headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-10 | September 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. ఆగ్నేయ ఆసియాలో భారతీయసంస్కృతి: ప్రాభవం

డా. జి. తిరుమల వాసుదేవరావు

అధ్యాపకుడు, చరిత్ర విభాగము,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(A),
నగరి, చిత్తూరు జిల్లా.
సెల్: +91 9441287342, Email: tirumala.gun@gmail.com
Download PDF


సమర్పణ (D.O.S): 20.08.2024        ఎంపిక (D.O.A): 28.08.2024        ప్రచురణ (D.O.P): 01.09.2024


వ్యాససంగ్రహం:

సుదీర్ఘకాలం సమున్నతంగా విలసిల్లిన భారతీయసంస్కృతిక వైభవానికి సజీవ సాక్ష్యంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వ్యాప్తి నిలుస్తున్నది. ఆగ్నేయ ఆసియా పై భారతీయ ప్రభావం ఆక్రమణ, ఆయుధబలంతో కాకుండా సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలతో జరిగినది. వివిధ కాలాలలో విభిన్న భారతీయ వర్గాలు ఈ బృహత్కార్యాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు ఓర్పు, పట్టుదలలతో నిరాటంకంగా నిర్వహించారు. మహోజ్వలమైన ప్రాచీన భారతీయుల చారిత్రాత్మక కృషిని స్మరించుకోవడానికి చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం. ఆగ్నేయ ఆసియా చరిత్ర, సంస్కృతి మొదలైన అంశాలపై వివిధ ప్రామాణిక పరిశోధన గ్రంథాలు, వివిధ జర్నల్స్ లో ప్రచురితమైన వ్యాసాలను పరిశీలించి ఈ వ్యాసాన్ని రూపొందించడం జరిగింది.ఈ వ్యాసంలో మొదటి భాగంలో. ఆగ్నేయ ఆసియాకు సంబంధించిన వివిధ చారిత్రక మరియు సాంస్కృతిక ప్రస్తావించడం జరిగింది. రెండవ భాగంలో కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ ప్రాంతాలతో భారతదేశానికి గల ప్రత్యేక అనుబంధాన్ని పేర్కొనడం జరిగింది.

Keywords: ఆగ్నేయ ఆసియా, భౌగోళికంగా కీలక స్థానం,ప్రాచీన ప్రపంచం, ప్రపంచీకరణ, సంగమ యుగ, తెలంగి లిపి, అంకర్ వాట్ దేవాలయ,బోరోబుదూర్ ఆలయ, యవ ద్వీప.

1. ఉపోద్ఘాతం:

చైతన్యవంతమైన భారతదేశ సంస్కృతి ఏకాంతంలో ఉంటూ ఎవరి ప్రభావానికి లోను కాకుండా, ఎవరినీ ప్రభావితం చేయకుండా గడిపింది అని భావించడం చారిత్రాత్మక తప్పిదం మరియు చారిత్రక విశ్లేషణలొ జరిగిన పొరపాటు. చారిత్రక దృష్టి కొరవడిన భారతీయులు ఈ చారిత్రక మహాకార్యాన్ని రికార్డు చేయకపోయినా వివిధ చారిత్రక మరియు సాహిత్య ఆధారాల నుండి అపారమైన సమాచారాన్నిమనం ఇప్పటికీ పొందవచ్చు.

2. భౌగోళిక, వాణిజ్య కీలకస్థానం:

సముద్ర వ్యాపారంలో భౌగోళికంగా కీలక స్థానంలో గల భారతదేశ వర్తకులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని, సాహసోపేతమైన యాత్రలు చేసి ఆగ్నేయ ఆసియాతో లాభపాటి వ్యాపారం చేయడమే కాక ఈ ప్రాంత వర్తకానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ చైనా, జపాన్, కొరియా లాంటి ప్రాంతాల వస్తువులను కూడా ఈ ప్రాంతంలో కొని వివిధ దేశాలకు విక్రయించేవారు. బంగాళాఖాతం ప్రాంతంతో భారతీయుల సంబంధాలు బహుముఖమైనవే కాక మరియు సజీవంగా సుదీర్ఘకాలం కొనసాగాయి. ఆగ్నేయ ఆసియా ప్రజలతో భారతీయులు తమ ఆలోచనలను, వస్తువులను మార్పిడి చేసుకున్నారు.

ఆగ్నేయ ఆసియా ప్రాంతం ప్రపంచ పటంలో భౌగోళికంగా కీలక స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల చైనా, భారతదేశంల మధ్య ఈ ప్రాంతం నెలకొని ఉంది.ఆసియా ఖండంలోని దక్షిణ మరియు ఆగ్నేయ ప్రాంతాలలో  ప్రపంచ జనాభా లోని మూడింట ఒక వంతు నివసిస్తున్నారు. ఈ ఆగ్నేయ ఆసియా ప్రాంతం 11 దేశాలలో విస్తరించి ఉంది[2],[3].

ఆగ్నేయ ఆసియా పై భారతీయుల ప్రభావాన్ని పరిశీలించడానికి చరిత్రకారుడు హోరేస్ జాఫ్రీ క్వారిచ్ వేల్స్ తన “గ్రేట్ ఇండియా” అనే గ్రంథంలో ఆగ్నేయ ఆసియా దేశాలను కొన్ని పోలికల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజిస్తూ సిలోన్, బర్మా, సుమత్ర, మలయా లను పశ్చిమ మండలం గాను , జావా, చంపా, సియాం (థాయిలాండ్), కాంబొడియా లను తూర్పు మండలం గాను విభజించారు. 

3. సాంస్కృతిక వ్యాప్తికి దోహదం చేసిన కారకాలు:

చరిత్ర పూర్వపు కాలాల నుండి ఈ ప్రాంతాలతో భారతీయులకు పరిచయం ఉన్న, కొన్ని కారకాలు ఈ సాంస్కృతిక వ్యాప్తిని వేగవంతం చేశాయి. అశోక చక్రవర్తి ప్రోత్సాహంతో పంపబడిన బౌద్ధ మత మిషనరీలు ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో మంచి ఫలితాలను సాధించాయి. ఇవి పరోక్షంగా సాంస్కృతిక సమ్మేళనానికి, వర్తక వాణిజ్య అభివృద్ధికి బాటలు వేశాయి. మౌర్య అశోకుడు మగధ రాజ్య ప్రాబవాన్ని చాటుతూ సాగించిన బౌద్ధ మత ప్రచారం భారతదేశంపై పరిసర ప్రాంతాల లోని దేశాలలో సానుకూల దృక్పథాన్ని ఏర్పరచగా, సముద్ర యాత్ర నిపుణులైన దక్షిణ భారతదేశంలోని తమిళ, తెలుగు వారు, మరియు తూర్పు భారతంలోని ఒరిస్సా, బెంగాల్ ప్రాంతాల వారు ఈ సాంస్కృతిక వ్యాప్తిలో తమదైన ప్రధానాలతో ఆగ్నేయ ఆసియా సంస్కృతిక రంగాన్ని సుసంపన్నవంతం చేశాయి. ఈ విధంగా ఆగ్నేయ ఆసియా పై భారతీయులు బలమైన సాంస్కృతిక ప్రభావాన్ని లోతైన గెట్టి పునాదులతో ఏర్పడింది[4].

మన దేశ తూర్పు తీరంలో ఉన్న తామ్రలిప్తి, దంతపురి, కలింగపట్నం, మోటుపల్లి మొదలుగు నౌకా వ్యాపార స్థావరాలు ఈ విధమైన సాహస వర్తకులతో, వ్యాపారులతో నిండి ఉండేది. మరోవైపున వీటితోపాటు బౌద్ధమత ప్రచారకులు ఈ దేశాలలో మత ప్రచారం చేసి ఆశ్రమాలు నిర్వహించి తమ వ్యక్తిత్వం, మంచితనంతో అక్కడి ప్రజలను ఆకర్షించి బౌద్ధ ధర్మాన్ని వ్యాపింప చేశారు. వీరి ప్రచారం వలన భారతీయ సంస్కృతి ఈ ప్రాంతాలలో వ్యాపించడానికి అవకాశం ఏర్పడింది. ఈ బౌద్ధ సన్యాసులను అనుసరిస్తూ హిందూమత ప్రచారకులు కూడా ఈ కర్తవ్యాన్నికొనసాగించి విజయవంతంగా పూర్తి చేశారు.

మరోవైపున రాజ్యాధికారాన్ని పొందలేని సాహస వీరులు తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ ఆగ్నేయ ఆసియా లో తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పాలించారు ఈ సందర్భంగా భారతదేశం నుండి వలసలు జరిగి ఆ దేశాలలో భారతీయ సంస్కృతి బలపడింది. ఇలా వలస వెళ్లిన భారతీయులు స్థానికులతో కలిసిపోయి ఆ సమాజంలో అంతర్భాగంగా మారారు.

భారతీయ వర్తకులు, ఔత్సాహకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతంతో జరిపిన వర్తక కార్యకలాపాల వలన ప్రాచీన ప్రపంచంలో ప్రపంచీకరణ జరిగి, అనేక నూతన జీవ, వృక్షజాతులు ఈ ప్రాంతాలలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి[5].

ఆగ్నేయ ఆసియా దేశాల రాజకీయ, పాలన, ఆర్థిక, సామాజిక, మత, భాషా మరియు సంస్కృతుల పరిణామక్రమంపై భారతీయుల ప్రభావాన్ని వివిధ కోణాలలో మనం స్పష్టంగా గమనించగలం[6]. పై విధాలుగా ఈ మహోజ్వల కృషిలో వర్తకులు, మత ప్రచారకులు, రాజ్యకాంక్ష గల వీరులు మొదలైన అనేక వర్గాల వారు కీలక భాగస్వామ్యులుగా నిలిచారు. 

4. సాంస్కృతిక వ్యాప్తి కి చారిత్రక ఆధారాలు:

మౌర్యుల కాలంలో సైన్యంలో నౌకా దళాలు ఉన్నట్లు మెగస్తనీస్ తెలియజేశారు. ఇది భారతీయుల విదేశీ వ్యాపార ప్రాధాన్యతను తెలియజేస్తుంది. విదేశీ వ్యాపార ప్రాధాన్యతను గుర్తిస్తూ శాతవాహన రాజులు నౌకాముద్ర గల నాణాలను ముద్రించారు. ఇది భారతీయుల సముద్ర వ్యాపార ఆకాంక్షలను తెలుపుతుంది. పెరిప్లస్ ఆఫ్ ఎరిథేన్ సముద్రం(Periplus of erythaen sea), టాలమీ రచనలు మొదలైన వాటి ద్వారా ఆగ్నేయ ఆసియా తో వ్యాపారం చేసే అనేక భారతీయ నౌకాశ్రయాల గురించి తెలుస్తుంది[7]. చోళులు అతి భారీ నౌకాదళంతో బంగాళాఖాతాన్ని తమ సరస్సుగా చేసుకుని ఆగ్నేయ ఆసియా ప్రాంతాలపై ఆదిపత్యం సంపాదించారు.

బృహత్ కథ, బౌద్ధ జాతక కథలు, జైనుల సమరైచ్చ కథ మొదలైన కథనాలలో కథానాయకులు ప్రధానంగా వ్యాపారులు. వీరు వ్యాపారం ద్వారా సంపన్నులు కావాలని ప్రయత్నిస్తారు[8]. కథాకోశ లో నాగ దత్త అనే వర్తకుడు సువర్ణ ద్వీపం కు 500 నౌకలతో వెళ్లి, సంపదతో తిరిగిరావడానికి వివరిస్తుంది. అదేవిధంగా మిలింద పన్హ, నిద్దేస (Niddesa) మొదలగు రచనలలో కూడా సువర్ణభూమికి సముద్ర ప్రయాణాల ప్రస్తావన ఉంది. 

5. సాంస్కృతిక వ్యాప్తిలో తమిళుల ప్రత్యేక పాత్ర:

ప్రాచీన తమిళ సాహిత్యం సిలోన్, మలయ, కాంబొడియా, చైనా, అరేబియా మొదలగు 17 దేశాలలో తమిళ్ భాష సంస్కృతి వ్యాపించి ఉన్నాయని తెలుపుతుంది. ఇది దక్షిణ భారతదేశం వాసుల సముద్ర వ్యాపార విస్తృతిని సూచిస్తుంది[9]. ప్రాచీన తమిళ సంగమ యుగ కావ్యమైన మణి మేఘాలలో జావా (cavakam)గురించి ప్రస్తావించారు. పట్టినపలై, పెరుంపనాట్రుపాద, మదురైకంచి మొదలైన సంఘం యుగ సాహిత్యాలలో సముద్ర ప్రయాణం గురించి సవివరమైన వివరాలు నమోదై ఉన్నాయి.

ప్రసిద్ధ తమిళ సామెత "యాతుమ్ ఊరే, యావరుమ్ కేళిర్" (Yādhum Ūrē Yāvarum Kēḷir). (ఇది ప్రాచీన సంగమ యుగ తమిళ కవి కనియన్ పుంగుండ్రానార్‌ కు ఆపాదించబడిన పదబంధం), దీనిని "ప్రతి ఊరు నా స్వస్థలమే, అందరూ నా బంధువులే" అని అనువదించవచ్చు. వారి నేపథ్యం లేదా మూలంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ కలుపుకొని పోవడం జరగాలి అని దీని అర్థం. ఈ సామెత విశ్వ మానవ సార్వత్రిక సోదరభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక కాలంలోని గ్లోబలైజేషన్ పద బంధానికి ఇది పునాదిగా చెప్పవచ్చు.

6. సంస్కృతభాషావ్యాప్తి:

ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో సంస్కృత భాష శిష్టుల భాషగాను, శాసనభాషగాను పరిగణించబడింది. “సంస్కృతం” భాషలకు భాషగా (lingua franca) పరిగనించబడేది[10]. ఈ సువిశాలమైన విస్తారమైన ప్రాంతంలోని మేధావులు, భాషా పండితులు తమ ఉన్నత స్థాయి ఆలోచనలను వ్యక్తీకరించడానికి సంస్కృతాన్ని సుదీర్ఘకాలం ఉపయోగించుకున్నారు[11]. ఈ అపారమైన విస్తీర్ణం కలిగిన ఈ ప్రాంతాలలో దాదాపు వెయ్యి సంవత్సరాలు(300 మరియు 1300 CE) సంస్కృతం మేధావి వర్గాల పై తన ఆధిపత్యం చలాయించింది (సంస్కృత కాస్మోపాలిస్)అని షెల్డన్ పొల్లాక్ పేర్కొన్నాడు.

ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని విద్యా బోధనలో వేదాలు, వేదా అంగాలు, రామాయణ, మహాభారతం లాంటి ఇతిహాసాలు, షడ్ దర్శనాలు, శుక్ర నీతి, నారద స్మృతి లాంటి ధర్మశాస్త్రాలు, అష్టాధ్యాయిని, మహాభాష్యం, సుశ్రుత సహిత లాంటి ప్రముఖ భారతీయ గ్రంథాలు స్థానం పొంది ఒక భాగంగా నిలిచాయి. ఆగ్నేయ ఆసియా లో లభించిన శాసనాల లో కాళిదాసు, భారవి లాంటి వారి ప్రస్తావనలు ఉన్నాయి. 

7. భాషా - సాహిత్యాల ప్రభావం:

ఈ ప్రాంతపు భాషలలో భారతీయ భాషా పదాలు పాలు- నీళ్లులా కలిసిపోయి ఉన్నాయి[12]. భారతీయ సాహిత్యం నుండి కథా వస్తువులను స్వీకరించి అనేక కావ్యాలను వీరు రచించారు. బౌద్ధమత సాహిత్యం అయిన జాతక కథలు ఆగ్నేయం ఆసియా ప్రాంతంలో వ్యాపించడమే కాక అనేక స్థానిక కథనాల చేరికతో ప్రాంతీయ తత్వాన్ని పొందాయి[13]. భాషా శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం ఇండో- చైనాలోని ఫోకస్ ప్రాంతంలోని శాసనాల లిపి భారతదేశంలోని కంహరి, బర్మాలోని తెలంగి లిపి అనేక పోలికలు ఉన్నాయి. 

8. భారతీయ సాంస్కృతిక సామ్రాజ్యం:

ఆగ్నేయ ఆసియా పై భారతీయ ప్రభావాన్ని ఆయా ప్రాంతాలలోని ఆర్థిక -సామాజిక రంగాలలోని అభివృద్ధి ద్వారా గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలోని మెదో వికాసంలో భారతీయ ఆలోచన ధోరణి కీలక పాత్ర పోషించింది[14]. భారతీయ ఆలోచనా దోరని లో కలిసిపోయిన ఐరోపా, మధ్య ఆసియా ఆలోచనా స్రవంతులను ఈ ప్రాంతాలకు పరిచయం చేసిన గొప్పతనం భారతీయులకే దక్కుతుంది. అందుకే ఆగ్నేయ ఆసియా పై భారతీయుల ప్రభావాన్ని సాంస్కృతిక సామ్రాజ్యవాదం గా కొందరు చరిత్రకారులు వర్ణిస్తుంటారు.

భారతీయ సంస్కృతి ప్రభావంతో ఈ ప్రాంతంలో కూడా చాతుర్వర్ణ కుల వ్యవస్థ రూపొంది. అయితే ఇది అదృఢమైనది. దక్షణ భారత దేశ సంప్రదాయ ఆచారమైన మేనరికం వివాహాలు కూడా ఈ ప్రాంతంలో ప్రాచుర్యం పొందాయి. అంకర్ వాట్ దేవాలయ శిల్పాలను పరిశీలిస్తే ఈ ప్రాంతం వారి వస్త్రధారణ, అలంకరణ భారతీయుల పద్ధతులలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. బౌద్ధమతం, హిందూమతం ఈ ప్రాంత సంస్కృతిలో ఒక విడదీయరాని భాగంగా మారాయి[15]. అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని, సందేశాన్ని ప్రపంచమంతటా వ్యాపింప చేయడానికి మూడవ బౌద్ధ సంగీతి అనంతరం సువార్తను అందించడానికి జరిగిన ప్రయత్నాల్లో భాగంగా ఉత్తర, సోనా అనే బౌద్ధ భిక్షులను ఆగ్నేయ ఆసియా కు పంపినట్లు తెలుస్తున్నది.

  భారతీయ సంప్రదాయాలను అనుసరించి ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో రాజును దైవంశ సంభూతుడిగా భావించడం ప్రారంభించారు. జావా పాలకుడు ఇలింగుడిని విష్ణువు రూపంగా కీర్తించారు. ఆగ్నేయ ఆసియాలో లభించిన శాసనాలలో అర్థశాస్త్రం, కామందుకు నీతి శాస్త్రం మొదలగు గ్రంథాల ప్రస్తావనలు ఉన్నాయి. భారతీయుల పరిపాలనా నమూనా ల ను వీరు అనుసరించినట్లు మనకు అనేక ఆధారాలు లభిస్తున్నాయి.

9. భారతీయ వాస్తు శిల్ప రీతుల వ్యాప్తి:

భారతీయ శిల్పకళ, వాస్తు రీతులతో ప్రేరణ పొంది తమదైన శైలిలో అద్భుతమైన మనోహర శిల్పాలను నిర్మాణాలను ఆగ్నేయ ఆసియా వాసులు రూపొందించుకున్నారు. సిట్ వెల్ చరిత్రకారుడి అభిప్రాయంలో రాతిపై మానవుని సృజనకు మహోన్నత ప్రతిబింబాలుగా  అంకర్ వాల్ నిర్మాణాలను ప్రస్తుతించాడు[16],[17]. బి .ఎస్ లూనియా అభిప్రాయం ప్రకారం ఈ మహోన్నత నిర్మాణాలు భారతీయ సంస్కృతి నుండి ప్రేరణ పొంది స్వీయ సృజనతో భారతీయ శైలిని ప్రపంచానికి వెల్లడి చేశాయి.

తూర్పు భారతదేశంలోని మధ్యయుగ దేవాలయాలు అయిన కోణార్క్ దేవాలయం మొదలగు గుడులు లోని శిల్పాలు బోరోబుదూర్ మరియు ఆంగ్కోర్ వాట్స్ గోడలపై ప్రతిబింబించాయి[18].

కంబోడియాలోని అంకర్ వాట్ లోని నిర్మాణాలు, జావాలోని బారా బోరూర్ వద్దగల బౌద్ధ మత నిర్మాణాలు, బర్మాలోని పాగంన్  లో నిర్మించిన ఆనంద దేవాలయం భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చిరస్మరణీయంగా ప్రపంచానికి చాటుతున్నాయి. అదే విధంగా పల్లవుల మహాబలిపురం వాస్తు శిల్ప శైలి ప్రభావాన్ని మైసన్-పో- నగల్ లో గల శైవ ఆలయం నిర్మాణంలోనూ, చంపాలోని డంగ్- డూయింగ్ లో గల బౌద్ధ ఆలయ నిర్మాణంలోనూ మనం గమనించగలం. బౌద్ధమతం సాహిత్య, జాతక కథలు ఆగ్నేయం ఆసియా ప్రాంతంలో వ్యాపించడమే కాక అనేక స్థానిక కథనాల చేరికతో ప్రాంతీయ తత్వాన్ని పొందాయి[19]. 

10. ఆచార వ్యవహారాల వ్యాప్తి:

భారతీయ ఇతిహాసమైన రామాయణం ఆగ్నేయ ఆసియా ప్రాంతాలలో ప్రాంతీయ సంప్రదాయాలను పునికి పుచ్చుకొని ఈ ప్రాంతం వారి సంస్కృతిలో ఒక విడదీయరాని భాగంగా మారింది[20].ఆగ్నేయ ఆసియా దేశాలలో  ఆహారపు అలవాట్లు భారతీయ సంస్కృతి చేత ప్రభావితం కాబడ్డాయి. ఉదాహరణకు, “నాసి తుంపెంగ్ కునింగ్”- అనే వంటకాన్ని పండగలు పర్వదినాల సందర్భంగా ఉడికించిన బియ్యం తో హిందువుల పవిత్ర చిహ్నమైన ‘మెరు” పర్వతం ఆకారాన్ని రూపొందించి, పసుపుతో అలంకరించి భుజిస్తారు[21]. అంతేకాకుండా సౌభాగ్యానికి, సంపదకు  అదిపతి గా భావించే భారతీయ దేవత “దేవి శ్రీ” కి ప్రతిరూపంగా బియ్యాన్ని భావిస్తారు[22].

ఆగ్నేయ ఆసియా లోని బర్మా, మాలయ, ఇండోనేషియా, ఇండో -చైనా మొదలైన ప్రాంతాలను భారతీయులు ప్రాచీన కాలంలో సువర్ణదీపం,సువర్ణభూమి అని పిలిచేవారు. ఈ ప్రాంతాలతో భారతీయులకు క్రీస్తు పూర్వం కాలం నుండి విస్తృతంగా పరిచయాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతాలలో విస్తరించిన భారతీయ సంస్కృతి వ్యాప్తి గురించి రేఖామాత్రంగా పరిశీలిద్దాం.

(అ)ఇండోనేషియా:

పూర్వ కాలం నుండి భారతదేశానికి ఇండోనేషియాతో సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి.వాయు పురాణం, యమద్వీప అనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు, మాల్యద్వీపాన్ని కూడా ప్రస్తావిస్తుంది, ఈ ప్రాంత చారిత్రక భౌగోళిక శాస్త్రంలో అత్యంత నిష్ణాతుడైన సర్ రోలాండ్ బ్రాడ్డెల్, మాల్యద్వీపాన్ని సుమత్రాతో సమ పోల్చాడు. అదేవిధంగా యావద్వీప జావా మరియు సుమత్రాకు ప్రాంతాల పర్యాయపదంగా విషయ నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్యం మరియు సాంస్కృతిక సంబంధాలతో జావా, సుమత్రా, బోర్నియో మరియు బాలి మొదలగు ప్రాంతాలు అనుసంధానించబడి ఉండేవి. క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన తొలి భారతీయ గణేశ విగ్రహం యొక్క పురావస్తు అవశేషాలు పనైటన్ ద్వీపంలోని రాక్సా పర్వతం శిఖరంపై కనుగొనబడ్డాయి. ప్రాచీన కాలాల నుండి ఒరిస్సా తీరప్రాంతాల నుండి ఇండోనేషియాలోని బాలి ప్రాంతానికి బాలి యాత్ర పేరుతో సముద్ర ప్రయాణాలు జరిగేవి[23]. భారతీయులకు ఈ ప్రాంతంతో ప్రాచీన కాలం నుండి ఉన్న పరిచయానికి సాక్ష్యంగా రామాయణంలో జానకిని అన్వేషిస్తున్న రాముడు వానర ప్రముఖులను యవన ద్వీపానికి (జావా) కు పంపుతాడు [24]. జావాద్వీపం బౌద్ధమత విద్యకు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది.

తూర్పు బోర్నియా పాలకుడు మూలవర్మ వేయించిన శాసనాలను ఇండోనేషియా లో మొదటి చారిత్రక ఆధారంగా చరిత్రకారులు భావిస్తుంటారు. అదేవిధంగా సుమత్ర, జావ, బాలి ద్వీపాలలో కూడా భారతీయ సాంస్కృతిక ప్రభావాన్ని మనం స్పష్టంగా గమనించగలం[25],[26]. ఈ ప్రాంతంపై బౌద్ధమత ప్రాబల్యానికి గుర్తుగా సుమత్రాలోని బర బదుర్ లో వెలసిన బౌద్ధ ఆలయాలను చెప్పుకోవచ్చు.

చైనా బౌద్ధ మత తీర్థయాత్రకుడు భారతదేశ యాత్రకు ముందు ఆరు నెలలు సంస్కృత భాష అధ్యయనానికి శ్రీ విజయ సుమిత్ర లో గడిపినట్లు తెలుస్తుంది ఇతని మాటల ప్రకారం వేల సంఖ్యలో బౌద్ధ పండితులు శ్రీ విజయ లో అనేక శాస్త్రాలను అధ్యయనం చేస్తుండేవారు[27].

సుమత్ర ప్రాంత ద్వీప సముదాయాన్ని శైలేంద్ర వంశ రాజులు శ్రీ విజయాన్ని రాజధానిగా చేసుకుని శ్రీ విజయ సామ్రాజ్యాన్ని రూపొందించారు. వీరి పూర్వులు కళింగ ప్రాంత వాసులుగా భావిస్తారు. ఇది రాజ్యం క్రి.సా ఎనిమిదవ శతాబ్దంలో మహోన్నతమైన దశను పొందింది. బాలపుత్ర దేవుడు, చూడామని వర్మ, చంద్రబాను వీరిలో ముఖ్యమైన రాజులు. ఈ సామ్రాజ్య చివరి రోజులలో మలయా లోని  కడారం వీరి రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తమిళ ప్రాంత రాజులతో వీరికి వర్తక సంబంధాలు, వాణిజ్య కార్యకలాపాలు ఉన్నట్లు లెయుడన్ (హలెండ్) లో గల రాగి పలక తెలుపుతుంది.

జావా ప్రాంతంలో క్రీశ మొదటి శతాబ్దం కాలానికి భారతీయ మూలాలు గలవారు రాజ్యాలు స్థాపించుకున్నట్లు తెలుస్తున్నది[28]. పూర్ణ వర్మ తగువ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. బాలి ప్రాంతంలో భారతీయ మూలాలు గల రాజ్యాలు పూర్వకాలం నుండి ఉన్న, జావాను ముస్లింలు ఆక్రమించుకున్నాక అక్కడి భారతీయ సంతతి బాలి ప్రాంతానికి వలస వెళ్లింది. ఈ ప్రాంతాన్ని ఉదయనుడు, ఇలింగుడు మొదలగు భారతీయ మూలాలు కలిగిన రాజులు పరిపాలించినట్లు ఈ ప్రాంత చరిత్ర తెలుపుతున్నది. ఇండోనేషియాలో నృత్యం లోను, అలంకరణలలోను అనేక శిల్పాల తోరణాలలోనూ భారతీయ నాట్య శాస్త్ర ప్రభావాన్ని ఇప్పటికీ స్పష్టంగా మనం గమనించవచ్చును[29].

శైలేంద్ర రాజవంశం రాజులు ప్రపంచంలోనే అతి పెద్ద బౌద్ధ నిర్మాణమైన బోరోబుదూర్ దేవాలయం నిర్మించారు. ఈ నిర్మాణంలో భారతదేశం యొక్క శిల్పకళా నమూనా కు జావా కళాకారుల సృజనాత్మక స్వేచ్ఛ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది[30]. బోరోబుదూర్ ఆలయ, పరిసర ప్రాంతాల సమ్మేళనం 1991లో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది[31].

నికోలస్ జోహన్నెస్ క్రోమ్ (డచ్ చరిత్రకారుడు) ప్రకారం ఇండోనేషియా పై భారతీయ సంస్కృతి ప్రభావం బల ప్రయోగం ద్వారానో, రాజ్యాధికారం ద్వారానో జరిగినది కాదు. ఇందులో ఆర్థిక, మతపర అంశాలు ఇమిడి ఉన్నాయి[32].

(ఆ) బర్మా (మయన్మార్):

క్రీస్తు శకం మొదటి శతాబ్దం కాలం నాటికి టకువా పా (Takua pa) నది తీరంలో భారతీయ వలసలు ఉన్నట్లు తెలుస్తున్నది. చైనా యాత్రికుడు కియాటాన్ (KiaTan) ఇండియాను - అన్నం (మయన్మార్) కు భూ మార్గం గురించి వివరించాడు. అదేవిధంగా బర్మా రచనలు అరకాక్ గుండా భారతదేశానికి దగ్గరి భూమార్గం గురించి తెలుపుతాయి. టియోంగ్వా రాజ్య రికార్డుల ప్రకారం  కి.శ 132 లో యవ ద్వీప రాజు దేవ వర్మ నుండి తాము బహుమతులు పొందామని వారి రాజు ఆ-టీన్ రికార్డు చేయించారు. మయన్మార్‌లో బౌద్ధమతం విస్తరణను ధ్రువీకరిస్తూ చైనీస్ యాత్రికుడు జువాన్ జాంగ్, ఈ ప్రాంతం శ్రీక్షేత్రం మని ఇది ఒక బౌద్ధ రాజ్యమని రికార్డు చేశాడు.

శ్రీ క్షేత్రం(ఫూ) దిగువ హీరావతి ( బర్మా) మామ్ రాజ్యం ద్వారావతి (సయ్యం) నది పరివాహక ప్రాంతం ల లో రెండు శాసన ఆధారాలు లభించాయి. ఇవి పాకృతం భాషలో ఉన్నాయి. బర్మా లో లభించిన శాసనం ప్లామ్ ఆకు ఆకారంలో బంగారంతో చేయించబడింది. సయ్యం లో లభించిన శాసనం రాతిపై ధర్మ చక్రాన్ని చిత్రీకరించారు ఈ అక్షరాలు పల్లవుల కాలం నాటి లిపులతో పోలి ఉన్నాయి ఆగ్నేయ ఆసియా లభించిన ఈ రెండు శాసనాల కాలం క్రీస్తుశకం ఐదు నుండి ఏడు శతాబ్దాల మధ్య కాలానికి చెందినవిగా భావిస్తున్నారు[33].

ఐరావతి నది తీరంలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో మన్ అనే తెగవారు రాజ్యాన్ని స్థాపించినట్టు తెలుస్తున్నది వీరికి తైలంగ్ లు అనే పేరు కూడా ఉంది. వీరు బౌద్ధ మతాన్ని పాటించేవారు సింహ విక్రం, జయచంద్ర వర్మ మొదలగు వారు వీరిలో ముఖ్యులు [34]. అదేవిధంగా పాగల్ ప్రాంత పాలకులను ఆంధ్ర ప్రాంత శాలంకాయన రాజ్య కుటుంబీకులుగా భావిస్తారు.

బర్మా ప్రాంతాన్ని పరిపాలించిన మామ వంశ రాజులలో అనవృత అని పిలిచే అనిరుద్రుడు ప్రసిద్ధుడు. ఇతని కుమారుడు క్యాజిస్త పాగంన్ లొ ఆనంద దేవాలయాన్ని నిర్మించాడు[35]. మలయ ద్వీపకల్పంలో భారతీయులు  క్రీస్తు శకం ప్రారంభం నాటికి తకువాపా ప్రాంతంలో వలసలు ఏర్పరచుకున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు నిదర్శనంగా అనేక బౌద్ధ, హిందూ దేవాలయాలు విగ్రహాలు ఈ ప్రాంతంలో లభ్యమైనాయి.

(ఇ) కంబోడియా:

కాంబోడియా రాజ్యాన్ని పూర్వకాలం భారతీయులు కంబుజ, కాంబోజ పేర్లతో పిలిచేవారు. చైనా గ్రంథాలలో దీనిని “హ్యూమన్” అని పిలిచేవారు ఇక్కడ అనేకమంది భారతీయ వీరులు రాజ్యాలను స్థాపించి సుదీర్ఘకాలం పాలన సాగించి కాంబోడియా సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారారు[36]. రెండవ సూర్య వర్మ(1113-1145) అంగోకర్ వాట్ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెంది అనేక దేవాలయాలకు విద్యాసంస్థలకు నిలయంగా మారింది[37]. కంబోడియాలు సూర్య వర్మ, జావాతో Airlanga బర్మాతో అనిరుద్ధ గొప్ప రాజులుగా నిలిచారు.
ప్రధానంగా ఇద్దరు రాజులను అంకోర్ కాలంలో కంబోడియా యొక్క సాంస్కృతిక గొప్పతనానికి కారకులుగా గుర్తిస్తూ ఉంటాము.

సూర్యవర్మన్ II (ఆంగ్‌కోర్ వాట్‌ను నిర్మించిన), మరియు జయవర్మన్ VII (అంగ్కోర్ థామ్ యొక్క విస్తరణకు కారకుడు). అంగ్కోర్ వాట్ విష్ణుకు అంకితం చేయబడింది[38]. అంగ్కోర్ యొక్క వారసత్వం కొనసాగింపుగా బోరోబుదూర్, అయుతయ, బగన్ మొదలగు స్థావరాలను పేర్కొనవచ్చును. భౌగోళికంగా హిందూ మహాసముద్ర వాణిజ్య రాకపోకలను, వర్తక సంబంధాలను అర్థం చేసుకోవడానికి అంకోరియన్ నాగరికత దోహదపడుతుంది [39],[40]. 

(ఈ) వియత్నాం (అన్నాం):

మెకాంగ్ నదీ ప్రాంతాలు, వియత్నాం, లావోస్, థాయిలాండ్, బర్మా దేశాలలో విస్తరించి ఉన్నాయి. వియత్నాం (అన్నాం) రాజ్యంలో భారతీయులు పూర్వకాలం చంప అనే వలసరాజ్యం స్థాపించారు. భారతీయ వంశాలు ఈ ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించినట్లు తెలుస్తున్నది[41]. ఈ ప్రాంతంలో విస్తృతంగా లభించిన బౌద్ధ హిందూ దేవతామూర్తులు ఈ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక ప్రభావాన్ని చాటుతున్నాయి. ఆగ్నేయస్య సంస్కృతితో భారత సంస్కృతి అంతర్లీనంగా అనుసంధానం చేయడంలో భారతీయులు విశేష ప్రతిభను కనబరిచారు[42],[43],[44],[45].

డాంగ్-డుయాంగ్ యొక్క బుద్ధుడు బుద్ధ దేవాలయం దక్షిణ భారతదేశ అమరావతి శైలిలో రూపొందించబడింది [46]. బెంగాల్ ను పాలరాజులు పరిపాలిస్తున్నప్పుడు మహాయానం క్షీణ రూపమైన తాంత్రిక బౌద్ధం జావా మొదలగు ఆగ్నేయ ఆసియ ప్రాంతాలకు వ్యాపించింది. ఈ ప్రాంతంలో శైవం బౌద్ధ మతాల మధ్య అవగాహన కుదిరింది. బుద్ధున్ని శివుని సోదరుడిగా ఇక్కడి ప్రజలు భావించేవారు.

(ఉ) థాయిలాండ్:

థాయిలాండ్ ను పూర్వకాలంలో సియాం అని పిలిచేవారు.థాయ్‌లాండ్‌లోని “బాన్ డాన్ టా ఫెట్" థాయ్‌లాండ్‌లో తొలి భారతీయీకరణ క్షేత్రంగా గుర్తించబడినది. అదేవిధంగా బౌద్ధ సన్యాసులు థాయిలాండ్ ప్రాంతం చేరి అక్కడ మత ప్రచారం కొనసాగించిన దానికి గుర్తుగా అక్కడ ఒక గోపుర స్తూపం నిర్మించబడింది. దీనిని పాథోమ్ చెడి (సంస్కృతంలో ప్రథమ చైత్యం)  అని పిలుస్తారు. ఈ నిర్మాణపు అవశేషాలు బ్యాంకాక్ పట్టణ పరిసరాలలో ఈనాటికీ నిలిచి ఉన్నాయి.  

(ఊ) మలేషియా:

మలేషియా ప్రాంతంలో భారతీయ వలసలు ప్రాచీనమైనవని ఈ ప్రాంతాలను సందర్శించి చరిత్రకారుడు ఇబ్న్ బట్టూటా తన గ్రంథం రిహ్లా లో ధ్రువీకరించాడు[47]. చోళ  చిహ్నమైన పులి చిత్రాన్ని నేటి ఆధునిక మలేషియా రాజ్య చిహ్నంగా స్వీకరించింది (మలేషియా లోని  కడారం ప్రాంతం ను గెలిచిన రాజేంద్ర చోళుడు “కడారం కొండ” అన్న బిరుదులు ధరించాడు)[48]. కాలానుగుణ మార్పులతో మలేషియా ఇస్లామిక్ దేశంగా మారినా, అనేక హిందూ- బౌద్ధ మత ఆచార సంప్రదాయాలు, విశ్వాసాలు ఇంకా మనుగడ సాగిస్తున్నాయి. ఇంద్రుడి వజ్రాయుధం మలేషియా పాలకుల కవచాలపై అలంకరించబడి ఉంది. మలేషియా మత విశ్వాసాలలో అనేక హిందూ, బౌద్ధ మత దేవతలు భాగంగా ఉన్నారు[49].

మలేషియా ప్రాంతంతో భారతీయ వర్తకులు క్రీస్తు పూర్వం కాలం నుండి వర్తక సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని లాటిన్, చైనీస్ ఆధారాలు, నాణేలు, శాసనాలు , సాహిత్య గ్రంథాలు, యాత్ర చరిత్రలు ధ్రువ పరుస్తున్నాయి[50]. లింగోర్ లో బౌద్ధ స్తూపం దాని చుట్టూ ఉన్న దేవాలయాలు మలయా వాసులు బౌద్ధ, హిందూ మతాల అవలంబకులు అని తెలుపుతున్నది. లంగ్ -కియా -సు అనే రాజ్యాన్ని భగదత్తుడు అనే రాజు ఆరవ శతాబ్దంలో పరిపాలించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. అల్బెరుని తన రచనలలో జబాజ్ (Zabaj) ద్వీపాన్ని హిందువులు సువర్ణదీపం (మలేషియా) పిలుస్తారు అని పేర్కొన్నారు[51]. కొంతమంది పండితుల ప్రకారం, పాత ఫిలిపినో మరియు పాత తగలోగ్ స్క్రిప్ట్‌లు కూడా ద్రావిడ మూలాల('వెంగి', 'పల్లవ-గ్రంథ' క్లింగ్=కళింగ) నుండి ఉద్భవించినట్లు అనిపిస్తుంది[52].

11. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక ప్రభావం అంతరించడం:

మధ్యయుగాలలో ఆసియా ఖండమంతటా వ్యాపించిన భారతీయ సంస్కృతి తన ఆధిపత్యాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయింది. ఈ ప్రాంతంపై జరిగిన విదేశీ ఆక్రమణలను నిరోధించడంలో భారతదేశ పాత్ర శూన్యం. తానే స్వయంగా ఆక్రమణదారుల పాలనలో విలవిల లాడుతున్న భారతదేశం తన అనుచరులకు సహాయం చేయలేక పోయింది. స్వాతంత్రం అనంతరం అంతర్గత, బహిర్గత సమస్యలు, అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక ఇబ్బందులతో తన పాత అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి భారత దేశానికి అవకాశం లేకపోయింది.

చైనా ఆక్రమణ తర్వాత మంగోలులు ఆగ్నేయ ఆసియా పై తమ దృష్టిని నిలిపి వరుస దాడులు చేసి తమ ప్రాబల్యాన్ని నెలకొల్పు పోవడంతో ఈ ప్రాంతంలో భారతీయ ప్రభావం అంతరించడం ప్రారంభమైనది. చంపలో 1253, కంబోడియాలో 1330, సుమిత్రాలో 1378 నుండీ సంస్కృత శాసనాలు లభించడం లేదు.

12. ముగింపు:

  • ఈ వ్యాసంలో ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక ప్రభావాన్ని, వ్యాప్తిని పరిశీలించడం జరిగింది. ఆగ్నేయ ఆసియా ప్రాంత దేశాలలో రాజకీయ, పరిపాలన, మతం, భాషా- సాహిత్యాలు, కుటుంబ వ్యవస్థ, వాస్తు నిర్మాణాలు, శిల్పకళ మొదలగు అంశాల పై భారతీయుల ప్రభావాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సాంస్కృతిక వ్యాప్తికి దోహదపడిన కారకాలను వివరించడం జరిగింది.
  • క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నాటికి ఆగ్నేయ ఆసియా ప్రాంతాలపై భారతీయులు తమ ప్రభావాన్ని విస్తృతంగా ప్రసరించారు. ఈ ప్రాంతంలోని సంస్కృతి ,కళలు, బాషా-సాహిత్యం, వాస్తు నిర్మాణాలు మరియు పరిపాలన మొదలగు అన్ని రంగాలలోనూ భారతీయుల కృషిని, ప్రధానలను మనం స్పష్టంగా గమనించగలం మరియు చారిత్రకంగా నిరూపించగలం. 
  •  కాల ప్రవాహంలో ఈ ప్రాంతాలలో అరబ్బులు, అమెరికా, రష్యా, చైనా లాంటి బలమైన దేశాల ప్రభావానికి పోయాయి. ఆగ్నేయ ఆసియాలోని భారతీయ ఆత్మ సుదీర్ఘకాలంగా తన మాతృదేశంతో అనుసంధానత కోల్పోయి బలహీనపడినా, తన అంతర్గత చేతను కోల్పోకుండా వివిధ మార్గాలలో ఈ ప్రాంతంలో తన గత వైభవాన్ని వివిధ రంగాలలో చూపుతున్నది.
  • ఈ వ్యాసంలో ఆగ్నేయ ఆసియా ప్రాంత చారిత్రక, సామాజిక సాంస్కృతిక, భాషా,సాహిత్యం,ఆర్థిక ,మత మరియు వాస్తు కళా నిర్మాణాలపై భారతీయ ప్రభావాన్ని పరిశీలించడం జరిగింది.అయితే స్థలాభావం కారణంగా అనేక అంశాలను రేఖామాత్రంగానే సృజంచడానికి అవకాశం లభించింది. అదేవిధంగా ఆగ్నేయ ఆసియా లోని వివిధ దేశాల వారీగా మరింతగా పరిశీలన చేయవలసిన అవసరం ఉంది.

13. ఉపయుక్తగ్రంథసూచి & పాదసూచికలు:

  1. C. మజుందార్., ఫార్ ఈస్ట్‌లోని పురాతన భారతీయ కాలనీలు. వాల్యూమ్. I. చంపా, పంజాబ్ సంస్కృత బుక్ డిపో, లాహోర్.1927.
  2. వీ-జున్ జీన్ యెంగ్, సోనాల్డే దేశాయ్, మరియు గావిన్ జోన్స్., దక్షిణ ఆసియా మరియు ఆగ్నేయ ఆసియా లో కుటుంబాలు, సాంఘికశాస్త్రం యొక్క వార్షిక సమీక్ష,I. 44,2028, Pp. 469–495.,
  3. ఆగ్నేయ ఆసియా. వికీపీడియా. ttps://en.m.wikipedia.org/wiki/Southeast_Asia.
  4. మోనికా ఎల్. స్మిత్., ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి "భారతీకరణ": ఎర్లీ ఫస్ట్ మిలీనియం E.లో ఆగ్నేయాసియాతో వాణిజ్యం మరియు సాంస్కృతిక పరిచయాలు, జర్నల్ ఆఫ్ ది ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ ఆఫ్ ది ఓరియంట్, వాల్యూమ్. 42, నం. 1 (1999), పేజీలు 1- 26.
  5. సముద్ర సంబంధాలను గుర్తించడం ద్వీపం ఆగ్నేయాసియా మధ్య మరియు హిందూ మహాసముద్రం ప్రపంచం టామ్ హూగర్‌వోర్స్ట్, ది రూట్‌లెడ్జ్ హ్యాండ్‌బుక్ ఆర్కియాలజీ మరియు ప్రపంచీకరణ తమర్ హోడోస్ ఎడిట్ చేసారు, 2017, న్యూయార్క్.
  6. జోహన్నెస్ బ్రోంకోర్స్ట్, ఆగ్నేయాసియాలో సంస్కృతం వ్యాప్తి, పేజీలు.265-275.
  7. మజుందార్, రమేష్ చంద్ర. ప్రాచీన భారతదేశం. మోతీలాల్ బనార్సిదాస్, 2016.
  8. మజుందార్ ఆర్.సి., ఆగ్నేయాసియాలోని ప్రాచీన భారతీయ వలసరాజ్యం, మహారాజా సాయాజీరావు గైక్వాడ్ గౌరవ ఉపన్యాసం, ఓరియంటల్ ఇన్‌స్టిట్యూట్ బరోడా. 1965
  9. కుమారన్., ఆగ్నేయాసియాలో ప్రారంభ తమిళ సంస్కృతి ప్రభావం, సాంఘిక శాస్త్రాలు మరియు మానవీయ శాస్త్రాలపై అంతర్జాతీయ సదస్సు యొక్క కార్యకలాపాలు, యూనివర్సిటీ సెయిన్స్ మలేషియా.2008. పేజీలు.1-10.
  10. జోహన్నెస్ బ్రోంకోర్స్ట్., ఆగ్నేయాసియాలో సంస్కృతం వ్యాప్తి, పేజీలు .263-274.
  11. స్టెఫానీ సీబెన్‌హట్టర్., భాషాశాస్త్రంపై సామాజిక సాంస్కృతిక ప్రభావాలు భౌగోళికం: ఆగ్నేయాసియాలో మతం మరియు భాష, © స్ప్రింగర్ నేచర్ స్విట్జర్లాండ్ AG 2019 పేజీలు. 1-19.
  12. వరదేట్ మేసంకృత్ధారకుల్., ఆగ్నేయాసియాలోని పాళీ, సంస్కృతం మరియు తమిళ పదాలు; థాయ్, లావో, మలేషియా భాషల కేస్ స్టడీ, రెవ. బస్ ఎకాన్ ఇంటిగ్రల్. వాల్యూమ్ 4,2015, పేజీలు. 158-1665.
  13. పీటర్ స్కిల్లింగ్., బౌద్ధమతం మరియు సౌత్-ఈస్ట్ ఆసియా యొక్క బౌద్ధ సాహిత్యం ఎంచుకున్న పత్రాలు, ఫ్రాగిల్ పామ్ లీవ్స్ ఫౌండేషన్, లుంబినీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బ్యాంకాక్.
  14. స్టెఫానీ సీబెన్‌హట్., భాషా భూగోళశాస్త్రంపై సామాజిక సాంస్కృతిక ప్రభావాలు: ఆగ్నేయాసియాలో మతం మరియు భాష, స్ప్రింగర్, నేచర్ స్విట్జర్లాండ్ AG 2019.
  15. స్టీఫెన్ ఎ. మర్ఫీ & లీడమ్ లెఫెర్ట్స్., గ్లోబలైజింగ్ ఇండియన్ రిలిజియన్స్ అండ్ ఆగ్నేయాసియా స్థానికత: 1వ మిలీనియం CE ఆగ్నేయాసియాలో బౌద్ధమతం మరియు బ్రాహ్మణ మతాన్ని స్వీకరించడానికి ప్రోత్సాహకాలు. లండన్ మరియు న్యూయార్క్: రూట్‌లెడ్జ్, , పేజీలు. 768-788.
  16. డర్ర్ ఫిడ్లీ., అంగ్కోర్ వాట్ నుండి ఒక హెడ్, ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ బులెటిన్, అక్టోబర్., 1915, సంపుటం. 10, నం. 10 (అక్టోబర్, 1915), పేజీలు 219-220.
  17. లిండ్సే ఫ్రెంచ్., ఆంగ్కోర్ వాట్ వద్ద విలువ యొక్క సోపానక్రమాలు, ETHNOS, VOL. 64:2 , 1999. పేజీలు. 170-191.
  18. నేతాజీ అభినందన్ మరియు సౌమ్య రంజన్ గహిర్., ఆగ్నేయాసియాతో 'నాగరిక భాగస్వామ్యం' కోసం భారతదేశం యొక్క అన్వేషణ: సందర్భానుసార సంబంధాలు మయన్మార్ మరియు ఇండోనేషియాతో, పొలిటికల్ డిస్కోర్స్ 9(1), జూన్ 2023, పేజీలు 78-87.
  19. పీటర్ స్కిల్లింగ్., బౌద్ధమతం మరియు సౌత్-ఈస్ట్ ఆసియా యొక్క బౌద్ధ సాహిత్యం ఎంచుకున్న పత్రాలు, ఫ్రాగిల్ పామ్ లీవ్స్ ఫౌండేషన్, లుంబినీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, బ్యాంకాక్. 2009)
  20. సింగరవేలు., సంస్కృతం, తమిళం, థాయ్ మరియు మలేయ్ వెర్షన్ల యొక్క తులనాత్మక అధ్యయనం, ఈ ప్రక్రియలో ప్రత్యేక సూచనలతో రామ కథ ప్రత్యేక సూచనతో రాముని కథ ఆగ్నేయ ఆసియా సంస్కరణల్లో సంస్కృతి ప్రక్రియ, XXVII ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఓరియంటలిస్ట్స్, ఆన్ అర్బోర్, మిచిగాన్, ఆగస్ట్ 13-19, 1967కి సమర్పించబడిన పత్రం.
  21. సెర్లీ విజయ., ఇండోనేషియా ఫుడ్ కల్చర్ మ్యాపింగ్: ఎ స్టార్టర్ ఇండోనేషియా పాక పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సహకారం, జర్నల్ ఆఫ్ ఎత్నిక్ ఫుడ్స్ (2019) 6:9 PP. 1-10.
  22. బి. పుటు సుఅంబ., భారతదేశం-ఇండోనేషియా సాంస్కృతిక సంబంధాల ఆవిర్భావానికి వాహనంగా సంస్కృతం, ఇండో-ఇండోనేషియా సాంస్కృతిక సంబంధాల ఆవిర్భావానికి వాహనంగా సంస్కృతం.
  23. మహ్మద్ తహ్సీన్ జమాన్., భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య సామాజిక-సాంస్కృతిక సంబంధాలు, అంతర్జాతీయ సెమినార్ 2015 ప్రొసీడింగ్: ది గోల్డెన్ ట్రయాంగిల్ (ఇండోనేషియా-ఇండియా-టియోంగ్‌కాక్) యూనివర్శిటీ ఆఫ్ వాహిద్ హసిమ్, సెమరాంగ్, ఇండోనేషియా. ఆగష్టు 28-30, 2015, పేపర్ నం. 9, p.56-59.
  24. రాహుల్ దాస్., భారతదేశం వెలుపల భారతీయతను ప్రోత్సహించడంలో హిందూయిజం మరియు బౌద్ధమతం పాత్ర: ఆగ్నేయ ఆసియా దృశ్యాలు, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ -గ్రంథాలయహ్, మే 2020, వాల్యూం 60.69.
  25. దౌడ్ ఎ.తనుదిర్జో.,ఇండోనేషియా పురావస్తు శాస్త్రంలో సైద్ధాంతిక పోకడలు, థియరీ ఇన్ పురావస్తు శాస్త్రం - ప్రపంచ దృష్టికోణం , రూట్లెడ్జ్ , లండన్,1995. PP. 62-76.
  26. గౌతమ్ కుమార్ ఝా., ఇండోనేషియా కళలు మరియు సాహిత్యంలో ఇండిక్ ఎలిమెంట్స్: భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య భాగస్వామ్య వారసత్వం, హెరిటేజ్ ఆఫ్ నుసంతర ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రిలిజియస్ లిటరేచర్ అండ్ హెరిటేజ్, 10(2), 2021, పేజీలు. 166-192.
  27. స్కోటర్‌మాన్., పాత జావానీస్ సంస్కృత నిఘంటువులు మరియు వ్యాకరణాలకు పరిచయం, ఇన్: బిజ్‌డ్రాజెన్ టోట్ డి తాల్-, ల్యాండ్-ఎన్ వోల్కెన్‌కుండే 137 (1981), నం: 4, లైడెన్, పేజీలు 419-442.
  28. నిషామణి కర్., సాంస్కృతిక సమ్మిళిత నాగరికత క్లాష్: డీకోడింగ్ ట్రేడ్ రిలేషన్స్ మధ్య కళింగ మరియు ఆగ్నేయాసియా, కళింగ & ఆగ్నేయాసియా: ది సివిలైజేషనల్ లింకేజెస్, ఉపేంద్ర పాధి (Ed), సరస్వతి కమ్యూనికేషన్, భువనేశ్వర్ పేజీలు..1-17.(2023)
  29. కృష్ణానందయాని, నాట్యశాస్త్ర గ్రంథం మరియు దాని ప్రభావం ఇండోనేషియాలో హిందూ మత కళ, LaD, జర్నల్ ఆఫ్ ఎస్కాటాలజీ, వాల్యూమ్ 1, సంచిక 2, 2024, 79-87.
  30. స్వాతి చెంబుర్కర్., బౌద్ధ మండలాన్ని దృశ్యమానం చేయడం: కేసరియా, బోరోబుదూర్ మరియు టాబో. K R కామా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్, ముంబై , PP.197-211.
  31. టిటిన్ ఫాతిమా., బోరోబుదూర్ ప్రాంతంలో సాంస్కృతిక ప్రకృతి దృశ్యం స్థిరత్వంపై గ్రామీణ పర్యాటక కార్యక్రమాల ప్రభావాలు, ప్రొసెడియా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ 28 (2015 ) 567 – 577.
  32. జరియత్ అబ్దుల్ రాణి., ఇండోనేషియాలో హిందూయిజం మరియు ఇస్లాం చరిత్ర: పాశ్చాత్య దృక్పథంపై సమీక్ష , మకర, సోషియల్ హ్యూమానియోరా, సం. 14, నం. 1, JULI 2010:pp. 51-55.).
  33. పీటర్ స్కిల్లింగ్, ది అడ్వెంట్ ఆఫ్ థెరవాడ బౌద్ధమతం మెయిన్‌ల్యాండ్ సౌత్-ఈస్ట్ ఆసియా, జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బౌద్ధ అధ్యయనాలు, వాల్యూమ్ .20 సంఖ్య .1 వేసవి 1997 పేజీలు..93-108.
  34. నేతాజీ అభినందన్ మరియు సౌమ్య రంజన్ గహీర్‌తో ‘నాగరిక భాగస్వామ్యం’ కోసం భారతదేశం యొక్క అన్వేషణ., ఆగ్నేయాసియా: మయన్మార్ మరియు ఇండోనేషియాతో సందర్భోచిత సంబంధాలను, పొలిటికల్ డిస్కోర్స్ 9(1), జూన్ 2023, పేజీలు 78-87.
  35. డోనాల్డ్ స్టాడ్ట్నర్., ది క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ మౌంగ్‌డాంగ్ సయాదా మరియు ఆనంద దేవాలయం, పాగన్ మరియు మింగున్ పగోడా సంగమం.
  36. ప్రజ్ఞా మిశ్రా., కంబోడియాలోని భారతీయ డయాస్పోరా సాంస్కృతిక చరిత్ర, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ ఇన్వెన్షన్, వాల్యూం 2 సంచిక 12, డిసెంబర్. 2013, PP.67-71.
  37. శ్రీరంజని శ్రీనివాసన్., కంబోడియా, థాయ్‌లాండ్ మరియు ఇండోనేషియా ఆర్కిటెక్చర్‌పై ఇండియన్ ఆర్కిటెక్చర్ ప్రభావాన్ని విశ్లేషించడం, వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ వాల్యూమ్:13, నం:5, 2019.
  38. మిరియం టి. స్టార్క్., టాల్., అంగ్కోర్ వాట్ వద్ద నివాస నమూనా, ANTIQUITY, 89, 348 (2015),1439–1455.
  39. గ్రోవ్స్, J. రాండాల్ (2014) "సౌత్ ఈస్ట్ ఏషియన్ ఐడెంటిటీస్: ది కేస్ ఆఫ్ కంబోడియా," కంపారిటివ్ సివిలైజేషన్స్, మీక్ష: వాల్యూమ్. 70 : నం. 70 , ఆర్టికల్
  40. ఫ్రా రట్చవిమోన్మోలి., సొసైటీ అండ్ కల్చర్ ఆఫ్ కంబోడియా ఇన్ ది ఇంఫ్లూయెన్స్ ఆఫ్ బౌద్ధమతం, టర్కిష్ జర్నల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్, వాల్యూం.12 నం. 8 (2021), pp. 2420-2423.
  41. లే థి లియన్., హిందూ విశ్వాసాలు మరియు దక్షిణ వియత్నాంలో సముద్ర నెట్‌వర్క్ ప్రారంభ సాధారణ యుగంలో, ఇండో-పసిఫిక్ ఆర్కియాలజీ జర్నల్, 39 (2015), పేజీలు. 1-17.
  42. Dinh Duc Tien., హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ ద్వారా ఉత్తర వియత్నాంలో చంపా కల్చరల్ ఇంప్రెషన్స్, రష్యన్ జర్నల్ ఆఫ్ వియత్నామీస్ స్టడీస్. వాల్యూమ్. 6. నం. 3.pp. 46-57.
  43. వాల్డెమార్ మోస్కా., వియత్నాంలో పర్యాటక ఆకర్షణగా చంపా కింగ్‌డమ్ టవర్స్. హిస్టారికల్, జియోగ్రాఫికల్ అండ్ ఆర్కిటెక్చరల్ ఎపెక్ట్స్, జర్నల్ ఆఫ్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ సొసైటీ, 2022, 12(4), pp. 52–64.
  44. డాంగ్ వాన్ థాంగ్., వియత్నాంలో OC EO సంస్కృతిలో శివుడు మరియు విష్ణువుల పరిణామం, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హిస్టరీ మరియు పరిశోధన (IJHR) వాల్యూమ్. 11, సంచిక 2, డిసెంబర్ 2021, 37–50.
  45. ట్రాన్ కై ఫ్రాంగ్., ది ఆర్కిటెక్చర్ పురాతన దేవాలయం-గోపురాలు చంపా (సెంట్రల్ వియత్నాం) అధ్యాయం 6- పేజీలు 155-186.
  46. జీన్ బోయిస్లియర్., ది ఆర్ట్ ఆఫ్ ది ఏన్షియంట్ కింగ్‌డమ్ ఆఫ్ చంపా ఇట్స్ ఒరిజినాలిటీ అండ్ డైవర్సిటీ,స్పాఫా జర్నల్, పేజీలు. 1-10.
  47. రాస్ పవర్, eds, ఇబ్న్ బట్టూటా : ట్రావెల్స్ ఇన్ ఆసియా అండ్ ఆఫ్రికా,pp. 1325-1354.
  48. పునీత శివానందం, కుమరన్ సుబ్రమణియన్., మలయల మధ్య సాంస్కృతిక సమీకరణ మరియు మలేషియాలో భారతీయులు, జర్నల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్, 204-217.
  49. పాటిట్ పబన్ మిశ్రా., ఆగ్నేయాసియాపై భారతదేశం యొక్క హిస్టారికల్ ఇంపాక్ట్, ఆసియా గురించి ఎడ్యుకేషన్, వాల్యూమ్ 26, నంబర్ 1, స్ప్రింగ్ 2021, పేజీలు.1-7.
  50. ప్రేమలత త్యాగరాజన్., మలేషియాలో భారతీయ నృత్య ప్రదర్శన, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ థీసెస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సెప్టెంబర్
  51. సుమిత్ కె. మండల్., మలేషియాలో భారతీయత: జాతి ప్రాతినిధ్యాలు మరియు ప్రసిద్ధ సంగీతం యొక్క సాంస్కృతిక రాజకీయాల మధ్య, ఫిలిప్పీన్ జర్నల్ ఆఫ్ థర్డ్ వరల్డ్ స్టడీస్ 2007 22 (2): 46-67.
  52. హిమాన్సు భూషణ్ సర్కార్., పాత జావానీస్ మరియు సంస్కృత శాసనాలలో దక్షిణ-భారతదేశం, బిజ్‌డ్రాగెన్ టాట్ డి తాల్-, ల్యాండ్-ఎన్ వోల్కెన్‌కుండే 125 (1969), నం: 2, లైడెన్, 193-206.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]