"సామల సదాశివ యాదిలో" - ప్రత్యేకసంచిక
AUCHITHYAM | Volume-04 | Issue-06 | May 2023 (Special Issue) | ISSN: 2583-4797
సంపాదకీయం
తెలుగు సాహిత్య చరిత్రలో సామల సదాశివ గారి ప్రస్థానం విశిష్టమైనది. తెలుగు, ఉర్దూ భాషల్లోని సారస్వతo, ఉత్తర దక్షణాది సంప్రదాయ సంగీతం ఒకచోట మూర్తీభవించిన తెలుగు సాహితీ మూర్తి సదాశివ గారు. బహుభాషావేత్తగా, బహుముఖీన ప్రక్రియల్లో సాహిత్యాన్ని సృష్టించిన సదాశివ వ్యక్తిత్వం ఉత్తమోత్తమమైనది. కాల్పనికవాదం నుండి అభ్యుదయం వరకు అన్ని భావాలు వారి సాహిత్యంలో కనిపిస్తాయి. తన జీవిత విశేషాలను “ యాది” చేసుకొని అందించిన ముచ్చట్లు వారి జీవితానుభవాలను అందిస్తూనే నేటి తరానికి సక్రమమైన జీవనమార్గాన్ని నిర్దేశిస్తాయి. అనువాదకుడిగా ఇతర భాషా వుల సాహిత్యాన్ని తెలుగు వారికి అందిచి భాషను, సార్వత్రిక భావనలను సుసంపన్నం చేసిన మహానీయుడాయన. ఇంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన డాక్టర్.సామల సదాశివ గారి జయంతి 11మే2023.
ఈ సందర్భంగా వారి సాహిత్యస్మృతిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట తెలుగు విభాగం వారు “ఔచిత్యం తెలుగు అంతర్జాల మాసపత్రిక” వారి సుహృద్భావం సౌజన్యంతో “సామల సదాశివ –యాదిలో” అనే ప్రత్యేక సంచికను వెలువరిస్తున్నాం. ఈ సంచిక నిమిత్తం సామల సదాశివ గారి సాహిత్య వ్యక్తిత్వాలను ఆవిష్కరించే వ్యాసాలను అందించిన రచయితలకు, పరిశోధక విద్యార్థులకు ధన్యవాదాలు. తెలుగు విభాగం నుండి ఈ సంచిక వెలువరించడానికి ప్రోత్సాహం అందించిన కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చలసాని ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం కలిగించిన ఔచిత్యం అంతర్జాల మాసపత్రిక సంపాదకులకు కృతజ్ఞతలు.
ఇట్లు
ప్రత్యేకసంచిక సంపాదకమండలి
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.