతీయ నాటక చరిత్ర’ చాలా ప్రాచీనమైనది. తెలుగు నాటకం మాత్రం ఆధునిక యుగానికి చెందింది. తెలుగు నాటరంగానికి మహోజ్వల చరిత్ర ఉంది. మనుషులు హావభావ విన్యాసాల్ని, సంభాషణల్ని, సంబంధాల్ని కలగలపుతున్న సాహితీ ప్రక్రియ నాటకం. ఎందరో నాటకర్తలు తమ నాటక రచనల ద్వారా తెలుగు నాటక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు.
2. ఎన్.జి.ఒ. నాటకం పరిచయం :
ఏలూరులో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీలలో ‘ఎన్.జి.ఒ.’ (గుమస్తా) నాటకం అద్భుతంగా ప్రదర్శించి, ఉత్తమ ప్రదర్శనకు, రచనకు బహుమతి పొందటంలో ఆత్రేయ పేరు ఆంధ్రదేశమంతట మార్మోగింది. ప్రజా సమస్యలను స్వాభావికంగా ప్రతిబింబించే రచనా విధానం సామాన్య ప్రజల నుండి మేధావి వర్గం వరకు అందరినీ ఆలోచింప చేసింది. వాస్తవిక జీవిత చిత్రణగల కొత్త తరహా నాటకాన్ని చూసి ఎందరో రచయితలు తమ ఆలోచనా రీతిని, రచనా విధానాన్ని మార్చుకొన్నారు. ‘ఎన్.జి.ఒ.’ నాటక ప్రదర్శన రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించింది. ‘‘Atreya School of thought’’ అనే విధంగా ఈనాటకం ఏర్పడిరది.
ఒక మధ్య తరగతి జీవన విధానం ఏవిధంగా ఉంటుందో ‘ఎన్.జి.ఒ.’ నాటకంలో కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. సాంఘిక సమస్య ఇందులోని కథావస్తువు పట్నంలో నివసించే మధ్య తరగతి వారి ఇరుకు జీవితం, మంచి, చెడులు మధ్య జరిగే నిత్య పోరాటం, కృత్రిమత్వాన్ని, విషాదాన్ని, నిస్సహాయత్వాన్ని, చేదునిజాల్ని విశ్లేషణాత్మకంగా చిత్రీకరించిన నాటకం ఇది. ఈ నాటకంలో నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు (1) సొంత ఇల్లు లేక అద్దెకొంప ఉంటే అందులో ఉండే కష్టాలు, (2) అనారోగ్యం, (3) వరకట్నం, (4) ధనిక వర్గంచే మధ్య తరగతి దోపిడి, (5) తీవ్ర దారిద్య్రం, (6) మధ్య తరగతిలో ఉంటే ఫాల్స్ ప్రెస్టేజి. ఈ సమస్యల మీద నాటకం నడుస్తుంది.
3. కథా సారాంశము:
రంగనాధం అనే గుమస్తా చుట్టూ అల్లిన కథ. సొంత ఇల్లు మురికి కాలువ దగ్గర కారుషెడ్డులో తండ్రి, తమ్ముడు, చెల్లి, భార్య, పిల్లలలూ కాపురం ఉంటున్న రంగనాధం. ఆ కుటుంబం మొత్తం మీద అతనొకుడిచే సంపాదన, చాలీ చాలని జీతం. బాధ్యతలు ఎక్కువ. ఏమీ చేయలేని నిసహాయ స్థితి. చివరకు లంచం పుచ్చుకొని జైలుకి వెళ్ళతాడు.
4. ఎన్.జి.ఒ. నాటకంలోని సమస్యలు:
4.1. అద్దె ఇంటి అగచాట్లు :
అది మోటర్ షెడ్. దాన్నే ఇల్లుగా మార్చి నెలకు రు.30/` లకు అద్దెకు తీసుకున్నాడు. ఆ యిల్లు బ్రహ్మణులకు మాత్రమే ఇవ్వబడును. రు.10/-లకు రసీదు ఇస్తారు. మిగిలిన రు.20/-లు బ్లాకు మని ఇంటికి ప్రత్యేక కొళాయి లేదు. యజమానుల బంగళా వెనుక ఉన్న కొళాయినే వాడుకోవాలి. అది కూడా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే ఉపయోగించాలి. బంగళా ముందు ఉన్న తోటలో పిల్లలు ఆడకూడదు. పూలు కోయకూడదు. రాత్రి పదిగంటలకు లైట్లు ఆర్పేస్తారు. గేట్లు వేసేస్తారు. అందుకని 10 లోపే ఇంటికి రావాలి ఇన్ని షరతులతో కూడిన మోటర్ షెడ్‌లోనే రంగనాధం కాపురమున్నాడు. ఇంటి ముందు పెద్ద మురికి కాలువ. దాని నుండి ముక్కులు పగిలిపోయేలా వాసన, అయినా తప్పదు. 1వ తారీకు వచ్చేసరికి కచ్చితంగా అద్దె ఇచ్చేయ్యాలి. లేదంటే ఇంటి యజమాని ఇల్లు కాళీచేయ్యమంటాడు. ఎంతో నీచంగా, హీనంగా చూస్తాడు. మురికి కాలువ మూయించమనీ, కొళాయి పెట్టించమని అడిగినందుకు గోపిని కర్రతో కొట్టించి, అతనిపైన దౌర్జన్యం చేసాడని కేసుపెట్టి గోపిని జైలుకి పంపిస్తాడు.
పట్నంలో ఇల్లులేని ప్రతిసామాన్యుని జీవితం ఈ విధంగానే ఉంటుంది. యజమానులు పేట్టే షరతులకు అడ్డుచెప్పకూడదు. ఇల్లు బాగు చెయ్యరు. నచ్చితే ఉండు లేదంటే ఖాళీ చెయ్యి అంటారు. చాలీచాలని జీతంలో ఎక్కువ అద్దెలు ఇచ్చుకొని మంచి ఇంటికి వెళ్ళలేక, తక్కువ అద్దెతో ఇరుకు ఇంటిలోనే సర్దుకొని ఉండాలి. ఆ విషయాన్నే ఆత్రేయ కళ్ళుకు కట్టినట్లు చూపించారు.
4.2. అనారోగ్యం:
రంగనాధం తండ్రి గుమస్తా చేసి వయస్సు మీద పడటంచే పదవీ విరమణ చేసాడు. అనారోగ్యంతో మంచం పట్టాడు. డాక్టరు వచ్చి చేసేసరికి ఆరుబయట ఉన్నాడు. డాక్టరు వచ్చి ఈ ఇంటి ముందు మురికికాలువ మూయించమని ఎన్నిసార్లు చెప్పాను. ముక్కులు పగిలిపోతున్నాయి. ఈ వాతావరణంలో ఉంటే ఆరోగ్యం బాగుపడదు అని చెప్పాడు. ఇంటి ఇల్లాలికి దగ్గు, క్షయ వ్యాధి, పిల్లలకు అనారోగ్యం.
ఇందంతా ఇంటి చుట్టూ ఉండే వాతావరణం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు. కాని మంచి ప్రదేశానికి వెళ్ళటానికి ఎక్కువ అద్దె కావాలి. అంత అద్దె ఇచ్చుకోలేని మధ్య తరగతి వాళ్లు మురికి కూపాలలో మగ్గుతూ అనారోగ్యపాలపెట్టాన్ని చూపించారు ఆత్రేయ.
4.3. వరకట్నం:
రంగనాధం చెల్లిలి పెళ్ళికోసం కట్నం, లాంఛనాలకు 10 వేలు కావాలి. కాని ఇవ్వలేని స్థితి. తండ్రి కోరిక తీర్చాలి. చెల్లెలు పెళ్ళి చెయ్యాలి. ఇల్లు గడవటమే కష్టమైన పరిస్థితి లంచం తీసుకోవటానికి అవకాశమున్నా నీతి నిజాయతితో పనిచేసిన రంగనాధం వరకట్న భూతానికి బెదిరిపోయి, లొంగిపోయి తన సిద్ధాంతాలన్నీ పెక్కనపెట్టి లంచం తీసుకొన్నాడు. తాను ఎంత దిగజారినా తన కుటుంబం సుఖపడాలనుకొన్నాడు. ఫలితంగా జైలుపాలు అయ్యాడు. ఉన్నత విలువలతో, ఆత్మ గౌరవంతో బ్రతకాలకున్న మధ్య తరగతి మనుషులకు వరకట్న సమస్య ఏవిధంగా అనైతిక పనులకు, పతనావస్థకు తీసుకువెల్లుతుందో ఈ నాటకంలో చూపించారు. ఈ వరకట్న సమస్య ఒక్క రంగనాధానికే కాదు ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ చెందినది. ఎందరో వరకట్న కోరల్లో చిక్కుకొని పతనమైపోతున్నారు. ఈనాటికీ ఈ సమస్య అలానే ఉంది.
4.4. ధనిక వర్గదోపిడి:
పేదవాళ్ళు శ్రమతోపాటు వాళ్ళ అవసరాలను కూడా ధనిక వర్గం దోచుకుంటుంది. ఇంటి యజమాని గుప్తా, గోపి మిత్రుడు శేఖర్, లంచంతో పనులు చేయించుకోనే దయాళ్‌సేట్, కట్నం కోసం మనిషిని పీక్కుని తినే రామశాస్త్రి, ఈ నాటకంలో ధనిక వర్గానికి చెందినవారు. ‘‘భూమి సూర్యుని చుట్టు తిరగటం లేదు, పైసా చుట్టూ తిరుగుతుంది’’ అన్న గోపి మాటలు అక్షర సత్యాలు. ధనాన్ని ఆశగా చూపి పేదవాళ్ళు చేత పనులు చేయించుకోనేది ధనికులే. వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేది ధనికులే. కారు షెడ్డుకు రు.30/-లు వసూలు చేయటమే కాక, మురికి కాలువ మూయించి, కుళాయి వేయించమని గోపి అడిగినందుకు అతనిని కొట్టి, అతనే తనను కొట్టినట్టు పోలీసు కేసు పెట్టటం, దయాళ్‌సేట్ డబ్బు ఆశ చూపి పని చేయించుకొని చివరకు రంగనాధాన్ని జైలు పాలు చేసాడు. పేదవాడి శ్రమను, అవసరాన్ని, గౌరవాన్ని కూడా ఏవిధంగా దోచుకుంటారో ఈ నాటకంలో చెప్పబడిరది.
4.5. తీవ్ర దారిద్యం:
మూర్తీభవించిన దారిద్యానికి ప్రతీక సీత. ఈమె రంగనాధం భార్య. కట్టుకోవటానికి సరైన చీరలు కూడా లేవు. ఒకపక్క అనారోగ్యం, మరో పక్క తీవ్రదారిద్యం మధ్య నలిగిపోయే స్త్రీ.
ఒక్కరి సంపాదన మీద 10 మంది బ్రతకటం. ముసలి తండ్రికి సరైన వైద్యం కూడా వేయించలేని నిస్సహయస్థితి. చిన్ననాటి స్నేహితుడు డాక్టరు కావటం చేత అతను వచ్చి వైద్యం చేసేవాడు లేదంటే డాక్టరుకు కూడా చూపించలేని స్థితి. మధ్య తరగతి జీవితంలో సుఖం, ఆనందం ఉండవు. ఎప్పుడూ కష్టాలు, విచారమే ఉంటుంది. దారిద్య్రం మనిషిని ఎంత పతనానికి తీసుకొని వెళ్ళుతుందో ఈ నాటకంలో తెలియచేసారు ఆత్రేయ.
4.6. మధ్య తరగతి ఫాల్స్‌ప్రెస్టేజి (భేషజం) :
మధ్యతరగతి జీవితంలో కష్టాలకు కారణం లేనిపోని భేషజాలే కారణం. తమ స్థాయికి చిన్న పనిచేయలేక, ఉన్నత ఉద్యోగంరాక, ఉన్న ఉద్యోగం చాలక అనుక్షణం బాధపడుతూ గడిపే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు. అందుకే గోపి తాను నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మి కుటుంబం గడవటానికి పళ్ళపొడిని అమ్ముతాడు. కాలేజిలో చదువుకుంటున్నా ఇంటి పరిస్థితులు సామాజిక వాతావరణాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకొని పళ్ళపొడిని అమ్ముతాడు. ఆ విషయం తెలసిన అన్న రంగనాధం తన పరువు పోయిందని, తన బ్రతుకును నడి రోడ్డు మీదకు లాగాడని ఆగ్రహించి తమ్ముని మీద చెయ్యి చేసుకుంటాడు.
5. ఉపసంహారం:
మధ్య తరగతి వాళ్ళు పస్తులున్న పరవాలేదు. కాని తక్కువ పని చేయకూడదు. అదే లేనివాళ్ళు ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మంది సంపాదిస్తారు. లేనిపోని భేషజాలకు పోరు. ఆ పనే గోపి చేసాడు. లేని పోని ప్రెస్టెజిలో పిల్లలకు రోగాలు వస్తున్నా, అప్పులు వాళ్ళు వచ్చి నానా బూతులు తిడుతున్నా, స్త్రీలు బయటకు వెళ్ళి పనిచేయకూడదు, ఉన్నదాని కంటే గొప్పగా కనిపించాలని తాపత్రయపడే మధ్య తరగతి మనస్తత్వానికి అద్దం పట్టింది ఈ ‘ఎన్.జి.ఒ.’ నాటకం.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆత్రేయ. ‘ఎన్.జి.ఒ.’ నాటకం. బాలప్రభా ప్రెస్, విజయవాడ. 1949.
- తెలుగు నాటక సాహిత్యం. (ప్రసంగవ్యాససంకలనం) ఆంధ్ర సారస్వత పరిషత్తు. హైద్రాబాద్, 1986.
- రమణ, పి.వి. తెలుగుసాంఘిక నాటకం పరిణామ వికాసం. స్వీయప్రచురణ, హైదరాబాద్.1995
- రాధాకృష్ణమూర్తి, మిక్కిలినేని. ఆంధ్ర నాటకరంగ చరిత్రము సీతారత్నం గ్రంథమాల, విజయవాడ, 1965.
- వెంకటేశ్వరరావు, బోయిన. ఆధునిక నాటకరంగం – ఈ శతాబ్ది ప్రయోగాలు. ఆంధ్ర సారస్వత సమితి. 1998.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

