headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-11 | October 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. రామాయణ కల్ప-విషవృక్షాలలో సీతపాత్ర: వ్యత్యాసం

సూర్యపోగు వెంకటేశ్వర్లు

పరిశోధకుడు, తెలుగు శాఖ,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం,
నాగార్జుననగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9100316717, Email: venkateswarluvenky26@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 15.09.2024        ఎంపిక (D.O.A): 30.09.2024        ప్రచురణ (D.O.P): 01.10.2024


వ్యాససంగ్రహం:

చరిత్రలోజరిగిన రాజుల వంశచరిత్ర, నిజసంఘటనని ఇతిహాసం అంటాం. భారతదేశంలో రెండే ఇతిహాసాలు ఉన్నాయి. అవి రామాయణం, మహాభారతం. ఈ వ్యాసంలో కేవలం రామాయణంలో సీతపాత్ర గురించి మాత్రమే రెండు భిన్నకోణాల్లో విశ్లేషించే ప్రయత్నంచేశాను. రామాయణ కల్పవృక్షం, విషవృక్షం కర్తలైన విశ్వనాథ సత్యనారాయణ, రంగనాయకమ్మ చిత్రీకరించిన సీతపాత్రల్లో వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నంలో “రామాయణ కల్పవిషవృక్షంలో సీతపాత్ర – వ్యత్యాసం” అనే శీర్షికను రూపొందించాను. ఈ వ్యాసంలో రామాయణంలో సీతపాత్రనంతనూ స్వీకరించకుండ కేవలంకొన్ని ముఖ్యఘట్టాలలో మాత్రమే వ్యత్యాసాన్ని విశ్ల్లేషించాను. ఈ రెండూ రామాయణాల్లో కొన్నిఘట్టాల్లో మాత్రమే వ్యాసమునకు పరిమితులు. కౌసల్యసీతాదేవి సంవాదం, రామసీతల సంవాదం, లక్ష్మనుడు సీత సంవాదం, రావణ సీతదేవీల సంవాదం అనే కొన్ని ఉపశీర్షికలతో వ్యాసమును భాగాలుగా విభజించుకున్నాను. ఇంతకుమునుపు రామాయణంకల్పవృక్షం: సీత అనే శీర్షికతో డా. యస్. రమాదేవి కమనీయ తెలుగు రామాయణం అనే జాతీయ సదస్సులో పత్రాన్ని సమర్పించగా ఔచిత్యం మాసపత్రికలో నవంబర్ 2023లో ప్రచురణజరిగింది. మరియు విశ్వనాథ రామాయణకల్పవృక్షం, రంగనాయకమ్మ విషవృక్షం గ్రంధాలను ఆధారాలుగా స్వీకరించాను. ఒకేపాత్రను రెండు విభిన్నకోణాల్లో వారి సృజనాత్మకతను ఉపయోగించి తగురీతుల్లో ఈ పాత్రనుప్రతిష్టించారు. కొన్ని ముఖ్య సంఘటనల్లో సీతాదేవి నుంచి వెలువడిన కొన్నిమాటలు కల్పవృక్షంలో శ్రీరాముడిని అనుసరిస్తున్నట్లే చూపించడం జరిగింది. విషవృక్షంలో శ్రీరాముడిని విమర్శిస్తున్నట్లు, సూచనలు ఇస్తున్నట్లు కనబడుతుంది. ఈ రెండు కోణాలని పరిశీలించి, ప్రస్తుత సమాజంలోని పాఠకులకు, సాహితీ ప్రియులకు, సీతాదేవిని గత రచయితలు ఎలాంటి భావవ్యక్తీకరణ శక్తిగా నిర్మించారో తెలపడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా మహిళలు సీతాదేవి స్వభావాన్ని సందర్భానికి అనుసారంగా నడవడే విధి విధానాలను తాము స్వీకరించగలరు అనే ఆకాంక్ష ప్రధానమైనది.

Keywords: విషవృక్షం, కల్పవృక్షం, సంవాదం, సర్గలు,కాండలు,మార్క్సిజం

1.ఉపోద్ఘాతం:

వాల్మీకిరామాయణంలో ఒక్కొక్క కాండము కొన్నిసర్గలుగా విభజింపబడింది. రామాయణ కల్పవృక్షంలో సర్గల వింగడింపు ప్రత్యేకంగా, ఖండాలనే బాగాలుగా ఉంది. ఆయా కథా విశేషాలను సూచించేవిధంగా విశ్వనాథ తన రచనలో ఖండాలకులకు పేర్లు పెట్టాడు. బాలకాండలోని సర్గల పేర్లు – ఇష్టి, అవతార, అహల్య, ధనుస్సు వంటివి. అయోధ్యాకాండలో ఖండాల పేర్లు – అభిషేక, ప్రస్థాన, మునిశాప, పాదుకా, అనసూయ; అరణ్యకాండలో ఖండాల పేర్లు – దశవర్షీ, పంచడటి, మారీచ, జటాయుః, శబరీ; కిష్కింధకాండ ఖండాలు – నూపుర, గజపుష్పీ, నియమపాలన, సమీకరణ, అన్వేషణ; సుందరకాండ ఖండాలు – పరరాత్ర, పూర్వరాత్ర, ఉషః, దివా, సంధ్యా; యుద్ధకాండ ఖండాలు – సంశయ, కుంభకర్ణ, ఇంద్రజిత్, నిస్సంశయ, ఉపసంహరణ. రామాయణ విషవృక్షం గ్రంథం రామాయణంపై మార్క్సిస్టు ధృక్పథంతో రంగనాయకమ్మ వ్రాసిన విమర్శనాత్మక గ్రంథం. రామాయణం భూస్వామ్య సంస్కృతికి ప్రతీక అని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ గ్రంథం వామపక్ష, హేతువాద, మార్క్సిస్టు వర్గాలలో మంచిఆదరణ పొందింది.ఈ గ్రంథం వాల్మీకి రామాయణంపై ఆధారితమైనది. ఇది వాల్మీకిరామయణంలోని కాండాల వరుసక్రమాన్ని యధాతధంగా పాటిస్తుంది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, యుద్ధకాండ, సుందరకాండ, ఉత్తరకాండ. వాల్మీకిరామాయణం ఏడు అధ్యాయాలుగా వెలువడగా, విషవృక్షము మూడు భాగాలుగా వెలువడింది. ఒక్కొక్కభాగము దాదాపు 700 పేజీల పుస్తకము. అదే విధంగా వాల్మీకి రామాయణం 2,400 శ్లోకాలతో కూడుకున్నదైతే, రామయణ విషవృక్షం 16 పెద్ద కథలు, వాటికి అనుబంధంగా 11 వ్యాఖ్యానాలతో, విమర్శకు మద్దతుగా సంస్కృత మూలాన్ని ఉదహరిస్తూ 600 పాదపీఠికలతో కూడిఉన్నది.

విభిన్న కోణాల్లో నడిచిన రామాయణంలో సీతపాత్రను విశ్లేషించి చూద్దాం.

2.1 హనుమంతుడి సీతాభక్తి:

“మాతృదేవీ సమజ్ఞాతీర్థ సుస్నాత వినతాతనూజుండు వేల్పు బువ్వ
కనుగొన్నయట్లుగా గనుగొంటి జానికీదేవి గవేషణాతీర్థ ఫలము
పరమ యాజ్ఞికులు నిర్భర మహా మహాచ్చoదో వతారంబు గాయత్రి తత్వమూర్తి
గనుగొన్నయట్లుగా గనుగొంటి జానికీదేవి శ్రీ రఘురామ ధీపదంబు.
కవిమహర్షి తపోజ్ఞిచే క్రాగి క్రాగి
సర్వతేజో: ఫలంబు రసంబు తుదకు
జూచినట్లుగా చూచితి క్షోణిజాత
జారితార్థంబు జన్మకు సంఘటింప” (కల్పవృక్షం, సుందరకాండ,ఉష: ఖండం,51- 52)

ఆంజనేయుడు సీతాదేవిజాడను కనుగొన్నక్షణంలో వినుతతనయుడు, గాయత్రీదేవి, కవిమహర్షులువలే క్లిష్టతరమైన అంశాలను, ఫలితాలను తానూకనుగొన్నాను అని ఆంజనేయుడు తననుతాను అనుకున్న సందర్భం గమనిస్తే ఆంజనేయుడికి సీతాదేవిపై ఎంతటిమాతృభక్తుందో క్షుణ్ణమవుతుంది. సీతాదేవి సర్వసాధారణస్త్రీ కాదు. ఆదిపరాశక్తి స్వరూపం. అట్టి మహోన్నతమైన స్త్రీ దైవాంశ సంభూతుడైన శ్రీరామచంద్రుడి పతిభక్తిసేవలో ఉండవలసిన సమయంలో ఇలా ఏకాకిలా, ఒంటరిగా తామసి రాక్షసికోరల్లో చిక్కుకున్న చంద్రుడికాంతిలా , కాంతినికోల్పోయిన చంద్రుడిలా శోకముద్రితురాలైన సీతాదేవినిచూసి ఆమె జాడను కనుగొన్న ఆనందం కంటే ఆమె ధీనస్థితిని చూసి తానుకూడా సీతాదేవి వలె శోకంలో మునిగిపోయాడు. ఆంజనేయుడి శోకంలో ఉన్న పరమార్ధాన్ని గమనిస్తే సీతాదేవి సాక్షాత్తు దైవ స్వరూపిణిగా తన మనసులో ముద్రవేసుకున్నాడు. అన్నట్లుగా అవగతం అవుతుంది. కానీ రామాయణ విషవృక్షంలో ఆంజనేయుడు సీతాదేవిని ఒక పరాశక్తిగా కాక ఒక సర్వసాధారణ స్త్రీగా భావించాడు అది “ రాక్షస స్త్రీల మధ్యనున్నసీత భూమికి జారిన నక్షత్రంలా మెరిసిపోతుంది. సీత సమస్త అవయవాలు చూసాడు హనుమంతుడు, గుండ్రని స్థానాలు, నున్నని తొడలు, రమ్యమైన అరికాళ్ళుకూడా చూశాడు. సీతను చూసి ఇలా అనుకున్నాడు. సీతా సౌందర్యరాశి, మహాపతివ్రత పతిదర్శనానికే నిరీక్షిస్తుంది. సరుకులబరువుతో ఓడసముద్రంలో మునిగిపోయినట్టు, పతివియోగంతో సీత దుఃఖసముద్రంలో మునిగిపోయింది. అయ్యో ఇటువంటి భార్యనువిడిచి ఇంతకాలం రాముడు ఎలా ఉండగలిగాడో” (విషవృక్షం,సుందరకాండ,పుట – 406) అంటూ సీతను ఒక కాంతగా మాత్రమే భావించాడు. ఈ తరంలో సీతాదేవిని ఒక ఆదిపరాశక్తిగా భావించే సమాజం ఏర్పడింది. హనుమంతుడిని కూడా దేవుడిగా భావించే సమాజం ఇప్పుడు బలమైనది. సాక్షాత్తు హనుమంతుడే మాతృస్థానంలో ఉన్న సీతాదేవిని అంగాంగం చూసినట్లు, ఇటువంటి స్త్రీని శ్రీరాముడు విడిచి ఇన్ని రోజులు ఎలా ఉండగలిగాడని తనమనసులో ఆంజనేయుడు అనుకున్నాడు. అన్నవిషయాన్ని విషవృక్షంలో రచయిత్రి చెప్పుకొచ్చిన విషయం ఈ సమాజం అంగీకరించలేనిది. అంగీకరించడం కష్టమైనది కూడ.

2.2 కౌసల్యా సీతాదేవిల సంవాదం:

వనవాసంలో తనపుత్రుడైన శ్రీరాముడిని జాగ్రత్తగాచూసుకోమని కౌసల్య సీతాదేవితో ఇలా అంటుంది. ఎన్నడూ నా పుత్రుడిని వీడి ఉండలేదు. తల్లితండ్రులను, రాజ్యాన్నీ, సోదరులను, స్నేహితులనువిడిచి వనవాసం చేయుచున్నాడు. నా బిడ్డను చూసుకునే బాధ్యత నీదే. నా బిడ్డకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పక చూసుకోవాల్సిందే నీవేనని కౌసల్య సీతాదేవికి బాధ్యతలను ఇస్తుంది. దానికి బదులుగా సీతా కౌశల్యతో ఇలా అంటుంది.

నీకొడుకు సాలభుజంబు నేను లతను
నీకొడుకు హొన్నవీణియ నేను తీగ
నీకొడుకు వార్షుకాభ్రంబు నేను మెరుపు
నీకొడుకు సూర్యదేవుండు నేను వెలుగు (కల్పవృక్షం, అయోధ్యకాండ, పుట – 158) 

ఈ మాటల్లో సీతాదేవిపతిభక్తి ఎంతగొప్పదో అర్థమౌతుంది. భార్యాభర్తలమధ్య వుండవలసినవి లౌకికప్రేమతత్వం, అద్వితీయమైన అనురాగం, అద్వైతబంధంవలన సుసంపన్నమైన కుటుంబం. ఈ సుసంపన్న కుటుంబంవలన ఏర్పడే సుస్థిరమైన నిర్భయమైన సమాజం గురించి కదా అందరూ కలలుకనేది. అందరూ కాంక్షించేది. సీతా మాటతీరులో భర్తపైతనకున్న గౌరవం, ప్రేమ, భక్తి కౌసల్యకర్థమై పుత్రుడు దూరమవుతున్నశోఖాన్ని కొంతమేరకు తగ్గించిందని భావింగలము. విషవృక్షంలో సీతభర్తతోపాటు వనవాసానికి సిద్ధమైనసమయంలో భర్తనివీడక పతిభక్తిసేవలో వనవాసానికివెళుతున్న సీతనుచూసి కౌసల్య సంతోషించింది. భార్య, భర్తతోపాటు కలకాలం కలిసి ఉండాలి. కష్టమైనా సుఖమైన. తనకొడుకు శ్రీరాముడు అడవులలో ఎలాంటి కష్టం పడకూడదు. తన కొడుకు రాజ్యంలో ఉన్నట్లే అరణ్యంలో సకలసేవలను సీత వల్ల పొందగలడు. అని కౌసల్య తనలో తానుననుకుని సీతను కనుసైగలతో మాత్రమే ఆశీర్వదించినట్లు చెప్పుకొచ్చారు రంగనాయకమ్మ. దీని ద్వారా ఆ కాలంలో కోడళ్ళు అత్తగారితో సూటిగా మాట్లాడే అధికారాన్నికలిగిలేరు అన్నవిషయాన్ని కొంతవరకు గమనించగలరు. అలాగనీ కోడళ్ళు అత్తగారితో ఎన్నడూ మాట్లాడలేదు అని చెప్పలేము. కౌసల్య సీతలు మాట్లాడే సందర్భంలో దశరధమహరాజు, లక్ష్మణుడు, భరతుడు మొదలైన ప్రముఖులు ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ చొరవతీసుకొని మాట్లాడలేదు. పరపురుషులయందు అంతఃపురరాణులు, యువరాణులు, ఎక్కువ మౌనాన్ని వహించారని అర్థమవుతుంది. దీనికి ఉదాహరణ రామాయణ విషవృక్షంలో వనవాసానికి వెళ్లేసందర్భంలో కౌసల్య సీతాదేవిల మాటలు ఎక్కడ స్పష్టంగా కనిపించలేదు.

2.3 రామ-సీతల సంవాదం:

రావణాసురుడుసీతను హరించే సమయంలో మారీచుడు మాయలేడియైన సందర్భంలో రామసీతా సంవాదం.

విషవృక్షంలో మాయలేడిని చూసిదానిపై ఆశపడిన సీతతనభర్తను ఇలా అడుగుతుంది. “ఆ లేడీ మనఇంట్లో ఉంటే చక్కగా ఎప్పుడూదాంతో ఆడుకుంటూ ఉండవచ్చు. అది చాలా బాగుంది. నా కోసం దాన్ని తీసుకురండి. సీతా! లేడీని పట్టుకోవడం మాటలా? ఇలాకనబడి అలామాయం అవుతుంది. దొరుకుతుందా ప్రాణాలతో? అన్నాడు రాముడు” అదిగో ఆ లేడీ లేచి ఎండలోకి వచ్చింది చూడండి. దాని చర్మం ఎంత కాంతిగా మెరుస్తుందో! నా మనసంతా చర్మం మీదే ఉంది. అది ప్రాణాలతో దొరక్కపోతే చంపేసి అయినా సరే ఆ చర్మం నాకు తెచ్చిపెడితేచాలు ఆ చర్మం మనధర్మాసనం మీదవేసుకొని కూర్చుంటే ఎంతోబాగుంటుంది. నిత్యంమన ఆశ్రమానికివచ్చే ఋషులందరూ దాన్నిచూసి మెచ్చుకుంటారు”. అని నవ్వుతూ అంది సీత” (విషవృక్షం, అరణ్యకాండ, పుట-274,275) మొదట లేడిని ప్రాణాలతో తీసుకురమ్మని అడిగి ప్రాణాలతో తీసుకురావడం కష్టమైనపనని రాముడు బదులివ్వడంతో సీత ప్రశ్నార్థకంగా నిలబడిపోయింది. ఇంత చిన్కోరికకూడా నెరవేర్చలేని పరిస్థితికి తన భర్త వచ్చాడని మనసులో అనుకునీ ఇంతసేపు తీసుకురమ్మని అడిగి ఒక్కసారి వద్దు అంటే ఆ పని తనభర్తకు చేతకాదు అని సీత అనుకుందని రాముడు అనుకోవచ్చు. కనుకనే కనీసం ప్రాణాలతో దొరకకపోతే దాన్ని చంపైన తీసుకురండి. అనడం సీతా తనభర్తపై కొంతవరకు విమర్శాధోరణిని కలిగుందని అర్థమవుతుంది. కానీ రామాయణ కల్పవృక్షంలో రచయిత దీనికి పూర్తిగా భిన్నం. లేడిని చూసి తన భర్తను అడిగి అడగగానే రాముడు పరిగెత్తుకుంటూ తన భార్య కోరికను తీర్చాలి అనే ఆలోచనలతో లేడీకోసం బయలుదేరినట్టు వివరించాడు. కల్పవృక్షం రాముడిని దీరోదాత్తుడిగా మహావీరుడిగా, భార్యకోసం ఏదైనాచేసే గొప్పభర్తగా చూపించడం జరిగింది. కానీ విషవృక్షంలో మాత్రం సీత కోరికను రాముడు తిరస్కరించినట్లు. సీత అది గమనించి రాముడునీ మనసులో విమర్శించుకున్నట్లు సీతయొక్క స్థితి కనిపిస్తుంది. కల్పవృక్షంలో భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. విషవృక్షంలో మాత్రం దానికి విభిన్నంగా ఉంది.

2.4 లక్ష్మణ-సీతా సంవాదం:

రావణాసురుడుసీతను హరించేసమయంలో మారీచుడు మాయలేడియైన సందర్భంలో లక్ష్మణ సీతాదేవిల సంవాదం.

లక్ష్మణా! నువ్వు చూడలేదు గాని అది ఇక్కడ గంతులు వేస్తుంటే మన ఇంటికే అందం వచ్చింది సుమా! అంటూ సంతోషంతో పొంగుతూ లేడీ అందచందాలు వర్ణిస్తూ ఒక్కొక్క మాట రాముడికి, ఒక్క మాట లక్ష్మణుడికి చెప్పింది. ఇద్దరూ దూరంగా ఉండి చూశారు. చెట్ల నీడలో పడుకుందిలేడి. సీత వర్ణనలేవి కనబడలేదు. లక్ష్మణుడు అరటి చెట్టు దగ్గర బోదులు సరిచేస్తూ – “ఏదో ఒక్కసారి ఎండలో చూస్తే అలా అనిపించిందేమో వదిన గారు” అన్నాడు . “కాదు ఒక్కసారి కాదు. చాలాసార్లు చూశాను. అందుకే నిన్ను చప్పున రమ్మని పిలిచాను. ఎంత అందంగా ఉందనుకున్నావు. అంత అందంగా ఉందంటే అదేదో రాక్షసమాయే. రాక్షసులే లేడీరూపాలు ధరించి రాజులు వేటకి వచ్చినప్పుడు దూరదూరంగా తీసుకుపోయి చంపేస్తారు వదిన గారు” సీతకి లక్ష్మణుడిమీద కోపమొచ్చింది “ఏం మాటల లక్ష్మణ? ఎంతెంతో అందమైన పూలని, పక్షుల్ని, జంతువులని చూడడం లేదా మనం. మనుషుల్లో చక్కగా పొందిగ్గా కనుమొక్కుతీరులో ఎంతో అందమైన వాళ్ళు ఉండరూ? అలాగే అది అందమైన తల్లిదండ్రులకు పుట్టి ఉంటుంది” (విషవృక్షం,అరణ్యకాండ, పుట 274) అంటూ రాముడువైపు చూసింది. 

అదే కల్పవృక్షంలో “మాతా రాక్షసులుండున్ లేడీయు భ్రమ” అనే మాటలో విషవృక్షంలో కల్పవృక్షాన్ని అనుసరిస్తున్నట్లు కనిపించింది. ఈ రెండు గ్రంథాలలో లక్ష్మణసీత యొక్క సంవాదము తల్లికొడుకుల మధ్య ఉన్న అనుబంధపు మాటలువలె అనిపిస్తునప్పటికీ రెండింటికీ వ్యత్యాసముంది. కల్పవృక్షంలో లేడీ యొక్క వర్ణనలను లక్ష్మణుడితో సీత ఏమాత్రం వివరించలేదు. కారణం సీతాపరపురుషులతో కొంతమేరకు హద్దులులోపుమాత్రమే సంభాషణలకులోనై వుందని గ్రహించదగ్గ విషయం. విషవృక్షంలో లక్ష్మణ సీత యొక్క మాటల సందర్భాలు చాలా లేకపోలేదు.

2.5 రావణ - సీతాసంవాదం:

రాముడినిమరిచి తనని సేవించమని రావణాసురుడు పలికిన మాటలకి సీతాదేవికి కోపమొచ్చింది. భర్తని సేవించడం భార్య యొక్క ధర్మం. పతివ్రత యొక్క ముఖ్యధర్మం. పాతివృత్యంలోవున్న సీతాదేవి మరొక పురుషులతో మాట్లాడాలంటే హద్దులను ఆలోచించుకుంటుంది. అలాంటిది భర్తను మరిచి మరొక పురుషుడిని సేవించడం అధర్మకార్యం. రావణుడి మాటలకుబదులుగా సీతాదేవి రావణాసురుడితో-

“పతియ జలంబు నేనును ప్రవాహము, రాఘవుడాకసంబు నే
నత మృతుగీతి నింద్రుడగు నాయన నేను హరిస్సు, వేద సం “ (రామాయణ కల్పవృక్షం, యుద్ధకాండ, ఉపసంహరణ 89) అని అంటుంది.

అధముడైన రావణుడుతప్ప ఏ మాత్రం సిగ్గు అభిమానం ఉన్న మగవాడెవడూ ఇట్లా మొహంమీద కొట్టిన విధంగా చెప్పించుకుని కూడా పర స్త్రీ వ్యామోహితుడవడు. మాయ మాటలు చెప్పి మాట వినకపోతే తనని చంపితింటామని చెప్పి బెదరిస్తున్న రాక్షసస్త్రీలతో ప్రళయం ముంచుకొచ్చిన, ఏడు సముద్రాలు ఇంకిపోయిన, సూర్యుడు మాడిమసిగా మిగిలినా, రాముడేనాకు భర్త మరెవరుకాలేరు. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అంటూ తననమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ప్రకటించింది. 

విషవృక్షంలో “సుందరి మా కులాచారం కూడా నువ్వు ఎరగవు. పర స్త్రీ గమనం మా జాతిలో దోషం కాదు. స్త్రీలను బలాత్కారంగా అపహరించి తెచ్చుకోవడం మా జాతి ఆచారం. నీకు నాకు జరిగేది ధర్మబద్ధ వివాహమే రాక్షస వివాహం” దీనికి బదులుగా సీత “ నాకు ఒక్కసారే వివాహం. ఒక పురుషుడే నా భర్త. నువ్వు నన్ను ఎంత కాలం బాధించినా ఈ మాటే చెబుతాను. నువ్వు నీ భార్యలతోనే ప్రీతిగా ఉండు. నన్ను మోహించవద్దు. ధర్మ మార్గాన నడుచుకో. నీ భార్యలను నువ్వు రక్షించుకునే విధంగానే ఇతరుల భార్యలను కూడా రక్షించాలి నువ్వు” (విషవృక్షం యుద్ధ కాండ, పుట 412) అని సీత అంటుంది.

ఈ వాక్యాల ద్వారా సీతాదేవి రావణాసురుడిని కోపంగా కాకుండా తెలివి తక్కువ వాడిగా చూసింది. నీ భార్యలను ఏ విధంగా రక్షించుకుంటావో పరస్త్రీలను కూడా అలాగే రక్షించడం అసలైనధర్మమని హితోపదేశం చేసినతీరులో సీతాదేవి రావణాసురుడిని మంచి మార్గంలోనడిపే స్త్రీమూర్తిగా కనిపించింది. రామాయణ కల్పవృక్షంలో రాముడు యొక్క కీర్తిప్రతిష్టలు మాత్రమే సీతపాత్ర చేసింది. కానీ విషవృక్షంలో సీత రావణాసురుడుని అధర్మాన్ని విడిచి, ధర్మంవైపు నడిపించే మార్గాన్ని సూచిస్తున్నట్లు కనిపిస్తుంది. పర స్త్రీ వ్యామోహంలో తన భార్యలను ఇంకా బాధ పెడుతున్నావు. స్త్రీల యొక్క మనస్తత్వం చాలా మృదువైనది. వారి గురించి కూడా ఒక్కసారి ఆలోచించి వారిని ప్రీతిగా చూడు. అంటూ రావణాసుడు యొక్క భార్యల గురించి కూడా గుర్తు చేసింది సీత.

3. ముగింపు:

  • రామాయణకల్పవృక్షం, విషవృక్షాలలో సీతాదేవిపాత్రను పరిశీలన దృష్టితో చూడడం ప్రధానమైన విషయం. సీతనుశక్తిగా ఒకరు ప్రతిష్టిస్తే మరొకరు సర్వసాధారణ స్త్రీగా మాత్రమే వివరించారు. 
  • ఎవరి రచనలోనైనా వర్ణనలు ఉండడం సర్వసాధారణమైన విషయం. కానీ ఒక పాత్రను వర్ణించే తీరులో ఆ పాత్ర స్వభావాన్ని మూల గ్రంథానికి విభిన్నంగా చిత్రీకరించడం సాహసమే. ఈ రెండు రచనల్లోనూ సీత పాతివృత్యాన్ని వహించింది. 
  • కల్పవృక్షంలోసీత కేవలం రాముడుని అనుసరిస్తున్నట్లు ఉంది. సందర్భానుసారం సీతపాత్రద్వార మౌనంవహిస్తున్నపాత్రలకి, అధర్మంవైపు నడుస్తున్నపాత్రలకి ధర్మోపదేశం చేస్తున్నట్లు రంగనాయకమ్మగారి చిత్రీకరణ. 
  • మార్క్సిజం ప్రభావంవల్లే వాల్మీకి రామాయణానికి విమర్శగా రామాయణ విషవృక్షం రాయడం జరిగిందని ఆమెవాదన. పరపురుషుల యందు మౌనం వహిస్తున్న స్త్రీలను గొంతెత్తి సూటిగా మాట్లాడగలిగే స్థైర్యం, ధైర్యాన్ని విషవృక్షం ప్రతిష్టించింది. పెద్దలను గౌరవించడం భర్త మార్గాన్ని అనుసరించడం అణుకువమాత్రమే స్త్రీ యొక్క లక్షణం అని కల్పవృక్షం తెలుపుతుంది. నిజానికి రెండు సరైనవే. అయ్యలరాజు రామభద్రుడు రామమాభ్యుదయంలో సీతనుతెలుగింటి ఆడపడుచులా సృష్టించాడు. 
  • ఈ రెండు రచనలకు ఆదర్శమనికూడా చెప్పవచ్చు. కారణం సీతపాత్ర యొక్క వైఖరి రామమాభ్యుదయంలో సీతనుపోలి ఉంది. మూలం వాల్మీకి రామాయణమైనప్పటికీ సీతదార్శనీకత ఈ రామాయణంలోనున్న ప్రత్యేకత. తెలివి, అణుకువ, ధర్మం వైపు నడిచే మార్గంలో తెగింపు కూడా సీత పాత్ర నుంచి ఈ సమాజంలోనీ స్త్రీమూర్తులు పాటించదగినవి. అవసరం కూడా ఉంది.

4. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఇందిర,గుమ్మలూరి, (2021) కల్పవృక్షంలో కాంతామణులు–రిమ్ పబ్లికేషన్స్
  2. మందేశ్వరరావు, వడలి (2000) ఇది కల్పవృక్షం అజో-విబో ప్రచురణలు
  3. ముప్పాళ్ళ, రంగనాయకమ్మ (2011) రామాయణ విషవృక్షం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, విజయవాడ
  4. రమాదేవి, ఎస్. (2023-డిశంబర్) రామాయణకల్పవృక్షం:సీత (వ్యాసము), ఔచిత్యమ్ పరిశోధనమాసపత్రిక, Vol.-4, Issue-15, UGC-CARE listed, ISSN:2583-4797,  "కమనీయం తెలుగు రామాయణం" జాతీయసదస్సు ప్రత్యేకసంచిక,  Web-link.
  5. సత్యనారాయణ, విశ్వనాథ (1998) రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ పబ్లికేషన్స్
  6. వాల్మీకి రామాయణం (2010) గీతా ప్రెస్, గోరఖ్పూర్
  7. వ్యాసమహర్షి (2010) అధ్యాత్మ రామాయణం, గీతా ప్రెస్, గోరఖ్పూర్
  8. శ్రీనివాసరావు, ఎల్లంరాజు (1998) రామాయణ రమనీయకము, తిరుపతి దేవస్థానం, చిత్తూరు

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]