పరిచయం :

సర్వమతాలు, సదాచారాలు, భిన్నత్వంలో ఏకత్వం, సంప్రదాయాలకు మారు పేరు రత్నగర్భగా పేరుగాంచిన భారతదేశం. అటువిం మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రిందట అరబ్బు దేశాల నుండి బ్రతుకుజీవుడా అని పొట్టను చేత పట్టుకొని ఈ పవిత్ర భూమిలో స్థిరపడ్డారు. అంగ్లేయులు, తరుష్కులు, మొఘలులులాగా వ్యాపారం కోసమో, వాణిజ్యం కోసమో మన దేశానికి వచ్చి రత్న వైఢూర్య, మణిమాణిక్యాలు, మన మాన, ప్రాణాలను దోచుకొని పోయినట్లు వారు దోచుకొని పోలేదు. ఈ నేల, ఈ మ్టి ఋణం తీర్చుకోవాలని భావించి రవి అస్తమించని బ్రిీష్‌ రాజ్యాన్ని గడగడలాడించి రక్కసుల కంబంధ హస్తాల నుండి భరతమాతను రక్షించి, ఈ పవిత్ర భూమిపై స్థిరపడిన వారే ''బంజారా రాజపుత్రులు''.

బంజారాలు వారు నిర్వహించే విధులను బ్టి లణధియా బంజారా హమార్‌ బంజారా, గోర్‌ బంజారా అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మనదేశంలో ఆదివాసులు, బంజారాలు, మణిపూర్‌, మేఘాలయ, సిక్కిం, పంజాబ్‌, గుజరాత్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒరిస్సా, రాజస్తాన్లలో చౌహాన్‌ , పమార్‌, రాథోడ్‌, ప్నాయక్‌లుగా పేరుగాంచారు. ఈ రాష్ట్రాలలో వీరితోపాటు చెంచు, గదభ, సవర, తోడాలు, తోీలు, ఎరుకల, కొండదొర, కోయదొర, కొండరెడ్లు అడవులలో అరణ్యాలు, పర్వతాలు, గుహలు, కొండలలో నివసిస్తూ ప్రకృతి సంపదను స్మగ్లర్ల నుండి కాపాడి మనకు మంచి గాలిని అందించడంలో, సకాలంలో వర్షాలు కురవడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. మిజోరాం, మేఘాలయ, అరుణాచలప్రదేశ్‌, సిక్కింలో తోదలు, గదబ, సవర విం గిరిజన సంచార జాతులపై ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్‌ ముజుందార్‌ ఎన్నో పరిశోధనలు చేసి నేికి ఆ గిరిజన జాతులు డబ్బుతో అవసరం లేకుండా జీవిస్తున్నారంటే వారి జీవనశైలి నాి ఋషులు, మహర్షులు, జీవన విధానానికి దర్పణం పడుతోంది. మనదేశం అటవి పర్యావరణ హక్కుచట్టం చేసి ఆ బాధ్యతను నిర్వహించవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అటవి శాఖలకు అప్పచెప్పకుండా సకాలంలో గిరిజన జాతులైన ఆదివాసీలు, చెంచు, సవర, గదబ, గోండులు, దంజారాలకు అప్పజెప్పింది అంటే వారి యొక్క నీతి నిజాయితీని మనం శిరసావహించి నమస్కరించవలసిందే. నాికి గిరిజనులు పేదలుగా వుండి పోవడానికి కారణం వారు కేవలం పశుపోషణ, అటవి ఉత్పత్తులపై ఆధారపడి జీవించడమే.

నేడు ఎంతో ధనవంతులుగా పేరుగాంచిన గిరిజనేతరులు ఎవరు కూడా పుట్టుకతో ధనలక్ష్మీ పుత్రుడు కాదే. ప్టుినపుడు రెండు ఎకరాలు పొలం వున్నవాడు నేికి వేల కోట్లు ప్రోగు చేసుకొన్నాడు. 50సంవత్సరాల క్రితం పూరి గుడిసెలో వుండే గిరిజనేతరులు నేడు కోటకు ఎదిగారు అంటే వారు బలశారులు, వీరులు, ధీరులు కాదు, వీరు కష్టపడి చెమోడ్చి సంపాదించలేదు. వీరు భారతావనిలో వుండే సహజ సంపదలైన భూగర్భ సంపదలను అక్రమంగా వెలికి తీసి, అడవులలోని విలువైన కలప సంపదలను దొంగలించి, ప్రభుత్వాలకు మోసం చేస్తూ అక్రమార్జన ద్వారా ధనాన్ని ప్రోగు చేసుకున్నారు. నాగలి ప్టి దుక్కి దున్ని పంట వార్పు చేసి ధనవంతులు కాలేదు. గిరిజనులు, కట్టెలు, తేనే సేకరించి, పశు పోషణ' చేస్తూ నేికి జీవిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకోవలసిన గిరిరజనేతరులు గిరిజనులను నీచంగా చూస్తున్నారు. అంటే వారి నీచ సంస్కృతికి ఇది అద్దం పడుతుంది.

మన ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనులలో 33 జాతులున్నాయి. అందులో ముఖ్యమైన ఆదివాసీ గిరిజన జాతులైన గోండులు, కోయ, గదబ, సవర, తోదలు. విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు, మన్యం తీర ప్రాంతాల్లో, అరకు లోయలలో నివసిస్తున్నారు. నేికి వీరు అటవి ఉత్పత్తులను సేకరించి - జీవనం సాగిస్తూ అడవులను కాపాడుతున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అరకులోయ, విశాఖ మన్యంలో పండే కాఫీకి హక్కులు గిరిజనులవే అని చట్టం చేసినా అవి పూర్తిగా అమలు కావడంలేదు. ప్రకృతిని ఆరాదించి సంపదలను దోచుకోకుండా అడవి తల్లిని నమ్ముకొని జీవించే బంజారాలు, మిగిలిన గిరిజనులు గొప్పవారే. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వున్న, అడవిని, అటవి సంపదకు కాపాడడానికి ఐ.ఎ.ఎస్‌. స్థాయి అధికారి, ఎందరో ప్రభుత్వ అధికారులు వున్నా, వారి జీతభక్యాల కోసం ప్రతి యేా వేల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేయిస్తున్నా లక్షల కోట్లు విలువ చేసే ఎర్రచందనం, టేకు, గంధం, మిగిలిన వన్య సంపద అన్యాకాంత్రం అయ్యాయి. అడవి బిడ్డలైనా గిరిజనులను నాయకులు బెదరించి వారి ద్వారా ఈ అక్రమార్ధన చేసి చివరకు గిరిజనులకు బలిచేయడం అనేది తల్లి రొమ్ము పాలు త్రాగి రొమ్మును గుద్దడం లాిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అటవి ఉత్పత్తులపై గిరిజనులకు హక్కులు కల్పించాలి. పసుపు, చింతపండు, తెనే, కుంకుడు కాయలు, విస్తరాకులు విం ఎన్నెన్నో ఉత్పత్తులను కొనుగోలు చేసి వాిని తక్కువ ధరకే గిరిజన కార్పొరేషన్‌ (ట్రైకార్‌) ద్వారా ప్రజలకు అందుబాటులో తెచ్చిన అధికారులు సైతం రాజకీయ రాబంధులకు లొంగి కొందరు అటవీ సంపదలను హరింపచేస్తున్నారు. మరికొందరు అయితే, నిజాయితీ గల అధికారులను సైతం హతమార్చి అటవీ సంపదలను కొల్లగ్టొి అక్రమ మార్గంలో విదేశాలకు తరలించి వేల కోట్లు కొల్లగొట్టుతున్నారు. అటవి సంపదలు తరలించేటప్పడు ఎన్నో చెక్‌ పోస్టులు దాి, చివరకు వేరే రాష్ట్రాలలో సైతం దాి, పడవల విమానాల ద్వారా విదేశాలకు అటవి సంపద తరలిపోతోంది అంటే ప్రతి స్థాయిలో నల్లధనం నదిలో నీరు ప్రవహిస్తున్నట్లు ప్రవహిస్తున్నది. అన్నమాట. ఇది గమనించిన మన రాష్ట్ర ప్రభుత్వం ''వనమిత్ర'' అని పేరు ప్టిె అప్పజెప్పింది అంటే బంజారాలు, గిరిజనులు అడవి తల్లిని కాపాడి దేశ, రాష్ట్ర సంపదలను సంరక్షించే వారిగా కీర్తింపబడ్డారు. కాని గిరిజనులు -వివక్షకు గురై కనీస అవసరాలకు కూడా దూరమై రోగపీడితులై బాధపడుతున్న గూడెంలు ఎన్నెన్నో వున్నాయి. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బంజారాలు అధికంగా వున్నారు. అదిలాబాద్‌ కరంనగర్‌ జిల్లాలో కోయ, గోండులు అధికంగా వుండి వనదేవతలను ఆరాధిస్తూ అడవులను కాపాడుతున్నారు.

బంజారాల సంస్కృతి ఆచారాలు హిందూమతానికి ఆదర్శమైన విధం:

ఇంతకు మునుపే చెప్పినట్లు బంజారాలు దేశభక్తి గల వీరులు, ధీరులు భరతమాత నుదుిపై తమ రక్తతిలకం దిద్దిన దేశభక్తులు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే ప్రముఖ చరిత్రకారుడు కల్నలాడ్‌ చెప్పినట్లు సిద్ధాంతాలు, ఆచారాలు, కట్టుబాట్లు, మత పెద్దలు చెప్పినట్లు అనుసరించడంలో చౌహాన్‌, పమార్‌, రాథోడ్‌, నాయక్‌, సుగాలి, లంబాడీలుగా పిలవబడే ''బంజారాలు ఆచరించినట్లు ఎవరు ఆచరించరని పరిశోధనల ద్వారా తెలియజేశారు. ప్రతి మతంలో వున్నట్లే బంజారాలలో కూడా భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. అయినప్పికీ 'తాండా' పెద్ద అయిన ''నాయక్‌'', కార్బారీ (మంత్రి) డావో (సలహాదారు)ల సలహా మేరకు క్రమశిక్షణ లోపించినపుడు 'నసాఖ్‌' అనే పంచాయితీ ప్టిె మందలిస్తారు. అంతేకాదు పెద్దలను గౌరవించాలనే ఆచారం ఎప్పుడైతే గాడి తప్పుతుందో ఆచార, వ్యవహారాలు, పాించని, అధికారంతో రాజ్యానికి అధిపతి అయినా సరే, జిల్లాకు కలెక్టరు అయినా సరే సగరాలు, పట్టణాల నుండి 'తండా'లకు వచ్చినపుడు ఖచ్చితంగా నేికి తాండా హిందూధర్మ, సనాతన, వైదిక ధర్మాలను పాించవలసిందే. అలా పాించని వ్యక్తికి దండన ఉద్యోగాలలో స్థిరపడిన వారు ఖచ్చితంగా వారి మతాచారాలను, హిందూధర్మ సంస్కృతిని ఆచరిస్తారు. 'తాండా' పెద్ద అయిన నాయక్‌ పర్యవేక్షణలో డావో, కార్‌ భారీ, ఒక చోట సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడో చెట్టుకోమ్మపై పుష్పించి వికసించి సుదూరానికి సైతం సుగంధ పరిమళాలను వెదజల్లి సకల జీవులలో ఉత్తేజాన్ని ఎలా అందిస్తుందో, అదే విధంగా యుగోస్లేవియాలో ప్టుి మనదేశానికి అడుగు ప్టిె భరతమాత నుదుటను ముద్దాడి నేను సైతం నీ బిడ్డలకు సేవ చేసానని మురికి కూపంలో చిక్కుకుని, దారిద్రంతో విలవిలలాడుతున్న కలకతా నగరానికి వచ్చి సేవ చేసి తరించి ''భారత రత్న'' పొందిన దైవదూత మదర్‌ థెరిస్సా సమస్త విశ్వానికి ఆదర్శప్రాయం. అదే విధంగా జాతి, ఉపజాతి ఏదైనా దేశభక్తి, అచారవ్యవహారాలు పాించడంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్తాన్‌, మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సా, గుజరాత్‌ మొదలగు రాష్ట్రాలలో విస్తరించి వున్న పమార్‌, చౌహాన్‌, రాథోడ్‌, సుగాలి' లంబాడీలుగా పిలువబడే 'బంజారాలు' క్రమశిక్షణ, హిందూధర్మ ఆచారాలు కట్టుబాట్లు పాించడంలో ఇతర మతాలకు ఆదర్శనీయం. ఇంకొక విషయం మనం గమనించాలి. దేశభక్తిని  చాటడంలో, ఆచార, కట్టుబాట్లు హిందూధర్మపరిరక్షణలో దేశంలోనే పేరుగాంచిన వారు ''సిక్కులు''. వీరే బంజారాలకు ప్రేరణ. ఇరువురు భారతదేశమనే రథానికి చక్రాలవిం వారు ఇలా చెప్పడంలో అతిశయోక్తి లేదు. చరిత్రకారులు చెబుతున్నదే నేను చెబుతున్నాను.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              తాండా     -              బంజారాల నివాస గ్రామ

                              నాయక్‌   -              తాండా పెద్ద నాయకుడు (రాజు)

                              కారో భారీ -              మంత్రి

                              డావో       -              సలహాదారుడు

                              నసాబ్‌     -              పంచాయితీ

                              ధాండ్‌      -              జరిమానా

గిరిజన 'బంజారా'ల వివాహ పద్ధతులు ఆచారాలు, సంస్కృతికి మూలం:

గిరిజన తెగల్లో ప్రముఖమైన బంజారాలు అనబడే నాయకు, సుగాలి, లందాడీలు, వీరి శైలి, అచారాలు అన్ని కూడా జీవిత పరమార్థాలను, సంస్కృతిని, సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను బోధించే విధంగా వుంటుంది. హిందూధర్మం, సంస్కృతి ప్రకారం వివాహం అష్ట విధములుగా వుంటుంది. అవి.

                              బ్రహ్మ వివాహం                      దైవ వివాహం

                              ఆర్ష వివాహం                         ప్రాజాపత్య వివాహం

                              అసుర వివాహం      గాంధర్వ వివాహం

                              రాక్షస వివాహం                     పైశాచిక వివాహాలు

పైవన్నీ ఐతరేయ బ్రాహ్మణంలో 3వ అధ్యాయంలో వివాహం యొక్క విశిష్టతను క్రింద విధంగా వివరించారు.

                              ''సాలంకృత కన్యాదానం సద్గుణార్థం

                              మనోసోతాసహ సంకల్పిత దక్షిణాం

                              తుళ్యమహం సంప్రదే నమమ సమమ||

సద్గుణవంతుడైన వరుణ్ణి అన్వేషించుకొని వధుపు తండ్రి వరునికి కన్యాదానంతో పాటు దక్షిణల రూపంలో బంగారు, వెండి, ధనమును ఇస్తాడు. అంతేగాకుండా లక్ష్మీదేవి స్వరూపమైన కుమార్తెకు బంగారునగలతో అలంకరించి కన్యాదాసం చేస్తారని ప్రతీతి.

వేదాలలో ప్రాచీనమైనది, సర్వశాస్త్రాలకు నిలయమైన ఋగ్వేదంలో వివాహం గురించి చక్కగా వర్ణించారు.

రూపం హీరణ్యం పశవో వివాహ

రయించ పుత్రాంగశ్చ దగ్నిర్మహ్య - మధో ఇమాం

ధార్మికత అనేది వివాహానికి గొప్ప ప్రతీక. వివాహ ప్రస్తావన మహాభారతం లోని శాంతిపర్వంలో ఇలా చెప్పడం జరిగింది.

నగృనహం గృహ మిత్యాహుః గృహినీ గృహ మభ్యతే!

గృహంతు గృహిణీమీనకుం అరణ్య సదృభశ్యం మతం||

సనాతన హిందూ ఆచారం ప్రకారం ప్రాచీన భారతదేశంలో సద్గుణవంతుడైన వరుణ్ణి వెతికి కన్యాదానం చేసేవారు. కాలక్రమంలో విధి వక్రీకరించి భర్త చనిపోతే, ఆ స్త్రీకి నరకప్రాయం కాకూడదు అనే ఆలోచనతో చనిపోయిన భర్త యొక్క తమ్మునితో (దేవర్‌) తిరిగి ఆ స్త్రీకి వివాహం చేసేవారు అప్పి ఆచారం ప్రకారం వాలి కూడా సుగ్రీవుణ్ణి ఓడించి సుగ్రీవుని భార్యనూ చేసుకున్నాడు. ద్రౌపది పంచపాండవులకు భార్య అయింది. అంటే బహుభార్యత్వం (పాలీగమీ) ఆ కాలంలోనే వుంది. వంశోద్ధరణకు బహుభార్యత్వం ఆచరణలోకి వచ్చింది. ఇదే ఆచారం, సాంప్రదాయం గిరిజనులలోని బంజారాలలో వుంది.

హిందూ వివాహంలాగానే తండా సంస్కృతిలో బంజారాల వివాహ సంప్రదాయం చాలా ముఖ్యమైనది. వీరు కొన్ని శతాబ్దాల నుండి తమ వైవాహిక అచారాలను అలాగే ఆచరించుకుంటూ క్షవడం చేత వివాహ పదతిలో ప్రత్యేకతలు కన్పిస్తాయి. పూర్వ సంచార జీవులైన ''బంజారాలు' సంవత్సర కాలంలో నాలుగు నుండి ఆరు నెలలు వ్యాపారం, పశుపోషణ కోసం వలస సంచారం పోయేవారు.

బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              దేవర్‌       -              భర్త తమ్ముడు (మరిది)

                              తాండ్రీ      -              స్త్రీ

                              మాీ       -              పురుషుడు

                              ధణీ         -              భర్త

                              పాలీగమి -              బహుభార్యత్వం

                              మోనోగమి              -              ఏకభార్యత్వం

బంజారాలలో 'సగాయి' అనే వధూవరులకు నిశ్చితార్థం చేయు విధం:

వంద సంవత్సరాల మునుపు బంజారాల వివాహం చాలా ఖర్చుతో, విందు, వినోదాలతో వారం రోజులు జరిగేవి. జీవిత పరమార్థం, ఎలా జీవించాలి దేశభక్తి, గురుభక్తిని, బోధించే విధంగా పెళ్ళిలోని ఘ్టాలు వుండేవి. అవి కథలు, పాటల రూపంలో వుండేవి. బంజారాల సంస్కృతి ప్రాచీనమైనది, ఆదర్శమైనది. బంజారాలు ధనం దాచుకోవడానికి ఇష్టపడరు. అందుకే బంజరాలు పేదవారుగా మిగిలారు. బంజారాలలో అబ్బాయికి ఒక అమ్మాయిని చూడడానికి ఎన్నో అంశాలను పరిశీలిస్తారు. అందరికి నచ్చితే 'సగాయి' అంటే నిశ్చితార్థం చేసుకుాంరు. బంజారాలలో ప్రధానంగా నాలుగు ఉపవంశాలున్నాయి. అని పమార్‌, రాథోడ్‌, చౌహాన్‌, వడిత్యా. మాతృ గోత్రస్తులకు కాకుండా వేరే గోత్రం వారికి ఇచ్చుకుాంరు. రాథోడ్లలో రకాలు వన్నాయి. వీిలో వరుసకు అయ్యే వారితో సంబంధాలు కుదర్చుకుాంరు. ఉదాహరణకు రామస్వామి తాండా అబ్బాయికి పూజారి తాండా అమ్మాయికి సంబంధం కుదిరినపుడు, ఇరు తాండాల పెద్దలు, తాండా 'నాయక్‌' సమక్షంలో 'సగాయి' అంటే నిశ్చితార్థం చేసుకుాంరు. దీనినే బంజారా భాషలో ''గోళ్‌ ఖాయోరో నోక్తా'' అంటే నిశ్చితారంలో భాగంగా అప్ప్లో అందుబాటులో వుండేది 'బెల్లం' ఒక్కటే కాబ్టి, పసుపు కుంకుమ నీళ్ళు వరుస అయ్యే వారిపై ఆనందంతో చల్లుకొని, అగ్ర వారి నోిలో బెల్లం పెడుతారు. సంతోషంతో వారి వారి తాండాలకు వెళుతారు.

ఈనాి బంజారా సమాజంలో అబ్బాయి అమ్మాయిని చూడడం నిశ్చితార్థం విం కార్యక్రమాలు ఆధునిక హంగులతో ఒక్క రోజులోనే జరుగుతున్నా ప్రాచీనంగా తరతరాల నుండి వసతున్న పై ఆచారాలు ఈ నాికి కొనసాగుతున్నాయి. పాించాలి లేదంటే ధాండ్‌ అంటే జరిమానా వేస్తారు తాండా పెద్ద ''నాయక్‌'.

బంజారా అబ్బాయికి వరుసకు అయ్యే అమ్మాయితో నిశ్చితార్థం చేస్తారు దీనినే బంజారా భాషలో ''సగాయి'' అంారు. లక్ష్మీదేవి స్వరూపమైన అమ్మాయిని కోడలిగా ఇస్తున్నందుకు ఒక రూపాయిని అమ్మాయి తండ్రికి ఇస్తాడు అబ్బాయి. తండ్రి. ఈ రూపాయి బిళ్ళను 'సాకెర్‌ రప్యా' అంారు (అంటే నిశ్చితార్థం జరిగేటప్పుడు వరుని తండ్రి వధువు తండ్రికి కన్యాదానానికి బదులుగా ధనంగా ఒక్క రూపాయిని ఇస్తాడు.) ఈ రోజల్లో ఈ రూపాయి ఇస్తూ, బంగారు నగలను పెళ్ళికి ముందే అమ్మాయి తండ్రికి అప్పగిస్తారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో ఈ ఆచారం ఇప్పికీ కొనసాగుతూంది. పెండ్లి అయిన మరుక్షణం వధువు వరునితో అత్తారింకి వచ్చేటప్పుడు, వరుడు నాలును కోడెదూడలను అమ్మాయి వారికి ఇచ్చే సాంప్రదాయం వుంది. ఎందుకు ఇలా ఇస్తారంటే. పురాణాలలో చెప్పినట్లు కన్యాదానం మహాదానం, పుణ్యదాయకం వరుడు కన్యాదానం అందుకొన్న తర్వాత మామ గారికి 'గోదానం' చేస్తాడు. అందులోను కోడెదూడలను ఎందుకు ఇస్తారంటే బంజారాల వృత్తి ఆనాడు పశుపోషణ కాబ్టి ఈ సంప్రదాయం పెండ్లికి ముందే ఖరారు అవుతుంది కాబ్టి ''దాసని కరార్‌-ధరార్‌'' (నిశ్శయం) అంారు. వరరాలలో వుంటున్నాసరిద్‌రీడిలను స్వీకరించకపోతే వాి విలువలను లెక్కించి దానికి సరిపడ ధనాన్ని వరుని తండ్రి వధువు తండ్రికి ఇస్తాడు. ఇటువిం ఆధ్యాత్మిక విలువలతో వధువు తండ్రిని గౌరవించే సనాతన ధర్మం బంజారాలలో కనబడుతుంది.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              థాండ్‌                                    -              జరిమానా

                              సాకేర్‌ రప్యా                            -              నిశ్చితార్థపు రూపాయి

                              కరార్‌ ధరార్‌                           -              నిశ్చయం

బంజారా వివాహ వ్యవస్థలో పురోహితునిగా బంజారా పూజారి ''భగత్‌'' ఉండుట:

ఆనాి బంజారా వివాహవ్యవస్థలో వివాహలు జరపడానికి ప్రత్యేకంగా బ్రాహ్మణ పురోహితుడు వుండడు. ఆయా తాండాలలో భవాని, మరిమామ కేంకాళి అంటే దుర్గామాతను పూజలు జరపడానికి ''బాల్యం నుండే సన్యాసం తీసుకొని వుండే అమ్మవారి ఉపాసన చేసి, అమ్మవారి అనుమతితో ఓ పెండ్లి వయస్సు రాగానే ఆ దుర్గామాత ఎవరిని సూచిస్తుందో ఆ వధువును చేసుకుాండు. అటువిం నిష్టాగరిస్టులు, దేవి ఉపాసకులైన బంజారా పూజారులే హిందూ మత పద్ధతిలో, బంజారా మంత్రాలను పఠిస్తూ పెళ్ళి జరిపిస్తారు. ఈనాడు అవుతున్నట్లు నా పరిశోధనలో తేలింది. రాజస్తాన్లో కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారం ఇప్పికీ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలలో బ్రాహ్మణ పురోహితుడు వుాండు. ముందుగా బంజారాల ఆచారం గుజరాత్‌, మహారాష్ట్ర, ఒరిస్సా ప్రకారం బంజారా పూజారితో పెండ్లి ఆచారాలు ముగించి తర్వాత బ్రాహ్మణ పురోహితునితో పెండ్లి జరిపిస్తున్నారు కాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో మొదట బంజారా భగత్‌ (బంజారా పురోహితుడు) కొన్ని సాంప్రదాయ కార్యక్రమాలు ముగించిన తర్వాత వివాహ కార్యక్రమాలు హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పురోహితునికి పెండ్లి జరిపించే బాధ్యతను ఇస్తున్నారు.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్ధాలు

                              మర్యామ, మరియామ           -              శ్రీ మారెమ్మ తల్లి

                              కేంకాళి                    -              శ్రీ పెద్దమ్మ తల్లి

                              భగత్‌                                     -              పూజారి, బంజారా పురోహితుడు

బంజారాలలో (వేతేడూ కరేరో) పెళ్ళి కొడుకును చేయు విధం:

''పెండ్లి కుమారునికి చొక్కా ధోవతి ఎర్ర రుమాలు 'శౌళ్‌' అనే ఎర్రి దుప్పి, కఠారి (కత్తి)ని ధరింపచేస్తారు. భుజానికి కొతళి (సంచి) అనే దానిని వెండి కడియాలు, చెవులకు వెండి కమ్మలు, 'కొణదరో' అనే మొలత్రాడును నడుంకు, భుజం మీద ఎర్రి శాలువను కప్పుతారు.

పెండ్లి కొడుకు ఎప్పుడైతే ఆడపిల్ల వారి ఇంికి రాగానే అమ్మాయి ఆమె ఇల్లు వదలి తమ బంధువుల ఇంో్లనే ఉండాలి. తాను పెళ్లి అయ్యేంత వరకు ముసుగును ధరిస్తుంది. ముసుగు జారిపోకుండా ఉండేందుకు గజ్జెలతో తయారు చేసిన తితరి అనే అద్దాలతో తయారు చేసిన దానిని కుట్టుకుాంరు.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్ధాలు

                              రుమాల్‌                  -              తలపాగా

                              ఖోళ్‌                                      -              ఎర్రి దుప్పి

                              కొతళొ                                   -              సంచి

                              కొణదరో                  -              మొలత్రాడు

పెళ్ళి కొడుకు (వేతడు) పెళ్ళికి (సాడి తాండేరో) అంకురార్పణ చేయుట:

పెళ్ళికొడుకును చేయడాన్ని బంజారా భాషలో సాండి తాండేరో చేయడం అంారు. ఇది పెళ్ళికి అంకుర్పారణ. ఈ కార్యక్రమంలో పెళ్ళికొడుకు వారి ఇంో్ల సాడి తాండేరో అనే కార్యం ఉంటుంది. వదాయి రోజు అనగా మగ పెళ్ళి వారి  ఇంో్ల విందు భోజనం రోజు దుప్పి కప్పిస్తారు. ఈ దుప్పి దాదాపు 12 మూరల వరకు పొడవుగా ఎర్రగా ఉంటుంది. దీనిని పెద్దలందరూ కలిసి మడత ప్టిె పెళ్ళి కొడకుకు పైనుండి క్రింది వరకు తన శరీరాన్ని ఇతరులకు కనబడకుండ కప్పుతారు. తలకు ఎర్రి తలపసాగాను, ఖడ్గమును చేతిలో, చంకలో సంచిని ఈ దుప్పిని తాండా నుండి వేతడు (కొతోళ) వీిని ధరింపచేస్తారు. ఈ దుప్పిని తాండా నుండి వేతడు (పెళ్ళికొడుకు) ఆడపెళ్ళి వారింకి పోయే ముందు కప్పిస్తారు. దీనిని తాండాలోని నాయకులు నలుగురు పట్టుకొని అందులో ఒక రూపాయి బిళ్ళను వేస్తారు. అది దొర్లుతూ పొర్లుతూ చివరగా బొమ్మ బ్నొంసు చూసి, అప్పుడు పెళ్ళి కొడుకును అమ్మాయి వారి ఇంికి పంపిస్తారు.

మగ పెళ్ళివారు అమ్మాయివారి తండాకు సమిపంలో వచ్చి నిలబడతారు. తండాలో ప్రవేశించి, ముందుగా తండా నాయకుని ఇంికి వెళ్ళి తమ నమస్కారాన్ని ''రాం రాం'' అని శ్రీరాముని పేరు స్మరిస్తూ పలకరిస్తారు. వారు కూడా ''రాం రాం'' అని చెప్పి, క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని కంచు చెంబులో మంచినీళ్ళు ఇస్తారు. తర్వాత ఈతాకులతో అల్లిన చాపపై కూర్చోబెడతారు. తర్వాత తండా నాయకుడు ఆడ పెళ్ళి వారికి కబురు పంపుతాడు. తండా నాయకుని సమక్షంలో షెళ్ళి కొడుకుని పెళ్ళికుమార్తె వారి ఇంికి తీసుకుపోతారు.

వరుడు ప్రతిరోజు పెళ్ళి ప్రారంభం నుండి పెళ్ళి చివరి వరకు తమ ఇంికి చేరే వరకు దుప్పిని ముసుగుగా (ఘోం) కప్పుకొని నిండుగా ఉండాలి. కొత్త పెళ్ళి కొడుకు(వేతడు) ప్రతిరోజు తాండా నాయకునికి ఉదయాన్నే ఆకు వక్కలతో హుక్కాను తన రెండు చేతులతో నమస్కరించి అందించాలి. అప్పుడు నాయక్‌ సంతృప్తి చెందకపోతే తోడి పెళ్ళికొడుకు (లేరియా)తో పెళ్ళి కొడుకుకు మంచి సంప్రదాయాన్ని పాించమని చెప్పి పంపుతారు.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              వేతడు                                   -              పెండ్లి కొడుకు

                              నవలేరి                   -              పెళ్ళి కుమార్తె

                              లేరియా                  -              తోడి పెళ్ళికొడుకు

                              సాడితాండ్‌రో                          -              పెళ్ళికి అంకురార్పణ చేయుట

                              ఘుోం                 -              ముసుగు వస్త్రం

బంజారాలలో వరుడు పెళ్ళికి ముందు ఇచ్చే విందు ''వదాయి''.

''పదాయి'' అనగా వడుగు అని అర్థం. ఈ కార్యం బంజారాలలో పెళ్ళి కుమారుని ఇంో్ల చేసే కార్యమిది. ఇది పెళ్ళికి శుభముహూర్తంగా ఆదివారం లేదా వేరే రోజును నిర్ణయిస్తారు. ఇది అబ్బాయి వారి ఇంో్ల జరిగే కార్యం. ఈ కార్యక్రమం తండా నాయకుని ఆధ్వర్యంలో జరుగుతుంది. బంధుమిత్రుల సమక్షంలో తండా వారి సమక్షంలో గోసాయి బాబా సాక్షిగా ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. వెళ్ళి కుమారునికి స్నానం చేయించి రాత్రి వేళలో ఒక సూదిని తీసుకొని మోదుగు కాడాకు గుచ్చి దీపం మీద బాగా ఎర్రగా కాల్చి పెళ్ళికుమారునికి ఎడమ భుజంపై మూడు (3) వాతలు పెడతారు. తర్వాత పెళ్ళి కుమారుని తమ్ముడికి కూడా ఈ వాత పెడుతారు. ఒకవేళ పెళ్ళి కుమారుడికి తమ్ముళ్ళు లేకుంటే ఒక ఓక్రా పెడతారు. ఓక్రా అనగా గోనె సంచి అందులో ధాన్యాన్ని ఉంచి ఆ ధాన్యపు బస్తాకు వాత పెడతారు. వదాయి కార్యం ధేమా గురువు అయిన బంజారాల ధనవంతుని తలచుకొని, అతను నియమించిన గోసాయి బాబాను (మంత్రి) స్మరించుకొని ఈ వాత పెడతారు. ఈ వాత పెట్టేటప్పుడు గోసాయి బాబా మంత్రాన్ని చదువుతారు.

ఈ 'వాత పెట్టే ముందు తండాలోని ప్రజలందరి సమక్షంలో గోసాయిదాబా మంత్రం క్రింది విధంగా ఏడుసార్లు చదివి వాత కార్యం నిర్వహిస్తారు.

                              ''కోళి                      -              కోళిజావ

                              ధోళోఘోడో                             -              హస్సలో

                              కోతలి                     -              కార్‌ఛ

                              తల్లి అతర                              -              థాల్‌ఛ

                              ముంగే అతర                          -              వేర్‌ఛ

                              గోసతాయి బాబా                    -              సదా సదార్‌'' అని తాండా పెద్ద లేదా తాండా భగత్‌ (బంజారా పూజారి) చెబుతాడు.

తాత్పర్యం :

నీవు ఈ రోజు నుండి ఆహారం కొరకు ప్రయాస పడవద్దు. తెల్లి గుర్రమనే నీ కోరికల మనసుకు కళ్ళెం వేస్తున్నాం. నీ చేతిలో ఖడ్గం పెడుతున్నాం ఇప్పుడు నీవు రాజువు యుద్ధం వస్తే దానిని పెసర గింజగాను, నువ్వుల గింజలాగా భావించి, ఈ సూదితో వేసిన వాతకన్నా చురుకుగా ఉండాలి. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు, గోసాయిబాబా నిన్ను సదా రక్షించుకుాండు అని మంత్రం చదువుతూ వాతలు పెడతారు. ఇది బంజారాల్లో ధర్మధీక్ష కార్యం. ఈ కార్యక్రమం లేకుంటే మగాడు వివాహ యోగ్యుడు కాడు.

తండా నాయకుడు పెండ్లి కూమారునికి అతని తమ్మునికి వాతలు పెడతారు. ఒకవేళ పెండ్లి కుమారుడికి తమ్ముడు లేకపోతే గోనె సంచికి వాతలు పెడతారు. పెండ్లి కుమారుని తమ్ముడికి ఒకసారి వాత పెడితే తిరిగి అతని పెళ్ళికి వాత పెట్టరు. ఇలా పెట్టుటకు గల కారణం అమ్మాయిని మోసగించి వేరే వివాహం చేసుకోకూడదని ఈ ఆచారం ద్వారా తెలుస్తుంది.

ఈ గోసాయిబాబా ఎవరు అనగా పూర్వం పమార్‌, రాథోడ్‌, చౌహాన్‌ వడ్త్యియా అనే బంజారాల నాలుగు గోత్రాల వారందరికి ధన ధాన్యాన్ని ఇచ్చే పెద్ద భూస్వామి, పమార్‌, రాథోడ్‌, చౌహాన్‌ రాజుల దగ్గర నుండి కప్పం వసూలు చేయానికి గోసాయిబాబాను దేమా గురువు నియమించాడు. ఈ గోసాయిబాబా బంజారాల నుండి కప్పం వసూలు చేసే బాబాగా నియమింప పడ్డాడు. బంజారాలకు అన్ని విధాల చేదోడు వాదోడుగా సహాయ సహకారాలను అందించి, బంజారాల వ్యాపారానికి పరోక్షంగా ప్రోత్సహించిన గురువుగా భావిస్తారు. అతని నామ ధేయాన్నే పెళ్ళికి ముందు అతను రక్షిస్తాడని నమ్మి వారి పేరు మీదుగా వాతలు పెడతారు. దీనినే ''గోసాయిబాబార్‌ దాగేర్‌ గీద్‌'' అని అంారు. 'బంజారాలు ఈ మంత్రం ఏడుపార్లు చదివి చివరిగా చురుకు అంిస్తారు పెళ్ళికుమారునికి ఎర్రి బట్టతో తయారు చేసిన 12 మూరలు కల్గిన దుప్పి శరీర భాగం మొత్తం కనబడకుండా దుప్పిని కప్పుతారు. ధోతి, రుమాలు, చొక్కా చంకకు కొతఖో, ఖడ్గం, కారి డాండియా, నడుముకు (కొన్‌ దరో) అనే పండి మొలత్రాడు, చేతులకు వెండి కడియాలు, చెవులకు మర్కి అనే వెండి పోగులను, మెడలో వెండితో తయారు చేసిన చందర్మార్‌ అనే గొలుసును కంటెను ధరింపచేస్తారు. ఆ తర్వాత పెళ్ళి కమారుని దుప్పి వెనుక భాగాన స్వస్తిక్‌ అనే శుభముహూర్తపు బొమ్మను వేస్తారు. ఈ గుర్తును గంధము, పసుపు, కుంకుమ ఆముదపు నూనెలో నాలింని కలిపి చాలా మందంగా ఈ గుర్తును పెళ్ళి పెద్దలు దుప్పి మధ్య భాగంలో వేస్తారు. దీనికి అర్ధం ఏమంటే సాధారణంగా బంజారాల వివాహాలలో పురోహితుడు ఉండడు. కుల పెద్దగాని భగత్‌ అనే గుర్తును శుభ ముహుర్తంగా భావించిన విధంగానే బంజారాలు కూడా 'చోకోపూరేరో నోక్తా' అనగా శుభ ముహుర్తంగా భావిస్తారు. ఈ గుర్తును వేసినప్పి నుండి పెళ్ళి కార్యక్రమాలు అన్ని శుభంగా జరుగుతాయని వీరి నమ్మకం. పెళ్ళి కుమారునికి అన్ని విధాల రంగుల బట్టలతో అలంకరిస్తారు. దీనినే 'సాడి తాండేరో' కార్యంఅని వ్యవహరిస్తారు.

 బంజారా పదాలు     -                             తెలుగు అర్థాలు

                              వదాయి  -                             పెండ్లి కొడుకు ఇచ్చే విందు

                              భగత్‌       -                             పూజారి

                              చోకోపూరేరో             -                             ఆవు పేడతో అలికి ముగ్గువేయడం

                              నోక్తా        -                             కార్యక్రమము

                              సాడితాండేరో           -                             పెండ్లికొడుకును చేయుట

బంజారా పెళ్ళి కొడుకుక తొడి పళ్ళి కొడుకు (లేరియా) వుండడం సంస్కృతికి దర్పణమైన విధం:

పెళ్ళి కుమారుడు అమ్మాయి వారింకి వెళ్ళేటపుడు అతనితో పాటు ఒక సమర్థుడైన దూతను పంపుతారు. ఇతనే సద్గుణవంతుడై వెళ్తాడు. పెళ్లి అయ్యేంత వరకు ఇతనిని తిరిగి రానివ్వరు. ఆడ పెళ్లి వారి తండాలో ఎన్నో జీల ప్రశ్నలకు, తమాషాలకు జవాబు ఇవ్వాలి. ఇతనికి అన్ని రకాల యోగత్య పరీక్షలు అవమానాలు ఉంాయి. వాటన్నింని సమర్థవంతంగా పూర్తి చేయాలి. పెళ్ళి ప్రారంభం నుండి చివరి వరకు పెళ్ళి కుమారునికి తోడుగా ఉండాలి''. ఈ తోడి పెళ్ళి కొడుకును బంజారా భాషలో 'లేరియా' అంారు.

బంజారాల వివాహాలలో ముఖ్యంగా ఐదు కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మాయివారి ఇంో్ల జరిగేవి.

  1. ఘోారో నోక్తా అనగా బెల్లం పానకం తయారు చేసే కార్యక్రమం
  2. వాయారొ నోక్తా అనగా - పెళ్లి కార్యక్రమం
  3. చూడేరొ నోక్తా అనగా - ముత్తైదు కార్యక్రమం
  4. వాయారొ నోక్తా - అనగా
  5. గొటేరొ నోక్తా అనగా - విందు భోజనము
  6. నవలేరిన్‌ ఒళాయేరో నోక్తా అనగా - అప్పగింతలు

పై కార్యక్రమాలన్ని పెళ్లి కూతురి ఇంో్ల జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు మొత్తం మగ పెళ్లి వారు భరిస్తారు. ఈ కార్యక్రమాలు దాదాపు రెండు నెలల వరకు పూర్తి అవుతాయి లేదా 15 రోజులలో కూడా పూర్తి చేసుకుాంరు. ఎవరి ఆర్థిక స్తోమతను బ్టి వారు పై కార్యక్రమాలు నిర్వహిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేంత వరకు పెళ్ళి కొడుకు అమ్మాయి వారి ఇంో్లనే ఉంాడు. ఇతనికి ప్రతిరోజు రెండు పూటల స్నానం, మూడు పూటల భోజనం సంతృప్తిగా వడ్డిస్తారు. ప్రతి రోజు పాలు, పెరుగు, పప్పు, నెయ్యి, ఆకుకూరలు, మాంసము, మత్తు పానీయాలు మొదలగు పౌష్టిక ఆహారాన్ని అందిస్తారు. ఈ కొబ్బరిని నెయ్యిలో నానా ప్టిె అందిస్తారు. బంజారాలు 'రాం, రాం! అనే రెండు సార్లు శ్రీరాముణ్ణి తలచుకొని నమస్కారాలు చేస్తారు''.

బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              ధావళో    -              రాగయుక్తంగా సుఖ, కష్టాలనుచెప్పే ఏడుపు పా

                              గోా        -              పానకం

బంజారా పెళ్ళిలో పానకం (గోా గోళేరో నోకా) చేయు విధం:

సనాతన హిందూ ఆచారంలో, హిందూ పండుగలైన ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలలో జిలకర, బెల్లం, యాలకులు విం సుగంధ ద్రవ్యాలతో పానకం చేసి అఖిలాండకోి బ్రహ్మాండ నాయకుడు, పురుషోత్తముడైన ఆ శ్రీరామునికి నివేదిస్తారు. బంజారాల వివాహాలలో మొదట శ్రీరాముణ్ణి అర్చించి ఈ పానకాన్ని నివేదించిన తర్వాత పెళ్ళి కార్యక్రమాలు చేస్తారు. ''ఈ కార్యక్రమంలో పెండ్లి కొడుకు పెళ్ళి కూతురు ఇదరు వేరు వేరుగా, తమ తరపున ఇంింికి తిరిగి, ఈ రోజు మా పెళ్ళిలో గోలేరో నోక్తా అంటే! పానక కార్యక్రమం ఉన్నది. కావునా అందరూ తప్పకుండా రండి అని పిలుస్తారు. తాండాలోని పెద్ద మనుషులు యువతీ యువకులు, తాండా నాయకులు, చిన్న పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొాంరు. ఆడవారందరూ కలిసి పెళ్ళి కూతురికి ఏడుపుపాట (థావళో) నేర్పిస్తారు. ముత్తెదులందరు కలిసి ఆట పాటలతో పాటు నృత్యం చేస్తారు. తర్వాత అప్పుడే తెచ్చిన కొత్త కుండలలో తాండా వారందరికి సరిపోయే విధంగా బెల్లం పానకాన్ని తయారు చేసి ఇస్తారు రామాయణం విం ఇతిహాసాలలో ఈ పానకం తయారి ప్రాముఖ్యత గురించి చెబుతుంది. పానకం తయారీలో కొత్త బాన అంటే పెద్ద కుండలో రాత్రి వేళ బెల్లం, నీరు, మిరియాలు కొద్దిగా దంచి వేస్తారు. రాత్రంతా నానడం వల్ల మిశ్రమం తయారు అవుతుంది. ఎంతో శక్తిని ఈ పానకం ఇస్తుంది. రుచిగా వుంటుంది. ఈ పానకం సేవింపడం వల్ల ఆరోగ్యంగా వుాంము. బంజారాలలో పెండ్లి నాడు ఏడురోజులు జరిగేది. వేడుక మూడు రోజులపాటు జరుగుతుంది. కాబ్టి పెండ్లికి వచ్చిన వారికి నూతనతేజం శక్తికి ఇది తోడ్పడుతుంది. ఉగాది, శ్రీరామనవమి విం పండుగల్లో దేవ దేవులు సైతం ఈ ఆచారం పాించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

బంజారాలలో పానకాన్ని పెళ్ళి పెద్దలకు ఇచ్చేటప్పుడు పిలిచే పద్ధతి (ఘోాగ్‌ పచార్‌) :

  'ఏనాయక్‌ పవారే లాక్‌, అన్నవారే సవాలక్‌

ఏ నాయక్‌ చందజేరో సోాతి, గస్సన్కాడే ఘోా

పచాస్‌ మాిన్‌ సవాసో లోా వేతుడూ హూబో

అనేతి లో నాయక్‌ మో దలేతీ అని పలకరిస్తారు.

అర్థము:

తాండా నాయక్‌ గారు హూ క్టొిన వారికి లక్ష నమస్కారాలు గుర్తించిన వారికి లక్షన్నర నమస్కారాలు. ఈ ఘోాను తయారు చేయానికి సుగంధ ద్రవ్యాలన్నింని చందనపు రోకలి బండతో సూరి చాలా రుచికరంగా బెల్లం పానకాన్ని తయారు చేసి ఉన్నాడు. గొప్ప మనస్సుతో ఈ పానకాన్ని తాగి, అందరూ ఆశీర్వదించండి అని పలుకుతారు.

బంజారాల నాి వివాహ పద్ధతి ప్రాచీన సంస్కృతిక దర్పణం- ''సగాయి'' నిశ్చితార్థం:

అంతకు మునుపే మనం బంజారాల వివాహ, ఆచార పద్దతుల గురించి తెలుసుకొన్నాము. అబ్బాయికి వరుస అయ్యే అమ్మాయిని చూసి, ఇరువురి తల్లిదండ్రులు, అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చినపుడు ప్రతి మతంలోను, ప్రతి జాతిలోను ''నిశ్చితార్థం'' చేసుకుాంరు. అలాగే బంజారా రాజపుత్రులలో ఇదే ఆచారం వుంది. అబ్బాయి - అమ్మాయిలు ఇరువురు ఇష్టపడినపుడు పెద్దలు వీరికి నిశ్చితార్థం చేస్తారు. దీనిని బంజారా భాషలో 'సగాయి' అంారు. ఈ ప్రక్రియలో భాగంగా మొదట ఆబ్బాయికి వరుస అయ్యే అమ్మాయి కోసం అన్వేషణ చేస్తారు. ఏ 'తండా'లో అయితే తనకు కోడలుగా అమ్మాయి సరిపోతుందో ఆ తండా పెద్ద 'నాయక్‌'కు కబురు పంపుతాడు అబ్బాయి తండ్రి. ఆ తండా 'నాయక్‌'. ఆ తండాలో వుండే అమ్మాయి తండ్రికి కబురు పెడతాడు. అమ్మాయి తండ్రితో కలసి నాయక్‌ అబ్బాయి యొక్క గుణగణాలు తెలుసుకుాంరు. చివరకు ఇరు తండాల 'నాయక్‌'లు అమ్మాయి - అబ్బాయి తల్లిదండ్రులు అంగీకారానికి వచ్చినపుడు, అమ్మాయి వారి తండాకు వెళ్ళి, 'సగాయి' చేస్తారు. నాి బంజారాల నిశ్చితార్థంలో బెల్లం, తాంబూలం ముఖ్యమైనవి. తర్వాత మత్తుపానీయం మేరామ గుడి దగ్గర, లేదా కేంకాళి అంటే పెద్దమ్మతల్లి గుడి ముందర లేదా ఆ తాండాలో ఎక్కడైన గ్రామ పెద్దలను పిలిచి అందరికి సరిపడ బెల్లం, తాంబూలం తెప్పిస్తారు. ఈ బెల్లాన్ని భాగాలుగా చేస్తారు. అందులో మొది భాగం గ్రామదేవతకు, రెండవభాగం, సద్గురు సేవాలాల్‌ మహారాజ్‌ కు తీసిన తర్వాత, బెల్లాన్ని అబ్బాయి తండ్రికి వారి తండా నాయక్‌ కు ఇస్తారు. తర్వాత అబ్బాయి తండ్రికి తర్వాత మిగిలిన వారందరికి నోి తీపి చేయడానికి బెల్లం, తాంబూలం ఇస్తారు. తర్వాత ఇరువురి 'రంగ్‌' అంటే రంగులు చల్లుకొని ఆనందపడి, 'రామ్‌ రామ్‌' అని ఆలింగనం చేసుకుాంరు. తర్వాత ఎవరి స్తోమతను బ్టి విందు చేసుకుాంరు. లక్ష్మీదేవి స్వరూపమైన మీ అమ్మాయిని మా ఇంికి ఇస్తున్నారు కాబ్టి రూపాయి బిళ్ళ ఇచ్చి ఇదిగో లక్ష్మీదేవి అని ఇస్తారు. దీనిని 'సాకెరోరప్యా' అంారు. దీనితో పెళ్ళి ఖరారు అయిపోతుంది.

బంజారా వివాహ వ్యవస్థలో 'వదాయి', 'హవేలి' చేయుట, గోవుల కసువు దిబ్బకు మొక్కుట ఆదిమ సంస్కృతి:

బంజారాల వివాహవ్యవస్థలో మొది ఘట్టం సగాయి అంటే నిశ్చితార్థం తర్వాత పెండ్లి, పెండ్లిలో మొది రోజు బంజారాలలో 'వదాయి' చేస్తారు. అంటే పొట్టేలు కోసి అందులో ఏడు మూలుగలు తీసి ఉప్పు వేయకుండా పసుపు నీిలో ఉడికించి వరునికి ఇస్తారు. సూదిని కాల్చి కుడి భుజంపై మూడు వాతలు పెడతారు. ప్రతి వాతకు ఒక నియమం వుంటుంది. జీవిత పరమార్ధం గురించి చెబుతారు. జీవితం యొక్క విలువలు మరిచిపోకుండా వుండడానికి అలా చేసారేమో మిగిలిన తండా వారందరికీ మాంసాహారం విందు ఇసలారు. ఇది రాత్రివేళలో జరుగుతుంది. ఇప్పి బంజారా వివాహాలలో తప్పకుండా సగాయి, వదాయి వుంది. జగాల కులాలలో వదాయి జరిగేటపుడు కేవలం బెల్లం పొంగలి 'లాప్సీ' చేసి శాఖాహార భోజనం పెడతారు. కాని ఎక్కువ బంజారా కులాలలో మాంసావార ఆచారం వుంది. నాి కాలంలో, అమ్మాయి పెండ్లి కూతురు అయ్యాక తండాలోని ఇంింికి పెళ్ళి తనను ఆశీర్వదించమని కోరేది. తండాలో వుండే దేవుని ఎద్దుపై నవవధువు బల్యా, ఘోగురి, చెవేలాగాంతో, చ్లోా, భూరియా అంటే పెద్ద ముక్కు పుడక వేసి దేవుని ఎద్దు 'సాండ్‌'పై నిలబడి తను ప్టుి పెరిగిన తాండాకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, సోదరులను ఉద్దేశించి ప్రమాణం చేసేది కూడా 'భగత్‌' అనే బంజారా పూజారులతో వివాహం జరిపించుట లేదు.

హిందూ వివాహ వ్యవస్థలో అరుంధతీ నక్షత్ర దర్శనం అపురూపమైన ఘట్టం. దంజారా వివాహ వ్యవస్థలో ఈ అరుంధతీ నక్షత్ర దర్శనంతో పాటు, బంజారాల ప్రత్యేక ఆచారం వుంది. అదే ''గోవుల పేడదిబ్బ'' (కసువుల దిబ్బ)ను మొక్కుట, వధువు ఇంో్ల పెండ్లి అయ్యాక బంజారా 'భగత్‌' అంటే పూజారి వధు, వరులను 'ఆవుల దిబ్బ' అంటే కసువు దిబ్బకు మొక్కిస్తారు. దీని వెనుక పరమార్థం దాగి వుంది. బంజారాల ప్రధాన వృత్తి పశుపోషణ.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              లాప్సి                                    -              బెల్లం పొంగలి

                              సాండ్‌                                    -              పెండ్లి ఎద్దు, దేవుని ఎద్దు

                              భగత్‌                                     -              పూజారి

బంజారా వరుడు వధువు ఇంట్లో 'గోటే పూజ' చేయు విధం:

బంజారా భాషలో పెండ్లి కొడుకును 'వేతడు' అని, పెళ్ళి కుమార్తెను 'నవలేరి' అని అంటారు. బంజారాల వివాహం వధువు ఇంిలో వరుడు 'గోటేరోపూజ' చేయడంతో పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం పెండ్లి చివరలో జరుగుతుంది. వరుని తండ్రి వధువు అంటే 'నవలేరి' వాళ్ళ తండా నాయకుణ్ణి, తండా పెద్దలందరిని పిలుస్తాడు. పెండ్లికుమార్తె వారి తల్లిదండ్రులు, బంధుమిత్రులందరిని పెండ్లి కొడుకు అంటే 'ఏతడు' పిలుస్తారు. గోటేర్‌ పూజ చేయడానికి కావలసిన పోట్టేలు, బియ్యం, రాగిపిండి, మందు మొత్తం పెండ్లి కూమారుడే తీసుకువస్తాడు. అన్నీ సిద్ధం చేసుకొన్న తర్వాత పెండ్లి కుమార్తె ఇంి ముందర ఆవు పేడతో అలుకుతారు, దీనిని బంజారా భాషలో 'చోకోపురేరో' అంారు. దీని మధ్యలో బియ్యంపిండితో ముగ్గు గీస్తారు. పసుపు, కుంకుమలు చల్లి తాంబూలం ప్టిె తమలపాకులో బియ్యం పోస్తారు. పెండ్లి కొడుకు తన వెంట తెచ్చుకున్న పెట్టె లేదా సూికేస్ని ముగ్గుగీసిన చోట పెడుతారు. ఈ పెట్టెకు ''కారి'' ప్టిె దాని కొన చివర నిమ్మకాయను గ్రుచ్భుతారు - 'కారి' అంటే ఖడ్గం, బంజారాలు రాజపుత్రులు కాబ్టి ఆనాి నుండే తమతో ఖడ్గాన్ని ధరించే ఆచారం వచ్చింది. ముందే తమలపాకులో బియ్యం పోసి వున్న దానిలో రూపాయి బిళ్ళ పెడతారు. పెండ్లి కుమార్తె వాళ్ళ తండ్రికి తండ్రి అంటే 'దాద'ను ఆవహనం చేస్తారు. పెండ్లి కుమార్తె వాళ్ళ 'దాద' బ్రతికి వుంటే ''దాద'' వాళ్ళ నాన్నను ఆవాహనం చేసి అయనకు పొట్టేళ్ళను బలి ఇస్తారు. ఆయనకు మందు త్రాగే అలవాటు వుంటే సారాయిని, సిగర్‌ె త్రాగే అలవాటు వుంటే సిగరెట్ను నివేదిస్తారు. పొట్టేలును కోసే ముందు పోట్టేలు 'దడిదడి' ఇవ్వాలి. పెండ్లి కుమార్తె 'దాద'ను ఆవాహనం చేశాక, ఈ పొట్టేలును నిలబ్టెి, స్వీకరించమని వధువు వాళ్ళ దాదాను మొక్కుతారు. పోట్టేలు మొత్తం శరీరాన్ని జలకరిస్తుంది. దీనినే 'దడిదడి' అంటారు. అంటే పితృదేవత అయిన వధువు వాళ్ళ తాత (దాదా) ఈ జంతుబలిని స్వీకరించినట్లు అన్నమాట. తర్వాత పోట్టేలును కోసి, కాలేయం' అంటే 'కోళజో', తల్లి అంటే నేరేడలను కాల్చి కోస్తారు. అలాగే రక్తాన్ని, పోట్టేలు పేగులను వేరు చేసి వీి మిశ్రమంతో ''సోళై'' చేస్తారు. అంతేకాకుండా ఐదు ఎముకలు అంటే ''గొడ్ల హడకలను తీస్తారు. వీితో పాటు జొన్న రొట్టెలను చేస్తారు. సొళై మరియు జొన్న రొట్టెలను బాగా కలుపుతారు. తర్వాత వధువు దాదాను ఆవాహనం చేసి ప్రతిష్ఠించిన కారి' దగ్గర ముగ్గులో నిప్పులను కొద్దిగా పోసి అందులో ఈ సోలోవ్‌ని అగ్గిలో మూడు పిడికెళ్ళు వేసి, సాంబ్రాణి, నెయ్యి పోస్తారు. ముందే చెప్పినట్లు కాలేయం, నేరేడలను కోసి, ఐదు ఎముక మూలుగలను ఆ వధువు 'దాదా' (తాత)కు నివేదిస్తారు. సవదంపతులు సుఖసంతోషాలతో వుండాలని మొక్కుతారు. తండాలోని వధువు బంధుమిత్రులను పిలిచి మాంసాహార విందు చేస్తారు. అందరూ వధు, వరులను దీవించి వెళతారు.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్ధాలు

                              గోటేరో పూజ            -              వధువు ఇంో్ల వరుడు ఇచ్చే విందు

                              ఏతడు     -              వరుడు

                              నవలేరి    -              వధువు

                              దాదా       -              వధువు తండ్రికి తండ్రి

                              గొడ్లహడక               -              ఎముకమూలుగ

                              కోళజో      -              కాలేయం

                              సొళై         -              రక్తం, పొట్ట, ప్రేగులతో చేసిన వంట

                              కారి         -              ఖడ్గం

బంజారాలు 'పురుడు' చేసే కార్యక్రమం ప్రాచీన, ఆర్య నాగరికతకు దర్పణం ఎలా:

వందల సంవత్సరాల మునుపు నుండి నేి వరకు బంజారా స్త్రీ ప్రసవించినతర్వాత వారు తీసుకొనే ఆహారం. పాించే నియమాలు అన్ని కూడా విజ్ఞానశాస్త్రానికి దగ్గర సంబంధాన్ని కల్గి వుండేటట్లు వుాంయి. బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ఎటువిం ఆరోగ్య సూత్రాలను పాించాలి. ఎటువిం ఆహారాన్ని తీసుకోవాలో ఆయుర్వేద వైద్యం తెలిసిన 'మంత్రసాని సహాయంతో తల్లి, బిడ్డలను కాపాడు కుాంరు.

నవమాసాలు నిండిన తర్వాత స్త్రీ ప్టుిింకి చేరుతుంది. బంజారా స్త్రీలు ఎంతో చక్కగ, అందచందాలతో వుండడానికి కారణం 'బాలికలు రసవతి అయిన దగ్గర నుండి పెళ్ళి అయిన తర్వాత బిడ్డలకు జన్మనిచ్చే వరకు ఎటువిం ఆహార నియమాలు పాించాలో నేర్పడమే, అంతేకాక నాి నుండి నేి వరకు తాండాలలో గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా పొలం పనులు, వ్యవసాయపనులు చేస్తారు.

గర్భిణీ స్త్రీకి ఏడవనెల నిండిన తర్వాత నుండి పోషక విలువలు గల ఆహారం తీసుకుంటూ ప్టుిిం దగ్గరే గడుపుతుంది. పురి నొప్పులు రాగానే మంత్రసాని వేడి నీళ్ళ స్నానం చేయిస్తుంది. నొప్పి నుండి మరల్చడానికి హాయిని కల్గించే బంజారా పాటలు పాడుతారు. అయినా మామూలు కాన్పు కాకపోతే కట్టెలబండి, పొడవైనా చక్రాలు గల ఎద్దుల బండిని క్టి అందులో గర్భిణీ స్త్రీని పడుకోబ్టెి అటు ఇటు బండిని త్రిపుతారు. గర్భాశయంలో బిడ్డ అడ్డు తిరగాడని భావించినపుడు వారు ఇలా చేస్తారు.

నేను మా అమ్మమ్మగారి ఇంో్ల పెరిగాను. మా అమ్మమ్మ వందల కాన్పులను చేసింది. ఆమె కాన్పు కాని స్త్రీలకు కాన్పు శాస్త్రీయ ప్రాచీన పద్ధతిలో చేసేది. తమలపాకుల వెనుక స్వచ్చమైన ఆముదము నూనె పూసి, దానిని వేడి చెన పొట్ట చుట్టూ కప్పేది. అలా చేసిన అర్ధగంట నుండి గంటలోపల కాన్పు అయ్యేది. ఇంకా కాకపోతే కట్టెల ఎద్దుల బండిలో ఆ స్త్రీని పడుకోబ్టెి అటు ఇటు తిప్పిన తర్వాత సులభంగా కాన్పు అయ్యేది. అమ్మమ్మ ఇంో్లనే కాన్పులు జరిగేవి. సాయంత్రం పూట, రాత్రిపూట ఎక్కువగా ప్రసవాలు జరిగేవి. మా నేను మా అమ్మమ్మ, తాతగారు, పిన్ని, బాబాయిలు వేరే ఇంో్ల పడుకునేవారు. నేను మాత్రం మా అమ్మమ్మను వదిలి పోయే వాడిని కాదు. ఇంో్ల ఒక మూల నన్ను పడుకోమని చెప్పేది. మా అమ్మమ్మ. నేను దుప్పికి రంధ్రం చేసుకొని కాన్పు అయ్యే వారిని చూసేవాడిని. అప్పుడు చిన్న వయసు కదా భయపడి ఏడ్చేవాడిని. చాలా సంవత్సరాల తర్వాత కాన్పుకు సంబంధించిన సందేహాలను మా అమ్మమ్మను అడిగాను. దగ్గర పట్టణంలో హాస్పిటల్‌ వుంది కదా. ఇంో్ల ఎందుకు కాన్పు చేయాలని అడిగాను. హాస్పిటల్లో సిజేరియన్‌ చేస్తారు. ఓపికగా వేచి చూడరు. మామూలు కాన్పు అయితేనే ఆ స్త్రీ పొలం పనులు చేయగలదని చెప్పింది. అప్ప్లో నాకు అర్థం కాలేదు. .

మామూలు కాన్పు కాకపోతే పొట్ట చుట్టు తమలపాకులను ఆముదం నూనెతో వేడి చేసి ఎందుకు వేస్తారో నేను డిగ్రీ చదివాక అర్థం అయింది. గర్భాశయంలో బిడ్డ చుట్టూ ఉల్బక ద్రవం వుంటుంది. దీనిని వైద్య భాషలో ఆమ్నియాిక్‌ ఫ్లూయిడ్‌ అంారు. అది తక్కువ ఉన్నప్పుడు సాధారణ కాన్పు జరుగదు. అందులోను గర్భాశయం, యోని కండరాలు గ్టిగా వుాంయి. పై విధంగా చేసినపుడు, ఆమ్నియాిక్‌ ఫ్లూయిడ్‌ పెరిగి, గర్భాశయం యోని కండరాలు వదులు అయి కాన్పు సులభంగా జరుగుతుంది. అలా కాన్పు అయిన వెంటనే బిడ్డ నుండి బొడ్డును కత్తిరించి భద్రపరుస్తారు. ఇప్పుడు దీనిని స్టెమ్సెల్‌ మూలకణాలు అంటున్నారు.

బంజారాలలో పురుడు (ధలియా ధోకాయరో) చేసే విధం:

హిందూమత స్త్రీలు పురుడు పోసుకొన్న తర్వాత బిడ్డకు, తల్లికి ఐదు రోజుల వరకు స్నానం చేయించరు. కాని బంజారాలలో ఇందుకు భిన్నంగా ఆచారం వుంది. ప్రసవం అయ్యాక ఆ స్త్రీకి శారీరక నొప్పులు ఎక్కువగా వుాంయి. కనుక వేడి వేడి నీళ్ళతో మూడు పూటలా స్నానం చేయిస్తారు. బెల్లం, తెల్లగడ్డలు ఆవు నెయ్యి కలిపిన అన్నం తినిపిస్తారు. దీని వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. శరీరంలో వుండే కొవ్వును కరిగిస్తుంది. శరీరం సౌష్ఠవంగా తయారవుతుంది. ప్రత్యేకంగా పోషకాలు కల్గిన ఆహారం చేస్తారు. దానిని ''కాడో'' అంారు. ప్టుిన బిడ్డకు మరుసి రోజు నుండి రెండు పూటల స్నానం చేయిస్తారు. తల గుండ్రంగా వుండేటట్లు అదుముతారు. ముక్కును చక్కగా సాగదీసి మంత్రసాని స్నానం చేయిస్తుంది. మరుసి రోజు మాయను తీసిన బొడ్డు తాడును ఇంి బయట దేవర మూలలో గుంతతీసి తులసీ కొమ్మను అందులో వేసి, నీరుపోసి బియ్యం పిండి, నెయ్యి, బెల్లం, మిశ్రమం చేసి ప్రసవించిన స్త్రీ తలపై 'ఛాియా' అనే వస్త్రం కప్పుకొని ఎడమచేతిలో కత్తి పట్టుకొని, తలపై బియ్యం పిండి మిశ్రమాన్ని ఎత్తుకొని, కుడి చేత్తో నీి చెంబును తీసుకొని ముగ్గురు లేదా ఐదుమంది యువకుల సహాయంతో గుంత దగ్గరకు పోయి అందులో పుల్లలపై ప్రత్తితో చేసిన ప్రతిమలను వెలిగిస్తారు. అందులో నీరు, బియ్యంపిండి మిశ్రమం, బొడ్డుతాడు వేసి టెంకాయ క్టొి భూదేవికి పూజ చేస్తారు. దీనిని 'ధలియా ధోకాయరో' అంారు.

పై విధంగా చేయడంలో ఎంతో పరమార్థం దాగి వుంది. తల్లి గర్భాలయం నుండి శిశువు మొదట భూదేవి ఒడిలో చేరుతాడు. పవిత్రమైన మాయను, బొడ్డు తాడును పడవేయకూడదు విజసి వాిని భూదేవి ఒడిలో చేర్చాలని అలా చేస్తారు. అమ్మ భూమాత! తల్లిని, బిడ్డను కలిపే బొడ్డు తాడును నీకు అర్పిస్తున్నాము. ఈ శిశువు పెరుగుతూ పెద్దవాడు అవుతున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు సంభవించిన కాపాడమని ఆరాధిస్తారు. అలాగే బిడ్డను సంరక్షించడానికి జన్మనిచ్చిన తల్లికి భూదేవి అంత సహనం కలగాలని పూజచేస్తారు.

                              బంజారా పదాలు     -              తెలుగు అర్థాలు

                              ఛాియాజి             -              తలపై స్త్రీలు ధరించే ముసుగు

                              ధలియా   -              మొక్కించుట

                              ధోకాయరో               -              అన్నం

బంజారాలలో అంత్యక్రియలు జరిపే విధం - హైందవ సంస్కృతికి ప్రతీక:

మహాభారతంలోని 'భగవద్గీతలోని రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునితో పరంధాముడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు జనన మరణాల గురించి చక్కగా వివరించాడు. మరణం అనేది శరీరానికే వుంది. ఆత్మకు లేదు. మానవ దేహం నశించినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వేరే శరీరాన్ని అన్వేషిస్తుంది. ఎవరు చేసుకున్న పాప, పుణ్యాలను బ్టి పునర్జన్మ లభిస్తుంది అని చెప్పాడు. అంతేకాదు ఈ సృష్టిలో ప్టుిన ప్రతిజీవి మరణించక తప్పదు మరణించిన ప్రతిజీవి పుట్టుక తప్పదు. జీవించి యున్నంతకాలం ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తూ, పరోపకారం, సమాజసేవకై పాటుపడుతూ దయ, కరుణ విం సాత్విక లక్షణాలు కలిగి వుాంరో వారికి తప్పకుండా ఉన్నత జన్మ అయిన మానవజన్మ ప్రాప్తిస్తుందని దేవదేవుడు, పరంధాముడైన శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పాడు.

బంజారా రాజపుత్రులైన నాయకలు మరణించినపుడు హిందూ ఆచారం ప్రకారమే అంతిమ క్రియలను పెద్ద కుమారుని చేత జరిపించినా హిందూ ఆచార వ్యవహారాలు, సంస్కృతికి బంజారా సంస్కృతికి తేడా చాలా కనపడుతుంది. వ్యక్తి మరణించిన తర్వాత చాలా వరకు బంజారాలలో వారి వారి పొలాలలో పూడ్చి పెడతారు. శవాన్ని పూడ్చినరోజు సాయంత్రం వేళ ఊరికి బయట దాయాదులు బంధుమిత్రులు కలసి మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతం కలగాలి అని మేకపోతు లేదా పొట్టేలును బలి ఇచ్చి, 'సొళై' అంటే రక్తం, పొట్ట, ప్రేగులు మూలుగ ఎముక కలిసి చేసిన కూర మరియు జొన్న రొట్టెలు మిశ్రమాన్ని నివేదిస్తారు. అంతేకాక బెల్లం పొంగళిని పెడతారు. దీనితో పాటు ధూమ, సురాపానం, సిగర్‌ె, మందును పెడతారు. తర్వాత చితికి కొరివి, ప్టిెన కుమారునికి, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అందరికి మాంసాహార భోజనం పెడతారు. పెద్దవారైన స్త్రీలు అయినా సరే పై విధంగా చేయాల్సిందే. ఊరికి బయట ఆ సాంప్రదాయం చేయడం అయిపోయాక, చనిపోయిన వారి ఇంిలో చనిపోయిన వ్యక్తి చిత్రపాన్ని ప్టిె, దీపం వెలిగించి మూడు రోజులు దీపం ఆరిపోకుండా జాగ్రత్తపడతారు. ఈ మూడు రోజులు రాత్రంతా భజన పాటలు, గరుడపురాణ పఠనం ద్వారా జాగరణ చేస్తారు. అలా చేయడంలో హిందూ, సనాతన సంస్కృతి దాగివుంది.

భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగంలో మోక్షం, పునర్జన్మ గురించి అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. మానవుడు మరణ సమయంనందు అయిన నన్ను స్మరించుకున్నవాడు నన్ను అంటే దైవత్వాన్ని పొందుతాడు. అని 5వ శ్లోకములో చెప్పాడు. అలాగే వ్యక్తి జీవిత చరమాంకంలో దేని గురించి ఆలోచించి మక్కువ్‌, ఆశ పెంచుకుాండో మరు జన్మలో వాిని అనుభవిస్తాడని 6వ శ్లోకంలో వివరించాడు. మనిషి జీవిత చరమాంకములో మరణానంతరం మూడు రోజుల పాటు అ భగవంతుని కొరకు మనం ఆరాధించినా మరణించిన వ్యక్తి ఆత్మ భగవంతుడైన ఆ పరమాత్మలో ఐక్యమై మోక్షం లభిస్తుందని బంజరాలు ఈ వైదిక ధర్మాన్ని ఆచరిస్తారు. ఇది హైందవ సంస్కృతికి చిహ్నం.

ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక ఇత్తడి పళ్ళెం నిండా అన్నం ప్టిె దానిపై మూత ప్టిె రాత్రంతా అలాగే వుంచుతారు. తెల్లవారు జామున మూత తీసి ఆ అన్నాన్ని పరిశీలిస్తారు. దానిపై ఏ జంతువు గుర్తులు ఏర్పడితే ఆ జంతువు శరీరంలో ఆ వ్యక్తి అత్మ ప్రవేశించినట్లుగా బంజారాలు భావిస్తారు.

ఏ జంతువుల శరీరంలో ఆ ఆత్మ ప్రవేశించుతున్నట్లు ఆనవాలు కనబడకపోతే అప్పుడు మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మలో ఐక్యం అయిందని అర్ధం చేసుకోవాలి. మరి ఏ విధంగా ఇది తెలుసుకోవాలి. ముందే చేస్తారు. మూడవ రోజు రాత్రి అన్నం వండుతారు. దీనిని కంచు పెళ్ళెంలో ప్టిె దానిని గ్టి మూతతో కప్పుతారు. ఆ రోజు రాత్రి అంతా, మరణించిన ఆ బంజారా వ్యక్తి పునర్జన్మ గురించి తెలియజేయమని ఆ భవానికి భజనలు చేసారు. మరుసి రోజు సూర్యోదయం కాకముందే, రాత్రి కంచుపళ్ళెం నిండా అన్నం వేసి దానిపై కప్పిన మూతను తొలగించి చూస్తారు. ఆ అన్నం పై ఏర్పడిన జంతువుల గుర్తులను బ్టి మరణించిన ఆ బంజారా వ్యక్తికి ఏ జంతువు రూపంలో పునరను సంటుందో చూస్తారు. ఒకవేళ అన్నంపై ఎటువిం జంతువులు, పకక్షులు, సర్పాల గుర్తులు లేకపోతే అతనికి పునర్జన్మ వుండదని భావిస్తారు. అతని ఆత్మ పరమాత్మలో ఐక్యమైందని నిర్ధారిస్తారు. కేరళలో ప్రసిద్ధ ఆలయాలలో ఈ అంశాన్ని నేడు చెప్పుతారు. అంతేకాక మనం ముందు అనుకున్నట్లు, శవాన్ని పూడ్చిన తర్వాత, అందరూ మ్టి వేసి వచ్చాక రేగుచెట్టు అంటే బోరేరోజాడున్‌ ప్రదక్షిణగా వచ్చి దాని ఆకును గిల్లి వస్తారు. దీని వెనుక ఒక పురాతన మూఢాచారం దాగి ఉన్నట్లు కర్నూలు జిల్లా కాలేనాయక్‌ తండాకు చెందిన గాంగూ నాయక్‌ అనే వృద్ధుడు వివరించాడు.

ఆధార గ్రంథం:

1. బంజారా సంస్కృతి వైభవం.