headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను పూర్తిగా రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. ఇప్పటివరకు కేర్-లిస్ట్ లో ఉన్న అన్ని జర్నళ్ళు... ఇక పై "పీర్ రివ్యూడ్" జర్నళ్ళుగా కొన్ని ముఖ్యమైన "పారామీటర్లు" పాటిస్తూ కొనసాగాల్సి ఉంటుంది. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతుంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-8 | July 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

14. అవధానదినోత్సవసాధన: సాధకబాధకాలు

డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ

తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ, మానవీయశాస్త్రవిభాగం,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం,
శ్రీసత్యసాయి జిల్లా –515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9247859580, Email: psarmarambhatla@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంధ్రులకే సొంతం అవధానవిద్య అని ఎలుగెత్తి చాటుకునే అపురూపమైన కళ అవధానం. వందల చరిత్ర ఉన్న అవధానవిద్యకు మూలాలు ఎంతో పురాతనమైనవి. తెలుగు వారి అవధానవిద్యను వారసత్వం సడలని నవీనాంకురాలు తళుకొత్తుతూ నిత్యవసంతశోభల్ని వ్యాపింపజేస్తున్న శుభతరుణం ఈ శతాబ్దం. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న ఈ విద్యకు ఒక రోజు కేటాయించి, అవధానదినోత్సవంగా ప్రకటించాల ఆలోచన, కోరికతో ఈ వ్యాసకర్త చేసిన పరిశోధనకు అక్షరరూపమే ఈ వ్యాసం. అవధానగ్రంథాలు, చారిత్రకాధారాలు, అవధానవరిష్టుల సూచనలు, అభిప్రాయాలు, చర్చలు, ఎన్నో ఉత్తరప్రత్యుత్తరాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో, అధికారులతో సంప్రదింపులు, సామాజికమాధ్యమాలలో ప్రసారం ద్వారా సేకరించిన అభిప్రాయలు, సీనియర్ జర్నలిస్టుల సలహాలు ఈ పరిశోధనకు ప్రధాన విషయసామగ్రి.

Keywords: అవధానదినోత్సవం, ఉగాది, మాడభూషి, తిరుపతి వేంకటకవులు, జాతీయదినోత్సవాలు. అవధానం, పద్యం, కళ.

1. అవధానం - విశిష్టత:

ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నింటిలోను చమత్కారం, శబ్దార్థాల గారడీ, అపరిమితమైన పదజాలం, వాక్యనిర్మాణ వైచిత్రి, అభివ్యక్తి, పలుకుబడులు మొదలైనవెన్నో విశేషాంశాలున్నాయి. వర్తమాన ప్రపంచంలో సగటు మనిషికి ఏదో ఒక సందర్భంలో కవితాత్మకత పై అభిరుచి కలుగుతూండడం గమనార్హం. ఈ నేపధ్యంలో పత్రికల్లో, దృశ్య, సామాజిక, అంతర్జాలమాధ్యమాల్లో క్రొత్తపుంతలు తొక్కుతున్న, పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్న ప్రాచీనవిద్య "అవధానం". విజ్ఞానం - వినోదాల మేళవింపుతో... పండిత పామరవేద్యంగా... అధునాతనమైన అంశాలతో... సామాజిక ప్రయోజనాలతో... సందేశాలతో... "ఆధునిక సాహిత్యోద్యమంగా" రూపుదిద్దుకుంటుందీ అవధానకవిత్వం. వేద, సాహిత్య, సాంకేతిక, శాస్త్ర, కళా సంబంధమైనవిగా అవధానాలు చాలా రకాలుగా కనబడుతున్నా నాటి నుండి నేటి వరకు ఎక్కువమంది అభ్యసిస్తూ, ప్రదర్శిస్తుండడం వల్ల తన ఉనికిని కాపాడుకుంటూ అజరామరంగా ప్రేక్షకుడికి రసానందాన్ని అందిస్తున్న విద్య - సాహిత్యావధానం ఒక్కటే.

లెక్కకు మించిన చిక్కులు, అందుకు తగ్గ ఎత్తులూ! పై ఎత్తులూ!! అవధానమంటేనే అక్షర సమరం. కాకలు తీరిన పండితుల, శాస్త్ర పారీణుల, సాహితీవేత్తల పశ్నలను దీటుగా ఎదుర్కొంటూ సభాసదులు ఔననేలా ఆ పృచ్ఛకులను సమాధానపరచాలి. పూరణ, ధారణలతో భేష్ అనిపించుకోవాలి. చమత్కార సంభాషణలతో సభను రంజింపజేయాలి. ఆశుకవితా విన్యాసాన్ని చూపించి ఆహూతులతో “వహ్వా” అనిపించుకోవాలి. లలితకళలలో ఒకటైన కవిత్వమే ప్రధానంగా ఈ అవధానప్రక్రియ ఆంధ్రంలో అవతరించి, సంస్కృత, కన్నడ భాషల్లో నిలదొక్కుకుని, హిందీ, తమిళ తదితర భాషల్లో ప్రయోగదశలో విస్తరిస్తోంది.

అష్టావధానం, ద్విగుణిత అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, పంచమహాశతవధానం, సహస్రావధానం, బృహత్ ద్విసహస్రావధానం, పంచసహస్రావధానం... మొదలైన వైవిధ్యాలతో మానవమేధకు పరిమితి లేనేలేదని నిరూపించే ప్రకియగా “అవధానం” ఈ రోజు నవీనసాహిత్యజగత్తులో మెప్పులు పొందుతోంది.

మాతృభాషను రక్షించుకోవాలని, అందులోని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. ఈ ప్రయత్నంలో ధైర్యం, ధార, ధోరణి, ధారణల సమాహారకళ అవధానవిద్యను ప్రోత్సహించడం, పరిరక్షించడం, భావితరాలకు యదాతథంగా అందించడం కూడ ప్రతి ఆంధ్రుడి బాధ్యత.

2. అవధానం - ఔన్నత్యం:

  • ప్రాచీనకాలంలో ఎన్నెన్నో గౌరవాలకు నోచుకున్న అవధానవిద్య - నడుస్తున్న నాగరిక సమాజంలో కూడా ఇంకెన్నో ఉన్నతశిఖరాలను అధిరోహించి,  మకుటాయమానంగా ప్రకాశిస్తోంది.
  • అవధానరంగంలో జరిగే పరిశోధనలకు, ఆయా పరిశోధకులకు తెలుగు రాష్ట్రాలలోను, ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలలోనూ విశ్వవిద్యాలయాలు "గౌరవ డాక్టరేట్"లు ప్రకటించి, ఈ విద్యను ఎంతగానో ఆదరిస్తూ పూర్వవైభవం తలపించేలా గుర్తింపునిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "కళారత్న" పురస్కారాల ప్రకటనతో అవధానవిద్యావరిష్టులను తగిన విధంగా సత్కరిస్తోంది.
  • భారతప్రభుత్వం ఈ సంవత్సరం  ప్రకటించిన "పద్మశ్రీ" విశిష్ట పురస్కారాలలో కూడా అవధానరంగ లబ్దప్రతిష్టను ఇనుమడింపజేసేలా సాహిత్య విద్యా విభాగాలలో చోటు కల్పించి ఈ విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పింది.

3. అవధానదినోత్సవం - ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం?:

జిల్లాయంత్రాంగం, రాష్ట్రప్రభుత్వాలు, సాహిత్యసంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పత్రికలు, దృశ్యమాధ్యమాలు శ్రాయశక్తులా అవధానాలను ఏర్పాటు చేస్తూ ఈ సంప్రదాయకళ గొప్పతనాన్ని తెలియజేస్తూ యువతను ఆకట్టుకునే ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. అయినా ఈ కార్యక్రమాలన్నీ ఉగాది పండుగరోజు, తెలుగు భాషాదినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం, ప్రపంచకవితాదినోత్సవం, వారసత్వదినోత్సవం, నవరాత్రి ఉత్సవాలు, కవుల, రచయితల సంస్మరణసభలు, వివిధ వార్షికోత్సవాలు మొదలైన వాటి పేరిట మాత్రమే జరుగుతున్నాయి. సాంస్కృతికశాఖ, భాషాసంఘం, ప్రభుత్వం వివిధ ప్రత్యేక సందర్భాల్లో తెలుగు మహాసభలను నిర్వహిస్తూ అందులో అవధానాలను ఏర్పాటు చేస్తూ తగిన విధంగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రవాసాంధ్రులు కూడా సందర్బానుసారం ఏడాదికో, రెండేళ్ళకో ఒకసారి జరిగే తానా, ఆటా, నాటా, నాట్స్ వంటి భాషాసాంస్కృతిక సమ్మేళనాలలోనూ, నెలవారీ కార్యక్రమాలలోను, పర్వదినాలలోనూ అవధానాలను ఏర్పాటు చేస్తూ విశ్వవిఖ్యాతిని కల్పిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంత గొప్పదైన “అవధానవిద్యను” గౌరవించుకోడానికి, యువతరానికి స్ఫూర్తిదాయకమైన ఈ అద్వితీయమైన సాహిత్యక్రీడ ఆచంద్రతారార్కం వర్ధిల్లడానికి, ఎందరో యువ అవధానులు తయారు కావడానికి, మరిన్ని అవధానకార్యక్రమాలు ఆంధ్రరాష్ట్రం నలుమూలలా జైత్రయాత్రగా నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించుకుని “అవధానదినోత్సవం” జరుపుకోవడం అవసరం.

4. ఏ రోజును - అవధాన దినోత్సవంగా ప్రకటించుకోవాలి?:

అవధానవిద్య వేదావిర్భూతమే. శతగ్రంథకల్పనగా తొలితరం కావ్యాల్లో మెప్పును పొంది అంచెలంచెలుగా రూపాంతరం చెంది విద్వాన్ మాడభూషి వేంకటాచార్యుల నేతృత్వంలో ఒక నిర్దిష్టతను సంతురించుకుంది. తిరుపతి వేంకటకవుల విపుల ప్రదర్శనా విశేషాలతో జనబాహుళ్యంలోకి చొచ్చుకువెళ్ళింది.  సగటు ప్రేక్షకుడి గుండెల మీద స్థిరమైన ముద్రను వేసుకుంది.. రాజాస్థానాలలో గణుతికెక్కింది. పండిత సభలలో నిలబడగలిగింది. పద్యశిల్పంలో సులభశైలితో రోజు వారీ సంభాషణల్లాగా యువతరంలో ఏకాగ్రతకు, జ్ఞాపకశక్తికే కాదు - స్థిర చిత్తానికి, భావోద్వేగ సంయమనానికి అవధాన విద్య అమృత సంజీవని. ఉత్తమ  సంస్కారానికి వ్యక్తిత్వ వికాసానికి అవధాన విద్య దివ్య ఔషధం. ప్రస్తుత పరిస్థితులలో దానికి ప్రోత్సాహం అత్యవసరం. అవధాన విద్య యువతరం ఊహలకు రెక్కలు తొడుగుతుంది. గరుత్మంతుల్ని  చేస్తుంది. విజేతలుగా రూపొందిస్తుంది. అవధాన విద్య తెలుగువారి అమూల్యమైన సంపద. ఇది తెలుగు జాతికి నాగరిక చిహ్నం. అలాంటి అవధానదినోత్సవాన్ని ఏరోజు ఏర్పాటు చేసుకోవచ్చు అని ఈ క్రింది విధంగా వివిధ అవధానులు, పండితులు, ఆచార్యులు, విమర్శకుల చర్చలు తెలియజేస్తున్నాయి.

4.1 తిరుపతి వేంకట కవుల స్మృతిపథంలో:

పద్యశిల్పంలో సులభశైలితో రోజు వారీ సంభాషణల్లాగా శిష్టవ్యావహరికంలో ఒదిగిపోతూ "బావా! యెప్పుడు వచ్చితీవు?...." "జెండాపై కపిరాజు..." "చెల్లియొ చెల్లకో..."  శైలిలో అందగించి అలరించింది. సమకాలికులను ఎందరినో ప్రభావితం చేసింది. తరువాత కూడా శిష్య, ప్రశిష్య పరంపరగా అవధాన విద్య అందలమెక్కింది.

19 వ శతాబ్దం చివరి దశకం నుండి 20వ శతాబ్దం పూర్వార్థమంతా అవధానం క్రీడగా, హేళగా, స్వర్ణయుగంగా పురోగమించి, అదో "అవధాన శకం" గా చెప్పుకోదగ్గ కీర్తిని సముపార్జించింది. అవధానానికి అంతటి మహత్తును తెచ్చిపెట్టిన వారిలో అగ్రగణ్యులు చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి జంటకవులు అనడం నిర్వివాదాంశం. ఈ దృక్కోణంలో ఎన్నేన్నో అవధానాలు చేసి, గౌరవ సత్కారాలు పొంది, శతాధికగ్రంథ కర్తగా, బాగా ప్రచారం పొందిన పద్యనాటకాలను సృష్టించిన మహాత్ములుగా పేర్కొనదగిన అవధానశిఖామణి "కళాప్రపూర్ణ" చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి. ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి, సోమవారం నాడు అంటే 1870 ఆగస్టు 8న జన్మించారు. వీరి జయంతిని “ఆగస్టు 8వ తేదీ”ని - "అవధాన దినోత్సవం"గా గుర్తించి, ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది.

4.2 తెలుగు వారి ఉగాది:

తెలుగు ఉగాదీ అలాంటిదే. 'పంచె కట్టుట యందు ప్రపంచాన మొనగాడు' అనిపించుకున్న తెలుగువాడి ప్రత్యేక పండుగ - తెలుగు సంవత్సరాది.  'చైత్ర శుద్ధ పాడ్యమిని బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభానికి శుభ ముహూర్తంగా ఎన్నుకున్నాడు' అన్నాడు నిర్ణయ సింధుకర్త. అంటే తెలుగు ఉగాది నాడు సృష్టి ఆరంభమైందని అర్థం. 

ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం - ఉగాది నాటి ముఖ్య కార్యక్రమాలు. ఉగాది ప్రసాదంలోని భిన్నరుచులు మనిషి మనుగడలోని ఆటుపోట్లకు ప్రతీకలు. విభిన్న రుచుల సమ్మేళనమే ప్రతీకగా మనిషికి ఎదురయ్యే కష్ట సుఖాల పట్ల సమభావనను అలవరిస్తూ జీవన తాత్త్వికతను తలకెక్కించే ఉగాది - తిరిగి పంచాంగ శ్రవణంలో గ్రహరాశుల విశేష సంచారాలను వివరిస్తూ 'కాలానుగుణంగా కార్యాన్ని సాధించుకోవాలి' అనే గొప్ప ఆలోచనను రేకెత్తిస్తుంది. విజయానికి బాటలు వేస్తుంది.

అటు అవధానమూ, ఇటు ఉగాదీ రెండూ తెలుగుదనానికి ప్రతీకలే. తెలుగు జాతికి ప్రత్యేకమే! కనుక ఈ రెండింటిని కలిపి ముడివేస్తూ తెలుగునాట ఉగాది రోజును 'అవధాన దినోత్సవం' గా ప్రకటించాలని తెలుగు భాషాభిమానుల అభిలాష. ఈ చర్యతో అటు అవధానము, ఇటు తెలుగు ఉగాది రెండింటికీ చక్కని ప్రాచుర్యం దక్కుతుంది. ఈ దిశగా ప్రభుత్వం తగు చర్యలు చేపడితే తెలుగు జాతి ఎన్నటికీ రుణపడి ఉంటుంది. (ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమహేంద్రవరం)

4.3 ఈనాటి అవధానరూపం ఆవిర్భవించిన రోజు:

శతగ్రంథకల్పనగా తొలితరం కావ్యాల్లో మెప్పును పొంది అంచెలంచెలుగా రూపాంతరం చెంది “శ్రీ మాడభూషి వేంకటాచార్యులనేతృత్వంలో ఒక నిర్దిష్టతను సంతురించుకుంది.

శ్రీ మాడభూషి వేంకటాచార్యులే ఇప్పటి అవధానవిద్యకు ఆద్యులు, అవధానప్రక్రియ రూపకర్త అని పరిశోధనలు తెలుపుతున్నాయి. మాడభూషివారు మొదట అష్టావధానం చేసిన రోజు “ఫిబ్రవరి 22” గా నమోదైంది. సర్వజనామోదకమైన ఈ విషయాన్ని పరిగణించి, “ఫిబ్రవరి 22” వ తేదీని - "అవధాన దినోత్సవం"గా గుర్తించి, ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది.

పై అంశాలు అభిప్రాయాలతో పాటు ఇంకా అనేకసందర్భాలను పరిశీలించి, చర్చించి అజరామరంగా నిలిచిపోయేలా ఒక రోజును అవధానదినోత్సవంగా కేటాయించవచ్చు. ప్రకటించవచ్చు.

5. అవధాన దినోత్సవం - ఆశయాలు:

ఈ నేపథ్యంలో అవధానదినోత్సవంగా ఒక రోజును గుర్తించి, తెలుగు వారు వ్యాపించి ఉన్న అన్ని చోట్ల ముమ్మరంగా ఆశుకవితా ప్రదర్శనలు, అష్టావధానాలు, శతావధానలు జరపడం; అవధాన విద్యపై ప్రసంగాలు ఏర్పాటు చేయడం; విశ్వవిద్యాలయాలలో మరిన్ని పరిశోధనలు, సదస్సులు, పత్రసమర్పణలు జరిగేలా తోడ్పడడం;  అకాడమీల ద్వారా ఔత్సాహికుల అముద్రిత పద్యకావ్యాలు, శతకాలను, చాటు పద్యాలను ముద్రించడం; ప్రాచీనకాలంనుండి నేటి వరకు ఉన్న సమస్త అవధానసాహిత్యాన్ని వెలికితీసి, సమాజానికి వాటిని ముద్రణారూపంలో అందించే ప్రయత్నాలు చేయడం;  ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఇంకా ఆన్ లైన్ బోధనల ద్వారా ఆరునెలలు, ఏడాది, రెండేళ్ల సెర్టిఫికేట్ కోర్సులు, డిప్లమా కోర్సులుగా "అవధాన విద్య"ను ప్రవేశపెట్టి నిష్ణాతులతో, నిపుణులతో శిక్షణను ఇప్పించడం;  గ్రామాలు, పట్టణాలు, జిల్లాల వారీగాను, రాజధాని నగరాల్లోనూ “పద్యరచనాశిక్షణ” శిబిరాలు నిర్వహిస్తూ, నమూనా అవధానాలను పాఠశాలల పిల్లలు, కళాశాలల యువతతో ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం, ఆనాటి కాలాన్ని తలపించేలా వరుస అవధానాల జైత్రయాత్రలకు నాంది పలకడం, ప్రతిభావంతులైన అవధాన వరిష్టులందరికీ పురస్కారాలు, వర్థిష్ణువులకు ఉపకార వేతనాలను ప్రకటించి, ప్రోత్సహకాలను అందిస్తూండడం ఈ అవధాన దినోత్సవం జరుపుకోవడంలో ఆశయాలు.  అవధానదినోత్సవాన్ని ప్రకటించుకుని జరుపుకోవడం అంటే భాషా, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడమే అవుతుంది.

6. ముగింపు:

అవధాన సుధారస సాగరంలో ఒక్కో అంశం అవధానిలో ఒక్కో కోణాన్ని ఆవిష్కరిస్తూ అవధాని ప్రతిభ వ్యక్తమయ్యేలా చేస్తుంది.

సమస్య స్ఫురణను, దత్తపది భాషాపటిమను, వర్ణన- కల్పనా శక్తిని, వర్ణనా నైపుణ్యాన్ని, నిషిద్ధాక్షరి- మేధోబలాన్ని, వ్యాకరణ జ్ఞానాన్ని, వ్యస్తాక్షరి, ఘంటాగణనం,పుష్పగణనం, వారగణనం మొదలైనవి ధారాణాశక్తిని, ఆశువు ధారాశుద్ధిని, అప్రస్తుత ప్రశంస - సమయస్ఫూర్తిని వెల్లడి చేస్తాయనడంలో సందేహం లేదు.

సాహిత్య సుమ సౌరభ సౌధంలో కవిత్వానికి ఆకారమై అవధానాలు వ్యక్తిత్వ వికాసానికి, ప్రాచీన సాహిత్య సంపద పరిరక్షణకు, పరివ్యాప్తికి ఉపకరిస్తున్నాయనడంలో సందేహం లేదు.

అకాడమీలు, అధికారభాషాసంఘం, సాంస్కృతికశాఖ, భాషామంత్రిత్వశాఖ, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, భాషాసాంస్కృతిక పరిరక్షణ సమితిలు, సాహిత్యసంస్థలు, అవధానులు, ఉపాధ్యాయ బృందాలు, అధ్యాపక సమ్మేళనాలు, ఆచార్య, సహాయాచార్యులు, ప్రజాప్రతినిధులైన పాలక వర్యులు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు, విమర్శకులు, విశ్లేషకులు, పాత్రికేయ మిత్రులంతా ఏకమై మన అమ్మ భాషలోని అపురూపమైన విద్యకు ఓ రోజును సాధించుకుని, దానికి శాశ్వతత్వాన్ని కల్పించడంలో కృషి చేసి, "జ్ఞానయోగమ్ము మా అవధాన విద్య" అన్న నినాదంతో ముందుకు అడుగులు వెయ్యాలి.! ఈ మహదాశయ సాధనలో భాగస్వాములై తెలుగువాళ్ళమైన మనందరం తరించాలి. 

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. సుబ్బన్న, సి.వి. అవధానవిద్య. తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్, 1987.
  2. రాజశేఖర వేంకటశేషకవులు, డి. అవధానసారము. జనోపకారిణీ స్టోర్స్, ప్రొద్దుటూరు, 1932.
  3. వరప్రసాదకవి, కడిమిళ్ళ. అవధానచంద్రిక. అవధానభారతి ప్రచురణ. నర్సాపురం, 2002.
  4. దొణప్ప, తూమాటి. ఆంధ్రసంస్థానములు- సాహిత్యపోషణము. ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం, 1969
  5. వెంకటరావు, నిడదవోలు. తిరుపతికవుల సాహిత్యసమీక్ష (వ్యాసం). భారతి మాసపత్రిక. అక్టోబరు. 1966.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "May-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-April-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "MAY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]