ఉపోద్ఘాతం:-

చిన్ననాటి మన తీపిజ్ఞాపకాలలో ఒకభాగం బామ్మలు చెప్పే కథలు. ఆబాల గోపాలాన్ని అలరించి మంత్ర ముగ్దులను చేసేవి ఈ కథలే. ప్రాచీనకాలం నుండి ఎంతో చారిత్రక ప్రాధాన్యతా ఉన్నా సాహిత్య ప్రక్రియా కథాసాహిత్యం. ఆదివారం వస్తుందంటే చాలు పేపర్ మ్యాగ్జైన్స్ లో వచ్చే కథలకోసం ఎంతగా ఎదురుచూస్తున్నామో మనందరికీ తెలుసు. అవేనా చతురా, విపులా, తెలుగువెలుగు మొదలగు అనేకమ్యాగ్జైన్స్ లో ఎన్నో ఎన్నెన్నో కథలు, ఎంతో సాహిత్యం, ఇంకెన్నో విజ్ఞాన విషయాలు, మరెన్నో అనుభూతులు. వీటన్నింటి మేలి కలయికే ఆధునిక సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న కథాసాహిత్యం

1. ఆనందగోదావరి :-

ఆనంద గోదావరి కథలో చిన్ననాటి స్నేహానికి విలువనిస్తూ తన ఆత్మబంధువుకు తన జీవితాన్నే నివాళిగా చేసిన అమర ప్రేమ గాధ మురళీధరానిది. ఈయన తన ప్రేమ బంధంకు ఇచ్చిన విలువ ఎంతంటే అది తన జీవితం. తను చిన్ననాటి నుండి కోరుకుంటున్న తన ప్రాణానికి ప్రాణమైన మీరా ఆశయసాధనలో తన జీవితాన్నే అంకితం చేసిన గొప్పమానవతావాది. పరిపూర్ణ మానవత్వం కలిగిన వ్యక్తి మురళీధరన్. మీరా ఆశయసాధనలో మురళీధరన్ తన జీతాన్ని, జీవితాన్ని ధారపోసి మరీ అనాధ శరణాలయాన్ని ఏర్పాటు చేసి శరణాలయంలో అనాధలకు సేవచేస్తూ తన చివరి జీవితాన్నిగడిపాడు. తన జీవితాంతం వరకు తన స్నేహితురాలికిచ్చిన మాటకోసం తన ఆశయ సాధనకోసం తపించి తరించిన మానవతావాది మురళీధరన్.

2. అరవిరులు:-

ఈ కథలో ప్రేమ పేరుతో మోసపోయిన ఓ యువతిని మన పోలీస్ వ్యవస్థ ఎలా రక్షించిందో ఆమెను రక్షించడం కోసం ఆమె స్నేహితులు పడిన తపనే ఈ కథ. అరవిరులు లోని ‘విరాజిత’ వ్యక్తత్వం ఎంతో ఉన్నతంగా చిత్రించారు మన రచయిత్రి. విరాజిత ట్రైనింగ్ పూర్తిచేసుకుని వచ్చిన వెంటనే ‘ప్రణయ’ స్నేహితురాలిని కాపాడటంలో నిమగ్నమైన దృశ్యం చదువుతుంటే ఈ సమాజంలో ఇంకా మానవత్వపు విలువులు ఏమాత్రం కూడా తగ్గలేదు అనిపిస్తుంది. విరాజిత ఏంతో చురుకుగా ఆలోచించకపోతే ప్రణయ స్నేహితురాలు బ్రతికేదికాదేమో అని అనిపిస్తుంది.

3. అడగని వరం :-

పనిమనిషి వరలక్ష్మి తన యజమానురాలైన మాధవి యొక్క చెవుల జూమ్కాలును తప్పనిసరి పరిస్థితులలో దొంగలించి సావుకారు దగ్గర తాకొట్టుపెట్టి తన అవసరం తీర్చుకొని మల్లి కష్టపడి తాకట్టు విడిపించడానికి సరిపడా డబ్బు సంపాదించుకు వచ్చి వాటిని విడిపించి తన యజమానురాలికే తిరిగి ఇచ్చి తిన్నింటి వాసాలు లెక్కపెట్టకుండా మానవత్వాన్ని నిలుపుకుంది. అలాగే ఆమెని క్షమించి తన సొంత మనిషిలా తిరిగి సేరదీసి మాధవి తన మానవత్వాన్ని చాటుకుంది. వీళ్ళిరువురు మానవత్వంను పంచడంతో ఒకరితో ఒకరు పోటీ పడ్డారనే చెప్పాలి.

4. రెండో బాల్యం :-

రెండో బాల్యం కథలో కన్నతల్లి కోరికను తీర్చిన ఓకొడుకు, వృద్ధాప్యంలో తన స్నేహితులను కలిసి సంతోషపడే అంబుజమ్మ ఆమె సంహితులకు తోడుగా స్నేహంగా ఉండే సరోజినీ కోడలు పాత్ర మానవత్వానికి మచ్ఛుతునకలనే చెప్పాలి.

5. మానవి :-

ఈ కథలో సవతి తల్లి పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొని దైర్యంగా ఒంటరిగా తనజీవనం సాగించిన పల్లవి తన జీవితంలో స్థిరపడిన తర్వాత తన తండ్రిని సవతి తల్లిని ప్రేమగా చూసుకునే తీరు మరియు ఆమె భర్త స్వయంగా అత్తమామలను సాకేతీరు చూస్తే నిజమైన మానవత్వం ను అచ్చుపోసి పల్లవి భర్తగా భగవంతుడు పంపడమో అనిపిస్తుంది.

6. జీవనవనిలో ఆమని :-

జీవనవనిలో ఆమని పేరుకు తగ్గట్టుగానే ‘ఝరీ’ జీవితంలో ఓ మానవతా మూర్తి. ఒకే జీవితంలో మరొక ఆమనిని వికసింపజేసాడు ‘శౌర్య’. మరదలైన ఝరీ జీవితంలో భర్త చనిపోయి అంతులేని విషాదాన్ని మోస్తున్న ఆమెకు తిరిగి వివాహం చేసుకుని ఆమని విరులను పూయించాడు శౌర్య.

7. జగన్మాత :-

స్త్రీ అబలకాదు సబల. తాను తలుచుకుంటే ఎలాంటి పనైనా, అది ఎంత కష్టమైన చేసి తీరుతుంది. దానికి ఉదాహరణగా జగన్మాత కథలోని ‘మురళి’ తల్లిని చెప్పొచ్చు. మురళి చిన్నప్పటినుండి తల్లి లాలనలో పెరిగి డిగ్రిపూర్తై ‘రవళి’ పరిచయంతో తల్లికి దూరమై తల్లిని భార్య చులకనగా చుసినా ఏమి అనలేక, చేతకాని వాడిలా ఉన్నప్పుడు ఆతల్లి తన కొడుకు బాధను, అసమర్ధతను అర్థం చేసుకొని, తనలోని నిరక్షరాస్యత అనే లోపాన్ని సరిదిద్దుకొని, తన గ్రామం మొత్తానికి మార్గ దర్శకరాలుగా మారి శరణాలయంను స్థాపించి, దానిలో అనాధ స్త్రీలకు వివిధ పనులు కల్పించి. స్వయం కృషితో బ్రతికేటట్లు చేసి తన మానవత్వం చాటుకుంది.

ముగింపు :-

నండూరి సుందరీ నాగమణి గారు మానవత్వపు విలువలతో కూడుకున్న పై కథలే కాకుండా అనేక కోణాలలో ఆలోచించి ఎన్నో కథలను రాసి పాఠకులను మంత్ర ముగ్దులను చేస్తున్నారు.

ఆధారగ్రంధాలు :-

నండూరి సుందరీ నాగమణి కథాసంకలనాలు

1.నువ్వు కడలివైతే

2.అమూల్యం