headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-4 | Issue-3 | March 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. “కరి నారాయణాచార్య భాగవతార్” యతిరాజభజనకీర్తనలు:
సంగీత సాహిత్యాంశాల విశ్లేషణ

కరి యామినీకృష్ణ

పరిశోధకురాలు, సంగీత & లలిత కళల విభాగం,
శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయం, తిరుపతి
సంగీత బోధకురాలు, ఆర్జీయూకేటీ శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9182860821, Email: kariyaaminikrishna@gmail.com
Download PDF


Keywords: వాగ్గేయకారులు, యతిరాజభజనకీర్తనలు, హరికథ, సంగీతాంశాలు, సాహిత్యాంశాలు, స్వరకల్పన

1. ఉపోద్ఘాతం :   

దక్షిణభారతీయసంగీతంలోని ముఖ్యమైన సంగీతరచనలలో రామనుజకీర్తనలు చాలా అరుదైనవి. సంగీతమూర్తిత్రయం అయిన త్యాగరాజు, శ్యామ శాస్త్రి, ముత్తు స్వామి దీక్షితార్ రాసిన కీర్తనలు రామ భక్తి, కామాక్షి స్తుతి, ఇంకా వివిధ దేవత కీర్తనల సంగ్రహములు.

2. కరినారాయణాచార్య భాగవతార్ (1903-1983)- పరిచయం:

19వ శతాబ్దంలోని వాగ్గేయకారులలో రామనుజకీర్తనలు రచించిన ఒకే ఒక్క వాగ్గేయకారులు శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్. వీరు శ్రీ రామతీర్థ క్షేత్రంలో 1903 లో జన్మించారు.

“శ్రీమాన్ లక్ష్మీ విభుర్దేవః | కరి వంశ సముద్భవం |

నారాయణరాయం రఖేత | రామ తీర్థ నివాసినమ్ ||”

నారాయణాచార్య రామతీర్థక్షేత్రం, విజయనగరం జిల్లా నివాసి. శ్రీరామతీర్థం ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం. చాలా మంది గొప్ప సంస్కృతకవులు, పండితులు, గొప్ప కర్ణాటక సంగీతకారులు ఈ ప్రదేశం నుండి వచ్చారు. రామతీర్థ క్షేత్రంలో దశాబ్దాలుగా కరి వంశస్థులు తమ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు. కరి కుటుంబానికి చెందిన పండితులందరూ రామతీర్థ క్షేత్రంలోని శ్రీ రామచంద్ర భగవానుడి నుండి గొప్ప దైవానుగ్రహాన్ని పొందారు. పండితులు అందరూ రామతీర్థ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తికి సేవ చేసే గొప్ప అవకాశం, రామానుగ్రహం పొందారు.

శ్రీ భాగవతార్ "కరి" వంశానికి ఒక కిరీటం. వీరు విజయనగరం జిల్లాలోని రామతీర్థ క్షేత్రంలో “గాన పండిత్“గా తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా పదవీ విరమణ తరవాత కూడా సింహాచల దేవస్థానంచే “ఆస్థాన విద్వాన్”గా నియమింపబడి తన గాత్రం తో రచనల తో ఎంతో సంగీత సేవ చేసారు . వీరు ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశంలోని అన్ని ఇతర ప్రదేశాలలో అనేక సంగీత కచేరీలు మరియు హరికథా కాలక్షేపం కూడా చేయటం లో సుప్రసిధ్దులు. 1963లో విజయనగరం వాణి  ప్రస్ ద్వారా ఆయన కుమారుడు శ్రీ కన్నసామి ప్రచురించిన “శ్రీమాన్ కరి నారాయణాచార్య భాగవతార్ షష్ట్యబ్దిపూర్తి సంచిక” అనే పత్రికలో  శ్రీ ధనకుధరం వరదాచార్యులు రాసిన వ్యాసంలో ఆయనను “ఆంధ్రరత్న” అని సంబోధించారు.

కరి వారు 1903 జనవరి 23వ తేదీన ఏకాదశి తిథినాడు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని బొబ్బిలి సమీపంలోని రాజయ్యపేటలో జన్మించారు. వీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. వీరి తల్లి తండ్రి  శ్రీ  కందాళ వెంకటేశ్వర్లు మరియు శ్రీమతి కందాళ లక్ష్మీ నరసమ్మ. బొబ్బిలి రాజు. వీరి పూర్వీకులు బొబ్బిలి రాజు వంశానికి ఆధ్యాత్మిక గురువులు.

వీరు సంస్కృత మరియు తెలుగు సాహిత్యం మరియు సంగీతములలో విశే్షమైన వైదుశ్యము కలవారు. నారాయణాచార్య భాగవతార్ విద్యాభ్యాసం విజయనగరంలోని సంస్కృత కళాశాలలో జరిగినది. వీరు ఆ కళాశాళ నుండి “ఉభయ భాషా ప్రవీణులు”. వీరికి చిన్నతనములోనే అధ్యాత్మికగ్రంధములు కూడా అభ్యసించే అవకాశం కలగడంతో వీరు “ఉభయ వేదాంత ప్రవీణులు”గా కూడా ప్రావీణ్యత పొందారు. అప్పటికి కరి నారాయణాచార్య భాగవతార్ వయస్సు కేవలం ఇరవై సంవత్సరములు మాత్రమే.

నారాయణాచార్య అనేక సాహిత్య రచనలు, సంగీతం లో కీర్తనలు చేస్తూనే హరి కధా కాలక్షేపాలు కూడా చెప్పేవారు. వీరు 1952లో “శ్రీయతిరాజ సేవామహిళా మండలి” వారి ద్వితీయ వార్షిక పండిత సభలలో చెప్పిన “గోదా కళ్యాణం” హరికధా కాలక్షేపం ఎంతగానో ప్రజాదరణ పొంది, తరువాత ఎన్నో పండిత సభలలో వీరి హరికథలను ఏర్పాటు చెయ్యటానికి దోహద పడింది.

నారాయణాచార్య పద్యరచనలలో “అమృతాంజన శతకం” కాశినాధుని నాగేశ్వర రావు మన్ననలను పొందినది. వీరి ఇతర రచనలు ఐన “శ్రీరామానుజ గురువరణం” సుధన్వుడు, స్వాహాశశాంకము మున్నగు నాటికలు, అనేక చాతువులు, గేయ ప్రబంధములు, హరికథలు, చాటువులు ఆంధ్రదేశములో విశేషమైన ఖ్యాతి గడించినవి.

అన్ని రచనలకు మించిన ఖ్యాతి గడించినవి, వీరు స్వయంగా రాసి స్వరపరచిన “యతిరాజ భజన కీర్తనలు”. 1949వ సంవత్సరంలో శ్రీ విశిష్తాద్వైత ప్రచారకసంఘం, ద్వారపూడి, తూర్పు గోదావరి జిల్లావారు నిర్వహించిన శ్రీమత్ రామానుజ కీర్తనల రచన మరియు కూర్పు పోటీలలో శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ రాసి స్వర పరచిన “శ్రీ యతిరాజ భజన కీర్తనలు” ప్రధమ బహుమతిని అందుకోవడం విశేషం. పోటీలలో గెలుపొందిన 25 కీర్తనలను శ్రీ విశిష్టాద్వైత ప్రచారక సంఘంవారు 1953 వ సంవత్సరం లో ప్రచురించారు.

2.1 నారాయణాచార్య బిరుదులు:

శ్రీ విశిష్తాద్వైత ప్రచారక సంఘం వారిఆధ్వర్యములో ఆర్తమూరులో నిర్వహించిన యతిరాజాశ్రమోత్సవం లో శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ గారిని “కవితా వతంస” “ గానకళా నిపుణ” అనే బిరుదులతో పండితులు సత్కరించారు. శ్రీ వైష్ణవ పత్రిక రజతోత్సవ సందర్భం లో వీరికి “ హరికధా చతురానన “  బిరుదును పండిత పరిశత్ ప్రధానం చేసారు.

3.యతిరాజ భజన కీర్తనలలోని సంగీత-సాహిత్యాంశాలు :

3.1శ్రీ రామానుజ మునీంద్ర కీర్తన – శ్రీరంజని రాగం-రూపక తాళం–రామానుజ జన్మ విశేషాలు తెలిపే కీర్తన:

(ప్రచురితం : 1951, ఆశ్వయుజ మాసం , భక్తి నివేదన వేదాంత మాస పత్రిక)

పల్లవి :

           , స ససనిని ద మ || మ స ని ద ద మ || , మదానిదా మ గ  || రీ గ రి  గ  స ||

          .  శ్రీ రా . . . . మా .   ||  ను జ  ము నీంద్ర || ,  శ్రితజన  వా .   || త్సల్యసాం.ద్ర||

          ; , స గ రి ని ద ని  || ని స మ మా మ ||  , మగామ ద ని స || సనిరిస  ని ద మ గమ||దని +

         . . చా . రు వ .  క్త్ర  || వి జి  త చంద్ర || ,  సకల    వి బు ధ || ని . త .  సు ధీం . ద్ర . || . . +  || ||శ్రీ||

చరణం :

          , గా,మ ద ద ని || సా సని దనిరీ సా || , సా,స  స  సనిరిస  || ని ద మదనీ దా ||

          . లో,క  హితము|| కో రి .   నీ .  .   వు ||  .  లో.క  ము న.జ.    || నించి నా . . వు   ||

         , దనిదస రి గా  || రీ గ   సా స    || , దరిసనిదా  మ ద   || దనిద మా గమ || దని +

         . శ్రీ . .   క రి నా ||  రాయ ణార్య   || .   సే . .విత    చ ర   || ణాం. బు జా  . .  || .  .  ||  ||శ్రీ||

3.1.1 సంగీత అంశాలు :

  • శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ ఈ కీర్తనను 22వ మేళకర్త ఖరహరప్రియ జన్య రాగం ఐన శ్రీరంజని రాగం లో కూర్చారు.ఈ రాగం కరుణ రస ప్రధానమైనది కనుక సాహిత్యానికి తగిన విధంగా ఎంచుకున్నారని తెలియుచున్నది.
  • ఈ కీర్తన పల్లవి సాహిత్యం లో వాత్సల్య సాంద్ర అనే పదం రామానుజుల వారు, వారి భక్తుల పట్ల సముద్రం అంతటి వాత్సల్యం కలవారు అని సంబోధించుట లో కరుణరస ప్రధానమైన రాగాన్ని కుర్చుటలో సంబంధం తెలియుచున్నది. ఈ సందర్భములో వాగ్గెయకారుల కు సాహిత్యం మరియు సంగీతం లో వున్న నైపుణ్యము తెలియుచున్నది.
  • శ్రీరంజని రాగం లో గాంధారం కంపిత స్వరం అని తెలియచెప్పే సంగతి పల్లవి మొదటి పాదం లో శ్రితజన వాత్సల్య పదము లో “వా” అక్షరం పాడుటలో ఆచార్యుల వారు తెలియ చెప్పారు. అక్కడ “శ్రితజనవా” అను పదానికి “మనిదమ గా” అని స్వర రచన చేసి శ్రీరంజని రాగం లో “గ” కంపిత స్వరం అని తెలియచేసారు.
  • అంతే కాకుండా ప్రతి చరణం మొదటి పదం యొక్క స్వర రచన “గామదాని” అని మొదలు అవుతుంది. అనగా మొదటి చరణం “ శ్రీశునాగ్య” , 2వ చరణం లో ని “ శ్రీ భూత పురమున” మొదలైన పదములన్నింటికి గాంధార గమకముతో నే మొదలవుతున్నాయి. చరణములన్నింటికి ప్రారంభ స్వరము గాంధార గమకమే.
  • ఇక శ్రీరంజని రాగములో అన్ని స్వరములు గ్రహ స్వరములే కనుక కీర్థన యొక్క గ్రహ స్వరము గా వాది స్వరం అయిన తార స్థాయి షడ్జం నే ఎన్నుకున్నారని తెలియుచున్నది.

3.1.2సాహిత్య అంశాలు :

  • ఈ కీర్తన లో శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ గారు వారికి రామానుజుల పట్ల వున్న అపారమైన భక్తి మరియు వాత్సల్యం తెలియచెస్తూ పల్లవి లో శ్రితజన వాత్సల్య సాంద్ర అని రాసారు. రామానుజుల వారికి తన భక్తుల పట్ల సంఉద్రమన్తటి వాత్యల్యం వున్నట్లే వాగ్గెయకారుల వారికి కూదా రామానుజుల పట్ల అంతటి వాత్సల్యం వుంది.
  • ఆ శ్రీమన్నారాయణుడి ఆజ్ఞతో ధర్మసంస్థాపనకై ఆదిశేషుడు, రామానుజులుగా 1017వ సంవత్సరం అవతరించారు అనే విషయం మొదటి చరణంలోని మొదటి పాదంలో “శ్రీశునాగ్య గైకొనియ– శేషుని అంశమున భువిని” అంటూ తెలియచేసారు. ఇక రెండవ పాదంలో రామానుజుల తంద్రి కేశవ సోమయాజి అని, వారి గృహమున జనించినావు అని “కేశవార్యసూరి వరుని- గేహమున జనించితివో” అంటూ తెలియచేసారు.
  • రెండవ చరణంలో రామానుజుల వారి జన్మస్తలం శ్రీ పెరుంబుదూర్ ని భూత పురముగా సంబోధించారు. రామానుజుల అవతరణ భూత పుర వాసులందరి గ్రుహములలో ను శోభను కలిగించిందని, వారంతా ఆనదోత్సాహములతో వున్నరని తెలియచేసారు.
  • మూడవ చరణంలో రామానుజుల తండ్రి కెశవార్యులు అమితానందముతో భాగవతోత్తములను గ్రుహమునకు ఆహ్వానించి, తన పుత్రరోత్సాహము తెలియచేయునట్లుగా వారందరిని ఆదరించెనని నారాయణాచార్యుల వారు తెలియచెప్పారు.
  • ఇక నాల్గవ చరణం వాగ్గేయకారుల ముద్రను సూచిస్తూ, రామనుజుల వారు లోక హితము కోరి జన్మించి, కరి నారాయణాచార్యుల వారికి రామానుజచరణాంబుజులు అయ్యే అవకాశం కల్పించారు అంటూ, వాగ్గేయకార ముద్రను రెండవ పాదంలో “శ్రీ కరి నారాయణార్య“ అంటూ తెలియచేసారు.
  • రామానుజుల వారి జీవిత విశేషాలని చెప్తూ, శ్రీరంజని రాగ లక్షణాలను క్షుణ్ణంగా వినిపించే విధంగా స్వరపరచి, శ్రీ కరి నరాయణాచార్య భ్హాగవతార్ గారు సంగీత సాహిత్య నైపుణ్యం కలిగిన ఆధునిక వాగ్గేయకారులని ఈ కీర్థన ద్వర నిరూపించారు.

3.2. “ ఏ పుణ్యము జేసితినో “- వసంత రాగం- రూపక తాళం :

ప్రచురితం : 1952,శ్రవణ మాసం , భక్తి నివేదన వేదాంత మాస పత్రిక

పల్లవి :

      , సాసనిదా మమ ||  మా,గ మదమద మగరీ ||  , సా,మమా మద ||  సనిదా మామ గమ || దని+

      . ఏ పు  .  .  ణ్యము|| జే .  .   సి .   తి  .  నో .  . ||  . ఎం. బెరు మా . ||  నే . .   దా సు  డా . .|| .   .+  ||ఏ||

అనుపల్లవి :

      , సా సనిదా   మామద ||  గ మ దాసని రి స  || ,  సస సనిదా మమ || సనిదా మగా గమ|| దని +

      . ప్రాపిం  . .   చె గ ,    || దా .    నే .  .   టి కి   ||  .  భవదం. .ఘ్రిస || రో . .   జ సే వ . .  || .  . +  ||ఏ||

చరణం :

      ,  ససామమా మా || మ మ మా,గదమ గ || , గా,మదనిసానీ  ||  దనిదామదనిద మగ  || మ +

      .   స త త ము నీ || ప ద  యు..గ్మ .  ము|| , సంశ్రయిం.చు ||   భా. . .  గ్య   మి . . .   మ్ము . ||  . +

       , ససానిదా  మామద  || గ మ దనిసని గరిసా  ||  , ససానిదా ద మ|| మాసనిదా మమ గమ||దని +

       . యతివర  నా .   .     || రా .   య. ణా . . . ర్య   ||  . నుతచర ణా  .  || క్రుపా. .   భ ర  ణా .|| . .+ ||ఏ||

3.2.1 సంగీత అంశాలు :

  • ఈ కీర్తన సాహిత్యం భక్తి రస ప్రధానం గా రచించి, భక్తి రస ప్రధానమైన వసంత రాగాన్ని ఆచార్యుల వారు ఎన్నుకోవటం విశేషం.
  • 17 వ మేళకర్త సూర్యకాంత రాగ జన్యమైన వసంత రాగం సాయంకాల రాగం. రోజు లో సాయంకాల సమయఓ రావటానికి  ఎదురు చూసినట్టు గా ఇంత కాలానికి నీ సేవా భాగ్యం కలిగింది అంటూ “ ప్రాపించెగదా నేటికి – భవదంఘ్రి సరోజ సేవ “ అని రచించారని నా అభిప్రాయం. కనుక సాయంకాల రాగం అయిన వసంత రాగం లో ఈ కీర్తన  స్వరపరిచారని ఊహించవచ్చు.
  • వసంతరాగంలో దాటు స్వరప్రయోగాలకి వున్న ప్రాముఖ్యత తెలియచేసే విధంగా అనుపల్లవిలో ఉత్తర భాగంలోనూ మరియు ప్రతి చరణం రెన్దవ పాదం లోనూ “సా సనిదామ మనిదమ” అనే ప్రయోగం వచ్ఛేలా సాహిత్యం కూర్చారు ఆచార్యులవారు. “భవదంఘ్రి సరోజ”, “గదా కడు ధన్యురాలా”, సౌభాగ్యమవర్ణ్యమిలను”,”క్రుపాభరణా” అను పదాల స్వరంలో దాటు స్వర ప్రయోగం తెలుస్తుంది.

3.2.2. సాహిత్యాంశాల విశ్లేషణ:

  • ఎంబెరుమానే అనే విశేష పదం ఈ కీర్తన మొత్తానికి అందాన్ని చెకూర్చిందనే చెప్పాలి. ఆచార్యులవారు, వారికి రామానుజులు భగవన్నరాయణుడితో సమానం అని చెప్పడానికి “ఎంబెరుమానే” అంటే “ నా భగవన్తుడా “ అని సంబొధించారు. విశిష్టాద్వైత సిధ్ధాంతం లో మొట్టమొదట గా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన “మణవాళ మామునులు వ్యాఖ్యానం చేసిన “ముముక్షిపడి” గ్రంధం లో “ఆచార్యులు సాక్షాత్ శ్రీమన్నరాయణ స్వరూపులుగా సేవించాలని చెప్పారు. “ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం” అనే రహస్య మన్త్ర వ్యాఖ్యానం ఆ గ్రన్ధం లో చెప్పబడింది. అందుకే ఆచార్యుల వారు “ ఏ పుణ్యము చేసితినో - ఎంబెరుమానే దాసుడ” అంటూ రాసారు.ఈ రచన ద్వారా కరి నారాయణాచార్య భాగవతార్ గారికి అధ్యాత్మిక గ్రంధాల లో వున్న ప్రావీణ్యత తెలుస్తూవుంది.
  • “భవదంఘ్రి సరోజసేవ” అనగా ప్రకాశించే సరోజములవంటి మీ పాదసేవ అని అర్దం.ఈ పదంలో భవత్ అనే సంస్కృతపదం వారి సస్కృతభాషాపటిమను తెలియచేస్తోంది. ప్రకాశించే సరోజములవంటి నీ పదముల సేవ నేటికి ప్రప్తించినది కదా అంటూ రామానుజుల సేవకై వారి ఆత్రుతను తెలియచేసారు.
  • ఇక 2వ చరణంలో, ఆంధ్రదేశంలో ముఖ్యపుణ్యక్షేత్రాలైన శ్రీకూర్మం, సింహాచలం మొదలగునవి దర్శించుకొని, శ్రేష్టమైన ఆదర్శనభాగ్యం  ఇలనంతా ప్రసరింపచేసినావు అని రచించారు, యతిరాజులు పుణ్యతీర్థ సంచారులు కనుక వారి   దర్శన భాగ్యం ఇలలో అందరికీ ప్రసరించే పుణ్యఫలం అని అర్ధం.
  • చివరి చరణం లో వాగ్గేయకార ముద్రను సూచిస్తూ “ నారాయణార్య నుత చరణా క్రుపాభరణా అంటూ రాసారు. ఎల్లప్పుడూ నీ పదయుగ్మ సేవ చేసే భాగ్యం కలిగించమంటూ వేడుకుంటూ చివరి చరణం లో వారి వాగ్గేయకార ముద్ర ను తెలియచేసారు.

4. ముగింపు:

ఇవే కాకుండా ఉదయ రవిచంద్రిక రాగంలో “ లాలి లక్ష్మణ బాల“ అనే రామానుజ లాలి కీర్తన,  ధన్యాసి రాగంలో “జయ జయ కాంతిమతీ కుమారా – జగదోధ్ధారా మంగళం” అంటూ రామానుజ మంగళహారతి కీర్తన ఇలా సందర్భానుసారముగా కరి నారాయణాచార్యుల వారు వివిధ కీర్తనలు విస్తారంగా రాగాలాపన , స్వరకల్పన పాడుతూ సంగీత విద్వాంసులు వారి మనోధర్మ ప్రావీణ్యం చూపిస్తూ పాడే అవకాశం వున్న రాగాల్లో రచించారు. వీరి రచనలన్నీ తరువాతి తరం సంగీతగ్యులకి, సాహిత్య పండితులకి, సంగీత విద్వాంసులకి స్పూర్తిదాయకం. 

5. ఉపయుక్తగ్రంధసూచి:

  1. చినసత్యనారాయణ, నూకల., సికింద్రాబాదు. 2001, రాగలక్షణ సంగ్రహం, చినసత్యనారాయణ, నూకల,శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్, హైదరాబాద్.
  2. శ్రీ విశిష్టాద్వైత ప్రచార సంఘం, విజయవాడ , 1953 , శ్రీ యతిరాజ భజన కీర్తనలు, శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్, శ్రీ సత్యనారాయణా ప్రింటింగ్ వర్క్స్,విజయవాడ.
  3. శ్రీ టి.కె.గోపాలాచార్యులు,1949-53, భక్తి నివేదన – వేదాంత మాస పత్రిక, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజి లిబెర్టీ ప్రెస్స్, తెనాలి .
  4. శ్రీమదుపనిశత్ సిధ్దాంత ఆచార్య పీటం, ద్వితీయ ముద్రణ 2017, యుగపురుషులు శ్రీ రామానుజుల వారి దివ్య చరిత్ర,శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరంగ రామానుజ జీయర్ స్వామీజీ, వి.జి.యస్ బుక్ లిన్క్స్, విజయవాడ.
  5. శ్రీ కరి నారాయణాచార్య భాగవతార్ గారి కుతుమ్బ సభ్యుల ముఖ ముఖి మరియు ఫోన్ ద్వారా నిర్వహించిన సమావేశములు 2020 -2023.
  6. ఆంధ్రభారతీ – అంతర్జాల తెలుగు నిఘంటువు https://andhrabharati.com/dictionary/

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు రాబోవు సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే సంచిక" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Circular
Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]