AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797
12. సామాజికాంశాల కూడిక: తంజాపురన్నదాన మహానాటకము

డా. బడిగె ఉమేశ్
అసోసియేట్ ఫెలో
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం,
సరస్వతినగర్, వెంకటాచలం, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494815854. Email: hcu.umesh@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
విజయరాఘవ నాయకుని కాలంలో యక్షగానాలు విరివిగా
వచ్చాయి. వాటిలో ప్రసిద్ధమైనది, విలక్షణమైనది పురుషోత్తమ దీక్షితులు రాసిన తంజాపురాన్నదాన మహానాటకము. ఇది
కీ. శ. 1618-1673 కాలంనాటిది. ఇందులో ఆ కాలం నాటి సామాజికాంశాలు కూలంకషంగా చర్ఛింపబడ్డాయి. ముఖ్యంగా అప్పటి
భాషలోనూ, ఆచార వ్యవహారాల్లోనూ గలిగిన ఆయా అంశాలను ఈ వ్యాసంలో సోదాహరణంగా తెలపడానికి ప్రయత్నించాను.
యక్షగానాలపై జరిగిన పూర్వ పరిశోధనల్ని పరిశీలించి వాటిలో పేర్కొనని అంశాలను ఈ యక్షగానం ఆధారంగా చెప్పాను.
అప్పటి భొోజన సత్రాలు ఇప్పటి హోటళ్ళుగా రూపాంతరం చెందిన క్రమాన్ని గుర్తి చేసి అన్నదాన సత్రాల ఆవశ్యకత ఎంత
ముఖ్యమనే విషయాల్ని చెప్పే ప్రయత్నమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
Keywords: యక్షగానం, కల్పనలు, భోజనం, సత్రం, వికృత
భావాలు, వింత చేష్టలు. 1. ఉపోద్ఘాతం: దక్షిణాంధ్ర దేశీయ వాఙ్మయ చరిత్రలో
నాయకరాజుల కాలాన్ని యక్షగానాలకు స్వర్ణయుగంగా చెప్పుకుంటున్నాం. ఆ కాలంలో వెలసిన ప్రక్రియల్లో
యక్షగానం విశిష్టమైంది. ఈ యుగం వీధి నాటకం నుండి యక్షగానంగా పరిణామం చెందింది. ప్రధానంగా విజయ
రాఘవనాయకుని పాలనలో (క్రీ. శ. 1633-1678) యక్షగానాలలో నూతన పద్ధతులు చోటు చేసుకున్నాయి. అలాంటి నూతన
పద్ధతులలో మొదటి నాటకంగా గుర్తింపు పొందినదే ‘తంజాపురాన్న దాన మహానాటకము’. దీని కర్త
పురుషోత్తమ దీక్షితులు. ఇది విజయ రాఘవ నాయకునికి అంకితమియ్యబడింది. ‘సత్రమరుల’ నాటకమని
దీనికి నామాంతరం. విజయ రాఘవ నాయకుని కొలువులో కామరుసు
వెంకటపతి సోమయాజి, కోనేటి దీక్షితులు, పురుషోత్తమ దీక్షితులు ఆస్థాన కవులుగా పేరుగాంచారు. వీరు
ముగ్గరు వరుసగా ‘విజయ రాఘవ చంద్రికా విహారము’, విజయ రాఘవ కల్యాణము, తంజాపురాన్నదాన
మహానాటకము’ అనే యక్షగానాలు రాశారు. ఈ మూడిటిని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి ప్రచురణలో
‘యక్షగానములు తంజావూరు’ (సంపుటం 2) అనే పేరుతో 1956 లో అచ్చేశారు. అప్పటి యక్షగానాల
పరిష్కర్తగా ఆచార్య గంటిజోగి సోమయాజి వ్యవహరించారు. లోక కళ్యాణం కోసం విజయ రాఘవుడు ఎన్నో
కార్యాలు చేశారు. ఆలకాంలో వేశ్యా వృత్తి ఒక పవిత్రమైనదిగా ఉండేది. రాజులు వేశ్యా గృహాలకు
వెళ్లేవారు. వీరికి ప్రత్యేక వాడలుండేవని ఈ యక్షగానాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇతిహాస, పురాణాలకు
సంబంధించిన కథలు యక్షగానాలకు ఇతివృత్తాలుగా నిలిచాయి. నాటక లక్షణాలను పోలి ఉండటం, యక్షగానాలకు
సహజమైంది. ఆనాటి సామాజిక వ్యవస్థ తీరు తెన్నులు, అప్పటి వేష భాషలు ఈ యక్షగానాల్లో బాగా
ప్రస్ఫుటమయ్యాయి. ప్రధానంగా పురుషోత్తమ దీక్షితులు రాసిన ‘తంజాపురాన్న దాన మహానాటకము’
లోని సామాజికాంశాలను స్ప్శశించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. 2. యక్షగాన కాలాంశాలు : ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు ముద్రించిన
‘యక్షగానములు తంజావూరు’ అనే రెండవ సంపుటిలో ఈ యక్షగాన క్రీ. శ. 1618- 1673.
(యక్షగానాములు తంజావూరు సంపుటం 2, పుట: I) మధ్య కాలంగా చెప్పబడింది. డా. ఎస్. వి. జోగారావు
‘ఆంధ్రయక్షగానవాఙ్మయచరిత్రము’ లో క్రీ. శ. 1669లో ఉండవచ్చునని పేర్కొన్నాడు.
(ఆంధ్రయక్షగానవాఙ్మయచరిత్ర- పుట: 269) ఆరుద్ర తమ ‘సమగ్రాంధ్రసాహిత్యం’ రెండవ సంపుటిలో
1669 కీలక సంవత్సరంలో రాయబడ్డదన్న విషయాన్ని సమర్థించారు. (సమగ్రాంధ్రసాహిత్యం రెండవ సంపుటం –
(పుట : 708) ఇద్దరు పరిశోధకులు దీనిని 1669లో రాశారని నిర్దారించటం వల్ల అప్పటి కాలమాన పరిస్థితులకు
అవగాహన చేసుకోవచ్చు. 3. యక్షగాన కథాంశం: తంజావూరులో నాయకరాజులు స్థాపించిన
అన్నదానసత్రాలు ఎంతో ఆదరణకు నోచుకున్నవి. ఇవి చాలా మంది పేదల ఆకలి బాధల్ని తీర్చేవి. తంజావూరి
సత్రానికి నెల్లూరి యెల్లమ రాజు అధికారిగా ఉండేవాడు. ఇక్కడికి అనేక మంది బ్రాహ్మణులు ప్రతి రోజు
వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. అక్కడ కరణాలు సత్రమధికారికి లెక్కలు చెప్పే విధానం, వంటావార్పులు
మున్నగు సేవలు చేసే పద్ధతులు ఇందులో వర్ణించబడ్డాయి. ముఖ్యంగా పప్పు తిప్పాభట్ల అనే సోమరిపోతు
బాపనయ్య ఒకడు తైతక్కలాడి డబ్బు దోచుకోవడానికి సత్రానికి వచ్చిన ఉత్తరాది వెంగసాని, జక్కుల
రంగసానిలతో చేసిన విరసములైన శృంగారప్రసంగ మిందులో కథాంశం. 4. యక్షగాన విశేషాంశాలు : ఈ యక్షగానంలో పాత్రలు సన్నివేశాలు
కల్పితాలే ఐనా కూడా ఆనాటి తంజావూరి అన్నదాన సత్రాల్లోని పద్ధతులను, అక్కడి ఆగంతుక బ్రాహ్మణుల జీవన
విధానం, వారి ఆశలు కొంత అతిశయం చేసి, హాస్యరస పోషకంగా వ్రాయడానికి తోడ్పడ్డాయి. విజయ రాఘవుడు తన
రాజ్యంలో సత్రాలను కట్టించి తద్వారా బ్రాహ్మణులకు ఇతర వర్గాల వారికి సైతం భోజనాలు, సత్కారాలు
జరిపేవారని ఈ యక్షగానం గుర్తు చేస్తోంది. అలాంటి తంజావూరు సత్రాల్లో ఒకనాడు జరిగిన సంఘటనల్నీ
వర్ణిస్తూ రాయబడ్డ సుప్రసిద్ధ యక్షగానమిది. ప్రతి సత్రానికి ఒక అధికారి, కరణాలు
ఉండేవారు. ఆయా పనులు చేయడానికి ఉద్యోగులు నియమించబడేవారు. అయితే అధికారులు, ఉద్యోగులు దాదాపు
తమిళులే అయ్యుంటారని ఈ యక్షగానంలోని భాషను బట్టి అర్థమవుతుంది. యక్షగానంలో అక్కడక్కడ తెలుగు మాటలు
వినిపించినప్పటికీ అధికంగా తమిళ సంభాషణలు కూడా చోటుచేసుకున్నాయి. నాటకం సాధారణంగా కైవారంతో ప్రారంభమై భరత
వాక్యంతో ముగుస్తుంది. ప్రక్రియగా ఇది ఎంతో వైవిధ్యమైన యక్షగానం. రచన ప్రహసన ప్రాయమైనది. నాటకంలో
ఎక్కువ భాగం వచనం, అక్కడక్కడ కొన్ని పద్యాలు చోటుచేసుకున్నాయి. అనుకోకుండా వచ్చిపడిన నాటి
తంజాపురాంధ్ర భాషావ్యవహార శైలి పరిశీలించదగింది. ఇందలి దరువులు చిన్న చిన్నవి పాత్ర ప్రవేశ
సందర్భాలలో ప్రయోగించబడ్డాయి. కవి ఇందులో శృంగార హాస్యాద్భుతాలు ప్రధానమన్నాడు. కాని శృంగారం కంటే
హాస్యం చమత్కారం బాగా పండాయి. అద్భుతం అంతగా లేదనవచ్చు. ఈ యక్షగానంలో ఆనాటి భాషలోని కొన్ని
విశేషాంశాలు మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. అరవం (తమిళం) మాట్లాడే కణకపిళ్లలు, కన్నడం మాట్లాడే
బ్రాహ్మణులు లిందులో తారసపడతారు. ఆనాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు మాట్లాడే వ్యావహారికాలైన
పలుకుబడులు కూడా మనల్ని ఆలోచింపజేస్తాయి. 5. యక్షగానంలో సామాజికాంశాలు : పురుషోత్తమ దీక్షితులు నీచ పాత్రల చేత
గొప్ప హాస్య చతురతను కలిగించారు. తంజావురూ నాయక రాజులు అన్నదానానికి ప్రసిద్ధులు. వీరి హాయాంలో
అన్నదాన సత్రాలు విరివిగా వెలిశాయి. ‘మనమేలికవారు బ్రాహ్మణ్య ప్రభువులు.
అన్నపానాదులపట్ల కొదవవచ్చిన తాళరు. ‘తంతుమాత్రపువాడైనా తంజావూర ఉపవాసం ఉండరాదు’ (తంజాపురాన్న దాన మహానాటకము - ఫుట: 195) అని నాయక రాజుల శాసనమట.
భుజం మీద జందెమున్న ప్రతి బ్రాహ్మణునికి బొజ్జనిండా తిండి పెట్టడానికి సత్రాలు కట్టించారనటం
మాటవరుసకే తప్ప నిజం కాదు. ఎందుకంటే ఈ సత్రాల్లో అన్ని వర్గాల ప్రజలు తమ ఆకలిని తీర్చుకునేవారని
నాటకం చదివితే అర్థమవుతుంది. రామానుజ కూటం, మధ్వకూటం, పెద్దసత్రం మొదలైన చోట్ల రోజూ అన్నదానం
జరిగేది. సత్రాలలో భుజించని ఆచార వంతులకు స్వయం పాకాలు ఇచ్చేవారు. ఈ సత్రాలలో పడి తినడానికి
ఎక్కడలేని సోమరి పోతులూ వచ్చేవారు. వాళ్ళ వెకిలి చేష్టలను చిన్న బుద్ధులను బయటపెట్టే ప్రహసనమే ఈ
యక్షగానం. ఈ మహానాటకంలో సత్రమధికారైనా నెల్లూరి
యెల్లమరాజు దగ్గరకు కరణాలు, ఉద్యోగులు మొదలైన వారు వచ్చి, ముందు నెల, ప్రస్తుత నెలకు సంబంధించిన
ఆదాయ వ్యయాల లెక్కలను చదివి వినిపిస్తారు. ఈ సందర్భంగా ఆ యెల్లమరాజుకు, కరణాలకు జరిగిన సంభాషణ
తమిళంలో ఉంటుంది. సత్రంలో భోజనానికి వచ్చిన తిప్పాభట్ల, వెంగసాని అనే వేశ్య, హాస్యకాడు వంటి పాత్రల
ద్వారా కవి ఇందులో హాస్యాన్ని పండించాడు. అదే విధంగా సత్రంలో అందరికంటే ముందు పొట్టి, కుంటి, నత్తి
బ్రాహ్మణులకు ఆహారం పెట్టే వ్యవస్థ విజయ రాఘవుడి కాలంలో ఉండేది. కాని దానిని అలుసుగా తీసుకుని
ముందుగా భోజనం తినాలనే కోరికతో కొందరు బ్రాహ్మణులు అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నకూడా కుంటి, నత్తి,
పొట్టి వారిగా నటించే వారు. దీనిని సత్రమధికారి గుర్తించి దండించే సందర్భం ఈ యక్షగానంలో
ఉన్నది. నాటకంలో విజయ రాఘవ నాయకుణ్ణి అక్కడ
భోజనాలకు వచ్చిన వారు ఏవిధంగా పొగిడారో రంటే ‘‘ఓరి తల్లుభట్లుగా ఇషువలె
మృష్టాన్నము సత్రములో పెట్టే రాజును కాశీ రామేశ్వరము పర్వంతములో ఎక్కడ నైనా చూస్తిమా! సన్న
బియ్యమన్న మేంది! కందిపప్పేంది! దొన్నెకొద్ది నెయ్యేంది! పట్టేడేసి కూరలేంది! వలసినంత పమాన్నమేంది!
వడలేంది! అతిరసాలేంది! మీగడ పేరుగేంది! ఓహోహో ఎంత సంభరమోయి!’’ అని ఆనంద పడేవారు.
సత్రంలో ‘ఊరుగాయలు, ఊరుబిండ్లు, పచ్చళ్లు, వేపుడుగూరలు, తాళదాలు, పిండిమిరియాలు, పుల్లగూరలు,
పప్పు, పాయసం, కజ్జాయాలు’ (తంజాపురాన్నదాన
మహానాటకము – పుట: 197) లాంటి వంటకాలు ఉండేవి. ద్వి. "ఈతీరుభుజియించి
యితవుగా ‘‘నన్న ఈ విధంగా భోజనానంతరం రాజును వారి వంశాన్ని
బ్రాహ్మణులు ఆశీర్వదించి, కృతజ్ఞతలు చెప్పేవారిని బోధపడుతుంది. రాజులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు
అనర్హూల పాలు అవుతాయని తెలుసుకోవడానికి ఈ యక్షగానం నిదర్శన మని చెప్పాలి. అంగవైకల్యం కలిగిన వారికి
ముందుగా ఉచిత భోజనం పెట్టడమనేది చాలా గొప్ప సంస్కారం. కాని ముందు తినాలనే ఆశతో కొందరు బ్రాహ్మణులు ఈ
నియమాల్ని పాటించకుండా మోసపూరితంగా ప్రవర్తించడం అస్సలు బాగాలేదు. పూర్వం నుండి ఎందరో రాజులు తమ
ప్రజలుకు మంచి చేయాలనే ఆలోచించారు. కాని ప్రజలే వాటిని సక్రమంగా వియోగించకుండా దుర్వినియోగం
చేయడాన్ని మనం నేటి నుంచి నాటి వరకు చూస్తూనే ఉన్నం కదా మరి. ‘సత్రం భోజనంలో సాయిబుల
దర్భారు’ అన్నట్లు చాలా మంది వ్యవహరించడాన్ని నిత్యం చూస్తుంటాం కదా! సత్రం వేళ కాక ముందే పప్పు తిప్పాభట్లు
అనే బ్రాహ్మణుడు సకుటుంబంగా భోజనానికి వచ్చేశాడు. అంతటితో ఆగకుండా ‘అదె వర్రా మంచిగా’
అని తన కొడుకును కూడా పిలుస్తాడు. ‘ఓపలేనే’ అని సుపుత్రుడు జవాబుతో ప్రవేశిస్తాడు.
ఏమిరా పిలువక మునుపే ఓపలే నవేవు? అని అంటూ.. తిప్పాభట్లు భోజనానికి ఎవరెవరు వచ్చారని అడగడానికి
ఉపయోగించిన భాషలోని కొన్ని పదాల్ని చూడండి. ‘వచ్చెనటవె, వచ్చెనషవె, వచ్చిరషవె, చూడడష’
లాంటివి వెటకారాన్ని గుర్తుచేస్తాయి. తిప్పాభట్లకు అతని పెళ్ళాం బిడ్డలకు మధ్య జరిగిన సంభాషణను
బట్టి వారి కుటుంబ పరిస్థితుల్ని అప్పటి నాగరికత క్రమాన్ని ఈ భాష ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అలాగే తిప్పాబొట్లను సత్రమధికారి వేదం
చెప్పమని అడగ్గా.. “హరిః ఓం. కోశం దక్షిణః పక్షః కుప్ప ఉత్తరః పక్షః నులుపె
శాంతం తూర్పెత్తు శ్లోకోభవతి గంపం నింపయతి’’
(తంజాపురాన్న దాన మహానాటకము – పుట: 198) అని ఏదో నోటికొచ్చింది చెబుతాడు. ఇదంత భోజనం
చేయడానికి పడే పాట్లుగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ అన్నదాన సత్రానికి ఎక్కడెక్కడి నుండి వస్తారో
తెలుగుసుకోవడానికి ఈ కింది మాటలే తార్కాణం. ‘అంగవంగకళింగమహారాష్ర్ట
సత్రంలో భోగాలవారు జక్కుల రంగసాని,
వెంగసాని మొదలైనవారి వర్ణన చూస్తే ఆకాలంలో తంజావూరులో వేశ్యలు ఉండేవారని, వారు భోజనానికి, డబ్బు
సంపాదనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే జీవనం గడిపేవారని తెలుస్తుంది. అంతేకాదు ఇలాంటి వారందరూ
సత్రమధికారిపై ఆధారపడాల్సి వచ్చేదని, సత్రమధికారులు వారిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుని నానా
కష్టాలకు గురి చేయడం పరిపాటని కూడా తెలుస్తుంది. ఆనాడు సత్రంలో లెక్కలు వేసే కరణాలు సరిగ్గా లెక్కలు
వేయకుండా నానా తప్పులు రాసి, పైగా సంత్రంలోని వస్తువుల్ని దొంగలించేవారు. ఇక్కడి పని మంతులు,
అవధానులు, తిండి, డబ్బు, వస్త్రాల గురించి బాగా పొగిడేవారు. పైగా వాటిని దుర్మార్గంగా దోచుకోవడం
చూస్తే ఆనాటి సామాజిక పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో తెలుస్తోంది. సత్రం ద్వారా ఆకలి తీర్చుకునే పేదలు ఎంతో
మంది ఉండేవారు. అలాగే తిన్నది అరక్క నానా రకాలుగా తైతక్కలాడేవారు కూడా లేకపోలేదు మరి. నాటకంలో
‘ఏమయ్యా! పప్పుతిప్పాభట్లుగారు వంగి వంగి చూచేదేంది? శివమాడేటట్టు తలకాయ
ఊచేదేంది? ఇదేమీ లెస్స ఉండలేదే.’ (తంజాపురాన్నదాన
మహానాటకము – పుట : 206) ఇది ప్రాచీన గ్రామీణ భాషకు నిదర్శనంగా కవి వాడాడని తెలుస్తుంది.
తిప్పాభట్టు నాటకంలో ఒక చోట... ‘ఓరి, గిరగిర తిరుగుచుందిరా. ఉత్తరాది
వెంగసాన్ని/జక్కుల రంగసాన్ని పటకసాని ముద్దునుంజూస్తే జంగాల బిళ్లవలె తిరుగుచుందిరా.’
(తంజాపురాన్న దాన మహానాటకము – పుట: 209) అని పలుకుతాడు.
ఇది ఆనాటి సాంస్కృతిక జీవితానికి తార్కాణం. యక్షగానంలో తిప్పాభట్లు సానికూతుళ్లకు
ఇచ్చే పురస్కారాల్నీ, సంస్కారాల్నీ చూసి చెప్పిన పద్యాన్ని చూడండి. ‘‘ఏషాగాధము
లేలే (తంజాపురాన్న దాన మహానాటకము - పుట : 212)
అని అనటంలో వేదాలు చదువుకున్న బ్రాహ్మణులు కూడా వేశ్యాలోలురై అనాడు తిరిగినట్లు బోధపడుతుంది.
ఈ నాటకంలో శృంగార హాస్యాద్భుత రసాలు
ప్రధానమని కవి చెప్పుకున్నాడు. తిప్పాభట్లు వెంగసానితోనూ, దీసానులతోనూ నృత్యం చేయటం చూస్తే ఒక ఏహ్య
భావం కలుగుతుంది. అయితే ఈ శృంగారం అంతగా రుచింపక పోవచ్చు. ముఖ్యంగా వైదిక బ్రాహ్మణుల ఆలంబన వారి
ఉపజ్ఞత, భోజనప్రీతి, రాజుగారి ఉదారత మొదలైన వాటి ద్వారా హాస్యం బాగా పండింది. గ్రామ్య భాషా తీరు,
అనాగరికుల యజ్ఞత, మరికొన్ని చోట్ల అసభ్య అభ్యాసాలు ద్యోతకమవుతాయి. ఇలా ఎన్నో సామాజికాంశాలు
యక్షగానంలో దర్శనమిస్తాయి. 6. ముగింపు: ఈ యక్షగానం ఎంతో విలక్షణమైనది. అన్నదాన
సత్రాల విలువను కళ్ళకు కట్టించింది. ఇలాంటి సత్రాలు ప్రస్తుత రోజుల్లో చాలా వరకు మృగ్యమైపోయాయి.
పుట్టగొడుగుల్లాగ హాటళ్లు వెలసిపోయాయి. అయితే ఇవి డబ్బున్న వారికి ఉపయోగపడతాయి తప్ప పేదల ఆకలి
కేకల్ని తీర్చలేవన్నది ధర్మ సత్యం. ఆకాలంలో రాజులకు ప్రజల బాగోగుల పట్ల ఉన్న శ్రద్దాసక్తులు ఈ నాటకం
బోధపరుస్తోంది. కాగా ప్రస్తుత రోజుల్లో కూడా కొన్ని ఆలయాల దగ్గర అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఎంతో మంది
ఉదార స్వభావులు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారనేది గమనార్హం. ఈ అన్నదాన సత్రాల వల్ల పేద ప్రజల ఆకలి
బాధలు పుష్కలంగా తీరుతాయని బలంగా నమ్మవచ్చు. నేడు ఆయా ప్రభుత్వాలు అమ్మా, అన్నా క్యాంటీన్లను
ప్రవేశపెట్టి కొద్ది కాలంలోనే ఎత్తివేశాయి. కానీ ఆనాటి రాజులు మాత్రం అన్నదాన సత్రాల నిర్వహణను చాలా
గొప్పగా, ఆదర్శనీయంగా చేపట్టారని ‘తంజాపురాన్న దాన మహానాటకమ’నే యక్షగానం ద్వారా
పురుషోత్తమ దీక్షితులు తెలియజేశారు. 7. ఉపయుక్తగ్రంథసూచి:
దాతా సుఖీభవ
త్వ’’ మనుచు లేచి
గఱ్ఱుత్రేంచుచుఁ
గరములుగడిగి
బొఱ్ఱలునిమురుచుఁ బొదలుచువచ్చి
వీడెముల్ దీసుక వేడ్కతో గుంపు
గూడుకవచ్చిరి కుతుకంబు మీఱ’’
(తంజాపురాన్నదాన మహానాటకము –
పుట: 229)
బంగాళకాశ్మీరపాండ్యభూములనుండి
కాశీకురుక్షేత్రకాంభోజపాంచాల
దేశాలనుండి-తీరని కరువచేత
బదరి కేదార ప్ర-భాసనైమిశములు
మొదలైన పుణ్యస్థలం- ములనుండి యిపుడు’
(తంజాపురాన్న దాన మహానాటకము – (పుట: 196) సత్రానికి బీహర్, బెంగాల్ మహారాష్ర్ట, శ్రీలంక,
కాశ్మీర్, కాశీ మొదలైన భారతదేశం నలుమూల నుండి భోజనం చేయడానికి వస్తారన్న సంగతి ఆశ్చర్యానికి గురి
చేస్తుంది.
క్రూస్సున్నున్నవి కోకిలంబులవిగో కోలాహలప్రక్రియన్
వేస్సున్నాడు మనోభవుండషిషుగా వేమారునీవున్ననున్
చూస్సుందానవు నీకుధర్మమషవే శుద్ధాత్ముఢన్ బ్రాహ్మడన్
త్రెస్సున్నా నిదెగూర్త మొక్కటిరతిం దేలింపవేలంఝమా
(తంజాపురాన్న దాన మహానాటకము – పుట : 210) చూస్తే అతడు ఎంత శృంగార ప్రియుడో
అర్థమవుతుంది. రాజరిక ప్రభుత్వాలు, వారి అనుచరులు చేసిన చేష్టలు, వికృత భావాలు, భాష ఎంత అశ్లీలంగా
ఉండేదో అర్థమవుతుంది. వెంగసానితో తిప్పాభట్లు చదివిన మరో పద్యమిలా ఉంది.
భాషింపవదేమి
మిట్టిపడెదవదేలే
కాషాయవస్త్రమిచ్చెద
రోషంబులు మాను మేము రుగ్వేదులమే.’’
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి
బాధ్యత వహించరు.