headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-9 | August 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. నవీనాంధ్రసాహిత్య యుగకర్త రాయప్రోలు: వివేచన

డా. జొన్నలగడ్డ మార్కండేయులు

F-301, Block-A, హరిహర రెసిడెన్సీ,
ఆంజనేయనగర్, మూసాపేట,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9440219338, Email: hydjmlu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

యప్రోలు సుబ్బరావు మార్చి17, 1892లో జన్మించారు. జూన్30, 1984లో కీర్తిశేషులు అయ్యారు. సుదీర్ఘకాలజీవిత సమయముగ నూతనశకము సాహిత్యయుగకర్తగ చిరస్మరణీయ కీర్తి. విశ్వకవి రవీంద్రుని సాన్నిధ్యము మక్కువ, జాతీయ భావము, ఆంద్రౌన్నత్యము గురించిన ప్రబోధాత్మక శైలిగ రాయప్రోలు, వారసత్వ కవిత్వసంపదగ తెలుగు సాహిత్యముపై ప్రభావితము ఎంతవరకు ప్రయోజనము? తెలుగువారిలో ఆంధ్రోద్యమ జాతీయకవిగ ఈయనకు ఖ్యాతి.? రాయప్రోలు కవితాత్మావేశము నాటి తెలుగుభాష విశేషమైన స్పందన ఈవ్యాస పరిశీలన. జాతీయ కవులలో ప్రధముడై “చావలేదు ఆంధ్రులమహోజ్వలచరిత్ర! హృదయములుచీల్చి చదువుడో సదయులార!” అని తెలుగు కైతను నవ్యమైన భావకవిత్వముగ మార్గమునకు ఈయనే ఆద్యుడను మాట ఎంతవరకు? గురజాడవలె ఆయన సరసన యుగకర్తగ సముచితము అనేది పరిశీలన ఈవ్యాసోద్దేశము.

Keywords: భావకవి, నవ్యసాహిత్యం, యుగకర్త, రాయప్రోలు, మార్కండేయులు

1. అనంతరకవులకు మార్గదర్శిగ భావకవి అనవచ్చా…? కవిత్వ నూతనశకము యుగకర్త:

“క్షీణప్రబంధయుగమునుండి వెఱ్ఱితలలు వేసిన రీతిప్రాధాన్యమునకు శబ్దచిత్ర లౌల్యమునకు నిర్వేల శృంగారమునకు, నీరస సంప్రదాయమునకు విరుగుడుగ రస గుళికలవంటి రమ్య కావ్యములను సృష్టించిన కవి రాయప్రోలు” (ఆధునిక ఆంధ్ర కవిత్వము- 246 పేజి)

సుబ్బారావుగారు 1912నుంచి నవ్య కవిత్వ పోకడలు ప్రారంభించి ఆనాటియువతను ఆకట్టుకున్నారు. లలిత, తృణకంకణము కష్టకమల స్నేహలతాదేవి స్వప్న కుమారము మొదలయినవి తొలిరచనలు నాటి యువత మనస్తత్వమును ప్రతిబింబించాయి. కవితాంజలి సంపుటముగ ఆనాటి యువకుడిగ వెంటవెంటనేవెలువడిన కవితాత్మావేశపు నవ్యకవితా మార్గదర్శకుడిగ యుగకర్త అనిపిస్తున్నారని అనేవారున్నారు. ప్రధముడిగగురజాడ అప్పారావు గారికియుగకర్తగ ప్రథమఖ్యాతి. ఆయినా గురజాడ పోలిక రాయప్రోలు సుబ్బారావుగారుకూడ యుగకర్త. అవుతున్నారు. కాబట్టి ఇద్దరుయుగకర్తలుగ (ఆధునికాంధ్ర కవిత్వము)కాదనరాదన్నది అభిప్రాయమును నారాయణరెడ్డి ఆధునిక ఆంధ్ర కవిత్వములో వెలువరించారు. భావకవిగ మన్నన పరిశీలనాంశము.

కాల్పనిక కవిత్వ ఉద్యమకాలకావ్యము రాయప్రోలువారసత్వముగ స్వేచ్ఛాపూర్వక సంస్కృతి నూతన కవిత్వము యువత కు నచ్చినట్లు ప్రాచీన సాహిత్య పరాయణులు యిష్ట పడలేదని మధునాపంతులవారు (459పేజి ఆంధ్ర రచయితలలో) అభిప్రాయ పడ్డారు. ఇదిఅర్ధసత్యమని నా అభిప్రాయము.లోతైనవిమర్శ జరగాలి.

భారతాది గ్రంథములలో భావము కవిత్వము అయినపుడు భావకవిత్వము అనేపేరు ఆధునికీకరణ కు తగదు. పాశ్చాత్య సాహిత్య విశారదులుగ నవ్యకవితోపాసకులు రాయప్రోలు వారు. నన్నయాదికవులరీతిని సంప్రదాయమూసను కలిగిన అందరినీ భావకవి అనడం, ప్రాచీనసాహిత్య భావుకతకుకొత్తదారిగ అద్దం పట్టారనడం అవగాహన రాహిత్యం. భావకవిత్వము సాహిత్య ప్రక్రియ గ ఆధునికీకరణ స్థిరమైన అర్థము పూర్వ కవుల కవితాత్మావేశ మునకు ప్రతిబింబము కాదు. నూతనమార్గ భావార్థక ముగ ఆధునిక సాహిత్య విశారదులుగ సంప్రదాయ కవిత ఆమోదముద్రగ రాయప్రోలు సుబ్బారావు గారుబాటగ సుగమము తలపులు భావకవికి అర్ధం చెబుతున్నాయి అన్నది నా అభిప్రాయము.

2. సుబ్బారావుగారి పై ఆంగ్లకవిత్వ కాల్పనిక కాలప్రభావము:

ఆంగ్లకవిత్వ కాల్పనిక కవిత్వ ద్యోతకమైన ప్రకృతి ప్రీతి, గతవైభవ పునరుద్ధరణము, ప్రణయతత్వము, ఆత్మాశ్రయ కవిత్వము, అద్భుతత్వము సాహస ప్రియత్వము తెలుగుభాష కవులు ఆదరించారు. భావకవులు గ ఆంగ్ల కవులు ఆధునిక వర్డ్స్ వర్తు షెల్లీ లమనిపించుకోవడం జరిగింది. ప్రారంభదశగ రాయప్రోలు వారుకూడ భావకవిగ ప్రశంసకు తహతహ పడ్డారనిపిస్తుంది. ప్రభావిత మయ్యారుగాని అనుకరణ అవదు. ఆంగ్లకవిత్వ పోకడ ప్రభావితము చేసిన మాట మాత్రం వాస్తవము. కవిత్వతత్వవిచారణ మాత్రము భారతీయత సంప్రదాయ కవిత ఆమోదముద్రగ భావకవి మాట ప్రచారమైంది. కావ్యారంభము కూడ అనగా దైవస్తుతి,కవి ప్రశంసలు నూతనవధవడిలో సాగాయి.

భావకవితా విహాయనమును పరికించినచో రాయప్రోలు, విశ్వనాథ, వెంకటపార్వతీశకవులు, దేవులపల్లికృష్ణశాస్త్రి, దువ్వూరి, బసవరాజు, నండూరి, వేదుల, నాయిని, పింగళి, కాటూరి, జాషువ, తుమ్మల, తల్లావజ్ఝల, బాపిరాజు మున్నగుకవినక్షత్రములును శాస్త్రీయదృష్టితో కావ్యవ్యాకరణ తీర్థులగు పంచాగ్నుల ఆదినారాయణ వంటి విద్వద్విమర్శకులుకూడ భావకవులుగ సమర్ధించారు. (301పేజి ఆధునిక ఆంధ్ర కవిత్వము.)

శ్రీశ్రీ వంటివారి, అభ్యుదయ అథివాస్తవికత కాలముగ పేరుగాంచినవి పరిశీలన ప్రత్యేకమే. అయినాఅంతర్భాగముగ భావకవులుగ వైతాళికులు అవుతారు.ఈ భావకవులను దేశకాలపాత్రలలో కలిగిన ఈనాటి కృతులలో విశదమయ్యే విశేషతనుబట్టి తానుజీవించిన కాలానికిసన్నిహితమైన ప్రతిభాకవి వైతాళికులుగ ముద్దుకృష్ణ సంకలనము చేసారు. ఈ సంకలనములో మొదటి కవిత రాయప్రోలువారితోనె ప్రారంభ మైంది. భావకవిత్వము పేరు నిలిచే ఉంది.

3. యుగకర్త:

రాయప్రోలు సుబ్బారావుగారు గురజాడ అప్పారావుగారిలాగె యుగకర్తగ భావన సమంజసము.

చిట్టిబొట్టు నోము బట్టి ప్రభుత్వంపై వేగిరపడు చిరుపడంతి స్వదేశీ చీరగట్టనుత్సహించు చున్నది….ఇట్టి బోధోదయ వేళ కళాకవిత్వమును భావోదయమునందమి దురూహ్యము” రాయప్రోలువారి మాటలు అక్షర సత్యమని నాభావన (1909ఆంధ్ర భారతిసంచికనుంచి) 247పేజీ ఇద్దరు యుగకర్తలు ఆధునికాంధ్ర కవిత్వము )

4. రాయప్రోలు వారికృతులు… నవ్య కవిత్వ రీతులు:

పృథివి దివ్యౌ షదుల్ పిదికెరా మనకు….కానల కస్తూరి కాచెరా మనకు…అవమానమేలరా, అనుమానమేలరా… భరతపుత్రుడ నంచు భక్తితో పలుక…పాడరా నీవీర భావ,భారతము”.. ప్రబోధముగ (6వపేజిజన్మభూమి కవితవైతాళికులు) ఆయనకున్న ప్రజాదరణకు నిదర్శనమైన రమ్య జాతీయకవి.

శాంతినికేతనము విద్యాలయ విద్యార్థిగ రవీంద్ర సన్నిహిత సంబంధాల వల్ల రమణీయ ప్రకృతి అందాల ప్రదర్శన రమ్యాలోకముగ కవిత్వ సిద్ధాంతగ్రంథమునకు సాహిత్య అకాడమీ పురస్కార భావకవి రాయప్రోలుసుబ్బారావుగారు.

తేనెమీది సుతారంపు ఠీవి
పగలబడినవ్వు పువ్వు పైకెగయు అళిని
ప్రియుడు ప్రియురాలి నట్లు చేర్చెనొకసుకవి
బిడ్డ తల్లినిభాతి కల్పె మరొకండు….

రమ్యాలోకములోని పద్యమిది. శైలి అద్భుతము. ఈవరవడి 1913నుండి సాగినది.రవీంద్ర సాహచర్యము వీరికవితాశక్తికి వికాసము (459పేజి ఆంధ్ర రచయితలు)

తృణకంకణము అనుకరణకవిత్వము కాదు
అణువునజాండము నేకన
రణినిండారిన మనోహరపు వాగర్ధ
ప్రణయము గీర్తించెడు మృదు
గుణులకు భాషాకుమారకుల నుతియింతున్ (తృణకంకణము) అన్నారు. రాయప్రోలు ముద్రగ కవిస్తుతి నూతనము. 

1913-1938 silver jubilee edition నవ్య సాహిత్య పరిషత్తు, గుంటూరు వారిచేత ప్రచురితమైన తృణకంకణము నీరాజనములో తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి ఇలా అన్నారు 37వపేజీ

1913 సంవత్సరములో School of Romantic revival గ అభినవాంధ్రకవితామండలి రాయప్రోలు కవిత్వమును వర్డ్సవర్త్, షెల్లీ, కీట్సు వంటి ఆంగ్ల కవుల అనుకరణగ ప్రధమ ప్రకటన చేసారు. కాని కాళిదాసత్రయము సాకల్య సమాలోచన ఈతృణకంకణము. పినతల్లి మాటలకు స్ఫూర్తి. అమలిన శృంగార భావ వ్యక్తీకరణగ అభినవాంధ్ర నూతనమైన కవితాప్రక్రియ….” అని 1937నాటి ఈ అభిప్రాయము సాహితీసమితిదని వెలువరించింది. ఆధునికాంధ్ర కవిత్వములో నారాయణ రెడ్డి ధ్రువీకరణ చేసారు.

కవిత్వములో నవ్యత ఉంది. భావములో నవ్యత ఉంది. దేశభక్తి, పృకృతి,సంఘసంస్కరణ, సాంప్రదాయికత, సంస్కృతభాష కవుల ముద్ర రాయప్రోలువారసత్వముగ అనంతరకవులను ప్రభావితము చేసాయి. లలిత మొదటిదశ కావ్యము. ప్రేమ కథ లకు ఆధునిక పరిస్థితుల కనుగుణముగ చిత్రీకరణ. కష్టకమల రజతోత్సవసంచిక 1938లో నవ్య సాహిత్య పరిషత్తు ప్రస్తావన లో శ్రవణపాతమైన రచనగ పేర్కొన్నది. తృణకంకణము లోనాయిక పదునాల్గు వసంతాలతో ఊరివెలుపల శైశవము నప్రేమికుడైన యువకుడిని కలిసింది. వారిమద్య అమలినశృంగారభావముగ “సాక్షిసూత్ర సుందరమైన సఖ్యరక్తి… అంచు నాదియ యగుప్రేమయందె ముక్తి (31వపేజి సిల్వర్ జుబ్లీ ఎడిషన్)

అమలినశృంగారభావముగ భావకవులకు శిరోధార్యమయింది. అమరావతీ పట్టణమున వంటిసీసపద్యములలోని పదశిల్పము, వాక్యశిల్పము, ఎత్తుగడ,… విశ్వనాథ, జాషువ, తుమ్మల మున్నగువారి జాతీయ కావ్యములలోని పద్య రచనపై ప్రభావము వేసినవి (296పేజి ఆధునిక ఆంధ్ర కవిత్వము)

5. భావకవిగ ప్రశంస:

మార్చి 17, 1892 జననము. మరణము 1984జూన్ 30. అయితే 1947స్వాతంత్ర్యము వచ్చేవరకుఈమధ్యకాలము విదేశీ పాలన పాశ్చాత్య నాగరికత, స్వాతంత్య్ర సాధనేఛ్ఛలు రాయప్రోలు వారికి అనుభవైద్యేకము.వివిధసాహితీ ప్రక్రియ తెలుగుభాష నూతన శకమునకు నాంది పలుకుతున్న సాహిత్యచరిత్ర కాలమది.

నూతనశకముగ అమలిన శృంగారప్రబోధముకావ్యఆవిష్కరణ రాయప్రోలు చేసారు. అంటే ప్రేమ వివాహబంధం కి దారిఅవకూడదు. భగ్న ప్రేమ యువతీయువకులకుఅమలిన భావముగ స్నేహపూర్వకముగ ముగియాలి. సమాజానికి అనుగుణమైన భావలహరి అనిపిస్తుంది. సంస్కృతభాష పలుకుబడి వీడలేదు. స్వతంత్ర రచన. కాని సృజనాత్మక కళాప్రక్రియగ పాశ్చాత్య సాహిత్య ధోరణిగ భావుకత అన్న విమర్శ ఉంది. ఎక్కువ మంది పాశ్చాత్య సాహిత్య విశారదులుగ భావకవిత్వము పేరుతో ముద్ర పడినది.

రమ్యాలోకము,మాధురీదర్శనము ఆధునిక కవితాసంబంధమైన లక్షణసంబంధములను నిర్వచిస్తాయి. రమ్యాలోకము నకు సాహిత్య ఎకాడమి పురస్కారము లభించింది.
“కాలధర్మానుగతమై జగత్ప్రవృత్తి మారునపుడు వాఙ్మయమును మారు నిజము” అన్నారు. అవధాన ఆశుకవిత్వధోరణిపై విరక్తి కలిగింది. కాని పాట, పద్యముదేనికవే గొప్పవి. చవి,చాతుర్యము కలిగి ఉండాలి. పోరునకు పొత్తునకు చాలిపొంది పొసగు, మాతెలుగుతల్లి మెడకిదె మల్లెదండ అన్నారురాయప్రోలు .

మధునాపంతులవారు- “నన్నయ్య వంటివారు కూడ ప్రబోధాత్మక ఛందోబద్ధమైన కవిభావనలతో ప్రాచీన పద్యములలో భావకవులవుతారన్నారు. అభినవాంధ్ర ఆధునిక సాహిత్యము లో యుగకర్తగ భావకవి అఅనిపించుకుంటూ రాయప్రోలు సంప్రదాయమునుగౌరవించారు, మారిన పరిస్థితుల కనుగుణముగ కవితాత్మావేశ యుగకర్త అనిపించుకున్నారు. రాయప్రోలువారిలో క్రొత్తదనమునకు పాదులువేసినవారిలో వారిపిన్నిగారు ప్రథమ స్మరణీయురాలు ..?..248పేజిఆధునికాంధ్ర కవిత్వము.

6. జాతీయకవిగ విమర్శ :

తెలుగుభాషకు, తెలుగుజాతికి అభిమానిగ రాయప్రోలు కృతి గేయాలు ఉత్తేజము కలిగిస్తాయనడంలో సందేహములేదు. కాని ఆచరణ ప్రవృత్తి వ్యక్తిగతంగ సందేహాస్పదమైన విమర్శ ను ఎదుర్కొన్నది. నిజాం పాలన సమర్ధించాడన్న వాదనకు గురయింది. జాతీయ కవిగ నిరుపమానమైన ప్రతిభ తెలంగాణ రాజకీయ ప్రయోజనాలఉద్యమము పట్ల నిర్లక్ష్య ధోరణి అని ఎత్తిచూపిన వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరంఉంది. పరిశీలనాంశము.

7. ఖండకావ్యాలు - అనువాదములు:

తృణకంకణము, ఆంధ్రావళికష్టకమల, రమ్య లోకము, వనమాల, మిశ్రమంజరి, స్నేహ లతాదేవి, స్వప్నకుమారము, తెలుగుతోట, మాధురీదర్శనం, రూపనవనీయతం మొదలైనవి.

అనుమతి, భజగోవిందం, సౌందర్య లహరి, లలిత, మధుకలశం. ఇన్ని రచనలు చేసిన రాయప్రోలువారు నిరంకుశపాలన వ్యతిరేకపోరాటచరిత్రలో రాయప్రోలువారి ప్రబోధాత్మక కవిత ప్రభావంవెదకాలన్న భావన ఆయనను మహారచయితగ త్రోసిరాజనదు అన్నది నా అభిప్రాయము.

కట్టమంచి రామలింగారెడ్డి అభిప్రాయము.

26 మే 1916 మహారాజకాలేజి ప్రిన్సుపాలుగ గొప్పప్రశంస చేసారు. దానిసారాంశము ప్రకారము వ్యక్తిగత పరిచయము లేకపోయినను ఒక కవిమిత్రుడిగ పరస్పరమైన సన్నిహిత ఉత్తర వ్రత్యుత్తరాలు వారిని కలుపుతూనేఉన్నాయని తృణకంకణము పై అభిప్రాయము పంపారు. “He holds a high rank amongst modern telugu poets….as a man of genius who has every title to the admiration and encouragement of the Telugu people…”

రామలింగారెడ్డి గారు తనతృణకంకణముపై అభిప్రాయమును రాయప్రోలువారు స్వాగతించారు. స్నేహాన్ని మరిచిపోలేదు. తెనుగే తీయని దందుపద్యపద రీతి క్రీడలత్యంత మోహనముల్ శోభనముల్ అన్నారు. ఉత్తమ రమ్యమైన శైలి. కవిత్వతత్వవిచారణ గ్రంధకర్త పట్ల మైత్రీభావము ఈక్రింది పద్యము.

పిండీపిండని పాడియాబొదుగులన్ బింబింప గాదంబినీ
కాండంబుర్వర పచ్చ కోకలను సింగారింప నీవేళ బూ
దండల్ దక్కనుద్వారబంధముల సంధానించి ప్రేమోదయా
ఖండ స్వాగత మిత్తు రాంధ్రు లనురాగస్ఫూర్తి రెడ్డ్యగ్రణీ!...432పేజి ఆంధ్ర రచయితలు

మధునాపంతులవారు రాయప్రోలువారి గురించి ఇలా అన్నారు. మాటలు. 459పేజి

తృణకంకణము శాబ్దికముగ గొన్నిదొసగులు దొరలినను మంచి నిబ్బర మైన కవితాధోరణి…శాంతినికేతన రవీంద్ర సాహచర్యము వలన వీరికవితాశక్తికి వికాసము.పెక్కుభాషలనెరిగి ప్రకృతి రహస్యముల నాకళించి రవికవి కవితాఛ్ఛాయలు తెనుగునకు దింపుచు రాయప్రోలు కవి పలువుర పొగడ్తలకు పాత్రుడయ్యెను...” కట్టమంచి రామలింగారెడ్డి సాభిప్రాయముఅక్షరసత్యముగ మధునాపంతులవారు కూడ ఆంధ్ర రచయితగ సముచితముగ ప్రశంశ చేసారు. ప్రకృతి శోభను మైత్రిని, భక్తిని,జగత్కల్యాణమును కావ్య సందోహములో నిబద్ధము చేసి రమణీయోపదేశ వ్యంజనచే ఉత్తమ బోద్ధ అయినాడు” (463పేజి. )

8. ముగింపు:

  • అనేకనవ్యమార్గదర్శకుడిగ, వంగవైష్ణవ సంప్రదాయములకు, అమలిన శృంగార నూతన సిద్ధాంతములకు, కథాకావ్యాది బహువిధ ప్రక్రియలకు, దేశభక్తి కవిత్వాది ప్రబోధాత్మక మార్గదర్శకుడిగ రాయప్రోలు వారసత్వముగ యుగకర్త కు సమగ్ర చర్చ జరగాల్సిన సందర్భము నకు ఈవ్యాసము ప్రేరణ అవాలని ఆశిస్తున్నాను.
  • మిశ్రమంజరికి సాహిత్య ఎకాడమీ బహుమతివచ్చింది. ఆయన కవిత్వములో పాశ్చాత్య సాహిత్య ఉద్యమ ప్రేరణ ఉంది. బాపట్ల కాకినాడ రాజమండ్రిలలో విద్యాభ్యాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగంలో 1919 నుంచి ఇరవైఐదు సంవత్సరాలు పనిచేశారు.
  • ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్లవేంకటావధాని బిరుదురాజు రామరాజు నారాయణరెడ్డి ఈయనతో పనిచేసిన వారు. ఎందరో మహోజ్వలచరిత్ర గలిగిన సమకాలీనులైన వారిచేత ప్రశంసలందిన యుగకర్త.

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నారాయణ రెడ్డి, సి. ఆధునికాంధ్రకవిత్వము. 6వ ముద్రణ, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, మే2007.
  2. ముద్దుకృష్ణ. వైతాళికులు (సంకలనం) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 17వముద్రణ, జనవరి 2012.
  3. సత్యనారాయణ శాస్త్రి, మధునాపంతుల. ఆంధ్ర రచయితలు.  సరస్వతి ప్రెస్, రాజమండ్రి, 1950.
  4. సుబ్బారావు, రాయప్రోలు. తృణకంకణము -రజతోత్సవసంచిక (pdf)1913-38
  5. సుబ్బారావు, రాయప్రోలు. కష్టకమల (రజతోత్సవసంచిక జయంతోత్సవసంచిక )(పిడిఎఫ్)1913-38

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]